ప్రభో

శ్రీ రంగబాబు

ఇవాళ నాహృదయం
విలయంగా విజృంభి స్తుం దెందుకు ప్రభు?
ఈ వేళ నాహృదయం శార్దూలంలా గర్జిస్తుం దెందుకు ప్రభు?

జీవితాశయాన్ని విడిచి
చీకటి గోళంలో గ్రుడ్డిగ,
ఎ టైనా దిక్కు తెలియక
వెళ్ళుతున్నానా ప్రభు ?

మానవధర్మాన్ని కఱచి
ఉన్మాదోన్మ త్తశునకంవలె;
వ్యక్తావ్య క్తపొలి కేక లిడుతున్నానా ప్రభు ?

బ్రతుకుపరమార్ధాన్ని మరచి
ప్రయాణించే ఈపథికుణ్ణి,
సర్పరూపంలో సాక్షాత్కరించి
కాటేసిపోవా ప్రభు ! – నన్ను
దాటేసి పోకు ప్రభు !!

ఆవ్య క్త కౌగిలిలో – మనసు,
విచిత్ర ప్రకృతిలో – మస్తిష్కం ,
ఫక్కున పగలబడి
నవ్వుతున్నాయి. ప్రభు !

మల్లెపువ్వును జూచి
మండిపడుతున్నాను
చెలినవ్వును జూచి
చికాకుపడుతున్నాను
ముళ్ళగులాబీని
ముద్దిడుతున్నాను
కళ్ళున్నా కీలంలో
కాళ్లిడుతున్నాను.
కారణ మేమిటి ప్రభు ? – ఈ
దారుణ మేమిటి ప్రభు ?

నన్నింకా ఈ కిరాణాదుకాణంలో,
నకిలీ సరుకుగ
చలామని కామంటావా ప్రభు ?

ప్రపంచమి త్తిక పాత్రలో, నా
పాలి పాపక్షీ రాన్ని
గ్రుమ్మరించక మునుపె,
నన్ను పాపులనుండి
నిష్క్రమింప జేయవా ప్రభు ?

మృత్యువుసంగీతం
వినిపించవా ప్రభు !
ముక్తి నాకు నీవు ప్రసాదించవా ప్రభు !!

మానస సముద్రతటమున మారు మారు
సతత భంగతరంగ సంహతు లి వేల?
కలక లధ్వను లొలయంగఁ బలుకసాగె
నలఁతి భూత విస్మృత విషయముల నేఁడు.

నాహృదయసీమ స్మృతుల పెన్నగర మొండు
స్వయమ నిర్మితిఁగన్న దీసమయమందు
నీలతానిలయం బగు నింగియందుఁ
దరళనక్షత్ర లోకంబు వరలు భంగి.

వికలతా దైన్యమున ముంచు వేదనమును
గొని సుఖమ్ములఁ బిల్వఁగాఁ గనె నెవండు
మూర్ఛ ముగ్గిన మామకాబోధమంద
భాగ్యచేతనమున కింకఁ బ్రణయసుఖమె

మోహమయ మాదకత్వ విస్ఫూర్తి గొల్పె
మనసును వినోద పెట్టు నామగ్నలీల
మధుర మాప్రేమభరిత సమగ్రపీడ
హృదయసౌధము నిపు డూపి వదలు నట్టె !

జీవన సమస్య జటిల మై సిద్ధయోగి
జటలవలెఁ జిక్కు వాయని సరణి యేల ?
నోలి మచ్చుష్క హృదయాన ధూళి రేగి
యెవతె యార్ద్ర విభూతి నర్థించు నిట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *