కవిత…. శ్రీ “కరుణశ్రీ”

 

 

 

 

 

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి

దోసెడు సారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా
డాసిన భంగి మేలిమి కడాని నరాల కరాలు వచ్చి క
న్మూసిన భంగి కన్నె నగుమోము పయి నునుసిగ్గు మొగ్గ కై
సేసిన భంగి అందములు చిందెడి నందనవాటి వెన్నె లల్

కాసిన భంగి జానపద కాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి కొవ్వలపు లేఖ తలోదరి తామరాకు పై
వ్రాసిన భంగి పెండ్లి తల బ్రాల్ జవరాలు రవంత నిక్కి పై
బోసిన భంగి గుండె వడబోసిన భంగి కళావిపంచికల్

మ్రోసిన భంగి పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్న తల్
భాసురతల్ నునోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ గడు
భాసిల తెల్గుకై త నవభంగుల నొప్పుచు సంస్కృతో క్తి సం
వాసితవనౌ నెడ కలశ వారిధి తీర పురోనిషణ్ణ దే

వాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహినీ
హాస విలాస విభ్రమ కరాంచల చంచల హేమ కుంభ సం
భాసి సుధా ఝరీ మధురిమమ్ములు వ్య క్తము కావ లెన్ ; శర
న్మాస శుచి ప్రసన్న యమునా తట సై కత సాంద్ర చంద్రికా

రాస కలాం కలాప మధుర ప్రజ యావత మధ్య మాధవ
శ్రీ సుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సార సంపదల్
రాసులు రాసులై పొరలి రావ లె; పొంపిరి పోప లే నవో
ల్లాస వసంత రాగరస లాలిత బాల రసాల పల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూ కల కాకలీ ధ్వనుల్

[ తిమ్మ నార్యుని కమ్మని పద పారిజాతాల పై ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *