దండియాత్ర

 

 కుందుర్తి

(అముద్రిత కావ్యం దండినుండి)

 

ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ 

చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు 

అకాలంగా వచ్చిన రవిలా ఒకానొక వృద్ధ భారతీయుడు

 చినిగిన కొల్లాయి కట్టుకుని  చేత్తో కర్ర పట్టుకుని

గుండెలో విశ్వాసబలం కూడగట్టుకుని 

ఎవరికీ అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకొని పరిపాలకుడు పరమాత్ముడైనా

ఊడిగం చేయించుకొనే హక్కు పుండదని కేకలు పెట్టుకుంటూ 

ఒంటరిగా పరుగెత్తుకొని వచ్చి ప్రజల మనస్సుల్లో

 “తుంటరిఊహలు రేపాడు!

 

ఆయన పేరు సత్యం

 భారతీయ సముద్రగర్భంలో దొరికిన మానవ ముత్యం 

ఆయన ఊరు పోరుబందరు

ఊరిలో పోరున్నదవి ఉలిక్కిపడ్డారు కొందరు!

ఆనాడు__కన్న గడ్డను ప్రేమించడం తప్పు

 ప్రజలందరూ మనుషులేనని ప్రవచించడం తప్పు

 ఆకాశంలో ఎగిరే విహంగాన్ని ఆశీర్వదించడం తప్పు

 సెలయేటి స్వేచ్ఛా గానాన్ని సంస్తుతించడం తప్పు!

 

ఆయన్ను చూసేసరికి ప్రజలందరూ లేచారు 

పర్వతాలు కదిలాయి: నదులు పొంగాయి; సముద్రాలు ఘూర్ణిల్లాయి

సమస్త విశ్వాంతరాళంలో విప్లవ నాదాలు మార్ర్మోగాయి ఆయన అప్పుడు తన మౌనం చాలించి 

బోసి నోటి చిరునవ్వు ముత్యాల వాన

సముద్రం మీద జల్లుగా చల్లి 

అప్పుడే పుట్టిన చరిత్ర శిశువుకు స్వాతంత్ర్య వాంఛాస్త న్యం పట్టి 

ఇసుక తిన్నెల బియ్యపు రాసిలో

రాసిన భాషలోలవణమని పేరు పెట్టి 

తనే తల్లిగా, తనే తండ్రిగా 

తనే సర్వ భారతీయ స్వాతంత్ర్య దీక్షా శక్తిగా 

వరదాస్య బంధ విముక్తిగా 

అభయ హస్తం లాంటి తన దక్షిణ హస్త మెత్తి 

కరకరా పొడిచి వస్తున్న కర్మసాక్షికి నమస్కరించి

సముద్రం వేపు చూసి 

తన వెనుక పొంగివస్తున్న ప్రజా సముద్రం వేపు చూసి

పంచభూతాత్మకమైన సర్వ ప్రకృతిని సాక్షీ భూతంగా నిలిపి సముద్రం మీదికి దండెత్తాడు.

ఆయన యుద్ధానికి వ్యతిరేకి మరి పింహాన్ని నిర్జించేదెలా

ఆయన శాంతికి చెలికాడు మంత్రానికి చింతకాయలు రాల్తాయా?

 హింసావాది పింహం పీడ వదల్టానికి అహింస తన మార్గమన్నాడు

 అందరికీ అంతా అర్థం కాలేదు కావి మొత్తంమీద సరే నన్నారు. 

 

ఆయన వెంట నడిచారు కొందరు మౌనంగా 

కొందరు పరువెత్తారు కొండంత ఉత్సాహంతో 

అందరూ కదిలారు సముద్రం పేపు 

అదేమిచేసింది పాపం! 

సింహాన్ని వదలి సముద్రం మీదికి చిత్రంగా వుంది దండయాత్ర! 

దాని పేరే దండియాత్ర.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *