దెయ్యాల ఓడ…

పశ్చిమ సముద్రంపై ఓ ఓడ తిరుగుతోంది.. జనరల్‌గా ఓడలో మనుషులు ప్రయాణం చేస్తారు.. ఆ ఓడ మనుషులది కాదు.. దెయ్యాలది.. ఎక్స్‌క్లూజివ్‌గా దెయ్యాలు తమకోసం, తమ షికారు కోసం మనుషుల నుంచి ఆక్రమించుకున్న ఓడ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 150 దెయ్యాలు ఈ లగ్జరియస్ ఓడను తమ సోల్ నివాసంగా ఫిక్స్ చేసుకున్నాయి.. అవి సముద్రంపై కాపురం చేస్తాయి.. సాగర జలాల్లో షికారు చేస్తాయి.. సరదాగా ఆడుకుంటాయి.. పాడుకుంటాయి..
భూగర్భ జలాల్లో జలకాలాటలు.. సముద్రంలో సయ్యాటలు.. నీటి మధ్యలో నిర్వేదనలు..అలల హోరులో ఆక్రందనలు..అయిన వారిని కోల్పోయామన్న ఆవేదన..అయినా అంతా కలిసే ఉన్నామన్న ఆత్మానందం..ఆత్మల మధ్యనే ఆత్మీయతలున్నాయి. తాము ఇంకా చనిపోలేదనుకుంటున్నారు. బతికే ఉన్నామన్న భ్రమలో ఉన్నారు. బతికి ఉన్న మనుషులతో చెలిమి చేస్తున్నారు.. చిలిపి పనులతో చికాకు పెడుతున్నారు. వారికి తెలియదు.. తాము చనిపోయి పదుల ఏళ్లయిందని ఉన్నట్టుండి సముద్రగర్భంలోకి దూసుకుపోతారు.. అంతలోనే పైకి వచ్చేస్తారు.. మనుషులు చేసిన ఓడను వాళ్లు ఆక్రమించేసుకున్నారు. ఆత్మల లోకంగా మార్చేసుకున్నారు. ఆ ఆత్మల లోకంలో అంతు చిక్కని రహస్యాలు. భూమ్మీద అందరికీ కనిపించేది ఓడ.. వాటికి మాత్రం అదొక లోకం… భూమ్మీద ఉన్న విచిత్ర లోకం.. వాటికి ఆత్మానందం… మనుషులకేమో వింత అనుభవాలు అందిస్తున్న ప్రపంచం.
ఇది అలాంటిలాంటి ఓడ కానే కాదు.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధంలో ఉపయోగించటం కోసం ప్రత్యేకంగా తయారైంది.. అలాంటి ఓడలోకి ఇన్ని దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా చేరాయి..? చిత్రమైన సందేహాలు.. మూఢనమ్మకాలు లేని చోట.. అమెరికా వంటి సూపర్ పవర్ కంట్రీలో ఇలాంటివి ఉన్నాయంటే నమ్ముతారా? కానీ నిజం.. అమెరికన్లకు ఈ ఓడలో దెయ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ల మాటలకు స్పందిస్తున్నాయి.. మీకు తెలుసా? ఈ ఓడలో దెయ్యాల గురించి వివరించేందుకు సెషల్ గైడ్స్ కూడా ఉన్నారంటే నమ్ముతారా?
క్వీన్‌మేరీ ఓడ1960లలోనే రిటైర్ అయింది.. ఆ తరువాతే అసలు కథ ప్రారంభమైంది. అప్పటిదాకా లగ్జరీ క్రూయిజ్‌గా ఉన్న ఓడ కాస్తా, గ్రే ఘోస్ట్‌గా మారిపోయింది. క్వీన్‌మేరీ సిబ్బందిలో ఒక్కొక్కరికి ఒక్కో దెయ్యం కనిపించటం మొదలు పెట్టింది.. వారికి వాటి గొంతులు కూడా వినిపించాయి.. ఆక్రందనలు.. నవ్వులు.. కేకలు.. పాటలు కూడా వినిపించటంతో తీవ్రంగా బెదిరిపోయారు..
ఓ పాప, ఓ ఇంజనీర్.. ఓ పెళ్లికూతురు… వీళ్లందరితో పాటు స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఇద్దరు మహిళలు తిరుగుతూ కనిపించారు.. వీళ్లందరితో పాటు మరికొన్ని ఆకారాలు ఓడలోని రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించాయి.. కొన్నాళ్ల తరువాత ఓడను ఉంచిన చోటే.. దాని కింద ఉన్న సముద్రలోపల.. లోతుల్లో రకరకాల ధ్వనులు, శబ్దాలు వినిపించటం మొదలు పెట్టాయి.. ఇక అంటే.. క్వీన్ మేరీ కాస్తా క్వీన్ ఘోస్ట్‌గా ప్రచారం మొదలైంది.. కొన్నాళ్ల తరువాత ఘోస్ట్ హంటర్స్ ఈ ఓడను సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకిలా దెయ్యాలు కనిపిస్తున్నాయి.. ఒకటి కాదు. రెండు కాదు.. పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి.. కారణం ఏమిటి? ఈ సెర్చింగ్‌లో చాలా విషయాలు బయటకు వచ్చాయి.. ఒక్కో దెయ్యం కనిపించిన ప్రాంతంలో ఒక్కో మరణం సంభవించింది.. దాదాపు 49 మరణాలను వీళ్లు గుర్తించారు.. ఒక ఓడలో ఇన్ని చావులు సంభవించటం ప్రపంచ చరిత్రలోనే అరుదు.. వీటిలో ఎక్కువ మరణాలు అనుమానాస్పదమైనవే కావటం మరో కారణం.. ఈ చనిపోయిన వాళ్లంతా ఇక్కడే దెయ్యాలుగా తిరుగుతున్నారన్న నిర్ధారణకు వాళ్లు వచ్చారు..
ఈ ఘోస్ట్ హంటర్స్ దెయ్యాలను కాంటాక్ట్ చేసేందుకు కొన్ని పద్ధతులు అవలంబిస్తారు.. ఈ పద్ధతులతో వాళ్లు దెయ్యాలతో లింక్‌లైన్ ఏర్పాటు చేసుకున్నారు.. కొంతకాలానికి వీళ్ల మాటలకు అవి స్పందించటం ప్రారంభించాయి.. వాటికి అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయని, అందువల్లే అవతి తాము కావాలని అనుకున్నప్పుడు మనుషులకు కనిపించగలుగుతున్నాయని, తమ స్టైల్లో స్పందిస్తున్నాయని ఘోస్ట్ హంటర్స్ తేలే్చారు. అవేవీ మనుషులకు నష్టం కలిగించవని.. హామీ ఇచే్చారు.. ఇంకేం క్వీన్ మేరీలో ఘోస్ట్ టూరిజం మొదలైంది.. అమెరికా ఓ అగ్రరాజ్యం.. సైంటిఫిక్‌గా, ఎకానమిక్‌గా ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ.. ఇలాంటి దేశంలో, దెయ్యాలు.. భూతాలు.. వాటితో మాట్లాడటం అవి స్పందించటం లాంటివి ఎంతవరకు విశ్వసనీయం? ఇవన్నీ కల్పనలా అంటే.. కాదని అనిపిస్తుంది.. కానీ, నిజమెలా అవుతుందన్న ప్రశ్నా పుడుతోంది..
ఇప్పుడు అమెరికాలో దెయ్యాల ఓడ ఒకటి స్పెషల్ అట్రాక్షన్.. ఒక నల్ల మనిషి.. ఒక నీలం రంగు చీర కట్టుకున్న మహిళ.. మరో పాప.. ఇలా ఒక్కొక్కరి ఐడెంటిటీని ఘోస్ట్ హంటర్స్ ఎస్టాబ్లిష్ చేయటం ప్రారంభించారు. ఈ దెయ్యాలను చూసేందుకు.. వాటితో మాట్లాడేందుకు జనం ఆసక్తి మొదలైంది.. తండోపతండాలుగా రావటం మొదలెట్టారు..
క్వీన్‌మేరీ ఘోస్ట్‌షిప్‌లో స్పెషల్ టారిఫ్ పెట్టారు.. దెయ్యాల గురించి ఆసక్తి ఉన్న వాళ్లు.. అవి ఉన్న ప్రదేాలను చూసేందుకు ఒక రేటు.. వాటి ఉనికిని ఫీల్ కావటానికి మరో రేటు ఫిక్స్ చేారు.. షిప్‌లోకి వచ్చిన వారిని ఘోస్ట్ గైడ్ నిర్దిష్ట ప్రదేానికి తీసుకు వెళ్తారు.. అక్కడ ఏ దెయ్యం ఉందో చెప్తారు.. ఆ దెయ్యాన్ని పేరు పెట్టి పిలుస్తారు.. వచ్చిన టూరిస్టుల్లో ఒకరి రెండు చేతుల్లో రెండు సన్నని స్టిక్స్ ఉంచి ఆ దెయ్యాన్ని తాను ఉన్నట్లు నిరూపించుకోమంటారు.. ఆ పుల్లలు వాటంతట అవే కదిలి దగ్గరకు వస్తాయి.
ఇంజన్ రూమ్.. బాయిలర్ రూమ్.. కార్గో.. ప్రొపెలర్ బాక్స్.. స్విమ్మింగ్ పూల్.. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు ఘోస్ట్ టూరిస్టులకు దర్శనీయ స్థలాలుగా మారిపోయాయి..
విచిత్రమేమంటే.. ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ల భ్రమలేనన్నది హేతువాదుల వాదన.. ఈ వాదనలనూ తేలిగ్గా కొట్టిపారేయలేం.. ఎందుకంటే ఘోస్ట్ హంటర్స్ ప్రదర్శించే టెక్నిక్స్ ఏవీ సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినవి కాదు.. రాత్రి పూట వినిపించే ధ్వనులకూ ఎలాంటి ఆధారాలు లేవు.. ఇవన్నీ ఓ గారడీ విద్యలాగానే ఉంటాయి.. అయినా సరే.. 150 దెయ్యాల గురించి క్వీన్‌మేరీ ఘోస్ట్ హంటర్స్ మాత్రం ఘంటాపథంగా ఉన్నాయనే పేర్లతో సహా చెప్తున్నారు.. ఆ టైప్ ఆఫ్ టూరిజాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడిపిస్తూనే ఉన్నారు..

2 thoughts on “దెయ్యాల ఓడ…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *