వేగుచుక్క

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

 

ఒక మనిషి మన తెనుగు దేశంలో ఉదయించాడు వేగుచుక్కలాగు. అంతటితోఅంతవరకు గాఢనిద్రా  పరవశమై వున్న మన సంఘం ఆతని పిలుపులకూ, మేల్కొలుపులకూ, కూకలకూ, కేకలకూ ఆదరిపడి దద్దరిల్లి లేచింది; ఆహవనీయాగ్ని చ్ఛటవలె “తాను పాకినంత మేరా ఓక మహా సాంఘిక విప్లవం ప్రావృట్కాల పయోధర మాలికలాగ గర్జిస్తూ పునీతం చేసింది. సంఘం ఇల్లు చక్క దిద్దు కొని ఆత్మపరీక్ష చేసుకొని కన్నులు నులుముకొని అభ్యుదయవపథాన ప్రయాణం సాగించింది.

ఒక మనిషి మన హిందూదేశంతో ప్రభవించాడు. వెన్వెంటనే సేతు శీతాచలమూ మరొక మహావిప్లవం ఝంఝామారుతో ద్దూతమయిన మహానముద్రంలాగ తరగెత్తి పొంగి దేశం అంచులకంతా పొర్లికలె త్తింది. భారత జాతిని ఆంతవరకు బంధించి ఉంచిన రాజకీయ అయశ్శృంఖలాలు ఆ మహావిప్లవాగ్ని హోత్రజ్వాలలో కరగి సీరయి సమసిపోయినవి. ఎప్పటివో కాదు, ఈ రెండు సంఘటనలూ మన నాటివే, నేటివే. మనతో చాలామంది కింకా ఆనుభవంలో ఉన్నవే . వారిద్దరే మనుషులు: మన తెనుగుదేశం లోనివారు. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు; రెండవవారు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాందీగారు. ఒకరు శత శతాబ్దులనుంచి దట్టంగా పట్టిన దుర్నయ, దురాచార మూఢ విశ్వాసా లనే బూజు దులిపి సాంఘిక జీవనానికి నిర్మల దృష్టినీ, బలిమినీ, వెలుగు కలిమినీ, సౌందర్యాన్నీ చేరిస్తే.. వేరొకరు మానసిక దౌర్బ్చల్యమూ, రాజకీయ పరదాస్యబంధనమూ, భయమూ తొలగించి జాతికి ధర్మ దృష్టిని, స్వాతంత్ర్యపథాన్నీ చేకూర్చినవారు. కానైతే ఆ వుభయులవీ సాధనలు వేరు. ఒకరివి వాజ్మయం సాధనయితే వేరొకరికి రాజ్యతంత్రపు క్రియసాధన ఆయింది. వా రిద్దరే మనుష్యులు. అందువల్లనే అన్నాడు ఎమర్సన్‌ _మనిషి ప్రభవించాడు___ విప్లవం ఛాయవలె అతని వెన్నంటి పరుగులు వారిందని,

మనిషే పుట్టాలికాని-__పుడితే విప్లవం రాకుండా మానదు, శ్రీ వీరేశలింగం పంతులు పుట్టాడు. తెనుగు దేశంలో విప్లవం పొడసూపింది. జీవితం అన్ని ముఖాలలోనూ విష్లవమే, ఆ వెనుకటి దృష్టే మారింది, సంఘమే మారింది, జీవితంలోనే ఎంతో మార్పు వచ్చింది. అంతా మార్పే. అంతా కొత్తే నవయుగం అది.__ఆయన యుగపురుషుడు. దేశం ఆంతా అర్ధంలేని మూఢ విశ్వాసాల లోను, అనర్థకాలయిన అలవాట్లలోను, ఆచారాలలోను కుళ్తుకబంటిగా కూరుకుపోయి గుడిగుడి గుంచం గుండా రాగం అన్నట్టు చక్రనేమి భ్రమణంలాగు తొక్కిన తోవనే తొక్కుతూ, తిరిగిన పరిధిలోనే తిరుగుతూ సాలె గూటిలోని కీటకంలాగ సంఘం పరిభ్రమిస్తూవున్న కాలంలో అవతరించాడు శ్రీ కందుకూరి వీరేశలింగం,

అప్పటికప్పుడే కుంఫిణీ ప్రభుత్వం ఇక్కడ పాతుకుపోయి. పాశ్చాత్య విద్యా విజ్ఞానలత దేశం అంతటా పంది రల్లుకొన్నట్టు అలుముకొని దేశానికొక కొత్త వికాసమూ, కొత్త శోభా చేకూర్చింది. పాశ్చాత్య ప్రాచ్య సంస్కృతి మహాసాగరాలు ఒండొంటిని తీవ్రంగా తాకేసరికి ఆ సంఘట్టనలో హాలాహలమూ వెలువడింది; అమృతమూ పుట్టింది. దేశీయమయిన మన ప్రాచ్య సంస్కృతి క్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతి పండించిన సరికొత్త ఫలం వీరేశలింగం. పాశ్చాత్యవిద్యా, విజ్ఞానమూ శ్రీ వీరేశలింగం పంతులు గారి సంప్రదాయకమయిన ధార్మిక సంపత్తికి ఒక కొత్త సంస్కార పరిణతి కలిగించి, ఆయనకు దూరదృష్టినీ, ధర్మ దీక్షనూ, అకుంఠిత శక్తినీ ప్రసాదించినవి, కాకపోతే ఇంగ్లీషు విద్యా పారంగతులయినవారు ఆ కాలంలో ఎందరు లేరు? ఆయనలోనే ఆ కాలమహిమ భాసించింది. తాము పొందిన నూతన విజ్ఞాన కాంతిలో దుర్నయ దురాచార పీడితమయిన సంఘాన్ని విలోకించే టప్పటికి శ్రీ వీరేశలింగం పంతులు గారి వొళ్లు జలదరించింది, ఎట్లా కుట్ల బొంతలా వున్న ఈ జాతి జబ్బు వీడి బాగుపడడం? మూఢ విశ్వాసాలూ, దురాచారాలూ మొదలై నవన్నీ జాతి ప్రాణశ క్తిని పీల్చి పిప్పి చేసీ వీడపురుగులలాగు ఆయనకు తోచినవి, ఇవన్నీ మాంద్యమూ, మసకతనమూ సంఘటించి జాతి దృష్షీకి లోపం తెచ్చి పెట్టినవి. ఈ దృష్టిమాంద్యమూ, ఈ జబ్బూ వదిలితేనే కాని జాతికి అభ్యుదయం లేదు. మోక్షం లేదనివిశ్వసించాడు రోగ నిదానం తెలిసిన ఆ వై ద్యశిఖామణి. ఇల్లు అంటుకుంటూ వుంటేమూర్థులు తక్క ఎవరు మిన్నకుండగలరు? కాని తానేం చేయగలడు ఒక్క తెలుగుపండితుడు?

విజయనగరం తుళువ, ఆరవీడు వంశనృపతుల కాలంలోను, తంజావూరు. మధుర నాయకరాజుల కాలంలోను కానయితే పట్టం కట్టుకొని ఏలింది తెలుగు, ఆ కాలం మారింది, ఆ రోజు లిప్పుడు పోయినవి. ఇప్పుడాంగ్ల (వభుత్వం, ఆంగ్లమే రాజభాష, విద్యనేర్చే సాధనం ఆంగ్లమే. ఆంగ్లవిద్యా పారంగతుడికే ఘనతా, గౌరవమూను. ఆతనిముందు తెలుగు పండితుడు దివిటీకింద దీపం. ఇప్పుడు తెలు గెవరికి కావాలి? తెలుగుకు గౌరవమూ లేదు, ఆదరమూ లేదు. ఆంగ్రపాఠశాలలలో చదువుకొనే విద్యార్థులకు కూడా తెలుగు పండితుడంటే అలుసే. వీరేశలింగం పంతులు తెలుగు పండితుడే; కాని ఏ తెలుగు పండితుడికీ లేని కార్యదీక్ష, దృఢనిశ్చయము, చిత్తస్థైర్యము, దేవునిమీద విశ్వాసము, సత్కార్యాచరణమున ఉత్సాహమూ.-ఇవన్నీ వున్నవి,ఆయన మానసికతత్వమే వేరు. మంచిపనికి పూనుకొంటే దైవ మెందుకు కలసిరాడు? ఈశ్వరు డెందుకు తోడ్పడడు?___ ఇదే ఆయనకు గల పరమ విశ్వాసం. ఎవరి ధర్మం వారు వెనుదీయక నిర్వర్తించినపవుడే సంఘం బాగుపడుతుంది. సంఘంలో ఒకడుగా జన్మించినందుకు తన బాధ్యత తాను నెరవేర్చవలసిందే-. కష్టాలురానీ, నుఖాలుపోనీ. ఆయన వీరుడు. మహాయోధుడు,. దయ దాక్షీణ్యమూ లేకుండా తన పని తాను నెరవేర్చి తీరవలసిందే, ఎవరికిష్టం ఉండనీ, ఎవరి కిష్టం ఉండకపోనీ, అటువంటివాడు వీరేశలింగమంటేను. కర్తవ్యనిశ్చయానికి గడంగినా డాయన.

వీరేశలింగం పంతులుగారికి ఆంగ్లభాషా పరిజ్ఞానం బాగాఉంది; ఆంగ్లవాజ్మయంలో ప్రసిద్ధులయిన కవుల గ్రంథాలు చదివాడు, ఇంగ్లాండు, ఫ్రాన్సు మొదలైన యూరోపు దేశాలలో కవికలానికి ఎంతటి పటుత్వం ఉన్నది. తెలుసుకొన్నాడు, కత్తికంటెనూ పదునయింది కలం అని గ్రహించాడు. దేశీయులలో విద్య విజ్ఞానము వ్యాపిస్తేనే కాని దేశం బాగుపడదు, దేశీయులను విద్యావంతులను, విజ్ఞానవంతులను చేయడానికి ఉండే పరిస్థితులలో కలమే శరణ్యం. తన ఆశయ సాఫల్యానికి కలమే ఖడ్గం, కార్యసాధనానికి సాహిత్యమే ఆయనకు అనమాననుయిన వజ్రాయుధం అయింది. నాడు మొదలు దైవంమీద భారంవేసిధర్మదీక్షితుడై  జాతీయాభ్యుదయానికి కలం చేతబట్టి రకరకాలయిన సాహిత్యరచనలమూలంగా తాను నమ్మిన అభిప్రాయాలను (పకటించి ప్రబోధిస్తూ, సంఘాని కనర్ధకాలని తనకు తోచిన మూఢాచార విశ్వాసాలను ఖండిస్తూ సహస్రాక్షుడై వీరేశలింగంపంతులు ఉపక్రమించాడు. వీరేళలింగం పంతులుగారికి ఆంగ్లవిద్యావ్యాస౦గంవల్ల సాహిత్యాన్ని నవ్యనూతనమార్గాల ఏట్లా నడపడానికి వీలున్నదో బాగో తెలిసింది, ఆ రూపాల నన్నిటినీ ఆయన ఇంగ్లీషులో చదివినవాడే. ఆ నూతన రూపాలను తెలుగు సాహిత్యరంగంలోకి తీసుకువచ్చికొత్త సృష్టి చేయాలని పూనుకొన్నాడు. అంతకు పూర్వం తెనుగులో, సంస్కృతంలో వలె రచించిన గద్య, పద్య కావ్యాలే, దృశ్య కావ్యాలే, యక్షగానాలే. అన్నీ తరతరాలనుంచి గతానుగతికమైన వరవడిలో వస్తున్నవే. ఇప్పుడాయన చేయదలచిన దంతా కొత్తసృష్షే, తన రచనలు ఏ మాత్రం చదివిన పామరునికయినా సుబోధమయేటట్లు, సుకరంగా తెలిసే టట్లు ఉండాలని రచన సాగించాడు వీరేశలింగం పంతులు,

శ్రీ వీరేశలింగం పంతులుగారు ఆంధ్ర సాహిత్యరంగంలో ప్రవేశించిన తరువాత ఆ రంగం అదివరకుకంచె ఎన్నోమడుగులు విశామయింది. ఆ విశాలమయిన సాహిత్య రంగంలో శీ పంతులుగారు తొక్కని పొలమేలేదు; రచనార్థము ఆయన సృశింపని విషయమేలేదు. ఆంధ్రసాహిత్యసీమ నిజముగా అత్యంత రమణీయమయిన ఒక దివ్య పుష్పఫలవాటిక అయింది, ఆనాటినుంచి తెనుగు సాహిత్యంలో కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్తవింతలు, కొత్త కొత్త రుచులు. ఆంధ్ర పాఠకలోకం ఈ కొత్త సృష్టిని చూసి నివ్వెర పోయింది. భాషమీద, కొత్తగా వచ్చే కొత్త రకం వ్రాతలమీద ఆంధ్రజనానీకానికి రుచి అధికమయింది. వారు కొ త్తనీటికి చేవయెక్కి నట్టు నూతన వాజ్మయాన్ని హార్దంగా ఆదరంతో స్వీకరించినారు.. శ్రీ వీరేశలింగం పంతులుగారి రాకతో ఆం ధ్రసాహిత్యం పండితులనే కాదు, పామరుల హృదయాన్నికూడా ఆకట్టి వేసింది. శ్రీ పంతులుగారితోనే మొదటి ఆంధ్రసాహిత్యంలో ఆధునిక యుగం. ఆయన ఆంధ్రసాహిత్య చరిత్రలో నూతన శకం స్థాపించాడు.

 

“ దేశాభివృద్ధి కలుగుటకయి. విద్యావిషయమునసు, వ్యవహారవిషయమునను, కులాచార విషయమునను, నీతి విషయమునను, మత విషయమునను నానా ముఖముల గృషిచేయనలయుననియే కాని రాజ్యాంగ విషయములందే పనిచేయుట నా యుధ్ధేశము కాదు”.ఆయన వ్రాస్తున్నారు తమ స్వీయచరిత్రలో. “మానవ ‘దేహములోని కరచరణొది సమస్తావయవములును యథాప్రమాణముగా పెరుగుటయే వృద్ధి కాని యొక్క తలయో, కాలో అత్యధికముగ పెరుగుట వృద్ధికాక రోగమయినట్లే దేశ విషయములో గూడ జనులు నీతి మత కులాచారాదులైన సమస్తాంగములందును సమానముగా నభ్యున్నతి నొందుటయే వృద్ధికాని యితరాంగములకు భంగముకలుగునట్లుగా ఒక్క రాజ్యాంగములయందే కాని యొక్కబుద్ధీ ప్రచారమునందే గాని యుత్కర్షమునొందుట కేమకరమైన దేశాభివృ ద్ధికాదనినా యభిప్రాయము. నెక్కడో దూరమున నున్న పరిపాలకులను, వారి శాసనములను దూషించుటకంటే సమీప ముననుండి రాజ శాసనములను నడపువారి దోషములను వెల్లడి చేయుట అధిక ప్రయోజనకరమని నా నమ్మకము.”

ఇదే. శ్రీ పంతులుగారి సాహిత్యరచనలకన్నిటికీ కీలకమూ, వ్యాఖ్యానమూను. ఈ సంఘసంస్కారదృ ష్టే పంతులుగారి రచన అన్నిటిలోను కనిపిస్తూ వుంటుంది. సంఘం రాజ్యాంగ విషయమున సర్వదోష సంక్షాళితం కావాలి, సంఘ హృదయం సంస్కారం పొందాలి అని శ్రీ పంతులుగారు సంస్క్బుతికోస మే ఎక్కువ కృషిచేశారు, వారు ఏ సాహిత్యరచన సాగించినా ఆయన లక్ష్యం సామాన్యజనుడే. అతనికి తన రచనను నుగమం చేయడం ఎట్లా, అతని మనస్పుకు తట్టేట్టు, అత నిమనస్సు రంజించేటట్టు ఎట్లా వ్రాయడం అనేదే ఆనా డాయనకు సమస్య అయింది, అంతవరకు తెలుగున రచన లెన్నో జరుగుతూ వచ్చినవి కొని అవి డబడబలాడే సంస్కృత పదాల ఆడంబరంతో కఠినపాకంలో పడి పండితులకే కాని పామరులకర్ణం కాకుండా ఉండేవి. ఆనాడూ, అంతకు పూర్వమూ పండితులు మెచ్చుకొన్నదే సాహిత్యం. సాహిత్యం  పండితులకోనమే, పండితుల మెప్పు చూరగొనడం కోసమే చేసేవారు. ఆరీతినవి సంస్కృత పద భూయిష్టంగా సంధులతో, సమాసాలతో పెనవేసుకుపోయిన తాటి చిక్కంలాగు, బాగా కాళ్లు పోసి లాగి బిగదీసి కట్టిన రై ల్వేపార్సెలులాగ బిగువుగా పదజటిలంగా ఉంటేనేకాని ఆనాడు సాహిత్య రచనకు—అది గద్యంకానీ, పద్యంకానీ__గొరవంలేదు. కాని ఆ రీతిని వ్రాస్తే పంతులు గారి. లక్ష్యం ఎట్లా. సిద్ధిస్తుంది? ఆశయం ఎట్లా సఫలమౌతుంది? తన రచన ఒక్క పండితుల కోసమే కాదు, సకలాంధ ప్రపంచానికీని, పండితులకూ పామరులకూ కూడాను, అలనాడు తిక్కన సోమయాజిగారు మహా భారత రచనకు గంటం అందుకొని ఆంధ్రావళి మోదముం బొరయుటకే అన్నట్టు ఈనాడు వీరేశలింగం పంతులుగారు యావదా౦ ధ్ర దేశాన్నీ లక్యంలో ఉంచుకొవి తమ కలం జేతబట్టినారు. అందువల్ల పండితుల తోవకూ, పంతులుగారి తోవకూ భాషా రంగంలోకూడా విభిన్నత ఏర్పడింది. సంధులు, సమాసాలు, కఠిన పదాలు విసర్జించి పిన్నలకు, పెద్దలకు తేలికగా ఆర్ధ మయేటట్టు పంతులుగారు రచన నారంభించారు. సంఘాన్ని ఉద్దేశించి, ప్రధానంగా సంస్కార లక్ష్యంతో చేసిన రచనలలో చక్కగా వ్యావహారికమే వాడేశారు. సూటిగా, చెప్పిన విషయం చదివేవాని మనను కెక్కేటందుకూ, చెప్పదలచిన విషయం స్ఫూర్తిగా నిండుతనంతో చెప్పగలిగేటందుకూను. ఈ కారణాలవల్ల తెలుగు భాష రచనలో మార్చు వచ్చింది. పంతులుగారి వెనక నిలబిడి వారు రచించిన పద్దతిని రచనలు చేసేవారు కొందరు తయారయినారు. తెనుగులో వీరందరితో ఒక కొత్త సంప్రదాయం ఏర్పడింది. అట్టివారికి తెనుగులో రచనను చేయాలనే ఉబలాటం అంతకు పూర్వంనుంచీ వారి “గుండె గొంతుకలో కొట్లాడుతున్నా” పండితులకు జడిసి, వారికున్నంతటి పాండిత్యం తమకు లేకపోవడంచేత కలం చేత బట్టడానికే వెరచేవారు.. ఇప్పుడు సవ్యసొచి పంతులుగారు అన్నిటికీ కాచుకొనే వారు ముందు నిలబడ్డ కారణాన వారి జడుపు తీరింది. ఈవిధంగా పంతులుగారి సాహిత్య రంగావతరణం భాషా సౌలభ్యానికే కాకుండా సాహిత్య రచయితల రంగ విస్తరణకు కూడా  దారి కలిగింది. తెనుగు రచనలలో కొత్త సంప్రదాయం తలెత్తింది. శ్రీ వీరేశలింగంగారు. ఆనాటి ఆంధ్ర సాంఘిక జీవనంలోని మాలిన్యం చూచి, దాని శోచనీయ పరిస్థితిని విలోకించి దానిని సంస్కరించే తలంపుతో కాలుష్యం కడిగివేసి దానికి కొత్త కాంతి, బలమూ ఇవ్వాలనే ప్రధానాశయంతో సాహిత్యరంగంలో ప్రవేశించిన నాటి నుంచీ సాహిత్యం సంఘానికి అదివర కేనాటికంటెనూ చేరిక అయింది; సంఘానికీ, సాహిత్యానికీ ఆవినాభావ నంబంధం ఏర్పడింది, అదివరకు కూడా సంఘాన్ని అనుసరించే తెనుగు సాహిత్యం పెంపొందుతూ. వచ్చినా రెంటికీ గల పరస్పర నంబందం___సంఘ జీవితంలో సాహిత్యం, సాహిత్యంలో సంఘజీవితం—పీరేశలింగం పంతులుగారి నాటివలె ఆంత ప్రబలంగా, ప్రస్ఫుటంగా గోచరించి వుండలేదు. ఆనందాని కయితేనేమి, విజ్ఞానాని కయితే నేమి ఏ జాతి సాహిత్యం ఆ జాతి చేసుకొనే గొప్ప సృష్టి, అదొక కళ, అదొక మహాశిల్పం,జాతి ఆశయాలు, ఆదర్శాలు, లక్ష్యాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు_ఆన్నీ ఆ జాతి సాహిత్యంలో ప్రతిఫలిస్తవి. జాతీయ జీవిత మనే క్షీరసాగరం మథించగా వచ్చిన అమృతకలశం సాహిత్యం. అది జాతి సౌందర్యమయజీవి తానికి వ్యాఖ్యానం; జూతీయజీవనపు మీగడతరగే అది, సంఘమూ, సాహిత్యమూ ఈ రెండూ ఒకదాని కొకటి యెడమయితే అవి రెండూ కూడా వెర్రితలలు వేస్తవి. సంఘం రసవంతమయిన సాహిత్యరచనకు జీవగర్ర, కవి ఎప్పుడూ సంఘంలోనుంచే, తన చుట్టు పట్ల పరిస్థితులలోనుంచే కథావస్తువును తీసి కొంటాడు కాని అంతరిక్షంలోనుంచి ఆహరించడు. సాహిత్యం సంఘానికి ధర్మపథం చూపి దివ్యదృష్టి నిచ్చి ఆనందంలో రంగరించి లలితంగా దానిని ప్రబోధించకుండా ప్రబోధిస్తుంది. కొండ అద్దంలోలాగ సంఘం సాహిత్యంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒక్క సాహిత్యమె కాదు, శిల్చం, చిత్రలేఖనం, కవిత్వం-_కవిత్వమంటే ఒక్క పద్యమే కాదు, గద్యమూను__అన్ని లలితకళలూ ఇట్టి వే. ఒక జాతి కళలో ఆ జాతి ప్రభావమూ ఉందుంది, ప్ర్రతిఫలనమూ ఉంటుంది, మన లలితకళలను చూసి మన జాతి ఎట్టిదో, మన సంఘం అభిరుచు లెటువంటివో సులభంగా చెప్పవచ్చు–ఒకడు చదివే పుస్తకాలను అనుసరించి వా డెటువంటివాడో చెస్సగలిగినట్లు, ఈ కారణం చేతనే ఎడ్వర్త్‌ స్టోన్‌ అన్నాడీ విధంగా:

The art of a nation, that is to say, the fine arts, sculpture, painting, poetry-both prose and verse-is a reflex of the morals of her people. The purity or impurity of her art is the only safe guide by which the vice or virtue of her citizens can be judged. An eleveated art helps to refine, and improve, but a depraved art, whether in the form of sculpture, painting or litera ture, is fatal to true civilisa tion.”

“ఒక జాతికళ అంటే శిల్పం, చిత్రలేఖనం కవిత్వం గద్యమూ పద్యమూ కూడా మొదలైనవి-.ఆ జాతి ప్రజల నీతికి ప్రతిబింబమే. ఆ జాతి కళలోని పరిశుద్ధత, ఆపరిశుద్ధతల ననుసరించే ఆ జాతి పౌరుల గుణవగుణాలను తేల్చేటందుకు తగిన సాధనం, ఉన్నతమైన కళ పరిశుద్ధికి అభివృద్ధికి తోడ్పడుతుంది.  భ్రష్టకళ శిల్చంలో కాని, చిత్రలేఖనంలో కాని, సాహిత్యంలో కాని యథార్థ సభ్యతకు వినాశకర మవుతుంది.”

కళాత్మకములయిన సాహిత్యరచనలను చేసి సంఘం తప్పొప్పులను అద్ధంలో లాగు చూసి. దాని నుద్బోధించి శ్రీ పంతులుగారు సాహి త్వాన్ని ఒక మెట్టెక్కించి దాని కీయవలసిన విలువను, గౌరవాన్ని ఇచ్చి దానిని ధర్మపీఠం మీద సు ప్రతిష్టితను చేశారు, ఓక జాతి సాహిత్యం ఆ జాతి సభ్యత స్వీయ చరిత్ర. ఆ విధంగానే మన ఆంధ్ర సాహిత్యం ఆంధ్రజాతి సభ్యత స్వీయచరిత్ర. మన కళ మన సభ్యతకు చిత్రరూపమయిన వ్యాఖ్యానం. శ్రీ వీరేశలింగ సాహిత్యం ఉపలక్షిస్తే ఈ యథార్థం మనక చక్కగా బోధపడుతుంది. శ్రీ వీరేశలింగంగారు తెనుగులోని ప్రాచీన సాహిత్యం బాగా చదివిన దిట్ట: చక్కని కవిత్వం చెప్పగల నేర్పరి. ఆయన దొక విచిత్ర ప్రకృతి. కార్యం ఎంత కష్టమయినదయితే అంతటి ఉబలాటం ఆయనకు దానిని సాధించాలని, అది వీరవ్రకృతి, ఆయన మహావీరుడు,అందువలనే ఆయన ప్రాచీన ప్రబంధఫక్కిని కావ్యాలు వ్రాయడంలో కూడా శుద్దాంధ్ర కావ్యములూ, శుద్దాంధ్ర నిరోష్ట్య నిర్వచనములూ ప్రయత్నించారు. కాని తేలకయినవాని పొంత పోలేదు ,శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నై షధం, రసిక జన మనోరం జ నం, శుద్ధాంధ్ర భారత సంగ్రహం వంటి రచయిత ప్రజ్ఞను పరీక్షించే గీటురాయివంటి కావ్యాలు రచించడమే కాదు, అవి మా దొడ్డ పాకాన బడినవని. ఆనాటి మేటి పండితులు శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు మొదలై నవారిచేత ప్రశంసలు కూడా పొందారు; పండితులే ననేటట్టు గద్యం వ్రాసిచెన్నపురి పండితులచేత రజత పాత్ర బహూకరణమూ, గద్యతిక్కన బిరుదమూ కూడా పొందారు. ఆటువంటప్పుడు ‘వంతులుగారి కవితా చాతురిని గురించి  కాని, ఆయన గద్య శైలిని గురించి కాని వేరే చెప్పడం ఎందుకు?

శ్రీ పంతులుగారు ముఖ్యంగా ఆ౦ ధ్ర భాషకు చేకూర్చిన అలంకారాలు మూడు : నవల, వ్రహసనం, కథ. కథ మన తెనుగు సాహిత్యంలో వీరేశలింగంగారికి పూర్వం లేకపోలేదు. కాని దానిని ప్రారంభించడం తోను, సాగించడంలోను, ముగించడ౦లోను పూర్వపు కథలకూ, పంతులుగారి కథలకూ చాలా తేడావుంది. కథా కల్పనే వేరు; వర్షన విధానమే వేరు; ఆ కూర్పే వేరు. కథలని పంతులుగారు రచించినవి ఈనాటి కథానికల వంటివి కావు. వాటిలో పెద్ద కథలు కూడా ఉన్నవి. వీటిని చిన్న నవలలన్నా తప్పులేదు. ఇక చిన్న కథలలో నీతికథలూ, అటువంటి ఇతర కథలూ కూడా చాలా ఉన్నవి. వీటిలో కొన్ని నడచిన తీరునుబట్టి చూస్తే అవి నేటి కథానికకు, చిన్న కథకు ప్రాతిపదికలా అనిపిస్తుంది.

ఇక శ్రీ పంతులుగారి నవలల విషయం ఎత్తగానే ముందుగా చట్టున మన మనస్సుకు తోచేవి రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వదేశ యౌత్రలు, ఈ తరంలో నేమోకానివెనుకటి తరంలోనూ పంతులుగారి నాడూ కూడా పంతులుగారి (గ్రంథాలను ఏవి చదివినా, ఏవి చదవకపోయినా ఈ రెంటినీ చదవని వారు ఆంధ్రదేశంలో లేరంటే అది స్వభావోక్తే. నూటికీ కోటికీ ఒక రుండేవారేమో అట్టివారు. రాజశేఖర చరిత్ర, వికార్‌ ఆఫ్‌వేక్‌ ఫీల్డు గ్రంథాన్ని అనుసరించి వ్రాశానని ఆయన అన్నారు గనుక మనం కాబోలు ననుకోవాలి కాని దానికీ దీనికీ ఎక్కడా ఏ విధమయిన పోలికా లేదు. దీనిలోని కథావస్తువు తెలుగునాటి ఒక సంసార గాథ, రాజశేఖర చరిత్ర చదివితే మన తెలుగునాటి మధ్యరకపు సంసారమూ, పంతులుగారి నాటి మన సాంఘిక పరిస్థితులూ బొమ్మ గీసినట్లు మన మనోన్నేత్రానికి స్ఫుటంగా కనబబడుతవి. ఆఫ్రికా సహారా ఎడారిలో కూర్చుని ఆ నవలను చదివినా ఆంధ్రుడికి తన దేశం, తెనుగు ఇల్లు తన ఎట్టయెదుట ప్రత్యక్షమై ఒళ్లు పులకరించక పోదు. రాజశేఖర చరిత మూడుమూర్తులా శుద్ధ తెనుగు నవల. ఈనాటికి కూడా ఈ నవలకు దీటువచ్చేవి మన తెనుగునో ఎన్నో లేవు. రాజశేఖర చరికలో కథా సంవిధానాన్ని పంతులుగారు గొప్ప చాకచక్యంకో అత్యద్భుతంగా నడిపారు; ఆ కల్పనే సొగసయినది, ఆ నవల ప్రతి పుటలోనూ చిక్కని తెనుగుతనం రూపుకట్టి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కథ ప్రారంభించినది మొదలు ముగించేదాకొ నిద్రపట్టదు, పంతులుగారి రచనా చాతురికి, కథా కల్పనకు, పాత్ర పోషణకు విస్మయం పొందుతాము. భూత వైద్యుల బూటకాలు, సిద్ధాంతుల సొరకాయ కోతలు, ఇచ్చకాలమారుల  వందిమాగధ స్తవాలు, బైరాగుల డాంభికపు మాయలు- ఓకటేమిటి, ఆ కాలంతో మన సంఘంలో మాలిన్యం, కపటం, డాంభికం. ఇటువంటివి ఎక్క డెక్క డున్నవో, ఏయే పద్ధతులు మన కభ్యుదయ హేతువులో అన్నీ పంతులుగారు గొప్ప నేర్పుతో ఆయా పాత్రల రూపాన చూవి వ్యంగ్యంగా తమ లక్ష్యాలు.. కావాలని తెచ్చి పెట్టినట్టు కాకుండా, చూపుతూ వచ్చారు. ఈ ననల ఒక్క టే చాలు శ్రీ వంతులుగారికి సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించడానికి,

ఇంక సత్యరాజా పూర్వ దేశ యాత్రలు ఒక చక్కని చిక్కని హాస్య గ్రంథం. గలివర్స్‌ ట్రావెల్స్‌ను అనుసరించి వ్రాసిన గ్రంథం యిది. దాన్ని అనుసరించినా మన భారతీయ వాతావరణానికి సరిపడేటట్టు దాన్ని మార్చి గొప్ప విన్నాణముతో కథ సాగించారు పంతులుగారు. ఇందులో ఆడు మలయాళం,లంకాద్వీపం అనేవి రెండు భాగాలు. ఆడు మలయాళం. స్త్రీలకు విద్య అక్కరలేదనీ, దానివలన వారికి హాని కలుగుతుందనీ వాదించే పూర్వాచారపరాయణులను అవహేళన చేయుట కోసం వ్రాసిన అపహాన్య ప్రబంధం, ఇక లంకాద్వీపం జనులలో జ్యోతిశ్శాస్త్రం మీదగల పిచ్చిని అవహేళనం చేయడానికి సంకల్పించింది. ఈ రెంటిలోనూ స్త్రీ విద్య వ్యతిరేకవాదుల మీదా, జ్యోతిశ్శాస్త్రాభిమానులమీదా తీసిన దెబ్బ లనేకాలు. ఈ సత్యరాజా పూర్వ దేశయాత్రలు చదువుతూవుం టే కడుపుబ్బ నవ్వు వస్తుంది. దీనిలో పంతులుగారు. చేసిన అపహాస్యం పైకి నవ్వు పుట్టించినా పోలీసుల లాఠీ ‘దెబ్బలలాగ హృదయానికంతా గాఢంగా గ్రుచ్చుకొని భాధ పెడుతుంది. ప్రహననా లలోకూడా పంతులుగారు హాస్యం ముమ్మరంగా ఉపయోగించారు. ఈ ప్రహసనాలలో కొన్ని ఆనుసరణాలు, కొన్ని స్వకపోల కల్పితాలు. ఇవన్నీ చాలావరకు సంఘంలోని దురాచారాలను నిర్మూలిచడం కోస మే వ్రాయడంచేత పంతులుగారి ఈ హా స్యం మాటున వారి రోషమూ, క్రోధమూ చిచ్చులా జ్వలిష్తూ ఉంటవి పంతులుగారు ఏది చెప్పినా, ఏది వ్రాసినా నిర్మొగమాటంగా, ఒక్కక్కప్పుడు అతి క్రూరంగా  కటువుగా, సంఘాన్నీ వ్యక్తులనూ విమర్శిస్తారు, వాస్తారు. ఈ కారణంచేత ఆయన కనేకులు శత్రువులేర్పడ్డారు. ఏర్పడడ మేమిటి, కొని తెచ్చుకోడమే.

శ్రీ వీరేశలింగం పంతులుగారు. విరచించిన కథలలో చాలాభాగం స్త్రీల ఉపయోగం నిమిత్తం (వాసినవే. మనదేశంలో బడులు “పెట్టి స్త్రీలకు విద్య చెప్పించడం ఆయనతోనే ప్రారంభం. అంతకు పూర్వం విద్యనేర్చిన ఆంధ్రమహిళలు లేకపోలేదు మన దేశంలో. వారిలో కొందరు గొప్ప కవయిత్రులుకూడాను. కుమ్మరి మొల్లరచించిన రామాయణం చదవని వారుండరు, అథమం మొల్ల పేరయినా వినని వారుండరు, తరిగొండ వెంగమాంబ మరొక ప్రసిద్ధ కవయిత్రి; ఆవిడ రచించిన కావ్యాలు ఎన్నో ఉన్నవి. ఈ విధంగా చదువునేర్చిన స్త్రీలు ఏ సకృతుగానైనా మనలో పూర్వం ఉన్నప్పటికీ బాలికల కందరికీ విద్య నేర్పాలనే నిర్బంధం, సామాన్యాభిలాష ఉండేదికాదు, ఆడుది చదువుకొని ఉద్యోగాలు చేయనా,ఊళ్లేలనా ఆనే నిస్పాకారం సంఘంలో శ్రీ పంతులుగారి నాటికి బలిసిపోయింది. మన జాతిలో ఉండే గొప్ప శక్తులూ, గొప్పగుణాలూ క్షీణించిననాడు స్త్రీ చదివిచెడ్డది; మగవాడు చదవక చెడ్డాడనే విపరీత వాదం ప్రబలింది. ఇదంతా చూసి, లోకవృత్తం గమనించి, భావికాలపు ఛాయలు కనిపెట్టి, స్త్రీలకు విద్య అవసరం; పురుషునితోపాటు న్త్రీకూడా చదువు కుంటే కాని, స్త్రీకి కూడా సంఘంలో సముచిత గొరవస్టానం ఇస్తే కాని కుటుంబ సంసార శకటం సరిగా సాగదు, జాతి అభ్యున్నతి పొందదని వాదించి పంతులుగారు స్తీ విద్య కోసం అత్యధికమైన కృషిచేశారు. స్త్రీ విద్యా వ్యతిరేకులతో ఆయన చేసిన వాగ్యుద్దాలనేకాలు. ఆ కాలంలో ఆయన సంఘాన్ని బహుముఖాల అనేక విషయాలతో ఎదుర్కోవలసివచ్చింది. ఏటి కెదురీతే ఆయినది. ఏకైకవీరుడై అర్జునుడు భిల్లు నెదిరించినట్లు ఎదిరించాడు. స్తీ విద్యా ఉద్యమం ఆయన కృషిఫలంగా విజయం పొంది౦దే.

శ్రీ పంతులుగారు స్త్రీల నిమిత్తం విఖ్యాత మహిళల జీవితాలెన్నో వ్రాశారు; ఎన్నో కథలు రచించారు. ఈ కథలలో కొన్ని ఇంగ్లీషు కథలకు అనుసరణాలు; కొన్ని అనుకరణాలు. ఆయన ఏది (వాసినా ఇక్కడి మన పరిస్థితులకు తగినట్టు మార్చి సవరించి, తన అభిప్రాయాల కనుగుణంగా వ్రాసేవాడు. సత్య వతీచరిత్ర, చంద్రమతీ చరిత, సుమిత్‌ చరిత్ర, సతీమణీ విజయం, రఘుదేవరాజీయం, గయ్యాళిని సాధు చేయుటవంటి ఆయన రచించిన కథలు చాలా ఉన్నవి. కథలని అవి నేడు మనం సాధారణంగా పత్రికలలో చదివే కథల వంటివి కావు. ఈ విషయం ఇదివరకే చెప్పాను. అవి చిన్న నవలలే.

సంఘంలోని దురాచారాలను తొలగించడానికీ, పరంవరగా వస్తున్న మూఢ విశ్వాసాలను ఛేదించడానికీ ఆయన చేపట్టిన సాహిత్య సాధనం ప్రహసనమూ, నాటకమూను. వారి హాన్య సంజీవని సంవాద రూపకమయిన చిన్ని నాటికల గుచ్చమే, ఈ హాస్యసంజీవని, పెద్ద య్య్యగారి పెళ్ళి అనే నామాంతరం గల (బహ్మ వివాహమూ, వ్యవహార ధర్మబోధిని మొదలైనవి చదివితే శ్రీ వీరేశలింగం పంతులు గారి నాటి ఆంధ్రసంఘం ఏ స్థితిలో ఉండేదో కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఈ రచనలన్నీ అనాటి మన సాంఘిక చరిత్ర రచనకు ముఖ్యమైన సాధనాలు. ఇటువంటి విచ్శిత వినోద సాహిత్యరచన లంతకు పూర్వం తెలుగులో లేకపోవడంవల్ల అవితమ ఆచార వ్యవహరాలను అధిక్షేపించి ఎద్దేవా చేసేవయినా ఆ రచనా పద్ధతి కక్కఱపడి వాటిని చదువడానికి జనం విరగబడ్డారు. తిర్యగ్విద్వన్మహాసభ, మహారణ్యపురాధిపత్యంవంటివి ఆనాటి రాజమహేంద్రవర పరిస్థితులు తెలిస్తేనే కాని అవి శ్రీ పంతులు గారు ఎవరిమీద తీసిన దెబ్బలో తెలియదు,ఈ విధమైన రచనలన్నిటిలోను ఆయన ఎవరి మీదనో ఒకరిమీద దెబ్బలు తీస్తూనేవచ్చారు. మనమీద దెబ్బతీస్తున్నాడని తెలిసీకూడా వాటిని మనం చదవకుండా ఉండలేము. అదే వాటి లోని ఘనత. సంఘాన్ని శ్రీ పంతులుగారు సంస్కరించింది ఇట్టి వ్యంగ్య, హోస్యరచనల ద్వారానే.

శీ వీరేశలింగం పంతులుగారి సాహిత్యానికి ఒక విశిష్టత ఉంది. ఆయన చేసిన సాహిత్య సీవ ఎంత గొప్పదో, ఎంత అపారమయినదో మన ఊహకు తట్టటంలేదు. ఆయన సృష్టించిన సాహిత్యాని కింకా మనం సరిగా విలువకట్టడం లేదు. ఇంతవరకు పంతులు గారిని లోకం సంఘనంస్క ర్తగానే గుర్తిం చింది కాని ఆయన చేసిన సాహిత్య సేవను గుర్తించలేదు. సాహిత్యాన్ని చేయూతగా తీసు కొన్నాడు గనుకనే, దాన్ని ఆశ్రయించాడుగనుకనే ఆయన ఆంధ్రదేశంలో సాంఘికంగా అంత గొప్ప మార్చు తీసుకు రాగలిగినాడు. ఎప్పటికయినా కత్తి నిర్వహించలేని పని కలం నిర్వహింపగలదనీ, కత్తి కంటెను కలమే బలీయమయినదనీ, ఎక్కువ వాడి యైనదనీ ఆయన రచనలే ధ్రువవరుస్తవి, _శ్రీ వీరేశలింగం పంతులుగారి సాహిత్య కృషిని సమగ్రంగా పరిశీలించి, దానికి సరిమైన విలువకట్టి, తగిన సమర్థులచేత ఒక విమర్శా పూర్వకమయిన గ్రంథం వ్రాయించి ప్రకటించడం చాలా అవనరం. ఇది హితకారిణీ సమాజంవారి ప్రధాన కర్తవ్యమని నా మనవి.

ఆంధ్ర కవుల చరిత్ర

వీరేశలింగంగారు రచించిన ఇతర (గ్రంథాలన్నీ ఒక యెత్తు, ఆయన ఆ౦ధ్రకవుల చరిత్ర ఒక యెత్తూను. ఒక విధంగా చూస్తే ఇదే ఆయన రచనలలోనిక్రి మేటి కిరీటంవంటిదనవచ్చు, ఆయన రచియించిన ప్రతి యితర గ్రంథాలతోనూ ఆయన కాలంనాటి సంఘం విషాద పరిస్థితీ, ఆయన సంస్థారపరత్వపు నిశితచ్చాయలూ ముదురు ముదురు గాకపోతే మానె లేత లేతగా నయినా గోచరిస్తూ ఉంటవి.

ఆయన రచియించిన సాహిత్య గ్రంథా లన్నిటిలోనూ కళ కంటేనూ, శిల్పముకంటేనూ మనకు గోచరించేది ఆయవ సంఘసంస్కరణాభిలాషే.. సత్యహరిశ్చంద్ర నాటకములో హరిశ్చంద్రుని వేడుక చెలికాడు గాలవుడు మాలెతలు హరిశ్చంద్రుని వేడరాని పెడకోరికలు కోరినప్పుడు నేను వీరిని తాకకూడని బ్రాహ్మణుడ నయిపోతిని కాని కాకపోయిన యెడల వీ రీపాటి యిల్లాండ్ర కేశఖండన మహోత్సవమునాటి రాగములు తీయుచు బరుగెత్తి యిల్లు త్రొక్కి చూడరా ఆంటాడు. బల కేశఖండన దురాచారము, వితంతు వివాహము, స్త్రీవిద్య మొదలైన శ్రీ వీరేశలింగము గారి హృదయంలో ఎప్పుడూ మెరుగుతూ ఉండే అభిప్రాయాబు ఆయన సాహిత్యమంతటా ఏదోవిధంగా ఎక్కడినుంచో ఒకక్కడినుంచి ఔచిత్యాన్నికూడా ధిక్కరించి తొంగి చూస్తూనే ఉంటవి కావి యీ కపుల చరిత్ర రచనలో ఆయన పుక్కిటి పురాణపు గాథలు, అసలయిన చరిత్రాంశములు శాస్త్రీయ పద్ధతిని విమర్శించి తక్కెడలో వేసి తూచి సత్యము నిర్ధరించి తీర్చు చెప్పే. గొప్ప న్యాయమూర్తి అయినాడు.

ఆకాలంలో కవుల చరిత్ర గ్రంథం రావడమె వింతలలోని కల్లా వింత, అంతవర కిట్టి చరిత్ర గ్రంథాలు లేవు. మన మిప్పు డర్ధం చేసుకొనే దృష్టిలో చరిత్ర అనేది ఇంగ్లీషు విద్య మనదేశంలో వ్యాపించిన తరువాత వచ్చిందే. అయితే కవులచరిత్ర లనే పేరుతో వీరేశలింగముగారి కవులచరిత్ర వాటికి వచ్చిన గ్రంథాలు లేకపోలేదు. శ్రీ గురజాడ శ్రీరామమూర్తిపంతులుగారు, బొద్దికూరపాటి వెంకటరంగ కవిగారు మొదలైనవారు దేశంలో వ్యాపకంలోఉన్న కవుల గాథల కొన్ని సత్యాంశాలను జోడించి కలగాపులగం చేసి రచియించిన చరిత్రలున్నవి కాని వాటిలో శాస్త్రీయమయిన విమర్శనాపటిమ తక్కువ. అందువల్ల శ్రీ ఏీరేశలింగంగారి కవులచరి త్ర కే విలువ యెక్కువ. ఆకాలంలో ఇ౦తటి శాస్త్రీయ పద్దతిని వీరేశలింగంగారు ఆ కవులచరిత్ర రచించినారంటే అది చాలా ప్రశంసవీయమయిన విషయం, ఏమంటారా, దేశచరిత్ర రచనకు కానీ కవుల చరిత రచనకు గాని వలసిన సాధన సామ[గి ఇప్పుడయితే పుష్కలంగా లభిస్తున్నది కావి ఆ నాటికి చాలా తక్కువ, లేనేలేదన్నా అది ఆతిశయోక్తి కాదు, ఏ సంవత్సరం వీరేశలింగంగారు కవుల చరిత్ర ప్రథమభాగం ప్రకటించారో ఆయేడే గవర్న మెంటువారు. దేశంలో వివిధ ప్రాంతాల వెదచల్లినట్టున్న శిలాశాసన తామ్ర శాసనాలను సంపాదించి. పరిష్కరించి (పకటించడానికి శాసనశాఖ నొకటి యేర్చరచినారు. అందువల్ల ఆయన కవులచరిత్ర వ్రాసేనాటికి గవర్నమెంటుశాసన శాఖవారి శాసనసామగ్రి ఆయనకు అందుబాటులో లేనిది. అందువల్లనే ఆంధ్ర కవుల చరిత్రను రచించడం చాలా కష్టమయిన పని అయిం దాయనకు. వారే తమ స్వీయచరిత్రలో వ్రాసుకొన్నాడు. నేను చేసిన (గంథాలలో నెల్ల ఆంధధ్రకవుల చరిత్ర ప్రధానమయినదనీ, పూర్వకాలమునుండి మనదేశంలో చరిత్రములు వ్రాసెడి ఆచారం అంతగా. లేకపోవడంచేత కవుల చరిత్ర వ్రాయడం యెంతో కష్టసాధ్యమయిన దనీని. కాదో మరి, కవుల కాలం తెలుసుకోడాని కాధారాలు లేవు; కవులు ఈమ గ్రంథాలు రచించిన కాలం బహుళంగా తెలుపుకోలేదు. కొందరు తమ గ్రంథాలను రాజులకు, మంత్రులకు దండనాభులకు ఆంకితమీచ్చినా ఆ రాజుల మంత్రుల దండనాథుల కాలం తెలుసుకోడానికయినా సాధనాలు లేవు.

రాజులకు గాని, వారి మంత్రులకు గాని, వారి దండనాథులకు గాని ఆంకిత మియ్యని కవుల విషయంతో మొదలే పేచీ. ఇంతటి పేచీలతోను, కష్టాలతోను కూడిన యిట్టి కవుల చరిత్రను వీరేశలింగంగారు. ఆనాడు అంత శాస్త్రీయంగాను, ఆంత వై పుణ్యంతోను వ్రాసి నారంటే వారి విమర్శనా చాతుర్యానికీ, వారి వ్రజ్ఞాపాటవానికీ, వారి యుక్తి వి వేకానికీ వారినెంతైనా అభినందింస వలసిందే. అనలీ పరిశోధనలో ముఖ్యమయిన విషయ మేమంటే ఈ చరిత్ర రచనకు సాధన సామగ్రి ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోడమే కష్టతరమయినపని, ఇప్పుడంటే ఇది సుకరంగా తెలుసుకోడాని కవకాశా లున్నవి కాని వీరేశలింగంగారి నా డట్టివి చాలా తక్కువ. అట్టి వాటిని గనిపెట్టి శ్రీ వీరేశలింగంగారు అట్టి ఉత్తమ శాస్త్రీయ చరిత్రగ్రంథాన్ని రచించారంటే ఆయన ఘనతా, ప్రజ్నా ఆందులోనే ఉంది. ఆ కాలంలో ఆయన కొందరు కొందరు కవుల విషయంలో చేసిన కాలనిర్ణయాలు పొరపాటు కావచ్చు; కొన్ని కొన్ని సిద్ధాంతాలు తప్పులు కావచ్చు. ప్రాచీనులలో పడవలసిన కవులు కొంద రాధునికులలోను, ఆధునికులలో పడవలసిన వారు కొందరు (పాచీనులలోనో, మధ్యకవులలోనో పడియుండవచ్చు_ ఆయన కాలంనాటికం టె నేడు చరిత్రరచనకు కావలనిన సొమగ్రి విస్తరించి మనక దొరకడంచేతను, అనేక గ్రంథములు మన కచ్చువడి లభ్యమవడంచేతను, అదీ కాక అచ్చుకాని పుస్తకాలయినను మనకు ఒక్కచోట ప్రాచ్య లిఖిత (గంథాగారంలో చక్కని కాగితాలమీద వ్రాసో, తాటాకులమీద వ్రాసో అందుబాటులో ఉండడంచేతనూ, లక్షణ్యగ్రంథాలు, ప్రబంధ రత్నావళివంటి  గ్రంధాలు దొరకడంచేతనూ,కవుల కాలము, కవుల (గంథములు మొదలైన విషయాలనుగురించి పత్రికలలో ఇటీవల చర్చ లనేకం జరగడంచేతను వీరేశలింగం పంతులుగారు చేసిన పొరపాట్లు, ప్రమాదాలు మనకు తెలుసుకోడానికి నే డెక్కువ అవకాముంది. ఆయన రచించిన కవుల చరితలో అటువంటి పొరబాటులు, ప్రమాదలేశములు ఉన్నవని ఆయన కవులచరిత్రను గాని, ఆయన చేసిన కృషినిగాని తృణీకరించడం ఆయన పొరపాట్లను చూపి ఆయన కంటే మన మేదో పొడిచేశా మనుకొని విర్రవీగడంవల్ల మన ఆజ్ఞానమూ, అహంభావనమే వెల్లడవుతుంది

కాని ఆయనకు కలిగే న్యూనతా ఏమీ లేదు,ఆయన చరిత్రకు గల విలువా తగ్గదు. నేటికి కూడా ఆయన కవులచరిత్ర అమూల్యమయిన గ్రంథం. నేటికి ఆంధ్రంలోని చరిత్రవాజ్ఞయానికి అలంకార్నప్రాయమయిన (గంథం, ఆయన కొంచె మించు అన్నీ అన్నా తప్పు లేదు, ఇప్పటికి ఒప్పులుగా చెల్లుబడి అవుతున్న వే. నన్నయభట్టీయాన్ని గురించి ఆయన చేసిన సిద్ధాంతాన్ని నేటికీ ఆమోదింపని వా రరుదు, అయితే ఇప్పటికీ ఒక రిద్దరు లేకపోతే పదిమంది అది నన్నయభట్టుకృత మే అని వాదిస్తున్నా ఆ వాదానికి పటుత్వంలేదు. భూమి చదునుగా ఉంది. కాని గుండ్రనగా లేదని వాదించేవారు శాస్త్రవిజ్ఞానం పూరా నిండి తొణికిసలాడే యూరోపు లోనే నేటికీ ఉన్నారు. వీరేశలింగంగారి నాటినుంచి నేటివరకు తామ్ర శాసనములు, శిలాశాసనములు మొదలై న వెన్నో బయలుపడినవి. ప్రాత తాటియాకుల వుస్తకాలను సేకరించుటకు అనేక ప్రయత్నములు తెలుగు దేశంలో జరగడంవల్ల తామ్ర గ్రంథ సంచయం వృద్ధిఅయి అదివరకు దెలియరాని కవులు ఎందరో తెలిసినారు, అదివరకు దెలియరాని పుస్తకములూ ఎన్నో తెలిసివచ్చినవి; ఆయా కవుల కాలములు నిర్ణయంచుటకు వెనుకటికంత అపకాశము లిప్పు డెక్కువ లభిస్తున్నవి. మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం త౦జాపూరు పుస్తక భాండాగారాలలోని  పుస్తకాల డిస్క్రిప్టివ్ క్యాటలాగులు ప్రకటితము లయినవి. ఇవి కాక ఆంధ్రసాహిత్య పరిషత్తు, విశ్వకళాపరిషత్తు, తిరుపతి దేవస్థాన విద్యానంస్థలలో “సేకరించిన తాళపత్ర గ్రంథాలు. వీటి కింతవరకు డీస్క్రిప్టివ్  క్యాటలాగులు లేక పోయినా.__అనేకా లున్నవి. వీటి నన్నిటినీ పురస్కరించుకొని ఏరేశలింగముగారు రచించిన ఆం(ధకపుల చరిత్రమును పునః విమర్శించి పరిష్కరించి ప్రకటించడం ఎంత పంతులుగారి. కీర్తిని, సాహిత్య కృషినీ చిరస్తాయిగా చెయ్యడానికి ఈ ఓక్క గ్రంథం చాలును; ఎందుచేతనంటే శ్రీ పంతులవారు వ్రాసిన ప ద్యకావ్యాలు శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన న్నైషధ, రసికజన మనోరంజనాదులు ఎంత పండిత ప్రశంసను ఆ కాలంలో చూరగొన్నవయినా అట్టి కావ్యాలకీ కాలంలో మెప్పుదల లేదు. ఇంకా ఇప్పుడయినా ఏ కొద్దిగానో ఉందేమో కాని ముందుముం దుండదని తోస్తుంది కాల ప్రవృత్తి మారుతున్నది గనుక. ఇక పంతులుగారు రచియించిన ప్రహసనములు, హాస్య సంజీవనులు,రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వా దేశయాత్రాది నవలలూ సమకాలిక సామాజిక ప్రవృత్తిని చిత్రించి, ,పధానంగా సమాజ సంస్కరణానికి ఉద్దేశించినవే కాబట్టి, ఆ సమాజం మారేటస్పటికి ఆ (గంథాదులమీది ఆదరం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. అందువల్ల శ్రీ పంతులుగారు. విరచించిన గ్రంథాలలోనికల్లా వారి ఆంధకవుల చరిత్ర ఆమూల్యమయినది, ఆంధ్రదేశానికి అమితోపకరమయినదీని. కాలము గడచినా దాని విలువ తగ్గనిది, విజయనగర వాజ్మయము, కవులచరిత్రమనీ ఇటీవల ప్రకటిత ములయిన,అవుతూఉన్న గ్రంథములను గురించి నాకు తెలియక పోలేదు. ఎన్ని కవుల చరిత్రలు ప్రకటితమయినా కాని శ్రీ పంతులుగారి కవుల చరిత్రకు గల విలువ తగ్గదనే నా అభిప్రాయం,

పంతులుగారు కూడా ప్రాచీన కవులనుగురించి వ్రాసిన _పథమభాగమును పృనః ముద్రించి నప్పుడు అనవసరవముయిన గ్రంథమును చాలా పెంచినారనే నాకు తోచినది. ఇప్పుడు కవుల చరిత్ర వ్రాస్తున్నానమంటే శ్రీ వీరేశలింగం పంతులుగారి నాటినుంచి నేటివరకు ఒక్కొక్క కవి కాలనిర్ణయాదికాలను గురించి ఎట్టెట్టి పూర్వపక్ష సిద్ధాంతాలు జరిగినవో వాటి నన్నిటినీ ఏకరువు పెట్టట అనవసరమూ, గ్రంథ విస్తర కారణమూ కూడాను, ఒక్కొక్క విషయం నిర్ధారణ చేయడంలో, ఒక్కొక్క చారిత్రకాంశం స్థాపించడంలో మొదటికాలంలో అనగా ప్రారంభంలో అనేక వాద ప్రతివాదాలు జరగవచ్చును, పలువురు పలువిధాలుగా ఆ విషయాన్ని గురించి (వాసి ఉండవచ్చును. కాని చారిత్రక సామగ్రి అధికంగా లభించిన కొద్దీ, ఆకరములు ఎప్కవగా దొరకినకొద్దీ ఒక్కక్క విషయం సునిర్దిష్టమయి స్థిరపడి పోతూ ఉంటుంది. నమస్యలు కొ త్త కొత్త వివర విషయాలలో పృడుతూ ఉనప్పటికీని. కాలానుగుణంగా ప్రబల ప్రమాణాధారాన స్థి రపడిపోయిన చరిత్ర విషయాలను గురించినవాదోపవాదాలు మళ్ళీ అన్నీ తవ్వి పుస్తకం లోని కెత్తనక్కరలేదు, స్థిరపడని విషయాలను గురించి మాత్రమే మనం గ్రంథంలో పొందుపరుస్తూఉంటే చాలు, మనకు గ్రంథం విస్తరింపజేయడం, సంపుటాలు పెంచడమూ కాదు కావలసింది, విషయం ప్రమాణ పూర్వకంగా,యుక్తి సహంగా, ఖచ్చితంగా చెప్పి మన చరిత్రకు ప్రామాణికతా, నిర్దుష్టతా, స్వచ్భ్శతా కలిగించడమే, ఈ ఫక్కీని శ్రీ వంతులుగారి ఆంధ కవుల చరిత్రను ఒక పరిశోధక బృందంచేత కాని, తగినవారిచేత కాని పరిష్కరించి సమగ్రంగా ప్రకటింపించడం హితకారిణీ సమాజ కార్యనిర్వాహకుల ధర్మ మని మనవిచేస్తున్నాను. శ్రీ పంతులుగారి కవుల చరిత్రయే ప్రస్తుతం తరచుగా సాహిత్యచరిత్ర, భాషాచరిత్ర, దేశ చరిత్ర చదివేవారు పరిశోధించే వారు వాడే రిఫరెన్సు బుక్కు. ఈ (గంథం మొదటి భాగం తక్క మిగిలిన రెండు మూడు భాగాలూ ఎక్కడ కొందామన్నా దొరకటం లేదు,

పంతులుగారి సంస్కరణ కృషి జాతిలో అంతర్భాగమయి ఆజాతి ఆ కృషి ఫలితాన్ని పొందితే, వారి ఆశయాలు జాతిలో సాఫల్యం పొందితే ఇక సంస్కరణ విషయంలో పంతులుగారిని తలచుకొనేవా రుండరు. నేడు వితంతు వివాహాలు అనేకాలు జరుగుతున్నవి. అవి నేడు పరిపాటి అయిపోయినవి, వితంతు వివాహమంటే ఎబ్బెరికం పోయింది. ఆ పూర్వపు పట్టుదలలూ, ఆ వివాదాలూ అన్నీ మణిగిపోయినవి, దేశ మంతా, ఆంధ్ర జాతి అ౦తా వితంతువివాహ సంస్కరణానికి సుముఖ మయింది. ఇప్పు డది మంచిదని ఒకరిని ఒప్పించవలసిన పని లేదు: అంటే ఆయన తలపెట్టిన వితంతువివాహ విషయకమైన ఆశయం. ఫలించింది; ఆయన కృషి సార్ధకమయింది, ఇక ఈ సంస్కరణోద్యమ చరిత్ర వ్రాయ తలపెట్టినప్పుడు కాని. ఆయనను న్మరించేవా రెవరు? ఈ విధంగానే ఆయన జాతిని సంస్కరించాలని ఏ లక్ష్యంతో ఆయన గ్రంథాలు వ్రాశారో ఆ లక్ష్యమే సిద్ధించినపుడు ఆయన ఆంధ్ర జాతి సంస్కారంలోనే తిరోహితులై ఉంటారు. ఇక ఆయనకు వ్యక్తిత్వం లేదు, ఇక వ్యక్తిత్వం ఇచ్చి, విశిష్టత ఇచ్చి ఆయన కీర్తిని చిరస్థాయి చేసేది ఆంధ్ర కవుల చరిత్ర మే, అది యెంతకాలం ఆంధ్ర దేశంలో రిఫరెన్సు పుస్తకంగా ఉంటుందో, ఆయన ఆ గ్రంథాన్ని నిత్యనూతనంగా ఎంత కాలమయితే పఠిష్తూ ఉంటారో అంతకాలమూ ఆయన యశః కాయుడే. ఏ కాలానికీ పనికి వచ్చే మహా కావ్యాలను__అని గద్యములు కానీండి పద్యములు కానీండి _వ్రాసిన మహాకవు లందుచేతనే యశఃకాయులు; ఆ కారణంచేతనే కావ్యం.._తాత్కాలిక ప్రయోజనానికి పుట్టింది కాదు-.- చిర (పయోజనానికయినది-_.గ్రంథకర్త పేరు చిరస్థాయిగా నిలిపే సప్త సంతానాలలో ఒకటిగా ఎన్నిక గన్నది—  శ్రీ వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్ర శుష్కమయిన చరిత్ర (గంథమయినా అదీ ఒక విధమైన చారిత్రక కావ్యమే. రాజమహేంద్రవరము హితకారిణీ సమాజము వారు శ్రీ వీరేశలింగం పంతులుగారి ఈ కవుల చరిత్రను సమర్థులయిన వారిచేత పునః దోష పరిష్కరింపించి నూతనంగా దెలియవచ్చిన కవులు కావ్యములను గురించిన విషయాలు చేర్చించి ప్రకటించడం చాలా అవసరం, అట్లా చేయకపోతే శ్రీ హితకారిణీ సమాజంవారు శ్రీ పంతులుగారిపట్ల అపచారం చేసినవా రవుతారు. శ్రీ పంతులుగారు ఆంధ్ర మహాపురుషులలో ప్రప్రథములు; నవ్యాంధ్ర నిర్మాతలలో అగ్రగణ్యులు, ఆంధ్రదేశంలో ఆధునికయుగ ప్రత్యూషం తెలుపుడు చేయుటకుదయించిన వేగుజుక్క. చేశంకోసం తన రక్తం ధారపోసి కష్ట నష్టాలకూ, తోడి వారి దూషణ తిరస్కారాలనూ లెక్కచేయక సాహిత్యం ద్వారా నూతన భావాలు వెద వెట్టి ఆంధ్ర జాత్యభ్యుదయంకోసం కృషి చేయగా చేయగా ఈనాటి యాంధ్రదేశం తయారయింది. ఈ సంతత మహా కృషిలో ఆయన ఆర్ధ ప్రాణ ములూ, రక్తమాంసములూ అన్నీ అరిగి పోయినవి. వాటితో ఆయన జాతి అభివృద్ధి సౌధానికి నిర్మించిన సోపాన పరంపరను ఎ క్కే మన మీనాడు ఇంతటి అభివృద్ది పొందినాము, ఆయన కీర్షిని చిరస్థాయి చేయవలసిన బాధ్యత ఆంధ్ర లోకం అంతటిదీనూ, అ ౦దులో ముఖ్యంగా హితకొరిణీ సమాజంవారిది. ఆంధ్రులు తమ నవ్యజాతి నిర్మాతలను విన్మరించి కృతమఘ్నులు కారాదు, అట్టి మహనీయుల దివ్యచరిత సంస్మరణ మే పురోభివృద్ధి పథానుగాములము మన కంగరక్ష.

శ్రీ దంగేటి నారాయణస్వామిగారు శ్రీ హితకారిణీ నమాజము కార్యదర్శిగ ఉండి సమాజ కార్యాలను జక్కగా నిర్వహించిసమాజాన్ని వృద్ధిలోనికి తీసుకువస్తున్నందుకు వంద్యులు. కార్యనిర్వాహక సభ్యులలో ఉత్సాహవంతమైన యువకు లనేకులు చేరి శ్రీ నారాయణస్వామిగారికి చేయూత ఇవ్వడం ప్రశంసింపదగ్గ విషయం, శ్రీ మద్దూరి శివరామకృష్ణయ్యగారి సారథ్యంవల్లా, శ్రీ నారాయణస్వామిగారి కార్యదర్శితవల్లా హితకారిణీ సమాజం ఉ త్తరో త్తరాభివృద్ధి పొందాలి శ్రీ వీరేశలింగంగారి ఆశయాలను సఫలం చేయడానికీ “పేరు చిరస్థాయి. చేయడానికీ అది గట్టి కృషి చేస్తుందని నా నమ్మకం.

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

కిన్నెర మాస పత్రిక (సంవత్సరం అందుబాటులో లేదు)

డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *