సమాజం అంతగా పతనమైందా?

రాచమల్లు రామచంద్రారెడ్డి

నేటి ‘కుష్ఠు వ్యవస్థ’ పై దిగంబర కవులు

సంచాలకుడు: సుబ్రహ్మణ్యం ప్రతులకు: 46, విద్యానగర్ కాలనీ, హైద్రాబాదు – 13 పేజీలు : 1 క్రౌన్ 120

వీళ్ళు ఆరుమంది అరిషడ్వర్గంలాగా. అందరికీ మారు పేర్లు వున్నాయి. తాము దిగంబర కవులమనీ, తాము రాసేది దిక్ లు అనీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళ మొదటి సంపుటి 1965 మేలోనూ, రెండవ సంపుటి 66 డిసెంబర్ లోనూ వచ్చినాయి. 68 సెప్టంబర్ లో మూడవ సంపుటి వచ్చింది. 120 పేజీలు గల యీ సంపుటిలో దిక్ లు చాలానే వున్నాయి. కవిత్వం మాత్రం యెక్కడా లేదు.

కవి ఒక అనుభూతిని మాటలద్వారా వ్యక్తం చేస్తాడు; మాటలద్వారా పాఠ కులకు అందిస్తాడు. అప్పుడు ఆ మాటలను కవిత్వమంటాం. కవి సాధారణంగా తాను పొందిన అనుభూతినే తన కవిత్వంలో వ్యక్తం చేస్తాడు. కానీ అది కాదు మనకు. ముఖ్యం. ఆ అనుభూతిని పాఠకులకు (లేక శ్రోతలకు) అందిస్తున్నాడా అనేదే సిర్ణాయక మైన ప్రశ్న. తాను యెంత గాఢమైన అనుభూతిని పొందినా అం దులో కొంతైనా మనకు అందకపోతే ఆతవి మాటల కవిత్వం కాలేదు. అతన్ని కవి ఆనవలసిన అవసరం లేదు. తాము తీవ్రమైన ఆవేశం పొందినామని వీళ్ళు అంటున్నారు. విజమే కావచ్చు. కుళ్ళిపోయిన యీ సమాజంషీ కా, యీ కుళ్ళుకు కారణమైన రాజకీయ నాయకులమీదా, స్వాములవార్ల మీదా, సి..మాలమీదా, సినిమా తారలమీదా (ప్రొడ్యూ సర్లమీద కాదు). పెట్టుబడిదార్ల మీదా యింకా యెవరెవరిమీదనో వీళ్ళకోపం కనపడుతూనే వుంది. వీళ్ళకోపం నిప్పులు కక్కుతున్నట్లుకూడా మనకు అర్థమౌ తుంది. కానీ, వీళ్ళకు విజంగా కోపం వుందని మనకు తెలిసినంతమాత్రాన ఆది కవిత్వం కాదు. ఆ కోపంలో కొంతై నా మనకూ కలిగితే_ యీ కుళ్ళు సమాజం మీదా, యీ కుళ్ళుకు కారకులై నవాళ్ళమీదా అప్పుడు, అప్పుడు మాత్రమే, అది కవిత్వమౌతుంది. ఆది లేదుగనుకనే వీళ్లు రాసింది కవిత్వం కాలేక పోతున్నది.

పై గా, మనకు రోత కలుగుతుంది. వీళ్ళ రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒత్తెరగని కుసం స్కారమూ, ఆ నోటితీటా, ఆ మాటల కంపూ మనకు జుగుప్స కలిగిస్తాయి.

మరీ జుగుప్స కలిగేది వీళ్లు అక్కడక్కడా కొన్ని బూతులు రాసినందుకు కాదు; కవిత్వపు వాసన యెక్కడా లేకుండా కవులమని చెప్పుకుంటూ మోసం

చేస్తున్నందుకు; సమాజాన్ని ఉద్దరిస్తామని విర్రవీగుతున్నందుకు. యీ దురహంకా రానికి తోడు బూతుల దుర్గంధం!

నా అనుచూనమేముంటే, తమకు కవిత్వం రాయడం రాదని వీళ్ళకు తెలుసు. కవిత్వంతో యెవరి దృష్టినీ ఆకర్షించలేమని వీళ్ళకు తెలుసు. కనుకనే పదిమంది దృష్టినీ ఆకర్షించడానికి వెకిలి వేషాలూ, వికృత చేష్టలూ మొదలు పెట్టినారు. లేకపోతే చెరబండరాజు , జ్వాలాముఖి వగైరా వింత వింత పేర్లు పెట్టుకోవలసిన ఆవసరమేముంది? తను రాతలకు దిక్ లు అని కొత్త పింత పేరు పెట్టుకోవలసిన అవసరమేముంది? సమాజ ద్రోహులను పెట్టడానికి బూతులు వాడవలసిన అవసర

మేముంది? తమ సంపుటాలను రిక్షావాలాలతోనూ, హోటర్ క్లీనర్లతోనూ. బచ్చగత్తెలతోనూ ఆవిష్కరణ చేయించవలసిన అవసర మేముంది? ఆ ఆవిష్క రణలు ఆర్దరాత్రి పండ్రెండు గంటల వేళనే చేయించవలసిన అవసరమేముంది?

వీళ్ళ మొదటి సంచికను ఒక రిక్ షావాలా ఆవిష్కరించినప్పుడుమంత్రిని పిలవడం స్నాబరీ, లేక సేపు. రిక్షావాణి పిలపడం ఒక పోజు, లేకపోతే ఓ

రకమైన ఆత్మవంచనఅవి తిలక్ అన్నాడట, వీళ్ల ఉత్తరం రాస్తూ. వీళ్లది ఆత్మవంచనగా కనపడదు. కనుక పోజే కొవాలి.

రాజకీయ వర్గాలలో వీళ్ళ పోజు కొన్ని భ్రమలు కల్పించినట్లుంది. సకూ జపు కుళ్లుకు కారకులై నవాళ్లను వీళ్లు బూతులు తిడుతున్నారు గనుక, వీళ్ల రచనలు సమాజ క్షేమానికి వినియోగ పడతాయని వాళ్లు ఆశపడుతున్నట్లుంది. రాజకీయ విలువ యెంత వున్నా ఒక రచన కవిత్వం కాజాలదనే విషయం అటుంచి, రాజ కీయ చిత్త శుద్దికూడా వీళ్ళ రచనల్లో కనిపించదు. వీళ్ళ ఉద్యమం సచూజపు మురికి గుంటను తొలగించడం కాదు; ఆ మురికి గుంటను కెలికి ఆ కంపును దళ దిశలకూ వ్యాపింప జేయడమే.

కాదంటే మరొక విధంగా చెప్పవచ్చు. వీళ్ళు మురికి గుంటను పూడ్చి గుర్రంచేసే ఆరోగ్యశాఖవాళ్ళు కాదు; మురికి గుంటలోనే ఉద్భవించి, అందులోనే తిని, తాగి, తందనాలాచి, ఆనంద పారవశ్యం చెందే క్రిమి సంతాసం.

అనగా సమాజం కుళ్ళుకు వీళ్ళు ఒక చిహ్నం. సమాజం కుళ్ళులో వీళ్ళు ఒక భాగం, సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళు ఒక నిదర్శనం. సమాజం కుళ్ళిపోవడానికి వీళ్లూ ఒక కారణం.

సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే. సమాజం పతనమైనమాట నిజమే. విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంతగా పతనమైన మాట నిజమే. కానీ, యెంత పతనమైనా. యీ దిగంబరుల పై త్యాన్ని కచిత్వ మనుకునేటంతగా పతనమైందా?

రా. రా.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *