బీరు దేవో భవ

beer, afloat, drifting-1607001.jpg

లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన భూమి… లక్ష రకాల జీవరాశులు. ఎంత నాగరికత.. ఎన్ని వండర్స్..ఆ భూమిపై సృష్టికే ప్రతి సృష్టి చేసిన మనిషి…… ఎన్నింటిని కనుగొన్నాడు.. ఎన్ని నిర్మించాడు.. ఇవాళ విశ్వాన్నే మధిస్తున్నాడు. విశ్వంలో భూమిని వదిలి మరో గ్రహంలో నివాసం ఉండేందుకు సైతం ప్రయత్నాలు చేస్తున్నాడు.. ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన మనిషి తాను కనుగొన్న వాటిలో అన్నింటికంటే గొప్పదేమిటి? నెంబర్ వన్ ఇన్వెన్షన్‌గా దేన్ని నిర్ణయించాల్సి ఉంటుంది? ఈ ప్రపంచాన్ని తనదైన రీతిలో రక్షించిన ఆ సృష్టి ఏమిటి? మీరు చెప్ప గలరా?

21వ శతాబ్దం.. అత్యంత శక్తిమంతమైన మనిషి. పది లక్షల సంవత్సరాల నాగరికత. భూమిని అద్భుతంగా మార్చిన ఘనత. ప్రపంచాన్ని కుగ్రామంగా చేసిన సామర్థ్యం. ఈ ప్రపంచం అంతా ఒక గొప్ప సృష్టితో మొదలైంది. అదేమిటి? రాకెట్టా? చక్రం కాదు. కారు కాదు. విమానమూ కాదు. మనిషి సృష్టిలోనే గొప్ప సృష్టి. బీరు…..
బీరు ప్రపంచంలోని ఏడు వింతల్లో మొదటివింతగా చెప్పుకోవచ్చు. మోడ్రన్ హెల్త్‌కేర్‌లో అత్యంత కీలకమైన పాత్ర బీర్‌ది. ఎందుకంటే ప్రపంచంలో బీరూ సైన్సూ మొగుడూ పెళ్లాల్లాగా చేూ చేూ కలిసి నడిచాయి..నడుస్తున్నాయి. బీరు అలాంటిలాంటి ఇన్వెన్షన్ కాదు.. ఇవాళ ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికాకు ఒక రూపాన్ని, ఒక స్థానాన్ని కల్పించింది. ఆశ్చర్యం కాదు.. నిజం.. అమెరికా వాడి డిఎన్‌ఏలోనే బీరు కణాలు ఉన్నాయి. దీనికోసమే వాడు గోధుమ పంటను పండించటం మొదలు పెట్టాడు.. బోరు బావుల్లోంచి నీళ్లు తీసినట్లుగా బీరును సీసాల కొద్దీ తయారు చేశాడు.. చేస్తున్నాడు.
బీరు కవిత్వాన్ని సృష్టించింది
బీరు గణితాన్ని సృష్టించింది
బీరు పిరమిడ్లను సృష్టించింది
బీరు మోడ్రన్ మెడిసిన్‌ను సృష్టించింది
బీరు అమెరికా కార్మిక చట్టాలను సృష్టించింది
బీరు స్కాములనూ సృష్టించింది
బీరు.. అవునండీ అక్షరాలా బీరే.. బీరుకు ఇంత సీనుందా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు బీర్ ప్రపంచాన్ని ఏలుతోంది. శాసిస్తోంది. ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచాలన్నా? ప్రళయం సృష్టించాలన్నా బీరు వల్లే సాధ్యపడుతోంది.. గమ్మత్తుగా మత్తును ఇచ్చే బీరు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తోంది.. మరదే విచిత్రం చూడండి…
మనకు తెలిసినంత వరకు బీరు ఓ మత్తు పానీయం. మందు విందుల్లో ఫుల్ క్రేజి ఉన్న డ్రింక్. పబ్బుల్లో, క్లబ్బుల్లో ఏర్లై పారే బీర్ల గురించి వాటిల్లో మునిగి తేలే యూత్ గురించి తెలుసు.. ఇవాళ మంచినీళ్లు, చాయ్ తరువాత మూడో స్థానం బీరుదే. ప్రపంచమంతా పాపులిస్టిక్ ఆల్కహాలిక్ బేవరేజ్ ఇది.
బీరు సొసైటీలో కామన్ డ్రింక్ . ఇది సోషల్ లుబ్రికెంట్. ప్రపంచంలో బీరు ఉత్పత్తి చేయని దేశం.. బీరును వాడని సొసైటీఅన్నది లేదు. అమెరికా, ఇరాన్, సిరియా, ఆఫ్రికా దేశాల్లో వైన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ బీరును అమ్ముతారు. రష్యాలో అయితే ట్రెడిషనల్ ఓడ్కా వినియోగమే లేకుండా పోయింది. బీరు ముందు ఓడ్కా చిన్నబోయింది.
మన దేశానికి వచ్చేసరికి బీరు వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏమిటో తెలుసా? హైదరాబాదే. మన దగ్గర పర్ కాపిటా వినియోగం ఒకటిన్నర లీటరు.. అగ్రరాజ్యంతో పోలిస్తే ఇది ఏ మూలకూ కాదు. ఎందుకంటే అమెరికాలో ఒక మనిషి బీరు సగటు వినియోగం 82 లీటర్లు. 90 శాతం మార్కెట్‌ను అమెరికాలో బీరే క్యాప్చర్ చేసింది. అందుకే అంటున్నది అమెరికాను బీరు నడిపిస్తున్నదని. ప్రపంచం మొత్తంమీద బీరు టర్నోవర్ ఎంతో తెలుసా? సుమారు రెండు లక్షల కోట్ల డాలర్లు.
బీరు లేకుండా పార్టీ లేదు.. బీరు లేని ఫంక్షన్‌లు లేవు.. బీరు లేని ఆటపాటలు లేవు.. ప్లేకార్డ్స్ ఆడుతూ, బీరు తాగుతూ తీసుకునే నిర్ణయాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయిట. ఇవాళ కార్పొరేట్ ఇండస్ట్రీలో, పేజ్ త్రి కల్చర్‌ను పూర్తిగా డైరెక్ట్ చేస్తున్నది బీరే. ఏ పని జరగాలన్నా.. చిన్న సిట్టింగ్ ఉంటే చాలు ఇట్టే అయిపోతుందన్నంతగా బీరు ప్రపంచాన్ని ఆక్యుపై చేసేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. మద్యం బాబులకు బీరంటే తెగ ఇష్టం.. దానికి అడిక్ట్ అవటం మామూలే.. ఇవాళ రేపు బీరు తాగటం పెద్ద దుర్వ్యసనం కూడా కాదు. కానీ, బీరు ప్రపంచాన్ని శాసించటం ఏమిటి? పిరమిడ్లను నిర్మించటం ఏమిటి? విడ్డూరంగా లేదూ..
బీరు సమాజాలను కలిపింది.. దేశాల మధ్య సామరస్యాన్ని నిలిపింది.. జాతుల మధ్య వైరుధ్యాలను తగ్గించింది. అపూర్వ అద్భుతాలను నిర్మించింది. ఇదేమీ కాకమ్మ కథ కాదు.. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. మానవ నాగరికతలో ఒక ఆల్కాహాలిక్ డ్రింక్ పోషించిన పాత్ర నిస్సందేహంగా అపూర్వం. ఇవాళ మనం చూస్తున్న ప్రపంచ వింతల నుంచి ఇప్పుడు ప్రపంచ పోలీసు దాకా బీరు మంత్రం మహత్యంపై నిర్మాణమైనవే.
మనిషి పుట్టుక పదిలక్షల సంవత్సరాల పూర్వం జరిగిందని అంచనా వేసుకున్నా.. బీరు పుట్టుక మాత్రం పదిహేను వేల సంవత్సరాలకు పూర్వమే జరిగింది. ఇదేమీ ఆశ్చర్యం కాదు. తొలి నాగరికతగా ఇప్పుడు ప్రపంచం ఎక్కువగా చెప్పుకునే మెసపటోమియాలోనే బీరు తాగిన ఆనవాళ్లు కనిపించాయి. మనిషి వ్యవసాయాన్ని ప్రారంభించిన మొదట్లోనే గోధుమల నుంచి బీరు పుట్టింది.
గిజా పిరమిడ్.. ప్రపంచంలోని ఏడు వింతల్లో మొట్టమొదటిది. ఈజిప్ట్ నాగరికతకు ఇది గొప్ప ఆనవాలు. కానీ, ఈ పిరమిడ్‌ను నిర్మించింది ఏమిటో తెలుసా? బీరు.
ఆశ్చర్యపోకండి… ఇది నిజం. గిజా పిరమిడ్ నిర్మాణంలో రోజూ వేల మంది కార్మికులు పాల్గొన్నారు. ఈజిప్టు రాజు వీరికొక్కరికి రోజూ 56 జార్ల బీరు పోయించేవాడట. ఇదే వారిలో పని చేసేందుకు చైతన్యాన్ని కలిగించేదట. గిజా పిరమిడ్ నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత బీరు ఖర్చయిందో తెలుసా? అక్షరాలా 23 కోట్ల 14 లక్షల 14 వేల 717 గ్యాలన్లు.
మోడ్రన్ మెడిసిన్‌లో యాంటీబయాటిక్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 1928లోనే దీన్ని కనుగొన్నా, 1948 దాకా మనకు యాంటీ బయాటిక్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. టెట్రాసైక్లిన్‌ను మొదటిసారి అధికారికంగా యాంటీబయటిక్‌గా గుర్తించారు. వాస్తవానికి మూడువేల ఏళ్ల నాడే ఈజిప్షియన్స్ ఈ యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. అదే బీరు. బీరులోనే టెట్రాసైక్లీన్ గుణాలు ఉన్నాయని నిరూపణ అయింది. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయటిక్‌ను కనుగొని నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇప్పుడు బీరుకు దాన్ని షేర్ చేయాల్సి ఉంటుందేమో..
మరి లక్షల మంది ప్రజల జీవితాలను ఎలా రక్షించింది. ముఖ్యంగా మధ్యయుగాల్లో ఇది ఓ అమృతంగా ఎలా పని చేసింది..? నిజాలు వింటే విడ్డూరంగా తోస్తుంది. నమ్మటం వీలు కాని పరిస్థితి.. కానీ, ఇదే అచ్చమైన నిజం. మధ్యయుగాల్లో యుద్ధభయం, ప్లేగుతో పాటు భయంకరమైన కిల్లర్ మనుషుల్ని చంపేస్తూ వచ్చింది. అదే నీరు..
ఈ నీటి నుంచి తప్పించుకోవటం ఎవరివల్లా అయ్యే పని కాదు. అందుకే మూడువేల ఏళ్ల నాటి ప్రధాన వంటకం బీరు.. ఇదే లక్షల మంది ప్రజల ప్రాణాలను నిలబెట్టింది. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలు కూడా వాస్తవాల్ని రుజువు చేసింది. మధ్యయుగాల్లో బీరు గురించి అప్పటి ప్రజలకు అవగాహన లేకపోవచ్చు.. కానీ, దీన్ని మరింత టేస్టీగా తయారు చేసుకునే వారు. యాదృచ్చికంగానే ఇది వాళ్లందరి పాలిట అమృతమైంది.
మన శతాబ్దంలో బీరు అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డ్రింక్.. అంతా కలిసి తాగే కామన్ డ్రింక్. ఇట్ ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్.. సమ్‌థింగ్ థ్రిల్లింగ్.. కామర్స్‌లో, ట్రేడింగ్‌లో ఇప్పుడిది కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది క్రియేటర్ ఆఫ్ మోడ్రన్ క్యాపిటలిజం. ఇది మద్యానికి తక్కువ.. మిగతా వాటికి ఎక్కువ.
పదహారో శతాబ్దంలో ప్రజలందరికీ ప్రధాన డ్రింక్ బీర్. పసి వాడి దగ్గరి నుంచి ఆడా మగా తేడా లేకుండా ఎనర్జీ కోసం బీరు తాగేవారు. మధ్యయుగంలో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 365 లీటర్ల బీరు తాగేవాడు. ఇప్పటి సగటుతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ.
బీరు ద్రవరూపంలో ఉన్న బంగారంగా భావిస్తారు. చర్చిల్లో అధికారికంగా బీరును ఇచ్చేవాళ్లు.. అంతగా ఇది సొసైటీతో అల్లుకుపోయింది. యూరప్‌లో ఇప్పటికీ బీరు పండుగ జరుపుకుంటుంటారు.
అమెరికా.. ప్రజాస్వామ్యాన్ని బుజాలకెత్తుకున్న దేశం.. ఇది మొత్తం బీరు పునాదులపైనే నిర్మాణం అయింది. అమెరికాకు బీరు మామూలు డ్రింక్‌కంటే ఎక్కువ. దేవుడు ఉన్నాడనటానికి అమెరికా చూపించే ఒకే ఒక రుజువు బీరు. దేవుడు ప్రజలను ప్రేమించాడు కాబట్టే.. ఆ ప్రజలు సంతోషంగా ఉంచేందుకే బీరును సృష్టించాడని అమెరికావోడి గట్టి నమ్మకం.
17వ శతాబ్దంలో అమెరికా విప్లవం చరిత్రాత్మకమైంది. బ్రిటిష్ వాళ్ల నుంచి స్వతంత్రం కోసం ఉద్యమకారుల కీలక సమావేశంలో ప్రధానభూమిక బీరుదే.
ఇవాళంటే గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు వచ్చేశాయి. కానీ ఇవి రాకముందు ప్రజల మధ్య కమ్యునికేషన్ నెట్‌వర్క్‌గా పని చేసింది బీరే.
మోడ్రన్ మెడిసిన్‌గా బీర్ చాలా బాగా పని చేస్తుందని పరిశోధనలు తేల్చాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈస్ట్ బ్యాక్టీరియా మనిషిని హెల్దీగా ఉంచుతుందిట. మనకు అత్యంత కష్టమైన సమస్య వేడి.. ఆ వేడిని తగ్గించటంలో బీరుకు సాటి మరొకటి లేదు. ఎందుకంటే నూటయాభై ఏళ్ల క్రితం వేడి నుంచి తప్పించుకోవటానికి ఐస్ ఒక్కటే మార్గంగా కనిపించేంది. కానీ, ఇప్పుడు మన పాలిటి ఐస్ … బీరు.
1904లో మెకెల్ ఓవెన్ మొదటి ఆటోమేటెడ్ మెషిన్ కనుగొన్నాడు.. ఈ మెషిన్ ఆ తరువాత తొలి ఫోర్డ్ కారు ఇంజన్‌కు బేసిక్ ఫార్ములా అయింది. ఇంతకీ ఓవెన్ ఆటోమేటెడ మెషిన్ ద్వారా తయారు చేసిందేమిటో తెలుసా? బీరు సీసాలు.
ఇవాళ బీరు ప్రపంచంలో నెంబర్ వన్ బేవరేజ్. నెంబర్ వన్ బిజినెస్.. నెంబర్ వన్ డ్రింక్. నో అదర్ డ్రింక్ కెన్ కంపేర్ విత్ ఇట్.

కోవెల సంతోష్ కుమార్

One thought on “బీరు దేవో భవ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *