దయ

vidwan vishwam

 

దిన మొలతో జడల డాల్చి 

దిశాంతముల జరియించిన, 

ఆకులతో, నారలతో

 నంబరములు నేసికొన్న,

 బూది, మన్ను, దుమ్ము

 వంటి మీద పూత పూసుకొన్న, 

బండల పై గుండ్ల పైన 

దిండు లేక పండుకొన్న, 

మనసులోని మాలిన్యము 

చనుట కెట్లు తోడుపడును ! 

జీవుల వేధించక, 

జన జేత యగుటకై ఏడ్వక, 

లోకమ్మును దయతో నా లోకించిన యవుడు గదా!

నీ మనస్సు నిర్మలమై 

కోమలమై శాంతమగుట !

 

 

పాళీ లిపి – ధమ్మపదం

అనువాదం.. శ్రీ విద్వాన్ విశ్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *