‘రాయలు కరుణకృత్య’మే ‘మల్లీశ్వరి’కి స్ఫూర్తి!

డా॥ వేదగిరి రాంబాబు

బుచ్చిబాబు అనగానే మనకు ‘చివరకు మిగిలేది’ నవల గుర్తుకొస్తుంది. లేకపోతే ఆయన కథానికలు గుర్తుకొస్తాయి. ఆయన నిజాయితీకి, ఆంగ్ల తెలుగుభాషల పాండిత్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా ఎన్నో వ్యాసాల్ని రాసారు. ఆయన రానిన షేక్‌న్పియర్ సాహితీ పరామర్శ గ్రంథానికి ఆరోజుల్లోనే రాష్ర్టసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీటన్నింటితో బాటు ఆయన గొప్ప చిత్రకారులు! ఎన్నో లాండ్‌ేన్కప్ రంగుల పెయింటింగ్స్‌ని గీశారు.
బుచ్చిబాబుగారు ఆకాశవాణిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసారు. శ్రవ్య నాటకాలకు ఆయన కొత్త ఒరవడిని పెట్టారు. ఆయన కథానికలలో ఆకాశవాణి నాటకాలుగా పనికొస్తాయనుకున్న వాటిని శ్రవ్య నాటకాలుగా మార్చారు. రంగస్థల నాటిక, నాటకాలుగా మార్చవచ్చునుకున్నవాటిని రంగస్థల ప్రదర్శనకనువుగా తీర్చిదిద్దారు.
ముందు అనంతపురం,తర్వాత విశాఖ పట్టణాలలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసారు. ఆ తర్వాత ఆకాశవాణి చెనె్నైలో కార్యనిర్వహణాధికారిగా చేరారు.
చెనె్నై ఆకాశవాణిలో పనిచేేనప్పుడు గంట వ్యవధి శ్రవ్య నాటకాల్ని రాసారు. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలనిన నాటకం ‘రాయలు కరుణకృత్యం’. శ్రీకృష్ణదేవరాయలు జీవితంలో జరిగిందని చెప్పుకునే ఓ సంఘటనాధారంగా ఈనాటకాన్ని రాశారు. ఈ నాటకంలో ఓగాత్రధారిగా పాల్గొన్న బి.ఎన్.రెడ్డిగారికి ఆనాటకం నచ్చి, దానిని చలనచిత్రంగా రూపొందించాలనుకున్నారట. కారణాలిదమిద్దంగా చెప్పలేం కాని బి.ఎన్.రెడ్డిగారు ఆ నాటకం ఆధారంగా గొప్ప విజయవంతగా చిత్రాన్ని నిర్మించారు; తెరమీద మూలకథని కూడా బుచ్చిబాబుగారి పేరు వెయ్యలేదు. రాయలు కరుణకృత్యం నాటకం ఆధారంగా నిర్మించిన ఆ చిత్రం ‘మల్లీశ్వరి’.
‘రాయలు ్టరుణకృత్యం’ ఆ నాటకాన్ని ప్రచురించేటప్పుడు బుచ్చిబాబుగారు ఈ నాటికలో ఇతివృత్తానికి వాహినీవారి చిత్రం ‘మల్లీశ్వరి’లో ఇతివృత్తానికి కొందరికి కొన్ని పోలికలు కన్పించవచ్చు. ఈ నాటికను భారతిలో ప్రచురించిన ఏడెనిమిది సంవత్సరాలకు ఆచిత్రం విడుదలైందని పాఠకులు గుర్తుంచుకుంటే చాలుఅని అసలు విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు బుచ్చిబాబు.
ఆయన చెనె్నై ఆకాశవాణిలో పనిచేేనప్పుడు ఆత్మవంచన, ఉత్తమ ఇల్లాలు, ఒమర్‌ఖయ్యాం, దారినపోయే దానయ్య లాంటి గంట వ్యవధి శ్రవ్య నాటికలు రాని, ప్రోడ్యూన్ చేస్తారు. ఆతర్వాత ఆయన విజవాడ ఆకాశవాణికి బదిలీ అయిన తర్వాత వీటన్నింటినీ రంగస్థల నాటకాలుగా మార్చి ప్రదర్శింపజేసారు. శ్రవ్య నాటకాల్ని దృశ్యనాటకాలుగా కూడా గొప్పగా తీర్చిదిద్దవచ్చని నిరూపించారు.
ప్రముఖ నటి సావిత్రి, నిర్మాత నటులు పుండరీకాక్షయ్యలను ‘ఆత్మవంచన’ నాటకంతోనే రంగస్థలానికి పరిచయం చేసారు బుచ్చిబాబు. ఈ నాటకాన్ని కాకినాడలో ప్రదర్శిస్తున్నప్పుడు చూని ప్రముఖ హిందీ నటులు పృధ్వీరాజ్‌కపూర్‌గారు మెచ్చుకున్నారు.1950 ఏప్రిల్ కాకినాడలో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలలో ఆత్మవంచనని ప్రదర్శించినప్పుడు బుచ్చిబాబు గారు ఉత్తమ రచన పురస్కారాన్ని పొందారు. ఈ నాటకంలో రాజశేఖరం పాత్రని పుండరీకాక్షయ్యగారు, బెంగాలీకన్య పూర్ణమ చంద్రికాబోన్ పాత్రని, సావిత్రి పోషించారు. మరో విశేష,ం; ఆత్మవంచన శ్రవ్యనాటకాన్ని జాతీయ నాటకంగా ఆకాశవాణి ఒకేసారి అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి, ప్రసారం చేనింది. అలా జాతీయ నాటకంగా తెలుగునుంచి మొదటిగా ఎంపికైన రేడియో నాటకం ‘ఆత్మవంచన’. ఇలా ఈ నాటకం శ్రవ్య నాటకంగా, దృశ్యనాటకంగా కూడా బుచ్చిబాబుకి మంచి పేరుని తెచ్చింది.
ఓ గమ్మత్తయిన న్ర్తీ రాణి. ఆమె ఆత్మవంచనతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటారు. తమ దగ్గరవారాలు చేసుకుని చదివిన రాజశేఖరమంటే ప్రేమ కలెక్టర్‌గారి పెద్దమ్మాయి రాణికి. కానీ ఆమాట అడగడానికి అహంకారం అడ్డం వస్తుంది. డబ్బులతో అతడ్ని వశం చేసుకుందామనుకుంటుంది. అందుకు సాంఘిక పరిన్థితులు అడ్డు తగులుతాయి. ఆఖరికి అతని శరీరంమీదయినా విజయం పొందాలనుకుంటుంది ఆమెకి ఆ ఆకాశం ఇవ్వకుండా రాజశేఖరం ఆత్మహత్య చేసుకుంటాడు. అంతకుముందు నీక్కాబోయే భర్త నన్ను ప్రేమిస్తున్నాడని రాణి చెప్పడంతో ఆమె ప్రేమించిన పూర్ణిమాచంద్రికా బోన్ ఆత్మహత్యచేసుకుందని తెలుసుకుంటాడు రాజశేఖరం. ఇలా రాణి ఆత్మవంచనతో రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. మనోవిశ్లేషణా ప్రధానంగా సాగుతుంది ఈరచన.
ఓమర్‌ఖయ్యామ్ పద్యాలను ఇంగ్లీష్‌లోకి అనువదించిన ఫిటజెరాల్డ్ తన ేన్నహితునికి వ్రానిన ఒక లేఖలో ఒమర్‌ని రక్షించడానికి పర్షియారాణి మారువేషంలో వచ్చిందని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు అని రాశాడు. ఈ కల్పితగాథ ఆధారంగా ‘ఓమర్‌ఖయ్యామ్’ నాటికని రాసారు.
నండూరి సుబ్బారావుగారి ఎంకి పాటలంటే బుచ్చిబాబుగారికెంతో ఇష్టం. ఎంకి పాటల్నిచెనె్నై ఆకాశవాణిలో పనిచేనినప్పుడు మల్లిక్‌గారితో రికార్డ్ చేయించారు. అంతేకాదు ఎంకి పాటలన్నింటికి బొమ్మలు వేసుకుని దాచుకున్నారు బుచ్చిబాబు.
ఎంకి పాటలలోఎంకిని ప్రథమంలో సుబ్బారావుగారికి ఎట్లా సాక్షాత్కరించిందో వారి ఊహలో ఎట్లా పరిణామం చెందిందో ప్రదర్శించాలన్న సంకల్పంతో ముందు ‘కలలో నా ఎంకి’ అనే శ్రవ్యనాటకాన్ని రాని విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం చేసారు. ఈ నాటికలో కవిపాత్రని నండూరి సుబ్బారావుగారే పోషించారు.
ఆ తర్వాత ఎంకి ఒక వ్యక్తిగా ఆయన ఊహల్లో ఒత్తిడి సాగించింది. ‘ఎంకి పాటలకవి నుంచి విముక్తి కావాలని ఉత్తమ ఇల్లాలు నాటకం రాసాను’ అంటారు బుచ్చిబాబు. ఉత్తమ ఇల్లాలులో ఎంకికి, నండూరి ఎంకి పాటలలో ఎంకికీ నైతికంగాగాని, లౌకికంగాగాని ఎటువంటి సంబంధం లేదు.
ఎంకికి ఒక స్వరూపం, వయస్సు, తృష్ణ కల్పించి, ఆమెకొక లోకం కల్పించి, అందులో ఆమె ఎలా సంచరిస్తుందో ఎట్లా అంతమొందుతుందో ప్రదర్శించి కాలక్షేపం కలిగించాలనే ఉద్దేశంతో ప్రధానంగా బుచ్చిబాబుగారు ఉత్తమ ఇల్లాలు నాటకం రాసారు. దీన్ని ముఖచిత్రం ఎంకి చిత్రాన్ని ఆయనే వేసారు. ఈ విధంగా తమ పాత్రని వినియోగించుకోవడానికి కొన్ని ఎంకి పాటల్ని వాడుకోవడానికి సమ్మతించి, దీవించిన నండూరి సుబ్బారావుగారికి ‘ఎంకి’ని ఉత్తమ ఇల్లాలుగా పరిచయం చేనిన శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారికి కృతజ్ఞతలూ చెప్పుకుంటారు ఈ నాటకాంతంలో శ్రీబుచ్చిబాబు.
ఈ నాటక నిర్మాణంలోగాని, భాషలోగాని, పాత్రపోషణతోగాని నాకేమాత్రం సంబంధం లేకపోయినా ‘ఎంకి’ అన్న పేరులోనే కథావస్తువు నాదైనట్లు పొంగిపోయాను. ఈ నాటకం నామనసు కలచివేనింది. రచయిత ఎంకి కనబరిచిన ప్రేమ నాకు కన్నెర్ర చేయించలేదు. మనశ్శాంతినిచ్చింది’’ అంటూ ఈ నాటకాన్ని చూనిన నండూరి సుబ్బారావుగారు బుచ్చిబాబుగార్ని ఆశీర్వదించారు.
అసలు మతాన్నే ద్వేషించిన తిష్యరక్షతి బుద్ధుని విగ్రహం క్రిందపడి చనిపోతుంది. అప్పుడు అశోకుడికి తిష్యరక్షతి ద్వేషించింది తననా? మతాన్నా? అనే అనుమానం వస్తుంది. ఇది ‘తిష్య రక్షతి’ నాటిక సారాంశం.
మొదట ‘అంతిమఅజ్ఞానం’ నాటకం ఆకాశవాణిలో ప్రసారమైంది. తర్వాత 1956లో ‘తెరపడని నాటకం’ పేరుతో కథానికగా ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వచ్చింది. రంగస్థల ప్రదర్శనకు, వీలుగా తిరగరాశారు ‘అంతిమ అజ్ఞానం’ పేరుతో.
ఆద్యంతాలు, మధ్య రాధ నాటకంలో పన్నెండు ఘట్టాలూ, మధ్య తరగతి కుటుంబజీవితాన్ని చిత్రిస్తాయి. ఈ రూపకం ఆకాశాణి చెనె్నై కేంద్రం నుంచి ప్రసారమైంది.
ప్రతీ రచనలోనూ ఇల్లాలికి అన్యాయం చేస్తూ వచ్చిన నాపైన ఫిర్యాదుచేస్తూ వచ్చి మా ఆవిడ పేరు చెప్పకూడదన్నారు పెద్దలు కానీ నూరు తప్పులు మించకుండా చేేన్త ప్రమాదం లేదని హామీ ఇచ్చారు గనుక పేరు చెప్తున్నాను శివరాజు సుబ్బలక్షికి, ఆమెను వెనుకేసుకొచ్చే ఆంధ్రగృహిణులకు నా సంజాయిషీగా ఈనాటికల సంపుటిని అంకితం చేస్తున్నాను అన్నారు హాస్యస్ఫోరకంగా ఈ నాటికల సంపుటిని భార్యకంకితం చేస్తూ.
1962లో ‘ఒకే నిద్ర ఎన్నో కలలు’ నాటకానికి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖవారి బహుమతిపొందింది. ‘గొలుసు’ కుటుంబ నియంత్రణకు సంబంధించిన నాటకం.
షష్టిపూర్తి, కార్యదర్శి కల్యాణి, మధురతరంగం, ఐదు నిముషాలలో అన్నీ తయార్, తీనిన తెర, నాలుగో పరిమాణం, గాజుమేడ, రహస్యజీవులు లాంటి నాటికలు, దొంగదొరికాడు లాంటి నాటికలు రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *