నాచన సోముని ఉత్తర హరివంశము

పి యశోదారెడ్డి

ఘను నన్నయభట్టును ది 

క్కన నెఱా ప్రెగడఁ టౌగడి యలిక -బున న 

క్షిని డాఁచి నట్టి సర్వ

జ్నుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్

నీతిచంద్రిక – చిన్నయసూరి.

నన్నయగారి త్రోవగొని నవ్యగుణంబులు కొన్ని చేర్చి తి 

క్కన మహాకవి ప్రవరుఁ డాంధ్రకవిత్వము వృద్ధి చేసె నె

జన్నయు వీరి త్రోవఁ గొని యర్హత యింకొక కొంత యిచ్చె స 

ర్వోన్నతి తెచ్చె సోముఁడు మహారధి నా జను నాంధ్రభాషకన్

                                                                                                       వేంకటపార్వతీశ్వరకవులు.

ఏ మహానుభావుని బురస్కరించుకొని శ్రీ వీరేశలింగము పంతులుగారు “భారతమును రచించిన కవిత్రయములో ననేకుల కవిత్వమును గొన్ని విషయములలో సోముని కవిత్వముతో సరిరాదని” బేర్కొనిరో యట్టిపొగడ్తను సార్థక మొనరించు కవితాసంప త్తిగల కవివరుఁడు సోమనాథుఁడు, ఈ నాచన సోమనాథుఁ డాప స్తంబ సూత్రుఁడు. భరద్వాజగోత్రుఁడు. సకలాగమవేది, అష్టాదశ పురాణార్థవిదుఁడు, అష్టభాషాకవిత్వ శ్రీవిలసితుఁడు. అన్నిటిమించి యీతఁడు మహాకవివరుఁడు. ఈతఁడు నాధనలేక నాచిరాజును నాతని కుమారుడు. ఈ వివరము లన్నియు పెంచుకలదిన్నె శాసనమువలన దెలియ వచ్చినవి. పెంచుకలదిన్నె శాసనమునందుఁ గానవచ్చుసోమాయ నాచనాంభోదే! సోమాయామిత తేజ సేఅను వాక్యము నాధారముగాఁ గొని నాచనయనునది గృహనామమా ? లేక పితృనామమా ! యను సందేహమును గొందఱు విమర్శకులు బయలు పఱచినారు. సాధారణముగ కులమునుగాని వంశమునుగాని సముద్రముతోఁ లోల్చు నాచార మున్నదనియుఁ దండ్రిని సముద్రముతోఁ బోల్చు నాచార మంతగా లేదనియు నీ విమర్శకుల వాదము. దాని ననుసరించియే వారు నాచన యను ఉపసర్గ గృహనామమని తీర్పు నిచ్చినారు. ఈ వాదము నొప్పుకొనుచు అయస్. రామకృష్ణశాస్త్రిగారు తమ ఆంధ్రవాజ్మయచరిత్ర సర్వస్వములో బ్రక టించిరి. ” కొన్ని తావులఁ దండ్రిని, కొన్ని తావులఁ దల్లిని సముద్రముతో గలదు. కావున నిట నాచనయను వ్యక్తినే సముద్రునితో జోల్చి నాడందుమేని సోమునకు నాచన తండ్రి యగును. ప్రతి గ్రహీత లందరు కును దండ్రుల నామములను శాసనమునఁ జెప్పియున్నాడు. సోముని తండ్రి పేరు చెప్పకుండ నుండఁడు. కావున నాచన శబ్ద మీతని తండ్రి పేరెయై యుండు ననుట కూడ సమంజ సమయిన యూహాయే యగును. కొక్కోకమును రచించిన యెజ్జయ కవి తన సకలనీతికధానిధానమునఁ బూర్వకవిస్తుతి చేయుటలో ‘నాచన సుతుసోము’ అని చెప్పియున్నాడు. దీనిని బట్టి నాచన శబ్దము పితృనామమే యని స్పష్టమగుచున్నది” అని శ్రీ చాగంటి శేషయ్యగారు వ్రాసినారు. నాచన యింటి పేరు మాత్రమేగాక యితని తండ్రి పేరు నాచిరాజని యాంధ్ర ప్రబంధములందు వ్రాయఁబడియున్నది. ఒకవేళ నింటి పేరు నాచిరాజు వారనియైనఁ జెప్పవచ్చునుఅని శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు సూచించినారు. ఇక నాచన యనునది గృహనామమా లేక పితృనామమా ? అని పరిశీలించి నిర్ణయము నొసఁగుట కాధారము లంతగ లేవు. ఏమేనియున్నచో నది మొదట సంశయమునకుఁ దా చొసంగిన పెంచుకలదిన్నె శాసనమీ. ఆ శాస నాధారము తప్ప మఱివేఱొండు లేదు . కావున నాశాసనమును పరిశీలింపఁగ నందు నాదన సోముఁడు ప్రతి గ్రహించిన గ్రామమున నూటపది వృత్తు లేర్పలని తాను ముప్పదియారువృత్తుల కఠిపతియై మిగిలిన వృత్తిభాగముల నాయాగో త్రీకులకు నిచ్చినట్లు గాన వచ్చుచున్నది. అందు

భారద్వాణాన్వయే జాతః తల్లపోనామయాజుషః

అష్టావింశతి వృత్తినా మధిపోచనాత్మజంఅని, కానవచ్చు శ్లోకమువలన భారద్వాజాన్వయుఁడు, యాజుషుఁడు నాచనాత్మజు డయిన తల్లపుఁడను నాతఁ గష్టావింశ తివృత్తుల కధిపతియని తెలియుచున్నది. పైఁ బేర్కొనఁబడిన తల్లపుని యన్వయము, సూత్రము, శాఖ మొదలగు వాని నన్నిటిని టరిశీలింప నాచన సోమనాధుని యన్వయము శాఖాదులతో సరిపోవుటయేకాక యీ తల్లవుడు నాచన కుమారుఁడని స్పష్టముగఁ బేర్కొన బడి యున్నది. కావున నిచట నాదన యనునది గృహనామముకాక వ్యక్తి పే రనుటలో సందేహములేదు. ఈ విషయములను బురస్కరించుకొని చూడ శాసనమందు చెప్ప బడకపోయినను ప్రయుక్తములగు విశేషణముల వలననే నాచన సోమనాథునకు సోదరుఁడుగఁ దెలియవచ్చుచున్నాడు. యజుశ్శాఖియైన నాచనకుమారులలోనే కాక మొత్తము నాఁటి యాజుషు లలో శ్రేష్టుడు నాచన సోమనాథుఁడు. కావుననే పెంచుక లదిన్నె శాసనమునందు శాసనకారుఁడుసోమాయ నాచనాంబోధే సోమాయామిత తేజ సేఅని యుచిత ముగఁ బేర్కొన్నాడు. ఆ కాలమందు వెలసిన సోమనాథులనుండి యితనిని ప్రత్యేకించుటకు నాటి యాచారమును బురస్కరించుకొని తండ్రి పేరుతోఁ నేర్చి యితనిని నాదన సోముఁడ ని వ్యహరించి యుందురు. ఇమ్మహాకవియు నావిధముగనే తన యుత్తర హరివంశమందు నాచచ సోనునాథ ప్రణితంట మనఅనియే వ్రాసికొనినాఁడు. పెంచుకలదిన్నె శాసనము సయితము శ్రీమన్నా తన సోమాఖ్య మహాక వివరో వ్యధఅనియే పేర్కొనినది. కావున నీ సోముఁడు నాదన కుమారుఁ డనుటయే నిక్కువము కాగా నాతనయను శబ్దము గృహనామముగాక తండ్రి పేరనియే తెలియుచున్నది.

నాచన సోమనాథుని కాలము

నాచన సోమనాథుని కాలమునుగూర్చి పండితులలో బలుదగవు, లున్నవి. కేవలము నాచన సోముఁడేని ఎఱ్ఱా ప్రెగడయేనని హరివంశమును వ్రాసి నచో నీతని కాలనిర్ణయమున అన్ని వివాదము లుండెడివి కావు. ఈ కవి కాలనిర్ణ యము మహాకవులయిన ఇద్దణి హరివంశరచనల పౌర్వాపర్యముతో జోడింప బడినది కావున నిందనేకములయిన యితర విషయములును ప్రవేశించినవి. నాచన సోమనాథుని కాలనిర్ణయమును గావించుటకుఁ బ్రధానములయిన రెండు చారిత్రకాధారములు గానవచ్చుచున్నవి. అందొకటి లుక్కరాయలు. గుత్తి దుర్గ మందుఁగల పెంచుక లదిన్నె యను గ్రామమును నాచన సోమనాథునకు ధారవోని వేయించిన దానశాసనము – రెండవది నాచన సోమన కృతిగా లక్షణ గ్రంథములం దుదాహరింపఁబడినవసంత విలాసమను గ్రంథమునకుఁ గృతిపతిగా చెలియవచ్చు మాధయ బ్రహ్మయ యను వాడు. మాచయ బ్రహ్మయ, బుక్క రాయలను వారిరువురు కల్పితపురుషులుకాక యాయాకాలములందున్నట్లు స నాధారములు గనఁబడుచున్నవి. ఆ మానవల్లి రామకృష్ణకవిగారు. మాచయ బ్రహ్మ యనువాఁడు. బ్రాహ్మణ సర్దారుఁడనియు నీతనికాలమును గొన్ని శాసనము లాభారముగ క్రీ.శ. 1880 గ నిర్ణయింపవచ్చుననియుఁ దెలిపినారు. నాచన సోమనాథుడుత్తరహరివంశము నేకాక వసంత విలాసమును మఱియొక గ్రంథమును రచించినట్లు లక్షణకారు లుదాహరించిన పద్యములు వలన దెలియుచున్నది. ఈ వసంతవిలాస కృతికి అతి సూచయ బ్రహ్మయ యని యా గ్రంథమండలి మొదటి పద్య మదీయని శ్రీ రామకృష్ణ కవిగా రుదాహరించినట్లు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రంగా రీ క్రింది పద్యమును చాటుపద్య మణిమంజరి భా. 2. రాజ ప్రశంసా స్తబకములో చేర్చి రారు. ఆ పద్యము, 7. శ్రీచన్ను ంగవ కేవఁ గొమ్మె టుఁగులన్ శృంగారపుందో టకున్ వ్రాచీనం బగుచున్న మిశతి నఖ పౌధిన్ సుఖాంబోధి వే లాభంద్రోదయమైన దేవుడు కృపాలంకారచిత్తంబునన్ కూచున్ మాచయ బ్రహ్మదీమణిఁ గవిస్తోమై కచింతామణిన్ఈ పద్యమును బురస్కరించుకొని కవిస్తోమై కచింతామణిగాఁ బొగడం బడిన ఈ బ్రహ్మయ యెవరని యాలోచింపవలయును. ఈ మాచయ బ్రహ్మయ శాసనము కారెమపూడిలో నున్నట్టుగను దానిని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రుల వారు చూచినట్లుగను దెలిపినారు. ఈ మాచయ బ్రహ్మయను గూర్చి వ్రాయుచు “కారెంపూడిలో మాచయనిం గారి శాసనములు రెండు 7. శ. 1226-1228 సంవత్సరముల నాటివి కలవు. ఆస్తుల వారు చూచిన శాసన మా రెంటిలో నేదయిన నగునో కాదో చెపఁజాలను, వొప్పిచర్లలో మాచయ సాహిణి పేర నొక శాసనము కలదు. (A. R. 641, 581, 664, of 1808) ఇది నాచన సోముని పెంచుకలదిన్నె శాసనములకంటె నలువది సంవత్సరములు పూర్వము పుట్టినది” అని శ్రీ చాగంటి శేషయ్యగారు పేర్కొనినారు. వీరింక ను మాయ బ్రహ్మయ యనఁగా నీతఁడు మాదయగారి బ్రహ్మయ యని యందు మేని యీ శాసనములోని మాదయ, బ్రహ్మయకుఁ దండ్రియని చెప్పవచ్చును. కాలమును సరిపోవును అని వ్రాసినారు. నిజమునకు శ్రీ చాగంటి శేషయ్యగారు భావించినట్లు మాచయ బ్రహ్మయ, ‘మాచయకుమారుఁడు బ్రహ్మయ కాగా నతఁడు తండ్రియైన మానయకు 26, 80 సంవత్సరముల తరువాతి వాఁడగును. ఇక మాచయ యచువాడు .. 1, 1224-25 అనగా క్రీ. శ. 1804 సంవత్సర ప్రాంత నాగరలిపి వ్రాత రసరుగాను. రసకూ గాను. రసాత్రగాను పొరపుచ్చుట సంభావ్యమే ఆనుచుఁ బేర్కొని తమ సవరణకు గల కారణములను బ్రకటించినారు. ఈ పండితుల వాదోపవాద సారాంశములను బురస్కరించుకొని చూడఁగా నాచన సోమనాథుని కాలమునకు ప్రధానముగా నాలుగుస్థితులేర్పడినవి.

  1. రసభూసయ నేందుభి – T.శ. 1218 — క్రీ.శ. 1294.
  2.  రసాభనయనేందు బి! — 1.శ. 1206 — క్రీ.శ. 1284.
  3.  కరాజనయనేందుభి – 1.శ. 1883 — క్రీ.శ. 1370.
  4.  రసరునయనేందు 1 — 7.శ. 1206 — క్రీ.శ. 1844. ఇట్లేర్పడిన కాలమనఁగా క్రీ. క. 1284, 1203, 1870, 1844 ఈ సంవత్సరములలో నేనువత్సమున దానశాననము వెలసియుండెనో నిర్ణయింపవలయును.

ఇంతవరకు బారిత్రకు లందురు సంగమునిపుత్రులైన హరిహర బుక, రాయాదులు కాకతి ప్రతాపరుద్రుని పతనానంతరమే దక్షిణాపథమునందు హిందూ ధర్మమును బునరుద్దరించి గొప్ప సామ్రాజ్యమును స్థాపించిరని చెప్పుచున్నారు. కావున క్రీ. శ. 1984 వ సంవత్సరము నాటికే బుక్కరాయలు స్వతంత్రుఁడై దానము గావించె ననుట పొసఁగనిమాట. అంతేకాక శాసన శ్లోకము ననుసరించియై వను క్రీ. శ. 1294 నకు సరియగు శా. శ. 1218 తారణ సంవత్సరమగుట లేదు. కావున నిన్నిట పొసఁగక యున్న రసభూనయనేందు లిఅను పాఠమును పూర్తిగా లేఖక ప్రమాదమని త్రోసివేయ వచ్చును. ఇక రెండవ రసాభయనేందు?’ అనఁగా నీ శాసనము క్రీ.శ. 1284 వాఁటిదను పాఠము. ఈ పాఠము ననుసరించి 7.శ. 1206 తారణ సంవత్సరమే యగుచున్నది. కాని యీ శతవర్షము విజయనగర స్థాపకులైన సంగముని పుత్రులలో నెవ్వరి దినిగాదు. 6 శ్రీ విద్యారణ్య శ్రీపాదుల యాజ్ఞ ననుసరించి హరిహరుఁడు .శ. 1258 ధాతృనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమినాఁడు పుష్యమీ నక్షత్ర యుక్త సింహలగ్నమున శంకు స్థాపనము గావించి పుర నిర్మాణము గావించినట్లు శాసనాధారములున్నవి. కావున విద్యానగర నిర్మాణమునకు పూర్వమే యా విద్యానగరరత్న సింహాసనముననుండి దానమిచ్చుట అసంగతము గావున నీ పాఠమునుగూడ లేఖక ప్రమాదమని త్రోసివేయవచ్చును. బుక్కరాయలు విద్యారణ్యకృత విద్యానగర రత్న సింహాసనమున నుండి దానము చేసినట్లు చెప్పుచున్న విషయము నాధారముగాఁ గొనియు, చారిత్రకులు నిర్ణయించిన బుక్క రాయల రాజ్యపాలనా కాలము క్రీ.శ. (1886-1377) సంవత్స రముల ననుసరించియు దానికి నుగుణముగ బుక్కరాయల పాలనమునందు వచ్చు సంవత్సరములకుఁ డై మార్పు గాచింపఁ బడినది. ఇంత ప్రయాసపడినప్పటికీ నీ మార్పువలన వచ్చిన సంవత్సరము తారణ కాలేదు. ఏలయనఁగ హరిహరరాయల మరణానంతరము రాజ్యపాలనము గావించిన బుక్కరాయలకాలములో తారణ సంవత్సరము రాలేదు. కావున తారణకు దరిదాపులనుండునది సాధారణ, ఆది బుక్క రాయణకాల మందు వచ్చినది. కావున పండితుల ‘తారణను ‘సాధారణ’గ సవరించియు శ్లోకమందలి ప్రథమపాదమును బూర్తి గ మార్చియు ‘కరాజనయ నేందు 24 సాధారణే’యను పాఠమును సిద్ధము చేసినారు. నిజమున కిది పండితులు సృష్టించిన పాఠమే కానీ నిజమైన దానశాసన పాఠముకాదు. ఇక మిగిలిన రసర్రునయనేందుఖిఆను పాఠము. ఈ శాసనము ననుసరించి గా.శ. 1927 (క్రీ.శ. 1844) టుక్క రాయల శాసనమందు చెప్పిన తారణ సంవత్సరమే యగును. కాని శ్రీనేటూరి ప్రభాకర శాస్త్రుల వారి సవరణతో గూడిన యీ పాఠము నంగీకరింపని పెద్దలు క్రీ.శ. 1844 వ సంవత్సరమునాటికి బుక్కరాయలు రాజ్యమునకే రాలేదు. కావున నాతఁడు విద్యానగర రత్న సింహా సనమునుండి దానమెట్లు చేయఁ గడ్గెనని ఆక్షేపమును ప్రధానముగఁ జేయు చున్నారు. విద్యానగర ప్రథమ చక్రవర్తులైన సంగమునిపుత్రుల శాసనము అన్నియు సంపూర్ణముగ బయలుపడకపూర్వము లుక్కరాయలు క్రీ. శ. 1866-1B ల నడుమ విద్యానగరాధిపతి యయ్యెనని తెలసిన దినములలో నీ యా షేపము సత్యమై సమంజసముగనే గోచరించుచుండేదిది. కాని సంగముని పుతులైన హరిహర బుక్కరాయాదుల విషయము పూర్తి గ నెం(గిన కాలము వారికిది యొక పెద్ద యాక్షేపముగ గోచరింపదు. ఏలయన హరిహరరాయల పరిపాలనారంభ కాలము నుండియు ననఁగ క్రీ.శ. 1888 నుండియు బుక్కరాయలు యువరాజుగ నుండుటయేకాక యన్నతో గలసి తానును రాజ్యపాలన మొనర్చుచుండెనని తెనియుచున్నది. కావున బుక్కరాయలు తన యగ్రజుడైన హరిహరరాయలు ప్రభువుగ ప్రభుత్వము నెఱపుచుండ పంచపాండవులలో శ్రేష్ఠుఁ డైన యర్జునునివలె తాను అన్న ప్రారంభించిన మహాకార్యమగు విద్యానగర నిర్మాణమునకుఁ బూని యా విద్యానగర రత్నసింహాసనము నుండి క్రీ.శ. 1844 నాఁడు పెంచుకలదిన్నెను నాచన సోమనాథునకు ధారవోని శాసనమును వేయించె ననుటలో విప్రతిపత్తి లేదు. కావున శాసనకాలము క్రీ. శ. 1844 అని నిర్ణయిం చుటయే యుక్తము. ఈ యాధారములను బురస్కరించుకొని చూడగా నీ నాచన సోమ నాముఁడు క్రీ.శ. 1285 ప్రాంతమున జన్మించి క్రీ.శ. 1980-55 వజకు జీవించియుండవచ్చునని తలచుట కవకాశమున్నది. నాచన సోముని వసంత విలాసమునకుఁ కృతిపతియైన మాచయ బ్రహ్మ నికాలము 1830 అని స్థూలముగఁ బరిగణించినచో క్రీశ. 1880-30లలో సోముఁ డి యుత్తరహరివంశమును రచించియుండెనని యూహింప నవకాశము గలుగుచున్నది.

నాచన సోముని కృతములుగాఁ గానవచ్చు గ్రంథములు

1. ఉత్తర హరివంశము

2. హరివిలాసము.

3. వసంతవిలాసము,

4. ఆదిపురాణము.

5. హరవిలాసము.

ఈ గ్రంథములలో నొక్క ఉత్తరహరివంశముతప్ప తక్కిన గ్రంథము తెవ్వియుఁ గానవచ్చుట లేదు. ఆయా లక్షణ గ్రంథకర్త లాయా లక్షణ గ్రంథములు దుదాహరణములుగా బద్యముల నుద్దరించి, గ్రంథముల పేరొసంగి కర్త సోమ నాథుఁడని పేర్కొనుటచే నియ్యవి సోమనాథుని కృతములుగాఁ గన్పట్టుచున్నవి. అప్పకవి ముకార యతులను గూర్చి చెప్పుచు వసంతవిలాసమునందు

ఆత్తరి విటనాగరకులు చిత్తమున వసంతకేళి చిగురొత్తంగా

మొత్తములు గట్టి తెచ్చిరి ముత్తెపురుల్లరులతోడి బుజ్జటకొమ్ముల్

ఈ పక్యము నుదాహరింపగా నీ పద్యమునే చక్కటివడుల కుదాహ రణముగ కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహము నం దుద్దరించినాఁడు. ఆం దాతఁడు నాచన సోముని వసంత విలాసమునుండి యని కంతో క్తిగా బేర్కొని నాడు. ఈ యిరువురు లక్షణకారులేకాక యనేకులగు నీతర విమర్శకు లాయా పద్యముల నుద్ధరించి యయ్యవి వసంతవిలాస మందలివి యని పేర్కొనివారు. ఇంతియకాక, విమర్శకులు లక్షణకారు లుద్దరించిన పదముల శైలిని బురస్కరించు కొని కూడ వసంతవిలాస’ | మనుకృతి నాచన సోముఁడు రచించినదిగనే కానవచ్చుచున్నది. శ్రీమదోగిరాల జగన్నాథ కవిరాజు గారు తమ సుమనోభిరంజన కావ్య వ్యాఖ్యానమున.

దేవ వల్లభ హోదినీ విలసిత మయ్యు జంధ జయాధిక సంపద దగి

అని తన గ్రంథమున వ్రాసినదానిలోని యను నక్షరము లఘు. వనియు నందుకు లక్ష్యమును జూపుటకొఱకు సంస్కృత సమాసములందు రేవసంయుక్త వర్ష పూర్వాక్షరమునకు లముత్వమును గల్పించిన పింగళి సూరనార్యులు నుదాహరించుచు నాచన సోమనాథునిదని “శతతాళ దమ్న ప్రదమున ను కెన్'” అను కందపద్య పాదము నుదాహరించినారు. ఈ పాదముతోఁ గూడిన పద్యము నాచన సోముని ఉత్తరహరివంగపు, ప్రతులందుఁ గానవచ్చుట లేదు. ఈ పద్య పాదమును టురస్కరించుకొని లో నడు కుదుటి వీరరాజు పంతులుగారుశ్రీకృష్ణుడు యమునానది యందలి కాళియ నాగరాజు హదమున నుతికిన ఘట్టములోనిదని తోచుచున్నది. ఈ యుదాహరణము ప్రక్షిప్తమనుటకు గాని, లేఖక ప్రమాద మనుటకు గాని పిలు లేదు. కాళియుని మరువున శ్రీకృష్ణుఁ డురికినది. పూర్వహరివంగము కథ యైయున్నదిఅని. వ్రాసినారు. ఇక శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రీగా రీవాక్యమును బురస్కరించుకొని శ్రీ మదోగిరాల జగన్నాధకవిగారు ప్రామాణికముగా దీనిని నాచన సోమనాథుని దనుచు నుద్ధరించినా రేమొ అని సందేహమును వెలిపుచ్చినాడు. ఇక చాగంటి శేషయ్యగారు.జగన్నా ధకవి శ్రీ ప్రభాకర శాస్తులు గారని నట్లు కళాపూర్ణోదయములోని శబ్దమును బొరపాటున నాచనసోమనాథునిదని వ్రాయలేదు. దీనిని బట్టి నాచన సోముఁడు పూర్వహరివంశమును వ్రాసియున్నడే విశ్చయింపఁ దగియున్నది. ఎడ్లాప్రగడ రచించిన హరివంశమున జగన్నాధకవి యుదాహరించిన పద్యపాదములేదు. భాగవతమున గాయమర్ధ నక థియందు ప్రద మున నుజి కెన్అను శబ్దము లున్నవి కాని శతరాశ దఘ్న శబ్దములేదు, శ్రీకృష్ణలీలలను వర్ణించిన పద్మ పురాణమునను నీ వాక్యము గన్పట్టుటలేదు. ఏవిధ ముగాఁ జూచినను టూర్వహరివంశమును నాచన సోమనాథ కవి రచించినట్లే కన్న ట్టుచున్నది.అని వ్రాసినారు. పెద్ద లందలు భావించినట్లుగా నీ పద్యము శ్రీకృష్ణుడు కాళియ ప్రదమునం దుబికిన సందర్భమునందలిడై యుండుట యుక్తమేకాని యీ పద్యపాదము పూర్వహరిపెంగ మునందలిదియా కాదా యని పరిశీలింపగా సంస్కృత హరిచంగ పూర్వరాగమందు

ఏనం కదంబ మారుహ్యత దేవశిశుశీల యా వినిపత్య ప్రదే ఘోరే దయయిష్యామి కాళియమ్ ” “

హరి. వి. ప. ఆ. 11-58.

అనియున్నదే కాని ‘శతతాళదఘ్న హ్రద ప్రతీయే లేదు.. కావున పెద్ద లేకారణమును బురస్కరించుకొని హదపసక్తి కలిగియున్న పద్యపాదము భాగవతమందలిదిగా గాని, పద్మపురాణము నందలిదిగా గాని యంగీకరింపలేదో యాకారణమును బురస్కరించుకొనియే యీ పాదము పూర్వహఠినంగ మునందలి కాదని చెప్పవలను పడుచున్నది. అయినచో నీ పద్యపాద మెదలిడై యుండునని యాలోచింప హరివిలాసమందలి దిగఁ దోచుచున్నది. ‘హరివిలాస’ మైనను, పూర్వ హరివంగమైనను శ్రీకృష్ణుని బాల్య క్రీడలను వర్ణించు ఘట్టమున శ్రీకృష్ణుఁడు కాళి యుఁడను సాగుని మర్థించుటకుఁ గాయప్రదమునం దుణికిన విషయమును చెప్పు సందర్భమును సూచించు నీ పద్యపాద మొకటియైయేయుఁడ నది పూర్వహరివంక మందుఁ బొసఁగక హరివిలాస మందెట్లు పొసఁగువని యా క్షేపమును గనఁబలుప వచ్చును. ఈ యాక్షేపము సమంజసమైయే కానవచ్చును. కాని సంస్కృత హరివంశము ననుసరించి చూడ నీ యర్థమునిచ్చు శ్లోకము పూర్వభాగ మందు లేదు. లాక్షణికు లెవ్వరును సోముని హరివంశము. పూర్వథాగమని యే పద్యమును బేర్కొనలేదు . కావున కనఁబడని వినబడని దానికి మూలాతిరిక్తమైన వర్ణనము వంటగట్టుటకిన్న శ్రీహరిలీలలు నన్నింటిని ‘హరివిలాస’ మను గ్రంథమున సోముఁడు రచించినాఁడనుటయే మేలు గానున్నది. కావున సోమనాథుని మూడవ గ్రంథమున ‘హరివిలాస’మని తేలినది. అప్పకవిఒకనాఁ డిందుధరుండుఁ దార్వతియు లీలోద్యాన కేశీ సరిఆను పద్యము నుద్దరించి దానిని వికల్ప విరమణములకు లక్ష్యముగ సూచించి ఆది పురాజుము నందలిదని పేర్కొనినాఁడు. ఈ పద్యము కొలది మార్పుతో నిప్పుడు సోముని ఉత్తరహరివంశ మందుఁ గానవచ్చుచున్నది. ఈ పద్యమును గూర్చి వేలూరి శివరామశాస్త్రిగారుహరివంశమున ఆదిపురాణమును పేరునున్నదా ! లేక వేలు గ్రంథము కాగ రెంట నా పద్యము నుపయో గించుకొనెనా !యను సందేహమును వెలిపుచ్చినారు. ఆలోచించి చూడగ నీ యాదిపురాణము వేఱు గ్రంథ మనియే తోచుచున్నది. ఏలయన హరివంశమున కాదిపురా జనును పేరున్నటుల నింతపల కెక్కడను గానవచ్చుటలేదు. కావున అప్పకవి యాదిపురాణ నుమచు నుద్దరించిన గ్రంథము నిజమై యున్నచో, సోముఁ డాదిపురాణమను వేడొక గ్రంథమును రచించెననుటయే యుక్తము. రంగరాట్చందమున, కస్తూరి రంగకవి ఆయా లక్షణములకు లక్ష్యములుగా సోముని హరి (హర) విలాసము నుండి యని నాలుగు పద్యములు నుద్దరించినాఁడు.

జయవిజయ వినుత జన్యా

వ్యయ దూరానంద రూప భాసురదత్తా 

థయ హరిహయ ముఖ నిర్జర

నయనన్నక్షత్రి యూథ నళినీవాథా.

ఆనందరంగరాట్చందము. అపి ఆను ఉపసర్ల P. 115.

క. శంబర వైరి విభంజన

సాంబశివా యంధక ప్రధానక గజచ 

ర్మాంబరధర యని నీదు ప 

దంబులు పూణించువాఁడు ధన్యుఁడు సుమ్మీ

ఆ.00. 4. ప్రాదియతి P. 100

క. జయమగుటకు నీమది సం 

శయ మేజికి విను మనుచు సమంచిత కరుణా 

లయుఁడగు మునీంద్రుఁ డెంతయు

ప్రియముగ మంత్రంబుఁ జెప్పె నృపతికి నెలమిన్.

ఆ. రం. ఛ. మకారయతికి. P 29

, మానితీలక ! సజ్జన సం

తాన మహిరుహ : భవత్సుధాలాపము నా 

వీనులకు విందొనర్చెన్ 

మేనునఁ గలతాప మంచె మృషగాదు సుమీ ,

ఆ. రం. భ, హల్లుకు. P. IT

ఈ నాలుగు పద్యములను బురస్కరించుకొని శ్రీ చాగంటి శేషయ్యగారు ఇవి సోమకవి వసంతవిలాసములోనివై యుండునని శంకించి సోమకని వసంత విలాసమే ఈ హరవిలాసమో కాక వేజు గ్రంథమో తెలియదని, ఈ పద్యములు శ్రీనాథుని హరవిలాసములోని వేమోయని పరీక్షించి చూచితిని. ఆందీపద్యములు కన్పట్టలేదు. ఈ గ్రంథము హరవిలాసమో, హరివిలాసమో సంశయముగా నున్నదని వ్రాసినారు. శ్రీ శేషయ్యగారు సంశయించి నట్లపద్వములు వసంత విలాసము నందలివియై యుండునోపవు. ఏలయన నింతవట కుదాహరింపబడిన వసంతవిలాస మందలి పద్యములను బురస్కరించుకొని చూడగా నాగ్రంథ మొక శృంగారరస ప్రబంధమువలె కానవచ్చుచున్నది. ఈ పద్యము లన్ననో హరసంబంధములై యతి ప్రాథములుగా నున్నవి. కావున నీ పద్యములు నాచన సోమనాథుని వసంతవిలాసమందలివిగా శంకించుటకు వీలులేదు. ఇక కస్తూరి రంగకవిచే నుద్ధరింపఁబడిన నాలుగు కందపద్యములు హరపరములై యే కానవచ్చుటచే నీ గ్రంథము హరివిలాసము కాక హరవిలాసమనియే చెప్పుట

యుక్తముగా నున్నది. ఇక సొమనాథు (డన్నియు కందపద్యములనే కూర్చెనో , లేక కస్తూరిరంగ కవి లక్ష్యములుగా నాయాభాగములనుండి యేరి కూర్చెనో తెలియదు. ఈ నాలుగు పద్యములు దక్క నితరాధారము లేక యీగ్రంథ నామ మును తత్కర్తను నిర్ణయించుట సులభసాధ్యముకాదు. ఒక వేళ నీ కృతి కస్తూరి రంగ కవి పేర్కొనినట్లుగా నాచన సోమనాథునిదే యగునేని యీగ్రంథము హర విలాసమే కాని హరివిలాసము మాత్రము గాదనుట నిక్కువము.

అమానవల్లి రామకృష్ణకవిగారికి మలబారు దేశమునందొక చంపూ రామాయణ గ్రంథప్రతి గ్రంథకర్త పేరు దెలియరానిది లభింపగా వారాశైలిని పురస్కరించుకొని యాగ్రంథము నాచన సోమనాథునిదై యుండవచ్చునని శంకించిరి.శ్రీరామకృష్ణకవిగారు లిఖించిన ఓండు రెండు వాక్యములు తక్క తది తర విషయము లెవ్వియు నెంగరాని యా గ్రంథమును గూర్చి యాలో చించుటయు సాహసమె యగును. కావున నాచన సోమనాథుని గ్రంథములుగా 1. ఉత్తర హరివంశము 2. వసంత విలాసములు నిర్జరీకరింపబడినవి. ఇక హరివిలాసము, హరవిలాసము, ఆదిపురాణము అను గ్రంథములనుండి యాయాపద్యముల లక్షణ కర్త లుద్ధరించుటచే నీ మూడు గ్రంథములు గూడ నా మహాకవి రచించి యుండెనమ్మ కారా రములున్నవి.

నాచన సోమనాథుఁడు పూర్వహరివంశమును రచించెనా? లేదా?

మహాభారతమునకు ఖిలపర్వముగాఁ బరగణింపబడుచున్న హరివంశము పూర్వోత్తర భాగములు గలిగియుండుటయు, నిప్పు డుపథ్యమగుచున్న నాచన సోమనాథుఁని గ్రంథము ఉత్తర హరివంశమను పేరుఁగాన వచ్చుటయు, నెజ్జా

పెగడ హరివంశము పూర్వోత్తర భాగములు రెండును గలిగియుండుటయుఁ ప్రధాన కారణములుకాగా నాచన సోమనాథుఁడు పూర్వ హరివంశమును రచించెనా? లేదా ? యను వివాదమునకు తావు నొసఁగినవి. ఉత్తర హరివంగమునందు గ్రంథ వతారిక గానరాకుండుటయు మఱియు గ్రంథారంభము నందలి .

““హరివంశ ప్రథమ కథాం తరమునఁ గల వింతలెల్లఁ దప్పక మదిలోఁ దిరమయ్యెఁ గదా మీదట నరవర : యే కథలొకో వినం బ్రియ మనుడున్ఉహ. ఆ 1.8

జనమేజయుఁ డిట్లను న

మ్మునితో బలదేవులాపుముతువిని మణియుం

దనియదు మరి ముద మరువఁగ

వినగోరెడుఁ జెప్పవే వివేకనిధానా”

ఈపద్యములను బురస్కరించుకొని ఇచట బలదేవులావు జనమేజయుం దీంతకుముర్ను విరినట్లును, నింకను వినగోరినట్లును దెలియుచున్నది. మఱియు ప్రథమ భాగమును దెలుఁగింపకయోప్రథమభాగమునఁగల కథలెల్ల వంటి విగదా మీదటనే కథలు వినగోరెదననికవి వ్రాసియుండడు. కావున సోముఁడు పూర్వ హరివంశమును రచించెనని చెప్పుచున్నారు. ఇక ఆ నడకుదుటి వీరరాజు పంతు లుగారుఇంతకుమున్ను విన్న బలదేవులా వెచ్చట నున్నదని విచారింపఁగా పైని నేను వ్రాసిన సంస్కృత హరివంశపు వ్రాత ప్రతులందుఁ బూర్వభాగము కడపటి యధ్యాయము చివరి శ్లోకములందే బలదేవులావు దుక్మి వధ సందర్భమున చెప్పబడి యున్నట్లు స్పష్టమైనది. దీనినిబట్టి సోముఁడు బలదేవ పరాక్రమము పూర్వ హరి వంశమునఁ జెప్పియున్నా (డని నిశ్చయమగుచున్నదనిరచించిరి.

శ్రీసరుకు మటి వీరరాజు సూచించినట్లుగ బలదేవులావు సంస్కృత హరివంశ పూర్వభాగము కడపటి యధ్యాయముప్రద్యుమ్ను వివాహో రుక్మివ ధశ్చఅను దానితో టూర్తి యగుచున్నది. ఈ మట్టము పూర్వోత్తరభాగములుగా విభక్తమైన హరివంశములో బూర్వభాగము చివరను, పర్వములుగా విభక్తమైన హరివంశ ప్రతులలో విష్ణుపర్వము 1 అధ్యాయముగనున్నది. ఇక బలదేవు మహాత్మ్యము నభివర్ణించు నధ్యాయముతో నుత్తర హరివంశము ప్రారంభమగు చున్నది. ఈ భాగము పర్వములుగా విభక్తమైన హరివంశములో విష్ణుపర్వము 82 వ అధ్యాయమున నున్నది. ఇది 20 శ్లోకములు మాత్రమే కల చిన్న ఆధ్యా యము, ఇవి మూల హరివంశపు విషయము. కావున ఆంతమాత్రమున సోమ నాథుఁడు పూర్వహరివంశమును రచించెననుటకు వీలులేదు. మఱియు పెద్ద లే పద్యము లాధారముగాఁ గొని సోముఁడు పూర్వ హరివంశమును రచించెనని

నిర్ణయించుచున్నారో యా పద్యములకు మూలములైన శ్లోకములు హరివంశమందలి యుత్తరభాగ ప్రధ మాధ్యాయమునందే కలవు. ఉదాహరణమునకు

రాజోవాచ

భూయ ఏవతు విప్రర్దే బలదేవస్యధీమత:

మహాత్మ్యం శ్రోతుమిచ్చా మిశేష స్మధరణి ధృత : 1

హరి.వి.ప ఆ. 62-; 

ఈ శ్లోకమును పురస్కరించుకొనియే నాచన సోమనాథుఁడు జనమేజయుఁ డిట్లను నమ్మునితోనను పద్యమును రచించనట్లు చెప్పకయే చెప్పుచున్నది కదా? ఇదియే కాక మూల హరివంశమున

ఆతీవబలదేవంఠం తేజోరాశి మనిర్ణీతమ్ ! 

కథయంతి మహాత్మానం చే పురాణ విదోజు నా || 

తస్య కర్మాణ్యహం విప్ర తుమి ద్ఛామితత్త్వం॥

అనంతంయం విదుర్నాగమారి దేవం మహౌజసమ్ ||

అను శ్లోకము లుండగా నాచన సోమనాథుఁడు

ఘనబలుఁ డుదగ్రతేజుం

డనఘు డనంతుఁ డని విందు మాదికథలు 

దనుటయు వైశంపాయన 

మునిపతి భూపాలచంద్రమున కిట్లనియెన్.

ఉ.హః. 1-5

అని తెలు గొనరించినాడు. కావున నీ పద్యమును నాచన సోముని స్వకపోల కల్పితములు కాక మూలహరివంశమున కనువాదముల గుటచే నియ్యవి సోముఁడు పూర్వ హరివంశమునుగూడ రచించెనని చెప్పుట కాధారముగాఁ జూపుటకు వాలనివి.

ఇక పూర్వభాగమును రచింపకయే పూర్వభాగ కథలెల్ల వింటివి కదా? ఇక నేమి వినవలతువని వ్రాసియుండుటను గూర్చి విచారింపఁగా నందొక విశేషమైన బాదముగాఁ గా నవచ్చుట లేదు , ఏలయన మన సాహిత్యము నందు ఆ టురాణములనేవి , పురాణగాథ లాధారముగా రచించిన ప్రబంధములనేని పటిసిలింపగా నందు జనమే జయుఁడు వైశంపాయన మహర్షి గాంచి యింతపలకు గల కథను వినినట్లు ప్రస్తా

వించి యిక మీది కథను జెప్పు మనుచు నడిగినట్లు రచించుట సర్వసాధారణమై కానవచ్చుచున్నది. ఇయ్యడి సాహిత్య వేత్తలైల నెఱిఁగినదే. కావున నీ వాక్యము సోముఁడు పూర్వహరివంశమును రచించెననుట కాధారముగా బనికివచ్చునది కాదు .

మూలహరివంశమును బరికింపక కేవలము సోముని ఉత్తరహరివంశమును సూత్రము పరిశీలించినచో నీతని యాశ్వాస ప్రారంభమునందలి పద్యములు కొంత సందేహమునకుఁ దావునిచ్చుమాట సమే, కాని మూరిశ్లోకములఁ బరిశీలింపగా నీ సందేహము: మనము గల్పించుకొని నదియేకాని, సోమునిపద్యములు మాత్ర మట్టి సుదేహమున కవకాశము గలిగింపని మూల శ్లోకానువాదములని తెలియుచున్నది.

మణి కౌండలు విమర్శకులు ఉత్తర హరివంశ మందలి 

పూలపాణి మహిను చెప్పం

గల వారెవ్వరు పురాణకత్యన్ మఱియుం 

డెలిసికొనుము నేఁ జెప్పక 

నిలిచిన చోటులు: వివేక నిర్మలబుద్ధిన్

ఉహ, 1-11. 

అను పద్యము నుద్దరించి సోముఁడు పూర్వహరివంశమును రచింపలేదు. ఏల యన నాతఁడే యీ పద్యమందు.పురాణకథలన్ మఱియం దెలసికొనుము నే తెప్పక నీలి? నబోటు లు వివేకి నిర్మల బుద్ధిన్అని కంతోక్తి గల చెప్పినాఁ డనుచు దమవాదమున కుపపత్తి గాఁ జూపుచున్నారు. ఈ పర్యమునే పేర్కొని పూర్వ హరివంశమును సోముఁడు రణం ననువారలు కూడ దమనిర్ణయము నొసఁగు చున్నారు.

ఈ విధముగ సోముఁడు పూర్వహరివంశమును రచించెన నువారలకును లేదనువారలకును బెల్ని ధియై యువకరించిన పద్యమునుగూర్చి విచారింపవలయును. ఇందుకును మూలహరివంశోత్తర భాగము బలదేవమాహాత్మ్యమును జెప్పు నంద ర్భమున (హరి. వివ. ఆ 18) లో

ఇతి పుకుష వరస్య లాంగలే గృహువిధము త్తమమన్యదేవచ

యద కథతమి హాద్యకర్మతే తదుపల భస్వ పురాణ విస్తరాత్ |

 

అను శ్లోకము గానవచ్చుచున్నది. ఇందు వైశంపాయనులే వ్యాస భగవానుల యాజ్ఞచే జనమేజయ మహారాజులకు హరివంశమును వినిపించుచుఁ బురుష ప్రప రుదైన బలదేవుని యుత్తమ కర్మలనేకములు గలవు ఇచ్చటఁ జెప్పనివి పురాణ ములవలన నెలలుఁగఁ దగుననుచుఁ జెప్పి యంతటితో బలదేవ మాహాత్మ్యకథనము నాపివేసినాడు.

ఈ విధముగనే హరివంశోత్తరభాగమును దెనిఁగింపఁ బూనిన నాచన సోముఁడు హరివంశోత్తరభాగ ప్రథమాశ్వాసమందలి బుదేశమాహాత్మ్యమును గొంత అభివర్ణించి చివరి శ్లోకమునకు వాదముగ నీహలపాటి మహిమ చెప్పగల వారెవ్వరుఅను పద్యమును రచించినాఁడు. ఈ పద్యము సంస్కృత శ్లోకము నకుఁ బూర్తి యనువాదమేకాని యొక్క పలుకైన క్రొత్తగా చేర్చినది కాదు. కావున

నీ పద్యము సోముఁడు పూర్వ హరివంశమును రచించెనను వారలుగాని లేదనువారలు గాని యుద్ధరించి తమవాదమున కుపపత్తి గాఁ జూపుటకు వీలు లేదు. కావున నిన్ని మూలాధారములఁ బురస్కరించుకొని సోముఁడు పూర్వహరివంశమును వ్రాయి లేదనుటయే సమంజసమైనది.

ఇక సోమనాథుని ఉత్తర హరివంశమందలి గ్రంథావతారికనుగూర్చి యాలో చింపవలయును.

నాచన సోమనాథుని ఉత్తర హరివంశము

శ్రీ సర్వమంగళాకుచ

వాసంతి వకుళ గంధ వద్వనమాలా 

వాసుకివిలాన వేద 

వ్యాసమునిమనోనివాస హరిహరనాథా!

ఉహ.ఆ..1.

అను కంద పద్యముతోఁ బ్రారంభమైనది. ఈ పద్యము సర్వవిధముల నవిఘ్న పరిసమాప్తి సంప్రదాయావిచ్ఛేద లక్షణఫల సాధనము కొఱకుఁ గావించు ఆర్నమస్త్రి యావస్తుని ర్దేశ పూర్వకమంగళ ప్రారంభమును గావించుచునే రచింపబడినది. నాటి కవికుల మూర్ధన్యుడైన సోముఁ డివద్యమ క్లిష్టదేవతా ప్రార్థన, వస్తు నిర్దేగాదుగా సతి చమత్కార ముగఁ జూపుట యేకాక వ్యాసమహర్షిని బేర్కొని పూర్వ కవిస్తు తిని

సయితము గావించినాడు. ఇంతియకాక భారతమునుగాని. హరివంశమునుగాని, పురాణములనుగాని ప్రారంభించునప్పుడు

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |

 దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ |

అను శ్లోకముతోఁ ద్రారంభించుట పరిపాటియై కానవచ్చుచున్నది. ఆ విధము గనే నాచన సోమనాథుఁడు భారత పరాంగమని చెప్పఁదగు నీ హరివంశోత్తర భాగ

మైన ఉత్తర హరివంశ ప్రారంభమున “శ్రీ సర్వమంగళాకుచ ” అను పద్యమునందు శ్రీ యనుపదముచేత లక్ష్మిదేవియేకాక సరస్వతియు సూచింపబడుటచే మిగిలిన వ్యాస నారాయణులను గంతోక్తి గఁ బేరాని సోముఁడు సంప్రదాయము ననుసరించి సరస్వతీ దేవిని, నారాయణవ్యాసమహర్షులను నమస్కరించి వాడనియు నిళ నీ విధానము గృతి ప్రారంభమును సూచించుచున్నదనియుఁ జెప్పవలను పడుచున్నది. కావున నాతడు పూర్వహరివంశమును రచింపలేదనియు నిప్పు డుపలభ్యమగుచున్న ఉత్తర హరివంశమునే రచించెననియు నిర్ణయింపవచ్చును. ఈ ప్రారంభ పద్యమునం దీ మహా కవి తాను వర్ణింపఁబోవు కథ నారాయణకథయనియు నాదేవుఁడు వ్యాస మనోని వాసియైన హరిహారదేవుఁడనియు నాతఁడు. “శ్రీ సర్వమంగళాకుల వాసంతీవకుళ గంధ వద్వన మాలా వాసు కివిలాసుడైనవాడుగా రూపించి నమ స్క్రియారూపమైన కావ్యముఖమును బూర్తి గావించినాడు. ఇన్ని విధముల గ్రంథ ప్రారంభమును సూచించుచున్న ఈ పద్యము సోముఁడు పూర్వ హరివంశమును వాయక ఉత్తర హరివంశమునుండియే కావ్యారంథమును గావించినాడని రుజువు చేయుచున్నది.

కొందఱు పెద్దలు సూచించినట్లు తెలుఁగునందు బ్రథమకావ్యముగ భారతము వెలసిననాటినుండి సోమనాథునివలకు నవతారికలేక కావ్యముల రచించినవారు లేర నట నిజమే. ఆయ్యు సంస్కృత కావ్యములఁ బరిశీలింప నందు మహాకవులుగ బ్రసిద్ధిక్కెనవారి గ్రంథమాలందు గ్రంథావతరణమును గూర్చిన ప్రస్తాపన మున్నట్లు గోచరింపదు. ఉదాహరణమునకు కవికులగురువైన కాళిదాసుని రఘువంక మందు

కాని మాఘుని శిశుపాల వధయందు గాని, హర్షుని నైషధకావ్యమందుగాని ఈ గ్రంధావరణ ప్రసంగములు పొడకట్టకుండుటను బేర్కొనవచ్చును.

ఇట్లు మహాకవులు మీఁదు మిక్కిలి నాచన సోముఁ డధికముగా ప్రభావితుడైన మహాకవి కాళిదాసుని గ్రంథములం దవతారికలు గానరాకుండుటచే సోముఁడు దానును తన ఉత్తర హరివంక మం దవతారికను జొప్పింపక కృతినాయకుడు. స్థితిలయముల కేక రూపియై వెలసిన హరిహరదేవుని స్మరణతో నవిఘ్న సమాప్తికై యేర్పరుప బడిన నమస్కార గూపమైన సంప్రదాయము నవలంబించి కావ్య ప్రారంథమును గావించినాడు. ఇంతేకాక యింతవఱకుఁ దేలు (గుకవు లెవ్వ రనుసరింపని నూతన విధానమం దనగాఁ గ్రంథాది యందవతారిక లేకయే యుత్తర హరివంశమును రచించి తన నవ్యతను బ్రదర్శించినాడు. ఇయ్యదియు నొక కారణమై సోముని నవీనగుణ సనాధునిగ నొనరించి యుండనోపు. కావున నాచన సోముని యుత్తరహరివంశము దవతారిక గానరాకుండుట ఆతఁడు పూర్వహరివంశమును రచించెనుటకు

హేతువుకాదు. కావున సోముఁడు పూర్వహరివంగమును రచింపలేదనుట నిశ్చయము.

నాచన సోమనాథుఁడు – అనువాద పద్దతి

నకలభాషా భూషణుడు, సాహిత్యర సపోషణుఁడు, సంవిధానచక్రవర్తి , నవీనగు జననాథుడైన నాచన సోముని హరివంశ రచనావిధాన మతిరమ్యమైనది. ఈతఁ దధికతర మైన జాగరూకతను బ్రదర్శించి హరివంశోత్తర భాగమునుండి కళా సుగ్రహమును గావించుటయందే తన నేర్పును బ్రదర్శించినాడు. మూలహరివంశ విష్ణుపర్వమందు 61వ అధ్యాయము నుండి ప్రారంభింపఁబడిన యీ హరివంశోత్తర రాగము భవిష్యహ్వంతము 688 శ్లోకములతో సమాప్త మగుచున్నది. పూర్వ హరివంశమునఁ జెప్పిన ప్రళయము, విధానము, ఆవతార వశంస, దేవదానవ యుద్దము లీ భవిష్యపర్వమునం బునరుక్తములైనవి. మిగిలిన కథాభాగములైనను ఆవాంతర విషయములతో గూడియున్నది. ఈవిధముగా అనేక విషయముల గూడి సాహిత్యరసదృష్టితోఁ జూచువారలకు మూణహరివంశ మగమ్యమైయుండ నాచన సోమనాథుడు మిక్కిలి నేర్పును జూపి హారివంతో త్తరభాగమునకంతటికిని ప్రాణ

ములంనఁదగు వారు కథలనుమాత్రమే గ్రహించి యుత్తర హరివంశమను పేర రచించి నాడు.

సంవిధాన చక్రవర్తి యైననాచన సోముఁడు గావించిన ఈ విష య సంగ్రహ విధా నమును బురస్కరించుకొనియే యితని గ్రంథ ముత్పాద్యమట్లు సర్వతంతమై కాన వచ్చుచున్నది. మూల గ్రంథమునందలి యనేక విషయముల ననుసరింపక విడిచినప్ప టికిని తిక్కన భారతపర్వము లా వెలితిదోఁపనీయక సమగ్రములై కొనవచ్చినట్టులే సోమనాధురి యుత్తర హరివంశముగూడ నా గ్రంథమునకొక మూల గంథమున్న దను భావమునే కలిగింపక సమగ్రమై కానవచ్చును. తను కాని సూక్ష్మముగా బరిశీలించి తిక్కన సోమయాజి భారత గ్రంథానువాద సందర్భము నందేనియమ ములు పాటించి యాంధ్ర మహాభారతమును స్వతంత్ర కావ్యమట్లు సంతరించెనో సాచన సోముడును పాటింపవలసిన సమయసందర్భము లందా నియమము అన్ని దేని పాటించియే యను వాదము గావించినాడు.

హరివంశమును ననువదించిన సమకాలికులగు మహాకవు లిద్దరిని పోల్చుకు నెఱన హరివంక పూర్వోత్తరభాగముల రెంటి ననువదించెను. నాచనసోముఁ డుతర భాగమును సయితము పూర్తిగా ననువదింపలేదని చెప్పుచుందురు. కాని మూలహరి వంశముతోఁ టోల్చి దాచిన, సత్యాసత్యముల విజ్ఞు లెంలు గుదురు. ఉత్తర హరివంశము విస్తృతి ముందు చిన్నదయ్య గుణమం దధిక విశేషము గలది. ప్రధాననాయకుని బురస్కరించుకొని ఈ నౌచిత్యపు ఛాయలనేని సొరకనీయక యతిభద్రముగా నీ గ్రంథమును గాపాడుకొనుచు వచ్చిన మహాకవి నాచన సోమనాథుడు.

హరివంశ మందు విపులముగా వర్ణింపబడిన శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. ఈతఁడు పురుషోత్తముడు. పంచమామ్నా యరూపమందు వెలసి ప్రసిద్ధమైన మహాభారతమునకంతటికి పట్టుకొమ్మ . భారతామ్నాయ మందుఁ బరాశరసూనుఁడే యద్వైతధర్మమును బ్రవచింపఁ దలఁచెనో యూ ధర్మము యొక్క సమగ్రస్వ రూపమే యితఁడు, అమూర్త మైనట్టిదియు. సర్వలోకకల్యాణ కారకమైనట్టిదియు హరిహూ భేద రూపకి మైనట్టిదియు నగు ఒకానొక ధర్మాద్వైత విధానమునకు రూపు కట్టినవాఁడు శ్రీకృష్ణుడు. అట్టి ధర్మస్వరూపుఁడు నాయకుడుగఁ బ్రవరి ంపబడిన దుష్టసంహార శిష్ట రక్షణాది రూపమగు విశ్వ శ్రేయమును వర్ణించినది నాచన సోముని

హరివంశము, ఈ ధర్మమునకు వెలితియైన కథలవి యెంతటి మనోహరము లయ్వు నెంతటి శ్రవణ పేయములయ్యు సోముని హరివంశమందు స్థానమును బొంద లేదు, మఱియు మూలగ్రంథ మార్ష గ్రంథమగుట చేత నందలి విషయనివేద నావసరములందు కాలక్రమము పాటింపఁ బడలేదు. కావుననే మనువుని వివాహాదులు ముందు చెప్పి తరువాత నా మనుమని తండ్రి పుట్టుక ఆకు ననఁగా ప్రద్యుమ్నుని జననమునకు, బూర్వము రుక్మిణి పుత్రార్థినియై శ్రీకృష్ణుని డ్రార్థించినట్లు మూలమనందు వర్ణింపఁ బడియున్నది. నిజమునకు విషయ నివేదనమే ప్రాధాన్యము ఏహింప నొక యలౌకిక భావముతో శ్రద్ధాభక్తులఁ బురిగొల్పుచు సాగిపోవుచుండు. రచనావిధానమే హరి వంగమందలి పద్ధతి. అట్టియెడ నా గ్రంథమును గావ్యముగా దీర్పఁదల పెట్టిన కవి యతితాగరూకుఁడై సూశాత్మ సూక్ష్మములైన మెలకువల నెన్నియో ప్రదర్శింప వలసి వచ్చును. అట్టి మెలకువలఁ బ్రదర్శించి కవివరుఁడై వాఁడు నాదన సోమనాథుఁడు.

నాచన సోమనాథుఁడు త్తర హరివంశమందు మూల హరివంశ క్రమము కన్న వేఱుగా నౌక క్రమమును దాటించి రచించటవలన సుత్తర హరివంశము రెండు గుణవిశేషముల నధికముగా సంతరించుకొనినది, సోమవాథుఁడు పాటించిన ఈ క్రమ మునుసరించి హరివంశమందలి కధలన్నియు నొక నియత మార్గమున నాను పూర్వం ములందు వైపరీత్యములు లేక వింతగఁ బొసఁగి సాగి పోవుటయేకాక కావ్యము మంగళాంతమగుటకును దోడుపడినది.

నాచన సోమనాథుని యనువాదపద్ధతియందొక వై లక్షణము గోచరించు చున్నది. ప్రధానములైన యితిహాస సంఘటనములందు, తత్త్వోపదేశములందు, నితరములగు మణికొన్ని ప్రధాన విషయనివేదనములందు మూలానుసారియై మూలూరుని ధనమునద్దము నందువలె ప్రతిఁ బిం బింపఁ జేయుచుండును. ఉదాహరణ మునకు

మూల హరివంశము

సుగ్రీవం చైవ బ్యంచ మేమ పుష్పవలాహకౌ: 

యోజయాశ్వానితి దారుకం ప్రత్య భాషతః

ఆరోప్య బ్రాహ్మణం కృష్ణాహ్య పరోప్య చదారుకమ్! 

మామువాచతతః శౌరిః సారధ్యం క్రియతామితి!

హరి ఉతర హరివంశము

వి. ప. ఆ. 112–27

డారుకుని డించి సారథిత్వంబు నాకు 

నొసఁగి భూమి సురసహితుఁడై యొప్పుమెరసె 

గృత వలాహక రైబ్య సుగ్రీవ మేఘ 

పుష్ప సన్యా హమగు రథంబున ముఖారి – ఉ. హ. ఆ. 2-86

కనిష్ణా శ్రీకృష్ణాదు లుత్తర సాగర ముత్తరించి గంధమాదనము సేరి నప్పుడు. మూల హరివంశము

తతస్తు పర్వతాస్సప్త కేశనం సముపస్థితా! 

జయంతో వైజయంతశ్చ నీలో రజత పర్వత:

 మహామేరు: సకైలాన ఇంద్రకూటశ్చ నామత: 

బిలాజా వర్ణరూపాణి వివిధా న్యద్భుతాని!

హరి వివ. ఆ 118-14+ 15 ఉత్తర హరివంశము

వచ్చునెడ జయంతమన వైజయంత 

మనఁగ నీలంబు నారజతాచలంబ 

నఁగ మహామేరు కైలాసము లనఁగ

నింద్రకూటంబునా వచ్చె నేడు గిరులు. మఱొకచోట మూల హరివంశము

నారా ఆపః సమాఖ్యాతాస్తాసామ యనమాదిత:

యతస్త్వం భూత భవ్యే శతన్నారాయణ శత:

హరసి ప్రాణినో దేవతతో హరి రీతిస్మృత:

శంకరో2సి సదాదేవత: శంకరతాం గతః

బృహత్త్వాదృృంహణుత్వా చ్చతస్మాదద్రృ హ్యేతిశబ్దితః 

మధురిండియనా మేతితతో మధుని మాదన:

హృషీకాణింద్రియాణ్యాహు స్తేషామీణీయతో భవాన్ |

 హృషీ కేశ స్తతో విష్ణోధ్యాతో దేవేషు కేశవః || 

మా విద్యావహరే ప్రోక్తాతస్యా ఈ యతో భవాన్ 

| తస్మాన్మాధవ నామాసిధవః స్వామీతి శద్దితః ||

హరి. క.ప.. 88, 43, 47

విశ్వలోక వ్యాప్తి విష్ణు నామము దాల్తు

మధునిం ద్రియములు దన్మర్ధనమున

మధుసూదనుండపు మాయన విద్యద

త్పతివి మాధవుఁడవు దపముచేత

నగుదు తపస్వి విహరణమింతకుఁ జేసి

హరివైతి నారంబున జలంబు 

లం దనయంబు నీ కగుట నారాయణ

త్వము వహించితి బృహత్వంబు బృంహ

 

తే|| ఇమున జూపుట బ్రహ్మవై నాడ వింద్రి

యములను హృషీకములు దదీశాఖ్య గలిగి 

నది హృషికేశ పదము కమ్మడి సుఖంబ 

ఓలమునకుఁ జేసి శలకరాకృతి భజింతు ||

ఉ. హ ఆ. 2-307.

ఇంతటి మూలను సాధియైన రచన గావించిన సోమనాథుఁ డతి విచిత్ర ముగా రాజసభ మర్యాదలను, రాయబారములను, అంతఃపుర వినోదములను ప్రద ర్శించుకప్పుడు స్వాతంత్రమును వహించి తనకాలమునాటి దేశాచారములను బురస్క. రించుకొని యాయాసందర్భములందు వర్ణించు కావ్యమును రసవత్తరముగాఁ జేయు చుండును. ఉదాహరణమునకు ఊర్వశి నరకాసుర సంభాణము, శ్రీకృష్ణుఁడు రుక్మిణీ సత్యభామ తో జూదమాడుట. జనార్ధనుని రాయగారము, సత్యభామ నర కాసురుతోఁ బోరుట మున్నగు ఘట్టములఁ బేర్కొనవచ్చును. –

ఆయాపట్టుల సర్వతంత్ర స్వతంత్రుఁడై రచించిన సోమనాథుని మూలాతిరి క్షములైన పద్యభాగములే ప్రధానకథతోఁ గలసి నిజమునకు గ్రంథ మంతయు సోముని యుపజ్నయే యను భావమును గలిగించుచుండును. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *