‘ఆశ్రు కావ్యము చంపక మాలిక

 

 

 

 

 

 

 

దావూద్

విరసము నీరసమ్ము నవివేకము నజ్ఞతఁ బారద్రోలుచున్
సరసవిదగ్గమార్గములఁ జాగెడు నవ్యకవీంద్రులార ! మీముందు
సరసత వాక్పటుత్వముఁ బ్రసన్నత నున్నతిఁ జాటుఁ డయ్య ! దు
స్తరము కవిత్వవాసన ప్రసాదముగా లభియించె మీకు దు
ర్భర మగు శాస్త్రముల్ చదివి పాండితు లం గడియించి తర్కభీ
కరులయి శబ్దశాస్త్ర గతకల్పనలం బఠియించి నంతనే
సరసక విత్వసుందరి ప్రసన్నత లభ్యము గాదు మానసాం
బరమున మచ్చ లేని ప్రతిభాప్రణయారత వృద్ధి సల్పి వి
స్తరనిజ సంస్కృతిం దఱచి తాపము సంది వియోగరాగముల్
విరహము యోగము – వలపు వెక్కసమున్ రుచి చూచి దానివె
ల్వఱచు విధానముం దెలుపు బాటను వాణిమనంబులోపలన్
నిరతము నిల్చి భావగత నిర్మలతం బరికించి కల్పనా
పరిసర దృశ్యణాలగురుభారము మానససీమ మోపుచున్
వరము లొసంగి నప్పుడె యభంగరసప్రద కావ్యసంపదల్
విరచన సల్పుచున్ రసికవీరులఁ దన్పుఁ గవీశ్వరుండు నే
ర్పరి యగువాని శబ్దమయరాజ్యము కూరుపు వోర్పు బోధనా
గురుత విశిష్టమై తరుణ గోష్టికి సృష్టి రహస్య పాఠముల్
తరుగని తీపితోఁ దెలిపి, తత్వము సత్వము వెల్లడించి యా
దరమును గౌరవంబు సతతంబును సంగ్రహణం బొనర్చు న
ప్పరమపవిత్రవ ప్రమునఁ బంటకు నష్టము గాని యట్లు ని
బ్బర మగు కల్పనల్ వలపుబాటల వ ర్తిలు సంస్మృతుల్ త్రపా
భరమృదునూత్నశబ్దమయభంగిమ, చారుమనోజ్ఞవాసనా
స్ఫురిత రసప్రవృత్తి సరసుల్ విరసుల్ విని సంతసించు న
తెఱఁగున బాసకున్ స్తుత గతిన్ ఘటియించి వికార రోగముల్
పొరయనియట్లు వ్యాకరణపున్ మునుముల్ చెడకుండఁ గాంచి త
త్పరమతిఁ దెల్గు పల్కులకు స్థానము గూర్పుఁడు కాపుకళ్ళపుం
దెఱఁగున గట్టి దేశ్యముల తీరగు నానుడులం గ్రంహిపుఁడీ
తఱకల జల్లుమాటలను దాలును బొల్లును నింపఁబోకుఁ డా
దరమున నన్య దేశ జపదంబుల వాడుఁడు ప్రాజ్ఞకోటి వ
హ్వరె, భళి, సాధు, సాధు, తరహా సలహాల హుషారు గూర్చు నీ
సరసుని కావ్యవీథిని- పసందగుమాటలు బేష్ సెబా సహో
తరుణతపస్వి నేటి సరదాలకుఁ జక్కనివాఁ డటంచు భూ
వరులును ధీపరుల్ పొగడ సరిలు మీరలు వ్యావహారిక
స్తరమున నున్న వానికిఁ బ్రచారము గూర్పు డు ఛందమందు ని
త్తెఱగున నున్నఁ గాదె మన తెలుక విత్వపుఁ దీరుతెన్ను ల
బ్బురమును గూర్చు పాఠకుల ముచ్చట దీర్చును దివ్యగానమా
ధురుల వెలార్చు రాగరసతోయధికిం బసఁగూర్చు కల్పనా
ధర మగు లోకమందు కవి భావవిహార మొనర్చి యాత్మదు
ర్పర కరుణారసంబును బరంపరఁగాఁ బ్రవహింపఁ జేసి ము
మ్మర మగు శోకవార్ణిధి నమాంతము ముంచుచు విప్రలంభబం
ధురరసతాపమందు పరిధుల్ విపరీతముగా నమర్చి సుం
దర పదపద్మముల్ తలఁపుఁ దల్పములం జతకూర్చి గానవ
ల్లరులను బెంచి నూత్నకళలం జెలు వారు చిగుళ్ల నించి పూ
సరముల భావముల్ తెనుఁగుసారసముల్ వలపు గులాబులన్
గర మనుర క్తితోఁ బ్రణయగంథముతో సవిలాసభూతితో
విరచన సల్పి కావ్యముల వెల్లువఁ బెట్టి రసజ్ఞ శేఖరుల్
పరువులు వారఁ గూర్పుఁడు ప్రభావముఁ జాటుఁడు గాని వక్రపుం
దెరువునఁ బోయి గ్రామ్యముల తేరును గేరుచు నవ్వులాటకుం
దరి యగు బాసతో నెఱుకదానివిధంబున సింగిమాడ్కి క
క్కురితికి విఱ్ఱవీగుటకుఁ గూలికి గాలిపదంబు లల్లి య
బ్బురమగు మీయశమ్మ వృథపుచ్చకుఁ డిప్పు డసాధ్య మేది భా
స్కర కిరణంబు సోకని ప్రకాశ విహీనత లంబు లోపలం
జొరబడి తద్రహస్యముల సూటిగఁ బల్కఁగలారు మీరు మీ
సరి మఱి యేరు లేరు పరజా పడి నిద్దుర నున్న జాతి స
త్వరముగ మేలుకొల్పుడి య దారత ధీరతఁ దెల్పి త్యాగబం
ధుర మగు జీవితంబుల గతుల్ దలపించి వివేక వీథికిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *