శ్మశానంలో వసంతం

 

 

 

 

 

 

 

కె. శివారెడ్డి

నసు దహించుకు పోతుంది.
ఆగ్రహానలం పడగ లెత్తుతుంది
నా పాప ఎది గెదిగి
నా కే ఎదురు తిరిగినప్పుడు
నా నీడ నా మీద కుట్ర పన్ని
నా పర్ణకుటీరాన్ని చుట్టుముట్టి
పచ్చని బతుకు బయలు ధ్వంసం చేసిన పుడు,
తప్త హృదయం లోపల
స్వస్థత లేని ఏ దేహడోల
నాకోరిక కుత్తుక ద్రుంచినా
రావణ శిరసులా మొల కెత్తుతుంది,
ఇంతకీ ఎక్కడకీ ప్రయాణం ?
ఇదొక ముగిసీ ముగియని కావ్యం
ఆ త్రోవ వెంట పడిపోయిన చెటు పరాభవించబడిన కోయిల లేములు
ఈ వాగుకిప్పుడు ప్రాణం లేదు
మరికాసేపట్లో మహోద్ధృత
యౌవనంతో సమస్తం ముంచవచ్చు
ముందు వెనుక లాలోచించే లోపల
పుట్టి వుటుక్క మనవచ్చు ఈ గమనంలో గమ్యం ఎచటని ? నాకు నేను పూర్తిగా అపరిచితుణ్ణి ఐపోతున్నాను.
ఆరని దాహంతో మూర్చాగ్రస్తుష్ణవుతున్నాను. పోతున్నాను, ఈ వీధి వెంట కదలిపోతున్నాను.
ఏకంట్లో నుంచన్నా కాస్త
వెలుగు వాకిలి తెరుచుకుంటుం దేమోనని.
నన్ను సంతృప్తి బాహువులల్తో
సాదరంగా శాంతి గుండెల్లోకి
తోడ్కొని పోతుందేమోనని
పూర్తిగా పడిపోయిన గుడి సై నా
పులుగ డిగిన ముత్యంలా వుంటే
కాంతితో రంగ వల్లులు దిద్దే
ఆ ప్రశాంతి కరాంగుళుల స్నేహంలో
మాఊరు పేరు మర్చిపోయి
పూర్తిగా మారిపోయి
రేపటి నుండి జాజిపూల పక్కల్లో నే
రజమై, పరిమళం పగలకొట్టినా బాధ లేదు.
ఈ ఇళ్ళలో ఎవరు నివసిస్తున్నట్లు ?
ఆ ముంగిళ్ళపాపలు పోరాడుతున్నట్లు
కనీసం మంచిగా లై నా మసలిన చాయ లేదు
ఏ ఊరు ఇది?
ఎంతకాలం ఇలా వుంటుంది ?
ఎందుకిలా తయారయింది ?
అపుడపుడు మాడిపోయిన
చెట్ల కన్నీటి చుక్కలు
నా చెక్కిలికి స్పృశించి
గుండె గులాబి గూటోకి జారిన యే :
చీకటి మొగలి పొదల్లో
ఆకలి తీర్చుకుంటున్నది సాపం

ఇవి శిధిలాలా ? కాదు,
చివికిపోయిన చరిత్రావ శేషాలా !…కానే కాదు
చరిత్ర మిగిల్చిన వి శేషాల్లో
అనంతమైన జీవన నది ఉంటుంది
ఆనకట్ట వేసినా ఆగని
సముద్ధృత సాంద చాంద్రీ ఝరులుంటాయి
దవనంలా మరువంలా వాడేకొలది
వాసి కెక్కు తాయి; వన్నె లీను తాయి,
మరి అటువంటి కథ లేమీ లేవే !
పురా సంపత్తి కుసుమం విచ్చుకున్నట్లు
నాసికలకు కబళం వేసినటు లేదే ?
ముమ్మాటికి ఇది పాడుబడ్డ ఊరు కాదు.
పురావస్తు పేటిక కాదు, మరేమిటి ?
నడుస్తున్న చరిత్రే
వర్తమానం ఈరకమైన
చొక్కా తొడుక్కుంది
నలభై అయిదుకోట్ల కళ్ళ లోగిళ్ళు
కసువుతో నిండి చమురు కంపు కొడుతున్నాయి
శ్మశాన దృశ్యాన్ని తలపిస్తు న్నాయి
ఆ వీధి కేగుదల
అంగడిలో అమ్మే దేమిటి ?
కొనే దేమిటి | ఆవితర్ధి పై వింతరద్ది ?
అదృశ్యం క ళేబరాని కతుకుతున్న రాబందులకు నేస్తం ఎదో ఎదో జుగుప్సావహమైన
ఆలోచన అవగాహన కందటం లేదు
పారిపోతున్న జ్యోతి దొరకటం లేదు
లేదు ముమ్మాటికి లేదు
ఎవరి కెవరూ అందటం లేదు
ఎవరికి వారు అర్థం అంతకన్నా కావటం లేదు
నడుస్తున్న కళేబరాలకు న వరసా లెక్కించే దెలా ?
బ్రతికి ఉన్న శవాలను పాతి పెట్టేదెలా ?
దుర్గంధపు నదీ తీరాన
నివసిస్తున్న నరరూప రాక్షసులు
ఏ ముని శాపం సోకి ఇలా తయారయారు వీళ్ళు !
ఏ కన్నీళ్ళ గాలిసోకి
పునర్జన్మ నెత్తుతాయి ఈ రాళ్ళు

ఏదో ఒక సముద్ధృత
విద్యుద్ధునీ తరంగాలు
అంతరంగపు బొడ్డుల్ని ఒరుసుకుంటే తప్ప !
ఎంత భీతావహంగా
భీభత్సంగా జుగుప్సా వహంగా
ఉంది. ఈ అసమగ్ర నాగరికతా రణరంగ భూమి
సార్వజనీన చైతన్యస్రవంతీ సలిలాల్లో
వీళ్ళ చేతా లుతికి
వీళ్ళ మనసుల్ని మల్లెపూలమీద ఆ రేసి,
సముచితాలోచనా
సాంబ్రాణి ధూపం వేసి
పది కాలాలపాటు పరువుగా, పచ్చగా
పరమ రమణీయంగా బ్రతి కేటట్టు
బట్టకట్టుకునేటట్టు
చేయాలని ఒట్టు పెట్టుకోవాలి అందరూ
అంతరంగ పు టా దేశాన్ని శిరసావహించాలి అందరూ !
అప్పటికి కదా ఈ శ్మశానంలో వసంతం !

(కళాకేళి, 1969, జూన్ సంచిక నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *