నైషధతత్వజిజ్ఞాస

అక్కిరాజు ఉమాకాంతం

శ్రీహర్షుడు నిజముగా ఒక అఖండబుద్ధిబలసమన్వితుడు. అజ్ఞాతభాషలో తగవులాడిన దాసీల సంభాషణమును, ఒక్కసారి విన్నమాత్రమున రాజసమక్షము నందు ఒప్పగించ గలిగిన ధారణావంతుడు. తండ్రిని ఓడించిన పండితుని జయించుటకు కృతప్రతిజ్ఞుడై అచిరకాలమున, సర్వశాస్త్రములను నేర్చిన మేధాశా విద్యాస్థానములు చాలక లోకమునంతటిని గ్రసింప జిహ్వాలు చాచుచుండి మేధాసముద్రమును శాంతింపజేయుటకు ఔషధము సయితము సేవింపవలసివచ్చిన అవూర్వశక్తినంపన్నుడు. మానవ హృదయములను ద్రవింపజేయగల రస సందర్శములు వచ్చినప్పుడు, కఠినులను సయితము కరగించగల కవితా హృదయము గలవాడు. నలుడు వట్టుకొన్నప్పుడు నలునిచే వట్టుబడి ప్రియావియోగము తలచుకొని హంస అన్నమాటలు శ్రీహర్షుని హృదయము తెలుపుచున్నవి.

1
“కధంవిధాతర్మయి పాణిపంకజాత్‌
తవప్రియా శైత్యమృదుత్వ శిల్పినః
వియోక్ష్యసే తే వల్లభయేతి నిర్లతా
లిపిర్తలాటం తవనిష్టురాక్షరా
“అయిస్వయూథ్ష్యై రశనిక్షతోపషమం
మమాద్య వృత్తాన్త మిదం బతోదితా
ముఖాని లోలాక్షిదిశా మసంశయం
చశాపి శూన్యాని విలోక యిష్యసి
“మమైవ శోకేన విదీర్ణవక్షసా
త్వయా విచిత్రాంగి విపద్యతేయది
తదాస్మి దైవేన హతోపి వాహతః
స్ఫుటం యతస్తే శిశవః పరాసవః
“తవాపి హాహా విరహాత్‌ క్షుథాశులాః
కులాయ కూలేషు విలుర్య తేషుతే
చిరేణజలబ్భా బహుఖి ర్మనో రథైః
గతాః క్షణీనా స్ఫుటితేక్షణామమ
“సుతాః కమాహూయ చిరాయచుంకృతైః
విధాయకం ప్రాణి ముఖాని కంప్రతి

కథానుశిష్య ధ్వమితి”

(అయ్యో! విధీ! నా ప్రియురాలి మృదుత్వమును జీతత్వమును నీ యేచేయి నిర్మించినదో, అదే మరల ప్రియావియోగమును బొందుదువు అని కఠినాక్షరములను నా నొనట ఎట్లు వ్రాయగలిగెను?

“భార్యా ప్రియురాలా! తోడి హంసలు వచ్చి పిడుగువంటి నా మరణవార్తను చెప్పినప్పుడు అయ్యో! నిస్సంశయముగా ఈ లోకమంతా నీకు శూన్యముగా కనబడును నుమా

“భార్యా! నన్ను గురించిన శోకమువ హృదయము పగులగా నీవు మృతినొందుదువా? హో దైవహతుడైన నేను మరల హతుడను. మన ఆ శిశువులు దిక్కులేక తప్పక ప్రాణములు విడుతురు. అయ్యో! భార్యా ఎన్ని కోరికలో కోరి చిరకాలమునకు పడసిన ఆ కన్ను తెరవని శిశువులు, నీవు కూడా లేకపోగా గూళ్లలో అకటి బాధకు మలమలమాడి, ఒక్క క్షణములో మగ్గిపోవుదురు కదా.

“బిడ్డలారా! తల్లిదంద్రులను కోల్పోయిన బాలిక ఎవరిని పిలిచి ఆహారమడుగుడురు?మీ చలించే ముఖములను ఎవరి వైపునక్కుతిప్పి మాట్లాడుదురు,

“తతోపి మధురతమః కరుణఇతి” (సంభోగశృంగారము కంటే, విప్రలంభము కంటి, కరుణము మధురతమమైనది) “సర్వదైవ మనుష్య హృదయంద్రవతీతి “(అన్ని విధముల మనుష్య హృదయము కరుణమందును ద్రవించును అని, అభినవ గుప్తపాదులు అన్నమాట సత్యము. ఈ తీరున శ్రీహరుడు మనుష్య హృదయములను ద్రవింపజేయగల కవితా సమన్వితుడు. అయితే నైషధము అరవై రెండు సర్గములు సాంతము చదివినప్పుడు, నైషధమునందు అడుగడుగునకు వచ్చు శాస్త్ర సంబంధములైన ప్రశంసలు, అసంబద్ధములైన ఉత్ప్రేక్షలు, అసభ్యములు, అశ్లీలములు, అనుచితములు అయిన పాడు సంభోగ వర్ణనములు కావ్యమును చెరిచి రసపరతంత్రుని విముఖుని చేయుచున్నట్లు నిశ్చయముగా కనబడుచున్నది. ఇంతటి మహా మేధాశాలి, సర్వశాస్త్ర సంపన్నుడు, కావ్యము యొక్క నిర్మలత్వమును కనుగొనజాలక పోయెనా? అని శంక కలుగుచున్నది. ఈ సంగతి విదారించెదను,

కవితా పరిణామము

రానురాను శాస్త్రముల పరిశ్రమ వృద్ధి అయిన కొలదిని కవిత్వము క్షీణించుచుండునను సిద్ధాంతము కొంత వణకు నిజమని నేననుకొను చున్నాను. వాల్మీకితో ఆరంభమై వాల్మీకియందే మహాదశ నారోహించిన సంస్కృత కవిత్వము, తక్కిన కవులందఱకును మార్గదర్శకమయ్యెను. వాల్మీకి ఆదర్శముగా కవితాలోకమున నిర్మల తేజస్సుతో ప్రకాశింపగలిగిన కాళిదాస, భవభూతులయందు, కవిత్వము వికాసము పొందెను. రాను రాను శాస్త్ర పరిశ్రమవృద్ధి అయినది. గొప్ప కవిత్వము జయలుదేజుటకు బదులు, కవిత్వము మీద గొప్ప విమర్శనలు బయలుదేరెను.

గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము గొప్ప కవిత్వము కుంటుపడిన సమయమని చెప్పవచ్చును. ఆనందవర్ధనాచార్యుని ధ్వన్యాలోకము, ముమ్మటుని కావ్యప్రకాశము, క్షేమేంద్రుని ఔచిత్యవిచార చర్చ, ఈ మూడు గ్రంథములును, మహాకవితా శక్తి, మహావిమర్శన శక్తిగా పరిణమించిన రూపమునకు సాక్ష్యములుగా ఉన్నవి. కవితా పరమార్ధములు నశించి క్షుద్ర గ్రంథావతరణము అరంభించినప్పుడే విమర్శ సహితము ఆరంభమగుచున్నది. నిర్మల కవితా రసాస్వాదమనుభవించిన వారు, అవి క్షుద్రకావ్యములు, ఇవి రసహీనములు, వాల్మీకి, కాళిదాసాదుల కావ్యములిట్లున్నవి, ఇట్టిది కవిత, ఇది కవితా పరమార్ధము, ఇది రసము, ఇది రసాభాసము, అని లోకమునకు ఉపదేశించవలసిన అవసరము కలుగుచున్నది. ఇదే విమర్శనకు ఆరంభము. ధ్వన్యాలోక కారుడైన ఆనంద వర్ధనాచార్యుని కాలము వజన క్షుద్ర కావ్యములు, కేవల శబ్దచిత్రములే ప్రధానముగా గల కావ్యములు ఆరంభించినవి. చిత్ర కావ్యములను గురించి 

“తతో న్య ద్రసభావాది తాత్పర్య రహితం, 

వ్యంగ్యార్థ విశేష ప్రకాశన శక్తి శూన్యంచ, 

కావ్యం కేవల వాచ్య వాచక వైచిత్ర మాత్రాశ్రయేజోప 

నిబద్ధం అలేఖ్య ప్రఖ్యం యథాభాసతేత 

చిత్రం నత స్ముఖ్యం కావ్యమ్,

(రసభావాది తాత్పర్యము లేనిది, వ్యంగ్యార విశేషమును ప్రకాశింపనే శక్తిలేనిది, కేవలము యమక చక్రబంధాదులతో, ఉత్ప్రేక్షాదులలో నిబద్ధమైన కావ్యము చిత్రకావ్యము. అది ముఖ్య కావ్యము కాదు) అని అన్నాడు. అలంకారములు ప్రబలినవి. అర్ధాలంకారముగాక, శబ్దాలంకారముగాక ధ్వని అంటే యేమిటి? అది లేనే లేదు, “యస్మినృప్తి నవస్తుకించన”అనే శుష్కతార్కికులు హెచ్చిరి, శాస్త్రముల పరిశ్రమ అధికమైనది, అప్పటినుండి నిర్మలకవిత్వము అడుగంటి కేవలము కవిత్వము మీద మీమాంస మాత్రము అధికమైనది. ధ్వని అంటే ఏమిటి? అది తాత్పర్యము

గాదా? లేకపోతే అనుమానములో అంతర్భావమునొందడా? బాట్యం అభిహితాన్వయవాదము, ప్రభాకరుల అన్వితాభిధానవాదము, ధ్వంకార మతమునకు తోడ్పడునా? ఈ తీరుగా వాదోపవాదములు, మీమాంసలు పెరిగినవి. రసనిరూపణమెట్లు? రసమనగానేమి? రసస్వరూపమేమి? రసము సామాజిక నిష్టమా? వటనిష్ఠమా? విప్రలంభము శృంగారమా? కరుణమా? ఇట్టి మీమాంసలు మఱియొక ప్రక్కన ఆరంభమాయెను. ఈ తీరుగా ఒకవైపునే శాస్త్రవాదములు జరుగుచుండగా షట్ శాస్త్రములయందును ప్రవీలులైన పండితులు కావ్యకరణమునకు గడగుచుండిరి. వాల్మీకి కాళిదాస భవభూతి ప్రభృతుల కవితా ధర్మములు, రసపరవశత్వములు వీరికి పట్టలేదు. శాస్త్ర పరిశ్రమల ఫలములు వీరు కావ్యములయందు ప్రదర్శింప మొదలు పెట్టిరి. ఉత్తమములు కాని కావ్యములు ఆరంభించిన ఆ కాలమున అలంకారములకు వ్యాప్తి హెచ్చెనని తెలిపితిని, వ్యాకరణము, న్యాయము మొదలైన శాస్త్రముల సంప్రదాయములు, సిద్ధాంతములు, కావ్యములలో చూపుట గొప్పగా ఎంచ నారంభించిరి.

నైషధము కలియుగమున 43వ శతాబ్ది మధ్యమున ఉద్భవిల్లెను. ఇప్పుడు 51వ శతాబ్ది గనుక సుమారు 8 వందల యేండ్ల క్రిందట ఆవిర్భవించినదని తెలియుచున్నది. నన్నయ భారతము పుట్టిన తరువాత సుమారు 100, 150 సంవత్సరములకు నైషధము జనించినది. “ఇశంచ అభియుక్త యుక్తిభి రయ మేవసిద్ధాన్తపక్షః యత్ శ్రీహర్ష: భీష్టద్వాదశశతాబ్ద్యుత్తరార్ద్బభూవ ఇతి” అని శ్రీమహామహోపాధ్యాయ పందిత శివదత్త శర్మగారు చేసిన కాలనిర్ణయమును నేను ప్రమాణముగా తీసికొంటిని.

శాస్త్రములు శ్రీహరుని కాలమునాటికి శాస్త్ర పరిశ్రమ భారతవర్షమున హెచ్చినది. శ్రీహర్షుడు షడ్దర్శనములయందు ఆరితేరిన నిపుణుడు, అనిర్వచనీయతను నెలకొల్పుచు, ఖండనఖండ భాద్యమనే గొప్ప శాస్త్ర గ్రంథమును రచించిన మేధాశాలి. శాస్త్రముల భారము క్రింద కవిత్వము అణగిపోయినది. ఏమి చెప్పబోయినా అతనికి శాస్త్రములు అద్దముగా వచ్చి నిలుచుండెను. కవిత్వముగదా అని ఎంత అణచి పెట్టినా యీ శాస్త్రపు తెరలు అతనికి ఆగలేదు. బిల్వబడన్నట్లు కవితాకస్య యితని దగ్గర ఇక వుండలేక తల్లడపడి యుండును. పట్టణమును వర్ణించబోయిన అతనికి వ్యాకరణము అడ్డమువచ్చి, “ఫణిభాషితభాష్య ఫక్కకా” వరరుచి కుండలించిన మహాభాష్యమువలె, దుర్రహముగా ఉన్నది” అని చెప్పించినది. వ్యాసుని హంసమీది బంగారు తెక్కల కవిత్వమునకు తర్కము పెదవి విరువగా ఆ హంసకు “హేమమృణాళినీ ” నాళములు

మేత పెట్టి “కార్యం నిదానాద్ది గుణానధీతే” (కారణగుణములే కార్యమునకు అలవడును, బంగారు మేత బంగారు రూపునిచ్చినది) అని తర్కమును సమాధాన పఱచెను. దమయంతీ కుచములను వర్ణించబోయినప్పుడు తర్కము ముందుకు వచ్చి “కలసే నిజహేతుదందజ”

అనేచోట సమవాయి కారణమును, అసమవాయి కారణమును, నిమిత్త కారణమును ఉపన్యసింప జేసినది. వల దమయంతుల మనస్సమాగమమును దీవించదలచినప్పుడు ఆ తర్కమే మరల దణుకల్యాణుకాది ప్రతిపాదన పూర్వకముగా సర్గ ప్రతిసర్గములను వచింపజేసినది. 17వ సర్గము వద్దకు వచ్చునప్పటికి పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, కాణాదము, గౌతమము, మొదలైన శాస్త్రములు ఒక్క పర్యాయము అన్ని ప్రక్కల కమ్ముకొనెను. ఈ శాస్త్రాలాపములనే ఆ సర్గమునందంతట అతడు నింపెను. ఇంతయెందుకు, “కావ్యేచారుణి, కావ్యేవారుణి” (సాంపైన కాన్యమునందు, సొంపైన కావ్యమునందు) అని అనుకొనుచు వచ్చిన శ్రీహరుడు *ధర్షిత పరాస్తరేషు యస్మోక్రయః”

(తర్కములో ఎవనివాక్కులు శత్రువులను బెదరగొట్టేవో) తర్కేశ్వస్య సమక్రమస్య (తర్కమందు సయితము అసమాన పరిశ్రమ చేసితిని) అని నిజరూపమును

బయల్పరచక ఉండలేకపోయెను. శ్రీహర్షుడు ఎంత మేధాశాలి అయితేనేమి, అతనికి కవిత్వమున ఎంత అభిలాష వుంటేనేమి? అతని శాస్త్రముల ధాటికి కవిత తాళలేకపోయెను. కనుకనే ఆముఖ్య కావ్య లక్షణములైన అస్థానసే శబ్దాలంకారములు, ఉత్ప్రేక్షలు, శాస్త్ర ప్రశంసలు, ప్రధానముగా కావ్యములో నిండిపోయినవి.

శ్రీహర్షుని కాలము

(మహమ్మదీయులు ఆంధ్ర రాజుల కాలముననే ఆరంభమయిన శక బర్బర యవన ప్రభృతి విదేశీయుల ఆక్రాంతి శ్రీహర్షుని కాలమునాటికి స్థిరముగా నెలకొనినది. సబక్తజిన్ యొక్క విజయములు, గజినీ దండయాత్రలు భారత వర్షమును కలత పెట్టినవి. సోమనాథుని పవిత్ర దేవాలయమును మ్లేచ్చుడు కాలదొక్కెను. భారతవర్షము ప్రధమ పర్యాయము యవనుని యెదుట ఖడ్గమును క్రిందబెట్టిన స్థానేశ్వర రణరంగము మిక్కిలి దగ్గర దగ్గరకు వచ్చుచుండెను. వంగ, మగధ, కోసల, కన్యాకుబ్బాది ప్రసిద్ధ రాజ్యములు కన్నీరు విడుచుచు యవనుని చేతబడిన కాలము ఆత్యాసన్నమై యుండెను. భారతీయ రాజాస్థానములు ఒకటి వెంట ఒకటి శీఘ్రముగా యవనానలముముందు కమిలిపోవుచుండెను. స్వాతంత్ర్య దీప్తితోపాటు సర్వధర్మములు గమనోన్ముఖములు కావొచ్చినవి. మహమ్మదీయుల ఇంద్రియ లోలత్వము, పరాధీనుల స్త్రీత్వ ప్రతిపత్తి, భారతవర్షమున రాజమందిరములలో, సాధారణ ప్రజలలో ప్రవేశించ నారంభించినవి. వాస్తవముగా ధర్మదేవత ఒంటికాలిమీద నడవవలసిన సమయము ప్రాప్తించెను. ఒక తట్టున మహమ్మదీయులు స్థిరపడుచుండగా, మణి యొక ప్రక్కన దారిద్ర్య దేవత భూమియందు కాలు కుదుర్చుకొను చుండెను. ఈ మహమ్మదీయుల ఆక్రమణము వలన, దేశము పొందిన విపతును కనిపెట్టియే

 “ఉదృత్య భూమిం యవనాభి మగ్నాం”

 (యవనాళియందు మగ్నమైన భూమిని ఉద్ధరించి)

అని ఒక రెడ్డి రాజును ఒక తెలుగు కవి కీర్తించెను. భారత భూమి యవనాక్రాంతమైనప్పటినుండి అర్ధపురుషార్ధము అన్యాధీనమైనది. ఏనాడు అర్ధము యవసహస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను.

సువర్ణము అతనికి దూరముగా నిలువబడి తళతళకాంతులతో అతనిని భ్రమపెట్టసాగెను. శ్రీహర్షుడు కాలప్రాప్తమైన పరాధీనతను తప్పించుకొనలేక పోయెను. రాజుల సువర్ణ ప్రాసాదములు, అతనికి దివ్యభూములవలె తోచుచుండెను, రాజుల సువర్ణవర్ణ వదనములనుండి వచ్చినమాట అమృతమయమై అతనికి వినబడుచుండెను. రాజుల సువర్ణ హస్తములనుండి జారిన తృణము పుణ్య పరిపాకల్యమైన మహాప్రసాదమువలె తోచుచుండెను. అందుకే 

“తాంబూలద్వయ మాసనంచ లభతే

యః కావ్యకుజేశ్వరాత్” 

(రాజు నన్నుకూర్చోమంటాడు, రాజు నాకు రెండు తాంబూలములిస్తాడు) అని యెంతో గొప్పగా చెప్పుకున్నాడు. రాజు కూర్చోమనడమే, రాజు తాంబూల మియ్యడమే ఒక పెద్ద విశేషముగా చెప్పుకొనవలసిన అర్థదాస్యరూపమగు దీవదశనుండి తప్పించుకొన లేకపోయెను. రాజాంతఃపురమునకు, రాజకుమారులకు, నిల్వ నీడనిచ్చినట్టి వాల్మీకితో ఆరంభమైన కవిపరంపర అధఃపతనమునొంది,

రాజు సువర్ణవదనముతో రమ్ము పొమ్మనడము గొప్ప వరముగా తలచవలసిన దీనదశకు వచ్చినది. వ్యాసుని హంసవలె తెక్కలయందు మాత్రమేగాక సువర్ణమయీ తను! ….. సువర్ణ శైలాదవతీర్య, నై) వొళ్లంతటా సువర్ణముతో, సువర్ణ శైలమునుండి దిగి వచ్చిన ఆ సువర్ణ హంసము అతనిని తప్పక మోహ పెట్టియుండును. సువర్ణ నైగనిగ్యముచే కన్నులు మిరుమిట్లు పడగా, లేఖిని పతితమైనది.

వాల్మీకి ధర్మమునకు అర్ధకామములను క్రిందుజేసెను. భర్త అరణ్యమునకు బయలుదేరినప్పుడు,

 

“అగ్రత, గమిష్యామి మృద్నంతీ కుశకంటకాన్”

కుశకంటకములను తొలగించుచు మాకు ముందుగా నేను నడుస్తారు. అని ధర్మము కొఱకు అర్థకామములను త్యాగము చేసిన సీత వాటికి సరమున వెలయగలిగినది. వ్యాసుడు ఒకసారి ధర్మమును, ఒకసారి అర్ధ కామములను మూడు చేయుచు చివరకు అర్థకామముల భుజముల మీదనే చెయివేసెను. అనేక సంవత్సర సహస్రములు రతిక్రిదలనుభవించినను చాలక ఆ రతి క్రీడల కొరకే మళ్లీ తనువుదాల్చి 

పురాదశ సహస్రాణి దనినాం వాజినామపి 

యం యాన్త మనుయాంతిస్మ సోయం ద్యూతేన జీవతి 

సోయం ద్యూత ప్రవాదేన శ్రియశైవావరోపితః 

తూప్రీమాస్తే యధా మూధ: స్వానికర్మాడి చింతయన్

 పార్థివస్యసుతానామ కాను జీవితమాదృశీ 

అనుభూయ భృశందుఃఖ మన్యత్ర ద్రౌపదీంప్రభో (విరా.)

“భీమసేనుడా! పదివేల యేనుగులు, వదివేల గుఱ్ఱములు, ఎవని వెంట నడుచుచుండెనో ఆ యుధిష్ఠిరుడిప్పుడు ద్యూతమువల్ల జీవించుచున్నాడు.

“ఆ (వైభవ సంపన్నుడగు) యుధిష్ఠిరుడిప్పుడు అన్ని సంపదలను బోగొట్టుకొని స్వకర్మములను తలపోయుచు, మూధునివలె ఊరక కూర్చున్నాడు.

ద్రౌపది తప్పితే, నావంటి రాజకుమారి ఎవతె ఇంతటి కడగండ్ల సుభవించి బ్రతుకగలదు?” అని భర్తను దెప్పిపొడిచి అర్థ కామములను ఆరాధించిన ద్రౌపది అతని కావ్యసర్గమున ఉత్తమ నాయిక యయ్యెను. రామాయణ కాలమున మూడు పాదములమీద నడచిన ధర్మము, భారతకాలమున రెండు పాదముల మీదనే నడచినదని ధర్మజ్ఞులు చెప్పు సంప్రదాయవచనము సత్యము. కాళిదాసు భారత సర్గముతో తృప్తి చెందలేదు. దానిమీద ఒక మోస్తరు ప్రతిక్రియనే అతడు నడువగలిగెను. కాళిదాసు

అర్ధకామములను ధర్మముతో శబలితము చేసి వాటి నిర్మల స్వరూపమును అతడు వీక్షించెను.

క్రీత స్తపోభితితి వాడిని చంద్రమౌళౌ, 

అహ్నాయ సా నీయముజం క్లమముత్ససర్జ” 

(ఓ పార్వతీ! తవస్సుచేత నన్ను వశపరుచుకొంటివి) అని అనగానే తపః గేశమును ఆనందముగా అనుభవించి, ధర్మముచేత కామముక్క సుందరరూపమును చూచిన పార్వతి, కాళిదాస సర్గమున మనకు గోచరించు చున్నది. వాల్మీకి సీమ వనము; వ్యాసుని సీమ ప్రాసాదము. ప్రాసాదమును, వనమునకు క్రిందు చేసెను కాళిదాసు. రఘువంశము, కుమార సంభవము, శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము ఈ అన్నిటియందు కాళిదాసు యొక్క యీ మనస్తత్వము మనకు తెలియుచున్నది. దీనిని ప్రేమ పరిణామమున వివరించితిని. కాని ధర్మదేవతకు మూడుకాళ్లు విరిగి ఒంటికాలిమీదనే కుంటుచు నడచిన కాలము వచ్చెను.

భారత వర్షము యవనాక్రాంతమైనది. ఉత్తమ పురుషార్ధములు నశించగా అర్ధదాస్యము, అనంగ సేవ ప్రజలకు పరమపురుషార్ధము లాయెను. కవులకు రాజభవనములే దివ్యప్రదేశములాయెను. అర్దము పరాధీనమై భారతీయుడు

ఆత్మాధీనతను కోల్పోయెను. అర్ధము దూరమైన కొలదీ అర్ధకామములకు దాసులైరి. దాని గొప్ప రూపము భారతీయ రాజులకు, ప్రజలకు ఎక్కువగా కనబడసాగెను.

 “పునశ్చయాచమానాయ జాతరూప మదాత్ ప్రభుః”

శ్రీ భా. 1వ స్కంధము) ద్యూతము, పానము, స్త్రీలు, హింస అనే స్థానములతో కలి తృప్తి పొందక మళ్ళీ అడిగితే పరీక్షిత్తు కలికి సువర్ణమనే అయిదవ స్థానము కూడా ఇచ్చెను, అని శ్రీభాగవత కర్త అన్నట్లు సువర్ణము నిజముగా కలివశమైనది “ఆశ్రమా యననైరుద్దా”

( పద్మ) అని ధర్మతత్పరులు చింతిల్లిరి. ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్చిన్నము లాయెను. మహమ్మదీయుల విషయలోలత్వము దేశమున వ్యాపింపజొచ్చెను.

శ్రీహర్షుని రాజైన జయంత చంద్రుని యొక్క మంత్రి ఒక సరస్సు దగ్గర దాకలివాని చలనమడతను పసిబట్టి, ఆ చీరను ధరించిన యౌవనస్థను, విధవను గృహమునుండి లేవదీసి తన రాజుకు భోగ కాంతను చేసెనని, ఈ రాజు కాంత దివరకు ఒక మహమ్మదీయుని పట్టణము మీదికి తెచ్చెనని కథలను చదువునప్పుడు, ఆ కాలమున రాజవంశములయందు విషయలోలత్వము ఏ తీరున ప్రసరించినది, యవనులు ఆక్రాంతి దేశమున ఏ విధమున నెలకొనినది మనకు కొంత వఱకు విశదమగుచున్నది.

*సరస్తటే రణరక్షాళి తాయాం శాటికాయాం నిలీనం మధుకరకులం దృష్ట్యా (దదర్శ) ……. సూపవదేవీ నాన్నా శాలాపతిపత్నీ యౌవన విధవా దర్శితా తాం….. జయంత చంద్ర భోగినీ మకరోత్ రాజీ క్రుద్ది ధనాధ్యతయా స్వచ్ఛన తయా నిజ ప్రధాన నరాన్ ప్రేష్య …. తక్షశిలాధి పతిః సురత్రాణ … ఆయాతి…. “మేచ్ఛ ధనుర్యానేషు మగ్నాని ధ్వానాంతరాణి యవనై ర్లాపుతా

(రాజశేఖరుని ప్రబంధ కోశమునుండి శ్రీ శివదత్త శర్మగారు ఉదాహరించినది) కామశాస్త్ర సంపుటములు కళకళలాడ మొదలు పెట్టినవి. 346 శ. లోటీ వంశస్థుడైన లాటభానుని వినోదమునకు, కల్యాణమల్లుడు అనంగ రంగమనే కామశాస్త్రమును సంస్కృతమున రచించెనని తెలిసినప్పుడు, మహమ్మదీయ రాజభోగుల విషయలోల త యొక్క స్వరూపము కొంత మనకు గోచర మగుచున్నది.

శ్రీహరుని మటుకు శ్రీహరుడు వలుతావుల కామశాస్త్రమును పేరు పెట్టి ప్రశంసించెను. ఆ శ్లోకములను గ్రంథ విస్తరభీతిచే ఉదాహరించలేదు. నలుని చరిత్రము వ్రాయబూనినప్పటికీ, బహుకామినీ సంసర్గమున పరిభ్రమించు మహమ్మదీయ కాలపు రాజభోగియే అతనికి సాక్షాత్కరించుచుండెను. వ్యాసుని

నలుడు భోగ ప్రమత్తుడు కాడు. శ్రీహర్షుని నలుడు బహుభామినీ బాహులతా పరివేష్టితుడు. అనేక కామినీ సంసర్గమున ఓలలాడుచుండిన భోగి. అందుకనే

“శుద్ధాంత సంభోగ నితాంత తుష్టే

ననైషధే ర్యమిదం నిగాద్యమ్” 

 అభ్యర్ధనీయః స గతేన రాజా 

త్వయా నశుద్ధాంత గ తోమదగ్ధమ్

ప్రియావ్యదాక్షిణ్య ఐలాత్మృతోహి 

తదోదయే దన్యవధూనిషేధ:”

 (ఓ హంసా? అంతఃపుర కామినులతో ఉన్నప్పుడు నలుని ప్రార్ధించవద్దు.

ప్రియురాండ్ర సుందర ముఖముల చూచుచున్న బట్టి సమయమున ఇతర కాంతా నిషధము తప్పక సంభవించును. అంతఃపుర కామినులతో సంభోగించి బాగా తృపుడైన నలునికి నా సంగతి చెప్పవద్దు) అని దమయంతిచేత శ్రీహర్షుడు చెప్పిస్తాడు. ఇది కాలతత్వము.

శ్రీహర్షుని మీద కాలము సంపూర్ణాధికారము వహించినది. ఆత్మబలోన్నతి గల అసాధారణ శక్తి సమన్వితులుగాని, కాలమును మీరలేరు. శ్రీహర్షుని కాలమునాటికి ప్రాచీన ధర్మములు లుప్తములై, సార్వభౌముల వలయములందు, సంపన్నగృహములందు, సాధారణ ప్రజలయందు, మహమ్మదీయ రాజభోగుల విషయలోలత్వము ప్రజలినది. సాహిత్య మార్గములు సైతము ఈ పరిణామమును తప్పించుకొనజాలక పోయెను. ఆ కాలమున పుట్టిన నైషధము, అప్పటి లక్షణముల నన్నిటిని తాల్చక తప్పకపోయెను.

ఈ కావ్యము యొక్క ముగింపు సైతము కాలతత్వమును తెలుపుచున్నది. అప్పుడు రణరంగములు వెలసినా, ఆ రణరంగములందు పోరాడినది భోగ లంపటమైన ఆసుర ప్రకృతి. అప్పుడు ధర్మ సంస్థాపన కొరకు వీరుడు ప్రతి వీరునితో పోరాడలేదు.

విషయలోలతోన్మత్తులైన రాక్షసులు రాక్షసులు పోరాడికి. ఇక ప్రజలు విషము సులలోలురై క్లేశములను సహించగల వీరత్వమును కోలోయి పూకు తుల్యులైరి. కంరమాలలు కంది పోవునో, హరిసశయనములకు హావముతో, కాంచనచేలముల కొంతి మాయునో అని సుఖసాధనములను కాపాడుకొను ఆడవారి చిత్త దౌర్బల్యము దేశమందలి జనులకు సాధారణమాయెను. దాట్యక ప్రభృతులు ఆరాధించిన వియోగ శృంగారము,

శృంగారే విప్రలంబాబ్యే కరుణేచ ప్రకర్షవత్”

అని ధ్వనికారుడు కీర్తించిన వియోగశృంగారము శ్రీహర్షునికి దుస్సహమాడను. వ్యాసుడు నలదమయంతుల వియోగము చెప్పినా. శ్రీహర్షుని భోగపరాయమైన పరాధీన లేఖిని మాత్రము నల దమయంతుల సంభోగమునుండి ఒక అంగుళమైనను కదలజాలక సంభోగములోనే ఆగిపోయెను.

“ఆరాధ్యాయస్వ పంచబాణమ్” (నలోక్తి)

(మదనుని ఆరాధించవలసినది) అని సంభోగములోనే నలదమయంతులను నిలిపెను. నైషధమున ప్రధానమైన యీ సంభోగ శృంగారమును, శ్రీహరుడైట్లు ప్రతిపాదించెను? అని పరిశీలన చేసెదను.

వాల్మీకి, కాళిదాసు, భవభూతి, చూరగలిగిన శృంగారము యొక్క నిర్మల స్వరూపమును, శ్రీహరుడు, కనుగొనలేకపోయెను. కూర్చో. ఇదిగో కాంటూలము అని మహావరములిచ్చిన రాజభోగి ఆ కాలమున రతిలాలసుడై ఆలకిస్తున్నపుడు, శ్రీహరుడు కామోద్రేకమైన సురతశృంగారమును వినిపించక యెట్లు మానగలడు? కావ్యము పతితమగునేమో, నలదమయంతులు అధమనాయకులగుదురేమో అని ఆలోచించుకొన లేకపోయెను.

ఒక తిండిపోతు మిక్కిలి ఆసక్తితో గారెలు తింటూ వుంటే అతడు వాటిని కొరకదము, సమలదము, నమిలీనములకుండా మింగడము, ఇంకొరగారెను కొరకడము, చెవిమెలవద్ద పిండి అంటు కొనడము ఇవన్నీ వర్ణించడము ఏ తీరున వుంటుందో, కామోన్మత్తుడు భార్యను ఒళ్ళంతటా, బొడ్డు రంధ్రమును సయితము ముద్దు పెట్టుకొనడము, కంచుకము విప్పడము, నీవి సడలించడము, స్తనములను మర్దించడము, ఊరువులను పీడించడము మొదలైన కామపు పనులను వర్ణించడము ఆ తీరుగానే వుండును.

ఇది గ్రామ్యసంభోగవర్ణనము. ఇవన్నీ పశువృత్తులు. ఇవన్నియు నలుగురు వినవలసినవి కావు. ఉన్నదివున్నట్లు వర్ణించడము స్వభావోక్తిగాదా అంటారా? అట్లు గాదు. ఉత్తమ ప్రకృతిని ఉన్నదున్నట్లు వర్ణించడమునందు ఆనందజనకత్వముగలదు గాని, అధమ ప్రకృతిని ప్రధానముగా కావ్యమున వర్ణించినప్పుడు, రోతయే పుట్టుచున్నది. కలుషిత చిత్తులకుగాని, అవి ఆనంద జనకములుగావు, ఇంద్రియములను విడిచి, భావము నాశ్రయించినప్పుడే శృంగారము పవిత్రమగుచున్నది. సురకైక లక్షణమైన గ్రామ్యసంభోగము మొదలైనవి పశువృత్తులని చెప్పితిని. ఇట్టి పశుత్వమును దాటినప్పుడే ప్రకృతికి ఉత్తమత్వము సిద్ధించుచున్నది. ఉపదేశ ప్రాప్తికేమి, కావ్యపరమ ప్రయోజనమైన ఆనందసిద్ధికేమి ఈ ఉత్తమ ప్రకృతియే అవలంబన మగుచున్నది. గనుకనే 

“నగ్రామ్య మాచరేత్ కించిత్” (దశ.)

 అని సాహిత్యవేత్తలు హితము చెప్పిరి, 

“ఉత్తమ ప్రకృతే రాజా దేరుత్తమ ప్రకృతి నాయికాభిస్సహ

గ్రామ్యసంభోగ వర్ణనం….. సుతరాం అసహ్యం” అని రసవేత్తయైన ఆనందవర్ధనాచార్యుడు పలికెను. ఇట్టిగ్రామ్య సంభోగమును క్షుద్ర ప్రకృతికి ప్రహసనములలో చెప్పితే, నవ్వు పుట్టించుటకు ఉపయోగపడునుగాని, ఉత్తమ నాయకులకు మిక్కిలి అనుచితమైనది. ఈ అనుచితమైన పనినే శ్రీహరుడు చేసెను. కాల మహిమచే విషయలోలత్వమున దృష్టినిల్పిన శ్రీహరుడు, ఉత్తమ ప్రకృతులైన నలదమయంతులకు గ్రామ్యసంభోగమును తగిలించెను,

నైషధము ఉత్తమ కావ్యము కాదు. 

“దమయంత్యా నలస్యచ”

అని సంకీర్తనమునకు పాత్రమైన వ్యాస నలుడు శ్రీహర్షుని కామ్యమున పరిహాసమునకు పాత్రమాయెను. మొదట శ్రీహర్షుడు పిటులను, ఏలా సినులను ప్రవేశ పెట్టి చేసిన గ్రామ్యవర్ణనలు తెలిపెదను. నలదమయంతుల వివాహమైన తరువాత, కవి విందు నొకదాని నేర్పాటుచేసి దానిలో విలాస పురుషుల చేపలు వర్ణించి కుతి తీర్చుకుంటాడు. 

  1. ఒకనికి స్త్రీలు కామమోదన మియ్యపలెనంటాడు, 
  2. ఒక దాసి మెల్లగా తొండను తీసికొని వచ్చి నలునికి విసనకర్ర వీచేదాని కాళ్ళ దగ్గర బెట్టినది, అది తాకగానే ఉలికిపడి ఎగిరినది. ఆ గజిబిజిలో వీరముడి వీడినది, ఉపాయముతోచక గుడ్డవిప్పి వేసినది. చీరవిడిచిన ఆ స్త్రీని చూచి అందటనవ్విరి. 
  3. ఒకతె పరాకున ఉండగా, ధూర్తుడు అద్దము తెచ్చి దాని కాళ్ళ సందున చూడకుండా పెట్టెను. దానిలో ప్రతిబింబితమైన భగమునుజూచి నవ్వెనట. 
  4. రవికచాటున ఉన్న కుచములను చూడవలెనని ఒకడు తంటాలు పడుతూవుంటే ఆమె పానక హోమ కుంభము పట్టుకొని తన స్తనములు ఇంతలా వున్నవని తెలుపుతున్నదట. 
  5. రతికి మన ఇద్దరికి సమయమెప్పుడని అడగడానికి, ఒకడు ఉష్టాన్నమును శీతాన్నమును పట్టుకున్నాడు, ఉష్టాన్నము పగటికి, శీతాన్నము రాత్రికి గుర్తులు. ఆమె ఇది గ్రహించి పెదవి విరచింది. అంటే పగలూ కాదు, రాత్రీకాదు సంధ్యాకాలమున అని అభిప్రాయము.

 ఇట్టివి శ్రీహరుడు చెప్పుటకు వెనుకాడలేదు. శ్రీనాథుడు దీనిలో సందుచేసికొని తన ముచ్చట తాను తీర్చుకున్నాడు. “నీవు భగవదారాధన ప్రాప్తివి” అని ఒకడు ఒక స్త్రీతో అన్నాడట. 

“విద్వజ్జనులు నిన్ను విషయించివత్తురు” అని మణియొక్కడన్నాడట. ఈ విధమున ఇతని బులుపు ఇతడు వెళ్ళబోసికొనెను. ఈ విందులో విలాసులు, షడ్రసములేకాకుండా, అపాఠశృంగారమనే సప్తమ రసమును అనుభవించిరన్నాడు.

 “అపార శృంగారమయస్సమునిష్మన్

దృశం రసపోష మధత్తసప్తమః”

ఇక ఈ శ్రీహర్షుడు నల దమయంతుల పడకగది వద్దకు పోవుచున్నాడు. వాకిట్లో నిల్వబడతాడేమోనని మన మనుకొందుముగాని అతడు లోపలికి పోదలచుకొనియ వచ్చెను. పోయినాడు. దమయంతి పడకగదిని చూచినాడు. అతనికి ఆ కాలపు భోగమిలాసములన్నీ ఎదట ఆడుతున్నవి. “తాం తృతీయ పురుషార్ధ వారిదే! పారలచ్చునతరీ మరీరముత్” కామసముద్రమును దాదించినది ఆ దమయంతి అని అన్నాడు. ఆమెతో రమింప మొదలు పెట్టినాడు. ఎట్లా? “దివానిశం” రాంత్రింబగళ్లు. నలుని వంటివానికి దివామైధునమా అని యైనా శ్రీహర్పుడు సంకోచించలేదు. దీనికోసము ప్రత్యేకముగా రాజ్యము మంత్రులకు ఒప్పగించినాడన్నాడు.

“స్వస్య మంత్రిషు సరాజ్య మాధరాత్” 

ఎందుకు? మన్మథ క్రీడలకు.

ఆరరాధ మదనం ప్రియాసఖ:”

 ఇట్లాటి వానినే రఘువంశపు రాజును కాళిదాసు భావించెను. అతడు ప్రజలకు దర్శనము సైతము ఇయ్యణాలక గవాక్షముగుండా కాలుజాపి దానిని చూచి పొమ్మని చెప్పేవాడట. కాని కాళిదాస కవి, ఈ భోగలంపటుడు క్షయపుట్టి చచ్చినాదని వీనిమీద జుగుప్స పుట్టేవిధమున ఇతని కథను ప్రదర్శించెను. కాని శ్రీహరునికి ఆ ఔచిత్యజ్ఞానము కాల మహిమవల్ల నశించినది. ఉత్తమ నాయకుడైన నలుని దుర్గతి పాలుచేసెను.

నలుని పడకటిల్లు మేరు పర్వతమువంటి బంగారు మేడలో ఒక మణిమయ నుందిరము. దానిలో చిలుకలు కామశాస్త్రములోని నఖక్షతదంతక్షతములను, ఆలింగనభేదములను తెలిపే కారికలను చదువుతున్నవి. 

“యత్ర పుష్ప శరశాస్త్ర కారికా

సారికా ధ్యుషిత నాగదంతికా”

ఆ పడకటింటిలో పటాలున్నవన్నాడు. ఒక ప్రక్కన ఇంద్రుడు అహల్యతో వ్యభిచరించిన పటము. 

“పారదారిక విలాస సాహసం 

దేవభర్తు రుదంకి భిత్తిషు” 

మఱియొక వైపున తారాశశాంకుల అభినయములు చెలరేగుచున్నవి. 

గౌరభాను గురుభామినీ స్మరోద్వృత్త

భావమితి వృత్తమాశ్రితాః 

ఇంకొక ప్రక్కన తపశ్శాలురు ఋషులు సయితము అప్సరసల కుచములు పట్టుకొనివున్న పటములు. వేటొక ప్రక్కన శ్రీకృష్ణునికి నలునికి కాలసంఘర్షణ దోషము సంభవించిన నేమి? ఆ బోగ విలాసములు, ఆ రతిక్రీడలు, ఆ కామోద్దీపనములు, అతనికి కావలసి వున్నవి. కనుక వాటిని నలునికి అతడు సమర్పించెను. దమయంతి పడకటింటిని, వ్యభిచారపు ప్రతిమలతో నింపిన శ్రీహరుని మనస్తత్వము ఆ కాల మహిమను చాటుచున్నది. శయనము నెక్కేవరకు ఉండిమైనా మరలలేదు. వారిద్దరు పాన్పుమీద ఎక్కిరి. ఇక శ్రీహర్షుడు ఎట్లు మరలగలడు? అప్పటి విధమును అతడు చెప్పెను. వాటిని క్లుప్తముగా నేనిచ్చట తెలిపెదను.

స్తన గ్రహణము (అస్మృతత్ సతదురోజుకోరకా)

ఈ స్తనగ్రహణములో, పీడనములో పలువిధములు చెప్పెను. ఆమె కుచములను చేతులతో కప్పడము వాటిని తీసివేసి ఇతడు పట్టుకొనడము, ఇటువంటి లీలలు ఉన్నవి.

నలుదిట్టి పనులు చేసినా లేదాయని విచారణకారు. నలుడు చేసెనో లేదో శ్రీహరుడూ ఎరుగడు. నేనూ యెరుగను. కాని ఉత్తమ ప్రకృతులని మనమనుకునే నలునికి, దమయంతికి ఇట్టి చేష్టలు కవి వర్ణించడము అనుచితమనియ నేను చెప్పుచున్నాను. అవును సరే. వ్యాస నలుడు ఉత్తమ ప్రకృతియే కాని శ్రీహరుని నలుడు వేజు, అతనికి ఆ చేష్టలు సరి పోవునంటారా, అనుట నాకు ఇష్టాపత్తియే. ఉత్తమ ప్రకృతి ని నలుని నాయకునిగా చేసి బంధించిన శ్రీహర్షనైషధము ఉత్తమ కావ్యము కాదని స్పష్టప డుచున్నది గనుక నాకు ఇష్టాపత్తి అని ఆంటిని. అవునయ్యా! కావ్యమునందు నీతి ప్రశంస అవసరము లేదుగరా అంటారా? అవును. నీతి ప్రధానము గాదు. అది సత్కావ్యమున ధ్వనించి తీరుచునే యున్నది. నీతిగాని దుర్నీతిగాని వాచ్య రూపమున నేని, ధ్వనిరూపమున నేని, నిర్వచింప చెప్పవీలులేని సరో వర్ణన, చంద్రోదయ వర్ణన మొదలైన వద సంచయములందు సయితము మను పావనమైన ఒక విధమగు ఆనందము సంఘటిల్లుచున్నది. కాని గ్రామ్య సురతాదులు మనస్సును కలుషితముచేసి కావ్యమును దోషవంతము సేయుచున్నవి. కనుకనే నలదమయంతులను అధమ ప్రకృతులను చేసి గ్రామ్యసంభోగ వర్ణనాదులచే నైషధమునకు ఉత్తమ రావ్యత్వమును దూరము చేసెనని చెప్పుచున్నాను.

 *ఆంధ్రాణామేవ కార్యేతు

  సింధుంతీర్వాభియాస్యంతి భారత శ్రీ జిఘృక్షయా” (కలియుగ రాజవృత్తాంతము)

సింధువును దాటి భారతశ్రీని వశపటుచుకొనుటకు యననాదులు వస్తారు. అని ఇతిహాసికుడు చెప్పినవుడు అతని మనస్సు వాస్తవముగా ఖేదపడినది. విశ్వగుణాదర్శకారుని యవనాంతి విషయక భేదము సయితము తద్రూపము కొంత తెల్పుచున్నది. ఏనాడు శక యవన బర్బరాదులు సింధువును దాటిరో, ఆనాడే భారత శ్రీతోపాటు, భారతీయుల సర్వధర్మములు గమనోన్ముఖములైనవి. భారతవర్షము ప్లేచ్ఛాక్రాంతమైన కొలదిని భారతీయుల ఆచారములు,

 

సంప్రదాయములు, కవితలు, గానములు, కలుషితములు కావడం భారతీయుల దృక్పథమే అధోముఖము కావడమైడు. ఆ విదములలో పరాయణత్వము, విషయ లోలత్వము కావుడు గమ్మినటు వ్యాప్తమై, ఆ కాలమున కవిత్వము కలుషితమై భావసీమలనుండి దిగివచ్చి బాహుమూలములలో నేరునిమురుచున్న ఆ సమయమున, శ్రీహర్షుడు కావ్య కరణమునకు కూ కలుపిత కావ్యమునే రచించవలసిన జడాయెను.

“శృంగారామృతశీతగా” “కవికుల దృష్టాధ్వంపాందే” యేమహా కవి శిరస్సు దీక్షితా: పాంసులాభిరపియేన శిక్షితా!”(శృంగారామ్మతమునకు చంద్రుడను, వాదాసాది కథలు సయితము ఎరుగని మార్గములో సంచరించే నా కావ్యములో, ఏ రతి క్రీడలు కార్మిక కాళిదాసాది మహాకవులకు గూడా గోచరించలేదో, ఏ రతిక్రీడలు అంజలు కూడా ఎరుగనివో వాటిని నల దను యంతు లనుభవించిరి అని బుజములు కొట్టుకొని మురిసెనేగాని కాళిదాసాది కవులు వర్ణించిన గ్రామ్య శృంగారము తన కావ్యమును పతితము చేయు చున్నదని, నల దమయంతులు తన చేతిలో క్షుద్రులగుచున్నారని, అతదు కాలమహిమచేతనే తెలిసికొనలేకపోయెను. కాల మహిమవల్ల వింత ఆంధత లేకపోతే లంజలు కూడా ఎరుగని అని నలదమయంతుల పట్టున చెప్పు సాహసించగలడు? భోగపరాయణమైన రాజ ప్రకృతిని పూజించ ఉపక్రమించినట్టి అతని దృష్టి రతిలాలసమైన రాజముఖమునందే నిల్చినది. అందుకే కాశ్మీర రాజులు బుజము తట్టినదాకా, జయంతచంద్రుడు శతానని తల ఆడించినదాకా నైషధము నవ్వు మొగము దాల్చలేకపోయెను. అది కాల మహిమ, కాలాధికారమును మీరగల ఆత్మబలోన్నతుడు కాడు శ్రీహరుడు. అందువల్లనే ఆ కాలపు పాడురుచులను సంతోషపరుపదలచి నలదమయంతుల పడక గదిని వ్యభిచారపు బొమ్మలతో నింపి వేసెను. నలుని గ్రామ్య మైరున లోలుని చేసెను. ‘దమయంత్యా నలస్యచ’ అని పుణ్య సంకీర్తనమునకు పాత్రమైన ఉత్తమ నాయిక, సాధ్వి, దమయంతి యొక్క తొడలు, చంకలేగాక భగమును సయితమును బయట పెట్టెను. ఈ తీరుగా ఉత్తము పాత్రలను చెడగొట్టి కాల మహిమచే శ్రీహరుడు నైషధమును దుష్ట కావ్యము చేసెను.

సయితము లక్ష్యమునందు ఏ అసమీక్షకారిత (బాగా ఆలోచించి చేయకపోవడము) కనబడుచున్నదో అది దోషమే అగుచున్నది) అని చెప్పి ప్రస్తావనము ముగించెను.

ఈ తీరుగా శృంగారము పఠితమైపోయినది. నిజముగా కరుణము తరువాత శృంగారమంత మధురమైన రసములేదు. లోక ప్రవృత్తికే హేతు భూతమైన శృంగారము ఎట్లు మధురము కాకుందును? మొట్టమొదట మహాకవి వాల్మీకి పవిత్ర వదనము నుండి వెలువడిన ఆ పావన పదములలో కరుణము, శృంగారము ఇమిడి పారవశ్యమును కలిగించుచున్నది.

“మానిషాదప్రతిష్టాంత్వమ గమత్ శాశ్వతఃసమాః య ంచ మిధునా దేశ మనధీః కామమోహితమ్” ఓ నిషాదుడా కామమోహితమైన క్రౌంచ మిధునములో ఒకదానిని చంపితివి.) అన్నాడు. ఆహా! వాల్మీకి!

శృంగార పరతంత్రమైన ఆ క్రౌంచ మిధునము ఆ నిర్మలచిత్తుని హృద యమును అమృతమయము చేసినది. అప్పుడు సంభవించిన ఆ వియోగము ఆ నిర్మలచిత్తుని హృదయమును ద్రవింపజేసినది. ఈ రెండింటి సమ్మేళనము హృదయము నుండి కవితను వెలువడజేసినది. అందుకనే ఆనంద వర్ధనాచార్యులవారు “క్రౌంచ ద్వంద్వ వియోగోత్ర: శోక శ్లోకత్వమాగతః” అన్నాడు.

వాల్మీకి, సీతారాముల సంయోగ వియోగములు! కాళిదాసుని పార్వతీ వరమేశ్వరుల సంయోగ వియోగములు! యక్ష తత్సతీవియోగము, భవభూతి సీతారామ వియోగము! వియోగ సంయోగ, శృంగారముల యందలి పావన మాధుర్యము! లోకమును ఆనంద పారవశ్యమున ముంచుచున్నది.

“శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాద నోరసః … శృంగారే విప్రలంఖాఖ్యే కరుణే చప్రకర్షవత్…. అని ఆనంద వర్ధనాచార్యుడు ఈ ఆనందమును ఆరాధించుచున్నాడు. ఇట్టి పవిత్రమైన శృంగారము ఏ తీరున విషయలోలురైన యవనరాజుల ఆక్రమణము తరువాత పతితమైనదో తెలిపితిని. పతీతమైన యీ శృంగారము ఆ పతిత కాలమున ఆవిర్భవించిన శ్రీహర్షుని నైషధము నందు

సర్వలక్షణములతో నెలసినది.

కావ్యమనేది, ఆ కాలమునందు దేశమున ఉన్న సంప్రదాయములు ఆధారములు, ప్రజల ధర్మార్థ కామముల పరిణామములు, రాజ్యవ్యవస్థలు ఓటి అన్నించే శబళితమగు ఒక సృష్టిగాని, ఏ సంబంధమూ లేకుండా కవి నోటి నుండి ఆకస్మికముగా ఊడివడు పదార్ధ విశేషము కాదు. అన్ని కాల ములకు, అన్ని దేశములకు వర్తించే భావములు కావ్యమునందు ఉన్నా, అవి సయితము దేశ కాలములచే శబళితములగుచున్నవి. ఏకదృష్టితో ఎగయుచు ఆకాశ మల విహరించు పతగము సయితము ప్రథమాశ్రయమైన భూమి యొక్క సంబంధమును వదలలక గురుత్వ లఘుత్వాదులచే వరివృతమయియేయున్నది. కవి నుండి దేశ కాలతత్వములు అత్యంతము ఏనాటికి నివృత్తములు కావని చెప్పుచున్నాను.

నైషధమునందలి హరిన సందేశమును హంస సందేశమనుటకంటె హంసోపదేశమనుట యథార్ధవచనమగును. కాని యివన్నీ శ్రీహర్షుడు పట్టించు కొనలేదు. ఒక ప్రక్కన ఆకాలపు తర్కములు ఒకవైపున రాజభోగుల రతి క్రీడలు, మరియొక పార్శ్వమున విషయోన్మత్తుల విభవ విలాసములు మాత్రము అతనిని ఆవరించి కన్నుల యెదుట ఆదుచుండెను. ఆ కాల మహిమ అటువంటిది. ఆ కాలమున నైషధమే ప్రౌఢకావ్యమని, మహాకావ్యమని గణసకెక్కినది. నేటికిని

నైషధము ఆ గణనతో ఉన్నది. అది కాల ప్రభావము. గొప్ప ఆదర్శములు, ధర్మపరాయణత్వము, నిర్మల జీవనము ప్రజలకు దూరమై, తుషములైన శాస్త్ర వాదములు ప్రబలిన ఆ కాలమున కాళిదాసుని కుమార సంభవము మరది, కాళిదాసుని రఘువంశమును మరచి, కాళిదాసుని మేఘదూతను మరచి, నైషధమును గొప్ప కావ్యమని విద్వత్పరిషత్తులు, రాజవలయములు స్వీకరించుట వింతగాదు.

అయినప్పటికీ సరస్వతిని విష్ణుపత్నిగా ‘వర్ణించినందుకు పదవేసినా మరి యెందుకు పడవేసినా, శారదాపీఠము నుండి శ్రీహర్షనైషధము మొట్టమొదట క్రిందపడడము భారతీయ కవితా విలోకనముననుసరించి ఆ కాలపు ప్రథమ విమర్శనము నైషధమునెట్లు తలచినది తెలియగలదు. ఆ కాలమున సయితము

కాష్యతత్త్వజ్ఞులు లేకపోదు. కాని వారిని మించి కూడ కాలము తన స్వభావమును వెల్లడి చేయుచున్నది.

వైషధము నొకనాడు శ్రీహరుడు కావ్య ప్రకాశకారుడైన ముమ్మట భట్టు వద్దకు తీసికొనిపోయి చూపెనట. ‘కదాచిన్ముమ్మటభట్టు స విధే శ్రీపారేణ నైషధ చరితం స్వనిర్మితం ప్రాదర్శి, శత ఆద్యంత మవలోక్యతే నోక్త మహో! పూర్వమేవ కావ్యమేతర్ ప్రదర్శిత ను భవిష్యత, నూనం కావ్య ప్రకాశే దోష పరిచ్ఛేదే దోషోదాహరణ ప్రయాసోమేనా భవిష్యత్ ” (ఖండన ఖండ భాద్య భూమిక)

(అయ్యో ఇంతకుముందే వైషధమును చూపివుంటే, నా కావ్య ప్రకాశ దోష పరిచ్ఛేదమున దోషోదాహరణములకు నాకు ప్రయాసము లేకుండా పోయింది అని ముమ్మట భట్టు చెప్పెనట. అని గురు శ్రీమహామహోపాధ్యాయ ద్రావిడ లక్ష్మణ శాస్త్రిగారు వ్రాసిరి. అయితే ఒకమాట మాత్రము చెప్పక ఈ విమర్శన ముగింపజాలను. సర్వశాస్త్రములు దాసభూతములై పాదముల వద్ద నిల్చుండి కావ్యసౌధమునకు క్రమసామగ్రి నందియ్యవేసిన ఇంతటి శక్తిమంతుడు తిరిగి కానరాలేదు.

ఇరవై రెండు వర్గల గొప్ప కావ్యమును నిర్మించినను ఎచ్చటనైనా ఒక పొల్లుమాటగాని, ఒక వ్యర్ధమైన “తూచాగాని” ఒక చప్పిడి పదముగాని ప్రయోగించక రచన చేసిన ఇతని శక్తి వాస్తవముగా నాకు ఆశ్చర్యము కలిగించినది. మృషా విషాదాభినయాదయం క్వచిత్” “ఆహో అహో నిర్మహిమా హిమాగమే” “విభావరీ ఛార్చి ధరాం బభూవరే ” “ఖనీఖనీలిమ” కదా విదభ్ర భమద భ్రగల్బే” “నయక్ష ఆపైకి మలక్ష్మినోవా “క్వభాగ్యమాప్నోతి నభాగ్య భాగమః ” “భుజమే తస్యభజన్ మహాభుజ” అని యీ తీరున అప్రసిద్ధ పదప్రయోగ దోషము లేకుండా శబ్దములను

త్రిప్పగలిగిన యితని శక్తి వాకాశ్చర్యమును కలిగించినది. “దమనా దమనా ప్రసేనుడు”, కుండిన మండనాయయా రరాజ నీరాజనయాసరాజు ఘం” చాతురీ తురీ “పదమస్కా రదనచ్ఛదం పడన్” “ప్రతిబింబానవలంబితాంబుని “సరసీః పరశీలి

తుం “పాఠలమ్మున తరీమరీ రమత్”, “నలినం మలినం వివృణ్వతీ “అని యీ తీరున అర్థమునకు హాని లేకుండా అక్షర సంఘటనము చేయగలిగిన ఇతని శక్తి నాకాశ్చర్యము కలిగించినది. అయితే ఇంత ఆశ్చర్యకరమైన యితని శక్తి యిన్ని విధముల దుర్వినియోగవడక కాళిదాసాది కవులు చూచిన నిర్మల కవితా స్వరూపమును దర్శించుటకు వినియోగపడియుండినచో మనకు ఒక గొప్ప కావ్యము లభించియుందును. ఎంత గొప్పవాడైనా శ్రీహర్షునిమీద కాలము వచ్చి వ్రాలినప్పుడు అతడు దాని ఆవరణమును తప్పించు కొనలేకపోయెను

. ఖండపురాయి” రాజప్రాసాదములలో “తాంబూల ద్వయమాస సంచ” (విదెములు, సువరా సనము) పొంది రాజభోగముల విషయలోలత్వమును తృప్తి పరచదలపడిన అతని కావ్యము ఉత్తమత్వమును కోల్పోవలసి వచ్చెను.

పర్ణశాలల నుండి, ప్రకృతి వనముల నుండి భ్రంశమునొంది భారతీయ కవిత్వము రాజద్వారముల యందు సువర్ణ హస్తాస్తోక్షేపణమునకు ఎదురు చూడవలసిన సమయము ఏనాడు వచ్చెనో ఆనాటి నుండియే క్షయోన్ముఖమైనది. భారత వర్షము శక బర్భర యవన ప్రముఖాక్రాంతమైనది మొదలు సర్వ ధర్మములు వినాశమార్గమును తొక్కినవి. ఒంటికాలితో కుంటుతూ అనార్య తాడితయై అశ్రువులు కార్చుచు భాగవతమున గోచరించు ధర్మదేవత ఈ దశన విశదపరచుచున్నది.

భారత వర్షము యవనాధీనమై ఆర్యధర్మములు అంతరించిన నాటి నుండి వాల్మీకి, కాళిదాసు, భాసుడు, భవభూతి, వ్యాసుడు ఇట్టి పవిత్ర కవుల యొక్క అవతరణము ఆగిపోయెను. భారతవర్ష కవిత్వము యొక్క నిర్మలదశను, పశిత దశను విడదీసే ఒక పెద్ద ఖండపు రాయివలె శ్రీహర్షుని నైషధము మనకు కనబడుచున్నది. అప్పటి నుండియు మరల భారతవర్షమున కాళిదాసాది పవిత్ర కవివరంపర ఆవిర్భవించకపోయెను. ఆనంద వర్ధనాచార్యుని నాటికే భారతీయ కవిత పతనము పొంద మొదలిడెను. “యే నాస్మిన్నతి విచిత్ర కవివరంపరా వాహిని సంసారే

 కాళిదాస ప్రభృత యో ద్వితా: పంచషానా మహాకవయో ఉపలభ్యన్” (ప్రతిభా విశేషముచే అతి విచిత్రమైన కవిపరంపరా సంస్కృతియందు కాళిదాస ప్రభృతులు ఇద్దరు ముగ్గురు, అయిదారుగురు మాత్రమే మహాకవులు కనబడుచున్నారు) అని అన్న ఆనంద వర్ధనాచార్యుని పంక్తులు చదివినప్పుడెల్లను భారత వర్షకవిత్వము యొక్క యీ ఆరోహణావరోహణ దశలు నా తలపునకు వచ్చుచుండును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *