మహాభారతం శాస్త్ర కావ్యమా? కావ్య శాస్త్రమా?

డా॥ గుంజి వెంకటరత్నం

మహాభారతంలోని శాస్త్రాద్యనేకాంశాలు ప్రతిపాదన దృష్ట్యా దానిని పరిశీలించిన వారికి అది కావ్య శాస్త్రమా? లేక శాస్త్ర కావ్యమా? అనే సందేహం రాకమానదు. ప్రపంచ భాషల్లోని ఆ వాఒ్మయంలోనైనా కావ్యం, శాస్త్ర, అనే రెండు రచనా ప్రక్రియలుంటాయి. కావ్యం వేరు.శాస్త్రం వేరు. పాశ్చాత్య సాహిత్య వేత్తలు కర్తృత్వ అపేక్ష నిరూక్షితలను బట్టి వాజ్మయాన్నంతటిని కావ్యం, శాస్త్రం అని రెండు విభాగాలుగా విభజించారు. కవి యొక్క ఆత్మీయతా ‘ప్రతిఫలనం గల రచ కావ్యమని, అది లేనిది శాస్త్రమని పాశ్చాత్యుల సిద్ధాంతం. సాహిత్య శిల్చ సమీక్ష పుట- 151)
కావ్యం, శాస్త్రం వేరు వేరు ప్రక్రియ లైనప్పుడు వాటి నిర్మాణం వాటిప్రయోజనాలు కూడా వేరుగానే ఉంటాయి. రూపాత్మకమైనది, ఉపదేశాత్మకమైనది. అది సహృదయునికి రసానందంతో పాటు ఏదో ఒక సందేశాన్ని కూడా ఇస్తుంటుందని ప్రాబీనాలంకారికుల అభిప్రాయం. ఈ దృక్కోణం నుండి భారతాన్ని పరిశీలించినప్పుడు ప్రధానంగా శాంతిరసపోషకమై ఆ యా సన్నివేశాల్లో శృంగారాది రసాలు పోషింపబడి, ఉపదేశాత్మకమై ఉండడం వలన ముఖ్యంగా అది కావ్యమనే చెప్ప వలసి ఉంది. అయితే భారతంలో చోటు చేసుకొని ఉన్న వివిధాంశాల విషయమేమిటి? అసలు రసాత్మక మైన కావ్యంలో శాస్త్రాంశాల ప్రతిపాదన ఉండవచ్చునా? ఉంటే ఎలా ఉండాలి? మొదలైన ప్రశ్నలుదయిస్తాయి. భరతుడు కావ్యంలో శాస్త్ర కళా, విద్యాది విజ్ఞానాంశాల ప్రతిపాదన లుండవచ్చునని నిర్దేశించాడు.
“నతత్‌ శాస్త్రం, నతత్‌ శిల్పం, నసా విద్యా వసాకళా
నా సౌ యోగో తతంర్మ నింట్యే స్మిన్‌ యన్న దృశ్యతే”
ఇది దృశ్యకావ్యాలను గురించి చెప్పినా శ్రవ్య కావ్యాలకు కూడా వర్తిస్తుంది. భామహుడు కూడా కావ్యాలల్లో శాస్త్రాంశాల ప్రతిపాదనను అంగీకరించాడు.
“స్వాదు కావ్యరసోన్మీళనం శాస్త్ర మప్యు పయుంజతే
ప్రథమా లీడ మాధవః పిబంతి కటు భేషజమ్‌”
కావ్యంలో ఎడనెడ శాస్త్ర విషయంబు దివ్టాలైనా, అది ఆమోద యోగ్యమే అవుతుంది. ఎందుకంటే మొదట తియ్యని మధువును సేవించిన వారే, తర్వాత చేదైన ఔషధాన్ని కూడా త్రాగుతారు గదా! అంటే రసస్ఫోరకమైన కావ్యం మొదట పాఠకునికి ఆనందాన్ని కలిగిస్తూనే పిమ్మట కడు భేషజం గా ధృఢత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి కావ్యంలో శాస్తాంశాల ప్రతిపాదన ఆమోద యోగ్యమే నని భామహుని అభిప్రాయం. మనకు ప్రాచీన కాలం నుండి నిఘంటు నిర్మాణ ప్రక్రియ ఉంది కాని, విజ్ఞాన సర్వస్వాల నిర్మాణాలున్న దాఖాలాలు కనిపించవు. అందుకే కాబోలు విజ్ఞాన ప్రసారాపేక్ష గల మన ‘అర్వాచీన కవులు కొందరు అవసరమున్నంతవరకు,అంతకు మించి కూడా విజ్ఞానాంశాలెన్నింటినో
తమ కావ్యాల్లో పొందు పరుస్తూ వచ్చారు. అదీ గాక సమకాలీన సామాజిక విషయాలెన్నోఅనాటి సాహిత్యంలో సమజంగానే చోటుచేసుకుంటూ ఉంటాయి. అందుకే ప్రాచీనాలంకారికుల మన వాబజ్మయాన్ని శాస్త్రం, కావ్యం, శాస్త్ర కావ్యం, కావ్య శాస్త్రం అని నాలుగు విధాలుగా విభజించారు.

“శాస్త్రం, కావ్యం శాస్త్ర కావ్యం , కావ్య శాస్త్రం చ ఖేదతః
చతుష్ర్ర కారః ప్రపరః సతాం సారస్వతో మతః”

సాహిత్య దర్చణం (హిందీ వ్యాఖ్యానం ) పుట – 55-389)

శాస్త్రం, కావ్యం, అనే వాటిని గూర్చి పైన చెప్పడం జరిగింది. ఇప్పడిక శాస్త్ర కావ్యమంటే ఏమిటో? కావ్యశాస్త్రమంటే ఏమిటో ? వాటిని గూర్చి ఆలంకారికులు లేమి చెప్పారనే నేపథ్యంలో మహాభారతం శాస్త్ర కావ్యమా? కావ్య శాస్త్రమా అని పరిశీలించవలసి ఉంది. సాహిత్య దర్పణకారుడు శాస్త్ర కావ్యాన్ని , కావ్య శాస్త్రాన్నివిశ్లేషిస్తూ

“శాస్త్ర కావ్య మిదం ప్రాహుః సర్వ కావ్యాంగ లక్షణం
కావ్యం విశిష్ట శబ్దార్థ సాహిత్య సదలంకృతిః
శాస్త్ర కావ్యం చతుర్వర్ణప్రాయం సర్వదేశాపకృత్‌
భట్టి భౌమక కావ్యాది కావ్య శాస్త ప్రచక్షతే

చతుర్వర్గ ప్రాయమైనది అంటే ధర్మ అర్థ కామ, మోక్ష సాధకమైన పరిపూర్ణ మానవజీవితానికి వ్యాఖ్యానరూపమైనది శాస్త్ర కావ్య మని చెప్పడం జరిగింది. వ్యాసుడు కూడా భారతాన్ని ఇదేవిధంగా భావించాడు. సంస్కృత భారత విషయం వచ్చినప్పుడు క్రింది పేరాల్లో ఈ విషయం చర్చిచడం జరిగింది. అదేవిధంగా రసాత్మకమై ఉపదేశాత్మకమైనది కావ్య శాస్త్రమని చెప్పి ,కావ్యశాస్త్రానికి బట్టి కావ్యాన్ని భౌమక కావ్యాన్ని ఉదాహరణులుగా చూపాడు. కాని శాస్త్ర కావ్యానికి ఉదాహరణలు చూపలేదు. ఈ విషయంలో మరికొంత చర్చించిన భోజుడు శాస్త్ర కావ్యాన్ని వివరించి దానికి దృష్టాంతాలు కూడా చూపాడు.

“శాస్త్రం యత్ర కవీనాం రహస్యముపకల్పయంత్య నల్పధియః

తద్రతీ విలాస కామందకీయవత్‌ శాస్త్ర కావ్యంతు ”

నిగూఢమైన శాస్త్రాంశాలు రమణీయంగా ఆ కావ్యంలో ప్రతిపాదించి ఉంటాయో అది శాస్త కావ్యమని చెప్పిన భోజుడు దానికి రతీవిలాసం, కామందకీయం అనే గ్రంథాలను ఉదాహరణులుగా చూపాడు. రతీ విలాసమనేది కామశాస్త్ర గ్రంథం. కామందకీయం నీతి శాస్త్రగ్రంథం. దీనిని బట్టి భోజుడు శా స్త గ్రంథాలనే శాస్త్ర కావ్యాలుగా పరిగణించి నట్లు తెలుస్తున్నది. ఈయన కావ్య శాస్త్రాన్ని కూడా విశ్లేషిస్తూ

“యత్రార్థ శాస్తాణాం కావ్యేనిశేవ్యతీ మహాకవిఖిః

తద్భట్టి కావ్యం ముద్రారాక్షసవత్‌ కావ్య శాస్తం స్యాత్‌”

అని సూత్రీకరించాడు. ఎక్కడైతే మహాకవులు తమ కావ్యాల్లో శాస్త్ర విషయాలను కూడా చేర్చిరచన చేసి ఉంటారో అది కావ్య శాస్త్రం అని నిర్దేశించిన భోజుడు దానికిభట్టి కావ్యాన్ని ముద్రారాక్షసాన్ని ఉదాహరణలుగా చూపాడు. భట్టి కావ్యంలో ఇతివృత్తం రామకథ. అయితే దీనిలో రామ కథతోపాటు పాణినీయ వ్యాకరణ శాస్త్రాంశాలు కూడా అనుషంగికంగా అనుసంధానించబడి ఉన్నాయి. ముద్రారాక్షసం నాటకం. ఇందులోని ఇతివృత్తం చాణుక్య చంద్రగుప్తల కథ. కాని అడుగడునా రాజనీతి శాస్త్రాంశాలిందులో చోటుచేసుకుని ఉంటాయి. ఈ లక్షణాలను కావ్యాలు,కావ్యశాస్త్రాలు, భోజుడి అభిప్రాయం అంటేకావ్యంలో వస్తువు కథ ప్రధానమై,అది రమణీయార్థ ప్రతిపాదనమై ఉండాలి. అలాంటి కావ్యంలో కథా సందర్భాలను బట్టి శాస్త్ర విషయాలను చెప్పిన కావ్యం, కావ్య శాస్త్రమని తెలుస్తున్నది.

ఇంతవరకు జరిగిన కావ్యానుశీలనంలో కావ్యత్వానికి భంగం వాటిల్లని తీరులో శాస్రగత విషయాలను ప్రతిపాదించిన కావ్యం కావ్య శాస్త్రమని , శాస్త్ర విషయాలనే అధిక ప్రాధాన్యమిచ్చి కథాగమనాన్ని కూడా పట్టించుకోని తీరులో శాస్త్ర విషయాలను చెప్పిన కావ్యం శాస్త్ర కావ్యమని చెప్పవచ్చును. మహాభారతంలో కౌరవపాండవుల కథ ప్రధానేతివృత్తం. శాంతం ప్రధాన రసం. ఆయా సన్నివేశాల్లో శృంగారాది రసాలు పోషింపబడి ఉన్నాయి. అయినా ఇందులో ఉపాఖ్యానాలు , శాస్త్ర విషయచర్చలు, నీత్యుపదేశాలు, అధ్యాత్మిక ప్రబోధాలు సుదీర్ఘంగా సాగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కథ కంటే ఇవే ముఖ్యంగా కనిపిస్తాయి. అందుకే వ్యాసుడు

“ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ

యదిహస్తి తదన్యత్ర యన్నేహస్తి నతత్‌ క్వచిత్‌”

ధర్మ అర్థం, కామ, మోక్షాలైన చతుర్విధ పురుషార్ధాలకు సంబంధించి మహాభారతంలో ఉన్న విషయాలు ప్రపంచంలో మరోచోట కూడా ఉండవచ్చును. కాని, అందులో లేని విషయాలు మరెచ్చటను ఉండవు. అని చెప్పాడు వ్యాసుడు చెప్పినట్లుగానే తిక్కన కూడా భారతాన్ని భారతీయ జన జీవన వ్యాఖ్యాన ప్రాయమైనదిగానే భావించాడు.

“వేదములకు నఖిల స్మృతి వాదములకు
బహుపురాణ వర్గంబులకున్‌

వాదైన చోటులను దాముందల
ధర్మార్ధ కామమోక్ష స్థితికిన్‌ (విరాట – 1-4)
అంతేకాదు వ్యాసుడు భారతాన్ని లోకహితార్థం రచించాడు. దానిలోని విజ్ఞానాన్ని అన్ని లోకాల్లో ప్రచారం చేసేందుకు తన శిష్యులను నియోగించాడని భారతం చెబుతున్నది. (ఆది 1-67) విజ్ఞాన ప్రసారాన్ని ఆశించిన మహాకవులు చేసే పని ఇది. నన్నయ కూడా భారతమొక మహాకావ్యమని, రాజనీతి, ఆధ్యాత్మికాది శాస్త్రాల సమాహారమని, సర్వలక్షణ సంగ్రహమని, భారతావతారికలో ప్రశంసించాడు.

మహాభారతంలో పాండవుల కథ పూలదండలో దారంలాగా అనున్యూతంగా నడుస్తూనే ఉంటుంది. దాని చుట్టూ సందర్భానుసారంగా ఎన్నో ఉపాఖ్యానాలు , మరెన్నో విషయ ప్రతిపాదనలు వచ్చి చేరుతుంటాయి. సంస్కృత మహాభారతంలో కొన్ని చోట్ల శాస్త్ర విషయాల చర్చ సుదీర్హమై కథా గమనానికి భంగం వాటిల్లే తీరులో ఉంటాయి. సంజయ రాయబార విశేషాలు తెలియక ఆందోళన చెందిన ధృతరాష్ట్రుడికి విదురుడ నీతిబోధ చేస్తాడు. ఇందులో ఎన్నో ధర్మాలు, నీతులు చెప్పబడినాయి. ఉద్యోగ పర్వంలోని ప్రజాగమనే ఉపపర్వంలో 8 అధ్యాయాల్లో 596 శ్లోకాల్లో ఇది విస్తరించి ఉంది. కథకు సంబంధం లేకుండా సుదీర్హంగా సాగిన శాస్త్రాంశాలివి. అదేవిధంగా భగవద్గీత ఇరుపక్షాల
సేనలు యుద్ధ సన్నద్ధమై నిలిచి ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునునికి చేసి బోధ భగవద్గీత. ఇది 18 అధ్యాయాల్లో 700శ్లోకాల్లో విస్తరించి ఉంది. అనుగీత, సరస్వతీ గీత, హంసగీత, జనక నీతి, కుబేర నీతి, కణిక నీతి, శాంతి, అనుశాసనిక పర్వాల్లోని ధర్మ శాస్త్ర అధ్యాత్మిక శాస్త్రాంశాలు మొదలైనవన్నీ ఈ కోవకు చెందినవే. ఇవన్నీ కథా గమనాన్ని కొంతవరకు అడ్డంకిగా నే ఉంటాయి. అయినా వ్యాసుడు విస్తరించే చెప్పి ఉ న్నాడు. అంటే వ్యాసుడు ధర్మశాస్త్రాలను , నీతి శాస్త్రద్యనేక విషయాలను లోకానికందించేందుకు మహా భారతాన్ని నిర్మించి, శిష్యులతో ప్రచారం చేయించాడు. సంస్కృత మహాభారతం యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకే ఆనందవర్థనుడు తన ధ్వన్యాలోకములో మహా భారతేపి శాస్త్ర రూపే కావ్యఛాయా న్వయిని” అని చెప్పాడు. మహాభారతం శాస్రత రూపంలో నున్న కావ్యం. అంటే శాస్త్ర కావ్యమన్నమాట.

ఇక తెలుగు మహాభారత విషయానికి వస్తే దాని పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. నన్నయ తిక్కన ఎర్రనలు సంస్కృత మహా భారతంలో సుదీర్ఘంగా సాగిన అనేక శాస్త్ర విషయాలను చాలవరకు సంక్షిప్త పరచి చెప్పారు. మరీ అవసరం లేవనుకున్నట్టు వంటి వాటిని వదిలి వేశారు. అందుకే సంస్కృతంలో లక్షశ్లోకాల్లో నున్న మహాభారతం తెలుగులో కేవలం 20, 5083 గద్యపద్యాలకే పరిమితమైంది. 4 వంతు కంటే కూడా తక్కువ ఉద్యోగ పర్వంలో రెండవ ఆశ్వాసంలో 16వ పద్యంనుండి 101 వ పద్యం వరకు గల విదురనీతి కేవలం 85 గద్య పద్యాల్లోకి సంక్షిప్తీకరించబడింది. దీని వెనువెంటనే సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు బోధించిన అధ్యాత్మిక తత్త్వం సంస్కృతంలో చాల సుదీర్ఘంగా సాగుతుంది. కాని తిక్కన దానిని కేవలం అయిదు గద్య పద్యాల్లో ప్రస్తావించి పూర్తిగా కదిలివేశాడు. భీష్మ పర్వంలోని భగవద్గీత 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల్లో సంస్కృత భారతంలో నుండగా దానిని తిక్కన కేవలం 48 పద్యాల్లో(ఉ ద్యోగ 1-185 నుంచి 208) చెప్పడం జరిగింది. ఇదే విధంగా అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి చెప్పిన సృష్టిక్రమ విశేషాలు ధర్మ ప్రబోధాలు, అధ్యాత్మిక తత్వ బోధనలు మొదలైన అనేక విషయాలు సంస్కృతంలో చాలా విస్తృతంగా వివరింపబడి ఉన్నాయి. నన్నయ ఎర్రనలు వాటిన చాలావరకు తగ్గించారు. అరణ్యవాసం చివరలో రోమకమహర్షి పాండవుల దగ్గరకు వచ్చి వారి చేత తీర్థయాత్రలు చేయిస్తాడు. ఇక్కడ వివరించిన తీర్ణయాత్రా విశేషాలు, చోటు చేసుకున్న ధర్మ శాస్త్ర చర్చలు కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. వీటన్నిటిని ఎర్రన కథా సందర్భాలకనుకూలం గా చాలా సంక్షిప్తం చేసి చెప్పాడు.

ముఖ్యంగా శాంతి, అనుశాసనిక పర్వాల్లో కథానామమాత్రంగానే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కనిపించేవారు ఇద్దరే. భీష్ముడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానరూపం లో ఎన్నో శాస్త్ర విషయాలు మరెన్నో ధర్మప్రబోధాలు ఇంకెన్నో అధ్యాత్మిక తత్త్వబోధనలు సుదీర్థంగా చెప్పుకుంటూ పోతాడు. వీటన్నిటిని తిక్కన ఉపాఖ్యానాల ద్వారా అవసరమున్నంత మేర గ్రహించి చాలావరకు కుదించి చెప్పాడు. కవిత్రయం వారు సంస్కృత భారతాన్ని తెలుగు చేయడం లో అనుసరించిన పై పద్ధతుల వలన, తెలుగు మహాభారతంలో విజ్ఞానాంశాల ప్రతిపాదన నాతి దీర్హమై కథా గమనానికి అడ్డుతగలని తీరులో పొందు పరచడం జరిగింది. దీని వలన పాఠకుడు కథ
ననుసరించి పోవడంలో ఎక్కడా ఇబ్బంది పడడు. కాబట్టి రసస్సూర్తికి భంగం కలిగే అవకాశం కూడా ఉండదు. అంటే కావ్య లక్షణాలకు భంగం లేని తీరులో తెలుగు భారతంలో విజ్ఞానాంశాల ప్రతిపాదన ఉండడం బట్టి అది కావ్య శాస్త్రమని పండితాభిప్రాయం. సంస్కృత మహాభారతంలో కథను మించి చెప్పిన శాస్త్ర విషయ చర్చలు నీత్యుపదేశాలు, ధర్మ ప్రబోధాలు, అధ్యాత్మిక బోధనలు విస్తృతంగా ఉండడం వలన, కథ చెప్పడం కంటె ధర్మ ప్రబోధాది శాస్త్రాంశాల ప్రచారమే అది. ప్రయోజనం గా కలిగి ఉండడం వలన దానిని
శాస్త్ర కావ్యమని కథా గమనానిక అడ్డంకి లేనితీరులో విజ్ఞానాంశాలను పొందుపరుస్తూ కథాత్మకంగా, రసాత్మకంగా సాగిన తెలుగు మహాభారతం కావ్య శాస్త్రమని చెప్పవచ్చు. అందుకే పండితులు సంస్కృత మహాభారతం శాస్త కావ్యమని తెలుగు మహాభారతం కావ్య శాస్త్రమని అభిప్రాయపడుతున్నారు.

(తెలుగు మహాభారతం ఆది పర్వం – 1-82. విశే. 25. టి.టి.డి ప్రచురణ) అది శాస్త్ర కావ్యమైనా, కావ్య శాస్త్రమైనా, విజ్ఞాన
ప్రసారాపేక్ష చేత కవులు ఎక్కువగా విజ్ఞానాంశాలను ప్రతిపాదించిన కావ్యాన్ని నేటి పరిశోధకులు విజ్ఞాన సర్వస్వ లక్షణాలున్న కావ్యంగానే
పరిగణిస్తున్నారు

డా॥ గుంజి వెంకటరత్నం

పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు

సికేయం కళాశాల

.

One thought on “మహాభారతం శాస్త్ర కావ్యమా? కావ్య శాస్త్రమా?”

  1. from y s rao garu
    మహాభారతము ఏ సాహితీ విశ్లేషణకు అందనటువంటిది. అంతే కాదు ఆధునిక సాహితీ ప్రక్రియల తో పోల్చ తగినది కాదు. దానిని పంచమ వేదం అని అంటారు పెద్దలు. అంతేకాదు అది విజ్ఞాన సర్వస్వము. భారతీయతకు ప్రతిబింబము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *