గ్రేట్ వారియర్స్..

విమానాల్లో గాల్లో తేలుతూ భూమ్మీద అణ్వస్ర్తాలను అలవోకగా విసిరేసి మహా విధ్వంసం సృష్టించటం… మనుషులు లేకుండా క్షిపణులను ప్రయోగించి దూరంగా ఉన్న టార్గెట్‌ను ఛేదించటం.. ఇదీ ఆధునిక యుద్ధనీతి.. యుద్ధం చేసే పద్ధతులు.. శత్రువును అతని ముందు నిలుచుని నేరుగా ఎదుర్కోవటం ఏ దేశ సైన్యానికీ ఇవాళ చేతకానిపని.. టెక్నాలజీ అందించిన నైపుణ్యాన్ని ప్రదర్శించటం తప్ప గెరిల్లా యుద్ధం సాధ్యం కాని పని.. అసలు యుద్ధం అంటే ఏమిటి? ఆ సైన్యానికి ఓటమి అంటే మరణంతో సమానం.. శత్రువును మట్టుపెట్టడానికి ఎంతకైనా తెగించగల సామర్థ్యం కలది.. ఒక్కొక్కరు వందమంది తలలు నరకగల మహావీరులు.. వాళ్లు సామాన్యులు కారు.. వారి ఆయుధాలు సామాన్యమైనవి కావు..
వాళ్లు యుద్ధరంగంలో అడుగుపెడితే వంద తలలు తెగితే కానీ తిరిగి రారు.. కత్తి చేత పట్టుకుంటే పచ్చి నెత్తురు తాగాల్సిందే.. వాళ్ల శౌర్యం అప్రతిహతం. అసాధారణం.. వాళ్లు మామూలు మనుషులు కారు.. వాళ్ల బలగాలు మామూలు బలగాలు కావు.. టెక్నాలజీల టెక్కులు లేకుండానే మహా సామ్రాజ్యాల్ని అలవోకగా గెలిచిన వీరులు వారు.
సముద్రంపై యుద్ధం చేయటం అంటే యుద్ధనౌకలను వినియోగించటం తప్పనిసరి.. కానీ, శత్రువు నౌకను అతను ప్రయాణిస్తుండగానే అతనికి తెలియకుండా ఆక్రమించటం సాధ్యమేనా? ప్రత్యేక బలగాల్లోని గ్రేట్ వారియర్స్‌కు ఏదైనా సాధ్యమే..
మనం సినిమాల్లో చూసిన విల్లు ఒకటే కనిపిస్తుంది. కానీ, సర్కిల్ విల్లును ఎప్పుడైనా చూశారా? డబుల్ బౌ విల్లును ప్రయోగించే విలుకాడికి ఏదైనా సాధ్యం కానిది ఉంటుందా?
సామురాయ్ స్వార్డ్.. ఒకసారి చేయి తాకితే చాలు.. ఎదుటివాడి తల నరకాలని అమాయకుడైనా శూరుడై హూంకరిస్తాడు..
శత్రువు ఆనుపానులను గుర్తించేందుకు జాగిలాలను ఉపయోగించాలని మనం ఇవాళ అనుకుంటున్నాం.. కానీ, వేల సంవత్సరాల నాడే జాగిలాలను నాటి మహా సామ్రాజ్యాల్లో సైన్యం ఉపయోగించిందన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఆనాటి జాగిలాల శిక్షణ ముందు ఇవాళ్టి ట్రైనింగ్ ఏమాత్రం నిలుస్తుంది? ఇవి అలాంటిలాంటి కుక్కలు కావు… నర మాంసాన్ని రుచి చూసిన కుక్కలు.. దూరం నుంచి చూస్తేనే వెన్నులోంచి చలి పుట్టుకొస్తుంది. ఈ శునకాలను క్కసారి వదిలితే.. ఇవి పులుల కంటే భయంకరంగా దాడి చేస్తాయి. రోమన్ సామ్రాజ్యపు మహా సైన్యంలో చతురంగ బలగాల కంటే అయిదో బలమైన జాగిలాలదే ప్రధానపాత్ర…
గుర్రం అతి వేగంగా పరిగెడుతుంటే.. ఏనుగుపై స్వారీ చేస్తుంటే పొడవాటి విల్లును పట్టుకుని కిందపడకుండా లక్ష్యాన్ని ఛేదించటం సాధ్యమేనా? ఈ ప్రత్యేక సైనిక బలగాలకు మాత్రం సాధ్యం? వీరు ఆయుధాన్ని ప్రయోగిస్తే టార్గెట్ మిస్ అన్న ప్రశ్నే ఉండదు. పరిస్థితులు అనుకూలమైనా.. ప్రతికూలమైనా? శత్రువు ఎంత బలగంతో వచ్చినా, భయమన్నది తెలియని వీరులు వీరు.. వీళ్లను మించిన వాళ్లు లేరు.. వీళ్లను ఎదిరించి నిలిచిన వాళ్లు లేరు.. వందల శతాబ్దాల తరువాత కూడా ఇలాంటి బలమైన సైన్యం ఏ దేశమూ ఏర్పరుచుకోలేదు.. ఇవాళ్టి అగ్రరాజ్యానికి సైతం సాధ్యం కాని ప్రత్యేక సైనిక బలగాలివి.. వాళ్లు రోమన్ మహా సామ్రాజ్యానికి వరంగా లభించిన వారియర్స్.. గ్రేట్ వారియర్స్…
వెయ్యేళ్ల పౌరుషం.. వీరుడంటే కటానా పట్టుకున్నవాడే. సైనికుడంటే పిడికిలిలో బిగించిన కటానా కలిగిన వాడే. కటానాతో సాము చేస్తుంటే గాలిలో దాని శబ్దానికి, వీరుడి నోటి నుంచి వచ్చే ధ్వని కలిసి ఒక ప్రకంపన పుడుతుంది. ఆ ప్రకంపనకే శత్రువు అల్లల్లాడిపోవలసిందే. జపాన్ యుద్ధ నీతిలో రక్తధారలను పారించే ఆయుధ నీతి సోరీ.. సుగాతా లనుంచి కటానా పుట్టుకొచ్చింది. ప్రపంచంలోనే ఇలాంటి ఆయుధం మరొకటి మనకు కనిపించదు. దీని పేరు కటానాయే కానీ, మనకు తెలిసిన పేరు సామురాయ్ స్వార్డ్… …
70 నుంచి 73 సెంటీమీటర్ల పొడవు.. అందమైన కర్వ్.. సింగిల్ ఎడ్జ్ బ్లేడ్.. రెండు చేతులతో పట్టుకుంటే మంచి గ్రిప్‌లో ఇమిడిపోయే పిడి…కటానాను అలా పట్టుకుని గాల్లో తిప్పుతుంటే కన్నుల పండువగా ఉంటుంది. అదే రణరంగంలో అది ఒకసారి తిరిగితే ఎన్ని తలలు తెగుతాయో దాని షార్ప్‌నెస్‌కు కూడా తెలియదు.
పొడవాటి కటానాను ఎక్కువగా రెండు చేతులతోనే పట్టుకుంటారు. రెండు చేతులతో సాము చేస్తేనే అది మరింత బలంగా, సమర్థంగా పని చేస్తుంది. లక్ష్యాన్ని ఛేదిస్తుంది. చురుగ్గా ఒకసారి లక్ష్యాన్ని గురిపెడితే, ఎట్టి పరిస్థితిలోనూ తప్పదు. అందుకే ఇది ప్రపంచంలోనే ట్రెడిషనల్ వార్ వెపన్‌లకు కింగ్‌లా మారింది. దీని కోసం గురువు దగ్గర ప్రత్యేకంగా శిక్షణ పొందటం అవసరం.. మామూలు కరవాలాలలతో, కత్తులతో చేసే పోరాటాలకు, కటానాతో చేసే యుద్ధానికి చాలా తేడా ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. అది మహా వినాశనాన్నే సృష్టిస్తుంది.
పదవ శతాబ్దం నుంచి దాదాపు వెయ్యేళ్ల పాటు జపాన్‌కు సామురాయ్ ప్రత్యామ్నాయంగా మారింది. సామురాయ్ సైనిక వ్యవస్థ గొప్పతనం అది. ముందు చెప్పుకున్నట్లు సామురాయ్‌లు చాలా ఆయుధాలు వాడినా, కటానాకు ఇచ్చిన ప్రాధాన్యం వేరు. క్రీస్తుశకం 1281లో జపాన్‌లో ఒక లక్షా నలభై వేల సామురాయ్ సైనికులు కటానాను తమ ప్రధాన ఆయుధంగా వినియోగించారు..
కటానా అంటే సామురాయ్‌లకు ఎంత ప్రేమ అంటే, దాన్ని కాపాడుకోవటం కోసం, మెయింటెనెన్స్ కోసం కూడా ప్రత్యేక సూత్రాలు త యారు చేసుకున్నారు. ఖడ్గం ఉపయోగించినప్పుడు మాత్రమే ఒరలో ఉండాలి. దీని తయారీకి సైతం ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు.. ప్రత్యేక ఉక్కుమెటల్‌ను రెండు పొరలుగా ఉపయోగించి.. రెండింటి మధ్యలో సునిశితమైన బ్లేడ్‌ను యూజ్ చేయటం దీని స్పెషాలిటీ.
కటానా అన్నది జపానీయుల జీవన విధానంలో భాగంగా మారింది. చిన్న పిల్లలు….. ఇంకా చెప్పాలంటే అయిదేళ్ల లోపు వయసున్న పిల్లలు తమ ఆటల్లో కూడా సామురాయ్ కటానాను ఉపయోగిస్తారు. ఆ జాతి మూలాల్లో ఉన్న పౌరుషానికి ఇది ప్రతీక.. మోడ్రన్ వార్‌ఫేర్‌లో ఆధునిక ఆయుధాలు ఎన్నైనా ఉపయోగిస్తుండవచ్చు. కానీ, కటానాను ఎదిరి నిలిచే ఆయుధం మాత్రం రాలేదు. ఇప్పటికీ.. కటానాను చూసి ప్రపంచం వణికిపోతూనే ఉంటుంది.
మనకు ఇప్పుడు తెలిసిన ఆయుధాలు క్షిపణులు.. యుద్ధ ట్యాంకులు.. ఏకె సిరీస్ గన్‌ల గురించి మాత్రమే.. కానీ, విల్లు అంటే తెలుసా? ఆ… ఒలింపిక్స్ గేమ్స్‌లో ఓ ఆట.. మనకు అంతవరకే తెలుసు.. కానీ, విల్లును మించిన మహా మారణాయుధం మరొకటి లేదు.. ప్రపంచంలోని ప్రాచీన రాజరికపు సైన్యాలకు ప్రధాన ఆయుధం విల్లే.. వాహనం ఏదైనా సరే.. ఆయుధం మాత్రం ఒకటే.. ఇది వంద బుల్లెట్లను మించిన శక్తి విల్లు నుంచి దూసుకువచ్చిన బాణానిది.. ఏన్షియంట్‌గ్రేట్ వారియర్స్ అనుసరించిన సింగిల్ అజెండా ఇది..
ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా శత్రువును సమూలంగా మట్టుపెట్టాలంటే ప్రాచీన సైన్యం ముందున్న ఏకైక ఆయుధం విల్లు.. దక్షిణాసియాకు ఇది ప్రత్యేకం. విలుకాళ్లతోనే స్పెషల్‌గా సైనిక బలగాల్ని ఏర్పాటు చేసుకున్న రాజ్యాలున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో.. కనిపించని శత్రువును మట్టుపెట్టాలంటే ఆయుధం కూడా ప్రత్యేకంగా ఉండాలి.. ఆగ్నేయాసియాలోని కాంబోడియాలో అంగ్‌కార్‌వాట్ ఖ్మేర్ రాజరికవ్యవస్థ ఈ ప్రత్యేక ఆయుధాల్ని తయారు చేసింది.. ఇందులో సింగిల్ బో.. డబుల్ బో.. లాంగ్ బో.. మూడు ప్రత్యేక విల్లులను తయారు చేసింది. సింగిల్‌బోతో ఏనుగులపై, గుర్రాలపై వెళ్లే సైనికులు 50 అడుగుల దూరంలోని లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేవారు.
సింగిల్‌బో కంటే డబుల్‌బో రెట్టింపు శక్తిమంతమైంది.
రెండు రెట్లు ఎక్కువ దూరంలోని టార్గెట్‌ను ఛేదిస్తుంది.
అడవిలో శత్రువు కనిపించనప్పుడు కేవలం శబ్దాన్ని విని టార్గెట్‌ను ఛేదించటంలో ఈ డబుల్‌బో పర్‌ఫెక్ట్ వెపన్.. అంతే కాదు.. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్‌లను ఛేదించటానికీ ఈ డబుల్‌బో చక్కగా ఉపయోగపడుతుంది.
లాంగ్‌బో విషయానికి వస్తే.. ఎక్కువ దూరాల్లోని లక్ష్యాన్ని తునాతునకలు చేసేందుకు ఈ విల్లును ఉపయోగించేవాళ్లు.. అతి వేగంగా వెళ్తున్న శత్రువును అంతకంటే వేగంగా వెంటాడి వేటాడటానికి ఈ విల్లును ఉపయోగించేవాళ్లు.. అదే సమయంలో శత్రువునుంచి వచ్చిపడే శరపరంపరను ఎదుర్కోవటానికి ఒక గాలి వస్ర్తాన్ని ఉపయోగించేవారు.. దీన్ని వీపునకు తగిలించుకుంటే ఏ బాణం వచ్చినా సమస్య కాదు. దీని వల్ల బాణం ఆ వస్ర్తానికి తగిలి కిందపడుతుందే తప్ప మనిషికి ఏమీ జరగదు.
ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, రోమ్.. సామ్రాజ్యపు సైన్యాలు అసాధారణ ప్రతిభ ఉన్న బలగాలు. ఇవాళ్టి ఆధునిక సైనిక వ్యవస్థలకు బలమైన పునాదులు ఏవైనా ఉన్నాయా అంటే వీటినే చెప్పుకోవాలి. ఇవి సాధారణ సైనిక బలగాలు కావు. కొన్ని రాజవంశాలను, కొన్ని జాతుల అస్తిత్వాలను ఉనికి కోల్పోకుండా నిలిపిన బలగాలు. గెరిల్లా పోరాటం నుంచి సముద్రంపై యుద్ధం దాకా అన్ని యుద్ధ నీతులనూ ఆకళింపు చేసుకున్న సైనికశక్తులివి.. వీటిని మించిన బలగాలు వీటి తరువాత ఏర్పడలేదు.. ఇకముందు ఏర్పడవు.
సైన్స్‌లో ఫలానా కనుగొన్నది ఎవరు? ఏ అమెరికా వాడో.. బ్రిటిష్ వాడో.. మొత్తానికి తెల్లవాడని చెప్పేస్తాం.. లెక్కల్లో ఫలానా కనుగొన్నది ఎవరు? అంటే నిక్కచ్చిగా తెల్లోడేనని చెప్పేస్తాం.. కంప్యూటర్ నుంచి రాకెట్ దాకా ప్రతీదీ తెల్లోని చేతుల్లో పెట్టేశాం.. వాడేది చెప్తే అదే వేదం.. వాడేది చెప్తే అదే శాసనం.. ఒక్కసారి ఆలోచించండి.. ప్రపంచానికి మన కంట్రిబ్యూషన్ ఏమిటి? జీరో అని ఇంగ్లీషువాడైతే తేల్చేశాడు.. ఇప్పుడేం చెప్పినా మనం నమ్మే సమస్యే లేదు.. కానీ, నిజం వేరు.. లక్షల సంవత్సరాల కిందటే అత్యాధునిక ఆయుధ సంపదను రూపొందించిన దేశం మనది.. విల్లు.. బాణం.. కత్తి, ఖడ్గం.. కవచం.. ఒకటా రెండా.. రాకెట్ లాంచర్లను సైతం ప్రయోగం చేసిన గడ్డ మనది..ఆధునిక ఆయుధాలకంటే వంద రెట్లు పవర్ ఫుల్ అస్ర్తాలివి. నమ్మశక్యంగా లేదా? ఈ ఎపిసోడ్ చూడండి..
ప్రపంచానికి ఆయుధాల తయారీ నేర్పించిందెవరు? తొలి వార్ హెడ్ రూపొందించింది ఎవరు? ఆధునిక కాలానికి వస్తే చాలా మంది పేర్లే చెప్పుకోవచ్చు. కానీ, ఆయుధ తయారీకి మూల పురుషుడు ఎవరు? దేవుడా? మనిషా? 10 లక్షల సంవత్సరాల క్రితమే అత్యాధునిక పరిజ్ఞానానికి సైతం అంతుపట్టని ఆయుధాలను తయారు చేసిన ఘనత ఎవరిది? ప్రపంచంలో కనీసం కలలో కూడా ఊహించని ప్రళయాన్ని సృష్టించిన సంప్రదాయ ఆయుధాలు ఇవాళ్టి ఆధునిక అణ్వస్ర్తాలకు సైతం మూలాలు. ఈ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి.. తిరుగులేని మన అస్త్ర సంపదకు మాపలేని రుజువులివి..
రామ బాణం..
ఒకసారి సంధిస్తే
వెనక్కి రాదు
బ్రహ్మాస్త్రమైనా సరే
రామ బాణం ముందు దిగదుడుపే
ప్రళయాన్ని సృష్టిస్తుంది
కనుచూపు మేర బూడిదే మిగులుతుంది
దాదాపు పదిలక్షల సంవత్సరాల క్రితం భూమ్మీద తిరుగులేని అస్త్రంగా చెప్పుకున్న బాణం.. ఇప్పటికీ, రామబాణం అన్నది తిరుగులేనిదన్న పదానికి పర్యాయంగా మారింది.. రామాయణ కాలంలో, రావణ సంహారానికి ప్రయోగించిన బాణమిది..
పాశుపతం
శివుణ్ణి మెప్పించి
అర్జునుడు సంపాదించిన అస్త్రం
న్యూక్లియర్ వార్ హెడ్
ప్రయోగిస్తే బీభత్సమే
స్మశానాన్ని సృష్టించే భయంకర ఆయుధం
బాణం.. ఖడ్గం.. గద.. పిడిబాకు.. ఇవన్నీ మనం పురాణాల్లో, సినిమాల్లో చూస్తాం.. బాణమైతే ఇవాళ ఆటల్లో ఒక ఆటగా మారిపోయింది. ఒకప్పుడు ఆది మానవుల కాలంలలో ఆహారం కోసం తయారు చేసుకున్న మామూలు ఆయుధాలుగానే మనకు తెలుసు.. కానీ, ఇవి ప్రపంచయుద్ధాల స్థాయి పోరాటాల్లో తీవ్రస్థాయిలో ఉపయోగించిన ఆయుధాలివి.
అయిదున్నర వేల సంవత్సరాల క్రితం ప్రళయాన్ని సృష్టించిన ఆయుధాలివి.. హరప్పా మొహంజదారోలో ఇవాళ్టికీ కనిపిస్తున్న రేడియేషన్ ఎఫెక్ట్ ఈ ఆయుధాల వల్లనే జరిగిందని చరిత్ర రుజువు చేస్తోంది. రామాయణ కాలం ముందు ప్రపంచం ఎలాఉందో ఇప్పటికైతే ఎవరికీ తెలియదు.. కానీ, అప్పటి నుంచి మొఘలుల దాకా ఈ సంప్రదాయ ఆయుధాలు ప్రపంచానికి సరికొత్త ఆయుధ నిర్మాణానికి రూట్ మ్యాప్ చూపించాయి.. ప్రపంచంలో ఆభివృద్ధి చెందిన నాగరికతల్లో రూపొందిన ఏ ఆయుధమూ మన, నాటి, ఆయుధాల ముందు ఎందుకూ కొరగావు..
ఏకే -47 నుంచి మిస్సైళ్ల దాకా ఉన్న ఆయుధాల గురించి మనకు తెలుసు.. సంప్రదాయ ఆయుధాలు కథల్లోనే తెలుసు.. కానీ, ఏకె 47 లను మించిన, మిస్సైళ్లను మించిన బాణాలను రాకెట్ స్పీడ్ లాంచర్లను మన వాళ్లు తయారు చేసిన సంగతి మీకు తెలుసా? మీరే చూడండి..
భారతీయ విజ్ఞానం.. ప్రపంచానికి పరిపూర్ణ విజ్ఞాన శాస్ర్తాన్ని అందించిన దేశం.. అన్ని రంగాల్లో మన వారి ఇంజనీరింగ్ నైపుణ్యం మరే దేశానికీ, నాగరికతకూ సాటిరాదు.. వేల ఏళ్ల నాడే ఇరిగేషన్ అద్భుతాల్ని సాధించిన ఘనత మనది.. వంపు లేకుండా కూడా నీటిని నిరాటంకంగా వెళ్లేలా చేసిన అద్భుతం మనది..
అన్నింటికీ మించి యుద్ధ తంత్రం.. వ్యూహాత్మక ఆయుధాల నిర్మాణం మనకు సాటిరాగల వాళ్లు లేరనే చెప్పాలి..
విల్లు..
మన యుద్ధరంగంలో దీన్ని మించిన ఆయుధం లేదు. నిలబడి గురిచూసి కొట్టడమే కాదు.. గుర్రంపై రైడ్ చేస్తూ కూడా విల్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆరడుగుల పొడవుంటే, మరొకటి మూడడుగులు మాత్రమే ఉంటుంది. రామాయణంలో రాముడు 12 అడుగుల విల్లు కోదండాన్ని వినియోగించాడు.
ఇది ఓ చిన్న విల్లు..
ఎత్తు మూడడుగులు..
దీన్ని ఎక్కుపెట్టి బాణం వదిలితే
వంద గజాల దూరంలో లక్ష్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది
గంటకు 200 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది
ప్రతి అయిదు సెకన్లకు ఒకటి చొప్పున బాణం వేయవచ్చు
హార్స్‌రైడర్లకు అత్యంత అనువైన ఆయుధమిది..
ఇక పొడవైన విల్లు ఇది
18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వాడిన విల్లు
ఆరడుగుల ఎత్తు
135మైళ్ల స్పీడ్
80 గజాల్లో లక్ష్యాన్ని ఛేదిస్తుంది
లక్ష్యాన్ని ఛేదించే టైమ్‌లో 90 మైళ్ల స్పీడ్
ఈ విల్లు బ్రిటిష్ వాళ్లు మొఘలులను జయించటానికి వాడింది. పొడవైన విల్లుతో వదిలిన బాణం కంటే, షార్ట్‌లెంగ్త్ బో తో వేసిన బాణం ఎక్కువగా లోతుల్లోకి దిగబడుతుంది. అయిదు సెకన్ల తేడాతో నిమిషానికి పన్నెండు బాణాలు వదిలితే.. శత్రువు అల్లకల్లోలమైపోతాడు.. పైగా ఒక్కో బాణానికి ఒక్కో వార్ హెడ్ ఉంటుంది. న్యూక్లియర్ వార్‌హెడ్‌ను కూడా మన వీరులు వినియోగించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పుడు అర్థమైందా రామబాణం ఎంత పవర్‌ఫుల్లో..
మన పురాణాల్లో రామబాణం, బ్రహ్మాస్ర్తాలు అణ్వస్ర్తాలేనని అంతర్జాతీయ చరిత్రకారులే రుజువు చేశారు. కేవలం బాణాలే కాదు.. ఖడ్గాలు.. పిడిబాకుల వంటి ఆయుధాలు వీరులు వినియోగించారు..ఆయుధాలు మాత్రమే కాదు.. శత్రువు నుంచి వదిలే ఆయుధాల నుంచి రక్షణ కోసం కవచాలనూ సూపర్ సోనిక్ టెక్నాలజీతో రూపొందించారు. కేవలం వీరులకు మాత్రమే కాదు.. తమ వాహనాలకు సైతం ఈ కవచాలను తయారు చేసారు…
ఈ బాణాన్ని తయారీని తెలుసుకోవటానికి దాదాపు పదిహేనేళ్ల పాటు పరిశోధన చేయాల్సి వచ్చింది.. సాధారణంగా మామిడి కర్రను తీసుకుని దాన్ని విల్లు తయారు చేస్తారు. అది విరక్కుండా ఉండేందుకు మరో కలపను ఫైబర్ వైర్ మాదిరిగా విడగొట్టి గమ్‌తో అంటించేస్తారు. ఆ తరువాత అది ఎంత వంచినా విరగదు. దానికి బలమైన తాడును బిగించి కడతారు. బాణాలు కూడా మామిడి కలపతోనే తయారవుతాయి. దాని చివరలో ఉక్కు బల్లాన్ని ఏర్పాటు చేస్తారు.. ఇదే చివరకు రకరకాల వార్ హెడ్స్‌ను కూడా వినియోగించేవారు.
మరో ఆయుధం ఖడ్గం. మన ట్రెడిషనల్ ఆయుధాల్లో ఖడ్గం ముఖ్యమైంది. ఇది అలాంటిలాంటి ఖడ్గం కాదు.. దక్షిణ భారత దేశంలో దొరికే నాణ్యమైన ఉక్కును వినియోగించి తయారు చేసే వారు.. ప్రాచీన కాలంలోనే కాదు.. మొఘలుల దాకా ఆయుధాల తయారీకి మన ప్రాంతంలో దొరికే ఉక్కుతోనే తయారు చేసే వారు. మన రాష్ట్రంలోని ఉక్కు గల్ఫ్ దేశాల దాకా ఎగుమతి అయ్యేది. టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం తెలంగాణా బ్లాక్‌స్మిత్‌లు తయారు చేసింది. చిట్టెం అంటే ఉక్కు అని అర్థం.. చిట్యాల పేరుతో ఉన్న ఊళ్లన్నీ కూడా ఉక్కును ఎగుమతి చేసేవి..
అలాంటి ఖడ్గమే మొఘలులు కానీ, టిప్పు కానీ వాడారు.
ఇది పిడిబాకు..
చాలా తక్కువ ఖర్చుతో, తేలిగ్గా తయారు చేయవచ్చు
మూడు ఇంచుల నుంచి 3 అడుగుల పొడవుంటుంది
ఈ పిడిబాకుకు రెండు వైపులా పదును ఉంటుంది.
శరీరంలోకి దింపితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చొచ్చుకుని వచ్చేస్తుంది
ఈ పిడిబాకును ధర్మరాజు, నకులుడు, శకుని ఎక్కువగా వినియోగించేవారు. మొఘలుల కాలంలో అక్బర్‌కు ఇష్టమైన ఆయుధమిది.
ఇక ఖడ్గం విషయానికి వస్తే దాని తీరే వేరు.. దాంతో దాడి చేస్తే మనిషి ఎముకలతో సహా ముక్కలు కావలసిందే..
ఈ ఖడ్గం చాలా బరువుగా ఉంటుంది
పొడవుగా ఉంటుంది
దీన్ని చేతబట్టి ఒకసారి దాడి చేస్తే ఎంత బలిష్ఠుడైనా ఎముకలు సైతం విరగాల్సిందే..
భారతీయ సంప్రదాయ ఆయుధాలన్నీ హైటెక్ టెక్నాలజీతోనే రూపొందాయి.. సరిగ్గా పట్టుబట్టి ఒకసారి వార్ చేస్తే శత్రువు పని ఖతం అయినట్లే..
ఎన్నో ఆయుధాలు.. ఎన్నెన్నో ప్రయోగాలు.. మన దేశంలో రాజులు, రాజ్యాలు చేసినంతగా మరెవరూ చేసి ఉండరేమో… మనది కాకుండా ప్రపంచంలో గొప్ప నాగరికతగా ఈజిప్టును, రోమ్‌ను చెప్పుకుంటాం.. కానీ, మన దగ్గర డెవలప్ అయినంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకెక్కడా అభివృద్ధి కాలేదనటానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. రావణుడు ఏకంగా విమాన మరమ్మతు కర్మాగారాన్ని నడిపించాడట.. అంటే మన టెక్నాలజీ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
రామాయణ కాలం నుంచి, బ్రిటిషర్లు మనల్ని ఆక్రమించేదాకా భారత సైన్యం నాలుగు విభాగాలుగా ఉండేది. నేలపై నడిచే సైనికులు ప్రధానంగా ఖడ్గాలు, బళ్లాలు పట్టుకునే వారు.. ఇక ఏనుగులు, గుర్రాలు, రథాలు.. మిగతా మూడు విభాగాలు.. వీటిపై యుద్ధరంగంలోకి వెళ్లటం అంత ఈజీ కాదు.. శత్రువు ముందుగా వాహనాన్ని ధ్వంసం చేసేవాడు.. ఆ తరువాత ప్రత్యర్థిపై దాడి చేయటం చాలా సులువవుతుంది. అందుకే భారీ కవచాలతో వాహనాలను ప్రత్యేక రక్షణ వ్యూహాన్ని అనుసరించారు మనవాళ్లు.
అంతే కాదు.. ఇనుపజాలితో పాటు ఏనుగు దంతాలకు విషం పూసిన కత్తులను అమర్చేవారు. దాంతో కుమ్మేస్తే క్షణాల్లో ప్రాణం పోవలసిందే.
అన్నింటికంటే ముఖ్యమైంది రాకెట్ లాంచర్లు.. పది లక్షల ఏళ్ల నాడే విమానాల్లో తిరిగిన మన వాళ్లకు రాకెట్ లాంచర్లు లెక్కలోకి రానే రావు.. రామాయణ, భారత యుద్ధాల్లో తీవ్రస్థాయిలో మిసైళ్ల వంటి ఆయుధాల ప్రయోగాలు జరిగినట్లు ఇతిహాసాల్లో తెలుస్తోంది. ఆధునిక కాలంలో టిప్పు సుల్తాన్ తొలి రాకెట్ లాంచర్‌ను ప్రయోగించాడని చెప్తారు. మొఘలులు, రాజపుత్‌లు కూడా రాకెట్‌లను ప్రయోగించారు.
తుపాకులు కూడా మనకు కొత్త కాదు.. తెల్లవాడు నేర్పిన విద్యేమీ కాదు.. వాళ్లు మన దగ్గరకు వచ్చేసరికే తుపాకులను మనం తయారు చేసుకున్నాం.. రణతంత్రంలో, ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించిన దేశం మనది.. 1300 అడుగుల దూరంలో టార్గెట్‌ను ఛేదించే సామర్థ్యం ఉన్న ఫిరంగులు మనవి..
ప్రపంచంలోనే మన వాళ్లు గ్రేట్ వారియర్స్.. ఇందులో సందేహమే లేదు.. మన వాళ్ల కంటే బలవంతులు లేరన్నది నిజం.. అలాంటి వాళ్లను సైతం ఆంగ్లేయులు ఓడించారంటే.. మన వాళ్లలోని బలహీనతల్ని సొమ్ముచేసుకోవటం వల్లనే సాధ్యమైంది. దేశంలో ఏ ఒక్క రాజునూ తెల్లవాడు నేరుగా గెలవలేదు.. విభజించి పాలించు సూత్రం ద్వారానే పట్టు సాధించగలిగాడు.. మనలో ఆ చీలికలు రాకుంటే.. మనకంటే సూపర్ పవర్ ప్రపంచంలో మరొకటుండేది కాదు.. మన టెక్నాలజీయే ఇందుకు నిలువుటద్దం..

కోవెల సంతోష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *