ప్రస్తావన

విశ్వనాథ సత్యనారాయణ

 

కొన్నాళ్ళక్రిందట నేను మిత్రుడు రామానుజరావుగారితో మాట్లా డుచు కాళిదాస భవభూతుల ప్రసక్తి వస్తే కొన్ని మాటలు చెప్పాను. పాతి కేండ్లు అయిం దనుకుంటాను. అనంతపురం కళాశాలలోని సంస్కృత సమితి వారు భవభూతి జయంతి చేశారు. న న్ను పన్యాసానికి పిలిచారు. అప్పుడక్కడ సంపత్ రాఘవాచారిగారు ప్రాచ్య భాషాశాఖకు అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతము ఆయన రాజమండ్రి కాలేజీలో ప్రిన్సిపాలుగా నున్నారు. నేను రైలు దిగాను. కళాశాలలోని సంస్కృతాంధ్రాధ్యాపకులు నన్ను స్వీకరించటానికి రైలుకు వచ్చారు. అప్పటికే పగలు పదకొండు గంట లయినది. వారందఱు ఆ పూట నాతోపాటు సంపత్తుగా రింట్లోనే భోజనం. ప్రాస్తావికంగా మాట్లాడుతూ వుంటే నాకొక సంగతి తెలి సింది. వా రందఱు ఉత్తర రామచరిత్ర కిచ్చినంత గౌరవం మాలతీ మాధవాని కివ్వటం లేదు. అంతేకాదు; మాలతీమాధవం అంటే వాళ్ళ కేమంత అభిప్రాయంకూడా ఉన్నట్టు లేదు. నేను ప్రధానంగా మాలతీ మాధవాన్ని గుఱించి మాట్లాడుదామ నే వెళ్లాను. నాకు కొంచెము భయం వేసింది. నేను నా మనస్సు వారితో చెప్పాను. వారు కొంచెం కదిలారు. మాలతీమాధవం నా ఉద్దేశంలో చాలా గొప్ప గ్రంథం. ఒక విధంగా చూస్తే ఉత్తర రామచరితం కన్నా గూడ గొప్పదే. శిల్పం నిగూఢంగావుంటే సామాన్య పాఠకులు పట్టుకో లేరు. వి శేషజ్ఞులుగూడ పొరపడుతూ ఉంటారు. మానవుని హృదయం యెప్పుడూ కష్టం లేకుండా ప్రాపించే సుఖాన్ని వాంఛిస్తూ ఉంటుంది. ఒక విశిష్టమైన ప్రకృతి ఉం టేగాని కృచ్చలబ్దమైన సుఖంలో ఉన్న గాఢత్వాన్ని పొందటానికి ప్రయత్నించడు. వారి వారి పూర్వజన్మ సంసారాలనుబట్టే ఆభిముఖ్యాలుకూడా ఉంటాయి. ఈ భేదము లోకము మాటెందుకు ? పండితు లనిపించుకున్న వాళ్ళల్లోనే గొడ్డలితో కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ మాలతీమాధవాన్ని గుఱించి పాతిక యేండ్ల కింద అక్కడ మాట్లాడట మేతప్ప మళ్ళీ యెక్కడా మాట్లాడ లేదు. ఒకడు ప్రధానంగా తెలుగు కవై తే వాడు ప్రత్యేకంగా ఏ శాస్త్రమో చది వితే తప్ప వాడికి సంస్కృతము వచ్చుననికూడ అనుకోరు. సంస్కృతపు పిలు పులు పిలవరు. ఒక డెక్కువ నవలలు వ్రాస్తూవుంటాడు. వాడు పద్యము కూడ సమృద్ధిగా | వాసి నా వాడు క వేమిటి నా వెలిష్టుఅంటారు. లోకముయొక్క భాంతి ఒక విధంగా ఉంటుందా? దానికి కారణం వాళ్ళ అగాఢ శీలత్వం; కావ్య ప్రపంచంతో ఉన్న పరిచయాల్పత్వం; చదివీ చదవకుండా చదివి ఏవో కొన్ని భావాలేర్పఱచుకొని వాటిమీద సిద్ధాంతాలు కట్టుకొని అక్కడ తిష్ఠ వేసుక కూర్చుండటం. ఈలాంటి వాళ్ళ భావా లొకొక్కప్పుడు మనకు గూడ మనశక్తిని గూర్చి సం దేహాలను కలిగి స్తవి. ఏదో కథవున్న ది గదూ ? ఒక బాహ్మణుడు యజ్ఞము చేయడానికి మేకను తోలుకపోతూ వుంటే పదిమంది పథకం వేసికొని పొడుగూ నా కు క్ష కుక్క అంటే, పాపమాబ్రాహ్మణుడుగూడ నిజ మే ననుకున్నాడట. అలాగా నాకు అనుమానం కలుగుతూ ఉంది. ఏడాది క్రింద గుంటూరులో ఉన్న సంస్కృతకళాశాల వారు వారి కళాశాల వార్షికోత్సవం చేసుకుంటూ నన్ను కాళిదాసుమీద మాట్లాడమన్నారు. నేను పాతి కేండ్ల నాటి మాలతీమాధవ విషయాలుగూడ చెప్పాను. అక్కడ పండితులు మెచ్చుకున్నారు. నాకు ధైర్యం వచ్చింది. ఏదో చిన్నప్పుడు చదివిన చదువు. అప్పు డేర్పటు చుకొన్న అభిప్రాయాలు. మళ్ళీ ఆ పుస్తకాలు తిరగ వేశామా పెట్టేమా ? ఉద్యోగాలు, సంసార తాప త్రయాలు. డబ్బు దస్కం వస్తుందని నవలలు వ్రాసుకోటాలు-ఇలావున్న నేను ఏగురువుదగ్గరో స్వంతంగానో మొదటిసారి చదివిన చదవట మేతప్ప మళ్ళీ చదివిన పాపాన పోలేదు. శాస్త్రాలు కూడ కొన్ని కొన్ని గ్రంథా లక్కడా అక్కడా చదివాను. చింతన చేసిన పాపాన పోలేదు. ఇంక కావ్యనాట కాలను గుఱించి చెప్పాలా ? అయినా నేను చెప్పిన కొన్ని విషయాలు శ్రీ రామానుజ రావుగారితో చెబితే మా ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున వాటి వాటిని గుఱించి మీరు మూ డుపన్యాసాలిస్తారా అని అడిగారు. ఇస్తా నన్నాను. ఇస్తాను అంటే ఇంటికి వచ్చి ఎప్పుడో చదివిన ఆ పుస్తకాలు మళ్ళీ చూడాలి. నాకు లై [బరీ లేదు. నేను చిన్నప్పటినుంచి వ్రాసినపద్యాలే సంపుటంగా వేద్దామంటే ప్రతులు లేవు. నా S.S.L.C., F.A., B.A., M. A. ల సర్టిఫికెట్లే నా దగ్గర పోయినవి. ఇంక పుస్తకా లుంటాయా. అసలు నేను కొని చదివిన పుస్తకము లేదు. ఏపుస్తక మైనా ఎక్కడో దొరికి తే చదవటం, వాండ్లది వాండ్ల కిచ్చి రావటం, కర్మం చాలక మన పుస్తకం స్వంతం అంటూ ఉంటే మన స్నేహితులు కొందఱు మేష్టరుగారూ! మీ కెందుకండీ అంటూ దాన్ని కాస్తా చంకన పెట్టుకొనిపోవటం. కనుక యిప్పుడా పుస్త కాలు మళ్ళీ చదవాలం టే ఎక్కడనుంచై నా తెప్పించి చదవాలి. కాలేజి ఉందిగ దా అక్కడ లై బ్రరీలో నుంచి తెప్పిద్దాము అంటే ఈ మఫ్యూ జల్ కళాశాలల్లో, సంస్కృత విద్యార్థులని తరిమివేసే కళాశాలల్లో ఒక్కడి కోసం మేము ఆ సబ్జక్టు పెట్టం అని విడివిడిగా వచ్చే అయిదారుగురికి రుద పాదాలు పెట్టే యీ కళాశాలల్లో, సంస్కృత గ్రంథాదులు దొరుకుతయా. సంవత్సరానికి వెయ్యిరూపాయలు పుస్తకాలు కొనేందుకు గ్రాంటు ఉంటుంది. అందులో యాభై రూపాయీలు సంస్కృత గ్రంథాలకు ప్రత్యే కిస్తారు. అందుచేత అక్కడ సంస్కృత గ్రంథాలు దొరకవు. మనకు కావ లసినవి అసలు దొరకవు. ఇంక కళాశాలల్లో నే దొరక్కపోతే పబ్లిక్ లై బ్రరీ లలో దొరుకుతవా. ఎవరో పండితుణ్ణి వెదకి సగం చిరిగిపోయిన మాలతీ మాధవాన్ని సంపాదించాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ గ్రంథాలే ఉపలభ్యమానాలు కాకుండావుంటే వాటిలోవున్న శిల్పం ఎవ డికి బట్టింది ? చాలామంది పండితులు కూడ చది వాము అంటే చదివాము అనిపించుకొనుటకు చదువుతారు. శబ్దార్థ పరిజ్ఞానము ఉంటుంది. కొన్ని భావాలు కొన్ని అలంకారాలు వారికి నచ్చినవి పట్టుకుంటారు. అంతే చేస్తారు. లోతులకుపోరు. అందఱూ పోరనికాదు. కొద్దిమందిమాత్రమే ఆ దృష్టితో చూస్తారని నే ననుకోవలసి వస్తుంది. ఆలంకారికుల తీర్మా నాలు చాలా ఉన్నవి. వాటి ననుసరించి మహాకవుల కావ్యాలు మనము పరిశీలిస్తున్నామా అన్నది ప్రశ్న.

 

 

 

 

 

One thought on “ప్రస్తావన”

  1. From tpn acharyulu సంతోష్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రస్తావన అందించిన మీరు అభినందనీయులు. విశ్వనాథ సత్యనారాయణ గారిని దర్శించు కొనే భాగ్యం తిరుపతి లో చదువు కొనేటప్పుడు నాకు కలిగింది. అలాగే , మాలతీమాధవం,మహావీర చరిత్ర తో కూడా పరిచయం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *