చెళ్లపిళ్ల

పింగళి లక్ష్మీకాంతం

ఆంధ్రక వితాజగద్గురుఁ డమరపురికి
తరలిపోయెను శిష్యసంత తిని విడచి
సహజగీర్వాణవాణీ ప్రసక్తులైన
దేవతలు చెప్పఁగల రీంక తెలుగుకవిత.

మరల తిరుపతి వేంక టేశ్వరులజంట
కలసె ముప్పదియేండ్ల పైకాలమునకు

సాగగల దింక క్పాలసభలయందు
అద్భుతావహ శతవధానాంధ్రకవిత

మాగురుం డిప్టు దిగిన వాజ్మయపు గద్దె
ఉర్వి ననధిష్ఠితంబయి యుండఁగలదు
అనభిగమ్యము నప్రధృష్యమ్ము నగుచు

విక్రమార్కునిసింహాసనక్రమమున

ప్రీణిత సదసజ్ఞు డగు పింగళికాంతుని కావ్యశిల్పని
ర్మాణధురీణ బుద్ధిగరిమంబున కిర్వురె సాక్షు లిమ్మహిన్
వాణికి వాణియైన గురువర్యుఁడు చెళ్పిళ వేంక టేశుడున్

ప్రాణముప్రాణ మైన గుణరమ్యుడు కాటురి వేంక టేశుడున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *