ప్రజాశక్తి (కొన్ని పద్యాలు)

ఏల్చూరి సుబ్రహ్మణ్యం 
(నయాగరా)

ప్రజాశక్తి
సకల ప్రజా సముద్ధర్త
సుప్తోద్ధృత జీవశక్తి
మహాశక్తి ప్రజాశక్తి
వొస్తున్నది వొస్తున్నది

రూక్షోజ్వల రుధిర దీప్తి
క్ష్మానాథుల తలలు తరిగి
కండ కరుగు కూలీలకు
రక్తమోడు్చ రైతులకూ
వొస్తున్నది ప్రజాశక్తి

గగనంలో వేగుచుక్క
జగమంతా జగచ్ఛక్తి
తమస గర్భ దళనహేతి
బానిసత్వ విచ్ఛేదక
ప్రబల విజయ ప్రజాశక్తి
వొస్తున్నది మహాశక్తి

ఆకటితో ఆకటితో
అటమటించు జీవులార
అన్నపూర్ణ స్వర్ణపాత్ర
వొస్తున్నది ప్రజాశక్తి

బంధీకృత ధనిక శక్తి
పొగ గొట్టపు భుగభుగలో
తెలతెలలై వెలవెలలై
పోతున్నది, వొస్తున్నది
మహాశక్తి ప్రజాశక్తి

కట్టు చాళ్ల తొలకరి
చిలికిన చిన్నెల వన్నెల
చంద్ర వంకలై శాంతమూర్తియై
కాంతి దేహియై వొస్తున్నది
మహాశక్తి ప్రజాశక్తి

One thought on “ప్రజాశక్తి (కొన్ని పద్యాలు)”

 1. from dr.voddiraju venkatramarao
  ఏల్చూరి సుబ్రమణ్యం,
  తొల్చూలు నయాగరాసుతుడు తానెపుడూ,
  పల్చనకొప్పడు అరసం
  , కేల్చూపిన కవుల దిట్ట కేరాలక్ష్మీ” అని ఆరుద్ర వీరిపై చెప్పిన సుప్రసిద్ధ చాటువు మదిలో మెదిలింది..
  దృక్పథం ఎలా వున్నా నాటి తరం వారిలో కవిత్వం పాండిత్వం పోటీపడేవి..అందుకువారి శాబ్దిక శక్తి నిదర్శనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *