డా॥ బోయి భీమన్న

నేను హైదరాబాదు వచ్చిన తొలి రోజుల్లో అంటే 1958లో “బోయి భీమన్న కావ్యసుమాలు’ అనే నా (గ్రంథావిష్కరణ సభకు విశ్చనాథ సత్యనారాయణగారు అధ్యక్షతవహించారు. అందులోని మొట్టమొదటి పద్యం చదివారు.

నీరు గట్టి మళ్ళు గట్టి నారుగట్టి

కంచెలును గట్టి నన్ను పోషించరెవరు

అడవి మొక్కను నేను విశ్యావకాశ

వీధులందు ఇష్టమొచ్చినట్టు విరియు చుంటి

విశ్వనాథ సత్యనారాయణ గారికి నామీద మంచి ఇంప్రెషన్‌ పుట్టించిన సభ అది. ఇది మొదట ఎందుకని చెప్పానంటే నిజంగా నాకు ఎవరూ కవిత్వం అంటే ఏమిటోచెప్పలేదు. నేను నాలుగయిదు తరగతుల్లో ఉన్నప్పుడు మాకజిన్‌ బ్రదరు బర్మానుండి భారత భాగవత రామాయణాలు, భక్తవిజయం అనే పుస్తకము తెచ్చి ఇంట్లో పడేశాడు. అప్పుడప్పుడు తిరగేసేవాడిని. నేను ఆరోక్లాసు వచ్చేటప్పటికి ఈ పద్యమెలారాస్తారని ఒక్కొక్క వృత్తమే తీసుకోవడం, నాలుగు పొదాలకీ అక్షరాలు లెక్క బెట్టి ప్రతిపాదంలోనూ రెండో అక్షరం ఒకటిగానే ఉన్నదని కనుక్కొని నాకునేను ఆపద్యాల సంగతి రిసెర్చి చేసి తెలుసు కున్నాను. ఆవిధంగా తెలుసుకొని నేను పద్యాలు రాయడం ప్రారంభిస్తే మా తెలుగు మాస్టారు ‘ఒరేయ్‌ గణాలు తెలుసుకోకుండా పద్యాలు రాస్తే గండాలు వస్తయ్‌రా’ అని నన్ను డిస్కరేజ్‌ చేసేవారు. ఇంకా మన భీమన్న కవిత్వం గవండ్ల గంగమ్మ కవిత్వం అని ఆక్షేపించేవారు. మాస్కూలు ప్రక్కనే కల్లు దుకాణం ఉండేది. ఆ కల్లు అమ్మే మనిషిపేరు గవండ్ల గంగమ్మ. నాకు లక్షణాలు కూడా రాకముందే మానాన్న తెల్లవారుజామున లేచి పాడుకునే పద్యాలు కంఠస్థం వచ్చేవి. నాకు మొట్టమొదటగా కంఠస్థమయిన పద్యం ‘మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు వోవునే మదనములకు” అనే సీసపద్యం. మాఊళ్ళో అప్పన్న సీతారామయ్య గారని పెద్ద భూస్వామి. మానాన్న ఆయన దగ్గర ఉండేవారు. వాళ్లిద్దరూ రాత్రిపూట పొలం కాపలా కు వెళ్ళినప్పుడు ఆయన ఈ పద్యాలు పాడుతూ ఉంటే మానాన్న నేర్చుకుని ఇంటి దగ్గర పాడుకుంటూ ఉండేవాడు. మానాన్న మొదటి నుంచీ పిచ్చివాడులాగా తిరుగుతూ ఉంటే జంగం వెంకన్న అని ఒకాయన నేను పిచ్చికుదురుస్తానని తన దగ్గర ఉంచుకుని అద్వెత వేదాంత తత్వాన్ని ఉపదేశించాడు. అది బాగా పట్టుబడిన మానాన్న అప్పటి నుండి ఆ శుద్ద నిర్గుణ వేదాంత తత్వార్థ కందాలు, దరువులు, ఈ భాగవత పద్యాలు కేవలం ఇంట్లోపాడుకుంటూ ఉండేవారు. నేనింకా అక్షరాలు గుణింతాలు నేర్చుకోకముందే ఇవన్నీ నాకు కంఠస్థ్రమై ఆవిధంగా నాకు వేదాంతం పుట్టుకతోనే వచ్చిందన్నమాట. అద్వెతవేదాంతం ఎప్పుడయితే పట్టుబడిందో ఆ వేదాంతాన్నే పద్యాలుగా, గేయాలుగా అల్లి పశువుల్ని కాస్తూ ఉన్నప్పుడు ఆగేయాలతోనే వాటిని మళ్ళవేస్తూ ఇలా గడిచింది నా చిన్నతనం. అందువల్ల నాకెవరు నేర్పలేదు. అలా చిన్నతనంలోనే మానాన్నగారివల్ల ఈకవిత్వం పట్టుబడింది. మాయిల్లు విడిగా చుట్టూ చెట్టూ పొదలతో అడివిలో ఉన్నట్టు ఉండేది. అందువల్ల ఆ (ప్రకృతి సౌందర్యం, తొలినాటి భారత, భాగవతాల ప్రభావం నన్ను క్లాసికల్‌ ధోరణిలో పెట్టింది. మావూళ్ళో ధర్డ్‌ ఫారం దాకా .ఉండేది. అది పూర్తయింతర్వాత టీచర్స్‌ట్రయినింగులో చేర్చమన్నారు. మానాన్న చిన్నపిల్లవాడు లే అని హైస్కూల్లో చేర్చారు. మా హైస్కూల్లో నేను ఫష్టున పాసయ్యాను. మార్కులు బాగావచ్చాయి. ఆర్థిక పరిస్టితి బాగా లేకపోవడంతో ఉద్యోగం కోసం అపై చేయమన్నారు. చేశాను కాని ఎవరూ పట్టించుకోలేదు. కాలేజీలోచేరాను. ఫోర్తుఫారంలో తిలకంపెట్టే వాబ్దో, ‘క్రాపు ఉండేది, శిలాయి బొట్టని నల్లబొట్టు ఉండేది. బిళ్ల గోచిపెట్టి పంచెకట్టే వాణ్ణి. ఇలా ఉండేదినావేషం. ఫోర్తుపారంలో మాకు అనువాదం, సైన్సు తిమ్మరాజు శేషగిరిరావు గారనే మాష్టారు చెప్పేవారు. ఆయనొక రోజు మా పరీక్ష పేపర్లు పట్టుకొని వచ్చి లేచి నిలబడరా అన్నారు. సందేహిస్తూ నిలబడితే బెంచీ ఎక్కమన్నారు. ఎక్కింతర్వాత ‘అందరూవాణ్ణో చూడండిరా అసలైన బ్రాహ్మాడంటే వాడూ’ అన్నారు. అనువాదంలో నాకు నూటికి నూరు మార్కులు వచ్చాయి. విచిత్రమేమంటే చివరికి నేను ఈ అనువాదశాఖ డైరెక్టరు కావడం. మాస్కూల్లో చిల్లర యోగానందయ్యగారని తెలుగు మాస్టారుండేవారు. ఆయన యోగానంద రామాయణం రాశారు. ఆయన నాపద్యాలు దిద్దేవారు. పాకెట్‌ మనీతో సంతలో పుస్తకాలు కొనే వాణ్ణి, నేను కొన్న మొదటి పుస్తకం ‘“అమరకోశం’. తరువాత పుస్తకం ఎనిమిదణాలు పెట్టి కొన్నది వావిళ్ల వాళ్లు టీకాతాత్పర్యాలతో అచ్చు వేసిన ‘మనుచరిత్ర’. ఇంటికి తీసుకుని వచ్చి మనుచరిత్ర పద్యాలు కంఠస్థంచేయడం మొదలు పెట్టి మొదటి నాలుగు పద్యాలు కంఠస్థం చేసి తరువాత మానేశాను. ఇలా చాలా పుస్తకాలు కొనుక్కున్నాను. నాకు భాగవతం ఇష్టమైన పుస్తకం. భారతంలో నన్నయ రచనమాత్రమే నాకు నచ్చుతుంది. ఎనిమిదో తరగతిలోనే మా టీచర్లనూ వారినీ జమ చేసి ఎండాకాలపు సెలవుల్లో భాగవతం పురాణంచెప్పాను. భాగవతంలోని పద్యాలంటే ఎంతో ఇష్టం. అందమయిన పదాలను నోట్‌ చేసుకునేవాణ్ణి. “అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ” పద్యంలో “సురారులమ్మ కడుపారడిపెట్టెిడియమ్మ’ అన్నమాట నాకునచ్చలేదు. ‘సురారులయమ్మ అ’శ్రువుల తుడిచెడియమ్మ’ అని దిద్దుకున్నాను. ఎంత పెద్దకవులయినా మనుషులేకదా. తప్పులుండవచ్చు. పొరపాట్టు జరగవచ్చు. కాకినాడలోఇంటర్మీడియట్‌. లోచేరింతర్వాత చూశాను కవులెవరో. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, శ్రీరంగం నారాయణ బాబు గారు, అడవి బాపిరాజుగారు, శివశంకరశా[స్తి గారు మొదలైన వాళ్లనంతా. కవి అంటే ఎట్టా ఉండాలి వేషంలో – అంటే కృష్ణశాస్త్రి గారిలాగా ఉండాలని చెప్పేవాణ్ణి కాకినాడకాలేజీలో గోపరాజు రామచంద్రరావుగారు (గోరా) బోటనీ లో ట్యూటర్‌గా ఉండేవారు. ఆయన నాస్తికవాదాన్ని గురించే ఎప్పుడూ బోధిస్తుండేవారు. ఆయనకి నేను దొరికాను. ఆయన జాతీయోద్యమంలో పనిచేస్తూ రాత్రి వేళల్లో చుట్టు పక్కల గ్రామాలకు వెళ్ళి మాలపల్లెల్లో వాటిల్లో ఉపన్యాసాలిస్తుండేవాడు. ఆయనతో వెళ్ళే వాణ్ణి. ఇది నాకు నచ్చిన విషయం. గోరాగారితో ఉండడం వల్ల బ్రహ్మ సమాజికులయిన కృష్ణశాస్రిగారితోనూ, వెంకటరత్నం నాయుడుగారితోనూ విరోధం వచ్చింది. సరే. బి.ఎ. పూర్తయింది. మ(ద్రాసువెళ్లాను. పిఠాపురం యువరాజుగారిప్రతికలో క్లార్కుగా చేరాను. ప్రతికలకోసం వచ్చే ఉత్తరాలు చదివి పట్టిక తయారు చేయడం మాత్రమే నాపని. మొదటి రోజు పోయి కూర్చున్నాను. కాసేపు చూసాను. ఏంచేయాలో తోచలేదు. ఉత్తరాల్ని పక్కన పడేసి సగంలో ఆపిన పద్యాన్ని పూర్తిజేసే ‘ప్రయత్నంలోజన్నాను. మేనేజరు ఇది చూసి తాపీ ధర్మారావుగారికి ఫిర్యాదు చేశాడు. ఆయన వచ్చి ఓహో నీవు కవిత్వం రాస్తావా అని అడిగారు. నేను రాసేదే కవిత్వమన్నాను. వచనం రాయగలవా అనిఅడిగి రాస్తానంటే ఒకవిషయం ఇచ్చి రేపటికి రాసుకురా అన్నారు. మరుసటిరోజు రాగానే రాశారా అనిఅడిగి కాగితాలు తీసుకొని లోపలకు వెళ్లారు. – అరగంట తర్వాత మళ్లా బయటికి వచ్చి నువ్వు ఈ ఫిష్‌ మార్కెట్‌లో ఉండలేవులే అని తనగదిలోకి తీసికెళ్లి తన టేబుల్‌ ముందుకుర్భీ వేయించారు. తర్వాత ఒక కాలం మెయింటెయిన్‌ చేస్తావా అని అడిగారు. చేస్తానన్నాను. ఏంచేయగలవు అన్నారు. ఉత్తరాలు రాయగలను అన్నాను. రాయి అన్నారు. రాశాను. పల్లెటూరి లేఖలు అని శీర్షిక పెట్టారు. ‘జానపదుడు” పేరుతోవేశారు. తరువాత నేనక్కడ మానేసి ‘ప్రజామిత్ర’లో చేరినపుడు సంపాదకులు ఆండ్ర శేషగిరిరావు ‘జానపదుని జాబులు’ అనిపేరు మార్చి ఆశీర్షికను కొంతకాలం సాగించారు. ‘జానపదునిజాబులు’ అనేపేరుతో నమ్మాళ్వారు ఆరణాల సీరీస్‌లో ప్రచురించాడు. తరువాత అందరూ సమ్మెచేస్తే తాపీ ధర్మారావుగారు బతిమాలినా వినకుండా నేనూ వచ్చేశాను. ముమ్మిడివరంలో టీచరుగా నాకు ఫస్ట్‌ పోస్టింగ్‌. అక్కడ మెజారిటీ విద్యార్దులు హరిజనులు. టీచర్లలో ఎక్కువమంది (బ్రాహ్మణులు. హెడ్‌మాస్టర్‌ మాత్రము కాపు. విభిషణరావు గారని చాలా మంచివాడు. నేనక్కడ చేరిన కొత్తలోనే ‘నవజీవన’ పత్రికలో నాపద్యాలుపడ్డాయి. నాదగ్గర ఆ పత్రిక చూశారు విభీషణరావు గారు. అందరు టీచర్లనీ సమావేశపరచి ఆ పద్యాలు చదువమన్నారు. “మాలలు రాజు లౌదురుసుమా” అన్న శీర్షికతో వచ్చాయి ఆ పద్యాలు. చదివాను. చదివితే ఒక బ్రాహ్మణ టీచరు-తిలకమర్తి గవర్రాజు గారని-అలాకాదు పద్యాలు చదవడం అని తీసుకొని గొంతెత్తి పాడాడు. అంత సంగీతం, అంతగొంతు, అంత మాధుర్యం ఎక్కడయినా ఉంటుందని నేననుకోలేదు. అంతబాగా పాడారు. ఆయన వద్ద తరువాత కొన్ని రాగాలు కూడా నేర్చుకున్నాను. బి.ఇడి చదువుతున్నప్పుడు రాజమండ్రిలో కుసుమ ధర్మన్నగారి పత్రిక “జయభేరొని ఒక సంవత్సరం నడిపించాను. అందులో పిపాసి” అనే కలం పేరుతోకథలు రాసేవాణ్ణో. అప్పుడు రాజమండ్రిలో కొంతమంది పెద్దలు ఆ కథలురాసేవాణ్ణే పట్టుకొని కొట్టి గోదావరిలో వేయమన్నారు. నేను దొరకలేదనుకోండి. తరువాత ఆ కథలేమయ్యాయో. రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షులు అప్పుడు క్రొవ్విడి లింగరాజుగారు. కోనసీమలో కళావెంకట్రావు గారు రాజులాంటి వారు. పళ్లంరాజుగారని మరొకరుండేవారు. వీరు ముఖ్యమయిన కాంగ్రెస్‌ నాయకులు. వెంకట్రావు గారు నాకు రాజకీయ గురువులాంటివారు. నేనెపుడూ కాంగ్రెసు అభిమానిని. వాలంటీరుగా చేసేవాణ్ణి ఒకసారి లింగరాజుగారునన్ను పిలిచి మద్రాసులో “ఆంధ్రప్రభ పెడుతున్నారు, నన్ను సంపాదకుడిగా ఉండమన్నారు. కాని నేను అంగీకరించలేదు. సబ్‌ ఎడిటరుగా నిన్ను తీసుకొమ్మని ఉత్తరం రాశాను. వెళ్ళి చేరు అన్నారు. నేనలాగే వెళ్ళాను. కాని నేను వెళ్ళేటప్పటికి కొంచెం అలస్యమయింది. నాకోసం చూసి చూసి వాళ్లు నాస్టానంలో శ్రీశ్రీ ని తీసుకున్నారు. నేనక్కడ బి.ఎస్‌. మూర్తి గారింట్లో ఉండేవాణ్ణి ఆయనకు మాలపల్లి  సినిమా తీసిన గూడవల్లి రామబ్రహ్మంగారికి మంచి స్నేహం. రామబ్రహ్మం గారి పత్రిక “ప్రజామిత్ర లో ఆయన నాకు ఉద్యోగం ఇప్పించారు.

 

ఇక నా జీవితానుభావాలు 

అతి పేదరికంలో, దుర్భరదారి[ద్యంతో పుట్టి నేను ఈ స్టితికి చేరుకున్నాను. చదువే నిషేధింపబడిన జాతిలో పుట్టి చదువుకొని అ(గ్రశ్రేణికి రావడం. అంటరానితనంలో పుట్టి అంటవచ్చు అనే స్థితికి చేరుకోవడం. ఈ విధంగా అనేక రకాలుగా నాకొక విశిష్టత ఉన్నది అని అనుకుంటున్నాను. వడ్డించిన విస్తరి కల వాళ్లవలె కాక విస్తరాకును పుట్టించుకోవడం, స్వయంగా సంపాదించుకోవడం. నాజీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. ఒకసారి మద్రాసులో ఉన్నప్పుడు భార్యాపిల్లలతో బీచ్‌ నుండి వస్తూ టట్రాం ఎక్కాం. ట్రాం బయల్టేరు తున్నప్పుడు ఒక ముసలాయన శాస్త్రి గారు మనవడి సహాయంతో ట్రాం ఎక్కి అదికదుల్లూ ఉంటే పడకుండా పైన రింగు పట్టుకొని ఊగుతున్నాడు. నేను లేని ఆయన్ను కూర్చోమన్నాను. కూర్చున్నాడు. ఎవరునాయనా? _ అనిఅడిగాడు. మారు నాకు తెలుసునండీ, నేను మోకు తెలియదు అన్నాను. ఇంకా ఊరుకోకుండా పద్యాలు రాస్తాను అని కూడా చెప్పాను. పద్యాలు రాసేవాళ్లు నాకు తెలియని వారెవరు? అన్నాడు. మోకు తెలియదులెండి నా పేరు భీమన్న అన్నాను. ఒక పద్యం వినిపించమన్నాడు. “కృష్ణాన్వేషణ’ అని అప్పుడొక ఖండిక రాసి ఉన్నాను. అందులోని పద్యం చదివాను. మరిచితివేమొ గోపసుకుమారుని మారుని కన్నతండ్రి నీ విరులకు మోహపున్‌పదను వెట్టిన  ప్రేయసునీ ‘ప్రియాళికిన్‌ వరమురళీరవాను నటనమ్ములు నేర్చిన విశ్శసాధకున్‌ మరచితివేమొ గోపవిభు మావిభు గోవిభు గోపికావిభున్‌ ఇది విని ఆయన ఆశ్చర్యపోయారు. విని ఇంతగా పద్యం రాసేవాళ్ళు నాకు తెలియకుండా ఉండడమేమిటి? మీ ఇంటి పేరేమిటి అని అడిగారు బోయి .భీమన్న అని చెప్పాను. ఇంకా మేం హరిజనులమని చెప్పాను. నన్ను, మా అవిడనూ పిల్లల్నీ చూసి మారు హరిజనుల్లాగా
లేరే అన్నారు. అప్పుడు నాకు కొంచెం కోపంవచ్చింది. మోరెప్పుడు హరిజనుల్ని చూసి ఉండరులెండి. హరిజనులంటే మాలాగే ఉంటారు. మేం మాలలం. పొలాల్లో ఎండలో పనిచేసి ఇలా ఉన్నాం కాని, గుడిసెల్లో కూర్చుని పనిచేసుకునేవాళ్ళు మావాళ్ళు మాదిగలున్నారు. రాజమండ్రి బ్రిడ్జి ప్రక్కన వారిని చూడాలి.  అచ్చమయిన ఆర్యతేజస్సు వారిలోనే ఉంది అన్నాను. ఆయన మాట్లాడకుండా తరువాతి స్టేజీలో దిగి పోయారు. అంతటితో అయిపోయిందనుకున్నాను. మరుసటిరోజు ఆంధ్రప్రభ ఆఫీసుకు వచ్చారు. ఆయన పెద్దవాడు కాబట్టి నార్ల ఆయన్ను ఆఫీసులోఅందరి దగ్గరకూ తీసుకు వచ్చి పరిచయం చేశాడు.  దగ్గరకు వచ్చినప్పుడు నార్ల ఏదోచెప్పబోయే లోగానే నాముఖం చూసి గిరుక్కున ముఖం తిప్పుకొని వెళ్లి పోయాడాయన. ఆయన మహామహోపాధ్యాయ, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్రిగారు. అంతా నాచుట్టు చేరి ఏమిటి ఆయనట్లా నీదగ్గరకు వచ్చేటప్పటికి అలాచేశారేమిటి అనిఅడిగారు. నేను జరిగిన కథ చెప్పాను. ఆయన చాలా గొప్పవాడు కాబట్టి నాకిది గుర్తుంది. ఒక హరిజనుడుగా పుట్టినందుకు చాలారకమయిన బాధలు పడవలసి వచ్చింది. ఈ రకమయిన బాధలు పడినటు వంటి అంబేద్కరు సమాజం మోద రాజకీయంగా, సాంఘికంగా తిరగబడ్డాడు. రాజకీయంగా నేను మొదటి నుండి  అవకాశాలున్నప్పటికీ నేను ఆవిధంగా చేయలేదు. ఒక బ్రాహ్మడు కులం పేరుతో నన్ను అవమానిస్తే మరొక బ్రాహ్మడు ఆదరించి అభిమానించి ఎంతో మేలుచేశాడు. ఇప్పుడు కులం పేరుతో ఒక బ్రాహ్మణకులాన్ని నేను ‘ప్రేమించనా? ద్వేషించనా? ఒక రెడ్డి గారు అపకారం చేస్తే పదిమంది రెడ్డు నాకుపకారం చేసేవారు. మా ఊర్జో కాపు లెక్కువ. ఒకకాపు నన్ను గుర్రబ్బండి ఎక్కించుకోకపోతే మరోకాపు తన అరుగు మోద కుర్చీవేసి నన్ను కూర్చోపెట్టుకొని కబుర్లు చేప్పేవాడు. అందుకని ఏ ఊర్జోనయినా అందరూ కలిసి ఉండక తప్పదు కాబట్టీ అన్ని కులాలకూ పరస్పర సంబంధాలు తప్పవు. తిరుగుబాటు చెయ్యడం కుదరదు. సమైక్యమేమంచిదన్న భావం నాకు చిన్నప్పటినుంచీ ఉంది. అందువల్ల అంటరానితనం వల్ల వచ్చిన కష్టాలు నాలో బిట్టర్‌ నెస్‌ను కలిగించలేదు. ‘ప్రభుత్వఅనువాద శాఖ డైరెక్టరుగాఉన్నప్పుడు ఒకసారి స్వతంత్ర” పత్రిక సంపాదకుడు గోరా శాస్త్రీ నుండి ఫోను వచ్చింది. మిమ్మల్ని వెంటనే కౌగిలించు కోవాలనుంది ఎలా అని అడిగారు. మా ఆఫీసుకు వచ్చేయండి, అయినా మో
కింత (ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అనిఅడిగాను. మో “రాగవాసిషస్టం’ చదివాను, పీర్రికంతా చదివాను. మోరు హిందూమతాన్నిబాగా తిట్టారు కాని,మో తిట్టలో ఎక్కడా బిట్టర్‌నెస్‌ కనిపించలేదు. ఎందుకూ? ఆనిఅడిగారు. బిట్టర్‌ నెస్‌ ఎందుకు? బిట్టర్‌ నెస్‌ వల్ల హృదయంగాయపడుతుంటి. ఎంతయినా, తిట్టవచ్చు కాని హృదయాన్ని గాయపరచకూడదు. ఈ హిందూ సంస్కృతికి సాహిత్యానికి, సంస్కారానికి అంతటికీ మూలకర్త వేదవ్యాసుడు అని రాయడానికి మూలకర్త ఈ పెద్ద మాదిగవాడే కదా అని రాశాను. నిజమేకదా! ఎవరు కాదంటారు. అవధానిగారే కాదనలేదు. అంతా నిజమే అన్నారు. కాని ఈ శ్మశానాన్న ఎందుకు తవ్వుతారు అన్నారు. దానికి సమాధానంగా “వారసత్వపు హక్కులు”  అని కవితరాశాను. ఆ కవిత చివరి లైనులో చెప్పాను. “ఇది శ్మృశానమని తెలుసు, తవ్వడం వ్యర్థమనీ తెలుసు. ఆ సమాజంలో పాతి పెట్టబడిన వాళ్లు నా పూర్వీకులు, నాకు దొరుకుతున్నవి వాళ్ల ఎముకలు, వాళ్ల చితాభస్మం. అయినప్పటికీ వాటిని వెలికితీసి ప్రపంచానికి చూపి ఇదిగో ఇది మాతాతగారిది అని చెప్పి అవతల పారేస్తాను. తలెత్తుకు తిరుగుతాను”. అని చెప్పాను. అందుకని బిట్టర్‌నెస్‌లేదు. కలగడానికి చాలా అవకాశాలున్నాయి. కవిని కాక పోతే కలిగిఉండేదేమో. రాజకీయంగా ఒక విష్ణవకారుడిగా మరిఏమైపోయేవాడినో.తెలిసేది కాదు. పిఠాపురం మహారాజావారి షష్టిపూర్తి జరిగింది పిఠాపురంలో. ఆ సభాకార్య క్రమం రాస్తున్న తారకంగారు (బ్రహ్మ సమాజీయుడు, చాల పెద్దవాడు. ఆయన ద్వారా నాకు ఆ సభలో పద్యాలు చదివే  అవకాశం లభించింది. సభాధ్యక్షుడెవరో చాలా పెద్దవాడు. రాజమన్నారు గారోఏమో. ఆయన వచ్చి కూర్చున్నాడు. ప్రోగ్రాం కాగితం తీసుకున్నాడు. పద్యాలు బోయిభీమన్న అన్నాడు. లేచి వెళ్లాను. ఎన్ని
పద్యాలు అని అడిగారు రాజావారు. అయిదు అన్నాను. ఒకటి చదువు అన్నారు. అరచాలు అంతే చదువుతాను అన్నాను. అరపద్యం చదివేటప్పటికి చప్పట్లు మోగిపోయాయి. రిపీట్‌ అని అరిచారు జనం. మళ్ళీ చదివాను. పద్యమంతా చదివాను. రెండో పద్యం మూడో పద్యం అలా అయిదు పద్యాలూ చదివాను. రెండుసార్జు చదివాను. మహారాజావారు లేచి స్వీకరించబోతే నేను వారికి అందజేస్తూ వారి పాదాలమోద ఉంచి వచ్చేశాను. దానితో ఆయన మూవ్‌ అయిపోయారు. మూవ్‌ అయిపోయి కన్నీరు కారుస్తూ “నేను ఆ పద్యాల వల్ల చాలా మూవ్‌ అయిపోయాను. నేనిక్కడ కూర్చోలేను. తక్కువ కార్యక్రమంతో నడిపించేయండి’ అనిలేచి లోపలికి వెళ్ళిపోయారు. సరిగ్గా ఇదే పద్దతి అంబేద్కర్‌గారు ఆంధధ్రటూర్‌ వచ్చినప్పుడు చేశాను. ఆయన వైస్రాయ్‌ కౌన్సిల్‌లో వెంబరుగా ఉన్నప్పుడు ఆంధ్రటూర్‌కు
తీసుకువచ్చారు. రామచం(ద్రపురం సభలో ఆయన్ను మొదటి సారి చూశాను. మరుసటిరోజు కాకినాడలో సభ. ఆరోజు రామచందద్రపురంలోనే ఉండి ఇంగ్లీషులో పద్యాలు రాసి అచ్చువేయించి ‘్రేముకట్టి తీసుకొని కాకినాడ వెళ్లాను. కాకినాడ సభకు పాము రామమూర్తి అని పి.ఆర్‌. కాలేజీలో టీచరు, పెద్ద హరిజన నాయకుడు అధ్యక్షుడు. సభ పి.ఆర్‌. కాలేజీలో జరిగింది. పద్యాలు చదవమని నాపేరు చదివారు.
నేను వెనుకనుండి వేదిక మోదికి వస్తున్నాను. కాంగ్రెసువాదిని-ఖద్దరు లాల్ఫీ, ఖద్దరు పంచ, ప్రకాశం పంతులుగారిలా శాలువాతో నా వేషం చూసి” హూఈజ్‌ హీ’ అని మూడుసార్లడిగారు అంబేద్కర్‌. ‘హీ ఈజ్‌ అవర్‌మాన్‌’ అని రామమూర్తిగారు మూడు సార్ట్హు సమాధానం చెప్పారు. నన్ను బ్రాహ్మడనుకున్నాడో ఏమో వన్‌మినిట్‌ అన్నాడు. హాఫే మినిట్‌ అన్నాను. పిఠాపురం సభలో లాగానే, ఒక పద్యం చదివాను. రెండో పద్యం చదివాను. తలెత్తి చూశాడు. మూడో పద్యం చదివాను. నావైపే చూశాడు. ఫ్రేము కట్టిన పద్యాలు అందించి దిగిపోయాను. నెలరోజులతర్వాత నాకొకపథత్రిక అందింది. పీపుల్స్‌ హెరాల్డ్‌-అంబేద్కర్‌
కలకత్తానుండి నడిపే పత్రిక. అందులో మొదట్లోనే నా పద్యాలు వేసి కింద ఈ సంచికకు ఆ పద్యాలే సంపాదకీయం అని రాశారు. అప్పుడు రాజోలులో టీచరుగా పనిచేస్తున్నాను. నామొదటి నాటకం ‘పాలేరు*. ఈ నాటకం చదివి రాజోలు దగ్గర్లో మోరి అనే ఊళ్లో హరిజన కుర్రాళ్లంతా కలిసి నాటకం వెయ్యాలని చెప్పి నా దగ్గరకు వచ్చారు. అయితే ఆనాటకంలో రైతులు, కూలీలు మాట్లాడే మాటలు చాలా బూతులుంటాయి. ఊళ్ళోవాళ్లు మాట్లాడే పద్దతి. అది సహజమే. కాని రంగస్థలం మోద కొంపమునిగిపోయే బూతులుంటే ఎట్లా. అందుకని అటువంటి మాటలు తొలగించి మళ్ళీ తిరగరాయాల్సి వచ్చింది. అందులో పాత్రలు ధరించే వారంతా హరిజనులే. ఒక్కడైరెక్టరు మాత్రమే సవర్ణుడు. ఒక హరిజనుడు రాసిన నాటకాన్ని హరిజనులు ఊరు మధ్యలో ప్రదర్శిస్తారా? ఎంత ధైర్యం? చూస్తామని చెప్పి సవర్ణులైన యువకులంతా సిద్ధ పడ్డారు. నాటకానికి నన్ను పిలిచారు. నేను భయపడ్డాను. అయితే మేమూ సిద్దంగానే ఉన్నామని చెప్పి తీసుకెళ్ళారు. టికెట్ల నాటకం. చుట్టూ కర్రలు పట్టుకొని కొందరు నిలబడ్డారు. వచ్చిన వాళ్ళు జేబుల్లో రాళ్లు. మావైపు చంపటం పెద్ద విషయంకాదు. కైజార్డుంటాయి.. నాటకమే మవుతుందోనని భయం వేసింది. పాలేరు వెంకన్న పాత్ర వేసిన యువకుడు రంగస్థ్రః:౦మోదికి వస్తూనే భయంతో డైలాగులు మర్చిపోయి పారిపోయాడు. మళ్డా అతన్ని పట్టుకొని కాఫీ తాగించి ధైర్యంచెప్పి రంగస్థలం మోదికి తోశారు. అతను నాటకమంతా అద్భుతంగా నటించాడు. వాళ్లు తెచ్చిన రాళ్ళు తెచ్చినవి తెచ్చినట్లే అక్కడ పడవేసి వెళ్ళారు. మరోపదిహేనురోజుల్లో ఏదో పండుగరాబోతూంది. ఆ పండుగకు ఆనాటకాన్ని ఆ సమాజం వాళ్లుఅక్కడే ప్రదర్శించాలని జనంకోరారు. అది పాలేరు నాటకం మొదటి ప్రదర్శన. తర్వాత అక్కడ ఒక లోకల్‌ సంఘటనను తీసుకొని ‘కష్టజీవి’ అనే నాటకం రాస్తే ఆ చుట్టప్రక్కల రెండు మూడు జిల్టాల్లోని కమ్యూనిష్టులంతా వచ్చారు నాటకం చూడడానికి. ఇది 1942 నాటిమాట. రాసిన వాబ్ణే, వేసిన వాళ్లని అరెస్ప్రచేయమని పోలీసులకు ఉత్తర్వులు. పట్టుకున్నారు, తరువాత ఏదోవిధంగా బయటపడ్డాం. దాన్నే ‘ధన్యజీవి’ అనిపేరు మార్చి చాలా చోట్ల ప్రదర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాత-ఇందులో సమ్మె అని వస్తుంది-దాన్ని సత్వాగ్రహంగా మార్చి ‘కూలిరాజు’ అని పేరు పెట్టి ప్రదర్శించాము. దీనికి సినిమా సంగీత దర్శకుడు రాజుగారు మంచి సంగీతం సమకూర్చారు.
రాజమన్నారు. దానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ కాంగ్రెసు వారికి తెలివి ఉంటే ఆ నాటకాన్ని ప్రతి ఊళ్ళోనూ ప్రదర్శింపజేస్తే కమ్యూనిస్టులనే వాళ్లు లేకుండా పోతారన్నారు. నాక్షు 1946లోనే కాం(గైసు టికెట్టు రావలసింది. కొంతమంది వల్లరాలేదు. 1952 లో రాజోలు నియోజకవర్గానికి వారు టికెట్టు ఇచ్చారు. కమ్యూనిస్టుల మాద జరిపిన హింసవల్ల కాంగ్రెసు అంటే కొంత వ్యతిరేకత ఆ (గ్రామాల్లో ఏర్పడి ఉంది.
ప్రచారానికి వెళుతుంటే. ప్రక్క ప్రతి గ్రామంలోనూ పాలేరు నాటకం వేస్తూ ఉండేవారు. వేస్తున్నవారు కమ్యూనిస్టులు. ఇంతమంచినాటకం రాసిన బోయిభీమన్న కాంగ్రైసువాళ్లకు అమ్ముడుపోయాడు – అని ప్రచారం. షేమ్‌, “షేమ్‌, షేమ్‌. అట్లా నా పాలేరు నాటకమే నన్నోడించింది. నేనొక్కట్లేమిటి? కోస్తా అంతా ఇంతే. కళా వెంకట్రావు ఓడిపోయాడు. మద్రాసులో టంగుటూరి ప్రకాశం గారి ఓడించారు. అట్లా ఓడిపోయింతర్వాత హరిజను డెవరున్నారు. అంటే గెలిచిన సంజీవయ్య ఒకడు కనిపించాడు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు నా ‘మధుబాల’అచ్చులో ఉంది. అది ఆయనకు అంకితం ఇచ్చాను. నాకెందుకు ప్రకాశం పంతులుగారికివుగూడదా అన్నారాయన. ప్రకాశంపంతులుగారిక్షీ, పట్టాభి సీత్రారామయ్య గారికీ అంకితం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కెవల్లిస్తారు. నేనేదో రాశాను మోకిస్తాను అన్నాను. సరే అని ఒప్పుకున్నాడు. తిరుమల రామచంద్రగారి ఇంట్లోనే పై డాబామోద అంకితోత్సవం పెట్టాం. చాలా బాగా జరిగింది. ఒక చక్కని పెళ్ళిలా జరిగింది. 1953 లో గుంటూరుజిల్దా చెరుకుపల్లిలో పాలేరు నాటకం వందసార్జు వేశామని సభ పెట్టి సంజీవయ్య గారిని పిలిచి నాకు గండ పెండేరం తొడిగారు. పదివేల మంది జనం డప్పులు, చిందులు, కర్రసాము. ఈ విధంగా పట్ట పగటి దివిటీలు పెట్టి బ్రహ్మరథం పట్టి ఊరేగించారు. కొన్నాళ్ళు ఆగండపెండేరం వేసుకొని తిరిగా. అప్పుడు ఆంధ్రప్రభలో పని చేస్తున్నా. కొన్నాళ్ళ తర్వాత తీసివేశా. హరిజన సేవా సంఘ సభలు నెల్లూరులో జరిగాయి. హైదరాబాదు నుండి
నేనూ సంజీవయ్యగారు కారులో బయల్లేరాం. బెజవాడలో భోంచేశాం. అక్కడ నంబూరి శ్రీనివాసరావు గారని ఒక ఎమ్మెల్యే మాకారు ఎక్కారు. ఇక నెల్లూరు వేళ్ళే సరికి వాళ్లిద్దరూ “పాండవోద్యోగ విజయాలు” నాటకమంతా వేశారు. సంజీవయ్యగారు చక్కగా పాడతారు. ఇద్దరూ పోటీ పడ్డట్లు ఎన్నెన్నిరాగాలు పలికించారో! నెల్లూరు సభకు ప్రారంభకులు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు. సభాధ్యక్షులు మాట్లాడారు. హరిజనులు వెలివేయబడడానికేవో రెండు కారణాలు చెప్పారు. వాటిలో ఒకటి చచ్చిన గొడ్డమాంసం తినడం. నాకు మనసులో కష్టం వేసింది. మరుసటిరోజు కవి సమ్మేళనం. అక్కడ చెప్పవచ్చులే జవాబు
అనుకున్నాను. మరుసటి రోజు కవిత్వం చదవలేదు. ఉపన్యాసం చెప్పాను. హరిజనులు వెలి కావడానికి కారణాలను గురించి ఒక అరగంటసేపు మాట్లాడాను. కాని సంజీవయ్యగారూ, పూర్తయ్యగారు, ఆఉపన్యాసాన్ని రాయాలనీ అచ్చు వేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ఒక వారంరోజుల పాటు వెంటబడ్డారు. తర్వాత అందరూ మర్చిపోయారు. నేను రాశాను. సాక పేములుగారని ఐ.ఎ.ఎస్‌
ఆఫీసరు. ఆయన అచ్చువేస్తానన్నాడు. దాన్ని నా రాగవాసిష్టానికి పీఠికగా కూర్చాను. అచ్చు వేసేముందు నార్లకిస్తే పది రోజులు ఉంచుకొని తిరిగి ఇస్తూ అచ్చయిం తర్వాత ఒక కాపీ ఇవ్వండన్నాడు. ఆయన సీరియల్‌గా వేస్తాడేమోనని నా ఆశు  నాకీ కాంప్రమైజింగ్‌ ఆటిట్యూడ్‌ పనికి రాదండి. మో లాంటి వాళ్లు రాసేది  నరికినట్టుండాలి అన్నాడు. ఎవర్ని నరకడం? కొంత ఆలస్యమైనా మనుషులు మారాలి. కలిసి బతకాలి కాని ఒకర్నొకరు నరుక్కుంటే! సాధ్యమేనా ఇది! అందుకే నాలో బిట్టర్‌నెస్‌ లేదు. నెనెప్పుడూ సామరస్యాన్నే కోరుకున్నాను. అగ్రకులాల వారిని ఎంత తిట్టినా వాడు మావాడు అనే ఉంటుందన్నమాట. మా వేదవ్యాసుడు సృష్టించిన జాతి ఇది. మా వాల్మీకి పెంచిన సంస్కారం ఇది – అనేది నాకుండడం వల్ల వాళ్లను మార్చడానికే చెప్తున్నాను తప్ప వాళ్ళను పరాయి వాళ్లుగా చేసుకొనడానికి, పగవాళ్లనుగా చేసుకోమని మాత్రం నాసాహిత్యాన్ని నేనుపయోగించలేదు – ఇంతవరకూ. ఇక నాకు ఎంత చీకటి ఎన్ని దీపాలు అన్నప్పుడు నేను పుట్టిన చీకటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలూ గ్రహాలూ ఇవన్నీ ఆగిపోతే ఎలాఉంటుందో ఆ రకమయిన గాఢాంధకారంలో పుట్టాను నేను. అడుగు ముందుకు వేయాలి కదా  ఎటు? ఎక్కడికి? ఒక దీపం కనిపిస్తుంది. అటుగా నడుస్తాను. ఆ దీపం ఆరిపోవచ్చు. దాటిపోవచ్చు. ఇంకో దీపం. ఇలా ఎన్ని దీపాలు నామార్గానికి దారి చూపాయో ఇప్పుడు నిలబడి ఆలోచించుకుంటే చాలా అద్భుతమనిస్తుంది. అంత చీకట్లో పుట్టిన నేను ఇంతదూరం రావడానికి ఎన్ని దీపాలు! మొదట మావూరి
కాపులు. వారికి పట్టింపులు ఎక్కువ. కఠినంగా ఉంటారు. వారిలోనలుగురయి దుగురునన్ను ఆత్మీయంగా చేరదీశారు. అక్కడినుండి చిన్నచిన్న దీపాల దగ్గరి నుండి కాలేజీకి వేళ్ళీటప్పటికి పెద్దదీపాలు కళావెంకట్రావు, ముళ్ళపూడి పళ్లంరాజు, అయ్యదేవర కాళేశ్యర్రావు: మంగిపూడి వెంకటశర్మ. నిజంగా మంగిపూడి వెంకటశర్మ ఇచ్చినంతవెలుగు ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వలేదనినేననుకుంటున్నాను
_ ఈ అన్‌టచబిలిటీ గురించి. ఆయన ఇప్పటికీ సూర్యుడులాగే ప్రకాశిస్తూ ” ఉంటాడు. అక్కడి నుంచీ మద్రాసు వరకూ వెళితే నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, నిడదవోలు వెంకటరావు వీళ్లంతా. అక్కడినుంచి హైదరాబాదుకు వస్తే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, సి.నారాయణ రెడ్డి, జె. బాపురెడ్డి ఇంకా చాలమంది. ఈ విధంగా ఒక్కొక్కవెలుగూ ఒక్కొక్క వెలుగూ వస్తూఉంటే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చానన్నమాట. మాతండ్రిగారికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. అప్పుడు మద్రాసులో ఆంధ్రప్రభలో పనిచేస్తున్నాను. నాకు ఆరోజు ఆఫ్‌. ఇంట్లోనే ఉన్నాను. ఆఫీసునుండి ఒక టెలిగ్రాం తెచ్చి యిచ్చారు. తెరిచే ఉంది. చూసి పక్కన పడేశాను. మరుసటిరోజు ఆఫీసుకు వెళ్లాను. నన్ను చూసి ఆఫీసులోని వాళ్లంతా వింతమనిషిని, రాక్షసుణ్ణి చూసినట్టు చూశారు. నీవు ఊరికి పోయి ఉంటావనుకున్నామే. పోలేదా!
ఆఫీసుకు ఎందుకు వచ్చావు? ఇప్పటికల్లా మో ఊళ్లో ఉండి ఉంటావనుకు న్నాము- అని: రకరకాలుగా అన్నారు. ఇంతకీ టెలిగ్రాం మానాన్న చనిపోయినట్టుంది. అందరూ చూసిందే. అందుకే అట్లా అనుకున్నారు. నేను చెప్పాను. మా తమ్ముడికి ముందే చెప్పాను-నేనురానని. అక్కడికి వచ్చిపోవడం ఖర్చుతో కూడుకున్నపని భరించలేను. ఆడబ్బు పంపిస్తాను. నీవే అంత్యక్రియలు చేయమని. మా అమ్మ
చనిపోయినప్పుడు కూడా నేను వెళ్లలేదు. మా అమ్మకూ దినం చేయలేదు నేను. మాసికాలు పెట్టలేదు. మా నాన్న కూ దినం చేయలేదు. ఎందుకంటే నాకు పునర్జన్మ మోద నమ్మకం లేదు. చనిపోతే అంతే. నాకు మొట్ట మొదటి నుంచీ అద్బెతం నేర్పిందేమిటంటే, అద్వైతం నుంచి నేనెక్కడ డిఫర్‌ అయ్యానంటే మోక్షం పొందడానికి సాధనకావాలి. అంటే యోగం. జీవ బ్రహ్మెక్యానికి కొంచెం సాధన కావాలి. నేను డిఫరయిందేమిటంటే అదేమి అక్కరలేదు. జ్ఞానం కావాలి. అక్కగర్రేదు; భక్తి కావాలి – అక్కర్లేదు. మరింకేదో పుణ్యమో ఏదో చేసుకోవాలి – అక్కర్రేదు. ఏమో అక్కర్రేదు. దోమను చంపితే ఏమవుతుంది? నల్లి చస్తే ఏమవుతుంది? ఎన్నిదోమలకు పునర్జ్దన్మఉంటుంది. అలాగే దోమ చచ్చినా అంతే దొరచచ్చినా అంతే. ఆ మోక్షం కోసం ప్రయత్నమేమో అక్కరలేదు. నీవు ప్రయత్నం చేసుకుంటావు, కృషిచేసుకుంటావు. పని చేసుకుంటావు-అంతే. ఒక రిక్షావాడుంటాడు. ఏముంది-పని చేసుకుంటాడు, పిల్లల్ని పోషించుకుంటాడు, చచ్చిపోతాడు-అంతే. అతని కెంత మోక్షం ఉందో రోజూ రుద్రాక్ష మాలలు పెట్టుకొని జపం చేసుకుని పూజలు చేసుకునే వాడికి కూడా అంతే మోక్షం ఉంది. ఎలాగంటే సముద్రంలో అలల్హాగానే. అల ఎక్కడినుంచి వచ్చింది? సముద్రం నుంచే. జీవుడెక్కడి నుండి వచ్చాడు? పరమాత్మనుండే. అంటే ఒక అలలేచింది. ఆ అల పెద్దది కావచ్చు. చిన్నది కావచ్చు. ఆ అల గొప్పపదవి లోఉన్నవాడుకావచ్చు, లేదా ప్యూనో, రోడ్డు ఊడ్చేవాడోకావచ్చు. అది చిన్న అల కావచ్చు పెద్ద అలకావచ్చు. ఎక్కడ పడిపోయింది? మళ్లాసము(ద్రంలోనే పడిపోయింది. నీటినుంచి వచ్చింది. నీరైపోయింది మళ్లీ, అలాగే జీవి – ఆత్మ పరమాత్మనుండి పుట్టింది. మళ్ళా పరమాత్మలో కలిసిపోతుంది. దీనికేం ప్రయత్నం అవసరంలేదు. నేచురల్‌ ప్రాసెస్‌ అది. అందువల్ల నువ్వు ఫాదర్ని చూసినా, మదర్శి చూసినా, ‘బ్రదర్నిచూసినా ‘బ్రతికున్నప్తుడు చూడాలి. చచ్చిపోయిం తర్వాత చూసినా లాభంలేదు, చూడకపో యినా లాభంలేదు. అందుకే మానాన్నకీ, అమ్మకీ దినాలు చేయలేదు. నేను. అదే చెప్పాను మావాళ్లకు. తర్వాత మా తమ్ముడు ఒక పెద్ద ఉత్తరం రాశాడు నాకు, అందులో ఉన్న విషయమేమిటంటే మానాన్న సోమవారం నాడు మా వాళ్లను పిలిచి చెప్పాడట – శుక్రవారం రాత్రి ఒక శబ్దం వస్తుంది. తరువాత దుర్వాసన కొడుతుంది. తర్వాత మళ్ళా ఒక శబ్దం అవుతుంది. తర్వాత సువాసన కొడుతుంది. అప్పుడు మిరు తలుపు తీయండి – అని చెప్పాడట. అయితే నాదొక చిన్నకోరిక ఉంది అది తీరదు అన్నాడట. మా తమ్ముడు ఇవ్వాళ సోమవారమే కదా! శు(క్రవారం ఇంకా చాలాదూరముంది కదా – చెప్పండి అన్నాడట. అప్పుడాయన అన్నయ్యను చూడాలని ఉంది అన్నాడట. మా తమ్ముడు వైరిస్తా రేపు వచ్చేస్తాడు – అన్నాడట. ఆయన నేను అపస్మారకంలోకి వెళ్తున్నాను, నాకు వాణ్ణి చూడాలని ఉందికాని వాడు నన్ను చూడడంకాదు. అపసా శ్రరకంలోకి పోయింతర్వాత వాడు నన్ను చూసేమిటి. చూడక ఏమిటి ! అన్నాడట. అని అపస్మారకంలోకి వెళ్లిపోయాడు. అంతకుముందు ఆర్నెల్లనుండీ అపస్మారకంలోనే ఉన్నాడు. అప్పుడు ఆ సోమవారం నాడు మేలుకొని ఆ విషయం చెప్పి మళ్లా అపస్మారకంలోకి వెళ్ళాడు. అట్టాగే జరిగిందట. అప్పటికే ఆయన శిష్యులు చాలమంది వచ్చి ఉన్నారు. పొద్దున శవానికి మా సిస్టరు స్నానం చేయిస్తూఉంటే వేళ్లు బ్రహ్మరంధ్రం లోకి వెళ్ళాయట. కేకపెట్టి ఇక్కడ రంధ్రం ఉంది అని చెప్పే అంతా వచ్చి చూశారట. అంటే ఆ రెండు శబ్దాలు మొదటిది అనాత్మపగిలిపోవడం. రెండోది కుండలిని ఛేదించుకొని మోక్షం పొతిదడం – అని వాళ్ళ పద్దతిలో చెప్పుకున్నారు. నాక్షు పద్మశ్రీ వచ్చినపుడు ఒక పద్యంలో చెప్పుకున్నాను.

“పాలేరుగ పుట్టితి, ‘మా మా’లకు బుషి వారసత్వమందించితివా, క్షీలలితను సేవించితి,

ప్తాలించితి వాక్య జగము పద్మశ్రీనై”

‘మామాలకు, అంటే మాదిగల్ని, మాలల్ని ఇద్దర్నీ కలుపుదామని. మాతంగుడు ధర్మవ్యాధుడు ఇద్దరూ వియ్యంకులు. మాతంగుడు ఫస్ట్‌ అన్‌టచబుల్‌. దిఫస్ట్‌ హరిజన్‌ ఈజ్‌ ధర్మవ్యాధ. ఆ ధర్మ వ్యాధుడి కూతుర్ని మాతంగుడి కొడుక్కు చేసుకున్నాడు. వీళ్లేమోమాంసాహారులు. అతనేమో శాకాహారి. ఈ మాంసాహారుల ఇంటి పిల్ల శాకాహారుల కోడలవడం వల్ల వచ్చిన గోలను వరాహపురాణంలో చాల విపులంగా చాల అందంగా వర్షించారు. వాల్మీకి వ్యాసుడు వీళ్లంతా హరిజనులని నేనెందుకంటున్నానంటే ఆ ధర్మవ్యాధుడు ఏదోఒక జంతువు ను వేటాడి ‘బ్రహ్మార్సణ చేసి, కొంత ఇతరులకు పంచి, కొంత అమ్మి, కొంత తిని జీవించేవాడు. చివరకు హరిని గురించి తపస్సు చేసి హరి ప్రత్యక్షమయితే అతను కోరిన వరమేమిటంటే నాకు, నా సంతానానికీ, నావంశానికి పరంపరగా విజ్ఞానం, కభాత్మకం, _ ఆధ్యాత్మికం ఈ మూడింటితో కలిసినటువంటి కవిత్వాన్ని ఇమ్మన్నాడు. ‘ఇచ్చాను. ఓ మహాకవీంద్రా” అన్నాడు విష్ణువు, మహాకవీంద్రా అని మొట్ట మొదట అనిపించుకున్నవాడు ధర్మవ్యాధుడు. ఆకాలానికి లిపిలేదు, కవిత్తం లేదు. ఏమి లేని కాలానికి వాడా కోరిక కోరాడు. మాతంగుడు, ధర్మ వ్యాధుల సంబంధం వల్ల ఈ దేశంలోని వంశాలన్నీ పుట్టుకొచ్చాయని నేననుకుంటూ అదేవారసత్వంలో అది కృత యుగంలో జరిగింది. త్రేతాయుగంలో వాల్మీకి బోయ, ద్వాపర యుగంలో వ్యాసుడు బోయ, కలియుగంలో భీమన్న బోయ – అని, రాయడానికి ఇది కారణం. ఈ వాల్మీకి ఈవేదవ్యాసుడు, ఈ హనుమంతుడు వీళ్లందరూ హరిజనులు, _ వీళ్లకు ధర్మవ్యాధుడు కోరిన వరమే ఒక వరంగా వస్తూ ఉన్నది. _ వీళ్లందరూ హరిజనులు కాబట్టి మోరీనాడు హరిజనులు, అంటరానివారు, నిమ్నజాతివారు, దళితులు అని పిలుస్తూన్న వాళ్లందరూ ఆనాటి వేద బుషులు, ఉపనిషద్రుషులు, కావ్యబుషులు. మరి ఆ బుషి వంశం వాళ్లం, మరి మో రెందుకిలా చేస్తున్నారు – అని నా ప్రశ్న సవర్జులకి. అది ఫలించుకుంటూ వస్తున్నది. తొలగిపోతున్నది. అందువల్ల నేను భగవద్గీతకు భాష్యం రాయవలసి వచ్చింది. భగవర్గీతకు భాష్యం రాసిన వాళ్లందరూ సన్యాసులు – సంసారంతో సంబంధం లేనివాళ్ళు, జీవితంతో సంబంధం లేని వాళ్ళు. కవిత్వమంటే జీవితం-సన్యాసం కాదు. అది వేదాంతం. భగవర్షీతలో ఉన్నది జీవితం. వేదాంతం కాదు. నేను రాశాను. ఈ వేద వ్యాసుడికి ఇంత వేదాంతం పెచ్చి ఏమిటి ? ఉపనిషత్తులు రాశాడు కదా! బ్రహ్మ సూత్రాలు రాశాడు కదా! మళ్ళీ భగవద్గీత రాయటానికేమిటి ? అంత పిచ్చా? అంత కండూతి ఏమిటి అని అడిగా. అందుకని ‘తస్మాత్‌ ఉత్తిష్ట కౌంతేయ యుద్దాయకృతనిశ్చయః అని చెప్పడానికి భగవద్గీత రాశాడు. అది యుద్దగీత.. అది సమరగీత, అహింసకు స్దానం లేదందులో. ఆ తక్కినవన్నీ ఎవరో శ్టోకంగా రాసి అందులో పెట్టారు పిచ్చివాళ్లు. నీ శత్రువులను చంపు, క్షమించకు. వాళ్లని నీవు చంపక పోతే వాళ్లు నిన్ను చంపుతారు. ఇది జీవితం. ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి భగవర్షీత  రాశాడాయన. కవిత్వమంటే జీవితం. జీవితంలోజండే అందాలు ఆనందాలు, సుఖదుఃఖాలు సంతోషాలు – ఇది కవిత్వం-సన్యాసం కాదు, వేదాంతం కాదు.
ఈ సుఖదుఃఖాలకు అండర్‌ కరెంటుగా వేదాంతం ఉండొచ్చు. ఒక పర్మనెంటు సూత్రంగా ఉండవచ్చే తప్ప అదే ముఖ్యం కాదు. అందుకనే ఈ గోవ్యాఘ్ర సంవాదం, అలాంటి కవితలు రాసి జాతిని నాశనం చేశారు అని ఎక్కడోరాశాను. గోవుకీ పులికీ సంవాదం జరిగి, గోవునేమో పులి విడిచి పెట్టి దాని దూడకు పాలిచ్చేటట్టు చేసి మళ్లీ తిరిగి వచ్చింతర్వాత ‘అయ్యో ఇంత నమ్మకస్తురాలైన గోవును నేను తిన’నని చెప్పి విడిచిపెట్టేసిందనే కథ ఉందే-అంతకంటే హిపోక్రసీ ఏమో ఉండదు. ఆ కథ రాసినవాడు కవికాదు, మోసగాడు అనినా ఉద్దేశం. ఎక్కడైనా ప్రపంచంలో గోవుకిన్నీ పెద్దపులికిన్నీ “స్నేహం కుదురుతుందా ? కుదురుతుంది అని నీ వెందుకు చెప్తున్నావు. నక్క ద్రాక్ష పళ్ళు కథ చెప్ప వచ్చు.మనకందలేదనుకోవచ్చు. ఇది అలాకాదే! రెండు మతాలున్నపుడు ఒక మతం ఇంకో మతానికి పూర్తిగా వ్యతిరేకమయినప్పుడు ఆ రెండు మతాలకు సామరస్యం కలిగించాలని, జాతీయ సమైక్యమని ఎన్ని సంవత్సరాలు ఎన్ని కోట్టు తినేస్తూ అరిచినా అవి కలవ్వు. ఎలాకలుస్తాయి? నాప్రవక్తే ప్రవక్త – మరొకడుకాడు. నాగ్రంథమే పవిత్ర గ్రంథం మరొక గ్రంథం కాదు. నాదేవుడే దేవుడు – మరొక దేవుడు కాడు. ఎలా? మరిమాకోదేవుడున్నాడు కదా! వాళ్లేం చేద్దాం ? తీసిపారేయ్‌. మాదేవుణ్లే కొలువు. రెడు మతాల మధ్య సామరస్యం కావాలంటే ఆ రెండు మతాల దేవుళ్లు (గ్రంథాలు వాటి పట్ట అవగాహన, ఒడంబడిక చేసుకొని కలిసి బ్రతికే ప్రయత్నం చేయాలి.

ఏకుల మంచునున్న వివరంబుల కూడిన కుంటి ప్రశ్నలన్‌

వ్యాకుల పెట్ట బోకుడది వ్యర్థము, లోకపు మంచి చెడ్డలం

దూకియు మున్ల కుండ యిటు దూరములంబడి వచ్చినాడయీ
యాకృతి నేమి గల్లు హృదయాకృతి జూసి సమాదరింపరే.

అలాగే మాకోనసీను. దాని గురించి చాలాచెప్పాలనుకున్నాను.

పొలముల నీటి బోదెలను బొబ్బరి తోటల మోట బోదెలన్‌
నిలిచి నవాంకు రమ్ములకు నీరము కట్టెడు వీగు వేళ నీ
చెలువము సస్యదేవతకు చిన్నెలు వన్నెలు తెచ్చు నన్నపూ
ర్లలు పదివేలు నీ వడువునన్‌ శ్రమి యింతురు తెల్లు పల్లెలన్‌

సరస్వతిని ఆరాధిస్తూ

ఇలపయినీవు పట్టీ పలికింపగ లేనిది పూచి పుల్లయున్‌
కలుగదు నీయను గ్రహము గాదె పికాళికి గాయనత్వమున్‌
తులసికి పావనత్వమును తోటకు రమ్యనవోదయత్వమున్‌
పలుకుదునేమొ మోటు మొకనాటికి నేటికి కాక పోయినన్‌

కృష్ణశాస్త్రి గారినీ అదీ చూసి నిజమయిన కవులను చూశానని సంతోషపడిన రోజుల్లో గోరాగారితో తిరుగుతూ బ్రహ్మ సమాజానికి వ్యతిరేకమయి పోయి వాళ్ళందరూ నన్ను ఒక నాస్తికుడుగా చూస్తున్న  సమయంలో రాసిన పద్యమది. అప్పుడు నా అంతట నేను ఈ కవుల్ని వదిలేసి ఏవో పద్యాలు రాసుకుంటూ ఉంటే అప్పుడు నన్ను ఎంకరేజ్‌ చేసింది ‘కృష్ణా పత్రిక. అపుడు కృష్ణా పత్రికలో రజనీకాంతరావు, నళినికాంతరావు మాక్షాసుమేట్సు, జూనియర్స్‌ ఇంకా ఒకరిద్దరి పద్యాలు పోటాపోటీగా వేసేవాళ్ళు. భారతజాతి, భారతమాత, దాని దాస్యము వీటిని వ్యంగ్యీకరించి రాస్తూ ఉంటే ఒక పంజరంలో చిలుకను ఊహించి వ్షిస్తూ కృష్ణాపత్రికలో నా పద్యాలు పడ్డాయి. చివరి దేమిటంటే –

ఎప్పుడీ పంజరము తెగిత్రుప్పువడునా

ఎన్నడాకాశ నీధులనెగిరిపోదు

నో, మదిచ్చ కొలంది నవోత్సవమున

నెన్నినాళ్లు యా దాస్యమింకెన్ని నాళ్లు

– అని రాస్తే దాన్ని తీసుకెళ్ళి, చూడండి . ఈ బ్రహ్మసమాజదాస్యం నుండి ఎప్పుడు విముక్తి అని వ్రాస్తున్నాడీయన’ అని ఫిర్యాదు చేశారు, ద్వేషం కలిగించారు. అపుడు రాసుకున్నది ‘పలుకుదునేమొ మోటుమొకనాటికి నేటికి కాకపోయినన్‌ అని సరస్వతిని. సరస్వతి అంటే నాలో ఉన్న ఒక ఎస్పరేషన్‌ ని రూపుదిద్దుకోవడం. అందుకే ఏకేశ్వరభావం కంటే బహూదేవతాభావం మోర్‌ సైంటిఫిక్‌ అని నాఉద్దేశం.
విగ్రహారాధన అనేది సైంటిఫిక్‌. మనుషుల ఆకాంక్ష లెన్ని విధాలో అన్ని విధాలుగా భగవంతుడు కనిపిస్తాడు విగ్రహారాధన అంటే. ఏకేశ్ళరో పాసన అనేది మనకెందుకూ పనికిరాని ఆలోచన. దేవుడొక్కడే కాదు మొత్తానికి. మతానికోదేవుడు. ఏకేశ్వరో పాసన అనేది అబద్ధం. ఆదేవుడు (డ్రగ్‌ లాంటివాడు. ఈ మతాలు చెప్పేదేవుడు అనేమాటను నిషేధించి నట్టయితే మనుషులంతా ఒక్కటే అవుతారు.

ఆంగికం భువనంయస్య వాచికం సర్వవాజ్మయం
ఆహార్యం చం(ద్రతారాది తం వందే సాత్వికం శివం

అది ఒక పరమాత్మయొక్కవిశ్చరూపం. దీన్ని నేను, అకాండ తాండవం, అని చెప్పి ఒక గ్రంథం రాశాను

పయనమై నీ మార్గమందే పడుచులేచుచు వచ్చు చుంటిని
పువ్వుదొరికిన నీగురించే ముల్టు విరిగిన నీ గురించే
ఎవరు నా కెదురేగుదెంచిన నీవెయని పూజింతు దేవా!
ఎవరు నీ కెదురేగు దెంచిన నేనెయని కరుణింపుమూ
అమృతమూర్తీ నీ విధమ్మున ఆడుచుంటిని పాఢడుచుంటిని
దారిలో నీ హృదయబిందువు చేరులోపల స్వేచ్చగా
గానమాపకు గజ్జ విప్పకు కాంతి తీయకు బాటపొడవున
ఆటగా ఒక పాటగా నాబాట నీతో చేరి పోనీ

శివుని యొక్క కదలికే ఆ సృష్టి ఆభంగిమలే ఆ జీవరాసులు అనే భావంతో రాసిందిది. నా ప్రతికావ్యానికి ప్రతి రచనకు ఒక (ప్రేరణ శక్తి ఉంటుంది. ఏదో ఒక ప్రేరణను ఆధారంగా చేసుకొని ఒక కవిత ఒక కావ్యమో పుడుతుందన్నమాట. అకారణంగా పుట్టిన కవిత లేవీ నాదగ్గరలేవు. ప్రతి దానికి ఒక కారణమున్నది. వాటిని గురించి చెప్తే బాగా ఉంటుంది. వీలయితే మరెప్పుడయినా చెప్తాను.

(23-2-1995) తెలంగాణ సారస్వత పరిషత్ (పరిణత వాణి ప్రసంగం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *