పువ్వు పేరు చంపకం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీరంగం శ్రీనివాసరావు

తన సొంత పొలాన నాగలి పట్టేడు
ఇంటి గుమ్మం ముందు వెదురు తలుపుల ముందు
రాఘవులు పాతేడు చంపకమొకటి
పరువమొలికే వయసు ఉరకలేసే మనసు
పరుగులిడేవేళ తీయగా హాయిగా
రాఘవులు పాతేడు చంపకం మొక్కని
అందాల ఆకుపచ్చందనం చిందేటి
చక్కని సన్నని చంపకం మొక్కని

చెయ్యీ చెయ్యీ కలుపుకొని
మనసూ మనసూ కలుపుకొని
దేవుని యెదుట
ఎన్ని పగళ్లు, ఎన్ని రాత్రులు
రోజులు, వారాలు నెలలు ఏళ్లూ
కాలం వాళ్ల మీద అమృతం వర్షించింది
చంద్రుణ్ణి చూడవద్దు
చంద్రకాంతిని చూడవద్దు
చంద్రుడు కోసం ఏడవ వద్దు
ఏదీ నా ప్రేయయి
ఏడవుంది నా ప్రేయసి

నిద్రలేని రాత్రుల్లో
చంపకం మొక్కనే చూస్తూ రాఘవులు
ప్రేమిస్తాడు చంపకం వన్నె ప్రేయసిని
చంపకం కన్నా సున్నితమైన
చంపకం వన్నె ప్రేయసిని
మొదటి శిశువు నీ వన్నె చిన్నదే అయితే
చంపకం అనే పేరు పెడతాను
చంపకం అనే పేరు పెట్టండి
మీకు నేను చంపకాన్ని కంటానంటుంది ప్రేయసి

పండుగలు వచ్చాయి
పంటలు పండేయి
పొలాలు బంగారు పంటలు పండేయి
గాలిలో కస్తూరి వాసనలు నిండేయి
వాల్ల చిన్ని గుడిసెలో
ఆనందం నిండిన గుండెల్లో
రాబోయే కొత్త జీవితపు కాంతులన్నీ
వాళ్ల బతుకునిండా వెలిగేయి
వాళ్ల ఒళ్లో మళ్లీ ఒక కొత్త వెలుగు
రాబోతుంది రాబోతుంది

దేవుని కరుణారసం
ఒకసారి ప్రవహిస్తే మరి వెనక్కి పోదు
చంపకం మొక్క పెరిగింది
పూవు పూసింది
చంపకం పువ్వు రేకు రేకులుగా విరిసింది
కంపం లేని మెరుపులాగ
చంపకం పువ్వు వెలిగింది
కుక్కి మంచంలో
చక్కని ఎదల్లో
చంపకం పువ్వు పుట్టింది
చంపకం పువ్వు నవ్వింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *