‘విరసం’ మహాసభలు – ఒక సమీక్ష (1970-ఖమ్మం)

సమీక్షకుడు..   “నిప్పు పూవు”

1970 అక్టోబరు 8, 9, తేదీల్లో ఖమ్మంలో విరసం మహానభలు జరిపారు. సమావేశాలు జరిపిన స్థలానికి సుబ్బారావు పాణిగ్రాహినగర్ అని పేరుపెట్టారు సుబ్బారావు పాణిగ్రాహి ‘ శ్రీకాకుళం గిరిజనోద్యమంలో అసువులు బాసిన అమరకవి. అనీ, ఆయన స్మారక చిహ్నంగా ఆప్రదేశానికి ఆ పేరు పెట్టారని తెలిసింది. ఆయనకే అంకితం చేశారు విరసంవారు తొలిరోజు ఆవిష్కరించిన “ఝంఝ” అనే విప్లవకవితా సంపుటి. ఈ విరస రథ సారధులుగా జ్వాలాముఖీ, నిఖిలేశ్వర్ అనుక్షణం కనిపించినా, అతిరథ మహారథులూ, సాహిత్య వ్యవసాయంలో కాకలు తీరిన వృద్ధపతి సార్వభౌములు’ శ్రీశ్రీ; కొ.కు.; కె.వి., రావిశాస్త్రి నామమాత్రావశేషంగా కన్పించి, దిగంబరుల మార్గదర్శకత్వంలో తమ పాత్రలు నిర్వహించిన ట్లవుపడింది. దిగంబరులూ, పైగంబరులూ, మార్క్సిస్టు విమర్శకుడ్నని చెప్పుకుంటున్న కె.వి.. మార్క్సిజం నాకు యింతవరకూ తెలీదు. ఇప్పుడే మితృలవల్ల తెల్సుకొని అనుసరణీయ మనుకుని యిందులో జేరాననే రావిశాస్త్రీ, శ్రీశ్రీ; కుటుంబరావులూ మనకు ప్రధానంగా కన్పించే వ్యక్తులు. వరవరరావు పాపం ఎంచేతో నిర్లిప్తంగా వూరుకున్నారు. భవనంచుట్టూ నినాదాల సైన్‌బోర్డులు అంటించారు.
కొన్ని మచ్చుకు వుదహరిస్తాను విరసం భావాల్నర్థంచేసుకుందుకు.
1. విప్లపం వర్థిల్లాలి, 2. రక్తం రక్తాన్నే బలి కోరుతుంది. 3. ప్రతి తల్లీ ఒక సూర్యుడ్ని ప్రసవించాలి, 4 విప్లవాన్నించి రక్షించండి 5. వేయి
నక్సల్బరీ లుద్భవిస్తాయి, 6. ఒక రాజీలేని పోరాటం కావాలి.
-ఈ నినాదా లెవరికోసం? ఏం వుప లక్షంచి? విరసం ఏ భావాలకి ప్రతిధ్వని? ఇది ఏ ఆదర్శానికి రూపం? ఏ సాధ్యానికి సాధన? సభకు వెళ్లిన వారికి తప్పనిసరిగా కలిగే సందేహాలివి వీటి సమాధానం కోసం జాగ్రత్త గా ప్రతి అంశాన్ని పరిశీలించినవారికి నిరాశ ఎదురైంది. విరసంకు యిప్పటివరకూ నిరిష్ట లక్ష్యం లేదు. ఇదే విషయం రెండవరోజు సమావేశం అనంతరం స్పష్టమైంది.
మొదటిరోజున 8వ తేదీన కొ. కు. అధ్యక్షతన కవిసమ్మేళనమూ; విరసంవారు ప్రచురించిన ఝంఝు’ కవితా సంపుటి ఆవిష్కరణమూ (ఆవిష్కర్త శ్రీశ్రీ) జరిగినయ్, దాన్ని గిరిజనోద్యమకవి కీ॥శే॥ సుబ్బారావు పాణిగ్రాహికి అంకితం చేశారు. వ్యాసం రెండవ భాగంలో ’ఝంఝు’ను సమీక్షించుకొందాము. కొత్త గుండె చప్పుళ్ళు వింటారా రణదుందుభి మోగించారు కె.వి. ఈ కొత గుండె చప్పుళ్ళు అచ్చం కొత్తవి కావు. చాలాభాగం కొత్త సీసాలో పాతమందు చిత్ర ప్రదర్శనం ఒకటి ఏర్పాటు చేశారు. సభాభవనంలో. చిత్రకారుడు చంద్ర. మోడరన్ పేయింటింగ్ చిత్రాలు అన్నీ, భావాలకు రూపకల్పన ఆకర్షకంగానే వుంది. రావి శాస్త్రి గారి పిపీలికం’; కొ.కు. ‘అనుభవం’, వరవరరావు రక్షించండి! రక్షించండి! మురిగిన సూర్యుణ్ణి నంజుకుంటూ కాస్త కాస్త గా కొరుక్కు తింటున్నాను. ప్రతి తల్లి ఒక సూర్యుణ్ని ప్రసవిస్తే చాలు… మొదలైనవి.
సభా భవనం బయట Book Stall పెట్టారు. చాలావరకు మావో సాహిత్యం : చైనా సాంస్కృతిక విప్లవం, శ్రీకాకుళ గిరిజన పోరాటం; నెహ్రూ సోషలిజం, విషాద భారతం, గురజాడ, శ్రీ శ్రీలపై సోమసుందర్ దాడి, ఝంఝ ప్రభంజనాలు, త్రివేణి పత్రికలూ కనబడ్డాయి. రాజకీయ సాహిత్యం ప్రధానంగా చోటు చేసుకుంది. విరసం గుర్తు కొడవలీ సుత్తీ వున్న ఎర్రజెండామీద నిలువుగా కలం వుంటుంది. ఇదీ విరసం సభల దిజ్మాత్రా దర్శనం. సమావేశం వైఖరి,
ఏర్పాటు చేయపడ్డ పద్ధతి, సభలు జరిగిన తీరూ, తెన్నూ చూశాక యివి రాజకీయ సభలా సాహిత్యసభలా?.. అనే సందేహాలు రాక మానవు. 2. ఏం లక్ష్యంతో ఈ సభలు జరుపబడ్డాయి? 3. సాహిత్యం యొక్క వుపదేశకత్వం ఎంతవరకు? సమాజంలో కవి లేక రచయిత స్థానం ఏమిటి?
ప్రసంగాలూ – తీర్మానాలూ
పహిల్వాన్ కాంతారావు మరణానికి; కె ఏ. అబ్బాస్ తీసిన చిత్రం పై సెన్సారింగ్ మీదనూ, పత్రికా స్వాతంత్ర్యం మీదా, గిరిజనోద్యమ విద్యార్థులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూనూ కొన్ని తీర్మానాలను విరసం ఆమోదించింది. పదో తేదీ మధ్యాహ్నం సాహిత్య గోష్టీ కొ.కు. అధ్యక్షతన జరిగింది. కొ.కు. ను అధ్యక్షుడనటం కన్న కన్వీనర్ అనటం వుచితం. అందులో చర్చనీయాంశాలు కథానికారచన, 2 వాగ్గేయకారులు 3. పత్రికారంగం 4. విప్లవకళాకారులు-బాధ్యత (నాసర్) 5.నాటికలు, రమణారెడ్డి విరసం మేనిఫెస్టో ప్రకటించగా, నిఖిలేశ్వర్ ఆదాయ వ్యయ పట్టికలు సమర్పించారు. ఈ గోష్టి కూడా సాహిత్య విద్యార్థికి తీవ్రమైన అసంతృప్తి కలిగించింది.
కారణాలు :
1. నిర్దిష్టమైన అభిప్రాయాలు ప్రకటింపబడకపోవటం బహుశా లేవేమో!
2 తాము వాంఛించే విప్లవస్వరూపాన్ని, స్వభావాన్ని స్పష్టీకరించలేకపోవటం,
3. వక్తలెవరూ తమ ప్రసంగాలను గురించి ఆట్టే ఆలోచించినట్లు కనబడలేదు. Prepared Lectures కాకపోతే మానె, వక్తవ్యాంశాన్ని శ్రోత కొత్త
విషయాన్ని తెలుసుకున్నా నన్న అనుభూతి పొందేందుకూ, తద్వారా మానసిక పరివర్తనం జరిగేందుకు, సాహిత్యంపట్ల జాగృతబుద్ధి, యోచనా కలిగేందుకూ ఏమాత్రమూ తోడ్పడలేదీ గోష్ఠి ప్రసంగాలు. వట్టి Random lectures పిచ్చాపాటి మాటాడుకుంటున్నట్లుగా వున్నయ్. విప్లవరచనకి అభ్యుదయరచనకు తేడా ఏమిటి? ఎందుకు? అభ్యుదయోద్యమం ఎందుకు పనికి రాకుండా పోయింది? విప్లవోద్యమం యొక్క అధిక్యం, అవసరమూ ఆయా ప్రక్రియల్లో ఏమిటి? సాహిత్యపరంగా వీరాలోచిస్తున్న ఆశిస్తున్న విప్లవం ఏ రకంగా ఆచరణీయం? విప్లవం భాషలోనా, భావనలోనా, శిల్పంలోనా? వారికే ఆస్పష్టం!
ఇక ప్రాసంగికులు పరస్పర విభిన్నాభిప్రాయాలు
ప్రకటించారు. విప్లవ దృక్పథం ప్రకటించ గలిగే సాహసికులు ఒక్క నాజర్ (బుర్రకథ)! ఆయనకూడా – విప్లవోద్యమ నిర్వాహకుడి బాధ్యతను విప్లవ నిర్వహణనూ గురించి మాట్లాడాడే తప్ప సాహిత్యం వూ సెత్తలేదు. విప్లవ కళాకారుల ప్రజల్నిట్లా జాగృతులుగా చెయ్యాలి అన్న విషయాల్ని (కథా నాటక ప్రదర్శనమూ ఆధారంగా వివరించాడు. చేతికి కనీసం 500 రూ॥ల ఖరీదైన కంకణం ధరించిన నాజర్ వీటన్నిటినీ త్యాగంచేసి పక్క గూడే ల్లోకి వెళ్ళి విప్లవ జ్వాలల్ని మండించాలనడం వట్టి ప్రగల్భం, ఆమాయకపు జనాన్ని ముక్కువచ్చలారని బాలకుసుమాలని రెచ్చగొట్టటం తప్ప శుష్క ప్రేలాపన, మార్క జం పేరెత్తలేదు వీరు. శ్రీశ్రీ సినీ మార్క్సిజంను కొనియాడుతూ, ఆయన సామాన్యుడికి దూరమవడాన్ని, విప్లవం అనేదానికి, ఆయనకూ, ప్రస్తుతం పట్టక పోవడాన్ని క్షమించి నాయకత్వం కట్టి పెట్టారాయనకి. దీని కాయన లబ్ధప్రతిష్టు డవటం తప్ప వేరేకారణం కనపడదు. తన ప్రతిష్టను నిలుపుకోవడానికి ఆయన పడుతున్న తాపత్రయంలో ఈ నాయకత్వాన్ని అంగీకరించటం ఒకటి.
కథానికా రచన పై ప్రసంగానికి నిర్ణయించబడ్డవారు ఆవిషయంపై ప్రసంగించలేదు, సరికదా ఒక Genuine సందేహాన్ని వెలిబుచ్చారు. వేదిక పైకి వచ్చి, విప్లవ కథానిక లేక కథ స్వరూపం ఏమిటి? “కవి విప్లవం వర్ధిల్లాలి” అంటే చాలు కాని కథకుని స్వతంత్రం తక్కువ భాద్యత ఎక్కువ. అతను కథాకథనం ద్వారా, సంభాషణల ద్వారా పాత్ర పోషణ ద్వారా ఎందుకు విప్లవం అవసరమో, ఎట్టాంటి విప్లవం శరణ్యమో! పాఠకుడికి వివరించి, నచ్చచెప్పి, ఒప్పించి అందుకు వున్ముఖుణ్ణి చెయ్యాలిగదా! దీనికనుసరించాల్సిన విధం ఎట్లాంటింది. వాస్తవికత నెట్లా పోషించడం విప్లవ స్వరూప స్వభావాల్లేమిటి ? అని తన సంశయాన్ని అక్కడ కూర్చున్న పెద్దలు నివృత్తి చేయాలనీ కోరాడు. ఇది ప్రసంగం! అధ్యక్ష స్థానంలో వున్న కొ, కు. లేచి యిది ఐదు మాటల్లోగాని, ఐదు నిమిషాల్లో గానీ ఐదుగంటల్లో గానీ తేలే విషయం కాదనీ సమగ్రమైన దీనిపై అవసరమని చెపుతూ పాశ్చాత్య దేశాల కథకులు తామే పరిసరాలకూ స్థితికీ చెందిన విషయంలో రచన చేయదలచుకున్నారో దాన్ని స్వయంగా తెలుసుకుని అనుభవించి రాస్తారే తప్ప కేవలం పూహాకల్పితరచనలు, ఆవాస్తవికమైన రచనలు చెయ్యరు. అట్లానే విప్లవ రచయితలున్నూ సహజములు ప్రేరకములు అయిన రచనలు చెయ్యాలని అంటూండగా కె వి కల్పించుకుని సెంటిమెంట్స్ కన్నసామాజిక వాస్తవికత ప్రధానమని, వర్గ చైతన్యమూ, సంఘర్షణా ప్రధానంగా యితివృత్తమూ, పాత్ర పోషణమూ, సంఘటనల కల్పనా జరగాలని ఆదే విప్లవ కథానిక అవుతుందని అంటూ అయిదుగంటలూ, రోజులూ అవసరం లేదని ఈపాటికి సందేహం నివృత్తి అయే వుంటుందని అన్నారు. కొ.కు; కే. వీ, ఈవిషయం మీద స్పష్టంగా భేదించడం మాత్రమే కాక కె. వి. విరసం లాక్షణికుడిగా pose వేయడం ఒకటి.. విషయాన్ని అవగాహనకి దూరంగా తోసెయ్యడం రెండూ.. ఆధిక్య ప్రదర్శనం మూడూ జరిగాయే తప్ప సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. కొ. కు. సమాధానం సమగ్రం కాకపోయినా ఆ ప్రశ్నకీయవల్సిన సమాధానం విషయంలో ఆయనకున్న సంధిగ్ధ స్థితీ ఆశక్తతా స్పష్టం చేయడం.. ప్రశ్నలో తానూ పాలుపంచుకున్నట్టయింది. – బావుంది ఇక ప్రసంగం చెయ్యడానికి ఎటువంటి వారిని పిలవాలి ? పిలిచారూ? అనేది ముఖ్యంగా విడ్డూరం కలిగించే విషయం. శ్రోతలకి అస్పష్టంగా వున్న విషయాల్ని స్పష్టం చేసేందుకూ, తెలీని విషయాలు తెలిపేందుకూ, భావచైతన్యం రగుల్కొలిపేందుకూ ఏదైనా వ్యాసంగానీ, ప్రసంగంకాని కావాలి-వింటాం. యిక్కడ జరిగింది తద్భిన్నం. వక్త ఒక శ్రోతగా వేదికనెక్కి తన సందేహాన్ని వ్యక్తంచేసి కూడా సంతృప్తి కరమైన సమాధానాన్ని పొందలేకపోవడం – సాహిత్యాభిమానులకు నిరాశాజనకమైంది. ఐనా రుజువైన సందేహాన్ని కొ.కు. ఒప్పుకున్నారు సందేహం వ్యక్తం చేసినందుకు వక్తను అభినందించక తప్పదు.
నాటికలు :-
చవకబారు చేత సెంటిమెంట్లను ప్రోత్సహించే రేకెత్తించే నాటకాలకు బహుమతులు పుచ్చుకున్నా డొకాయన నాటక కళాపరిషత్తు పోటీలలో 1 కళ్ళు
1. . …………… రెండు బహుమతులు ఒకరే – చచ్చు రకం రచనలకు బహుమతులు పొందుడం గమనార్హం గర్హనీయం. అంటూ సోషలిస్టు విప్లవరచనలు పేద సాదల (నిమ్నతరగతి) జీవనానికి సంబంధించిన విధానాలనీ, విరసం అందుకు ఊతమిస్తుందని ప్రసంగం. పట్నాల్లోనూ, భవనాల్లోనూ మాత్రమే కాదు గుడిసెల్లోనూ గూడేల్లోనూ జీవితం వుంటుంది నిజమే. విప్లవమంటే చవకబారు నినాదాలూ, తిట్టులూ కాదు. ఒక సర్వసమగ్ర ఆదర్శానికై తపన వేదన, పోరాటమున్నూ ఈ ప్రాసంగికుని దాడి మారుతీరావు మీదా, ఆతని రచనలమీదా ! అయినా కేవలం మావోయిస్టు నినాదాల రాజకీయ ప్రచారాలు విప్లవరచనలు కాగలవా? అవి ఎంతవరకు ప్రజాజీవితాన్ని పరివర్తన చేయగలవ్ నేటి సామాజిక జీవితం ఎంతవరకు సెటిమెంట్లకు బాహిరంగా వుంది ! అన్న విషయాల్ని ఆలోచించినట్లు లేదు. మానవ జీవితంలోని ప్రతి గణనీయమైన మార్పూ మధ్యతరగతి సహకారం వల్లనే వచ్చిందన్న విషయాన్ని ప్రపంచ చరిత్ర చూస్తే తెలుస్తుంది. – వీరు విస్మరించారు, సెంటిమెంటు మానసికమైన నైసర్గిక బలహీనత. అది తొలగించబడాలని చెప్పడానికైనా దాన్ని ప్రవేశపెట్టక తప్పదు రచనల్లో, పేదసాదల బతుకుల్లో, ప్రేమ సానుభూతి, జాలి, వైరం వంటి సెంటిమెంటుల్లేవనే వీరభిప్రాయపడితే మనిషినీ, వాస్తవాన్ని వీరింకా అవగాహన చేసుకోలేదనే అనుకోవాలి.
వాగ్గేయకారులు
వీరొకే పాయింటు మీద పరిభ్రమణం చేస్తూ పూకదంపు వుపన్యాసం చేశారు-సంగీతమూ పాడారు.. వాగ్గేయకారులు అన్న అంశాన్ని వీరికిచ్చినవారు విషయ వైపుణ్యాన్నీ వక్త శక్తిని గమనించినట్టులేదు. కవుల రచనలకి ప్రజల కనుగుణమైన బాణీల నేర్పరచి ప్రచారం చేయాలి. విప్లవ భావాల్ననీ, నల్గురు అయిదుగురుంటేచాలు ఎంత ప్రచార మైనా చేయవచ్చని వీరి ప్రసంగ సారాంశం. హరిదానుడి మళ్లే పిష్టపేషణం చేశారే గాని ఆ ప్రయోజనం ఎక్కడ ఎట్లా సాధించబడింది, సాహిత్య స్వరూపం ఏమిటి — ప్రచారంవల్ల ఎంత ప్రయోజనం సాధించబడగలదు ? అనే విషయాల్లో వీరు స్పష్ట మైన వుదాహరణగానీ, నిదర్శనం గానీ, చూపలేదు. వాగ్గేయకారులంటే పాపం! వీరికి తెలియదని ప్రసంగం విన్నాకగానీ తెలీలేదు. ప్రచారం, బాణీలు అనే సరికల్లా విరసంవారు గుర్తించే పాటలూ లయలూ పునఃప్రవేశించే ప్రమాదాన్ని ఆజలోకి తీసుకో లేదు వీరు.
విరసం: పత్రికలు
ఇందుకు నియోగింపబడ్డ వక్త పది హేనేళ్ళుగా పత్రికారంగంలో పనిచేస్తూ నేటికీ 1. పత్రికలు ప్రజా ప్రయోజనాల కోసం పుట్టినవి కావనీ 2 అవిస్వార్షపరుల లాభార్జన కోసం పుట్టినవనీ. 3. అందులో నిష్పక్షపాత వైఖరి మృగ్యమనీ. 4.తప్పుడు అబద్ధాలకోరు సమాచారాలు తప్ప వాస్తవ వార్తలుండవనీ 5. ఇవి ప్రజలనూ, ప్రజాభిప్రాయాల్ని వక్రమార్గం పట్టిస్తున్నాయని తెలుసుకోగలిగిన పత్రికా రచయిత. పత్రికారంగం స్వార్థపరుల లాభాలకూ, ప్రభుత్వానికి డబ్బా కొట్టేందుకు మాత్రమేగాని ప్రజాప్రయోజనం విషయంలో అజాదళ స్తనం వంటిదని కొ. కు. సమర్థించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏవైనా యింతేనని, మూక వుమ్మడిగా పత్రికలన్నిటి మీద దుమ్మెత్తి పోశారు. అక్కడున్న రచయితల్లో ఎవరు పత్రికల వల్ల ప్రయోజనం పొందనివారు ? పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించనిమాట నిజమే; కొన్ని లెఫ్టుకి కొన్ని రైటుకు జరిగాయి. ఎవరిధోరణి కనుకూలంగా వారు బాకా లూదుతున్నారు. సహజమే. విరసం వారి ఈ మహా సభల పద్దతీ, ధోరణి కూడా తమ భావాల ప్రకటనకూ, ప్రచారానికి అన్న విషయం విస్మరించరానిది ప్రజాస్వామ్యం అయింది. భావప్రకటన స్వాతంత్ర్యం మనకి మళ్లేనే అందరికి వుంది. పోనీ యిందుకు వీరు సూచించిన పరిష్కృతి ఏమన్నా వుందా? అదీ లేదు. కేవలం దులపడం, వ్యవస్థా విచ్చిన్నం విప్లవం అని వీరు భావిస్తున్నట్లుంది. అది తప్పు, కేవలం భ్రమ!
సాహిత్యగోష్టి, అనంతరము తేలిన విషయాలు :
1.
ప్రస్తుత వ్యవస్థ విచ్ఛిత్తి కావాలి. అందుకు విప్లవమే శరణ్యం అభ్యుదయోద్యమం కన్న విప్లవమార్గ ఆధిక్యత ఏమిటి? ఎవరూ చెప్పలేదు; సాహిత్యపరంగా ఎటువంటి విప్లవాన్ని లక్ష్యిస్తున్నారు ??
2. రాజకీయ సభలకి సాహిత్య సభలకి తేడాలేదు. ఇదే విప్లవం అన్నప్పుడు ‘విరసం’ అని ఎందుకూ, “వికాసం” అని వుండొచ్చుగా (విప్లవకారుల సంఘం)
3. వక్తలకు మార్క్సిజం గానీ సాహిత్యంగానీ తాము మాట్లాడాల్సిన విషయం గానీ స్పష్టంగా తెలీవు.
4. అభ్యుదయోద్యమం మీద దండెత్తదలచుకున్న మనోవికలులు ఒకరిద్దరు వృద్ధుల్ని ముందుంచుకుని ఆడుతున్న నాటక ప్రదర్శనం ఈ సభలు.
ఆరోజు 9.10.1970 సాయంత్రం విరసంవారు నినాదాల బోర్డులు పుచ్చుకుని శ్రీ శ్రీ, కొ.కు. లతో వూరేగింపు జరిపారు. ఖమ్మం వూళ్ళో, ఇది ప్రజల్లోకి చొచ్చుకు పోవట మని వారి అభిప్రాయం కావచ్చు కాని, చవకరంగా, నమ్మే ప్రదర్శనంగా దీన్ని Feel అయ్యారు జనం. రచయిత అంటే వున్న లేక వుండాల్సిన గౌరవాన్ని పోగొట్టింది. అవి లేనప్పుడు రచయిత జనానికి సంబోధించేదీ, పరివర్తించేది లేదని గమనించాలి. సాయంత్రం 6 గం॥లకు బహిరంగసభ జరిగింది. అందులో ప్రసంగించింది. శ్రీశ్రీ, కు.కు.; కె.వి; రావిశాస్త్రి; జ్వాలాముఖీ, నాజరు రాత్రి బుర్రకథ చెప్పారు. మనుషులందరూ ప్రాథమికంగా ఒకటేననీ, తాను అంతర్జాతీయ వాదిననీ విశ్వనాథ వంటి దుర్విమర్శకులు అంతటా వున్నారని శ్రీశ్రీ అన్నారు. మొదట్లో విశ్వనాథ; కృష్ణ శాస్త్రి తనమీద ప్రభావం చూపారని ఆ రోజుల్లో వారి కవిత గొప్ప వుత్తేజాన్ని కలిగిస్తూం డేదనీ; మహాప్రస్థానంలోని చాలా కవితలు తాను మార్క్సిజం తెలుసుకోకముందే రాశాననీ, తరవాతి మార్క్సిజం తనని ప్రభావితం చేసిందని, రష్యన్ మహాకవి మయ కొనిస్కి; స్విస్ బర్న్ కవితలు తనను వుత్తేజితుడ్ని ప్రభావితుడ్ని చేసినవని, విశ్వనాధ తమను సాహిత్య నక్సలైట్స్ అంటున్నారనీ అందుకు వెరపడం లేదని భగవంతు డున్నాడనుకోవడం కంటె లేడనుకోవడం వల్ల స్వశక్తిమీద విశ్వాసం పెరిగి వ్యక్తి తన బాధ్యత మరవడం జరగదనీ, సినిమా పరిశ్రమవల్ల తాను లాభపడా నను కోవడం పొరపాటనీ, తనను సినిమాపరిశ్రమ Expliot చేస్తున్నదని, నిర్మాతలలో నగం యిచ్చినవారూ, అసలే యివ్వనివారు, పూరికే రాయించుకున్న వారూ తప్ప.. నిర్మాత సంపాదించే లాభంలో రూపాయికి పైసచొ॥న కూడా రచయితగా తాను పొంద టం లేదనీ, తాను పెట్టుబడిదారీ వలయం నించి విముక్తుణ్ణి అయేందుకు తపన చెందు తున్నాననీ శ్రీ శ్రీ అన్నారు. భగవంతుడి విషయంలో కిమల్లె మార్క్సిజంపట్ల కూడా శ్రీశ్రీ నందిగ్ధ మనస్కుడు. అందుకే ఒక సకలాతీతశక్తి వున్నట్టా ? లేనట్టా అనేది యిప్పటికీ వీడని చిక్కు సమస్య ఆయనకు. కవిత్వంలో కూడా కార్టూన్ సర్రియలిస్ట్ కవితలమీద ఆయనకు వెర్రి వ్యామోహం. శబ్దమూ దాని ధ్వనీ ఆయన నూగిస్తాయి. ఆయన ఈ మధ్య వ్రాస్తున్న లిమరిక్కులూ, సర్రియలిస్టు కవితలూ, ప్రాసక్రీడలూ, నిష్ప్రయోజనకరమైన గారడీలు, బపూనరీ ఫిట్లూనూ.. మార్క్సిస్టు ఈ పనిచేయడు. అందుకే జ్వాలాముఖి పిడికిలి బిగించి (ఆ మద్యనొక ఇంటర్వ్యూ సందర్భంగా మీకు మార్క్సిజం తెలీదు. అన్న ప్పుడు ఆయన బేలమొఖం వేసి అవునని వప్పుకోవడం జరిగింది. మార్క్సిజంలోని Dialectical materialiemo Thesis. Antithesis: Synthesis ఉన్నవి. ఆయనను ధ్వనినిబట్టి ఆకర్షించినవనడం తప్పేం కాదు. వర్ణనహిత సమాజం లోని వర్గచైతన్యం (వర్గవిభజన] Thesis అనీ, వర్గసంఘర్షణ Antethesis అనీ, తత్పరిణామంగా ఏర్పడే వర్గరహిత సమాజం Synthesis అనే ఆయన వివరణకైతే పూనుకున్నారు, కౌకు, . “Daత Capital” చదివాకను, Marxism తెలుసుకున్నాకనూ తను ప్రయోజన్నా నెరిగి రాయటం జరిగిందని అంతవరకూ రచ నకు ప్రయోజనం వుంటుందనే ఆలోచన తనకి లేదనీ, కి॥శే ॥ గోపీచంద్ తన్నం దుకు ప్రోత్సహించారని, కథానికా రచన సామాజిక వాస్తవికతను ప్రతిబింబించాలని చెప్పారు. మార్క్సిస్టు రచనా స్వరూపం వివరించలేదు, రావిశాస్త్రి. ‘పిపీలికం’ * మధ్యవచ్చిన గొప్ప కథ అన్నారు. విప్లవం పూసే ఎత్తలేదు వీరు.
రావిశాస్త్రి తమ ప్రసంగంలో యిప్పటివరకు తానేది రచన చేసుకుంటూ పోవడమే గాని ఆనేక నిర్ధిష్ట లక్ష్యముతో చెయ్యలేదనీ, యిప్పుడిప్పుడే మితృలవల్ల Marx ను గురించి తెలుసుకుని అది ప్రయోజనకారి అని గ్రహించి విరసంలో విప్లవము దాన్ని ప్రోత్సహించే రచనలూ అవసరమని, పాపభీతిలేనివాడే బాగుపడటం మనం చూస్తున్నామని, దోపిడి సమాజాన్నెదిరించాలనీ, దేముడు ఒకర్నొకరు దోచుకోవడం కోసం మసల్ని సృష్టించలేదనీ; మున్ముందు విప్లవ దృక్పథంతో రచనలు చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. భగవంతుడిపట్ల విశ్వాసంవుంది. వీరికి, మార్క్సిజం యింతకు ముందు తెలియదు. ఇప్పుడే తెలుసుకున్న మార్క్సిజం భగ వంతుడిపట్ల నమ్మకానికి పడనిది. మార్క్సిజం తెలీదు కనుక తత్సబంధమైన విప్లవ పరిజ్నానం లేదనుకోవటం అసహజంకాదు (విరసం’ సభలలోనే వీరు మార్క్సిజం తెలుసుకున్నా ననడం విడ్డూరంగానూ, అసహజం గా కనిపిస్తూ వున్నది. విశ్వనాధశాస్త్రి వంటి ప్రఖ్యాతుడైన రచయిత విషయంలో ఇది నమ్మరాని విషయం, క్షంతవ్యం కానిదిన్ని. ఆఖరి వక్త జ్వాలాముఖి. ఈ సంఘం ఆయన చేతులమీదగానే నడుస్తుండటం గమ నార్హం. దిగంబర కవుల్లో ప్రసిద్ధుడీయన ఇజాలన్నిటినీ ద్వేషించిన నిజమైన మనిషి కోసం తపన జెంది కలలు కని అసభ్యమూ, అశ్లీలమూ అయిన భావ పదజాలాన్ని ప్రయోగించి, కసిని వెళ్ళగక్కడమే కవితగా వుద్యమంగా నడిపిన కసిపట్టిన చక్షుశ్రువులుగా పేర్కొంది, అ తిట్టు కవితోద్యమాన్ని విరమించి విరసంలో దిగంబరోద్యమాన్ని సమ్మిళితం చేశామని వ్యక్తీకరించారు. జ్వాలాముఖి. ఆయన భావాలతో ముడిపెట్టు కోకుంటే చక్కని వక్త. వేగమూ, ఆవేశమూ, ధారాళమైన వాక్శుద్ధి అన్నీవున్నవారు. ఏభావానికి, నిజానికి బానిసగానీ; ఏ నియమాలకు కట్టుబడని స్వచ్చమైన స్వేచ్చగలి గిన మనిషిని మావోయిజం ఆవిష్కరిస్తుందా ? ఇది యిజానికి బానిసత్వం కాదా ? తాను మావోయిస్టునన్నాడు జ్వాలాముఖి – ఇది నిజం మనయింట్లో నిప్పులేనప్పుడు పక్కయింటినుండి తెచ్చి పొయ్యి రాజేసుకుని వంటచేసుకోమా ? అని ప్రశ్నిస్తూ ఆయుధాలు, ఆహారమూ ఆర్ధిక సాంకేతిక సహాయాలు పొందుతూన్న మనం సాంస్కృ తిక సహాయం విదేశాలనుండి ఎందుకు పొందరాదు ? అంటూ మావోయిజంపై తమకు గల అభిమానాన్ని సమర్థించుకున్నారు. మావోయిజం మార్క్సిజం యొక్క విపరిణామం. చైనా సాంస్కృతిక విప్లవం ఆవిషయాన్ని చూపింది. మాదే సూక్తులు వేదాలు గా, ఆయన్నో దార్శనికుడిగా, మార్క్సిజం సంస్కర్తగా ఆరా ధిస్తున్న ఈ మావో కాగే వరులకు నక్సలైట్లమని ఒప్పుకోవడానికి ధైర్యం లేదు. నక్సలైట్లూ తామూ మావో భక్తులే – ఒకే గురుత్వమూ, ఆదర్శమున్నూ – ఒక పిరికి తనం మినహాయిస్తే, కానీ విశ్వనాధ అన్నట్లు తాము నక్సలైట్లమైతే విశ్వనాధ తల కృష్ష్ణ కాలవలో తేలేదని ప్రగల్భించారు. విశ్వనాధ తలను కృష్ణలో తేల్చే మీ సంస్కా రం ఏపాటిది? ఇక వీరి దేశికత్వాన్ని అనుకరించేవారేపాటివారు? ఇక వీరు నక్స లైటుకాక మరెవరు? ముఖ్యమంత్రి వెంగళ్రావ్ ఏమీ చేయలేదన్నారు – మరెందుకూ ఆ భయం, ఉలికిపాటు, పిరికితనాన్ని వాక్ శౌర్యంతో కప్పుకోవడం ఎందుకూ?. ” గాంధి ప్రజాశతువు” అనటానికి సాహసిస్తున్నామన్నారు. జాతిని ఆయన నిర్వీర్యం చేశా డనీ, ధనవంతులకి వారి పీడనకి పేదలను బలి పెట్టి వారి దయాదాక్షిణ్యాల అడుగున బతకడమే సర్వోదయం అని హేళన చేశారు. ఇదే గాంధిజీని విప్లవవాది. (తన మేరలో తాను) శ్రీశ్రీ ఆంగీకరించారు! ఆరుద్ర జంధ్యాలు తెంచుకున్నా., గొంతుచించుకున్నా, వినోబా ఒంటిపూట భోజనమైనా ప్రయోజనహీనులన్నారు., జవహర్లాల్ దేశాన్ని ఆశక్తమూ, చేవలేనితనమూతో నింపి దేశభక్తి వంటి కొజ్జా నినాదాలు లేపారన్నారు. ఇదంతా నక్సలిజం కాక మరేమిటి? ఎందుకు నిజాయితీతో నిర్భీతితో అంగీకరించలేరు? సాయుధ పోరాటముతప్ప మార్గాంతరం లేదనుట ఏ యిజం?
సభలు ముగిసిన తర్వాత తేలిన విషయాలు, జిజ్ఞాసువైన శ్రోతకి
1. విరసం మూడు రకాల భావాల కూటమి ఒకటి అరసంలో యిమిడలేక కొత్తదారి వెయ్యనూ లేక అసహాయులుగా నామమాత్ర నాయకత్వం స్వీకరించిన శ్రీశ్రీ; కొ.కు. కె.వి; రావిశాస్త్రి, వగైరా కొత్త సీసాలో పాతమందు నింపి జనాన్ని భ్రమపెట్ట చూస్తున్నారు వీరు.
రెండు దిగంబరులు తమ వుద్యమాన్ని వుపసంహరించుకుని మావోయిస్టు నినాదాలతో బయలుదేరి యిందుజేరిన సాహిత్య నక్సలైట్లు – లేక నక్స లైట్ సాహిత్యకారులు.
మూడు సాహిత్యంలో భావ తీక్ష్ణతను వాంఛిస్తూ, భావవిప్లవానికై ఉవ్విళ్ళురుతూ తమ ఆదర్శాన్ని తామే స్పష్టంగా తేల్చుకోలేని ఔత్సాహిక రచయి తలూ కవులు.. వీరివి మారుతున్న భావ వాహినులు, అరసంమీద పూర్తి అసంతృప్తీ లేదు. విరసం వీరికి పూర్తిగా అభిమాన పాత్రమూ కాదు. మార్పుకోరే వర్గంవారు నక్సలైట్స్ గానీ, దిగంబరులు కానేగారు.
2. Left Communistsచే ప్రోత్సహించబడుతున్న ప్రో మావోయిస్టు భావాలు ఈ వుద్యమానికి వెన్నెముక. ఈ నానాజాతి సమితిలో ఈ భిన్న కూటముల పొత్తు ఎంత కాలమో సాగదు. సమావేశాల్లోనే అభిప్రాయ భేదాలు పొడసూపినయ్, నిజాయితీ స్థానాన్ని నినాదమూ, సాహిత్యం స్థానాన్ని చెత్తరకం Statements, ప్రగతి స్థానాన్ని అధోగతీ.. ఆక్రమించుకున్నాయ్ !
3. సాయుధ పోరాటమే విముక్తి కలిగిస్తుందని భావించేవారికి కావలసిన ధైర్యం వీరికి లేదు. శుష్క ప్రేలాపనలు ; తిట్టటమూ, కసిత్వమూ కవిత్వం కాదు. జుగుప్సనూ భీతిని కలిగించే రచనా, రచయిత నమాజానికి దూరము కాక తప్పదు.
4, మార్క్సిజం పట్ల వీరి అభిప్రాయాలు భిన్నాలు. మార్క్సిస్టు కానివాడు అభ్యుదయ రచయిత కాడన్న శ్రీ శ్రీ మార్క్సిస్టేనా ఆసలు ?!.
5 గాంధి ప్రజా శతృవైననాడు వీరు ప్రజాద్రోహులూ వంచకులూ, ఆ నిజాయితీ, లక్ష్యశుద్ధి, త్యాగశీలత, వాగాడంబరత సభల్లో ద్యోతకమవుతూనే వుంది. ప్రగల్భాలు క్రియాశీలతను చూపవు. మొరిగే కుక్కలు కరవ్వు.
6. వేషాల మార్చినంత మాత్రాన అసలు మనిషి మారనట్టే, నినాదాలూ, సంఘాలు మార్చినంత మాత్రాన ప్రకృతిలో మార్పు గానీ, పరిగణనగానీ, విప్లవంగాని రావు.

కళాకేళి పత్రిక (1971  మార్చి సంచిక నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *