రసము కిన్ని ష్ణ ము?

 

 

 

 

 

 

 

 

దివాకర్ల వేంకటావధాని, ఎం. ఏ. (ఆనర్సు)

 

కావ్యమునకుఁ బరనిర్వృతి కారణమైన రసానందమే పరమ ప్రయోజన మని సంస్కృతలాక్షణకు లెల్ల రంగీకరించి యున్నారు. ఈయానందము రసానుభవహేతుక మైనట్టిది. బహ్మసృష్టివలెనే కావ్యసృష్టియుఁ పంచభూతాత్మక మై యుండును. కవి, వస్తువు, భావము, శబ్దము, పాఠకుఁడు అను న వైదును గావ్యసృష్టికి సంబంధించిన పంచ భూతములు. ఇందు వస్తువు, నాయకాదులు, తద్వ్యా పారము అని రెండు విధములు. భావము, శబ్దము, నాయకాది వ్యాపారభూతమైన వస్తువు అనునవి రసానుభవమునకు సాధనము లైనవే. కాని సాధకము

లైనవి కావు. ఇంక మిగిలిన కవి నాయక పాఠశాలలో రసము అనుభవించువా రెవ్వరో నిర్ణయింప వలెను. భట్ట తౌతుఁడు కావ్య కౌతుకముననాయక స్య కవే శ్రోతు స్సమానోనుభవ సత్త:అని పై మువ్వురును సమానమైన యనుభవమునే పొందుకు రని చెప్పి యుండెను. కాని యితు లాక్షణికులు పలువుకు రసము పాఠం (సామాజిక) నిష్ఠ మనియే యభిప్రాయ పడియుండిరి.

సంస్కృత లాక్షణుకులలో దొలదొత్త రసవిషయక మైన చర్చ కావించిన వాడు భరతముని. అతఁడు నాట్యశాస్త్రములోవిభావాను

భావ వ్యభిచారి సంయోగా దోపనిష్పత్తుఅని యొక సూత్రమును వివరించెను. ఇందు రసమునకుఁ బూర్వరూపమైన సాయిరావము

ప్రసక్తియే లేదు. పైగా నిందలి సంయోగనిష్పత్తి పదము లస్పష్ణా రములుగా నున్నవి. ఈసూత్రము నాధారముగా గ్రహించి పలువురు లాక్షణికులు రసపరిణామ ప్రకారమును వివరింప యత్నించిరి. వారిలో భట్టలోల్లట, శ్రీశంకు, భట్టనాయక, అభినవగుప్తులు నలుగురును నాలుగు భిన్న వాదముల నావిష్కరించి యుండిరి. వానికి గ్రమముగా నుత్పత్తి, అనుమితి, భుక్తి, అభివ్యక్తి వాదములని పేరు. వానిని బరి శీలించిన చో రసము యగ్గతమో తెలియవచ్చును.

పై నలువురు లాక్షణికులలో లోల్లట శ్రీశంకుక భట్టనాయకుల గ్రంధము లిప్పు డుపలభ్యమానము లగుట లేదు. అభినవగుప్త మమ్మ టాదులు భరతరససూతమునకు వ్యాఖ్యానము చేయునందర్భమున స్వమతముఁ బ్రతిష్ఠించుచు విమర్శన పూర్వకముగా పై వారి వాదము లను సూచించి యుండిరి. వా రుద్ధరించిన వాక్యములను బట్టియే రవచిష యమునఁ బై లాక్షణికులకుఁ గల యభిప్రాయములను మనము గ్రహింపవలయును.

భట్టలోల్లటుని మతమున రసమ నుకార్యని మనది. అను కార్య లనం గా నా యా కావ్యములందు సాయకు లై న రామాదులు. ఆలంబన విభావము లైన సీతారామాదుల చేతను,నుద్దీపనవిభావములై నయారా మాదులచేతను,నాయకులైన రామాదులందు రత్యాదులగు స్థాయిభా వము లుదయించి, కటాక్ష భూవి, పస్మితాదులగు నను భావములచే స్పష్టత్వమునొంది, నిర్వేదసైన్యాదులగు వ్యభిచారిభావములచేఁ బరి వృష్టమై రసముగాఁ బరిణమించును. నాటకకర్త నాటకమున రామాది నాయకుల ప్రేమను లతోచితములైన శబ్దములతో వర్ణించును. నటుడు వారి భావములను, వ్యాపారములను గకుంగకు మెలకువతో సభినయించును. అభినయనందర్భమున నటులు ప్రదర్శించు నైవుణ్య ముచే సామాజికులు రామాదులగు నను కార్యుల మానసిక ప్రవృత్తులే వారియందును నున్నట్లు భ్రమింతురు. ఆనఁగా వారు నటులందు రామ త్యాదు లారోపించి వారే రామాడులని భ్రాంతి నొందుదురు. అప్పుడు నిజమునకు రామాద్యను కార్యుల యందే యుండు రసము వారి భూమి కల ధరించి నెటించు నటులయందు లేకున్నను ఉన్నట్లే భాసించును.

చుటయు సంభవించును. నటునియందుఁ గలుగు నను కార్యభ్రాంతి సామాజికుని గానందము కలిగించుటకు రజ్జువును జూచి సర్ప మని అయించి భీతి నొందు మానవుల వ్యాపారము దృష్టాంతముగాఁ జూపం బడినది. ఈ వాదము ననుసరించి రసము రామానులం దు త్పన్న మగు చుండుటచే దీని కుత్పత్తి వాదమను పేరు కలిగినది. ఈ వాదమునఁ గార్యకారణములకు సామానాధికరణ్యము లేక పోవుట ప్రధానదోషము. రామా ద్యను కార్యగతమైన రసము నారికా నందమా కలిగించును గాని సంబంధము లేని సామాజికుల కొట్లానం దము కలిగింపఁ జాలునో యిందు స్పష్టముగా వివరించబడలేదు. సీతాదులు రామాదులకే విభావములుకాని సామాజకులకు విభావ ములు కారు గదా! రానూరుల రూనందమును జూచి యానందము నొందు సామాజికులు వారు దుఃఖము నొందు నప్పుడు దుఃఖము కూడఁ బూంకుకు రని చెప్పవలసి వచ్చును. అంకుచేల గరుణము ప్రధానరస ముగాఁ గల నాటకాదులు సామాజికుల కానందము నెట్లాసంగునో యిట వివరింపఁ బడియుండ లేదు. ఇచ్చట దృష్టాంతముగా జూపఁబడిన రజుసర్పభ్రాంతికిని నటనాయక భ్రాంతికిని బోలిక లేదు. మొదటిదాని యందు థాంతికారణము, భయము కార్యము. ఈకార్యకారణములు రెండింటికి నాకరమైన వారొక్కరే. రెండవ దానియందు స్థాయిలా పము కారణము, ఆనందము కార్యము. కారణ మనుగార్యుని యం దుండఁ గారణము సామాజికునియందుఁ గాన వచ్చుటలో సామంజన్యము లేదు. ఈ వాదమున సామాజికుఁ డనుభవించునది చమత్కార జంత మైన యానంద మేకాని రసము కాదు.

శ్రీశంకుకుని మతమున రస మనుమితివిషయమైనది. నటు లభిన యమునందుఁ దమకుఁగల నేర్పుచే నాయకాదుల వ్యాపారములను జక్కగా ననుకరింతుకు. అప్పుడు సామాజికు లాయనుకరణమును అది నటులే యమ కార్యులని నటులు నాయ కాదులకంటే భిన్నులు కారని తలంతురు. నటులభినయిందు విభావానుభావవ్యభిచారుల యొక్క సంయోగమువలన తార్కిక వ్యాప్తి ననుసరించి వారు నటులయందుఁ గూడ రత్యాదుల ననుమానింతురు. ధూమ మున్న చోట నగ్ని యుండు ననియు, ధూమము లేనిచోట నగ్ని లేదనియు ననుకొనుటకు వార్కిక వ్యవహారమున వ్యాప్తి యని పేరు. ఈ వ్యాప్తి ననుసరించి సామాజికులు నాయకాభిన్నులు గహింపఁబడిన నటులంకు రత్యాము లుండుటచే రసము కూడ నున్నదని యనుమానింతుకు. తరువాత నటులుడలి రత్యాది స్థాయిభావములనే వా కనుభవించి యానందింతురు. ఈమక మున నటుడొనరించు నిపుణమైన యనుకరణముచే సామాజికుడు చిత తుంగన్యాయము ననుసరించి నటులే నాయ కాములని విశ్వసించుచు నాయము లందలి రసము కూడ నటవిషమై యున్న ట్లను మానించును. అందుచేత నీ దీని కనుమితి నాది మరి పేరు కలిగినది.

భట్టలోల్లటుని మకమున వలెనే యిందుఁగూడ గాక్యకారణ ములకు సామానాధికరణ్యము కానఁబడరు. నాయ కాదు లంచండి నటు లందనుమానింపబడిన రసము సామాజికుల కొట్లానందము కలిగిం చునో యిట వివరింపఁ బడలేదు. చిత తురగన్యాయ మిచ్చట పరిపడదు. చిత్రము నందలి తురగ మె తనిపుణము గల జిత్రింపబడినను యథాళ్ల తురగమువలె నుండు నీ కాని నిజముగా తురగము మాత్రము కాజా లను. మఱియుఁ బ్రత్యేక జ్ఞానము చమత్కారమును గలిగించునట్లు మాన జ్ఞానము గలిగింప నేకము. రసమును బ్రత్యక్షముగా ననుభవించు చున్నావను మాట లోకమున నుండఁగా సామాజికుఁ డనుమానజ్ఞాన ముచే రసము ననుభవించుచున్నాడనుట స్వభావవిరుద్దము. తా మెన్నఁడును జూడని నాయకాముల వ్యాపారములను నటులను కరించుటయు, వానిని జూచి సామాజికులు నటులే నాయ కాదులని యనుమానించుటయు విశ్వసనీ మువిషయములు రావు. ప్రఖ్యాత నాయ కుల వ్యాపారములను గ్రంథ స్థిత వర్ల నాదుల ననుసరించి నటు లనుక రింపఁ జూలినను గల్పిత నాయ కాదుల వ్యాపారములను గూడ వారను కరించి రనుట హాస్యాస్పదము గానుండును.

భట్టనాయకుని మతమున రసము ప్రతీయమానము గాని, ఉత్పా ద్యమానము కాని, అభివ్యజ్యమానము కాని కాదు.కావ్యనాట్యము లం దభిధాశక్తి కంటె భిన్న మును, విభావాదిసాధారణాత్మకము గు భావకత్వవ్యాపారముచే భావ్యమానమై స్థాయి భావము నత్త్యోద్దేశ ప్రకాశానంద మయ సంచిద్విశాంతి సతత్త్వమగు భోగముచే భుజ్య మాన మగుచున్న దని భట్టనాయకు సభిప్రాయ వైట్లు కావ్యప్రగా శము నుడువు చున్నది. రసాస్వాదము పరబ్రహ్మ సాక్షాత్కార తుల్య మైన దసియం బరబ్రహ్మవలెనే రసముకూడ నానందమయు మైన దనియు భట్టనాయకుడు తలంచెను. ఈతని మతమున శబ్దమున కలి ధాశక్తి కాక భావనాభోగీకృతులను మతి రెండు వ్యాపారములు కూడ నుండును. వీనికే భావకత్వవ్యాపారము, భోగకృత్యవ్యాసారమునని నామాంతరములు.

అభిధా వ్యాపార మలంకారశాస్త్ర నిర్దిషమైన దే. ఇది శబ్దము యొక్క వాచ్యార్థమును బోధించును. ఇవి ముగిసిపోగానే భావక త్వవ్యాపార మారంభించును. ఇది శబ్దము యొక్క రసాదులను గొంచును. శృంగారరస సందర్భమునఁ బరుషపద ప్రయోగ ముచిము గాదనుట యీ వ్యా పారము చేత నే. పరుష శబ్దమున నను లలిత బ్దమున కై నను వాచ్యార్థమాతబోధక మైన యభిధా వ్యాపారము సమానమే. ఈ వ్యాపారముచే సీతారామాదులగు విభావములు తమ ప్రత్యేకతను గోల్పోయి సామాజికునికి సామాన్యములుగా గోచరిం చును. అనఁగా సీతాదులు సాధారణ స్త్రీత్వముతోడను రామా

దులు సాధారణ పురుషత్వముతోడను గోచరింతురు. ఇట్లు విభావ ములు సాధారణ ములుగా క జేయ బడుటచే సాధారణీకరణ మని పేరు. దీని వలన సామాజికునకు నాయకాదులతో న భేదత్వ మావహిల్లును. ఇంతటితో భావగత్వవ్యాపార ప్రభావ మనసితమగును. అంత మూడ వది యైవ భోగభృత్య భోజకత్వ, వ్యాపారము పనిచేయ మొద లియును. దీనిచే సాధారణీకృతములైన రత్యాది స్థాయిభావములు సామా జికులచే ననుభవింప బడును. అప్పుడు వా రానందమయ మైన మొకా నొక స్థితిని బొందుదురు. ఇవి సాధారణము లైన యమభవముల గంటను స్మృతుల కంటెను విలక్షణమై పరబ్రహ్మాస్వాదతుల్యమై, స్వనంవేద్యముగా నుండును. ఈస్థితిలోఁ జిత్తమునకు ధృతి, విస్తారము, or సము అను ధర్మము లేర్పడును.

భోగకృత్త్వవ్యాపారమునే సామాజికు లందలి రజస్తమో గుణ ము లడంగి వాడిహృదయముల పత్త్యోద్రేక మతిశయించును. అప్పుడు రానందమగ్నులై పరిసరములనే కాక తమ్ముగూడ మఱచి వీచు చున్న లేక చూచుచున్న వస్తుదృశ్యములతో న భావము నొందుకుకు. * మతమున విభావాదులు భోజక ములును, రసము భోజ్యము నగుటచే దీనికి భుక్తివాదమని వీకు కలిగినది,

భట్టనాయకుఁడు తనమతముగఁ గార్యకారణములకు సామానా కరణ్యము లేకపోవుట యను దోషమును బరిహరింప యత్నించెను. కాని భావకత్వవ్యాపారముచే విభావములును రత్యాదులును సాధార ణీకృతములై నను సామాజికులు మొట్ట మొదటం దమయందు బీజరూపముగా నైన లేనట్టి స్థాయిభావముల ననుభవించుటయు నాయకాద్య భేదము నొందుటయు నించుక యసంగతములుగా నున్నది. అదిగాక భట్టనాయకుఁడు శబ్దమున ఉండువని చెప్పిన యభిధా భిన్నములైన భావకత్వబోగకృత్త్వ వ్యాపారములు కేవల కల్పితములైన పగుటచేఁ గ్రామాణి సమ్మతము లైనవి కావు. వ్యంజన మీ భావక త్వవ్యాపారము నిర్వహించు చుండ డానికై యొక కొత్తవ్యాపారమును గల్పించుట యనవసరము, ఆభిన వగుప్తుం డీవ్యాపారము విభావాదులదేయని చెప్పెను. తా ఏవ పరిహృతవి శేషా రస హేతవః అని భరతముని చెప్పిన వాక్యము కూడ నీవిషయముననే బోధించు చున్నది. విశ్వనాధుడు విభావాదులకు సాధరణీకృతి యను పేరుగల యొక వ్యాపార మున్న దని స్పష్టముగాఁ జెప్పియుండెను,

లోచనకారుఁడు చెప్పిన దానిని బట్టి భట్టనాయకుఁడు కూడఁ గోవ్య మునకు రసమే యాత్మ యనియు పది వ్యంగ్యముగా నుండుననియు విశ్వసించినట్లు తెలియుచున్నది.పచ కావ్య వ్యాసారైగగోచరో రసధ్య ని రితి, నచధ్వని రేవీతి. సపవ ముఖ్యతయత్మేతిగాని యాతఁడు రసా స్వాదము వర్ణింప నలవిగాని దనియుఁ గావ్యమున కాత్మభూత మైనది రసధ్వని యొక్క టే కాని వస్త్యలంకారధ్వనులు వనియు నభి

ప్రాయపడియుండెను. ధ్వని మతమునకును నాతని యభిప్రాయము నకును గల భేద మీంతే.

భట్టనాయకుఁడు రసము సామాజిక నిష్టమని యే చెప్పెనుగానీ దానికి బీజములు స్వల్పముగానైన సామాజికులం దుండునని యంగీక రింపలేదు. అభినవగుప్తుని మతమున రస మభివ్యక్తము సహృదయు హృదయములందు  రత్యాదులు వాననారూపమున నడఁగి యుండున, నియు నవి విభావాను భావాదికములచే సముల్లసితములై రసములుగా బరిణమించుననియు నాతని వాదము, ఈతని మతమున నీవావన లేనిచో రసాస్వాదము కలుగదు. అందుచేతనే వైయాకరణులకును మీమాంసకులకును రసాస్వాదము కలుగదని ధ్వనికారుడు చెప్పి యుం డెను, వాసనారహితులైన సామాజికులకు రసాస్వాదనము మృగ్యము నియు, నట్టివారు రంతాతఃస్థిత కాష్టకు డ్యాళ్మణిపన్ని భు లనియు ధర్శ దత్తుఁడు వివరించి యుండెను. వ్యంజనాశు ప్రభావముచే రసదభివ్య క మగుననియు రసాస్వాదమును వివరించి వర్తించవచ్చు ననియు అభినవగుప్తుడు నుడినియుండెను. అతఁడు భట్టనాయకుని భావకత్వ వ్యాపారమును బూర్తిగా ముగించెను. రసభోగ మని చెప్పక యతఁడు రసప్రతీతియనియు రసచర్వణ మనియు నుడువుచుండును. ఈతని వాదము ననుసరించి సహృదయుల హృదయములందు వాసనారూపముననున్న స్థాయిభావములనే విభావాదులు వ్యక్తము చేయుననియు నా వ్యక్తము లైన స్థాయి భావములే రసము లనియు స్పష మగుచున్నది. అందు చేత నే దీని కభివ్యక్తి వాదమని పేరు వచ్చినది. అభి వ్యక్తి యనఁగా నున్న దానిని వ్యక్తము చేయుట. భట్టనాయకుని మతమున నీ వాస నాప్రసక్తియే లేదు. భుక్త్యభివ్యక్తి వాదములందలి ముఖ్య భేదములలో నిదియొకటి.

ఈవిధముగా రసము సామాజిక నిష్ఠమని తేలింది. సామాజి కుఁడు విభావాదుల ననుసంధించుకొని చర్వణము చేయు చున్నంత కాలమును రసానందము ననుభవించుచునే యుండును. ఈచర్వణ మెప్పుడు ముగియునో రసాస్వాదనము కూడ నప్పుడే ముగియును. కేవలానంద మైన బ్రహ్మానందము శాశ్వతమైనది. విభావాదికారణ మైన రసానందము తాత్కా లిక మైనది, అందుచేత న దీనిని బ్రహ్మానంద సహోదరమని చెప్పుదురు.

అభినవగుప్తుని మతమున భరతుని సూత్రము నందలి సంయో గపదమునకు వ్యంగ్యవ్యంజక భావ ముము. నిష్పత్తి యనఁగా నభివ్యక్తి. రత్యాదులగు స్థాయిభావములు వ్యంజకములగు విభావాను భావాది భావములచే వ్యంగ్యములై రసము లగును.

భరతుడు ముఖ్యముగా దృశ్యకావ్యములను మనసున నుంచు కొని రససూత్రమును వివరించెను. లోల్లటాదులును నాదృష్టితోనే దానికి వ్యాఖ్యానము కావించిరి. ధ్వనిశారుఁ డైన యానంద వర్దకుఁడు రససిద్ధాంతమును శ్రవ్య కావ్యముల సందర్భమునఁ గూడ సమన్వయం చెను. దృశ్యకావ్యములందు నటులమూలమున విభావాదులు ప్రత్య క్షమగుచుండును గాన సామాజికులు నాయకా భేదమును బొంది యానందము ననుభవింతురు. ఈ దృశ్యకావ్యములలో నాయకాదులు ప్రత్యక్షము కారు కావున సామాజిక స్థానీయులైన పాఠకులు నాయ కాభేదము నొంది రసానండము నెట్లనుభవింతురని సందేహము కలుగ వచ్చును. వాక్యప్రదీపకారుఁ డైన భర్తృహరిపాఠకులు శబ్దోపహితరూపములు గల్లి బుగ్గిలిషయత్వము నొందిన కంసాదులను బ్రత్యక్షము

లైన వారినివలె సాధనములుగా గ్రహించురని తెల్సి యాసందేహ మును నివారించినాడు. అనఁగా శ్రవ్యకావ్యములందుఁ గవులు వాడు శబ్దములచేతను జేయు వర్ణ నాదులచేతను నాయ కాదులు రూపమును బొంది, పాఠకుల హృదయములు చొచ్చి, ప్రత్యక్షముగా గోచరిం తురు. వారు రంగమునఁ జర్మచక్షువులచేఁ జూచు నాయకాదులదే శ్రవ్యకావ్యమును. విను సందర్భమున హృదయరంగమున మనో నేత్ర ముచేఁ దిలకించి, తద భేదమునొంది రసానందము ననుభవింతురు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *