కొన్ని సందర్భాలు

nature, read, reading-4975498.jpg

మంగారి రాజేందర్ జింబో

కొన్ని సందర్భాల్లో
పదాలు దొరకవు
అది సంతోషమైన సందర్భం కావొచ్చు
దు:ఖమయమైన సందర్భం కావొచ్చు

పదాలు దొరకనప్పుడు
లేనప్పుడు
చూడడం
నిశ్శబ్దంగా
వినడమే
చేయాల్సింది

కన్నీళ్ళు ప్రవహించనీ
నిజానికి అప్పుడు కావల్సింది
మనం అక్కడ వుండడమే
కొన్ని సందర్భాలలో
అది సాధ్యం కాని
వీలు కాని పరిస్థితి
కారణం
పకృతి  కావొచ్చు
మరొకటి కావొచ్చు

చాలా సందర్భాలలో పదాలు దొరకవు
కన్నీళ్ళు మాత్రమే దొరుకుతాయి
ఆ వాతావరణాన్ని
అనవసర పదాలతో పూరించవద్దు

సంతోషించాల్సిన వాళ్ళతో సంతోషించాలి
దు:ఖించాల్సిన వాళ్ళతో దు:ఖించాలి
దు:ఖాన్ని తగ్గించే ప్రయత్నమేదో చేయాలి

పదాలు లేనప్పుడు, దొరకనప్పుడు
స్పర్శే గొప్ప ఉపశమనం

నిజానికి కొన్ని సందర్భాలలో
పదాల కన్నా
స్పర్శే అవసరమేమో !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *