బమ్మెర పోతరాజు

శ్రీ రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు

శ్రీమద్భాగవతము నాంద్రీక రించిన బమ్మెరపోతరాజు ఒంటిమిట్ట వాడని కొందఱును, ఓఱుగంటి వాఁడని కొందఱును కొంత కాలమునుండి పరస్పర విజ యారు లై పట్టుదలతో పోరాడుచున్నారు. నే నాంధ్రకవుల చరిత్రమును వ్రాసి నప్పుడు తెలుఁగు భాగవతమును ముద్రించినవారు తమ పీఠికలో వ్రాసిన దానిని నమ్మి పోతన యొంటి మెట్టవాఁ డనియే చెప్పితిని గాని యిటీవల బై లువెడలిన వాదానువాదములను బట్టి నా తొంటి యభిప్రాయమును మార్చుకొని యోరుగంటి వాఁడని నే నీ నడుమ సంస్కరించి ప్రకటించిన కూర్పులోఁ బ్రచురించినవాఁడ నై తిని. అట్లు చేసినందులకయి బ్రహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావుగారు నన్ను బహువిధముల దూషించి పరిషత్ప తికలో నొక వ్యాసమును వ్రాసి ప్రకటించిరి. దూషణము లెప్పుడును వాదదౌర్బల్యమునకు .. సూచన లగుట విచారించి వారి దూషణ వచనముల నాశీర్వచనములుగా స్వీకరించి సత్యగ్రహణపరాయణు లగువారి యుప యోగార్థముగా నా పూర్వాభిప్రాయమును మార్చుకొనుటకుఁ గల యాధారములను సంక్షేపించి వ్రాయుచున్నాను. సత్యగ్రహణ సమాదరణచిత్తు లు దీనినిగూడ చిత్త గించి, తమకు తోఁచిన సిద్ధాంతమును చేసికొందురుగాక !
పోతనార్యుని భాగవతములో నొంటిమిట్ట యనిగాని, యోరుగల్లని కాని లేదు ; దానిలో “ఒక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకం గని సజనాను మతంబున నభ్రంకష శుభ్రసముతు ంగ భంగ యగు గంగకుం జని క్రుంకులిడి వెడలి…. మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి” అని యేక శిలానగర మని మాత్రము చెప్పఁబడినది. దీనినిబట్టి యిందుఁ బేర్కొనఁబడిన యేకశిలానగర మేదియని నిర్ణయింపవలసియున్నది. శిలా తామ్ర శాసనములయందును, పూర్వ గ్రంథములయందును ఓరుగంటి కే యేక శిలానగర నామము వ్యవహరింపఁ బడి యుండుట నిర్వివాదాంశము. ఏకశిలానగర నామ మొంటిమిట్ట కే శాసనము నందును ‘ గ్రంథమునందును వాడ(బడ లేదు. నూలు సంవత్సరముల క్రిందట మెకాంజీగారు గ్రామస్తుల వలన కయిఫీయతులు మొదలైన వానిని సంగ్రహించి
నున్న గంగా భాగీరథి గాక గౌతమియే యగును. ఈ గంగకు కొన్ని దినముల ప్రయాణములో నున్న దగుటచే నేకశిలానగర నామ మోరుగల్లునకే చెల్లును గాని యొంటి మెట్టకుఁ గాని తన్నామమును ధరించిన యే యితర పురమునకుఁ గాని చెల్లదు. ఒంటిమెట్టకు సమీపమునఁ గొన్ని దినములలోఁ జేర (దగిన నది యేదియు లేదు. వ్యవహారములో లేకపోయినను నేదో స్థలమాహాత్మ్య ములో గంగ యనఁ బడిన పినాకినీ నది యొంటి మెట్టకు సమీపములో నున్నను, ఆ పెన్న యొంటిమెట్లకు భాగవతములోఁ జెప్పఁబడినట్టు కొన్ని దినముల ప్రయాణములో లేక కొన్ని గంటల ప్రయాణములోనే యున్నందున నందుఁ బేర్కొన(బడిన గంగ పెన్న గా దనుట నిశ్చయము. సామాన్యముగా జలసామాన్యమును గంగయని జనులు వ్యవహరిం తురు గాన నందుదాహరింపఁ బడిన గంగ కొన్ని దినముల ప్రయాణములో నున్న యే చెఱువు నీరో యే యేటి నీరో యను విద్వాంసులకు సమాధానము చెప్పుట నా వంటి మితజ్ఞునకు సాధ్యము కాదు. కొన్ని దినము లనఁగా నెన్ని మాసము లైనను కావచ్చు నను పండితులను సమాధానపఱచుటయు నసాధ్యమే. పినాకిని యన్న పేరు రెండు నదుల కున్నప్పుడు త్తర పినాకిని దక్షిణపినాకిని యని పిలుచుచున్నట్లుగానే గంగ యను పేరు రెండు నదులకు సామాన్యమయి యుండుటచేత ను తరమున నున్న భాగీరథి నుత్తరగంగ యనియు దక్షిణమున నున్న గోదావరిని దక్షిణగంగ యనియు పిలుచుట వాడుకయై యున్నది. అయినను, గోదావరి దక్షిణ శబ్ద ప్రయో గము లేక కేవల గంగ యని పిలుచుటయు వాడుకలోఁ గలదు. పోతనతోడి సమ కాలికుఁ డైన శ్రీనాథ మహాకవి రాజమహేంద్రవరమును వర్ణించుచు,

 

“ప్రవహించు నే వీటి పశ్చిమ ప్రాకార
మొరసి గంగమ్మ సాగరము కొమ్మ”

 

అను సీసపాదమున గోదావరిని గంగ యని చెప్పియున్నాఁడు. గోదావరీ నామముతో గౌతమిని సాధారణముగా వ్యవహరించు రాజమ హేంద్రవరములో నున్న శ్రీనాథుఁడే దక్షిణశబ్ద విరహితనుగా వాడినప్పుడు, గంగ యనెడి యేక నామముతోనే వ్యవహరించు దేశమునం దుండిన పోతనామాత్యుఁడు దక్షిణగంగ కనక “యభ్రంకష శుభ్ర సముతు ంగ భంగ యగు గంగ” కని ప్రయోగించుటలో వింత యేమున్నది ? దక్షిణ పదానుపూర్వకముగా ప్రయోగించినను ప్రయోగింప వచ్చును ; దక్షిణపదమును విడిచి ప్రయోగించినను ప్రయోగింపవచ్చును. “దక్షిణ గంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు”నని నన్నయ భట్టారకుఁడు దక్షిణ శబ్ద పూర్వకముగా ప్రయోగించెను. భాగవత భాగములను రచించిన బమ్మెర పోతన్న యొక్కయు, వెలిగందల నారాయణకవి యొక్కయు, ఏర్చూరి సింగన యొక్కయు గృహనామములు గల యూ ళ్ళోరుగంటికి సమీపములో సుండుటచేత భాగవలో దాహృత మయిన యేక శిలానగర మెరుగయే యని సిద్ధాంత మగుచున్నది. ఓరుగల్లు కాదని యొంటి మిట్టనే సిద్ధాంతము చేయు తలఁపుతో ఈ నామములకు ప్రతిగా ఏర్చూరున కేల్చూరును వెలిగందలకు వెలిగండయు మేనమామ పోలిక గల రెండు గ్రామముల నొంటిమిట్టకు చేరువ నుండు వాని వొంటిమిట్ట వారు కష్టపడి కని పెట్ట గలిగిరి గాని ప్రధాన గ్రామ మైన బమ్మెరతోడి సమానాక్షర సంబంధము గల గ్రామ కల్పమును దేనిని తత్సమిపమునఁ గని పెట్ట: జాలక బొమ్మవరమును బమ్మెర యందు మనిరి. బొమ్మెర బమ్మెర కాదని వాదించెడి యీ ఘనులకు తక్కిన యక్ష రముల మాట యటుంచినను బొమ్మెరలో మొదట నున్న బొకారముతో నారంభ మయ్యెడు బొమ్మవరము నెట్లు చెప్ప సాహసము గలిగెనో ! ఈ పే రొంటిమెట్ట వాదులకే సరిపడక దానిని గప్పిపుచ్చుటకయి బమ్మెర యూరిపేరే కాదనియు పోతన పూర్వు లూరూరు తిరుగువా రగుటచే భ్రమణ శబ్దభవమైన బమ్మెర వారియింటి పే రయ్యెననియు అపూర్వపాండిత్య ప్రభావు లయిన యొంటిమెట్ట వాదులు తమ పాండిత్య విశేషముచేత విశేషార్థ కల్పనము చేసిరి. బమ్మెర గ్రామ మగునో కాదో పూర్వకవి యైన పట్టమట్ట సరస్వతీ సోమయాజి కృతమయిన పృథు చరిత్రములోని యీ క్రింది పద్యమును జదివి వారు గ్రహింతురుగాక !

 

చ. పరుల కసాధ్య మై పర(గు భాగవతంబు రహస్య మంతయుః
హరి కృపచే నెఱింగి మృదులాంధ్ర వచోరచనాచమర్రియా
కరణ మహాప్రబంధమునుగా రచియించిన బాను తేజు బ
మ్మెరపుర పోతరాజు నసమీకృత భోజు నుతింతు నెంతయున్ .

 

గ్రామనామము బొమ్మెర యని వాడుకలో నుండుటచే నది బమ్మెర కాదని వాదించుచున్నారు గదా ; ఓరుగంటి వైపువారు బమ్మెర పోతరాజు నిప్పటికిని బొమ్మెర పోతరాజనియే చెప్పుచున్నారు. తొంబది సంవత్సరముల క్రిందట ననఁగా 1829వ సంవత్సరమునం డింగ్లీషున దక్షిణ హిందూస్థాన కవుల చరిత్రమును ప్రకటించిన కావలి వేంకట రామస్వామిగారు పోతరాజు గృహనామము బొమ్మెర వారని వ్రాసియుండుట మీరు చూచియుండ లేదా ? ఇంతకును నా రేకశిలానగర మనెడిది వంటిమిట్టా ? ఒంటిమిట్టా ? “వంటిమిట్టలోను” వసతిగాను అని

 

స్థలయున్న నై నను మా కెల సూహలోన
వింతపండువుఁ బోలెను వీరభద్ర
విజయ మెలను వినఁ గడు వేడ్క యయ్యె నది
తెలుంగున రచియింపు మభిమతముగ.ఆ. పిన్న వాఁడ ననియుఁ బెక్కు సత్కృతులను
విననివాఁడ ననియు వెఱపు మాను
మత్ర్పసాదదివ్య మహిమచే నెంతై న
గవిత చెప్ప లావు గలుగు నీకు.

 

పోతన కులగురు వై న సోమనారాధ్యుని యింటి పేరు ఇవ్వటూరివారు. ఇది గ్రామనామ మగుటకు సందేహము లేదు. ఇవ్వటూ రోరుగల్లు పట్టణమునకు ముప్పది మైళ్ళ దూరములో నున్నది. అందుచేత

 

“అనఘుఁ డివ్వటూరి యారాధ్యచంద్రుండు

సోమనాథసముఁడు సోమవిభుఁడు”

 

అని కవి వర్ణించిన సోమనారాధ్య గురుఁడును ఆ గురువుచే వీరభద్ర విజయ విరచనమునకు నియమింపఁబడిన తచ్చిష్యుఁ డగు పోతనయును ఓరుగల్లు ప్రాంతము వారని యేర్పడును గాన భాగవతము నందుఁ జెప్పఁబడిన యేకశిలానగర మోరుగల్లే యని నిశ్చయ మగుచున్నది. ముద్రిత మై యున్న వీరభద్ర విజయములో

 

ఉ. భాగవత ప్రబంధ మతిభాసురతణ రచియించి దక్షదు
ర్యాగకథా ప్రసంగమున నల్పవచస్కుఁడ నై తిఁ దన్ని మి
తాగత వక్తృదోష పరిహారము కై యజనై క శైవశా
స్వాగమ వీరభద్ర విజయంబు రచించెద వేడ్క నామడిన్ .

 

అని యుండిన పద్యమును జటవి భ్రమపడి నేను భాగవత రచనానంతరమున వీరభద్ర విజయము వ్రాయఁబడె నని చెప్పియుంటిని. ఇప్పుడు గురుప్రాయులై వావిలకొలను సుబ్బారావు గారీ పద్యము వ్రాతప్రతులలో లేదని చెప్పి, నా కన్ను తెలిపి చూపినందునను ఇప్పుడు నే నిందు నిమి త్తమై చదివిన వ్రాత పుస్తకము లలో నొక్కదానియందుఁ దప్ప నీ పద్యము కానఁబడ నందునను కవి పిన్న వాఁడని చెప్పిన పద్యమున కది ప్రత్యక్ష విరోధముగా నున్నందునను ఈ పద్యము ప్రక్షిప్తమని నిశ్చయించి నా ప్రమాదమును కృతజ్ఞతాపూర్వకముగా సవరించుకొనుచున్నాను, శైవుఁడు వైష్ణవపురాణము రచించెనన్న శై పసంఘమున కెల్ల నవమానకరముగా నుండు నని యెంచి భాగవతంచనా పాపపరిహారారముగాఁ దరువాత వీరభద్ర విజయము రచించినట్లు స్వజనులలో నమ్మకము కలిగించుటకై వీరశైవుఁ చెవ్వఁడో యొక (డీ పద్యమును గూర్చి పుస్తకమునఁ జేర్చి యుండును. ఈ పద్యము ప్రక్షీ ప మని యిప్పుడు స్పష్ట సందున కడపట రచియింపఁబడిన భాగవతములో కంటే మొదట రచియింపఁ బడిన వీర భద్ర విజయములో నెక్కువ లక్షణ దోషము లుండుటకు కారణము సహితము కరతలామలక మైనది. వీరభద్ర విజయము పోతన కృతము కాదనియు నెవ్వఁడో వేడొకఁడు పోతన పేరు పెట్టి దానిని రచించె ననియు మొట్టమొదట కొంత కాలము క్రిందట నొక వాదము బై లు వెడలినది; ఆ వాదము నిలువదని తేటపడిన తరువాత నిప్పు డది పోతన కృతమే యనియు వీరభద్ర విజయము రచించిన పోతన భాగవతమును జేసిన పోతన గాక వేఱుపోతన యనియు ఇద్దలు పోతన్న లున్నట్లు బుద్ధిమంతు లగుటచే నింకొక వింత వాదమును బై లుదేఱఁ దీసిరి. పోతన్న కానివాఁడు కష్టపడి పుస్తకము చేసి తన పేరు మాసి పోవునట్లుగా నన్యుఁడైన పోతన్న పేరు పెట్టుట కుద్దేశ మేమి యుండును. పుస్త కమునకు ప్రసిద్ది రావలె నన్న యుద్దేశముతో నట్లు చేసి ననెడు పక్షమున, పూర్వ లాక్షణికులు నిర్దుష్ట కవిత్వము కాదని నిరాకరించిన పోతన్నకు కర్తృత్వ మారోపిం చుటకంటె సర్వలాక్షణికులును పరమ ప్రామాణిక కవిత్వ మని శిరసావహించెడు తిక్కనాదులలో నొక్కరికి తన పుస్తక కర్తృత్వము నారోపించి యుండఁడా ? పుస్తకములో కర్త పేరు ప్రత్యక్షముగా కనఁబడు చున్నప్పుడు దానిని నిరాకరించి ‘యన్య కర్తృత్వము నారోపించుటకు నిరా క్షేపములును, నిర్దుష్టము లును నైన యమోఘ నిదర్శనము లుండ నక్కఱలేదా ? వీరభద్ర విజయమును రచించిన పోతన్న వేఱు, భాగవతమును రచించిన పోతన్న వేఱు, అని చెప్పుట కై న నేమి హేతువు లున్నవి ? వీర భద్రవిజయములో గద్య – “ఇది శ్రీమన్మహా మ హేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్య పుత్ర పోతయ నామధేయ ప్రణీతం బైన” అనియు, భాగవతముతో గద్య – “ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతం బై న” అనియు వేఱువేఱుగా నుండుట యని చెప్పుదురేమో ! ఒక్క కవి చేసిన గ్రంథము లన్నిటిలో గద్య లేక రీతినే యుండ వలెనా ? ఒక పుస్తకములో నొక విధముగాను ఇంకొక పుస్తకములో నింకొక విధముగాను ఉండ(గూడదా ? మీ యొంటిమెట కవియైన యయ్యలరాజు రామ భద్రు(డే తన ప్రథమకావ్య మైన సకల కథాసారసంగ్రహములో గద్య — “ఇది
శ్రీరామభద్ర భద్రప్రసాద లబ కవిత్వ మహత్వ విశారద శారద సత్కవిమిత్రోవ స్తంబసూత్ర పాత్ర కాశ్యపసగోత్ర పవిత్ర రామభద్ర భీముద్రాభద్ర రామభద్ర ప్రణీతంబైన” – అనియు, ద్వితీయ కావ్యమైన రామాభ్యుదయములో గద్య – “ఇది శ్రీమదొంటిమెట్ట రఘువీరశతక నిర్మాణ కర్మఠ జగదేక ఖ్యాతిధు ర్యాయ్యల రాజు తిప్పయ మనీషి పర్వతాభిధాన పౌత్రాక్కయార్య పుత్ర బరిశీలిత సమిడ్డ రామాసుజమత సిద్ధాంత మర్మ ముమ్మడి వరదాచార్య కటాక్ష వీష్ పాత్ర హృదయ పద్మాధిష్ఠిత శ్రీరామభద్ర రామభద్ర కవి ప్రణీతం బైన” – అనియు వేఱువేలు విధములుగా వేయలేదా ? భాగవతములో కంటె వీరభద్ర విజయములో తప్పు లెక్కువ యున్న వనెడు పక్షమున, రామాభ్యుదయములో కంటె సకలకథాసార సంగ్రహములో తప్పు లెక్కువలేవా ? ఆటి తేటిన మీఁదట చెప్పెడు కవిత్వములో కంటె ప్రారంభదశలో చెప్పివ బాలకవిత్వములో దోషము లధికముగా నుండుట స్వాభావికము కాదా ? ఉభయ కావ్యములలోను గల వంశావళిలో గ్రంథకర్తలు
భిన్ను లని స్థాపించుటకుఁ గావలసినంత యున్నట్టు మన మిత్రులు తమ సూక్ష్మ బుద్దిచేఁ గని పెట్టిన భేదము స్థూలబుద్ది నైన నాకుఁ దెలియరాకున్నది. ఈ క్రింద నుదాహరింపఁ బడెడు రెండు పుస్త కములలోని వంశావళులను పరిశీలించి బుద్ధి మంతులు తాము తెలిసికొందురు గాక ! భాగవతములోనిది యిది –

 

సీ. “కౌండిన్య గోత్ర సంకలితుఁ డాపస్తంబ
సూత్రుండు పుణ్యుండు సుభగుఁ డై న
భీమనమంత్రికిఁ బ్రియపుత్రుఁ డన్నయ
కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాపు వరమునఁ గనియె సోమన మంత్రి
వల్లభ మల్లమ వారి తనయుఁ
డెల్లన యతనికి నిల్లలు మాచమ
వారి పుత్రుఁడు వంశ వర్గ నుండు
లలితమూరి బహుకళానిధి కేసన
దానమాసనీతి ధనుఁడు ఘనుఁడు
తనకు లక్కమాంబ ధర్మ గేహిని గాఁగ

మనియె శైవశాస్త్రమతముఁ గనియె.

 

క. అమానినికిం బుట్టితి
మే మిరువుర మగ్ర జాతుఁ డీశ్వర సేవా
కాముఁడు తిప్పన పోతన
నామవ్యక్తుండు సాధునయ యుకుడన్.”

 

పై దానినిబట్టి భీమనకొడుకు అన్నయ, అన్నయ కొడుకు సోమన, సోమన్న కొడుకు ఎలన, ఎల్లన్న కొడుకు కేసన, కేసన్న కొడుకు లగ్రజుఁడు తిప్పన్న, తదనుజుఁడు పోతన్న అని విదిత మగుచున్నది.
వీరభద్ర విజయములోని వంశావళి యిది

 

ఉ. మల్లయ భీమనాహ్వయ కుమారకుఁ డన్నయమంత్రికి దయా
వెల్లికి గౌరమాంబ కర వింద దళేక్షణుఁ డై జనించి వ
రిల్ల వెలుంగు సజ్జన విధేయుఁడు సోమన నామధేయుఁ డా
మల్లమయందుఁ గాంచె సుకుమారుల ధీరుల సత్కుమారులన్.

 

ఉ. నీతి యుగంధరుం డనఁగ నిర్మలుఁ డై ఘననాగరీకుఁ డై
యాతతమైన రేచనయు నన్నయమంత్రియు సర్వశైవలో
కాతులహారుఁ డెల్లనయు నయ్యల పెగ్గడయుఁ దయాగుణ
వ్రాత విభూషణుండు జనవంద్యుఁడు మాచయ నాఁగ నున్నతిన్ .

 

క. అందుల మధ్యము డెల్లన
మందర ధీరుండు నీతిమంతుఁడు
వనితా కందర్పుఁడు మాచాంబిక
నందంబుగఁ బెండ్లియాడె నభినవ కీర్తిన్.

 

ఉ. మానిని మాచమాంబకుఁ కుమార కుఁ డెల్లనకుం బ్రసిద్ధిగా
మానుగ నుద్భవించిరి కుమారులు కేసనయున్ గుడావళిన్
మానితుఁ డైన మాధవుఁడు మాన్యుఁడు నిమ్మడినాఁగ మువ్వురున్
భూనుతమైన తేజమునఁ బోలిరి ధర్మజభీమ పార్థులన్ .

 

ఉ. అట్టి ఘనుండు మంచికి దయాగుణ ధీమణి మాచమాంబకున్
బుట్టిన లక్ష్మియో యనఁగఁ బొల్పగు గోపన కూర్మి చెల్లెలిన్
నెటనఁ బెండ్లియాడె మహనీయుఁడు కేసనమంత్రి శ్రీసలిన్
దట్టపు వేడ్క, గేశవుఁడు దాను వరించిన భంగిఁ బొంగుచున్ .

 

క. ఆ దంపతులకు సంతత
మోదిత చిత్తు లకు మిథునముఖ్యులకు
దయా పాదిత గుణులకు శంకర
పాదయుగాంభోజ భక్తి పారీణులకున్ .

 

శా. సారాచారుఁడు వైభవోన్నత గతిః సంపూర్ణచంద్రుండు భూ
భారాహీంద్ర సమాన దక్షుఁడు సదా భర్మాకరుం డర్దిమం
దారుం డంచిత రూపరేఖలను గందర్పుండు భూయోయళ
శ్రీరమ్యుం డగు తిప్పనార్యుఁడు జనించెన్ వంశవర్దిష్ణు డై ,

 

వ. తదనుజుండ నయి యేను జన్మించి పోతన నామధేయుండ నై పరగి …. దీనిని బట్టియు మల్లయ పుత్తు డైన భీమన కొడుకు అన్నయ్య, అన్నయ కొడుకు సోమన, సోమన, కొడుకు ఎల్లన, ఎల్లన కొడుకు కేసన, కేసన కొడుకు లగ్రజుఁడు తిప్పన్న తదనుజుఁడు పోతన్న, అయియే యున్నారు. ఇందుఁగల భేద మంతయు భీమన తండ్రి మల్లయ యనియు, ఎల్లన యన్నలు రేచనాన్నయ లనియు తమ్ము లయ్యల మాచయ లనియు, కేసన తమ్ములు మాధవేమ్మడు లనియు, లక్ష్మమ్మ (లక్కమాంబ) తండ్రి మంచయ్య తల్లి మాచమాంబ యన్న గోపన్న యనియు, భాగవతములోఁ జెప్పఁబడని విశేషము లిచ్చుట యయియున్నది. పోతన్న యొక గ్రంథములోఁ జెప్పని తన తండ్రియొక్క తమ్ముల పేరులను పితృవ్యుల పేరు లను తల్లి యొక్క జననీజనకాగ్రజుల పేరులను రెండవ గ్రంథములోఁ జెప్పిన మాత్రముననే యొక పోతన్న చెడి యిద్దఱు పోతన్నలు గానగునా ? పోతన్న యన్నయు తల్లిదండ్రులును పితామహప్రపితామహాదులును రెండు గ్రంథముల లోను జెప్పఁబడిన వా రించుకయు భేదము లేక యింటి పేరులతోను, పేరులతోను, భార్యలతోను, సరిగా సరిపోవుచుండఁగా వారు వేఱువే అనుట కేమి యాధార మున్నది ? ఒడయనంబి విలాసమును బట్టియు దాక్షాయణీ వివాహమును బట్టియు పోతన పుత్రపౌత్ర ప్రపౌత్రులు గోదావరీ ప్రాంతమునందే యుండి గోదావరీ ప్రాంత వాసులతో నే సంబంధ బాంధవ్యములు చేయుచున్నట్టు స్పష్టపడుచుండుటచే పోతన యొంటి మెట్టవాఁడు కాఁ డనియు గోదావరీ నదీ సమీపమునం దున్న యోరుగంటి వాసియే యనియు సిద్ధాంత మగుచున్నది. ఈ విషయము నింతట విడిచి పెట్టి పోతన యొంటి మెట్టవాఁ డని చెప్పుటకయి యొంటి మెట్టవాదులు చూ పెడు గ్రంథ ప్రమాణములను గూర్చి యించుక విచారింతము. నీ గాధారము చేసికొన్న మొదటి ప్రమాణము సుమారు డెబ్బది సంవత్సరముల క్రిందట ననఁగా క్రీ. శ. 184 8న సంవత్సరమున నాంధ్రభాగవతము నవ్చొ తించినప్పుడు పురాణము హయగ్రీవ శాస్త్రులుగారు తమకు లభించిన బమ్మెర పోతనామాత్యుని జన్మకర్మ ప్రభావాదులను గూర్చి తెలి పెడు వచన గ్రంథమును బట్టి వ్రాసితి మని యతఁడు బాల్యములో నేకశిలానగర పరిసర వనములో పశువు లను మేపుచుండఁగా చిదానందయోగి యతనికి దర్శన మిచ్చి రామమంత్రోపదేశము చేయుట మొదలైన కథలు చెప్పుచు వ్రాసిన దాని పీఠిక. వారు తమ పీఠికయం దేకశిలానగర మని వ్రాయుటయే కాని యొంటిమెట్ట యని యెక్కడను వ్రాయక పోవుట చేత వారికి దొరకిన పూర్వ గ్రంథమునం దొంటిమెట్ట యను పేరు లేకపోవుట నిశ్చ యము. అయినను, వారు తమ పీఠికలో . నేకశిలానగర మను పదము ప్రక్క పువ్వు వేసి యా పుటముయొక్క యడుగు భాగమునందు “ఈ గ్రామమునకు ప్రతి నామము ఒంటిమిట్ట. ఇది కడపకు దక్షిణమున చెన్నపట్టణమునకుఁ బోవు బాటలో మొదటి మజిలీస్థలముగా నుంటున్నది” అని వివరణము చేయుటచే నది మూల గ్రంథమును జేసిన వారి యభిప్రాయము గాక కేవల శాస్త్రులవారి యభిప్రాయమే యగును. అందుచేత నొంటిమిట్ట నేకశిలానగర మని చెప్పుట కాయనయే ప్రథ ముఁడు. ఆయన యోరుగంటికంటె సొంటిమిట్టకు మిక్కిలి చేరువ నున్నవాఁ డగుటచేతను, ఓరుగల్లు ప్రాంతములకుఁ బోయి పోతన విషయమున నక్కడి వా కేమి చెప్పుదురో విననవకాశము లేనివాఁ డగుటచేతను, ఒంటిమెట్టవా రెవ్వరో తమయూరను పోతన పొలము మొదలయిన వున్న వని చెప్ప విని విశ్వసించినవాఁ డగుట చేతను, అట్ల భిప్రాయపడి యుండును. కేవల జన శ్రుతులు నమ్మి వ్రాసిన వ్రాత లెప్పుడును ప్రమాణములు కాజాలవు. శాసనముల వలనను చరిత్రముల వలనను రాజరాజ నరేంద్రునకు సారంగధరుఁడను కొడు కున్న టే కానఁబడకపోయి నను రాజమహేంద్రవరపువారు నిజముగా సారంగధరుఁ డుండినట్టును, సారంగ ధరుని మెట్ట యనఁబడెడి యా పట్టణములోని యొక చిన్న కొండ మీఁద నాతని కాలుచేతులు నటిక(బడి నట్టును, ఆమెట్ట క్రింద నున్న చెఱువులోనే మత్స్యనాథుఁ డను సిద్ధుఁడు సారంగధరుని తెగినకరచరణములు కడిగి స్వస్థునిఁ జేసినట్టును చెప్పి యాయా సలములను జూపుదురు. కథ తమ దేశమునందే నడచెనని చెప్పి
యోరుగల్లు ప్రాంతముల వారు స్థలనిదర్శనములు చూ పెదరట! ఈ కథ మాళవ. దేశములో నడచినట్టు గౌర వకృత నవనాథ చరిత్రము వలనను వేంకటపతి సారంగ ధర చరిత్రము వలనను దెలియ వచ్చుచున్నది. ఇది పాంచాల దేశములో నడచిన దయినట్టు కొన్ని సంవత్సరముల క్రిందట గోదావరీ మండలమునకు వైద్యాధి. కారిగా వచ్చిన యొక పంజాబు దేశ సుఁడు చెప్పెను. ఇట్టి కథలన్నియు నిజమని, నమ్మవచ్చునా ? గోదావరీ మండలములోని కోనసీమవా రర్జునుఁడు మత్స్యయంత్ర మును తెగ నేసి ద్రౌపదిని గ్రహించిన స్థలము తమ కోనసీమలోనే యున్నదని. చూపుచున్నారు. ఇట్టి జనప్రవాదములకును నిదర్శనములకును మేర యుండదు.. మెకన్లీ దొర వారు నూఱుసంవత్సరముల క్రిందట గ్రామస్థులచే వ్రాయించిన యొంటి మెట్ట కై ఫీయతులలోను, పూర్వమునందున్న శిలాశాసనములలోను, తద్దామ. వాసులైన కవులు చేసిన గ్రంథములలోను ఒంటిమెట్ట కేకశిలానగర నామము లేక పోవుటచేత భాగవతపీఠిక నాటినుండియే వచ్చిన దనియు అంతకు పూర్వము. దాని కా పేరు లేదనియు భావింపవలసి యున్నది. నిరాధార మయిన జనప్రతీతిని: బట్టి వ్రాయఁబడిన దగుటచేత హయగ్రీవ శా స్తు లవారి యభిప్రాయము ప్రమాణము. కాదు.

ఒంటిమెట్ట కై ఫీయతులలో ఒంటిమెట్ట యను పే రాగ్రామమునకు ఒంటఁడు. మిట్టఁడు నను బోయల పేర కట్టఁబడుటచే వచ్చిన దని స్పష్టముగా వ్రాయఁబడి. యున్నది.ఒంటిమెట్టవారి రెండవ గ్రంథ నిదర్శనము దొరతనమువారి పరిపాలన వివ రణ సంగ్రహము (Administration Report) ఈ గ్రంథము యొక్క మూఁడవ సంపుటము 991వ పుటలో నిట్లున్నది

 

:– “Vontimittah (వొంటిమిట్టVontimitta, *Tel.) From (onti, tel. single + mitta, tel. mound). ror] Sanskrit name (ekasilanagara), meaning single+ rock + city (warangal)-Village Railway Station : Cuddapah Dist., Sidhout. tal………….Large Pagoda [q. v.] dedicated to Codanda Rama swamy, built or restored by a Vijayanagar rajah in 14th cen.. tury-Car festival (ratotsavam) in April. Ancient mantapam rg. v.] close to a tank west of the village. North of this are two caves in the hill. Finely sculptured old temple of Gopaulaswamy.”

 

ఈ పరిపాలన వివరణ సంగ్రహము 1893 వ సంవత్సరమునం దనఁగా శ్రీ హయగ్రీవ శాస్త్రులవారి భాగవత పీఠిక ప్రక టింపఁబడి యొంటిమిట్ట నేకశిలా నగర మనుకొన నారంభించిన నలువది యెదు సంవత్సరముల తరువాతఁ బ్రకటింపఁ బడినది. ఇది వ్రాయఁబడుచుండిన కాలము సందు హయగ్రీయ శా సులవారి పీఠికను చదివి భ్రమపడిన క్రింది యుద్యోగస్తు లెవ్వరో తెలుఁగువారు పయి యధి కారుల కొంటిమిట్ట యనఁగా సంస్కృతమున నేకశిలానగర మని తెలుపుటచేత నట్లు వ్రాయబడి యుండును. ఈ పుస్తకమును ప్రకటించిన గ్రంథకర్త లేకశిలా నగరము ప్రక్క వోరంగ లని వ్రాసియున్నారు. భాగవత పీఠికానంతరమున బహుసంవత్సరములకుఁ బ్రకటింపఁబడిన యీ గ్రంథ ఈ విషయమున ప్రమాణము కానేరదు. పదునాల్గవ శతాబ్దమునం దొక విజయనగర రాజుచేత కోదండ రామ స్వామి దేవాలయము కట్టబడిన దని పై వ్రాతలలో నుండుటచేత మన బమ్మెర పోతరాజు నాఁటి కీదేవాలయము కట్టఁబడినదో లేదో ? ఒకవేళ కట్టబడినను దాని కప్పటి కిప్పటి ప్రసిద్ది వచ్చియుండునా యని సందేహింపవలసి యున్నది. అప్పటికి రాలేదనియే చెప్పవచ్చును. ఆ గ్రామములో గోపాలస్వామిది పురాతన విష్ణ్వాలయ మొకటి యున్న దని పయివ్రా(తలో నన్నది గదా ! ఒంటిమిట్ట కవి యని నిర్వి వాదముగా నంగీకరింపఁబడిన పోతనకు నూఱు నూటయేఁబది సంవత్సరముల తరువాత నుండిన యయ్యలరాజు రామభద్రకవి తన ప్రథమగ్రంథ మైన సకల కథాసార సంగ్రహమును గోపాలస్వామి కంకితము చేయుటయే మన యూహను సిద్ధాంతము చేయుచున్నది పాఠకుల యుపయోగార్థముగా సకల కథాసార సంగ్ర హములోని మొదటి పద్యము నిం రుదాహరించుచున్నాను :

 

శా. శ్రీ లీలావతి యైన రుక్మిణియు రాజీవాస్య యైనట్టి స
త్యాలోలాక్షియు నిర్వు చెప్పు డతివేలాస క్తి నిర్వంకలన్
హా ళి న్నిల్వఁ దటి ద్వయీ లలిత నీలా భ్రాకృతిం బొల్చు గో
పాలస్వామి కడున్ దయారసము నా పైఁ జిల్కు నెల్లప్పుడున్ .

 

కడప మండల చరిత్ర సంగ్రహమునందు (Cuddapah District Mannual Page 49). ఒంటిమిట్టను గూర్చి యేమున్నదో చూడుఁడు –
Ontimetta (the solitary hill) is one of the most important towns. It has a large and very holy Pagoda and a tank of some
importance. The Pagoda is dedicated to Kodanda Ramaswami and is said to have been built by one of Chitwail Rajahs about 300 ycars ago, though, if tlc inscription), at Gandikota (Scce Appendix) is to be belicved, it illust havc been built by a men. ber of tic Vizianagar (lynasty in the 14th Century”

 

పై దాని కిది తెలుఁగు — “ఒంటిమెట్ట (ఒంటిగా నున్నదిబ్బ) మిక్కిలి ముఖ్యములైన పట్టణములలో నొకటి. అది పెద్దదై మిక్కిలి పవిత్రమైన యొక్క దేవాలయమును కొంత ముఖ్యమైన యొక చెఱువును గలిగి యున్నది. దేవాలయము కోదండరామస్వామి కర్పింపఁబడినది. గండికోట (అనుబండము చూడు) వద్దనున్న శాసనమును నమ్మవలసి యుండిన పక్షమున విజయనగర రాజకుటుంబములో నొకరి చేత పదునాల్గవ శతాబ్దమునందు కట్టఁబడవలసి యున్నను, అది సుమారు మున్నూఱు సంవత్సరముల క్రిందట చిట్టివేలు రాజులలో నొకరిచే కట్టింపఁబడి యున్నట్టు చెప్పఁబడుచున్నది”.
చిట్టివేలు రాజులు మట్ల అనంత భూపాలుఁడు లోనగువారు. పైని చెప్పఁబడి నట్టు కోదండరామస్వామి దేవాలయము కట్టఁబడి మున్నూఱు సంవత్సరములే యయిన పక్షమున, అది మన పోతనార్యుని యనంతరమున నూఱు సంవత్సరము లకు పైని గాని కట్టఁబడియే యుండదు. సంశయగ్రస్త మైన శాసనమును నమ్మి దేవాలయము పదునాల్గవ శతాబ్దము నందే కట్టఁబడె ననుకొన్నను, అది భాగవత రచన కాలమునందో తదనంతరమునందో కట్టఁబడి యుండవలెను. అందుచేత పోత రాజునకు ప్రత్యక్ష మైన రాముఁ డొంటిమెట్ట కోదండరామస్వామికాఁడనియు, పోతన యేకశిలానగర మొంటిమెట్ట కాక యోరుగల్లే యనియు ఊహింపవలసి యున్నది. (క నొంటిమెట్ట వాదుల మూఁడవ గ్రంథ ప్రమాణమునకు వత్తము. దానినే వారు పరమ ప్రమాణమైన పురాణ మనుచున్నారు. వారు పరమాధారముగా నెన్నుకొనుచున్న యీ కడపటి మహాగ్రంథ మొంటి మెట్టకు దావున నున్న యోబిలి గ్రామ నివాసి యయిన రామదాసాఖ్య మహానుభావుఁడు తన కెవ్వరో సంస్కృత స్కాందపురాణము నుండి తెనిఁగించి తెచ్చియిచ్చిన తెనుఁగు వచనము ననుసరించి చేసినట్టుగా ““ఏకశిలానగర మాహాత్మ్య ము” అను పేర 1906 వ సంవత్సరాంత మున సృజించిన మూ(డాశ్వాసముల యత్యద్భుత పద్యకావ్యము. ఈ మహాకవి విరచిత పవిత్ర విచిత్ర కావ్యములోని కడపటి గద్య మిట్లున్నది – “ఇది శ్రీమద్రామభద్ర కరుణా పాత్ర రామయామాత్యపుత్ర ఆంధ్రమాఘ పురాణ నిర్మాణ కవితా ప్రవీణ అష్ట విద్యానిధాన రామదాస ప్రధాన ప్రణీతం బై న యేకశిలానగర మహత్త్వంబు సర్వంబును ద్వితీయాశ్వాసము”.

 

కవి తా నాంద్ర మాఘపురాణ నిర్మాణ కవితా ప్రవీణుఁడ నని గొప్ప చెప్పు కొన్న ను భాషా విషయమును బట్టి విచారింపఁగా నీ పురాణము పట్టి తప్పుల కుప్పగా నున్నది. కవిత్వమునం దాటితేటిన తరువాత రచింపఁబడిన యీ యేకశిలానగర మాహాత్మ్య రచనయే దోష భూయిష్ట మయి యుండఁగా ప్రథమ నిర్మాణ మయిన మాఘపురాణ మహిమ యెంత శ్లాఖాపాత్రముగా నుండునో ! ఒక్క భాషా విషయ మున మాత్రమే కాక చరిత్రాంశ విషయమునను నిది తప్పుల కుప్పగానే కానఁబడు చున్నది. కవి తా నీ గ్రంథము నేపురాణము నుండి గైకొంటి ననియెనో యాసాండ పురాణ భాగమునైనఁ జూచిన పాపమునఁ బోయినవాఁడు కాఁడు. అస లట్టి పురాణ ముండినఁ గదా చూడ నవకాశము కలుగును ? లేని పురాణము నెవ్వఁ డెట్లు చూడఁ గలుగును ? హయగ్రీవ శాస్త్రులవారి భాగవత పీఠికను జదివి దానిలోని కథలను స్థానికేతిహాసములలోని కట్టుకథలను గైకొని స్థలాభిమానముచేత నొంటి మెట్టకు ప్రాశ స్యము తీసికొని రావలె నన్న చింతతో కావ్యమునకు గౌరవము కలుగుటకయి స్కాందపురాణాంతర్గత మని చెప్పి, కవియే యీ యేకశిలానగర మాహాత్మ్యము నీ నడుమ సృజించియుండును. దీని సత్య ఈ క్రింది భాగములను జదివెడు నిష్పాక్షిక బుద్ధులకు బోధపడక మానదు. ఒంటఁడు మిట్టఁడు అను బోయ వాం డ్రిప్టజు కోదండరామ విగ్రహమును బూజించుచు నొక యడవిలో వాసము చేయుచుండి రనియు ఆ యరణ్యమున నొకరాజు మృగయావినోదార్థముగా వచ్చి వేఁటాడి యలసి పిపాసాపీడితుఁ డయి జలాశయమును జూపుఁడని వేఁడఁగా,

 

గీ. “అనుచు రాజు నుడువ నా వంట మిట్టలు
రమ్మటంచుఁ బోయి రామతీర్థ
సరసుఁ జూప నదియు జలములు చాల లే
వొక్కగజము గ్రోల నిక్కువముగ”.
బోయ లాతనిని గొనిపోయి రామతీర్థ మనఁబడెడి యొక మంచినీళ్ళ గుంటను తాము మూత వేసియుంచిన రాతిని బై కిఁ దీసి చూపఁగా రా జందు జలపానము చేసి సంతృపు (డై సంతోషించి వరము కోరుఁ డని యడిగె ననియు,

 

క. “మే మార్షించిన ద్రవ్యము

రాముల కర్పించినాము రాతిని గుడిగా
తా మేర్పరించి యందున
స్వామిని నిల్పియును నవలఁ జ (జె) ఱు వుంచవలెన్,

 

క. ఇది గాకను మా పేరను
సదయుఁడ వై పట్టణంబుఁ జ(జె) య్యగవలె మా
మదిలోన నుండు. టిదియే
సుదినంబును గూడినట్టి శుభలగ్నమునన్ ,

 

క. ఆచంద్రార్క స్థాయిగ
భూచక్రము నుండు వఱకుఁ బోకుండంగా
నా చక్రికిఁ గైంకర్యము
వే చేయించంగ భూమి యీవలె రాజా !

 

ఆ. చ(చె) ఱువు క్రింద భూమి చాలినంతయు స్వామి
కియ్యవలెను పూజ లిచ్చువారి
కిల్లు వాకిలియును నేర్పరింపఁగవలె
వంటి మిట్టలోను వసతిగాను.

 

వారు రామస్వామికి దేవాలయమును దేవాలయ సమీపమునఁ దమ పేర నొక యూరును గట్టింపు మని కోరగా రాజువారి కోరికను దీర్చి యొంటిమెట్ట గట్టించె ననియు గ్రామమున కొంటిమిట్ట నామము వచ్చుటకుఁ గారణ మందు వివరింపఁబడి యున్నది. ఈ గ్రంథమునుబట్టి మొదటిబోయ వాని పే రొంటఁడో వంటఁడో యాతని పేరఁ గట్టఁబడిన గ్రామ మొంటిమెట్టయో, వంటిమిట్టయో స్పష్టముగాఁ దెలియ రాకున్నది. పయిపద్యమును బట్టి వంటిమిట్ట యయినట్టే కనఁబడినను, పుర వర్ణనము లోని యీ క్రింది పద్యమును బట్టి చూడఁగా నొంటిమిట్ట యగుచున్నది.

 

సీ. “పుర విశేషంబు గోపుర విశేషంబులు
నొనరఁగా నొప్పును నొంటిమిట్ట
స్థలవి శేషం బుపస్థల విశేషంబులు
నొనరఁగా నొప్పును నొంటిమిట్ట
జలవి శేషంబు లంజల విశేషంబులు
నొనరఁగా నొప్పును నొంటిమిట్ట
కులవిశేషంబు గోకుల విశేషంబులు
నొనరఁగా నొప్పును నొంటిమిట్టనరవి శేషంబు సయ్యు వానర విశేష
మయ్యు రథగజతురగ వాహనము లయ్యు
చుట్టు నుద్యానవనము పై చోద్యముగను
చూడఁ జూడంగ నొప్పును సురుచిరముగ.
ఏకశిలానగరమును దెనుఁగులో నొంటిమిట్ట యందు రనియు స్కాంద పురాణములోనే చెప్పఁబడెనఁట !

 

క. ఏకశిలానగరం బన
శ్రీకరముగఁ బట్టణంబు చెలఁగుచు నుండున్
లోకులు తెలుఁగున నుడువుదు
రేకంబుగ వంటిమిట్ట యిది యను పేరన్.

 

మన వారికిఁ గావలసిన దంతయు నిందులోనే యుండఁగా మఱి యేది కావలెను ? బమ్మెరపోతరా డొంటి మెట్టవాఁ డనియు నీ యపూర్వ పురాణములోనే యున్నది. చిత్తగింపుఁడు –

 

శాలివాహన శకగత మోలి
నడుచు వేయి మున్నూఱు వత్సరా ల్వెలయుచుండ
బమ్మెర కులాభిచంద్రుండు భగవదంశు
కేసనామాత్య పుత్రుండు కేశవునకున్ .

 

క. భక్తుఁ డయినట్టి పోతన
యుక్తవయసు రాకమును పె యురుగోత్రము లా
స కత గోవుల మేపుచు
రక్తిగ నేకశిలనగర రాజము నందున్ .

 

క. కాపురము చేయుచుండియుఁ
గాపులతోఁ గూడి పసులఁ గనపు స్థలములన్
మేపుచునుండఁగఁ గొండల
దాపు చిదానందయోగి దర్శన మయ్యెన్

 

గీ. దర్శనంబు మౌని స్పర్శయుఁ గలిగిన
బావనుండు నయ్యెఁ బారుఁ డతఁడు
నదియుఁ జూచి రామనామంబు నుపదేశ
మొనరఁ జేసె దాని మూలమునను.

 

గీ. ఆ చిదానంద యోగికి నపుడు భక్తి
వినయములు చేసి శాశ్వతవిభవ మమరఁ
దారకంబును దొరకెను ధన్యు నై తి
ననుచు మ్రొక్కిడి పోతనానంద మొందె.

 

వ. అంతఁ జిదానందయోగి యదృశ్యుం డై చనినఁ దదనంతరంబున.

 

గీ. భాగవతముఁ జేయ భావించి రాముల
కృపకుఁ బాత్రుఁ డైన కొడుకుఁ జూచి
తల్లిదండ్రు లపుడు తగునని చెప్పిరి
పోతనాఖ్యుఁ డపుడు పొసఁగఁ జేసె.

 

ఉ. బమ్మెర పోతనాఖ్యుఁడును భాసిలు కాశిపురంబుఁ జేరి భీ
ష్మమ్మను వేఁడికొంచుఁ గలుషమ్ములఁ బాపు మటంచు విష్ణుపా
దమ్మునఁ బుట్టినమ్మ యని దబ్బున గంగను దోఁగి లేచి చి
తమ్మున రాముఁ జేర్చుకొని తారకముణ జపియించుచున్నాడన్ .

 

క. పట్టాభిరామ దేవుఁడు
పట్టుగఁ గనుఁ గవకుఁజాలఁ బ్రత్యక్షం బై
దిట్టముగ భాగవత మి ప్పట్టునఁ
దెనిఁగించు మోక్ష భాగ్యము లొదవున్ .

 

బమ్మెర పోతరా వొంటిమిట్టవాఁ డనీ చూపుటయే కాక బమ్మెర పోతరాజు స్నానము చేసినది గోదావరిగాక కాశిలోని భీష్మమ్మ (భీష్మునియమ్మ) యని స్పష్ట పరచి యీ మహాపురాణ మొంటిమిట్టవాదుల పాలిటి కల్పతరు వై నది. కవికి రాముఁడు సాక్షాత్కరించినదియు కాశీ నగరములోనే యని యీ పుస్తకము తెలుపు, చున్నది. రాముఁడు ప్రత్యక్షమయి భాగవతమును రచింపు మని యాదేశింపఁ గానే పోతరా జొంటిమిట్టకు పరుగెత్తు కొని వచ్చేనఁట !

క. ఏకశిలానగరమునకుఁ
ద్రాకటముగఁ బోతరాజు పరుగిడి యచటన్
శ్రీకాంతుం డగు రాముల
నాకరముగఁ జేసికొంచు నయ మరుదారన్.ఈ యపూర్వ స్కాందపురాణములోఁ బేరొనఁబడిన వాఁ డొక్క పోతరాజు మాత్రమే కాఁడు. తరువాత బహుకాలమున కుండిన యొంటిమిట్టకవి యయ్యలరాజు . రామభద్రుఁడు సహిత మిందుఁ బేర్కొనఁబడెను. ఆతని కథను జూడుఁడు—

 

క. శివదేవరాయ లను ప్రభు
సవినయత న్విజయ నగర సామ్రాజ్యుండై
నవఖండంబుల నేలుచు
నవిరళముగ రామదేవు నర్చన చేసెన్ .

వ. అట్టి కాలంబున శాలివాహన శకవర్షంబులు వేయి న్నన్నూట డెబ్బది మొదలు. యెనుబది రెండువఱకుఁ దన రాజ్యంబునకు లో(బడిన సిద్దవటపురంబున కిరుదెసల వంటిమిట్ట శ్రీరాములవారికి సకలభోగంబులు జరుగునటులఁ కొన్ని పురంబుల నరణం బిచ్చె నా సమయంబునందు.

 

ఉ. అయ్యలరాజు వంశజుఁడు నాలును బంధులు మిత్రు లాదిగాఁ
జయ్యనఁ బుత్రు నెత్తు కొని స్వామికి నర్చనచేయువేళఁ ద
ల్లయ్యెడఁ బుత్రునుంచి బహుళమ్ముగ వేఁడుచునుండి రాత్రి యై
పొయ్యిరి బిడ్డయం చనక పొల్పుగ రాముల మాయొ చిత్రమో.

 

గీ. ఉదయమున లేచి బిడ్డను వెదకుకొనఁగ
నల్లెడలఁ గాన కాత్మలోఁ దలడిల్లి
సదియు నొక్క నెలయు బాగుగాఁ బెంచితి
నిచ్చినతని కియ్య నేమి కొదవ.

 

క. అనుచును మూఁడు దినంబులు
తన యాత్మం బుత్రుఁ దలఁచి తారకనామం
బును జపియించుచు నుండినఁ
గనుఁగవకుం దో(చె సుతుఁడు కాపున్న క్రియన్.

 

క. నాలవనాఁడును పూజా
మూలంబుగ నంబి యరుగ మురహరివలెఁ దా
కాలుని గెలిచిన పుష్కరు
వాలెం గుడినుండి వెడలె వసుధకు నంతన్ .

 

ఆ. తల్లిదండ్రి మొదలు దగవారి వారలు
హర్ష మొదవ రామహర్నిశములు
దలఁచుకొంచుఁ బేరు దగు రామభద్రయ్య
యనుచుఁ బిలిచికొనుచు నరిగి రపుడు.

 

క. సీతారాములు పెంచిరొ
యేతీరున బ్రతికివచ్చె నీకుఱ్ఱఁడు శ్రీ
మాత యయి సీత స్తన్యం
బీతనికి నిచ్చెననిరి పృథివిని దివినిన్ .

 

క. ఆ రామభద్రయాఖ్యుఁడు
శ్రీరాముల దయను బొంది చెలఁగుచుఁ గవి యై
యారాయ ప్రభునివద్దను పాఱుఁడు
ప్రబలకవి యయ్యుఁ బర గుచునుండెన్ .

 

ఈ గ్రంథమునందుఁ బేర్కొనఁబడినవారు రామభక్తు లగు భారతీయులు మాత్రమే కాదు. మహమ్మదీయులు సహిత మిందుఁ బేర్కొనఁబడిరి. కన్నులు – తనియం గనుఁడు–

 

చ. అదియునుగాక మ్లేచ్చకులు, డైన యిమాంబెకుఁ డొక్కనాఁడు తాఁ
బదుగురు గుట్ట మేనుఁగులు పత్నియుత ంబుగ వచ్చి దేవలం
బొదివిన నర్చకాదులును బొమ్మనఁ బోక పరుండ నచ్చట!

వదలక యుండ సామునిసి వాఁడగు పచ్చలబద్ద పట్టుకన్.

 

సర్వజులకు గోచరము గాని దేముండును ? ఇన్ని దెలిపిన సర్వజుఁ డైన యీ స్కాందపురాణ కర్త యిటీవలఁ బు స్తకములఁ గోదండరామస్వామి కంకిత మొనర్చిన భక్తుల నేల పేర్కొనలేక పోయెనో ! ఈ పుస్తక కల్పనము 1906వ సంవత్సరమునందుఁ గాక 1918వ సంవత్సరమునందుఁ జేయఁబడినచో నీ నవ భాగవతో త్తముల పేరులు సహిత మిం దెక్కి యుండును. ఇక నీ యేకశిలానగర మాహాత్మ్యమునకు మూలమైన సంస్కృత స్కాందపురాణము రాక యొక్కటి కొఱఁతగా నున్నది. “ఓరుగంటి కాధారముగ లిఖితాధారములు తాళపత్రములు సృష్టింపఁబడుచున్న వని వింటిని” అని ఆంధ్ర వాల్మీకులును, భక్తా గ్రేసరులు నైన శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు పలికినట్లు వారి యిష్ట దేవతానుగ్రహంబున నా కొఱతయు శ్రీఘకాలములోనే తీఱు నేమో !

 

-ఆంధ్రపత్రిక పదియవ (సిద్ధార్థి) సంవత్సరాది సంచిక..
(1919, మే 28వ తేది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *