ఆంధ్ర పరిశోధక మహామండలి పంచమ వార్షికోత్సవము – అధ్యక్షోపన్యాసము

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు

(100 సం.ల నాటి వ్యాసమిది. పుస్తక రూపంలో ఎక్కడా ప్రకటితం కాలేదు. అప్పట్లో చెలికాని లచ్చారావు గారనే వదాన్యుడు, జమీందారు, సాహిత్యాభిమాని పరిశోధక మహామందలి అనే సంస్థను స్థాపించి కొన్ని ప్రాచీన కావ్యాలు అచ్చు వేశారు. ప్రతి సంవత్సరం కవి పండిత పరిశోధక సమావేశం నిర్వహించే వారు ఆయన. 1922లో జరిగిన ఐదో వార్షికోత్సవానికి అధ్యక్షత వహించి శ్రీ లక్ష్మణరావు చేసిన ఉత్తేజకర ప్రసంగమిది. ఈ ప్రసంగంలో కొన్ని శాసన పాఠాలు లక్ష్మణరావు ప్రసక్తం చేశారు. ఆ శాసన పాఠాలు, కాలచర్చలు ఇప్పుడీ ప్రకటితమవుతున్న వ్యాసం నుంచి పరిహరించడం జరిగింది. సం.11)

పండితోత్తములకు నవినయ దండ ప్రణామములాచరించి కథా’శ్రమమునకుం బూనుకొనియెదను. నేను ఈ యగ్రాసనమును అధిష్టించుటకు మీ
యకారణ ప్రేమయే కారణము గాని నా యోగ్యత కాదని నే నెలుంగుదును. కావున ఈ మీ ఆజ్ఞకు లోనై యిచ్చటం గూర్చుంటినే కాని వేజుకాదు. (ప్రభువుల యాజ్ఞయు, పెద్దల యాజ్ఞయు అనుల్లంఘనీయము లనియెదరు. రాజకీయ సాంఘిక విషయములలో నీ నియమమునకుం గాలానుసరమున నపవాదములు కలిగినను, విద్యా విషయికములైన యిష్టాగోష్టులందు నీ నియమమును పాటించుట విధియని తలంచియు, మీరొసంగెడి వ్యాసరూపమయిన జ్ఞానామృతము ఈ వీలయిన స్థలము నుండి ఏకాగ్రచిత్తముతో (గోలి నా యోగ్యతను హెచ్చించుకొందునను నమ్మకము తోడను నన్ను మించిన యీ యున్నత పదవికి నంగీకరించితిని. స్టలాంతరముగా నున్న యాంధ్ర పండితోత్తములును, కవి పుంగవులును, _పరిశోధక శ్రేష్టులును, ఒక్క చోటం గుమిగూడి విద్యా గోష్టింగాలము గడుపునట్లు చేసి, మనలకు స్వాగతమొసంగిన, ఆంధ్ర పరిశోధక మవామండలి స్థాపకులగు శ్రీయుత చెలికాని లచ్చారావు గారి యెడ మనమెంతయు గృతజ్జులము. ఇట్టి యుత్సవ నెపమున నైనను జ్ఞాన సంపన్నుల సహవాసము, రెండు దినములయినను లభించిన యెడల భాషా వికాసమునకును, నూతన పరిశోధనలకును మార్గము
కల్గుననుటకు సందేహము లేదు. ఆంధ్ర పరిశోధక మహామండలి వారైదు సంవత్పరముల నుండియు. జేయుచున్న పని వారి రిపోర్టుల వలన మీకు విశదమే. ముఖ్యముగాం గ్రిందటి యేట వారు చేసిన పని యిప్పుడు చదువబడిన నివేదిక వలనం దెలియగలదు. చేసిన పనికి మనము వారిని అభినందించుటయు. గృతజ్ఞత చూపుటయు సహజము. వీరింతకంటె నెక్కుడు పని చేయవలసి యుండెను – అని కొందలు నాతో సూచించి
యుండిరి. కాని యిట్టి యాక్షేపణము అనవస్థా ప్రసంగములో జేరును! ఎంత పనిచేసినను అంతకంటె నెక్కుడు పని జరిగి యుండవలసినది అని యాక్షేపించు వారుందకపోరు. ఇట్టి యాక్షేపణమునకు లోబడని సంఘమొక్కటి మైనను లేదు, ముప్పది గ్రంథములను ప్రకటించిన విజ్ఞాన చంద్రికా మండలి వారును (బాగుగ వనిచేయు దినములలో) రాజవువోరాజాధిరాజుల యనుగ్రహమును, అభిమానమును గలిగిన ఆంధ్రభాషా పరిషత్తును, ఎడతెగక పుస్తకములను (‘ప్రకశించుచున్న ఆంధ్ర ఫ్రచారిణి వారును, ఒక రెక్కమీదనో రెండు రెక్కల మీదనో మూడు పెద్ద సంపుటములు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము వారును ఈ యాక్షేపణమునకు గుజియైరి. కొన్ని యెడల నిజముగా గుజియైరి యనియుం జెప్పవలయును. కావున నిట్టి యాక్షేపణములను పాటింపక, ఎవరిచేతనైన పని  వారు చేయుచునుండుటయే మంచిదని నా తాత్పర్యము. ఒక్కొక్కరు విడివిడిగాం
బని చేయుట కంటె నందఖజును గలసి సంఘీభావముతో బనిచేయుట మంచిది కాదా? యని కొందజదుగ వచ్చును. మంచిదే. కాని యే కారణము చేతనో తెలుం గు దేశమున నిట్లు చేయుట యిప్పుడు సాధ్యము గాక యున్నది. అందుకుం గారణములు చర్చించుటకు నిది సమయము కాదు. సంఘముగాం బని జరుగుటకు వీలు లేనప్పుడు, ఎవరికి జేతనైన పని వారేల చేయగూడదు? అట్లు చేయకుండుట తప్పని నా తాచ్చర్యము. కావున మహామండలి వారింకను ఎక్కువ పని చేయుదురు గాక యని కోరుచు వారు చేసిన పనికి సంతసించి వారిని గౌరవింతము. పరిశోధనపై సంకురుమయ్య ఈ మహామండలి వారిని మనము గౌరవించుటకు మఱియొక విశేష కారణము కలదు. ఎందుచేతనో రెండుమూడు సంవత్సరముల నుండి సంకురుమయ్య ఆం(ధ దేశమున వాంగ్మయ పరిశోధనము మీది నుంచి పోవుచున్నట్టు కానవచ్చుచున్నది. అందువలననే పరిశోధన మెచ్చటిదచ్చట నిల్పిపోయినది. ముఖ్యముగా నిదివఱకు దేశదేశములకు బండితులను బంపి తెలుంగు తాటాకు గ్రంథములను సంపాదించుచున్న వారిద్దరు. దొరతనము వారి పక్షమున చెన్నపట్టణమందలి మ్యాన్యుష్కిష్ట లైబ్రరీ వారు, తెలుంగు పరిషత్తు వారు. వీరిద్దరును రెండేండ్ల నుండియు పురాతన గ్రంథ సంపాదనమును మానుకొనిరి. కారణము ధనాభావము, దరిద్రత, ఆదాయము భరణమునకే చాలక సాహుకారు నింటికిం బోయి పత్రము వ్రాసి అప్పు తెచ్చుకొనవలసి వచ్చుట. దొరతనము వారికి కొన్ని యేండ్ల నుండి ఆదాయమున కంటె ఖర్చు అధికమగుటయు, వారెక్కువ వడ్డీ యిచ్చి పత్రములను జారీచేసి అప్పు పుచ్చుకొనుటయు ‘బడ్జెట్లాలో మీరు చూచుచునే యున్నారు. అందుకుం గొంత ఖర్చు తగ్గించుమనిరి! “పట్టరా! దేవతార్చన బ్రావ్మాణుని అన్నట్లు ఈ దెబ్బ మొదటం దాటాకు గ్రంథముల మీదం బడినది. మొదటనే యవి ముసలితనముచే శిథిలములై యుండుటతో పప్పు పప్పు అయినవనుటకు సందేహము లేదు. అన్ని భాషల గ్రంథ సంగ్రహమునకు దొరతనము వారు సంవత్సరమునకు 10, 12 వేల కంటె నెక్కుడు ఖర్చు పెట్టుట లేదు. ఇదివఱకే  దేశమందలి తాటాకు గ్రంథములన్నియు నశించినవి. ఇంకొక తరమూరకుంటిమా! దేశము నందు దాటాకు పొడిని ఏరుకొన వలసినదేగాని గ్రంథములు మాత్రము దొరకనేరవు. అట్టి స్థితిలో పదిపండ్రైండు వేలకు లోభించి, యిట్టి భాషా ద్రోహమును చేసిన మహానుభావుని గాని, మహానుభావుల గాని ఏమనవలయును? అంతగా ధనము లేని యెడల, ఒకరి ద్దరిని పైఅధికారులను దీసివేయగూడదా? నెలకు వేలకొలది జీతములను కొల్లంగొట్టుచు, యోగ్యత గాని, ఆవశ్యకత గాని లేని యధికారులెందలు లేరు? అందునొకరిద్దరిని ఊడంబెరికిన గాని, వారి జీతములు తగ్గించిన గాని ఎంత ధనమైనను మిగిలి యావశ్యకములయిన విద్యావిషయము లెన్నియో బాగుపడును? విద్యా శాఖ యందే వేలకొలది – లేదు లక్షల కొలంది-  ధనమును అపహరించుచు అజాగళ స్థృనముల వలెనున్న వారు లేదా? అట్టి వారెవరైనది, ప్రజల ప్రయత్నము వలన వారెనెట్లు తొలంగింపవలసినది యను విషయములు రాజకీయ సభలలో జర్చింపందగినవి కాని విద్యాసభల  విషయములు కావు. కాన నధికముం జెప్పనొల్ల. దొరతనము వారికి వలెనే పరిషత్తు వారి యార్ధిక స్థితియు సమాధానకరముగ లేదు. కావునం దాటాకు గ్రంథములను సంపాదించు పని వారును మానిరి. ఇట్లు ఆం(ధ్రదేశమునందు, గ్రంథ సంపాదన పని పూర్తిగా నాగిపోయిన కాలమందు గొంతవఱకైనను ఆ పనిని సాగించుచుం జావకుండ నిలవం బెట్టిన శ్రీయుత లచ్చారావు గారి విద్యాఖిమానమును, వాజ్మయ ప్రీతియుం గొనియాడం దగిన వనియే చెప్పవలెను. విద్యా క్షేత్రమంతయు మనకు నిచ్చట మీమాంస్యమైన విషయమైనను, ఇతర విషయములను వండితులకు విడిచి వరిశోధక మండలి వారి యాతిధ్యమందున్నందున, పరిశోధనమును గుఱించియు, పరిశోధకులను గుఱించియు: గొంత ముచ్చటింప దలంచితిని.

పరిశోధనలో దృష్టి భేదము

చరిత్ర సంబంధమైనట్టియు, వాంగ్మయ సంబంధమైనట్టియునగు పరిశోధన ఆధునికాంగ్ల భాషా సంస్కార ఫలమని చెప్పక తప్పదు. వారి పూర్వుల చరిత్రమును తెలిసికొనవలయుననిన యిచ్చ మన పూర్చులకును గలదు. కాని పూర్వ చరిత్రమును గుజించిన వారి దృష్టికిని మన దృష్టికిని, భేదము గలదు. చరిత్ర తెల్చుటకునైవ్రాయంబడిన గ్రంథములే – పురాణములు మొదలయినవియే- పూర్వ చరిత్ర సాధనములని పూర్వుల యభిప్రాయము. ఇప్పుడు చరిత్రోద్దేశముతో వ్రాయం బడకపోయినను కావ్యములు, నాటకములు, పద్యములు, పాటలు, శాసనములు మొదలయిన ప్రతి గ్రంథమును చరిత్ర విషయకమగు నేదో అంశమును బోధించును. ఇట్టి యూహచే ప్రతి గ్రంథమును, ప్రతి కాగితపు తునకయు, ఉత్తరమును సంగ్రాహ్యముగా, దోచుచున్నవి. పూర్వ కాలము నందును శాసనములను, సనదులను జాగ్రత్త చేసి యుంచుచుండిరి. కాని వారియుద్దేశము వేలు. తమ తమ వాక్కులను, ఈనాములను, అగ్రహారములను కాపాడుట వారి యుద్దేశము. ఇప్పుడు పరిశోధకులు శాసనములను ఆ దృష్టితో జూచుట లేదు. పూర్వ కాలపు సంగతులు వాని వలన నెంత వఱకు దెలిసికొనం గలమన్నదియే మనకుం గావలసిన విషయము. పదునైదు వందల సంవత్సరముల క్రింద వేంగిలో రాజ్యము చేసిన శాలంకాయనుల తామ శాసనములు నాకు దొరికినవి. అందలి ప్రతిగ్రహీతల వంశము వారిప్పుడెవ్వరును లేరు. అందు దానము చేయంబడిన గ్రామము లెవ్వియో నిశ్చయముగం జెప్పలేము. అయినను చరిత్ర విషయమై అవి గొప్పప్రమాణములుగ నున్నవి. ఇంతియకాదు. లిపి విషయమైన యొక విశేషముం గూడ నాకందు గాన్పించినది. ఇప్పుడు మనము బండి ’ఱ‘గ వాడు గుర్తు పూర్వము -మిక్కిలి పురాతన కాలమున – ఉపధ్మానీయమునగా గుర్తుగ నుండెను, ఉపధ్మానీయమనగా
పకారమునకుం బూర్వము వచ్చు విసర్గము. పోనుపోను అన్ని విసర్ణలకును ఒక్క గుర్తే యుపయోగింపసాగిరి. అందువలన నీ గుర్తుకు సంస్కృత లేఖనములలో జోటు లేకపోయెను. తెలుంగు – కర్ణాటకులకు సంస్కృతము నందున లేని బండి “ఱకు గుర్తు కావలసి వచ్చినప్పుడు ఖాళీగానున్న యీ సంస్కృతాక్షరమును తీసుకొని బండి ‘ఱ చేసిరి – అని తోచుచున్నది. ఇట్లు ఎందుండి యేనూతన విషయము తెలియునో మనము చెప్పంజాలము. అన్ని విషయముల (గ్రంధములును ఆధునిక పరిశోధకులకుం గావలసినవే. గ్రంధ శబ్దము వ్యాపకార్థము నందుం దీసికొనవలెను.
గ్రంథితమైన దంతయు గ్రంధము. అది కాగితముల మీంద నుందనిండు, తాటాకు మీంద నుండనిండు, రాతిపై నుండనిండు. అది పెద్దదియైనను సరే, చిన్నదిడైనను సరే ఒక పంక్తియైనను సరే. అది మన మతము వారు వ్రాసినది కానిండు, పరమతము వారు వ్రాసినది కానిండు. పరిశోధకులు భేదభావముతో జూడరు. ఇంక వాంగ్మయ విషయమును అట్లే, రసవంతములయిన కావ్యములందఱకు గావలసినవే. రసికులు వానిని మరల మరలం జదివి సంతసింతురు గాక. పరిశోధనకునకు రసవంతములు, అరసవంతములు, లక్షణయుక్తములు, లక్షణ విరుద్ధములు, కాసటలు, బీసటలు అన్నియు గావలసినవే. నన్నయ కాలపు లక్షణమునకు విరుద్ధమైన వానిని జూడను గూడం గూడదని మనవారు పెట్టుకొనిన నియమము వలన నన్నయ్యకుం బూర్వపు సత్మావ్యములెన్నియో నశించుటయేగాక, యప్పటి భాషా స్వరూపము కనుంగొనుటయు దుస్పాధ్యమైనది. నన్నయ్యకుం బూర్వము తెలుంగు కవిత్వమే లేదన్నంత వలకు వచ్చితిమి! కావున నీ నూతన దృక్పథము ననుసరించి పరిశోధకులన్ని విధములయిన సాధనములను సేకరింతురు నూతన పరిశోధనలం జేయం బూనుకొన్న వారిదివఅకు నీ మార్గమునం
బోయి మనకు మార్గదర్శకులయిన వారి పరిశ్రమను స్మరించి కృతజ్ఞతం జూపుట యావశ్యకము. కావున నాంధ్రదేశ చరిత్రమును గుజించియు, వాజ్బయమును గుతించియు, బరిశోధనలు చేసిన వారిం గొందరిని పేర్కొందును. వీరిలో గొందఱు పరదేశీయులు, కొందరు స్వదేశీయులు. ఎవరైనను వారి నిరపేక్ష విద్యాసేవచేత  వారు మనకు వంద్యులే. రాజకీయాది విషయములలో నన్యాయము చేయు వారు స్వదేశీయులయినను మనమెట్లు నిర్భయముగ వారి నిరసింపవలయునో, అట్లే విద్యావిషయములందు – అందును హైందవ విద్యావిషయములందు బరదేశీయులు
చేసిన నిరపేక్ష కృషికి వారి యెడం గృతజ్ఞత తప్పక చూపవలెను.

కర్నల్‌ కాలిన్‌ మెకంజీ

ఇట్టి పరిశోధకులలో మెకంజీ మొదటి వాండని చెప్పవలసి యున్నది. ఈతండు 1783లో ఇంజినీయరుగా చెన్నరాజధానికి వచ్చెను. 1790-92
సంవత్సరములలో టిప్పుతో జరిగిన యుద్ధములలో నుండెను. తరువాత దత్తమండలములను, హైదరాబాదు ఇలాకాలో కొంతభాగమును సర్వేచేయు నిమిత్తము పంపంబడెను. 1798లో పాండిచేరి ముట్టడిలో నుండెను. 1796లో ఇంగ్లీషు వారు సింహళమును స్వాధీనపలుచుకొన్నప్పు డచ్చట ఇంజనీయరులకు నాయకుండుగ నుండెను. 1799లో ఇంగ్లీషు వారు శ్రీరంగ పట్టణమును వశపఱచుకొన్నప్పుడచ్చట నుండి, 1810వ సంవత్సరము వణకు మైసూరు దేశము సర్వే చేయుచుండెను. 1816లో హిందూ దేశమున కంతకు సర్వేయర్‌ జనరల్‌ అయి కలకత్తాలో 1821లో మరణము నొందెను. ఈతండు చెన్నప్రురికి వచ్చినప్పటి నుండియు హిందూదేశపు చరిత్రమును, వాంగ్మయమును చక్కగ దెలిసికొనవలెనన్న
కోర్కె ఈతనికి జనించెను. ఈతండు చేయుచున్న ఇంజినీయర్‌ పనికిగాని, సర్వే పనికిగాని సంబంధము లేని ఈ చరిత్ర జిజ్ఞాస యాతనికి నిర్వాజముగం గలిగె ననుటకు సందియము లేదు. ఈ పనికై యితండు వేలకొలంది స్వంత ధనము వెచ్చించెను. తెనుంగు, కన్నడము, అజవము, మహారాష్ట్రము, పారసియను వేఱువేఱు భాషల కొక్కొక్క పండితుని తగు జీతభత్యమిచ్చి యేర్పాటు చేసి దేశదేశములకుం బంపి, చరిత్ర సంగ్రహింవ సాగెను. ఈ పండితులు చేయవలసి పనియేమన, ఒక గ్రామమునకుంబోయి యచ్చటి మునసబు, కరణములను గాని, ఇతరులను గాని
కలసికొని, ఆ గ్రామ సంబంధమయిన చరిత్రయంతయు వ్రాసికొనుట. వీనినే కైఫీయతులందురు. తరువాత ఆ గ్రామమునందు దొరికెడి తాటియాకు గ్రంథములను సంపాదించుట. ఈ గ్రంథసంపాదనమునకు మెకసన్టీ యెంతయు ధనము వెచ్చించెను. శాసనములేమైన నాగ్రామమందున్న యెడలం దెలిసి నంతవణకు వాని నకళ్లు వ్రాసికొనుట. శిల్ప కళానిపుణతను జూపు మందిరము లేవియైనం గలవేని వాని పటములను వ్రాయుట. మత సంబంధమయిన మఠములు గాని గుహలు గాని చుట్టుపట్ల అరణ్యాది ప్రదేశములందున్న యెడల వానిని స్వయముగ జూచి వాని యప్పటి స్థితిని దెల్పు వర్ణనలు వ్రాయుట. ఈ పనులన్నియుం జేయుటకు బంపం బడిన పండితులు, ముస్పీలు, గుమాస్తాలు తనను మోసము చేయకుండ వారు వారము వారము తనకు “దినచర్య” పంపునట్లేర్పాటు చేసెను. అట్టి దినచర్యల సంపుటములు కొన్ని చెన్నపట్టణమందలి మెకన్‌జీ సంగ్రహములు జూచి చదివి యానందింపవచ్చును. ఈతండు పెక్కుభాషల కైఫీయతులను (గ్రంథములను సంపాదించినను వానిలోం దెనుంగు భాషకు సంబంధించినవి మాత్ర మితరముల కంటె నెక్కుడుగ నున్నవి. ఇట్లు సంపాదించిన నూతన జ్ఞానము నాతండు వేఱువేఱు పత్రికలలో వ్యాసములను వ్రాసి ప్రపంచమునకుం దెలుపుచుండెను. ఈతండీ సంగ్రహము కెంత ధనము వెచ్చించెనో మనము నిశ్చయముగం జెప్పలేము. కాని వేలకొలంది వెచ్చించెనని యూహించుటకు మాత్రమొక యాధారము కలదు. మెకన్‌జీ చనిపోయిన తరువాత నాతని సంగ్రహము యొక్క యోగ్యతను దెలిసికొని, “ఈస్టు ఇండియా కంపెనీ” వారు అతని భార్యకొక లక్ష రూపాయలిచ్చి, యా సంగ్రహమును కొనిరి. దొరతనము వారు లక్ష యిచ్చి కొన్నప్పుడు మెకన్‌జీ తప్పక యిరువదియైదు వేలైనను వెచ్చించి యుండునని మనమనుకొనవచ్చును. ఏమీ యీ నిర్వ్యాజ జిజ్ఞాస!
పరదేశీయులు మన దేశపు తాటి యాకులకు, కొండపల్లి ముతుక కాగితములకు ఇరువదియైదువే లేల వెచ్చించవలయును? జ్ఞానానంద మద్భుతము గదా! ఈ మెకన్‌జీ దొరగారు మన యాంధ్రుల కొనర్చిన మహోపకార మింకొకటి చెప్పవలసియే యున్నది. అది అమరావతిలో శిల్ప చాతుర్య సీమావధిని జూపు బౌద్ద స్తూపమొకటి యున్నదని మన యాంధ్రులకు దెల్పుటయే. అమరావతి సాహితీ జయంతి స్తూపమిప్పుడు ప్రపంచమందంతటను విఖ్యాతిం జెందియున్నది. యూరోపు ఖందమందలి ప్రతి చిత్రవస్తు ప్రదర్శనాలయమందును, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిసుతో
జేయబడిన అమరావతీ శిల్ప ప్రతిమలు గలవు. ఈ విఖ్యాతి కంతకును మెకన్‌జీయే కారకుండు. పదునెనిమిదవ శతాబ్బాంతమున చింతపల్లి జమీందారుండైన వాసిరెడ్డి వెంకటా[ది వాయుండు అమరావతిలో దన మేడం గట్టుకొనుటకును, అమరేశ్వరాలయమును నిర్మించుటకును, దీపాలదిన్నైెయను ఈ దిబ్బను కొంత త్రవ్వించి అచ్చట దొరికిన గొప్ప నాప బండలను, పెద్ద పెద్ద యిటుకలను ఉపయోగించుకొనెను. చుట్టుపట్టు వారు నాపబండలు కావలసి వచ్చినప్పుడెల్లను ఈ దిబ్బలలోని చక్కని చెక్కడపు బండలను తీసుకొని వెళ్లుచుండిరి. సున్నము కాల్చుటకుం గొన్ని బండలు దగ్ధము చేయబడెను. ఇల్లీ యమూల్యమైన శిల్పసంపద నాశము చెందుచుండగా నాంధ్రుల అదృష్టవశమున మెకన్‌జీ యచ్చటికి వచ్చుట సంభవించెను (1792). ఆతం దచ్చటి కట్టడముల చక్మదనమును జూచి యచ్చెరువంది, చింతపల్లి జమీందారు. డంతమీద దానిని పగులంగొట్టకుండం దగిన యేర్పాటు చేయుటయు గాక, యీ స్తూపముయొక్క వర్ణనము వ్రాసి ఏషియాటిక్‌ సొసైటీ వారి పత్రికలోం బ్రకటించెను. ౧1 6 1807) అప్పటి నుండియు నీ స్తూపము యొక్క ఖ్యాతి ద్వీపద్వీపాంతరములందు వ్యాపించెను. మెకన్‌జీ మరల 1816లో అమరావతికింబోయి సర్వేచేసి యా స్తూపము యొక్క ఆకారాదుల పటము వ్రాసెను. కొందరు చిత్రకారులను వెంట దీసికొని వెళ్లి యచ్చటి శిలల మీదంగల చెక్కడపుం
బనుల ప్రతిమల వ్రాయించి, యొక గ్రంథమును సిద్ధపటిచెను. అది యిప్పుడు ఇండియా ఆఫీసులో నున్నది. వ్యాసుల వారు మహాభారతమును మూడు భాగములు చేసి, యొకటి స్వర్ణమందును, మఖియొకటి పాతాళమందును, మిగిలిన దానిని భూలోకమందును దాచినట్లు మెకంజీ సంగ్రహమును దొరతనము వారు మూడు భాగములు చేసి, కొంత లండన్‌ పట్టణమున ఇండియా హౌస్‌లోను, కొంత కలకత్తాలోని ఏషియాటిక్‌ సౌపైటీలోను, కొంత చెన్నవట్టణములోని కాలేజీలోను ఉంచిరి. చెన్నపట్టణములోనున్న భాగమే యిపుడు దొరతనము వారి అముద్రిత గ్రంథాలయము నందున్నది. చెన్నపట్టణములోని కాగితములు జీర్ణమగుచు రాగా వానిలోం జాల భాగములను మరల వ్రాయించి బ్రౌన్‌ దొరగారు 70 సంపుటములు గట్టించిరి. వానికే యిప్పుడు లోకల్‌ రికార్డు (స్థానిక చరిత్రలు) అని పేరు. ఈ సంపుటములిదివఱకుం చెన్నపట్టణమునకుం బోయిన గాని మనకు లభింపకుండెను. శ్రీయుత నాగేశ్చరరావుగారి యౌదార్యము వలన వీనికిప్పుడు నకళ్లు వ్రాయుచున్నారు. అవి త్వరలోనే రాజమండ్రి గౌతమీ గ్రంథాలయమును అలంకరింపం గలవు. కలకత్తాలోను, లండన్‌లోను ఉన్న గ్రంథముల నకళ్లు వ్రాయించి తెప్పించు సుబుద్ధి
ఏ శ్రీమంతునికైనను గలుగుంగాక. ఇంకొక వింత సమాచారము. లండన్‌ పట్టణములోని ఇండియా హౌస్‌లో మెకస్టీ సంగ్రహమునకు సంబంధించిన తెలుం గు గ్రంథాదులు పెక్కులు గలవనియు, వానికి నన్నిటికిం గ్యాటలాగు చేయించుటకుం బూనునెడల వానిని బంపెదననియు లైబ్రేరియన్‌ అయిన మిస్టర్‌ థామస్‌గారు కొంతకాలము (క్రిందట మడ్రాస్‌ యూనివర్సిటీ వారికిం దెల్పిరంట. అందుపై దమకు ధనము లేదు గనుక నా పని చేయించుటకుం జేతకాదని వీరు జవాబు వంవిరట! చూచితిరా? మన యూనివర్సిటీ యొక్క యోగ్యత? ఇట్టి విశ్వవిద్యాలయాలు జ్ఞాన సంబంధమైన నేతి బీరకాయలు సుమండీ!

కావలి వెంకట బొజ్జయ్య

ఈతండు మెకన్టి యెద్ద నున్న ప్రధాన పండితుడు, దుబాషి, దక్షిణ హిందూదేశమునందుం బుట్టిన మొదటి ‘ఎపిగ్రఫిస్టు అని యీతనిం జెప్పవలయును. ఎపిగ్రఫిస్టు అనగా పురాతన శాసనములు చదువు వాండనుట. ఉత్తర దేశమునందలి శాసనములు చదువుటకు బ్రథమమునం (‘బ్రయత్నించినందుకు ప్రిన్స్‌సెస్‌ అను దొరకెట్టి గౌరవమును, ఖ్యాతియుం గలదో అట్టి గౌరవమును ఖ్యాతియు నీ యాంధ్రదేశపు పండితునకు నుండవలసినది. కాని యీతండు హిందువు అగుట చేతను, ఆంధ్రులకు జరిత్రాసక్తి లేనందునను నూటయిరువది సంవత్సరముల (క్రింద నుండిన యీ ఆంధ్రమవాపరిశోధకుని మనము మఱచిపోయితిమి. ఈతని సవిస్తరమైన చరిత్రము నేను మొదట “అర్వాచీన ఇతిహాసిక కోశు అనంబడు
మరాటీ పుస్తకములో జదివితిని. ఇందుమూలముననే మహారాష్ట్రల పరిశోధనా విధానములకును మన విధానములకును గల భేదము తేటపడగలదు. ఈ కావలి బొజ్జయ్య గారిది మొదటంగాపుర స్థలము ఏలూరు. అచ్చట నాతండు తెలుగు, సంస్కృతము, ఫారసీ నేర్చుకొనెను. అచ్చటి నుండి బందరుకుంపోయి మార్గన్‌దొర పాఠశాలలో నింగ్లీషు నేర్చెను. మొదట సైన్యములో జీతములు పంచు గుమాస్తాగా నుండి, తరువాత మెకన్టీ యొద్ద దుబాషుగాం గుదిరెను. పరిశోధకత మెకంజీ వలన నీతండు నేర్చెనో, లేక యీతని వలన మెకంజీ నేర్చెనో కాని, యప్పటి నుండియు 1808లో నితండు మరణించు వఱకును చరిత్ర వాంగ్మయ విషయకశోధనల కన్నిటికిని ఇతండె నాయకుండుగ నుండెను. ఇతనికిం దెలుగు, హిందుస్తాని, పారస్‌, ఇంగ్లీషు, కన్నడము, అఱవము, మహారాష్ట్రము అను నేడు భాషలు వచ్చును. ఇంతియ కాదు. ఈతండు వచ్చు వరకును మెకంజి గాని, ఆతని యొద్ద నున్న ఇతరులు గాని ఈ దేశపు శాసనములలో నొక్కదానిని గూడం జదువలేదు, అర్ధము చేసికానలేదు. ఈతండు వచ్చిన తరువాత గ్రమముగా నైదాఱు భాషలలోని శాసనములను చదువుటకును, అర్ధము చేసికొనుటకును వారందఱును సమర్థులైరని,
హైందవ జ్ఞానమందిరమునం బ్రవేశించుటకు బొజ్బయ్య యను ద్వారము నాకు దొరకెననియు, బొజ్బయ్య మరణము గుఱించి చెప్పునప్పుడు మెకంజీ స్వయముగ వ్రాసియున్నాండు. అనగా నీతడు పురాతన శాసనములను చదువుట సప్రయత్నముచే నభ్యసించి, అందు నాజితేరి  తరులకును ఆ విద్య బోధించెను. ఇది యంతయు నెప్పుడు? ఉత్తర హిందూ దేశమున ప్రిన్‌సెస్‌ ఇంకను శాసనముల: జదువం ప్రారంభించినప్పుడు! ఈతండొక హళ కన్నడ శాసనమును జదివి యర్థము చెప్పగ మెకంజీ మిక్కిలి సంతసించి యా రాతిపై నీతని పేరు వేయించి ఏషియాటిక్‌ సొసైటీ వారి భవనమునందుంచెనంట. ఈ సమాచారము మన యాంధ్రుల కెంతయు భూషణాస్పదము గదా! 1799లో శ్రీ రంగపట్టణము కోటను ఇంగ్లీషు వారు సాధించినప్పుడు బొజ్బయ్య యచ్చట నుండెను. ఆ ప్రసంగమును వర్ణించుచుం దెనుగున రసభరితమైన కావ్యము. జెప్పెను. 1800 సంవత్సరమునందు సర్‌ ఆర్థర్‌ వెల్లస్లీ, ధుండీ యను నొక వీరునిం బట్టుకొనెను. ఆ యుద్ధమునందు బొజ్బయ్య యుండెను. ఆ యుద్ధమును వర్ణించుచు నొక తెలుగు కావ్యమును రచించెను. ఇవి గాక సత్చురుష వర్ణనమను నూలు శ్లోకములను, శ్రీరంగచరిత్రము, శ్రీరంగపట్టణ రాజుల వంశావళి, యాదవరాజుల వంశావళి యను గ్రంథముల రచించెను. ఒకప్పుడు నైజాము రాజ్యములో సర్వే చేయుచుండగ కర్షల్‌ మెకంజీ యొక్కకాగితములు మొదలైన వాని నొక జమీందారుని మనుష్యులు దొంగిలించిరి. వానిని విడిపించుటకుం బోంగా బొజ్జయ్యను ఖైదు చేసిరి. అప్పుడు బొజ్జయ్య యారాజు నొద్దకుంబోయి, యాతనిని తన పాండిత్యము చేతను, కవిత్వము చేతను మెప్పించి కాగితములను, తనను విడిపించుకొని వచ్చెను.  యంతటను శాంతత ప్రసరించిన తరువాత, యంత్ర సాయములేక చేతితోనే దేశ పటములను దింపుట యభ్యసించి, మెకంజీనే మెప్పించెను. ఈతండిరువది యాఱవ యేటనే చెన్నపట్టణమునం గీర్తి శేషుండయ్యెను. ఈతని మరణమునకు
మిక్కిలి దుఃఖించి మెకంజీ యీతనిని దహనము చేసిన చోట నొక చిన్న శాసనము వేయించెనంట. అది యెచ్చట నున్నది కనుంగొన వలయునని నేను చెన్నపట్టణము నందలి కొన్ని శృశానములం దిరిగితిని గాని నాకది కానిపించలేదు.

కావలి రామస్వామి

ఈతండు బొజ్జియ్యకుం దమ్ముండు. బొజ్జయ్య గారి తరువాత మెకంజీ యొద్ద దుబాషుగా నున్న వాండు. కల్నల్‌ మెకంజీతోం గూడ క లకత్తాకుంబోయి యచ్చట, మెకంజీ సంగ్రహమునకు వ్యవస్థిత రూపము నిచ్చెను. ఈ సాధనముల నన్నిటిని యుపయోగించుకొని యీతండు 1822వ సంవత్సరమున నింగ్రీషులో “దక్షిణ దేశపు కవుల చరిత్రము” అను గ్రంథమును వ్రాసి గవర్నర్‌ జనరల్‌ అయిన లార్జు కార్నవాలిస్‌నకు నంకితమిచ్చెను. ఇది మొదట కలకత్తాలోను తరువాతం జెన్నపట్టణమునం బ్రకటింపం బడినది. ఇందు తెలుంగు, మరాటి, అజవము, కన్నడము అనుభాషలకు సంబంధించిన కవుల చరిత్రము లున్నవి. బ్రౌన్‌ దొరగారు సి.పి.బ్రౌన్‌ అను నతడాంధ్ర భాషా మతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఈతండాంధ్ర వాజ్బయాభివృద్ధికై చేసినంత పని యిటీవలి వారెవ్వరును చేయలేదని చెప్పిన నతిశయోక్తి కానేరదు. ఈతనిచే రచింపబడిన కోశముల మీరెజిగియే యున్నారు. మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవ పాండవీయం వంటి వాటికన్నింటికిని టీకలు వ్రాయించెను.
కన్‌జీ వలెనే యీతండును జీతములిచ్చి పండితులను బెట్టి యీ పని చేయించెను. తెలుంగు తాటాకు గ్రంధములన్న నీతని కమిత ప్రీతి. వీనిని సంపాదించుట కతం డెంతయో ధనము వెచ్చించెను. కొన్ని సమయములందు ధనము తక్కువ పడగా నీతడు తన వెండి పాత్రాదులను తాకట్టు పెట్టి పండితులను సత్మరించుచుందెను. ఈతనికి నరిదియైన తాటాకు గ్రంధముల యందు గల ప్రీతిం దెల్పు కథయొకటి చెప్పుచున్నాను. మా బంధువులు కొందఅకును ఒక జమీందారునకును ఒక యగ్రహారమును గుఖజించి వ్యాజ్యము బ్రౌన్‌ గారి కోర్టులో జరుగుచుండెనంట. కోర్టులో నితర వ్యాజ్యములు జరుగుచున్నప్పు డూరక నేలకూర్చుండ వలయునని మా బంధువులలో నొకండు ఐసవ పురాణము దీసికొని వెళ్ళి కోర్టులో నొక మూల గూర్చుండి అప్పుడప్పుడు మనసులో6 జదువుకొనుచుందెను. బ్రౌను అది విని యొకమారతనిని పిలిచి యది యే గ్రంధమైనది తెలిసికొని, తనకొకటి సంపాదించి యాయవలసినదిగాం గోరెనంట. అంత మాబంధువుడా పుస్తకము సంపాదించి ‘బౌన్‌ దొరకిచ్చెనంట. అంత నాతనిని బ్రౌన్‌ దొర యనుగ్రహముతోం జూచుచు, శైవ సంప్రదాయములను గుజించి యప్పుడప్పుడడుగు చుండెనంట. ఈ సంగతి యంతయుం జూచి జమీందారుండు న్యాయమైన రాజీకి సమ్మతించెనంట! ఇట్టి కథ లెన్నియో కలవు. ఎందరో పండితులు బ్రౌను వలన బాగుపడిన వారు కలరు. వారి
సంతతి వారిప్పటికిని మంచి స్థితిలో నున్నారు. పూర్వపు రాజుల వలెం దన మీదం పద్యము చెప్పిన వాని కెల్లను బౌను ఏదో యొక యుపకారము చేయుచునే యుండెను. బ్రౌను దొరగారి యాస్థానమొక జమీందారుని యాస్థానము వలె నుండెను. ఈతండు సంపాదించిన గ్రంథములన్నియు నిప్పుడు చెన్నపట్టణము అముద్రిత గ్రంధాలయమున నున్నవి. ఈతని సంగ్రహమును దొరతనము వారు ధనమిచ్చి కొనినట్లు కానరాదు. ఈతండు ప్రతి పుస్తకమును ఎంత శ్రద్ధతోం జదువుచుండెనో యాతండు ఆయా (గ్రంథముల మీద వ్రాసియుంచిన షరాల (రిమార్ముల) వలనం దెలియంగలదు. వాని నన్నిటిని చక్కగ నభ్యసించి యెవరైనను ఈతని చరిత్రము సాంగముగ వ్రాయుదురు గాక, ఈతండు తెలుంగు గ్రంధములను సంపాదించుటకు నెట్టి ప్రయత్నములు చేయుచుండెనో, ఎంతెంత ధనము వెచ్చించుచుందెనో గంజాము నుండి యొకండు వ్రాసిన యుత్తరమిచ్చట నుదాహరించుచున్నాను. మహాజరా రాజశ్రీ సీ.పి. బ్రౌన్‌ దొర వారి దివ్య సముఖానకు -గుంటూరు జిల్లా యిల్మా బాపట్ల తాల్టూలో చేరిన పెద గంజాం కాపురస్థుం డైన గంజాం పెద అప్పయ్య హరిదాసు వినయవిధేయ పూర్వకముగా వ్రాస్తున్న విజ్ఞాపనలు యేమంట్లే -పల్నాడు వీరచరిత్రలనే గ్రంధమును నాద్వారా వ్రాయిచి పంపించవలసి నదిగా తమరు మహారాజశ్రీ గుంటూరు జిల్లా కలెక్టరు దొరగార్లు మేష్టరు యె.పార్వీ
దొరవారుకు వ్రాయించి నంద్ను ఆయన గారు నన్ను పిలిపించ్చి రూబుగారీలో శలవు యిచ్చిన ఫ్రకారమునూ తమరు నాప్యార వ్రాయించి వుండె వుత్తరాల ప్రకారమున్నూ యింత మట్టుకు 16 కథల [గ్రంథమును గోవ కాకితాల మీంద 5 బుక్కులలో వ్రాసి వారి తావున దాఖలు చేసి వున్నంద్ము అవి తమకు చేరినట్లు తిర్టి నా ప్యార 1853 సంవత్సరం పిబరెవరు నెల 15 తారీఖున వుత్తరం వ్రాయిస్తూ అందులో లేవని వ్రాయించిన ౩ కధలలో బాలగోపన్నతో బ్రహ్మినాయుడు కోడిపోరుకు పోయిన కధనున్ను వుత్తండ వీరుల గంగాధర మణ్గులో ప్రాణలింగాలు పట్టిన కథానున్నూ సెప్టెంబరు బుక్కులో వ్రాసి వున్నాననిన్నీ తక్కిన అన్గురాజు రాజ్యం చేస్ని కథ ఒకటిన్ని అంతు ఈ రెండు కథలున్నూ నా తావున లేకపోవటం చేత వాటిని గురించి విచారిస్తే యిక్కడ్మి షుమారు 24 ఆమడ దూరం గల బెండమూరి లంకలో వున్నట్టు తెలుస్తుందనిన్ని నాకు భత్య ఖర్చుకు యేమీ యింట్లో నా చిన్న వాండ్ల ఖర్చుకు యేమి ఆ గ్రంథాలు వుందె మాలకుదార్లకు యేమైైన యిస్తేనే గాని వ్రాసుకోవడమునకు యివ్వరు గనుక వాండ్లకు యివ్వడముకు యేమి రూ 50 రూపాయలు దయచేయిస్తే నేను బెండమూడి లంకకు వెల్లి బాహుళ్ళం గల సదరు  కథలు రెండున్నూ సాధించి వ్రాసి తీస్కుని వచ్చి దాఖలు చేస్తానని యిదివరలోనే సదరహి దొరవారి ప్యార అద్జీల ద్వార వీశదపర్పుకొని వుంన్నాను. వారి వల్ల తమ చిత్తానకు విశదమయ్యే వుండును. ఆ కథలు రెండున్నూ ఆగత్యం కావలసిన పక్షమందు సదర్ను వ్రాసుకున్న ప్రకారం నాకు ఖర్చుకు 50 రూపాయిలు దయచేయించినట్టులైతే అవి సాధించి తీస్కుని వచ్చి వ్రాసి పంపించుకుంటు వున్నాను. యిదివరలో శలవు ప్రకారం నేను వ్రాసి పంపించుకొని వున్న గ్రంథాలకు నాకు యిప్పిస్తామన్న రు 50 రూపాయలు మింజుమలే యిదివరలో యిప్పించి వున్న రు. 25 యిరువై అయిదు రూపాయలు గాక తక్కిన రు 25 రూపాయలున్నూ నాకు దయచేయించ గలందులకు సదరు దొరవారి ప్యార శలవు దయచేయించ వలెనని వేడుకుంటున్నాను.
మొదట పార్వీసు దొరవారు నన్ను పిలువనంపించి యీ బగంథం వ్రాసి యివ్వవలసినదిగా అడ్జినంతలో నా తావు వుండె 11 గ్రంథముల సేహారిస్తూ వ్రాసి యిచ్చినందున అవి గోవ కాకితాల మీద వ్రాసి యిచ్చే నిమిత్తం 50 రూపాయలు నిష్మర్న యేర్పరచి నా తామ్ను వుండె 11 కథలకు జాబితా తీస్మున్నందు సదరు జాబితాలో నమోదు అయి వున్న 11 కథలు గాక తమ యొక్క అనుగ్రహం సంపాదించుకోవలెననే తాత్పర్యం చేత యీ దేశమందు యితర వద్ద కథలు 5 అయిదు కథలు వ్రాసి యిచ్చివున్నాను. మొదట నేను రు. 50 లు కలుప్పుకొని వ్రాయవలసిన కథల కంటె 5 కథలు జాఫా వ్రాసి యిచ్చి వున్నాను. గనుక నాకు రావలసిన రు. 25 న్యాయంగా దయచేయించవలెనని తమ యొక్క ఘనాన్ని మిక్కిలి ప్రార్ధిస్తూన్నాను. దివ్య చిత్తాన్ముతేవలయును. 1753 సం; జూన్‌ నెల 11 తేది గంజాం పెద అప్పయ్య హరిదాసు వ్రాలు.”) (వా. వె. 15. పేజీ 99)

బుక్క పట్టణము రాఘవాచార్యులు

ఈతండు పరమపదించి పదునైదు సంవత్సరముల కంటె కాలమై యుండదు. వీరిది గుంటూర్లు ఈతండు డిప్యూటీ తహసీలుదారు పనిచేసెను. హానరేబిల్‌ డి.యస్‌. చరిత్రమును రెండు భాగములుగ వ్రాసెను. ఒక భారత చరిత్రమును, రెండవ భాగమందు గజపతుల చరిత్రమును ఉన్నప. గజపతుల చరిత్రము నందు మనకిది వఱకు దెలియని కొన్ని విశేష రెండు భాగములును ఇటీవల జెన్న వట్టణవు అముద్రిత (గంథ సంగ్రహాలయమునకు వచ్చినవి. మూడవ భాగమనగా శాసనముల భాగము మాత్రము కానవచ్చుటలేదు. ఈతండు సంపాదించిన శాసనముల నన్నింటిని ఈతని తరువాతి వారు కరిగించి కాంగు చేసికొనిరని తెలియుచున్నది. శాసనముల యోగ్యత యెఱుంగని వారింత కంటె నేమి చేయంగలరు?

రంగాచార్యులు గారు

ఆంధ్ర వరిశోధకులను గుజించి చెవ్వునమ్చుడు కీర్తిశేషులయిన మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులు గారును, వారిచే స్టాపింపం
బడినదియు, వారి పుత్ర పౌత్రులచే నభివృద్ధి చేయంబడుచున్నదియు నగు విశాఖపట్టణ మందలి ఆర్ష పుస్తకశాలయు, విశేష సంస్మరణీయములని వచించుటకు సందియము లేదు. ఇందు మన దేశము నందు దొరకు గ్రంధములేకాక, ద్వీపాంతరములందు గాని దొరకని అద్వితీయ సంస్కుత గ్రంథములకుం బ్రతులు తెప్పించి యుంచుట యెంతయుం. బ్రశంసనీయము. ఆచార్యుల వారిచేం ‘జ్రారంభింపంబడిన సంస్కృత మవికోశము పూర్తియై యుండిన యెడల వాచస్పత్యాది కోశములు వెనుకం బడియుండును. అది అసంపూర్తిగ నుండుట యాంధ్రుల దురదృష్టమనియే చెప్పవలయును.  ఆంధ్ర వాజ్మయ చరిత్రమునకై కృషి చేసిన గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారిని, కందుకూరి వీరేశలింగము పంతులు గారిని ఆంధ్రులెన్నడైన మటువంగలరా? వీరేశలింగము గారి ప్రతిభ సకల దిక్‌సంచారి. వారు వ్రాయని విషయము లేదు. చేయని సత్మార్యము లేదు. కావున నితర ఘనకార్యములకై వా వారి క్రీరి తెనుంగు దేశమునందు చిరకాలము వ్యాపించి యుండు ననుటకు సందేహం లేదు. అట్లెనను వారు మజియే ఘనకార్యమును చేయక యుండి, మఱియే గ్రంధమును వ్రాయక యుండి, యొక్క యాంధ్ర కవుల చరిత్రమును మాత్రమే వ్రాసి యుండినను వారి కీర్తి యజరామరమై యుండుట నిక్కము. ఇంకముందు నాంధ్ర భాషను గుజించి యున్ని గ్రంథములైనను పుట్టును గాక; వాజ్మయ చరిత్రము దెలిసికొనగోరు విద్యార్ధికి దీని పఠనము అపరిహార్యము. పైని పేర్మొనంబడిన వారు గాక కీర్తిశేషులైన పరిశోధక మహాశయులు
మజికొందలుందురు. కాని, నా యజ్ఞాన మూలమునను కాలహరణ ఖీతి చేతను ఇచ్చట వారందథటి నామములను స్మరించుటకు వీలులేదని చింతిల్లుచున్నాను. మన సమకాలికులైన శ్రీయుతులు వేణుగోపాలచెట్టిగారు, జయంతి రామయ్య వంతులు గారును, మానవల్లి రామకృష్ణ కవి గారును, కాశీభట్ల బ్రహ్మయ్యశాప్రిగారును, వంగూరి సుబ్బారావు గారును, బుర్రా శేషగిరిరావు గారును, ఆంధ్రేతిహాస పరిశోధక మండలియు, వేంకటరమణ కవులును, మజికొందరును నూతన విషయములను కనుగొనుటకును, పురాతన విషయములను నూతనముగ నన్వయించుటకును యత్నము చేయుచున్నారు గనుక వారును మనకు స్మరణీయులే. ఇట్లు పూర్వాచార్య సంస్మరణము: గావించి వాజ్బయ సంబంధమైన కొన్ని నూతన పరిశోధనలను గుజించి ముచ్చటించెదను. యుద్ధమల్లునకుం బూర్వపుం దెలుంగు పద్యములు నన్నయభట్టునకు6 బూర్వము తెలుంగునం బద్యరచన లేనే లేదనియు, నది నన్నయచే నూతనముంగ బుట్టింపంబడెననియు. దలంచెడు పండితులు కొందజు మన దేశమునందుం గలరని మీరెజుంగుదురు. పూర్వలిపి పరిశోధన పంతులు గారు ఆంధ్ర పరిషత్పత్రికలోను, ఎపిగ్రాఫియా యిండికాలోను ప్రకటించియున్నారు. అది 927వ సంవత్సరము మొదలు 93%వ సంవత్సరము వఱకు వేంగి దేశమును పాలించిన చాళుక్య యుద్ధమల్లుని శాసనమని వారు నిరూపించి యున్నారు. అందుపై గొన్ని వాద వివాదములు గూడ జరిగినవి. నిష్పక్షపాత బుద్దితో విచారించు మహనీయులకు నా శాసనము నన్నయ్యకు రమారమి నూరేండ్లు పూర్వపుది యని తోంపక మానదు. అయినను ఇందుకు నాప్పుకొనని వారు కొందజు కలరు.  ఇంగ్లండులో నింకను భూమి గుండ్రముగ లేదు, బల్లపరువు వలెనే యున్నది అని వాదించువారు కూడం గలరు! వారికి సమాధానము చెప్పుట యెవరి తరము? యుద్ధమల్లుని శాసనము సంగతి యిట్లుండగా నంతకంటే బూర్వపు తెలుగు పద్యములు బయలుదేరినవి. వానిని నేండు మీకు సమర్చింపబోవు చున్నాండను. ఇందొకటి సీసపద్యము, మజియొకటి తరువోజ. ఈ శాసనములు కొత్తవి కావు. ఇందలి పద్యములను కనుంగొని, వాని యతిప్రాసగణములం బకీక్షించి, యివి తెలుంగు పద్యములే, గద్యములు కావని నిశ్చయించుట నూతన విషయమే గాని శాననము  దివజకుం గనుగొనబడినవే. ఈ శాసనములు బటర్‌వర్తు వేణుగోపాలచెట్టి గార్లచేం బ్రకటింపబడిన నెల్లూర్‌ ఇన్‌ప్మిస్షన్‌స్‌’ అను గ్రంధము యొక్క రెండవ సంపుటమునందు నీయంబడినవి. ఇవి యాంధ్ర భాషా చరిత్రమునకుం జాల ముఖ్యమైనవి యైనను ఇన్ని దినముల వఅణకుం బండితుల దృష్టిని నెంతగ నాకర్షింపవలయునో యంతగా నాకర్షింపక పోవుట యాశ్చర్యము. ఇందలి యొక శాసనము పద్యమయమైయుండునని శ్రీయుత చిలుకూరు వీరభద్రరావు గారు తమ ఆంధ్రుల చరిత్రలో వ్రాసిరి. అదియే మంజరీ ద్విపదయై యుండునని యొక తావునను, తరువోజయని మథియొక తావునను శ్రీయుత వంగూరు సుబ్బారావు గారు తమ వాజ్మయ చరిత్రము నందు వ్రాసియున్నారు.  పద్యమయములని నా మనసుకుం దోంచి, కొంత ప్రయత్నించి చూచి, యవి పద్యములేయని నిశ్చయించుకొంటిని. ఈ రెండు శాసనములను యుద్ధమల్లుని పెదతాతయైన గుణగ విజయాదిత్యుని కాలము నాటివి. తరువాతి కాలము వారీతనిని గణగ విజయాదిత్యుం డన్నను, ఈతని సమకాలికులును, ఈతని శాసనములును ఈతని పేరు ‘గుణగు ‘గుణగ నల్లాత అనియే చెప్పుచున్నవి. ఈతండు 845 మొదలు 888 వణకు రాజ్యము చేసెను. ఈతని మంత్రి పండురంగందను వాడు. ఈతని శాసనముల నన్నిటిలోను ఈ మంత్రి పుంగవుండే “ఆజ్ఞప్తిగా నుండును. ఇప్పుడు గుడివాడలోను, ఇతరత్రను “పందడ్రంగి వారు కలరు. వారికి నీతనికి నేమైన సంబంధము కలదేమో విచారింపవలయును. ఇయక శాసనములను విచారింతము. మొదటి శాసనము నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామము లోనిది. ఇది “నెల్లూరు ఇన్‌స్ర్కిప్షన్స్ అను గ్రంధము యొక్క రెండవ సంపుటములో 544వ
పుటలో నీయబడినది. ఈ రాయి యాగ్రామమునందు రామస్వామిమేడ అను దేవాలయములోని గోడలోం గట్టబడి యుండెను. దానిని శ్రీయుత వేణుగోపాల చెట్టి గారు తీయించి తాలూకా కచేరిలోం బెట్టించిరి. ఇట్లు వారు చేసి యుండకుండిన మనకిప్పుడా రాయి లభించి యుండదు. ఈ రాతిని స్వయముగాం జూచి గ్రంథములో నీయబడిన పటములో బాగుగం గానరాని యక్షరములం గొన్నిటినైనను కనుంగొనవలయునని నేను ఆ రాయి తాలూకా కచేరిలో నున్నదా లేదా యని విచారింపగా, తాలూకా కచేరి రెండు మూడు స్థలములకు మాజినందున నిప్పుడా రాయి యొచ్చటను కానవచ్చుట లేదని మొన్ననే మా మిత్రులైన శ్రీయుత సరస్వతీ గారి వలనం దెలిసిది! కావున నిప్పుడు శ్రీయుత చెట్టిగారు తమ గ్రంధమందిచ్చిన  సేసపద్యముండెనని స్పష్టపడుచున్నది. ఈ పద్యమందలి రెండు చరణములు స్పష్టముగ చూపి రెండు తావుల ఉత్త సంధిని విడదీసిన యెడల యతులతోం గూడ సీసపాదము లేర్పడుచున్నవి. మూడవ పాదములో సగమును, నాల్టవ పాదమున నుత్తరార్థమును ఇట్లే స్పష్టపడుచున్నవి. ఇప్పుడు మనము తాటాకు గ్రంధముల నుండి పద్యములను వ్రాసి కొనునప్పుడు లక్షణము సరిపోవుటకుం జేయునట్టి స్వల్పమైన మార్పుల వంటివే యీ మార్పులు గాని అంతకంటెం బెద్దవి కావు. నిండు సున్న యున్న చోట అజసున్నగ మార్చుచున్నారము. *ని అని చివర నున్న యెడల ‘న్‌ అని నకార పొల్లుగ మార్చుచున్నాము. అట్లే మూలమందుం గొన్ని మార్పులు చేసినం బద్యము సిద్దించుచున్నది. ఇందురాజైన గుణకేనల్లాతని పేరును, ఆతని మంత్రియైన పాండురంగని పేరును స్పష్టముగ నున్నవి. కావున దీని కాలనిర్ణయమును గుటించి యే విధమైన
సంశయమును లేదు. ఇట్లు ఈ పద్యము యొక్క పద్యత్వమును గుఖజించియు, కాలమును గుటించియు నిశ్చయ చిత్తులమై (ఇక) రెండవ శాసనమును గూర్చి విచారించెదము. ఈ శాసనము శ్రీ చెట్టిగారి గ్రంథమునందు 896వ పుటలో నీయంబడినది. ఇయ్యది యిప్పటి గుంటూరు జిల్లాలోని అద్దంకి గ్రామము నందు నున్నది. దీని ఛాయాపటమును గ్రంథమునం దీయంబడినది. కాని యంత స్పష్టముగ లేదు. ఎపిగ్రాఫి డిపార్టుమెంటు వారికి వ్రాసి దీని ప్రతి యొకటి కొత్తగాం గొట్టించి తెప్పించితిమి. కానీ యీ రాయి యెండకెండి వానకు నాని చలికి వణుకుచు
నెచ్చటనో యెవరి దొడ్డిలోనో పడియున్నందున చెట్టిగారి కాలము కంటె మిక్కిలి దురవస్థలో నున్నది. అయినను కొన్ని యక్షరముల నిర్మయమునకు సహకారియైనది. ఇది పరమ మాహేశ్వరుండయిన పాండురంగనిచే నాదిత్య భట్టారకునకు నీయం బడిన దానమును తెల్చును. ఇది గద్య పద్యాత్మకము. మొదటి 7 పంక్తులును పద్య్వమయములు. 8 మొదలుకొని 11వ పంక్తి వఱకు గద్యము. ఇందలి వృత్తము తరువోజ. ఇది పెద్ద వృత్తము. గద్యమును జూచి పద్యమను కొనుటకు నెంత మాత్రమును వీలులేనంత పెద్దది. ద్విపద యొక్క రెండు చరణములు కలిపి దీని
చరణ మొకటి యగును. నాలుగు చరణములందును ప్రాస యుండును. ఒక్కొక్క చరణములో మొదటి యక్షరముతో నాలు స్టలములందు యతి యుండును. అనగాం బ్రతిచరణము నందును నాల్గుచోట్ల యతి మైత్రి గల యక్షరములే యుండవలయును. ఇన్ని కట్టుదిట్టములతో నున్న పద్యమును అన్యముగాం జెప్పుటకు నెవ్వరికి వీలులేదు. ఇట్లు నన్నయ్య భట్టు కంటె రెండు వందల యేండ్లకు బూర్వమును, యుద్ధమల్లుని కంటె దొంబది యేండ్లకు బూర్వమును తెనుంగునందు బద్య కవిత్వముండెననియు, శాననముల మీందం గూడ బద్యములు చెక్కించుచుండిరనియు నిశ్చయింపవచ్చును. మనకు దొరకిన యీ రెండు పద్యముల యొక్క వృత్తములను గుఱించి యొక విశేషము కలదు. మొదటిది సీసము, రెండవది తరువోజ. ఈ రెండును అచ్చ తెలుంగు వృత్తములని చెప్పవచ్చును. కొందజ మతమునం దెనుంగు వృత్తములందు స్వతంత్రములయిన వేవియు లేవు. కొన్ని సంస్కృతము నుండియు , గొన్ని కన్నడము నుందియుం దీసికొనం బడినవంట. కాని సీసపద్యమును గుఱించి యట్లు చెప్పుటకు వీలులేదు. సీసపద్యము సంస్కృత వృత్తముల లోనిది కాదు. కన్నడమునందు దీనికిం బ్రచారము లేదు. దీనికిం దెనుగుననే ప్రచారము కలదు. 990 ప్రాంతము వాడైన నాగవర్శచే రచింపబడిన ఛందోంబుధి యందు సీసపద్యోదాహరణమొకటి యున్నది. కాని ప్రక్షిప్తమని కొందతి యభిప్రాయము. అది ప్రక్షిప్తమైనను గాకపోయినను, కర్టాట వాజ్బ్యయమునందు సీసపద్యమును ఉపయోగించిన వాందరిది. గొప్పకవి యెవండును ప్రయోగించి యుండలేదని ” తజ్జుల యభిప్రాయమై యున్నది. ఇంకం దెనుగుననో దానిని ఉపయోగింపని కవియే
లేడు. కావున దీనిని అచ్చ తెలుంగు వృత్తమని చెప్పిన యెడల నతిశయోక్తి కానేరదు. అదియు గాక ఛందొంబుధి సంస్కుతచ్చంద శ్శాస్ర్తమునందు గాని, కర్టాటక చ్ఛందశ్శాస్త్రమందు గాని కాన్నంపదు. రెండు ద్విపద చరణములతో దీని చరణ మొక్కటి యగును. సంస్కతమునందు
ద్విపద కును నామసామ్యము తప్ప మజతీయే సంబంధమును లేదు. దాస్‌కి రెండు చరణములుండును. దీనికి రెండు చరణములుండును. గణములు మాత్రము వేఱువేఱు. సంస్కృతము నుండి తీసుకొనబడినం యక్షర గణములకుం దెనుంయన బ్రాస నియమముండినట్లు దీనికిం బ్రాస నియమమున్నందున నిది సాంస్కృతికమేమో యన్న సంశయము కలగవచ్చును. కాని యట్లు సందేహింప నక్మర లేదు. కన్నడ ఛందశ్శాస్త్రమునందు ద్విపద వంటి వృత్తమొకటి చెప్పంబడినను వాజ్బ్యయమునందు దానికిం బ్రచారము లేదు. తెనుంగుననో వాజయము నందేకాక, బ్రతి గృహమునందును, నాండువారి పాట రూపముగ ననాది కాలము నుండియు వ్యాపించి యున్నది. కావున దీనిని “తెలుంగు వృత్తుమని చెప్పుటకు నేమియు సంశయము లేదు.

నన్నయకు బూర్వము గవిత్వము నొల్లని వారీ పద్యముల నొక విధముగ నాక్షేపింపవచ్చును. అసంపూర్తిగ నున్నవియు, తొణ్జి మొళణ్ణి్ నున్నవియు నగు నీ పద్యములు నన్నయ కావ్యముల యెదుట లెక్కయా, ప్రమాణములా? యని వారనవచ్చును. యుద్ధమల్లుని శాసనమందలి పద్యములను గూడ వీరు ‘తొణ్జి మొళణ్జి పద్యమూలని యాక్షేపించి యున్నారు. కాని ఈ యాక్షేపణయే వీరు తమ మూల వాదమును వదలుకొనిరని తెలుపుచున్నది. ఈ పద్యములను మేమొక కావ్యమని యుదాహరించి యున్న యెడల బూర్వము తెలుంగునం బద్యరచనయే లేదు; సంస్కృతమును, కన్నడమును చూచి యొక దినము నన్నయయే మొట్టమొదటం పద్యము ము రచించెను అని వారి వాదము. దాని కి బదులుగ పై పద్యములు పంబడుచున్నవి. ఒక పద్యము మాత్రము గాదు, గణయుక్తమైన యొక రణ నన్నయకుం బూర్వపుది తెలుగున దొరకినను వారది వాదమంతరింవవలనినదే. నన్నయకు. బూర్వము నియమితేంద్ర చంద్ద్డ్రర సూర్య గణములతోం గొన్ని తెలుంగు వృత్తములం దెనుంగు వారు పాడుచుండిరనియు, నన్నయలో గానవచ్చెడి యతిప్రాస నియమములు అంతకు బూర్వమే యుండెననియు,
న్నయ పుట్టించినవి కావనియు నొక్క పద్య చరణము స్టాపించంగలదు. కావున వానిని నాంధ్ర వాజ్మయ చరిత్రమును తెలిసికొనం గోరు వారు అనాదరణతో ఉండుటకు వీలులేదు.

ప్రాస చంపకమాల

గుణక విజయాదిత్యుని మజియొక శాసనమునందు నొక విశేషము కలదు. ఈ తామ్ర శాసనము క్రొత్తగా దొరకినది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని సౌతలూరను గ్రామమున దొరకెను. శ్రీయుత నాగేశ్వరరావు గారి మూలమున నాకు లభించినది. దానిని రాంబోవు సంవత్సరాది సంచికలో. బూర్తిగా బ్రకటించుచున్నాను. ఇచ్చట నందలి యొక్క విశేషము మాత్రము చెప్పెద. అందు కవిచే పిట్టరుం డనబడు విష్ణువర్ధనుని వర్ణించుచు సంస్కృతమున నాక చంపకమాలా వృత్తము చెప్పంబడినది. దాని నాలుగు చరణములందును ప్రాస కలదు. యతి మాత్రము నంస్కృత సంప్రదాయమనుసరించియే యున్నది. ఆంధ్ర సంప్రదాయ మనుసరించి లేదు ఆ పద్య మెద్ది యన

చంపకమాల

అరి నృప వాఱి వారణ పదాతి మహావిభ్రవిరామ మారుతః
పర కర నస్తితాసిభరు ఖిఫ్ర పినాశన భాను సన్నిభః
గురు తర దీన భారవత మానవ మానిత కల్ప పాదపః

వర కరి గల్ల భూమిప భూజాసిరిహాజి భువి ప్రహాసతే.

కావున పై శ్లోకము సంస్కృతము నందున్నను, అది దేశభాషా సంప్రదాయము ననుసరించి వ్రాయంబడె ననుటకు సందియము లేదు. అనగాం దొమ్మిదవ శతాబ్దము నందు గుద్రవాడ విషయములో, అనగా గుడివాడ ప్రాంతమునందు దెనుంగు కవులు ప్రాసయుక్తమైన చంపకమాలా వృత్తమును రచించు చుండిరని మన మీ సంస్కృత శ్లోకము వలన నూపొంపవ చ్చును. అప్పుటికి వృత్తములలో యతి పాటింపం బడుచుండెనో లేదో ఈ పద్యమును బట్టి నిశ్చయముగా చెప్పలేము. కన్నడము నందు వలెనే యతి నియమము తెనుంగునందు మొదట లేకయుండెనేమో? భావి పరిశోధన వలన గాని యీ సంగతి తేలనేరదు. పైని నుదాహరింపంబడిన తెలుంగు సంస్కృత పద్యములు నన్నయభట్టునకు
రమారమి రెండు వందల సంవత్సరములు పూర్వకాలపువి. అనగా నంతగా నెక్కుడు ప్రాచీనములు కావు. కావున నన్నయ కాలపు వ్యాకరణ ఛందో లక్షణములు చాల వణకు వానికిం బట్టుచున్నవి. ఆ కారణము చేతనే మనము వానిని పద్యములని గుర్తింపంగలిగితిమి. కాని యా కాలమునకుం గూడ బూర్వపు వాగ్మయమును పరిశోధించునప్పుడు, సర్వకాలములందును ఛందోవ్యాకరణ లక్షణము లొక రీతిగా నుండవన్న సత్యమును శోధకులు మజువక యుండవలయును. లేనియెడలం బద్యములు గద్యముల వలెను, సలక్షణ వాక్యములు తప్పుల వలిను, నాగరక
పదము లెజకలి బాస వలెను దోచి, మనము పెడమార్గమునం బడవచ్చును కావునం బురాతన శాసనములను శోధించు మహనీయులు తమ ప్రజ్ఞావిశేషముచే గుణక విజయాదిత్యునకుం బూర్వపు టాంధ్ర పద్యరాజములను గూడ గుర్తించి యాంధ్ర లోకమున కొసంగుదురు గాక.  నన్నయభట్టాది కవియే నన్నయ భట్టారకునకుం బూర్వము దెనుంగు కవిత్వమున్నంత మాత్రమున ఆతని గౌరవమునకు గాని, ఆదికవి యన్న బిరుదమునకు గాని, యే విధమైన లోపమును రాజాలదు. ఇప్పుడు మనము పఠించెడి ఆంధ్ర మహాకావ్యములలో మొట్ల మొదటిది యాతనిదే. ఆంధ్ర ఛందోవ్యాకరణ లక్షణములకు నాతని భారతమే ప్రథమ ప్రమాణము. అంతకుంబూర్వము కావ్యము లుండిన నవి లోపించినవి.  నీతండే ప్రథముందడని చెప్పుట లోపము గాదు. అది యొక విధముగ క ఇట్టి బిరుదములకు గొంతవఱకు నౌపచారికార్ధము గ్రహింపవలెను. సంస్కృతమున వా సిడిని ప్రధమ కవి యందురు. అంతకుం బూర్వపువి యగు వేదములలో ఛందములు లేవా? వేదములు పౌరుషేయములా, అపౌరుషేయములా యనిన వాదమటుండనిచ్పానను, మంత్రద్రష్టలైన యొందఱకు రుషులకు కవులన్న బిరుదములు లేవు? అసుర గురువైన శుక్రాచార్యుండు కవిగాదా? శుక్రాచార్యులు మొదలా? వాల్మీకి మొదలా? చతుర్ముఖ బ్రహ్మకుం గవియన్న బిరుదము గలదు. అది యట్లుండె. కాళిదాసును కవికులగురువందురు. అప్పుడు వాల్మీకి యేమాయె? పెద్దనను ఆంధ్ర కవితాపితామహుడందురు. పదునొకండవ శతాబ్దమున నున్నవాడుం ను, ఆంధ్ర భాష పితయునగు నన్నయకు పదునారవ శతాబ్దము నందున్న పెద్దన తండ్రి యని యా యీ బిరుదమునకు అర్ధము? కావున నీ బిరుదములకు ఔపచారికముగను, లాక్షణకముగను అర్ధమును గ్రహించు నెడల నన్నయకు బూర్వమాంధ్ర వాబజ్బ్యయమున్నదను కొను వారికిని, లేదనుకొను వారికి, గూడ యే  వివాదములతో నవసరముండదు. పరిశోధనకు నూతన ప్రదేశములు – మన పరిశోధకు లిదివఱకు నెక్కువగా నుత్తర సర్మారులనే తెనుంగు దేశముగ భావించి పరిశోధనలన్నియు నటువైపులనే జరిపియున్నారు. చెన్నపురి మాన్యుస్కిప్ట
లైబ్రరీ పండితు లిదివరకు దత్తమండలముల వైపు తాటాకు గ్రంథములకై వెళ్లలేదు. “సాహితీ వైజయంతి ” పరిషత్తు వారు చేసిన ప్రయత్న మత్యల్పము. కృష్ణదేవరాయని రాజధానికి సీమంతాద్భాగము నందున్న దేశముల విడిచిన యెట్టితెలివి గల పని? ఎపిగ్రాఫీ ఫీ రిపోర్టులో జదివినట్లు ప్లా న్థాపకము. ఈ మఠములు జంగము మఠములో వేఱు మరములో తెలియదు. కాని తెనుంగు దేశమునందు నితరత్రను జంగము మఠములలో శైవవాజ్మయ మపూర్వమైనది కలదని నా తాత్పర్యము. నేనిటీవల పరిష్పత్రికలో బ్రకటించినదియు, దిక్కనకుం బూర్వపుదియు నగు శివతత్వ సారమను గ్రంధము జంగముల యింటనే దొరకెను. సాధారణముగా నీ జంగము మఠస్థులు పరమతముల వారికి గ్రంథములీయరు. అయినను మన సదుద్దేశములను వారికి దెల్చి చెప్పియు, వేఱు విధములను బ్రయత్నించి యిట్టి మఠములలోని గ్రంధములను
సంపాదించవలెను. అట్లే మైసూరు రాజ్యమునందును కొంత తెనుంగు దేశము కలదు. అచ్చటను అపూర్వ గ్రంథములు కొన్ని దొరకవచ్చును. హరిభట్టు రచితమైన నృసింహ పురాణమును, అహోబల రచితమైన చిత్ర కవిత్వ లక్షణమును మజికొన్ని మనమిది వరకు వినని గ్రంథములు మైసూరులో నున్నవని నాకుం దెలిసినది. వానిని సంపాదించుటకు యత్నించు చున్నాండను,

హైద్రాబాద్‌ రాజ్యము ఆంధ్రదేశమును గుఱించియు, నాంధ్ర రాజుల గుఱించియు, నాంధ్ర వాజ్మయమును గుఱించియు నెక్కుడు పరిశోధనము చేసి కొత్త క్రొత్త వింతలను కనుగొనందలంచిన వారికి హైద్రాబాద్‌ రాజ్యమందలి తెలుంగు భాగ మొక బంగారము వంటిది. బ్రిటిషు ప్రభుత్వమందలి తెలుంగుదేశమును, వైజాములోని తెలుంగు దేశమును ఒకటికి నొకటి తగిలియున్నను ప్రభుత్వములు భిన్నములగుటచే నుత్తర సర్మారులోని తెలుంగు వారికి హైద్రాబాదు రాజ్యమందలి తెలుంగు దేశమొక యండమాను దీవి వలెం దోచుచున్నది! కాని నైజాము రాజ్యమందలి మన బాంధవులను గుఱించి మనమింత భయపడవలసిన పనియు లేదు. ఇంత యౌదాసీన్యముగ నుందుటయు న్యాయము కాదు. నేను ఒక విధముగ జమీందారి యొక్క గడ్డవలె నైజాము రాజ్యమునకు నడుమ నుండును, మాకుం జుట్టు సరిహద్దు నైజాము రాజ్యమే. రాజకీయముగ మేము బ్రిటిషు ప్రభుత్వంలోని వారిమైనను ఇతర విషయములన్నిటి లోనూ మేము నైజాము రాజ్యమునకు సంబంధించిన వారమే. కావున నైజాము రాజ్యమును రెండు చీలికలుగ విభాగింపవచ్చును. తూర్చు భాగమునకు ‘తెలంగాణ అనియు, పశ్చిమ భాగమునకు “’మరాఠవాడి’ యని పేరు. ఈ తెలంగాణలో బెద్దది యగు 8 జిల్లాలు కలవు. అత్రాఫ్‌బల్దా, వరంగల్‌, నల్లగొండ, మెతుకు, కరీనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ అను జిల్లాలను శుద్ధాంధ్ర దేశమని చెప్పవచ్చును. ఇంత వైశాల్యమును, జన సంఖ్యయు గల తెలుంగు దేశమును గుఱించి మనమేమియు దెలిసికొనక యూరకుండుట న్యాయమా? ఈ తెలుంగు భాగము మనకంటె రమారమి‌, నూఱేండ్లు వెనుకనున్నందున, పూర్వకాలపు గ్రామ సంఘముల యొక్కయు, ఆచార వ్యవహారముల యొక్కయుం జరిత్ర కనుగొన వలయునన్ననీ ప్రాంతమునందు. దప్ప మరొకటి యెచ్చటను మీకుం గానరాదు. తెలంగాణము ఇదియే అసలు తెలుంగు దేశమనియు జెప్పవచ్చును. తురకలు దీనికిచ్చిన తెలంగాన్‌ అను పేరు ‘తెలంగాణము అను మన మాటయే. ‘ఆఅణ” శబ్దము దేశపరము. మహారాష్ట్ర దేశమునకును కన్నడ దేశమునకు తగిలియున్న దేశమునకు తెలంగాణము అన్న పేరుండెను. ఇచ్చటి బ్రాహ్మణులే తెలంగాణ్యులు. ఇచ్చట  వ్యవసాయము చేయు కాపులే తెలంగాలు. మొదటిది తెలంగ రూపము, తెలుంగు
రూపము తరువాతది. ఈ తెలంగాణము మొదట నితర నాడుల వలె నొకనాడి. వెలనాడు, కమ్మనాడు, పాకనాడు వంటిదే యిది యొకటి. వెలనాటిలోని రెండవ రాజు యొక్క శాసనమునం దిట్లున్నది. ఆ సవి ముజు వాస్తవ్యో దేవార్యో దేవ సన్నిభః భారద్వాజాన్వయం కమ్మకులజః కులవర్థనః ఈ శాసనమింకను ప్రకటింపం బడలేదు. బహుశ శ్రీయుత జయంతి రా మయ్య పంతులు గారి యొద్ద నుండవచ్చును. ఇట్లు మిక్కిలి పురాతన కాలమునం దెలుంగు దేశము చిన్నచిన్న నాళ్లుగా విభాగింపం బడియుండెను. కొంతకాలము పోగా నా నాళ్లలో తెలంగాణమను దానికి బ్రముఖత సంభవించి యదియే దేశమంతటకును, అన్నినాళ్లకును తన నామమే యొసంగెను. అదియే యా నాళ్లలోని భాషకు గూడ నామమయ్యెను. ఇందు నాశ్చర్యమేమియు లేదు. పిఠాపుర గ్రామము జమీందారీకంతకును తన పేరిచ్చినది కాదా? మద్రాస్‌ పట్టణము
ప్రెసిడెన్సీ కంతకును పేరీయలేదా? ఇట్లు నైజాము రాజ్యమందలి తెలంగాణము  తెలుగుదేశ చరిత్రమునకు విత్తనము వంటిది. కావున నా భాగమును గుఱించి మనకెంత యధికముగం దెలిసిన యంత మేలు. అట్టి స్థితిలో మన మా దేశమును గుఱించి యేమియు నెఱుంగక యుండుట యెంత శోచనీయము?! పురాతన చరిత్రమునకే గాక, తరువాత కాలపు చరిత్రకుం గూడ నైజాము రాజ్యమందలి తెనుంగు దేశమును మన వారు శోధింపవలసి యుండును. కాకతీయుల సామ్రాజ్యమునకు ఓరుగల్లె రాజధాని గద. కాకతీయుల రాజధానికి నెంతో దూరమందున్న యుత్తర సర్కారులోనే కాకతీయుల శాసనములు ముఖ్యమైనవి పెక్కులు దొరకగా, వారి రాజధానియైన ఓరుగల్లు ప్రాంతమున బరిశోధించిన యెడల నెన్నియో శాసనములు, వేలు చరిత్ర సాధనములును దొరక గలవనుటకు సందేహము లేదు. 14, 15వ శత్టాము లందు విజయనగర  సామ్రాజ్యమెంత వైభవమనుభవించెనో, 12వ 13వ శతాబ్దములలో గాకతీయులును అంత అనుభవించిరి. కావున వారిని గుఱించి మనకెన్నియో విశేషములు తెలియవలసి యున్నది. అవి యోరుగంటి ప్రాంతమునం దప్ప మఱి యెచ్చటం దెలియంగలవు? కాకతీయులకు బూర్వము పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులును రాజ్యము చేసిరి. తెలుంగు దేశమందలి వారి యేలుబడిని గుఱించి మనకేమియుం దెలియదు. వీరు గాక రాచవారు, వెలమవారు, మఱి యితరులును చిన్న చిన్న రాజ్యములు నేలిరి. శాసనము లటుండ నిచ్చి వీరిని గుఱిచిన దంత కథలును, కైఫీయతులును పోగు చేసినను ఎంతయో నూతన విచిత్ర చరిత్ర తెలియంగలదు. ఇందుకొక చిన్నయుదాహరణ మొసంగెదను. సీతాపతియె చిత్తాపఖానుండు పెక్కు సంవత్సరముల క్రింద నేను ఓరుగంటికి వెళ్లి యుంటిని. అప్పుడచ్చటి కోటలో నొక శాసనము చూచితిని. ఆ రాతి మీది యక్షరములు స్పష్టముగ
లేనందునను, అప్పుడు శాసనాక్షరములం జదువ నభ్యాసమిప్పుడు న్నంత లేనందునను, శాసన మంతయు వ్రాసికొనలేకపోయితిని. కాని చిత్తాపఖానుడను  వాడొక శాసనమును వేయించెననియు, అది సంస్కుత శాసనమనియు, జీర్ణమైన కృష్ణదేవాలయమును ఉద్ధరించిన సమాచారమందున్నదియు మాత్రమె మొత్తము మీద గనుంగొంటిని. అప్పటి నుండియు. దురకయేమి? కృష్ణదేవాలయమును ఉద్ధరించుట యేమి? యన్న సంశయము మాత్రము నన్ను బాధించుచునే యుండెను. వీలయినప్పుడెల్లను, వీలయిన చోట్ల నెల్లను, వీలయిన వారినెల్లను చిత్తాపఖానుని గుఱించి విచారించుచునే యుంటిని. ఇంతలో నా శాసనము యొక్క ప్రతి యొకటి మెకంజీ సంగ్రహములో నాకు దొరకెను. అది
చాల తప్పులతో నున్నందున నైజాం ప్రభుత్వము వారికి వ్రాసి శాసనము యొక్క అచ్చులను తెప్పించితిని. చిత్తాపఖానుని కైఫేయతులును కొన్ని దొరకెను. ఇవన్నియు రాజ్యము లేర్పడు కాలమున నీతండును ఒక న్వతంత్ర రాజ్యమును స్థాపింపవలయునని యత్నించి ఓరుగంటిని కమ్మంమెట్టును మఱికొన్ని దుర్షములను తురుష్కుల యొద్ద నుండి లాగుకొని పెద్ద రాజ్యమును సంపాదించి, 16, 12 సంవత్సరముల వఱకు స్వతంత్ర ప్రభుత్వము చేసెను. తరువాత గోలకొండ నవాబైన కులీకుతుబ్‌షాహ ఈతని నోడంగొట్టి, యచ్చటి నుండి బారందోలెను.. పిమ్మట
నీతండుత్తర సర్కారులలో గజపతుల సామంతుండుగ నుండి, కృష్ణరాయలు కలింగము చరిత్రలో ‘సీతాపతి’ అని చెప్పంబడు వాండీతండే. నేను సిద్ధము చేసిన యీతని చరిత్రయు, శాసనమును హైద్రాబాద ఆర్కియాలాజికల్‌ సీరిసులో ద్వరలోనే ప్రకటింవబడును. గాన నిందు గుఱించి యధికము చెవృవీలు లేదు. తాత్పర్యమేమన జిన్న చిన్న సమాచారములను కూడా శ్రద్ధతోం పోగుచేసితిమే యవి చరిత్ర కాధారములు కాగలవు. వురాతన గ్రంథములను గుఱించియు మన మీహైద్రాబాద దేశము వెతకవలసియుండును. ఇచ్చట గొప్ప గొప్పు కవులు పుట్టిరి. పాలకురికి సోమన, పోతన, మడికి సింగన, హరిభట్టు, వెలిగందల నారయ మొదలైన కవిపుంగవు లిచ్చటి వారె. ఇంకను మనకు బాగుగం దెలియని కవులెందజో గలరు. ఇప్పటికిని మంచి కవులున్నారు. ఆంధ్ర భాషయందలి పురాతన రూపములు గూడం బెక్కు లిచ్చటం గానవచ్చును. కావున నాంధ్రుల చరిత్రమును గుఱించియు, నాంధ్రుల వాజ్ఞయమును గుఱించియు నిజమైన నూతన విషయములను శోధింపవలయుననిన, మన తరుణ పరిశోధక వీరులు హైద్రాబాదు రాజ్యము మీదికి దండు వెడలవలయును. ఎక్కున కాలము తిరుగుటకు వీలులేని వారు కొందరు
కలిసి వంతు లేర్పరచుకొని, సంవత్సరమునకు నొక్కొక నెల ప్రకారము ఒక్కొక జిల్లాకుం బోయి వచ్చి తాము చూచినదియు, వినినదియు వ్రాసి ప్రకటించుచుండిన నూతన విషయములు పెక్కులు వెలువడం గలవు. ఆ దేశమందును మనకుం దగిన సాయము చేయువారును, తెలియని సంగతులు చెప్పువారును, మన వెంటం దిరుగు వారును కలరు. ఈ నూతన మార్గమును మా మీత్రులు కొందరు త్రొక్కుదురు గాక.

పరిశోధకులకు విన్నపము

భాషా విషయికమైన పరిశోధనలు చేసి క్రొత్త గ్రంధములను సంపాదించు మహనీయులకుం గొన్ని విన్నపము లొనదింప వలసి యున్నది. ఆ విన్నపము లొక్కొక వ్యక్తికి సంబంధించినవి కావు. సర్వసామాన్యములు.  1. క్రొత్త పుస్తకములు దొరకిన తోడనే యది యపూర్వమైనదియని తోచిన  యెడల, నాకు నిట్టి గ్రంథ మిట్టి స్థలమున దొరకినది ఇప్పుడది యిట్టి స్థలమందున్నది దాని యపూర్వత యిట్టిది – యని కొద్ది లేఖ యొకటి
ప్రకటింపవలెను. ఈ గ్రంథమును తామే ప్రకటింపం దలంచిరేని శోధకులు గనుక నిట్టి హక్కు వారికిం గలదు. కాని యంతమాత్రమున నెవ్వరికిని చూపక దాచియుంచు నధికారముగాని, ఎప్పటికినీ బ్రకటింపక దాచియుంచు నధీకారము గాని ఎవ్వరికిని లేదని యెటుంగవలయును. తాము ప్రకటింపం దలంచిన యెడలం జూపు వారికి వారు ప్రకటింపం గూడదన్న షర్తు మీదనే చూపవచ్చును. ముఖ్యముగ నూతన గ్రంథము చిక్కినప్పుడు అది యెక్కడ జిక్కినది, ఇప్పుడెక్కడ నున్నది తెలుపక యుండుట భాషా ద్రోహమని నా తాత్బ్చర్యము. గ్రంథ మెచ్చట దొరకినది,
ఎచ్చటనున్నది తెలిసిన యెడల దాని ప్రాచీనతను గుజించి సంశయము గలవారును, పాఠాంతరములను గుటించి సంశయము గలవారును వెళ్లి మూల ప్రతిని యాధారము ల గ్రంధమునం దెచ్చట నున్నవి చెప్పవలెను. అట్లు హేతు ఆధారములను చూవనిది యెంత గొప్పవారు వచ్చి యేమి చెప్పినను లోకులు విశ్వసింపరు. మా మిత్రులొకరు కొన్ని దినముల క్రింద యర్థము గల వార్తం (బకటించిరి తమ శోధనలలో దేలిన దేమనగా ఐదవ శతాబ్దము బౌద్ధ త్రిపిటకములు తెలుంగు లోనికి భాషాంతరీకరింప బ డెను. కావున తెలుంగు వాజ్బయము గలదని అందఱును తెలిసికొనవలసినది. ఇది శంకరాచార్యుల వారి శ్రీముఖమో, దొరతనము వారి ఎగ్జిక్యూటివ్‌ ఉత్తరువో నాకుం దెలియలేదు. బౌద్ధ త్రిపిటకములు తెలుంగులో నుండెనని తనకెట్లు తెలిసెను? ఆ గ్రంధమైనను దొరకి యుండవలెను? లేదా దానిని గుఱించి మఱియొక డైనను చెప్పంబడి యుండవలెను. అట్టి యాధారములను చూపక మీరందఱు నా మాట నమ్మవలసినదని భగవంతుడు వచ్చి చెప్పినను ఈ దినములలో
నమ్ము వాండెవండు? ఈ మిత్రుడు కలిసినప్పుడెల్లను మీ యాధారము లెవ్వియని నేనడుగుచుంటిని. చివరకు విసుగెత్తి యాతండు ఒకసారి యెల్లయ్య గారే గ్రంథములోనో యున్నదని చెప్పగా విని తొందరపడి ప్రచురించితిని గాని చివర కా గ్రంధము చూడంగా నందీ విషయము లేదు అని ప్రత్యుత్తరమచ్చెను! అంధ్రార్ధ కథలు నేను మాత్రమా విషయ మింతతో విడిచి పెట్టక సిలోన్‌లోని శ్రీ అంగారిక ధర్మపాలుర వారితోను, మిసెస్‌ రైస్‌ దేవిస్‌తోను, కలకత్తాలోని యొక పాలీ పండితునితోను ఉత్తర (ప్రత్యురములు జరిపి, కొంతవజకు నీ విషయమును గనుం గొంటిని. మీలోని బుద్ధిమంతు లీ విషయము నింకను పరిశోధించెదరని మీతో చె ప్పుచున్నాడను. త్రిపిటకములు బౌద్ధులకు మన సంహితల వంటివి. వానిపైబౌద్ధకధ లను భాష్యగ్రంధములు పుట్టినవి. అవి మన (బాహ్మణములు వంటివి. నవారు ‘మంత్ర బాహ్న్మణ యోర్వేద నామధేయం అని సంహితలను
బ్రాహ్మణములను సమాన గౌరవముతో జూచినట్లు, బౌద్దులు త్రిపిటకముల వలెనే అర్ధ కథలను గూడ గౌరవముతోం జూచెదరు. అర్ధకథలలో నొక దానికి “ఆంధ్రార్ధ కధియని పేరు. ఐదవ శతాబ్దము వాండగు బుద్ధఘోషుండను బౌద్ధపండితుడు వేజు వేటు దేశములు తిరిగి, యచ్చటచ్చటి యర్ధ కథలను సంపాదించి, వాని నన్నిటి సారాంశముగ నాక గ్రంథమును పాలీలో వ్రాసెను. ఆతసికి కాంచీ పట్టణమునందు ఆంధ్రార్ధ కథ యొక్కప్రతి దొరకెను. ఈ అర్ధకధకు “అంధ్రార్ధ కథి యని పేరు వచ్చుటకు. గారణ మది యాంధ్ర భాషయందు రచింపంబడుటయో, లేక యది ఆంధ్ర దేశమునకు సంబంధించినదనియో మనము చెప్పజాలము. ఆ గ్రంథమిష్పుడు దొరకుట లేదు. కాని యది ఆంధ్ర భాషామయమని యూహించుట కొక చిన్ని హేతువు గలదు. బుద్ధ ఘోషుండు సింహళదేశమునందు సంపాదించిన అర్ధ కథ సింహళ భాషలో యుండెననియు, దానిని తాను పాళి
భాషలోనికి మార్చితిననియు బుద్ధఘోషుండే వ్రాసియున్నాండు. ఇదియుం గాక బుద్యదేవుండు *ఏ దేశము వారాదేశ భాషలోనే తన బోధనలను
చదువుకొనవలయూనని శాసించెను. కావున ఆంధ్రార్ధ్థకథ బహుశః ఆంధ్రమునందే యుండునని మన మనుకొనవచ్చును. నేను కనుంగొనిన విషయమింతియ. జిజ్ఞాస గల శోధకు లెవరైన మూలాంధ్రార్ధ కధను కనుంగొందురు గాక. అయ్యది జపాను, టిబెట్టు, చైనా దేశములలో దొరుకునేమోయని కొందతి యభిప్రాయము. పరిశోధకులకు జివర విన్నపమొకటి చేయవలసి యున్నది. పూర్వపు శోధకులకు లభ్యమైన సాధనములు తక్కువగ నున్నందున వారూహించిన కొన్ని విషయములలోం బొరపాటుండ వచ్చును. తరువాతం గ్రొత్త యాధారములు మనకు
దొరకినందున మనము వారి తప్పును కనిపెట్టవచ్చును. అంతమాత్రమున పూర్వ గ్రంధకర్తను గుఱించి కఠినముగ వ్రాయుట పితృ ద్రొహమని నా తాత్పర్యము. ఒక విషయమునందే పనిచేయు వారిలో గాలమందు బూర్వముండు వారు తరువాతి వారికి బిత్రుతుల్యులు. ఈ నియమమును పెక్కురు లేఖకులు మఱిచి, స్వయముగా తామేదో క్రొత్త విషయము తాము కనిపెట్టితి మనుకొనిన తోడనే విజ్ఞవీగి, అదియే సమయమని తలంచి పూర్వులను యట్లుండ, అభిప్రాయ భేదములను గురించి, పరుల నిందించుట యెంత తప్పు? తమ అభిప్రాయము తెల్పుటలో నెవ్వరును, పూర్వులెంత గొప్పవారైనను, వారికి గాని, సమకాలము వారికిం గాని భయపడనక్కర లేదు. కాని, నిందలు వేయు కెవ్వరికిని అధికారము లేదు. నింద ప్రారంభమైన తోడనే చిత్తము వికలమగునుు; బుద్ధి భ్రమించును, సారాసార వివేకము నిద్రించును, హేతువాదము సున్నయగును;
న్యాయము లోపించును; సత్యమడుగంటును; మానుషత్వము మాయమై క్రూరమృగత్వము సంప్రాప్తించును! పరిశోధకులకు సమస్య పరిశోధన సంబంధమయిన పని యొకటి ఈ సభ వారికిం గూడం గల్పించి యీ పరిశోధన పురాణమును పూర్తి జేయుచున్నాను. కలి విష్ణువర్దనుని నాంటి
తామ శాసనమొకటి కలదు. అది యిప్పుడు బ్రిటిషు మ్యూజియములో నున్నది. ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన పెక్కు శాసనములును, శిల్పాదికములును లండను పట్టణములోని బ్రిటిషు మ్యూజియములలో నున్నవని విని మీలోం బెక్కు మందికి నాశ్చర్యము కలుగవచ్చును. అందాశ్చర్యమేమియు లేదు. వాని యోగ్యత నింగ్లీషు వారు మనకంటె మొదటం గనుంగొనిరి. కావున వారు వానిని సంగ్రహించుటయుం దమ దేశమునకుం దీసికొనిపోవుటయు, సంభవించినది. మన కింకను వాని యోగ్యత చక్మగం దెలియలేదనియేం జెప్పవలను. తామ్ర శాసనములను, తాటియాకు గ్రంథములను తమ యొద్ద నుంచుకొని, తమకు వాని వలన ప్రయోజనము లేకపోయినను ఎవరికి జూపని వారు, ఈయని వారును మనలో బెక్కురు గలరు. ఒక కుటుంబము వారిక కొన్ని తామ శాసనములను గరగించి పెద్ద గంగాళము చేయించుకొనిరని యిది వజకే చెప్పితిని గదా! ఈ గంగాళములో నాంధ్రదేశ చరిత్ర మెంత మునిగిపోయినదో? అది యట్టుందె. ప్రస్తుత మనుసరింతము. కలి విష్ణువర్ధనుండు పదునెనిమిది మాసములు మాత్రము రాజ్యము చేసెను. “ తామ్ర శాసనమొకటి యీతనిది డాక్టర్‌ పీట్‌ అను నతండు “ఇండియన్‌ ఆంటిక్వేరో యను మాసపత్రిక 13వ సంపుటము నందుం బ్రకటించెను. ఇయ్యది కొంత సంస్కృత భాగమర్దమగుచున్నది. తెనుంగు భాగము మాత్ర మగోచరముగ నున్నది. కావున ప్లీట్‌ తెనుంగు భాగమున కద్ధమీయలేదు. నన్నయ్యకుం బూర్వమున్న తెలుంగు బాసను విజ్ఞాన సర్వస్వము యొక్క ఆంధ్ర సంపుటమునకై నేను అభ్యసించుటకుం బ్రయత్నించు చుండగా, నీ శాసనము నాకు 6గానవచ్చెను. అప్పటి నుండియు తెనుంగు భాగమున కర్ణము కనుంగొనవలయునని నేను పరిశ్రమ చేయుచున్నాను. రమారమి సగభాగము కర్ధము కనుగొంటబిన్ని మగివిన భాగమింకను సంశయాస్పదముగనే యున్నది. ఆంటీక్వేదీలో దీనికి ఛాయాపటము గూడ నీయంబడియున్నది. అందులోపము లున్నవేమోయని సంశయించి, లండను నుండి మూల శాసనముల క్రొత్త ఛాయాపటములు, అచ్చున తెప్పించితిని. కాని భేదమేమియు కానరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *