పూండ్ల రామకృష్ణయ్యగారు

అడవి శంకర రావు గారు, బీఏ, ఎల్.టీ.,

ఆంధ్ర ప్రబంధములను చాలవరకు మొట్టమొదట నచ్చొత్తించి యాంధ్రవాజ్మయ మునకు మహోపకార మొనర్చినవాడు పూం డ్ల రామకృష్ణయ్యగారు. వీరి ” అముద్రిత గ్రంథ చింతామణి’ పత్రిక సాయమువలన నే ” తాళీ దళసంపుట ప్రకర కాంతారంబులం” దణగి యుండిన మహాకవు లనేకులు మొదట తమ చెర విడుటయు, ఆంధ్రలోకమున పాఠకవర్గము నకు వారి పరిచయము సులభసాధ్య మగు టయు దటస్థించినది.

రామకృష్ణయ్యగారు నెల్లూరునకు పదు నై దుమయిళ్ల దూరముననున్న దువ్వూరనుగ్రామమున గాలం వ సంవత్సరము జూలై 9వ తేదిని (రౌద్రినామ సంవత్సర ఆపాడ బహుళ ద్వాదశిని) జన్మించిరి. ఈ నెల్లూరు ముడలము కవి తిక్కన (కొట్టరువు తిక్కన) ఖడ్గ తిక్కనల జన్మస్థానము. రామకృష్ణయ్య గారు భారద్వాజస గోత్రుడు. ఆపస్తంబ నూ త్రుడు. అప్పయ్య వీరితండ్రి, అమ్మక్కమ్మ వీరి తల్లి. ఆంగ్లేయమున వీరి పరిచయము బహుస్వల్పము. నెల్లూరుననున్న మిషను వారి యున్నత పాఠశాలలో నైదవతరగతి వరకు మాత్రమే చదివి, తరువాత సంస్కృతాంధ్ర ములయం దభిరుచి యెక్కువ యగుచుండు టచే, ఆపాఠశాలలో చదు వీయన మానివైచి నెల్లూరులోనే శ్రీవుల్లిగుండము రామచంద్ర రావుగారివద్ద శిష్యుడుగనుండి సంస్కృతాంధ్ర కావ్యము) గాఢముగ బఠింప దొడగెను.

రామకృష్ణయ్యగారు తొమ్మిది సంవత్సర ముల బాలుడై యుండగనే, తండ్రిని గోల్పోవు దురదృష్టము సంభవించెను. అందువలన జీవ నోపాధికై మార్గము లరయవలసిన యవస రము వారికి గ్రమముగ దప్పని సరియయ్యెను. ఈ సమయమున -రామకృష్ణయ్యగారికి శ్రీ వొడయారు వీరనాగయ్యగా రనువారితో గాఢ మైన మైత్రిగల్లెను. .వీరనాగయ్యగారు సంస్కృతాంధ్రములదగుపాటి పరిచయము గల్గిన వారును, చాలకాలమునుండి రామకృష్ణయ్య గారి కత్యంత క్షేమాభిలాషులు నై యుండిరి. తనకు పరిచితమైన చోట్ల గొన్ని టియందు చాల విలువగల తాళపత్ర గ్రంథము లున్న వనియు, అవి శిథిలముగా కపూర్వమే నానిని సేకరించి ముద్రించిన యెడల పండితలోకము మెప్పునందు టయే కాక వాజ్మయమునకు శాశ్వతమైన సేవ చేయుట యనియు, వలసిన చో దా నెంతయు నీ పనికి సాయమొనర్తుననియు వీర నాగయ్యగారు రామకృష్ణయ్యగారిని ప్రోత్సహించిరి.

కాని చాల ధనవ్యయము చేతను ప్రయాస ముచేతను సాధింపవలసిన యీ ఘన కార్యము రామకృష్ణయ్య, వీరనాగయ్యలవంటి యుత్సాహమే ముఖ్యాధారముగాగల సాధారణులకు సాధ్యమగు టెట్లు ? దీనివిషయమై వారిరువురు తీవ్రముగ నాలోచించిరి. నెల్లూరి మండలము లోని వెంకటగిరి సంస్థానము సుప్రసిద్ధకవుల కాశ్రయ మొసంగి వారి ప్రాబల్యమున కీర్తి గాంచినది. అప్పటికీ వెంకటగిరి సంస్థానాధీశ్వ రులైన శ్రీ వెలుగోటి రాజగోపాలకృష్ణయా చంద్ర బహదరుగారుకూడ కవిపోషణమునను, వాజ్మయ పోషణమునను నుత్సాహ మగుషర చుచునే యుండిరి. అందుచే రామకృష్ణయ్య గారును, వీరనాగయ్యగారు నాలోచించి శ్రీ రాజగోపాల కృష్ణయాచేంద్ర బహదరుగారిని తమ ప్రయత్నములకు దగిన సాయము చేయ వలయునని ప్రార్థించిరి. సంస్కృతాంధ్రభాషా భిమానులును, గవి తాపోషకులు నైన వెంకటగిరి ప్రభువు వీరి సంకల్పమును గౌరవించి, యుత్సా హమును గుర్తించి వారికండయై నిల్చుటకం గీకరించిరి. పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రచు రించిన ‘అముదిత గ్రంథ చింతామణి పత్రిక కు వెంకటగిరి ప్రభువే ప్రధానపోషకులు.

“అముద్రిత గ్రంథ చింతామణి ‘ యొక్క పరమావధి అముద్రితములైన యాంధ్ర ప్రబంధ ముల గ్రమముగ బ్రకటించుటయని వేరుగ చెప్పనక్కర లేకయే తెలియుచున్నది. ఈపత్రిక 1885 వ సంవత్సరము జూను నెలలో ప్రారం భమై 1904వ సంవత్సరము యేప్రిల్ నెల వరకు సాగుచునే యుండెను. రామకృష్ణయ్య గారు పండితుడేగాని కవి కాడు. వీరు స్వయ ముగ రచించిన గ్రంథ మొక్కటియు లేదు. వీరు ముద్రించిన పూర్వకాన్యములలో బార ముల సవరించుటకును, వాటికి వ్యాఖ్యానము చేయుటకును కందుకూరి వీరేశలింగము పం తులు, కొక్కండ వెంకటరత్నము పంతులు, వావిలికొలను సుబ్బారావు, మండపాక పార్వ తీశ్వంకవి, మచ్చా వెంకటకవి, వేదము వేం కటరాయశాస్త్రి, ధర్మవరము కృష్ణమాచారి మున్నగువారు రామకృష్ణయ్యగారికి చాల దో డ్పడిరి. 1904 సం. సెప్టెంబరు 1వ తేదీని రామకృష్ణయ్యగారు స్వర్గస్థు లగువరకు భాషా సేవయందే వారి కాలమంతయు గడచినది. వీరి మరణానంతరము తగిన ప్రోత్సాహము లేక, సమర్థుడైన యధిషతి లేక, అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక – మరల ప్రకటింపబడ లేదు. చాలు వ్యయప్రయాసల కోర్చి దీక్ష తోను, స్వార్థ త్యాగముతోను రమారమి ఇరు. వది వత్సరములు నిరుపమానమైన వాజ్మయ ఏ చేసిన పూండ్ల రామకృష్ణయ్య గారి కాంధ్రు లు మిక్కిలి కృతజ్ఞులై యుండవలయును.

అడవి శంకర రావు గారు, బీఏ, ఎల్.టీ.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *