డా॥ సి. నారాయణరెడ్డి

అది 1981 సంవత్సరం. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యగారు నా పట్ల చాలా కాలంగా ఉన్న అభిమానంతో, నన్ను అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా అంటే లోగడ వావిలాల గోపాలకృష్ణయ్య గారు అధ్యక్షులుగా ఉన్న సంమానికి అధ్యక్షుడిగా ఉండాలని నాకు కబురు చేశారు. ‘నేను ఒకవైపు విశ్వవిద్యాలయంలో అధ్యాపకత్వం వహిస్తున్నాను. మరోవైపు సినీగీత రచనలో ఉన్నాను. పైగా ప్రవృత్తి రీత్యా నాకు పరిపాలనా వ్యవహారాలపై అంత ఆసక్తి లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉండమంటే నాకు కుదరదని అప్పటి
ఉపకులపతికి చెప్పాను” అని ముఖ్యమంత్రికి నా అభిప్రాయం తెలియపరిచాను. ఆయన కాదు కాదు మీరే ఉండాలని పట్టు పట్టారు. అప్పటి మంత్రివర్గంలోని శ్రీ అయ్యపురెడ్డిగారు, శ్రీ భాట్టం (శ్రీ రామమూర్తిగారు స్వయంగా నా దగ్గరకు వచ్చి “మీరంగీకరించాలి. చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మీరుంటే బాగుంటుంది” అని అన్నారు. వారిపట్ల గౌరవభావంతో నేను అంగీకరించాను. కాకతాళీయంగా అది నాకు యాభై
ఒక సంవత్సరాలు పూర్తయిన ఘట్టం. ‘స్వర్గోత్సవ సభి సందర్భంగా గేయం రాసాను. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆ గేయంలో నేను ప్రసంగించబోయే అంశాలన్నీ పిండీకృతమయ్యాయి. ఆ గేయం ఇలా ప్రారంభమవుతుంది-

ఎవరికి ఈ సన్మానం

ఎందుకు ఈ సన్మానం?

చెట్టంతటి పేరొందిన

చిగురుకు ఈ సన్మానం.

అమ్మగ, సింగిరెడ్డి బు

చృమ్మగ కమ్మగ నను కని

పెంచిన మా హనుమాజీ

పేటకు ఈ సన్మానం.

అంటే సింగిరెడ్డి బుచ్చమ్మ నా తల్లి. హన్మాజీపేట మా వూరు. అందులో కన్నతల్లి, పుట్టిన ఊరు ఈ రెండు కలిపి చెప్పడం జరిగింది. ఇక తండ్రి గురించి చెప్పాలి. మాది వ్యవసాయ కుటుంబం. దాదాపు వంద ఎకరాల సేద్యం ఉండేది. ఇప్పుడు రెండెకరాలు మిగిలాయి. ఆ గేయంలో ఇంకా ఇలా అన్నాను.

వదుగురు పాలేర్లున్నా

పదరా అని మా నాయన

మల్లన దున్నిన రేగడి

మట్టికి ఈ సన్మానం.

“నీ యవ్వా అరే” అంటు
నీళ్లే నా గొంతుకలో
కవితలు న్వరవరిచిన వరి
కథలకు ఈ నన్నానం.

ఉర్జూనే విద్వార్థిగ
ఊపిరిలా వీల్చుకున్న
నాలో తెలుగును మలచిన
నాల్టుకు ఈ సన్మానం.

ఎంతపైకి ఎదుగుతున్న
ఇంకా పై కెదుగుమనీ
దీవించే నా వ్రీయ గుడు
దేవుల కీసన్మానం.

ఏ రుతువైనా నరాల

తీరాలను ఒరునుకునీ
పటి పాయలా ఉరికే
పాటకు ఈ నన్మానం.

నముద్రాలతో గీనిన
నరివాద్దులు చెరివివేసి
మనువుల ముజివేనీన నా
మాటకు ఈ నన్నానం.

అనుభవాల వెన్నముద్ద
లారగించిన్నా మననుకు
జిద్రంటని నారాయణ
రెడ్డికి ఈ నన్న్బానం.

పేరేమో సింగిరెడ్డి
నారాయణ రెడ్డి గాని
కులం కీళ్లు విరిచే నా
కలాని కీసన్నానం.

కులాల కీళ్లు విరిచాను అని ఎందుకన్నానంటే – నా బాల్యంలో మా వూళ్లో మాదిగవాడ ఉండేది. ఆ మాదిగ వాడకు వెళ్ళి ఒక మాదిగ కుర్రాడితో బాల్యంలో ఆడుకునేవాణ్డి. అప్పుడు అస్పృశ్యత భయంకర వ్యాధిలాగా ఉంది. ఇప్పటిలా కాదు. పైగా ఊళ్లో పెద్ద రైతు కొడుకుని నేను. అతను మాదిగ. అయితే అక్కడితో ఆగలేదు. ఎగిరి ఎగిరి దాహమేసి “దూపి అయి, మాదిగోల్ల బాయికాడ కుండతో చేదుకుని నీళ్లు తాగాను. పక్కనున్న మరో కులస్టుడు – నేను కాదు, మాదిగ కుర్రాడు కాదు – మధ్యలో ఉన్న అతను వెళ్లి మా అమ్మతో ఈ సంగతి చెప్పాడు. “అమ్మా! అమ్మా! బుచ్చవ్వా బుచ్చవ్వా! బాబు మాదిగోళ్ల నీళ్లు తాగిండు” అని. “అయ్యెయ్యో! ఎంత పనైపాయే. కులం జెడిపాయే” అని మా అమ్మ జానెడు రాగితీగ అంచును కొంచెం కాల్చి నా నాలుకపై పెట్టీ ‘ఇక పోయింది, ఇక పోయింది” అని ప్రాయశ్చిత్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన వాళ్లం. అందువల్లనే ఈ తరం వాళ్లకు “కులం కీళ్లు విరిచే నా కలానికీ సన్నానం’ అన్నాను. నేను పుట్టింది 29-07-1931 ఆషాఢ (గురు) పూర్ణిమనాడు. కరీంనగర్‌ జిల్లా,  వేములవాడ మండలం, హన్మాజీపేట గ్రామం. తండ్రి మల్లారెడ్డి, తల్లి బుచ్చమ్మ, ఇంటిపేరు సింగిరెడ్డి. నాకు పుట్టినప్పుడు పెట్టిన పేరు సత్యనారాయణరెడ్డి. ఎందుకంటే మా అమ్మకు చాలాకాలం వరకు సంతానం కలగలేదట. సంతానం కోసం కోమట్ల ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినపుడు నేను పుట్టానట. అందుకే నాకా పేరు పెట్టారు. సిరిసిల్లలో “వస్తానియా” మాధ్యమిక పాఠశాలలో మా నాయన నన్ను చేర్చించినపుడు
‘క్యా నామ్‌ హై?” అని అడిగితే, ‘సత్యనారాయణ రెడ్డి అని చెబితే. “చోటా నాం బోలో” అని సూచించాడు నాల్గో తరగతి అధ్యాపకుడు. “నారాయణరెడ్డి అన్నాడు మా నాయన. ఇంటి పేరు చెప్పమంటే సింగిరెడ్డి అని మా నాయన చెబితే ‘సి రఖో” అన్నాడు. నిజానికి “ఎస్‌” ఉండాలి ఇప్పటి లెక్కలో. కాని దానికి బదులు ‘సి’ వచ్చి చేరింది. మా హన్నాజీపేటలో పాఠశాల లేదు. ఒక ఖానిగి (ప్రైవేటు) పంతులు బడి నడిపేవాడు. ఇష్టముంటే పోవడం లేకుంటే ఊరుకోవడం. అక్కడే కొంతవరకు చదివాను. అప్పుడే కొన్ని పద్యాలూ అవీ పాదేవాణ్ణి. ఇక మాధ్యమిక స్థాయిలో నాల్లవ తరగతి నుంచి
సిరిసిల్లలోనే చదవాలి. మా వూరి చుట్టు పక్కల ఎక్కడా బడి లేదు. నిజాం పరిపాలన రోజులవి. సిరిసిల్లలో చదువు ఉర్దూ మాధ్యమంలోనే. తెలుగు ఒక ఐచ్చికాంశంగా తీసుకుని చదివాను. ఉన్నత పాఠశాల కోసం నేను కరీంనగర్‌ వెళ్లాను. అక్కడ ‘ఫోకానియా” అయిపోయింది. నేను ఏడవ, ఎనమిదవ తరగతులప్పుదే పద్యాలు రాయడం ప్రారంభించాను.

“ఒకనాడు ఒక నక్క ఒక అడవిలోపల
పొట్ట కోసర మెటో పోవుచుండె” అని రాశాను.

ఇది శతావధానులు శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన దూపాటి వెంకట రమణాచార్యులు గారి దృష్టిలో పడింది. ఆయన గొప్ప విద్వాంసుడు, విమర్శకుడు, మంచి ఉపాధ్యాయుడు. నా పక్కన కూర్చున్న విద్యార్థి “సార్‌! ఈయన మంచి పద్యాలు రాస్తాడు చూడండి” అని చూపించాడు. “ఒకనాడు ఒక నక్క అని యతులు కుదిరాయే” అన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ‘కా’ బదులు “కి పెట్టేవాణ్ణి. అంటే ‘కమ్మనైన వాణ్ణి గిన్నెలోపల” అన్నట్లుగా ఇక్కడ “గి బదులు ‘క ఉండాలి, కై ఉండాలి అని ఆయన చెప్పేవారు. “ఎట్లా రాస్తావోయ్‌” అని సహాధ్యాయులు అడిగేవారు. ‘రా అనేవారు కాదు. తెలంగాణాలో ఆ పదం వాడేవారు కాదు. సహాధ్యాయులంటే గుర్తుకొచ్చింది. ఉన్నత పాఠశాల స్థాయిలో వెలిచాల కొండలరావు, నేను సహాధ్యాయులం. ప్రార్ధన ఉండేది. అపుడు దీన్ని ‘దువా’ అనేవారు. ఆ దువా పాడేటపుడు మేం నిలబడేది. ఎత్తును బట్టి నిలబడాలి. మేం అప్పుడు చిన్నగా ఉన్నాం. నేను, కొండలరావు కీచులాడేవాళ్లం. నువ్వు చిన్నోడివి, కింద నిలబడు అనుకునేవాళ్లం. తర్వాత ఇంటర్మీడియట్‌లో చేరేందుకు హైదరాబాదుకు నచ్చాను. ఉర్జూ మాధ్యమం కాలేజి చాదర్‌ఘాట్‌లో వుంది. కనుక అక్కడ చేరాను. వేరే చోట ఇంగ్రీషు మాధ్యమం వుంది. ఉర్జూ మాధ్యమం నుంచి ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడంలో చాలా ఇబ్బందులుంటాయి. అందుకని ఇందులో సుఖంగా ఉంటుందని చాదర్‌ఘాట్‌ కళాశాల ఎంచుకున్నాను. చదువు ఉర్దూ మాధ్యమంలోనే సాగింది. తెలుగు ఒక పాఠ్యాంశం మాత్రమే. అప్పుడే నేను (శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో తొలిసారిగా ఆధునికాంధ్ర మహాకవుల రచనలు చదివాను, రాయప్రోలు, గురజాడ, కృష్ణశాస్త్రి, జాషువా, కరుణశ్రీ, గ్రీశ్రీ భావకవుల, అభ్యుదయ కవుల రచనలు చదివాను. ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు ఇరివెంటి కృష్ణమూర్తి నా సహాధ్యాయి. చాలా ఆత్మీయుడు, గొప్పవాడు- ఇప్పుడు లేడు. అప్పుదే మా సహాధ్యాయుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ జీవన్‌రెడ్డి గారు ఒకరు. చాలామంది రాజకీయ నాయకులయ్యారు. పి.రామచంద్రారెడ్డి మాజీ సభాపతి, యం. బాగారెడ్డి మాజీమంత్రి, యం. నారాయణ రెడ్డి పార్లమెంట్‌ సభ్యులు, సి. జగన్నాథరావు ఉపముఖ్యమంత్రి- నేనొక్కడినే సాహిత్య రంగం ఎంచుకున్నాను. ఆ రోజుల్లో నేను ఆశువుగా పాటలు చెప్పే వాడిని. అప్పుడే “బర్బాత్‌ సినిమా వచ్చింది.

‘బర్బాత్‌ మే హమ్‌ సె మిలే తుమ్‌ సజన్‌ సెమిలే హమ్‌ బర్బాత్‌మే,

దీనిని “జడివానలో నాతో నీవు నీతొ నేను కలిసిపోదమా, జడివానలో” అన్నాను.

“ప్రీత్‌ నే సింగార్‌ కియా మై బనె దుల్దన్‌” (పేమ నన్నలంకరించ పడుచునైతిని’”

‘గాయ్‌ చలేజా, గాయ్‌ చలేజా ఏక్‌దిన్‌ తేరఖీ జమాన అయేగా’ ‘పాట పాడుబే,

పాటపాడుబే ఒక్కనాడు నీదిభీ బొక్కలిరుగుబే’ అన్నాను. బొక్కలంటే ఆంధ్ర ప్రాంతంలో ‘రంధ్రాలు” అని అర్థం. తెలంగాణాలో దీని అర్థం “ఎముకలు” తర్వాత బి.ఏ, ఎం.ఎ పూర్తి అయ్యాయి. ఇక పి.హెచ్‌డి. చేయాలి. బి.ఏ.లో ద్వితీయభాషగా హిందీ తీసుకున్నాను. తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడింది నాకు. “ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు -ప్రయోగములు” నా పరిశోధన విషయంగా ఎన్నుకున్నాను. ఇది ఎలా జరిగిందంటే – దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవులు. 1957 ప్రాంతంలో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడక ముందు వేంకటేశ్వర కళాశాల అనేది ఉండేది. అక్కడికి మమ్మల్నిద్దరినీ పిలిచారు. తెలుగుభాష గురించి మాట్లాడమని తెలుగు సంఘం వారు కోరారు. కార్యక్రమం అయిపోయింది. అలా కొండపైన నడుస్తున్నాం మేము. అలా నడిచిపోతుంటే నన్ను గుర్తించే వారెవరు? అప్పుదప్పుడే పైకొస్తున్న వాజణ్డి. కృష్ణశాప్రి
గారిని ‘మీ పక్కనున్నది మీ కుమారులా’ అని ఒకరు అడిగారు. “అలా కనిపిస్తున్నామా! అయినా దీనివల్ల (జుట్టును చూపిస్తూ) అనిపిస్తున్నామేమో!” అని అన్నారు వారు. జుట్టేకాదు సరుకు కూడా ఇద్దరిదీ ఒకటే. ఆయన పెద్దవాడు. నా కంటే 25-27 ఏండ్లు పెద్దవాడు. “ఏం చేస్తున్నారు?” అని నన్ను అడిగారు. అప్పుడు పి. హెచ్‌డి. చేయాలనుకుంటున్నాను అన్నాను. “ఏ సబ్దక్టు?” convention and revolt in modern telugu poetry అని పెట్టండి. “convention and revolt in modern english poetry అనే పుస్తకం వచ్చింది చూడండి” అన్నారు. ఆ తర్వాత అది నేను చదివాను.
convention అంటే సంప్రదాయము, revolt అంటే ‘తిరుగుబాటు’ అనే అర్థాలున్నాయి.
tradition and experiment in modern telugu poetry అని అంటే బాగుంటుందేమో” అని ఆయనతో అన్నాను. ఆయన ఆమోదించారు. ఆ దృష్టితోనే అధ్యాపకుడిగా ఉంటూ “ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు- ప్రయోగములు” అనే అంశంపై పరిశోధన చేశాను. అది ఆధునికాంధ్ర కవిత్వము మీద సమ[గ్రస్థాయిలో జరిగిన పిహెచ్‌.డి. గ్రంథం అని పేరుపొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాలలో మా అధ్యాపకులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, శ్రీ కె. గోపాలకృష్ణారావు గారు, శ్రీ పల్లా దుర్గయ్య గారు, శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు. ఆ తర్వాత అధ్యాపకుడిగా అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా! డి.ఎస్‌.రెడ్డి గారు నన్ను ఎంపిక చేసుకున్నారు. సికింద్రాబాదు ఆర్హ్సు- సైన్సు కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా వెళ్ళాను. తర్వాత నిజాం కళాశాలకు బదిలీ అయింది. అక్కడ అధ్యాపకుడిగా పని చేశాను, రీడర్‌గా చేశాను. తర్వాత తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చేశాను. ప్రొఫెసర్‌గా పని చేశాను. ఇంకా పదకొండు సంవత్సరాలు పదవిలో కొనసాగే వీలుంది. ఇంతకు ముందు (ప్రస్తావించినట్టు ముఖ్యమంత్రి అంజయ్యగారు నన్ను అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా నియమించారు.  అధ్యాపకరంగం నుంచి పాలనారంగంలోకి వచ్చాను. నా భార్య శ్రీమతి సుశీల. దివంగతురాలు. ఆమె స్మృత్యర్థం “శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టును స్థాపించాను. ప్రతి సంవత్సరం ట్రస్టు ఉత్తమ రచయిత్రికి రూపాయల పదివేలతో ప్రారంభమై ఇప్పుడు యాభై వేలు పురస్కారంగా అందజేస్తుంది. ఆమె పేరిట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్వర్ణ పతకాలను ఏర్పాటు చేశాను. నాకు నలుగురూ కుమార్తెలే. ‘కొడుకు పుట్టాలె, కొడుకు పుట్టాలే’ అని మా పెద్దలు అనవసరంగా ఆశలు పెట్టుకుంటే అందరూ కూతుళ్లే పుట్టారు. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, కూతుళ్లు కాబట్టి అందరూ నా మనసుకు అనుకూలంగా ఉన్నారు. కొడుకులయితే
ఒకరు అమెరికా, ఒకరు ఆస్టేలియా వారి ఇష్టంగా వెళ్లేవారు. కుమార్తెల పేర్లు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. ఈ చతుర్వేణులు నా కూతుళ్లే. అల్లుళ్లు భాస్కరరెడ్డి, సురేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి. అప్పుడప్పుడు సరదాగా దేవుళ్ల గురించి ప్రస్తావన వచ్చినపుడు అనుకుంటాను- అల్లుళ్లే నా దేవుళ్లని, ఎందుకంటే కూతుళ్లకు అనుకూలంగా ఉంటూ నేనున్న ఇంట్లోనే కింది అంతస్తు నుంచి మొదలై మొదటి, రెండు అంతస్తుల్లో వారి వారి గదుల్లో ఉంటున్నారు. కూతుళ్లు, మనుమలు, మనుమరాండ్రు కలుపుకుని మొత్తం ఇరవైమంది ఒకే ఇంట్లో వుంటున్నాం. ఇద్దరు, ముగ్గురు విదేశాలకు వెళ్లే వారున్నారు. అది వేరే సంగతి. ఇక మునిమనవరాలు ‘వరేణ్య”’ బాల ఆంగ్ల కవయిత్రి. ఇటీవలే అమె పుస్తకం ఆవిష్కరింపజేశాం. ఆమె రచించిన “tender rays ఆంగ్ల కవితా సంపుటిని “లేత కిరణాలు” అని అనువాదం చేశాను నేను. అమ్మాయి ఆంగ్లంలో
రాయడానికి కారణం పుట్టింది అమెరికాలో, పెరిగింది అమెరికాలో. పదవుల ఇక విషయానికొస్తాను.

అధికార భాషా సంఘ అధ్యక్షతలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. తొలిసారిగా మూడుకోట్ల రూపాయలు వ్యయంతో పద్వాలుగు వేల తెలుగు టైపు రైటింగ్‌యంత్రాల సేకరణ చేశాం. ఒకేసారి ఇన్ని యంత్రాలు కొనుగోలు చేయడం భారతీయ భాషల్లో రికార్డుగా నిలిచింది. నలభై ఐదుకు పైగా ప్రభుత్వ శాఖల పదకోశాలను రూపకల్పన చేశాం. కార్యాలయ పదావళి, నమూనా లేఖలను ప్రచురించాం. రాష్ట్రమంతటా విస్తారంగా పర్యటన జరిపి తెలుగు వాడకం పట్ల ప్రజలలో, ఉద్యోగులలో అవగాహన పెంచగలిగాం. జిల్లా స్థాయిలో అమలు నేనున్నప్పుడు 75% వరకు పెరిగింది.  ర్యాలయాలు తెలుగును అధికంగా వినియోగించాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా వుందో అందరికీ తెలిసిందే? కాన్వెంటు స్మూళ్లలో (ప్రాథమిక స్థాయిలో తెలుగు మాట్లాడితే కొట్టడం, వారికి శిక్షా సూచకంగా అట్టమీద రాసి వారి మెడలో వేయడం వంటి భయంకర దుఃస్థితి ఏర్పడింది. ఈ దశ తెలుగు భాషకు ఏనాడు ఏర్పడలేదు. చెప్పేవాళ్లు చెప్తూనే ఉన్నారు. చేసేవాళ్లు మానడం లేదు. ఇది శోచనీయం. దీన్ని ప్రభుత్వం దుమ్ము దులపాలని కోరుతున్నాను. తెలుగు రోజు రోజు క్షీణించి పోతోంది. ఇది కార్యాలయాలలో మాత్రమే కాదు, విద్యారంగం ప్రాథమిక దశ నుంచీ జరుగుతోంది.

అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి నడుస్తోంది కదా? అనుకున్నాను. అప్పటి ముఖ్యమంత్రి డా॥ ఎన్టీ రామారావు గారు “ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా ఉండాలి. అది ప్రాథమిక దశలో ఉంది” అన్నారు. డా.జి.రామిరెడ్డి గారి తర్వాత రెండో ఉపాధ్యక్షుణ్జి. ప్రస్తుతం అది డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయమైంది. దానిని నేను 1985 నుంచి 1989 వరకు నాలుగు సంవత్సరాలు నిర్వహించాను. అప్పుడు సాధించిన కొన్ని ఫలితాలు పేర్కొంటాను. జూబ్లిహిల్స్‌లోని 54  ఎకరాల స్థలం కేటాయింపు పొందడం నా కాలంలో జరిగినందుకు సంతోషిస్తున్నాను.
ఇప్పుడు అది ‘“వికాస్‌నగర్‌’గా మారింది. జాతీయ స్థాయిలో విశ్వ విద్యాలయానికి 55 అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశాం. అప్పుడు విద్యార్థుల సంఖ్య 50 వేలు దాటింది. ఇప్పుడు ఇంకా అధికమై ఉంటుంది. విశ్వవిద్యాలయం ఆరుబయలు స్ధలంలో 1987 మార్చిలో ప్రథమ స్నాతకోత్సవం నిర్వహించాం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పాఠక్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పిమ్మట ఎన్టీ రామారావు గారు 1989 నుండి 1992
వరకు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్స్‌లర్‌గా నన్ను నియమించారు. ఇక్కడ కూడా నేను రెండవ వైస్‌ ఛాన్స్‌లర్‌నే. మొదటి వైస్‌-ఛభాన్స్‌లర్‌గా ఆచార్య తుమాటి దొణప్పగారు, తర్వాత నేను. తెలుగు విశ్వవిద్యాలయానికి యూ.జి.సి. గుర్తింపు తీసుకురాగలిగాను. దానివల్ల చాలా ప్రయోజనాలు చేకూరాయి. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం, భవన ప్రవేశం నేనున్నప్పుదే జరిగింది. కూచిపూడిలో
కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకొచ్చాం. 1989లో ప్రథమ స్నాతకోత్సవం నిర్వహించాలనీ నిర్ణయించాం. అప్పటికింకా యూ.జి.సి గుర్తింపు రాలేదు. యూ.జి.సి గుర్తింపు రాకపోతే విశ్వవిద్యాలయానికి గవర్నరు బదులు ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా ఉంటారు. అప్పుడు నటమూర్దన్యులు ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారే ఛాన్స్‌లర్‌ స్థానంలో ఉన్నారు. మొదటిసారి స్నాతకోత్సవం కొత్తదనంగా ఉండాలని మేమిద్దరం కూర్చొని ఆలోచించాం. తెలుగుదనం కావాలనుకున్నాం. ముట్నూరి కృష్ణారావు గారి తలపాగా నమూనా తీసుకుని రామారావుగారికి చూపించాను. అప్పుడు ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం ఇద్దరి తలపాగాలు కలిపి రామారావు గారు కొత్త
తలపాగా, గౌను కాగితం పై వేసి చూపారు. ఉపరాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మగారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండవ స్నాతకోత్సవం విశేషమేమిటంటే నాటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన తెలుగులో ప్రసంగించారు. “ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే” అనే నానుడి తీసుకుని “నేను తెలుగువాడిని కాబట్టి, తెలుగు విశ్వవిద్యాలయం కాబట్టి నేను వచ్చాను” అని చెప్పారు. తెలుగు విశ్వ
విద్యాలయంలో నిర్వహించిన మరికొన్ని ముఖ్య కార్యక్రమాలు – ‘వీడియో డాక్యుమెంటేషన్‌ అనేది ఒకటి కొత్తగా చేపట్టాం. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి గారి ద్వారా ఇరవై లక్షల రూపాయల గ్రాంటు పొంది ముప్పైమంది ప్రముఖులపై “వీడియో డాక్యుమెంటేషన్‌ చేయించాం. ఇక ఆ పని నేటి వి.సి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య చూసుకోవాలి. పరిష్కృత విజ్ఞాన సర్వస్వ సంపుటాలతో పాటు 150 పైగా ఉత్తమ [గ్రంథాల
ప్రచురణ జరిగింది. మరొక విశేషం 1990 మార్చిలో మూడు రోజుల పాటు బెంగుళూరులో ‘మూడవ అఖిల భారత తెలుగు మహా సభలు” తెలుగు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించాం. అక్కడ ఎం. రాధాకృష్ణరాజు మొదలైన వారి సహకారం పొందాం. నాటి ముఖ్యమంత్రి డా. మళ్ళి చెన్నారెడ్డి గారి ప్రోత్సాహంతో తెలుగు విశ్వవిద్యాలయం 1990 చివర్లో మారిషస్‌లో “మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు” నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున మారిషన్‌లో జరపడం విశేషం. విశ్వ విద్యాలయ పక్షాన ‘విశిష్ట పురస్కారం” ఏర్పాటు చేశాం. దీనికింద స్వీకర్తకు యాఖై వేల రూపాయల నగదు లభిస్తుంది. ఆ కాలంలో యాఖై వేలు అంటే ఎంతో గొప్ప. మొట్ట మొదట యాఖై వేల రూపాయలతో డా॥ బోయి భీమన్న గారిని సత్మరించాం. సాహిత్యరంగంలో, కళారంగంలో, సాంస్కృతిక రంగంలోనే గాక సినిమా రంగంలో కూడా ‘దాక్టరేటో ఇవ్వడం మొదలు పెట్టాం. సినిమా రంగంలో “డాక్టరేట్‌ ఇచ్చింది గుమ్మడి వెంకటేశ్వరరావు మహానటునికి. నేను తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షునిగా
ఉన్న కాలంలో రెండు నెలలకు పైగా కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి ఉపాధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించాను. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు బాగా సన్నిహితులు. ఆయన ‘మరొక పదవీకాలం కొనసాగుతారా విశ్వ విద్యాలయానికి” అన్నారు. “వద్దండి- చేసిన పనిని చేయను నేను అనినా సమాధానం. పిమ్మట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో “భాషా సాంస్కృతిక వ్యవహారాల
సలహాదారు” పదవిని చేపట్టాను. ఎప్పటికప్పుడు భాషా సాంస్కృతిక వికాసాలపై ప్రభుత్వానికి సూచనలు చేశాను. ఒక ముఖ్య సూచన గురించి తప్పక చెప్పాలి. అది రాజధానిలో కళానికేతన్‌ నిర్మాణ పథకం. ఇది సర్వాంగీణ కళాప్రాంగణం వంటిది. అధునిక దృశ్య ఛవణ సాంకేతిక విజ్ఞానం నింపుకున్నది. చరిత్ర, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్చకళ, జానపద, గిరిజన కళాభాగాలు, ప్రదర్శన శాలలు, రంగస్థలాలు, డాక్యుమెంటేషన్‌ విభాగాలు మొదలైనవి దీనిలో ఉంటాయి. ఇలాంటివి భోపాల్‌, కొచ్చిన్‌ మొదలైన చోట్ల భిన్న భిన్న రూపాలలో ఉన్నాయి.

ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్ష పదవి ఇచ్చారు. అది కేబినెట్‌ హోదాలో వుంది. 1997 నుంచి 2004 వరకు ఈ పదవీ బాధ్యతలు నిర్వహించాను. ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలు జరిపాం. ముఖ్యంగా సాంస్కృతిక విధానంపై జాతీయ సదస్సు జరిపాం. జాతీయ విధానమనేది ఒకటి ఉండాలని ప్రత్యేక సదస్సు నిర్వహించాం. రాష్ట్రంలోని
75 ప్రముఖ సంస్థలు సాంస్కృతిక వికాసానికి 108 సూచనలు చేశాయి. ‘హంస పురస్కారాలు రూపొందించాం. హంస నీరక్షీర న్యాయానికి మరో పేరు. కాబట్టి వికాసానికి ప్రతీక హంస. సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్చం, జానపద గిరిజన కళలు వంటి రంగాలన్నింటిని ఈ పురస్కార పరిధిలోకి తీసుకు వచ్చాం. ‘హంస పురస్కారానికి ఆ రోజుల్లో ముప్ఫైవేల రూపాయలు నగదు, బంగరు పూతతో ఉన్న హంస ప్రతిమ, ప్రశంసాపత్రం, శాలువా లభించాయి. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం క్రమంగా అందించాను. కాలం మారింది కదా! ఇప్పుడు హంసకు బదులు “కళారత్న! అని పేరు పెట్టారు. అది వారి ఇష్టం – మనం కాదనం. ఇక నవల, కథానిక, పద్యం, గేయం, వచన నాటకం, సాహిత్య విమర్శ, ప్రసార
మాధ్యమ రచనా విధానాలు – ఈ ప్రక్రియల్లో అధ్యయన శిబిరాలు నిర్వహించాం. ఇవికాక ముఖ్యమైనవి రెండున్నాయి. ఇవి నా ఊహతో జనించినవి. ‘సమైక్య రాగాత్మ’- రాగాల ధోరణులు వేరైనా, వ్యక్తీకరణ విధానాలు వేరైనా, ఆత్మ ఒక్కటే”. ఒకే వేదికపైన ఒక కర్నాటక విద్వాంసుడు, ఒక హిందుస్థానీ గాయకుడు, ఒక అరబిక్‌ గాయకుడు, ఒక పాశ్చాత్య సంగీత నిపుణుడు- నలుగురిని కూర్చోబెట్టి మొట్టమొదట ఒక జానపద
గీతం పాడించాను. జానపద గీతం పాడించి అందులో రాగమేముందో కర్నాటక సంగీత గాయకుడు లక్షణాలు వివరించి వినిపిస్తాడు. ఎంతో విద్యాత్మకంగా ఉంది ఆ కార్యక్రమం. మళ్లీ ఎక్కడా రాలేదు. చూద్దాం! ఎవరైనా చేస్తారేమో! తెలుగు విశ్వ విద్యాలయమే చేయాలి ఇవన్నీ- తెలుగు విశ్వవిద్యాలయం అన్ని కళలకు సంబంధించింది కాబట్టి. ఈ కార్యక్రమంలోని విశేషమేమంటే ఉదాహరణకు-

ఉ… బండెన్క బండిగట్టి…. ఓ చిన్నారి లచ్చు”

ఇందులో రాగం కనుక్కోవాలి. కర్నాటక సంగీతంలో పాడాలి. నూకల చిన సత్యనారాయణ ప్రధాన పాత్ర వహించారు. తర్వాత గాయకులు దాన్నందుకుని హిందుస్టానీలో పాడాలి. అదే రాగంలో పాశ్చాత్య సంగీతంలో పాడాలి. ఈ రకంగా సరదాగా నేను చెబుతున్నా దీని వెనక ఎంతో కృషి వుంది. అంటే ఒక జానపద గీతంలోని రాగం, కర్నాటక రాగం, హిందుస్థానీ రాగం, అరబిక్‌ రాగం, పాశ్చాత్యం వీటి మూలాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన అపూర్వ సంగీత కార్యక్రమమిది. “లయ సంగమం అని మరొకటి ఉంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు డా॥ యొల్లా వెంకటేశ్వరరావు
సహకారంతో ఈ కార్యక్రమం జరిపాం. ఇందులో అన్నీ చర్మవాద్యాలే ఉపయోగించాలి. ఇప్పుడొస్తున్నవన్నీ ష్షాస్టిక్కులే. అసలు చర్మవాద్యాలు (తోలు డప్పులు) తీసుకురమ్మన్నాను. చర్మ వాద్యాల్లో రకరకాలున్నాయి. డప్పు, డోలు, కంజర, రుంజు, మృదంగం వంటి పది చర్మ వాద్యాల లయగతుల సమ విన్యాసం చూపించాం. పద్య నాటకోత్సవాలు జరిపాం. గిరిజన భాషా సాహిత్యాలపై సదస్సు ఏర్పాటు చేశాం. రాష్ట్ర స్థాయి చిత్ర లేఖన శిల్ప
కళల పోటీలు నిర్వహించాం. నేను రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఉండగానే అనుకోకుండా భారత రాష్ట్రపతి నన్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ చేశారు. దీని కాలపరిమితి ఆరు సంవత్సరాలు. సంగీతం, సాహిత్యం, నాటకం, నటన, పత్రికా రంగాల నుంచి లబ్ది ప్రతిష్టులైన వారిని నామినేట్‌ చేస్తారు. దక్షిణ భారతంలోనే జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవిని అప్పట్లో వున్నది నేనొక్కణ్నే కావడం వల్ల నామినేట్‌ చేశారని తర్వాత తెలిసింది. అప్పటి ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్‌ గారు ఈ సంగతి నాతో చెప్పారు. నాతో పాటు దా. రాజారామన్న (విజ్ఞానశాస్త్రం), షబానా ఆజ్మీ (చలన చిత్రరంగం), కులదీప్‌ నయ్యర్‌ (పత్రికారంగం)- ఇంకా కొందరున్నారు. రాజ్యసభలో నేను క్రియాశీల సభ్యుడిగా కృషి చేశాను. రాజ్యసభ సభ్యత్వం
పదవీకాలంలో క్వశ్చన్‌ అవర్‌లో మొత్తం 624 ప్రశ్నలు వేశాను. అందులో ప్రధాన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి పేర్కొంటాను. గాంధీజీని న్యూనపరుస్తూ ‘మాక్సిమ్‌” అనే పత్రిక ఒక కథనం ప్రచురించింది. గాంధీజీని వ్యక్తిగతంగా అగౌరవ పరిచే రీతిలో రాశారు. నాకు ఒళ్లుమండి సభ దృష్టికి తీసుకొచ్చాను. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సాంస్కృతిక వికాసానికి దోహదకరంగా ఆర్థిక సహాయం చేసే నిమిత్తం “సాంస్కృతిక నిధి ఏర్పాటు చేయాలని సూచించాను. కంప్యూటర్‌ భారతీయ భాషలలో వినియోగం గురించి అడిగాను. వైద్య కళాశాలలో శిక్షణ పొందకుండా దొంగ సర్దిఫికేట్‌లతోనో, మరొక విధంగానో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యుల ఆటకట్టించాలన్నాను. సంస్కృత భాషా వ్యాప్తికి తోద్బడే నిమిత్తం కేంద్ర విశ్వవిద్యాలయాలలో సంస్కృత పీఠాలను పెట్టమని చెప్పాను. ఇతర
దేశాలలో తెలుగు వారికోసం ఆకాశవాణి ప్రసారాలను నిర్వహించాలని కోరాను. “స్పెషల్‌ మెన్షన్‌’ అనేది ఒకటుంది. అదే (ప్రత్యేక ప్రస్తావన. దీనిని రాతపూర్వకంగా ఇవ్వాలి. 32 సార్లు ప్రస్తావన చేశాను. దీనిలో వాచవిగా కొన్ని ఉదాహరిస్తాను. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గాంధీజీ చదివిన “ఆల్రైడ్‌ హైస్కూల్‌ దుస్థితి. దాని పేరు ఇప్పుడు మోహన్‌దాస్‌ గాంధీ హైస్కూల్‌. ఇందులో ఉన్న పద్ధెనిమిది గదుల్లో పది గదులకు తలుపులు, కిటికీలు లేవు. ప్రార్ధనా మందిరాన్ని పనికిరాని వస్తువులుంచేటందుకు వాడుతున్నారు. నేను దానికి యం.పి. లాడ్స్‌ (నిధుల) నుంచి రూపాయలు ఐదులక్షలు ఇస్తానని సభాముఖంగా ప్రకటించి, ఇచ్చాను. రాజ్యసభ సభ్యునిగా ఎం.పి లాడ్స్‌ నిధుల కింద రూపాయలు పదకొండున్నర కోట్లు నాకు కేటాయించారు. నామినేటెడ్‌ మెంబర్‌ అయితే భారతదేశంలో ఎక్కడైనా సంస్థలకు ఈ నిధి నుంచి ఇవ్వవచ్చు. మిగతా సభ్యులకు, లోకసభ సభ్యులకు వాళ్ల నియోజక వర్గాలకే పరిమితమై ఉంటుంది. అలా నేను సద్వినియోగం చేసుకున్నాను. ప్రత్యేక ప్రస్తావనలో ముఖ్యమైనవి కొన్ని తెలియజేస్తాను. ఒరిస్సా రాష్టం కటక్‌లో నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టి పెరిగారు. నిజానికి అతనిది బెంగాల్‌. ఆయన జన్మించిన ‘జానకీనాథ్‌ భవనం దుఃస్థితిని స్వయంగా చూశాను నేను. ఈ భవనాన్ని పునరుద్ధరించాలని ప్రత్యేక ప్రస్తావనలో కోరాను. నా ఎం.పి.లాడ్స్‌ నిధుల నుంచి తర్వాత రూపాయలు పది లక్షలు కేటాయింపు ప్రకటించాను. నేటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, రాజారామన్న చిత్తరంజన్‌, టి.ఎస్‌. చతుర్వేది, విదుత్తలై విరుంచి మొదలైన ప్రముఖులు నా ప్రస్తావనను బలపరిచారు. ఇంకొక ప్రస్తావన చాలా ముఖ్యమైనది. నేను ‘ఆస్ట్రేలియా తెలుగు సంఘం” అహ్వానిస్తే ఆస్టేలియా పర్యటనకు వెళ్ళాను. ‘మెల్‌బోర్స’ సమీపంలో “గోల్డ్‌ మ్యూజియం” చూశాను. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలపై లక్ష్మీదేవి చిత్రాలున్నాయి. వాటి గురించి తెలిపే అసభ్యకర వివరణ ఉంది. “సెన్సువస్‌ లక్ష్మి “సెడిక్టివ్‌లక్ష్మి’ అంటే సమ్మోహనకరమైన లక్ష్మి, పంచేంద్రియాలను రెచ్చగొట్టే లక్ష్మిగా వర్ణించారు. రాసినవాడి దృష్టిలో “లక్షి అంటే రంభ, ఊర్వశి అనుకున్నాడు. దేవత అని జగన్నాత అని, తెలియదు. ఇది నేను
చెబితే రాజ్యసభలో సభ్యులు సమర్థించారు. ఇలా నెల తిరుగక ముందే ఆ రాతలు తీసేసి “గాడెస్‌ అని రాసుకున్నారు. ఇందులో విశేషమేమంటే రాజ్యసభకు నేను సాహిత్య ప్రతినిధిగా వెళ్ళాను. కనుక సంస్కృతి పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి. మరో ప్రస్తావనలో భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరాను. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్ర గ్రామంలో ఆయన గృహాన్ని నేడు ‘పశువుల పాక’గా వాడుతున్నారు. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా గుర్తించి, జీర్టోద్ధరణ చేయాలని సూచించాను. తర్వాత అమలు జరిగిందని తెలిసింది. మాతృభాష నిర్బంధ బోధనపై బిల్లు ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదన విద్యార్థి చదివే భాషల్లో మాతృభాష తప్పక ఉండాలని నిబంధిస్తుంది. అప్పుడు నేను ఏదో కొండంత ఆశతో ప్రతిపాదించాను. కొండలకే రంధ్రాల్లాగా ఏర్పడి ఇప్పుడు మాతృభాష పరిస్థితి ముందే చెప్పినట్లు తెలుగులో
మాట్లాడితే దెబ్బలు తినడం, అదీ ఆంధ్రప్రదేశంలోనే కావడం- అంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి లేదు.

అధికార భాషా వ్యవహారాల సంఘం, శాస్రీయ సాంకేతిక, పర్యావరణ సంఘం వంటి కొన్ని పార్లమెంటరీ సంఘాలలో నేను సభ్యునిగా ఉన్నాను. వీటి పనిలో భాగంగా భారతదేశంతో పాటు, విదేశీ పర్యటనలు కూడా చేశాం. ‘మొరాకొలో 2003లో జరిగిన ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సమావేశాల్లో భారత ప్రతినిధి వర్గ సభ్యునిగా పాల్గొన్నాను. పారిస్‌లోని యునెస్కో కార్యాలయం సందర్శించి హైదరాబాద్‌ నగరానికి
ప్రపంచ వారసత్వ నగరం ప్రతిపత్తి ౪//0॥16 1612869 512145 ఇవ్వాలని కోరుతూ నగర ప్రాచీనత్వం గురించి వివరించాను. ఎం.పి. లాడ్స్‌ కింద నాకు పదుకొండున్నర కోట్లు ఇచ్చారని ఇంతకు ముందు చెప్పాను. వీటిని సద్వినియోగం చేశానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. వీటిని సక్రమంగా అనేక సంస్థలకు కేటాయించాను. ‘సద్వినియోగం’అని ఎందుకంటున్నానంటే నా కళ్లముందే తోటి లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు “మీకు 10% ఇస్తాం, ఫలానావారికివ్వండి” అని చెప్పి బేరాలాడిన మహానుభావులున్నారు. అంతకంటే భయంకరమైనది. మరొకటి లేదు. ఆ రూపాయలు పదకొండున్నర కోట్లు నుంచే ఇరవై యైదు లక్షలు “ఆంధ్ర సారస్వత పరిషత్తులో భవన నిర్మాణానికి అందించాను. పరిషత్తు
నిజాం పరిపాలనలో వెలసిన తెలుగు భాషా సంస్థ. ఒరిస్సా వరద బాధితులకు కొంత ఇచ్చాను. గుజరాత్‌ భూకంప బాధితుల సహాయనిధికి మరికొంత ఇచ్చాను. షోలాపూర్‌లోని పద్మశాలీ విద్యా సంస్థ భవన నిర్మాణానికిచ్చాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘“నీరు-మీరు” అనే పథకానికి, కరీంనగర్‌లోని “సారస్వత సదనం’కు బోయినపల్లి వెంకటరామారావు కోరిక మీద రూపాయలు పది లక్షలు ఇచ్చాను. వేములవాడలో భవనానికి, సిరిసిల్లలో మున్సిపల్‌ ఆడిటోరియానికి, కరీంనగర్‌ మట్టేపల్లిలో అంబేద్కర్‌ కమ్యూనిటి భవన నిర్మాణానికి నిధులిచ్చాను. అన్నీ సమదృష్టితో చేశాను. గాంధీని, అంబేద్కర్‌ను సమదృష్టితో చూశాను. వంశీ రామరాజు నిర్వహిస్తున్న ‘వేగేశ్లు వికలాంగుల సంస్థకు రూపాయలు 40 లక్షలు ఇచ్చాను. భవన నిర్మాణం జరిగింది. కడపలో సి.పి.బ్రౌను గ్రంథాలయ భవన నిర్మాణానికి నేనిచ్చిన నిధులతో ఒక ప్రత్యేకమైన భవనమే ఏర్పడింది.

ఇక నా సాహితీ ప్రస్థానంలో రచయితగా కొన్ని దశలు చెపుతాను. నా ప్రసంగం ప్రారంభంలో దీనిని ప్రస్తావించాను. నేను హైస్ఫూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే పద్య నాటకాలు రాశాను. “ప్రహ్లాద చరిత్ర ఎక్కడ పోయిందో తెలియదు. అలాగే సీతాపహరణం) అనే నాటకం రాశాను. అదెక్కడ పోయిందో తెలియదు. “భలే శిష్యులు” సాంఘిక నాటిక రాశాను. ఇవన్నీ మావూళ్లో ప్రదర్శించే వాళ్లం. నేనూ పాత్ర ధారణ చేసేవాణ్ణి మొట్ట
మొదట. నేను పద్యరచన చేశాను. పల్లా దుర్గయ్యగారు నా పద్యాలు విన్నారు. “ఏమిటి రెడ్డి ఏం రాశావు? అంటే అది “అసిత వారివాహ చృ్చటావృతమయి బుగులు గొల్పుచు పొగరేగా గగనసీమ” అని అన్నాను. “అసిత వారి వాహచ్చటావృతమయి ఎందుకు రెడ్డీ? ఇంత పెద్ద సమాసం మాకే అర్థం కాలేదు” అన్నారు. ఆ వరుసలో నేను పద్యాలు రాస్తూ దాశరథికి అంకితం చేసిన “జలపాతంలో పద్యాలు పుంఖాను పుంఖాలుగా చేర్చాను.

“దాశరథీ! మనోజ్ఞ కవితాశరథీ శరదిందు చంద్రికా

పేశల కావ్య ఖందముల విండిన నీ కలమందునన్‌ మవో

అశని పాతముల్‌ వెలయునౌరో మహేశుని కంటిలో నుధా

రాశి తరంగముల్‌ పటు వోలవాల కీలలు పొంగినట్లుగా”

అంటూ దాళరథికి అంకితం చేస్తూ వద్యాలు రాశాను. ఆ వరుసలోనే

“అన్నలు లేని చింత పృాదయాంతిక మందు జనింపలేదు నా
కెన్నదు; పైకి నవ్వు టనరించి విషమ్మును దాచు దొంగ నా

గన్నుల గుండియల్‌ బెదరగ్యా కవితాధ్వజ మెత్తినట్టి తె
ల్లన్నలు అన్నలౌదురు నుమా! నను కన్నులలోన నిల్బగన్‌”

ఇలా సాగి పోయింది నా పద్యధార.

నా కంటె ముందు జాషువ, విశ్వనాథ, రాయప్రోలు, కరుణథ్రీ, దాశరథి వంటి వారు పద్య రచనలో ఉద్దండులైన వారున్నారు. నేను గేయాన్నెన్నుకున్నాను. నా “నాగార్జున సాగరం’ కావ్యం ప్రప్రథమ కథాత్మక గేయ కావ్యం అని డా॥ తిరుమల ్రీనివాసాచార్యుల వంటి విద్వాంసులు, విమర్శకులు చెప్పారు. ఇక ఇందులో కూడా సమాసాలు పెట్టాను.

“ఇక్ష్వాకు వంశ క్షి

తీంద్ర చంద్రుల కీర్తి

కొముదులు నల్లడల

కలయ విరిసిన నాడు;

కృష్ణవేణీ తరం

గిణి పయఃకింకిణులు

్రిశరణ క్వాణాల

దెసల నింపిననాడు;

నేను జీవించి యు

న్నానంచు భావించి

పలికింతు గేయ కా

వ్యమును హృదయము పెంచి” అన్నాను.
ఇప్పుడైతే ఇంతగా ప్రాఢ నమాసాలు వాడను. నా కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయుడు కథాత్మ గేయ కావ్యాలు. ప్రపంచ పదులు కొత్త ప్రక్రియ. సినారె గీతాలు, సినారె గజళ్లు, బుతుచక్రం, మరోహరివిల్లు, గాంధీయం, ముత్యాల కోకిల, మంటలూ-మానవుడు, మార్పు నా తీర్పు ఇత్యాదులు, భూమిక, విశ్వంభర, “మట్టీ -మనిషీ-ఆకాశం” వెలువరించాను. “విశ్వంభరకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. మట్టీ -మనిషీ-ఆకాశం దీర్హకావ్యం. ఇలా నా కవితాత్మక నిరంతర గమనం సాగుతోంది. 30,40 ఏళ్లుగా. ఏటేటా ఒక కవితా సంపుటిని నా జన్మదిన సందర్భంగా ఆవిష్కరించాలని ఒక నియమం పెట్టుకున్నాను. నాకు ‘సన్మానం” అంటే ఒప్పుకోను నేను. నా జన్మదినం నాకు సన్నానోత్సవం కాదు, నా నూతన ‘కవితా సంపుటి” ఆవిష్మరణోత్సవమే నా సన్మానం. ఆ రకంగా ప్రతి సంవత్సరం కవితా సంపుటిని ఆవిష్కరింప జేస్తున్నాను. రామప్ప” రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అది రేడియో సంగీత రూపకం. అందులో ఒక పాత్రధారిగా డా॥ మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు పాడారు. ‘ఈ నల్లని రాలలో, ఏ కన్నులు దాగెనో…” అని ఆయన గొంతులో పలికింది. నేను సినీ కవిగా రంగ ప్రవేశం చేసిన తర్వాత దాన్ని “అమరశిల్పి జక్కనిలో పాటగా మలచుకున్నారు. నా రచనల్లో కొన్ని (ఫెంచ్‌, సంస్కృతం, హిందీ, కన్నడం, ఉర్దూ, మలయాళం, తమిళం మొదలైన భాషల్లోకి అనువాదాలయ్యాయి.

ఇక చలనచిత్ర గీత రచన ఘట్టం మిగిలింది. “గులేబకావళి చిత్రంలో పది పాటలు రాయమని ఆహ్వానించారు నట మూర్ధన్యులు ఎస్టీ రామారావు గారు. మొదటి పాట “నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ…”- అది ఇప్పటికి నలభై తొమ్మిది సంవత్సరాలు అయిందనుకుంటాను. ఇప్పటికీ చైతన్య వంతంగా వినిపిస్తుంది సంగీత విభావరుల్లో. ఇక ఆ వరుసలో నేను రాసినవి కొన్ని ముఖ్యమైనవి అన్నపూర్ణ వారికి, ప్రతాప్‌ ఆర్ట్స్‌
వారికి ఎన్నో పాటలు రాశాను. ఇక ఎన్టీఆర్‌కు నాకు ఒప్పందం ఏమిటంటే “సెలవుల్లో నేను వస్తాను అని చెప్పాను. ఆయన పిలిచినప్పుడు నేను నిజాం కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నాను. ఒక సంవత్సరం గడిచింది. నేను యూనివర్సిటీ రీడర్‌గా వెళ్లాను. వేసవి సెలవులు యాఖై రోజులుగా ఉండేవి మాకు. సెలవు రోజుల్లో మదరాసులో ఉండేవాణ్ణి. అనేక సినీ సంస్థలు పాటలు రాయించుకునేవి. సెలవులే కాక శని, ఆది వారాల్లో కూడా
వెళ్లేవాణ్ని. వారు రప్పించుకునేవారు. దాదాపు యాఖై మంది సంగీత దర్శకులతో పనిచేశాను. అందులో తమిళంలో చాలామంది గొప్పవారున్నారు. ఎం.ఎస్‌. విశ్వనాథన్‌, మూడు భాషల్లో గొప్పవాదైన మహదేవన్‌, తెలుగు భాషలో సాలూరి రాజేశ్వరరావు వంటి వారితో
కలిసి మూడు వేలకు పైగా 50 మంది సంగీత దర్శకులకు పాటలు రాశాను. ఇవి కాక కొందరు హిందీ నిర్మాతలు నాచేత పాటలు రాయించారు. శంకర్‌-జై కిషన్‌కు రెండు పాటలు రాశాను. వారు ట్యూన్‌ ఇచ్చి పాటలు రాయించుకునే వారు. పూటకో పాట రాయించుకునేవారు. ఇక సి.రామచంద్ర ట్యూన్‌ ఇచ్చేవాడు కాదు “ఆప్‌ లిఖియే రెడ్ది సాబొ” అనేవారు. అప్పుడు సి.రామచంద్ర ‘అక్చర్‌ సలీం అనార్మ్శలికి నేను రాసిన పాటలకు బాణీలు సమకూర్చారు. మచ్చుకు ఒకటి – “సిపాయీ, ఓ సిపాయీ…. నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో, ఈ పూల మనసు నడుగు అడుగు చెబుతుంది.” ఇక ఓపి నయ్యర్‌కు రెండు పాటలు రాశాను. “నీరాజనరిలో అద్భుతంగా ట్యూన్‌ ఇచ్చాడు. “నిను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా… ఇలాగే”. ఇక రవీంద్రజైన్‌ పుట్టుగుడ్డి; హిందీలో రామాయణానికి సంగీతం కూర్చాడు. అతణ్ణి ఎన్టీఆర్‌ (బ్రహ్మర్షి విశ్వామిత్రకు పిలిచాడు. జైన్‌ స్వయంగా స్వరకర్త, పదకర్త. హార్మోనియం వాయిస్తూ బాణీ వినిపిస్తే నేను రాయాలి. అలా రాసిందే “జయహే విశ్వామిత్ర మహర్షీ జయహే సత్యాన్వేషీ జయహే విశ్వామిత్ర మహర్షి. తర్వాత ఉషాఖన్నా అనే మహిళామణి తీసిన చిత్రానికి రెండు పాటలు రాశాను. బప్పీలహరి సంగీత దృష్టితోనే చూస్తాడు. అతనికి రెండు, మూడు పాటలు రాశాను. ఇందులో ప్రముఖ హిందీ గాయకుడు తెలుగు పాటలు పాడాడు. ప్రధానంగా చెప్పుకోదగ్గ వాడు మహమ్మద్‌ రఫీ. మహమ్మద్‌ రఫీ వినయ సంపన్నుడు. రెడ్డి సాబ్‌! ఏ కైసే బోల్తే హై తెలుగు మే అని అనేవాడు. నాకు రెండు భాషలు తెలుసు కాబట్టి నేను వినిపించేవాణ్ని- యహ ఫర్‌ దేఖ్‌, తెలుగుమే ‘సా హై, ‘జా’హై అని. సాధ్యమైనంత వరకు ‘సికారం, ‘జికారం లేకుండా మాటలు పొదిగేవాణ్ణి. “ఎంతవారుగానీ వేదాంతులైన గాని వాలు చూపు చూడగానె తేలిపోదురోయ కైపులో,
కైపులో కైపులో” అని “భలే తమ్ములు’ చిత్రానికి పాటలు రాశాను. ఈ రకంగా అనేక గీతాలు తెలుగు అర్ధమయ్యే పద్ధతిలో చెప్పి గీతాలు రాశాను. ఇంకా ఎంతోమందికి ఎన్నో విధాలుగా పద స్వరూపం తెలిపి వారు పాడుతున్నప్పుడు సవరించడం జరిగింది. నా గీతాలు ఎక్కువగా ఘంటసాల వారు గానం చేశారు. వారు పాడిన పాటల్లో గీతరచయితగా చూసుకుంటే అత్యధిక సంఖ్యలో నేను రాసిన గీతాలు వారు పాడారు అని తెలుసుకుని గర్వపడుతున్నాను.

ఎంతటి ప్రబంధానికైనా క్షీణ ప్రబంధయుగం వస్తుంది. క్షీణ ప్రబంధంలో మాటల విలువలు పోయి రకరకాలుగా మరో రకంగా మారిపోతాయి. తెలుగులో కూడా మారిపోయింది. ఎప్పటి ధోరణి అప్పుడు ఉంటుంది. ఇటీవల రామానాయుడి “ప్రేమించు సినిమాలో ‘అమ్ముపైన ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని బొమ్మ అమ్మే కదా, రాతిబొమ్మే కదా” అని రాశాను. దాని తర్వాత మరొకటి ‘మేస్తీ- దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెలుగు భాష గురించి ‘మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు రాశాను. నాకు ఎక్కడ అవకాశం ఉన్నా సినిమాల్లో కూడా తెలుగు భాషా వైభవాన్ని ప్రశంసించాను. ‘తెలుగు ఖాష మనది- నిండుగ, వెలుగు జాతి మనది- అన్నాను. ‘మేప్తీ’ పాటలో కూడా “గోదావరీ కృష్ణ తుంగభద్రా నదుల సాధు సలిల క్షీర ధారలే సాక్షులుగ, ప్రత్యేక భాష మనది- ప్రాబీన భాష మనది” అంటూ మన ప్రాబీన భాష గురించి చెప్పుకున్నాను. అవార్డుల విషయానికి వస్తే నా ‘బుతుచక్రం” కావ్యానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, ‘మంటలూ-మానవుడు” కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాయి. ఇంకా భారతీయ భాషా పరిషత్‌ పురస్కారం, సోవియట్‌ లాండ్‌ ఏ కేటగిరి అవార్డు, కుమరన్‌ ఆశాన్‌ (కేరళ) అవార్డు, రాజలక్ష్మీ అవార్డు, ‘విశ్వంభర’ కావ్యానికి భారతీయ “జ్ఞానపీఠ పురస్కారం లభించాయి. సత్మారాల విషయానికి వస్తే మీరట్‌, నాగార్జున, ఆంధ్రా, కాకతీయ, అంబేద్మర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. భారతీయ ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్‌ గౌరవాలు అందుకున్నాను. ఇతర రాష్ట్రాల్లోని ఆంధ్రా సంఘాల ఆహ్వానం మేరకు ఢిల్లీ, ముంబయి, మైసూర్‌, భువనేశ్వర్‌, కొల్‌కతా, షోలాపూర్‌, నాగపూర్‌ కొచ్చిన్‌ వంటి ప్రదేశాలు సందర్శించి తెలుగు సాపొత్యం గురించి ‘ప్రసంగించాను. విదేశీ పర్యటనల్లో నా మొట్ట మొదటి పర్యటన 1981 “చికాగోలో తానా సంస్థ జరిపిన ‘తెలుగు మహా సభలకు వెళ్లాను. అక్కడి పదిహేడు ఇతర నగరాలు, రా్షైలు ఆహ్వానించాయి. అక్కడి వారు నన్ను గుండెల కద్దుకున్నారు. జ్ఞాప్వేల్‌ డా. రామయ్య అని ఉన్నారు. వీరు నా మిత్రుడు మధుసూదనరావు సహకారంతో “కర్పూర వసంత
రాయలు కావ్యగానం రికార్డింగు ఏర్పాటు చేశారు. ఇది  మంచి కార్యక్రమంగా మిగిలిపోయింది. ఇక అమెరికాతో పాటు ఇంగ్రండ్‌, ప్రాన్స్‌, జపాన్‌, రష్యా, కెనడా, ఇటలీ, డెన్మార్క్‌ థాయ్‌లాండ్‌, యుగోస్లేవియా, గల్ఫ్‌దేశాలు, ఆస్టేలియా, సింగపూర్‌, మలేషియా, మారిషన్‌ మొదలైన దేశాల ఆహ్వానాల మీద వారు పంపిన టికెట్ల పైన వెళ్లాను నేను. సగర్వంగా చెప్పేదేమిటంటే ఎన్ని దేశాలు తిరిగినా ఏ ఒక్క దేశానికీ నా జేబులో నుంచి పైసా ఖర్చు పెట్టకుండా వెళ్ళొచ్చాను నేను. యుగోస్లేవియా లోని ‘స్ట్రూగాలో జరిగిన అంతర్జాతీయ ‘కవి సమ్మేళనం’లో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నాను. అక్కడ నన్ను తెలుగులో చదవాలన్నారు. తెలుగులో కొంచెం స్వరబద్ధంగా పాడుతుంటే చప్పట్లు కొట్టారు. దీనితో భాష అర్థం కావలిసిన అవసరం లేదు అని తెలిసింది. తర్వాత అర్థం చెప్పాను. ఎన్నో సాంస్కృతిక సంస్థలతో నాకు సన్నిహిత సంబంధం వుంది. “రసమయి”
ఎం.కె. రాము ‘సుశీలా నారాయణరెడ్డి పురస్కారం ప్రారంభించి ఇప్పటికీ జరుపుతున్నాడు. “వంశీ సంస్థ నా జన్మదిన సందర్భంగా నా గ్రంథావిష్మరణ సభ జరుపుతుంది. కరీంనగర్‌లో నా సాహిత్యాభిమానులు ముఖ్యంగా గండ్ర లక్ష్మణరావు సారథ్యంలో ప్రతి సంవత్సరం
సినారె సాహిత్య పురస్కారంగా ఒక ఉత్తమ కవితా సంపుటికి ద్రవ్యరూపంలో రూపాయలు పదివేలు ప్రదానం చేస్తున్నారు. పాలకొల్లులో నా గజల్‌ మానస పుత్రుడు డా॥ గజల్‌ ‘ఖీనివాస్‌ ‘సినారె కళాపీఠం” నెలకొల్పి ప్రతి ఏటా రూపాయలు పదివేలు ప్రదానం చేస్తున్నాడు. లోగడ ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడిగా ఉన్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా ఉన్నాను. చివరికి చెప్పేది-నేను ప్రసంగం ప్రారంభించింది ఆంధ్ర సారస్వత పరిషత్తుతో. ముగింపు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తుతోనే. ఇది మా మాతృసంస్థ అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణలోని తెలుగు వారందరికీ భాషాపరంగా మాతృ సంస్థగా ఉందని నేను భావిస్తున్నాను. ఆ రోజుల్లో మాడపాటి హనుమంతరావుగారు,
సురవరం ప్రతాపరెడ్డి గారు, దేవులపల్లి రామానుజరావుగారు వంటి మహనీయులు దీన్ని నెలకొల్పారు. రూపకల్పన చేశారు. దీనికి ఏవో కొన్ని వన్నెలు, చిన్నెలు దిద్దింది నేను. దేవులపల్లి రామానుజరావు గారి కృషి అసమానమైంది. నా తర్వాత నారాయణరెడ్డి గారే ఉండాలి అని డా! రామానుజరావు గారు అన్నారు. ఇప్పటి వరకు ఉన్నాను. పరిషత్తు పక్షాన “పరిణతవాణి” ప్రసంగాలు, చర్చా గోష్టులు, వివిధ కళోత్సవాలూ,
సదస్సులూ, ప్రసంగాత్మక ప్రదర్శనలూ, గ్రంథావిష్క్మరణలూ, అధ్యయన శిబిరాలూ వంటి విలక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పండిత శిక్షణ కళాశాల వుంది. ప్రాచ్య కళాశాలలో తెలుగులో స్నాతకోత్తర స్థాయి కోర్సులున్నాయి. నేను యువతరానికి ఇచ్చే సందేశం- రాబోయే తరంవారు కూడా ఒక ప్రతీకగా, ఒక గుర్తుగా భావించి, వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవడం, మలచుకోవడం అవసరం ఎంతైనా వుంది. నా జీవిత ప్రస్థాన క్రమమే నా సందేశం. కాబట్టి మరోసారి ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలుపను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *