విశ్వనాథ – చలం నవలలలో స్త్రీ పాత్రలు

కోవెల సుప్రసన్నాచార్య

తెలుగు సాహిత్యంలో వీరేశలింగం గారితో ప్రారంభమైన సంస్కరణ వాదం వర్ణభేద నిరాసము, అస్పృశ్యతా నివారణ, బాల్య వృద్ధ వివాహ నిరోధము, వితంతు వివాహము, న్ర్తీ విద్య మొదలైన అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. సంస్కరణ వాదంతోనూ జతగా రూపుకట్టిన స్వాతంత్రోద్యమం ప్రబలమైంది. క్రమంగా సంస్కరణలు అంగీకృతా లౌతూవచ్చాయి. మార్పు పొందిన జీవనశైలి సాహిత్యంలో రూపుకట్టుతూ వచ్చి ఆధునిక సాహిత్యంగా నూతన వైఖరికి కారణమయింది.
సంస్కరణ వాదం క్రమంగా త్రోవ తీనిన జాతీయోద్యమంలో విద్యావతులైన న్ర్తీల భాగస్వామ్యం పెరిగింది. బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టి యువతీయువకుల వివాహాల వల్ల వివాహ వ్యవస్థలో ప్రేమ వివాహాలు, గాంధర్వ వివాహాలు ఎక్కువయ్యాయి. నూతన వ్యక్తిత్వం ఏర్పరచుకొన్న న్ర్తీ పురుషలు వివాహంలో తమ ఇష్టానిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అప్పటిదాకా వచ్చిన కుటుంబం నిర్ణయించే వివాహధోరణికీ, స్వయం నిర్ణయంతో ఏర్పరచుకున్న వైవాహిక న్థితికీ, ఘర్షణ ప్రారంభం అయింది0 అధికారం, పరంపర, విశ్వాసం ఇవన్నీ నూతన న్థితిని, ేన్వచ్ఛా భావాన్నీ ప్రశ్నించటంతో, విరోధించటంతో వైమనస్యాలు పెరిగిపోయాయి.
ఈ న్థితిలో సమాజ వ్యవస్థ ెుుక్క క్షేమానికీ, దాని ప్రాథమిక రూపమైన ‘దంపతి’ భావానికీ క్షతి కలుగకుండా వివాహ వ్యవస్థలో పరస్పర విశ్వాసానికీ, అనురాగానికీ, సమర్పణకూ, ఆరాధనకూ అవకాశమిచ్చే రీతిలో దాని పరిమితులను విస్తరించి మౌలికమైన కట్టుబాటులకూ మౌఢ్యానికీ ఆలవాలమై రాజ్యవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సమాజము ఆ వ్యవస్థలో ఏ మార్పునూ అంగీకరించని ఒకానొక విపరీత మనోలక్షణంలో మొత్తం వివాహాన్నే కాదనేంత తీవ్ర చిత్తంతో ప్రవర్తించటం మరోవైపుగా ఉన్న న్థితి.
అప్పటికీ న్ర్తీ పురుష సంబంధాలను విశ్లేషణ చేస్తూ కాల్పనికోద్యమం – కవిత్వంలో ప్రేమ ప్రాధాన్యాన్ని, ప్రాథమ్యాన్నీ నొక్కిచెప్పుతూ పవిత్ర ప్రణయ సాధనకు ఒక ఆదర్శాన్ని – ఊహా ప్రేయనిగా నిలబెట్టుతూ వచ్చింది. న్ర్తీ పురుషల మధ్య వివాహ వివాహేతరంగా ేన్నహరూపంగా అమలినంగా ప్రేమ ఉండవలెననీ, అది అమలినమనీ రాయప్రోలు తమ కావ్యాలలో ప్రతిపాదించారు. ఈ అమలిన ప్రేమభావం రాధాకృష్ణ తత్త్వంగా, గోపికా సాధనగా కూడా ప్రతిఫలించింది.
అప్పటికే న్ర్తీ పురుషల జీవితాన్ని నీతి నియమాలో, ధర్మమో కాకుండా ధనము శానించటం వలన కన్యాశుల్కము, వరశుల్కము వంటి దురాచారాలు ఉన్నాయి. కన్యాశుల్కము తగ్గిపోయి వరశుల్కము ప్రాధాన్యము వహించింది. రాయప్రోలువారి ేన్నహలతాదేవి లేఖ ఈ అంశాన్నే ముందుకు తెచ్చింది.
మధ్యయుగాలలో ప్రబలిన న్ర్తీ నీచభావనను తిరస్కరించే ధోరణి 20 శతాబ్దపు ఆరంభానికే ప్రకటితమవుతున్నది. కొమఱ్ఱాజు అచ్చమాంబ 1903లోనే – శ్రీ వివేకానందులు దేహాన్ని పరిత్యజించిన సంవత్సరం – తమ కథలలో ఇలా వ్రానినారు. ‘నేను పెండ్లాడిన భార్యను కాని దానిని కాదు. వివాహమాడుటవలన భర్తకు దానినగుదునా ఏమి? గృహయజమానురాలిగా ఎంచి మన్నించి ప్రేమించవలయును… మా వంటి పత్నులు పురుషల అహంభావము నెంత మాత్రమును సహింపజాలరు’. ఈ భావన క్రమంగా అభివృద్ధి పొంది ప్రకటితం కావటానికి దాదాపు ఇరవై యేళ్ళు పట్టింది.
గుడిపాటి వేంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ ఇంచుమించుగా రెండు సంవత్సరాల వ్యవధిలో జన్మించి ఆంధ్ర సాహిత్యాన్ని ఆవరించిన మహారచయితలు. విశ్వనాథ సత్యనారాయణ విద్యాభ్యాసమునకు ఎదుగుదలకు మచిలీపట్టణం స్థానం. జాతీయోద్యమానికీ, జాతీయ విద్యావ్యాప్తికీ, కృష్ణా పత్రికకూ, చెళ్లపిళ్ల వేంకటశాన్ర్తి, హరి నాగభూషణం, కానుకొలను త్రివిక్రమరామారావు గారలకు మచిలీపట్టణం స్థానం. గుడిపాటి వేంకటాచలం పుట్టి పెరిగింది తెనాలిలో అయినా, మాననికంగా ఎదిగింది కాకినాడలో. రఘుపతి వేంకటరత్నం నాయుడు – బ్రహ్మసమాజము, సంస్కరణ వాదము ప్రధానంగా ఆయనను ప్రభావితం చేనిన అంశాలు. దేవులపల్లి కృష్ణశాన్ర్తి ఆయన సహపాఠి.
బందరులో వెలువడిన కృష్ణాపత్రికలో నాదెళ్ల పురుషోత్తమకవి రచించిన ‘న్ర్తీల మీటింగు నాటి హరికథా నాటకము’ అనే గ్రంథాన్ని గురించి 1908లో తుచ్ఛగ్రంథము అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది. ఈ గ్రంథం న్ర్తీలను కించపరచే విధంగా రాయడం వలన దీనిని నిర్మూలించి గ్రంథకర్తకు ధర్మశా రీత్యా తగు ప్రాయశ్చిత్తము విధించాలని ఆ జిల్లా కలెక్టర్‌గారికి, చెన్నపురి దొరతనము వారికి, ప్రధాన కార్యదర్శికి, బందరు పురప్రముఖులు శ్రీయుతులు వల్లూరు సూర్యనారాయణరావు, భోగరాజు పట్టాభి నీతారామయ్య, కోవల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు, చెళ్లపిళ్ల వేంకట (శాన్ర్తి) శతావధాని ……… తదితరులు ఒక తీర్మానం చేశారు. (జండర్ స్పృహ – ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు – సంపా. కాత్యాయనీ విద్మహే (1905) పే.148) ఇక్కడ గమనించవలనిన విషయం న్ర్తీలను కించపరచే విధంగా రానిన రచనలను తిరస్కరించి నిషేధించమని కోరిక వాళ్లలో చెళ్లపిళ్లవారితో పాటు బందరు పురప్రముఖు లందరూ ఉన్నారు. చెళ్లపిళ్లవారు విశ్వనాథకు గురువులు. మచిలీపట్నం జాతీయ పునరుజ్జీవనోద్యమ స్థానం. కాకినాడ సంస్కరణోద్యమ కేంద్రం.
ఏ రచయిత చైతన్యాన్నైనా మూర్తి కట్టించే అంశాలలో అతని విద్య, సంస్కారాలు, వైయక్తిక పారివారిక సామాజిక అనుభవాలు, దేశకాలాలు, చుట్టూ పరిక్రమించే పరిభ్రమించే వ్యక్తులు వారి వారి భావనా సంపుటి ముఖ్యమైనవి. ప్రతి రచయితకూ అతని వికాసానికీ, విశ్వజనీన చైతన్యం పొందటానికీ ఇవన్నీ కారణాలే అవుతవి. కొంతలో కొంత పరిమితులు విధిస్తవి. ఏ వ్యక్తీ పైన పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా స్వయంభువుగా ఏర్పడడు. ఈ సూత్రాన్ని విస్మరించి తమ ఇష్టానిష్టాల ఆధారం మీద నిర్ణయాలు చేేన విమర్శకుల ధోరణి అపసవ్య ధోరణికి చెందింది. సత్యస్పృహ లేకుండా రాగద్వేషాల పరిమితిలో సాగిపోయేది.
సాహిత్య నిర్మాణంలో ప్రతిభావంతులైన రచయితంలదరిలోనూ జాగ్రద్దశ ఎంత ప్రాథమ్యం వహిస్తుందో, అంతకు మించి అతని అవచేతన, సుప్తచేతన, సమష్టి అవచేతనలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఎంతటివాడిలోనూ తను భావించి నిర్మించుకొన్న విధం కథా నిర్మాణంలో, సన్నివేశాల కల్పనలో పాత్రలను రూపొందించటంలో ప్రతిఫలించదు. అవచేతనాదులు ఎక్కడో సందు చేసుకొని తమ స్పందనలను ఆవిష్కరించుతాయి. విశ్వనాథ సత్యనారాయణ రచనావేళ తన మనోలక్షణాన్ని గురించి ఇలా వివరించాడు –
‘నేను రచన చేేనప్పుడు ప్రయోగించవలనిన కథాక్రమం గురించి కానీ, శైలిని గురించి కానీ, కళను గురించి కానీ ఆలోచించను. ఇతివృత్తం ఉన్నది. ప్రారంభం చేస్తాను. భాష, కథాక్రమం, అభివ్యక్తి, కవిత్వాంశ ఇవన్నీ వాటంతట అవే చేరుకుంటాయి. దాంతో ఇక్కడ ఒక రచన ఏర్పడి ఉంటుంది. సామాన్యంగా నేను (వచనమైతే) రాయించటంగానీ, పద్యమైతే అల్లటం కానీ భిన్నభిన్న కాలాలలో చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా రచన గురించి ఏం రాయాలో అని ఆలోచిస్తాను. ఏదో ఒక భావం వస్తుంది. రచనావేళలో అది అలా రానే రాదు. నేను రచనను చెప్పేప్పుడు – ఆ సమయం భాషను, కథాక్రమాన్నీ, కళనూ, శిల్పాన్నీ తను ఎన్నుకొంటుంది. నా రచనా ప్రపంచంలో కానవచ్చే శిల్పాదికం అంతా ముందు నేను ఆలోచించి పెట్టుకున్నది కాదు. నా రచనలో ప్రతి అక్షరమూ సహజోద్గమం. పెల్లుబికి వచ్చే మనస్సు ఉద్విగ్నన్థితిలోంచి వచ్చిందే. నన్ను ఆ న్థితిలోకి అది ప్రవేశింపజేస్తుంది. ఈ మనఃన్థితిని విశ్లేషించటానికి ప్రయతిే్నన్త నాకు అది సాధ్యం కాదు. నాకు నాకే ఆ న్థితి ఆశ్చర్యంగా ఉంటుంది’ (విశ్వనాథ అసంకలిత సాహిత్యం – ఉపన్యాసాలు ఇంటర్వ్యూలు – 2వ భాగం – పు.207).
ఒక విధంగా 20వ శతాబ్దపు మొదటి పాతిక సంవత్సరాలు భారతీయ వివాహ వ్యవస్థను పరీక్షకు పెట్టిన కాలం రచయితలందరూ అంతో ఇంతో ఈ దిశలో స్పందించక తప్పలేదు. గుడిపాటి వేంకటాచలం (చలం) ప్రకటించిన ప్రణయ పారమ్యం విశ్వనాథ ప్రకటించిన కులపాలికా ప్రణయం రెండూ భిన్నభిన్న దిశల నుంచి వచ్చిన ప్రతిక్రియా రూపాలు. ఒకటి సహజోద్వేగాలకు సంబంధించింది – రెండవది సామాజిక సున్థితికీ, పురోగతికీ సంబంధించింది.
విశ్వనాథ, చలం ఇద్దరిదీ ఉద్విగ్న స్వభావం. ఒకటి ఎన్ని మార్పులకు లోనైనా పరంపరను రక్షించుకోవాలన్న భావం గలది. రెండవది ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎదురుదెబ్బలు తగిలినా పరంపరను విచ్ఛేదం చేనినా వ్యకిే్తన్వచ్ఛను రక్షించాలనేది. ఒకరిది వాస్తవ ప్రపంచం, వేరొకరిది భావుక సౌందర్య ప్రపంచం. ఒకటి బాధ్యత, వేరొకటి అనుభవం. ఒకరు మహోత్తుంగ తరంగాలతో ఉద్విగ్నంగా పొంగులెత్తే మహా సముద్రం. రెండవవారు ఉన్నత శిఖరాల నుంచి అతి వేగంగా దూకిపడే జలపాతం. సముద్రం చెలియలికట్ట దాటదు. జలపాతం నేలమీద నెమ్మదిగా సాగిపోక తప్పదు. ఒకరు సర్వకవితా (సాహిత్య) సంభారాన్ని శ్రీరామచంద్రునికి సమర్పింపగా, మరొకరు తమ సర్వచైతన్యాన్నీ భగవాన్ రమణమహర్షి పాదాలయందు సంలీనం చేశారు.
చలం సాహిత్యం ముఖ్యంగా నవలలు – శశిరేఖ, దైవమిచ్చిన భార్య, మైదానం, అరుణ, జీవితాదర్శం, కథలు, నాటకాలు ఇంకా ఇతర సాహిత్యం అంతా న్ర్తీ అనే భావం చుట్టూ అల్లుకొన్నది. శశిరేఖలో అంటాడు – ‘న్ర్తీ పురుషని తన శక్తిచే యాజ్ఞయందుంచుకొనవలయును. లేదా పురుషడామెను నీచముగా లోబరచుకొనును. అందువలన న్ర్తీ పురుషలు ప్రతి విషయమున సమానులైన గానీ ప్రేమయుండదు. ఒకరిపై నొక రాధారపడిరా ఆ ప్రేమ నశించునదే. (శశిరేఖ-పే.71). ఇందులోనే చలం పెళ్లి న్ర్తీ పురుషలను ఆజన్మాంతం కట్టిపడేేనదిగా వుండే యాంత్రిక వ్యవస్థ కాగూడదనీ, ఎవరి అధికారం కిందా ఉండకుండా న్ర్తీ స్వతంత్రంగా ఉండవచ్చును అని అభిప్రాయపడుతారు. ప్రస్తుత సామాజిక సంబంధాలలో ేన్వచ్ఛాయుత ప్రేమపూరిత న్ర్తీ పురుష సంబంధాలకు స్థానం ఉండదు. అది సముద్రంలో చేపను ఎంతగా ప్రేమించినా నేలమీద సుఖపెట్టలేము అని తేలుస్తారు చలం.
శశిరేఖలో శశిరేఖయైనా, మైదానంలో రాజేశ్వరియైనా, మరొక పాత్రయైనా చలం కథాక్రమం వివాహవ్యవస్థను విచ్ఛేదించటంతో ప్రారంభం అవుతుంది. తరువాత ప్రేమించి న్వీకరించిన పురుషని వద్దనైనా ఆగిపోదు. ఆమె ప్రేమ చంచలమే. అక్కడనుంచి మరో పురుషడు, మరో పురుషడుగా సాగుతుంది. చివరకు ఆత్మహత్య దాకా కొనసాగి నవల పూర్తవుతుంది. వ్యవస్థ భేదించినప్పుడు ఏర్పరచవలనిన మరొక ప్రత్యామ్నాయ వ్యవస్థను గురించి చలం ఆలోచించలేదు. శశిరేఖలో కృష్ణడు, తరువాత సుందరరావు, రామారావులు ఎక్కడా తాను కోరుకున్న ేన్వచ్ఛ లభించక ఆత్మహత్య చేసుకుంటుంది. మైదానంలో రాజేశ్వరి కూడా అమీర్‌తో లేచివచ్చినా, అక్కడ నిలుకడలేదు. మనస్సు మీరా మీదకు పోతుంది. చివరకు ఆత్మహత్యకు దారితీస్తుంది. ఈ నిలుకడ లేనితనాన్ని చలం ఇలా సమర్థిస్తాడు. ప్రేమకు జీవలక్షణం ఉంటుంది. కనుక అది ఎప్పుడూ పెరుగుతూ వుంటుంది. అందువల్లనే చంచలంగా కనబడుతుంది. ేన్వచ్ఛ లేకపోతే ప్రేమ చచ్చిపోతుంది అని భావిస్తాడు.
అయితే చలం నవలలోని, కథలలోని భావనలు సమాజం అంగీకారం పొందలేదు. కాకపోతే న్ర్తీ పురుష సంబంధాలలో సాంప్రదాయిక నిర్బంధాలలో పట్టణీకరణ, విద్యావ్యాప్తి, ఆధునిక అవసరాల దృష్ట్యా మార్పులు వచ్చాయి. అవి చలం నవలల ప్రభావంగా భ్రాంతి పొంది ఆనందించేవాళ్ళు అలాగే భావించవచ్చు. అయితే పి. సంజీవమ్మ వంటి మార్క్సీయ విమర్శకులు ఇలా అన్నారు – వివాహవ్యవస్థకి, ెనక్సు జీవితానికి సంబంధించి చలం సృజనాత్మక రచనలు ఆత్మాశ్రయ ధోరణిలో కొట్టుకుపోయి, నైతికత ప్రధానమైన సామాజిక ఉద్యమాల నుండి దూరమై ఒక నైతికేతర వ్యవస్థ కావాలనేంతవరకు పోయాయి. కందుకూరి, గురజాడ, ఉన్నవ వంటివారి సాహిత్యానికున్న ప్రయోజనం చలం సాహిత్యానికి లేదు. అయితే సంఘం కదలి న్ర్తీల బ్రతుకుల్ని గూర్చి కూడ ఆలోచించేట్లు చేశాయి చలం నవలలు. (ఆధునిక తెలుగు సాహిత్యంలో పునరుజ్జీవన సంస్కరణ స్వాతంత్య్రోద్యమ ప్రతిఫలన రూపాలు – నవలా సాహిత్యం (1985) కాకతీయ విశ్వవిద్యాలయం సంగోష్ఠి ప్రసంగపాఠం).
కాని క్రమక్రమంగా చలంలోనూ మార్పు వచ్చింది. ‘నేను వాంఛించే మార్పు ఈ వివాహవ్యవస్థలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు పోవాలని, ఈ దుర్మార్గాలు వొదిలించినంతమాత్రాన అసలు చచ్చేటంత దుర్బలం కాదు వివాహం. అంతేకాకుండా వొద్దన్నవాళ్లకి బలవంతంగా కట్టగూడదనీ, వివాహం అయినంతమాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ కానంతమాత్రాన అవినీతి అనడమూ మూర్ఖమని నా వాదన’ (మ్యూజింగ్స్-1, పే.43) ఈ నిశ్చయం ఆయన అంతరంగంలో నిహితమైన భావనను వెలికితీస్తుంది.
అందువల్లనే జీవితాదర్శం నాటికి చలం పాత్రలు ప్రతీకాత్మకతను పొందాయి. దానిలో నాయిక ‘లాలస’. ఈమె చలం భావనాలోకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వివాహమైన లక్ష్మణనింగ్‌తో దూరమై, మాల్వంకర్ గానంచేత ఆకర్షితురాలై అతనితో కొంతకాలం జీవిస్తుంది. కళాకారుల కళలో ఎంత సౌందర్యం ముంచెత్తినా, నిజజీవితంలో అంత ఆనందం ఉండదు. కళాపరిమితులనుంచి దిగినంతనే వారంతా సామాన్య మానవులే అవుతారు. అక్కడ నించి భీమునిపట్నం సముద్రతీర ప్రాంతాలలో ప్రశాంతంగా సహజీవనం చేస్తుంది. అక్కడ ఒకవిధంగా భావుక జీవనం ఉన్నది. మళ్లీ లక్ష్మణనింగ్‌తో రానంటుంది. భావుక జీవనానికి ఆస్కారమిచ్చింది ఆమెలో ఉన్న సౌందర్యబోధ. అదే బయట దేశికాచారి (దేశిక-ఉపదేశమిచ్చేవాడు) గా కానరావటం జరిగింది.
చలంలో ఉన్న నిరంతరాన్వేషణ, ఒక కాల్పనిక జీవనంకోసం, భావుకత్వ సౌందర్య లోక సాక్షాత్కారం కోసం చేనిన తపస్సు శ్రీరమణుల దర్శనంతో లక్ష్యాన్ని చేరుకున్నది. అతిలోక సౌందర్యం ఆయనకు అనుభవంలోనికి వచ్చింది.
విశ్వనాథ సాహిత్యం అంతా న్ర్తీపురుషల జీవనంలోని సామరస్య సాధనకు సంబంధించినది. మనుస్మృతిలో ప్రజాపతి తన దేహాన్ని రెండు సగములుగాజేని ఒకటి న్ర్తీగా, మరొకటి పురుషడుగా ఏర్పరచినాడని ఉన్నది (1-35). రెండు భాగములు సమానమైనవే ననీ, పరస్పర పోషకములనీ, పరిపూరకములనీ ఆయన భావించినాడు. ఆయన సంప్రదాయ వివాహవ్యవస్థను యథాతథంగా ఆమోదించాడన్న వాదం సత్యదూరమైంది. విమర్శకుల వివేచనలేమిలో నుండి వచ్చిన మాట. కిన్నెరసాని పాటలలో వివాహవ్యవస్థ కాఠిన్యం ఆమె అత్త వ్యక్తిత్వం ద్వారా ప్రతిఫలించింది. ఆమె ఇల్లువిడిచి వచ్చింది. భర్త ఆ వ్యవస్థ లోని జడత్వానికి ప్రతీకయై రాయై పోయినాడు. అహల్య కథకిది ప్రతికూల ప్రాగ్రూపం కొంతవరకు. ఆమెను అంతటి తీవ్రదుఃఖంలోనూ సమాజం సుఖంగా ఉండనీయలేదు. సృష్టిలోని ఆదివృద్ధుడైన కడలిరాజు ఆమెను కామించాడు. అయితే గోదావరీదేవి ఆమెను ఆపదనుంచి రక్షించింది. ఆమె చివరకు తెలుగుదైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య దర్శనముచేేన త్రోవలో నిలచి వారికి ేనవచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకొన్నది. ఆమె ధీరురాలై తన జీవనమార్గాన్ని తానే స్వతంత్రంగా నిర్దేశించుకొన్నది. ఆత్మహత్య చేసుకోలేదు.
ఇదే పరిన్థితి నర్తనశాలలో ధీరవనితగా ద్రౌపదిని చిత్రించి కీచకవధను భీమునిచేత నిర్వర్తింపజేశాడు విశ్వనాథ. రాచరికపు కట్టుబాట్లలో వివాహము ఆసాధ్యమై అక్బరుచక్రవర్తి అనార్కలిని జీవసమాధి చేయటం రాజు క్రూరత్వానికి, వివాహవ్యవస్థ రాచరికపు ఉక్కుకోరల్లో చిక్కుకొని గిలగిల తన్నుకులాడటాన్ని చిత్రించింది. వేనరాజులో వివాహవ్యవస్థను నిషేధించి, స్వలింగ వివాహభావాన్ని ప్రచారం చేనిన రాజు అధర్మం చివరకు తిరస్కృతమైంది.
విశ్వనాథ భావించిన వివాహవ్యవస్థ పురుషాధిక్య భావన ప్రధానమైంది కాదు. అడుగడుగునా ఆయన నాయికలు పురుషాధిక్యతను ప్రశ్నించారు. కల్పవృక్షంలో నీతాదేవి ‘అంతయు నేన చేనితిన్’ వనవాస గమనం నుంచి, రావణవధ దాకా తానే సర్వము నిర్వర్తించినట్లు చెప్పుకొంటుంది. గిరికుమారుని ప్రేమగీతాలలో పరస్పర ప్రేమానుబద్ధమైన శృంగారాన్ని దంపతీనిష్ఠంగా ప్రతిపాదించి కాల్పనిక కవిత్వంలో ఒక కొత్త శిఖరాన్ని ఆవిర్భవింపజేశాడు. వారి దాంపత్యభావం భార్యను దేవీమయంగా భావించేదాకా సాగిపోయింది. వరలక్ష్మీత్రిశతిలో – ‘ప్రేయోరూపము దాల్చి వచ్చినది గౌరీదేవి నా యింటికిన్’ అని ఈ భావాన్నే వ్యక్తీకరించాడు. దాంపత్యధర్మ పరిపాలనలో దివ్యభావ స్ఫురణ ఉన్నవాడవటంవల్లనే ఆ వ్యవస్థను నిలబెట్టే కృషి తన సర్వసాహిత్యంలోనూ నిర్వర్తించాడు.
మనస్సులో పుట్టే మోహమనే నదీప్రవాహాన్ని కొనసాగించే రెండు కులాలు భార్యాభర్తలు. గార్హస్థ్యం మిగిలిన సర్వసమాజాన్నీ రక్షించే బాధ్యతను నెత్తికెత్తుకొన్నది. ‘చేతో మోహకుల్యానదీ మర్యాదాకృతి తీర్చుయోగమిది’ (కల్పవృక్షం) సర్వసృష్టి నిర్వహణము లోని భౌతిక, దైవిక, ఆత్మిక స్తరాలలో సాధనను సాగించే సాధనం వివాహం. పూర్వం యజ్ఞయాగాదుల నిర్వహణలో ఉపయుక్తమైన అగ్ని – ప్రణయంగా, పరివార పోషణగా, సమాజ ధర్మేనవనంగా రూపాంతరం పొందింది. అందువల్లనే – ప్రేమగీతాలలో ‘నా అకర్మిష్ఠిత క్షమించినారు దేవి’ అని అంటాడు. ఆర్షమైన ఆచార వ్యవహారాలు కాలక్రమంగా రూపాంతరం పొందాయి. రూపాంతరం పొందిన నేటి లక్షణాలనే విశ్వనాథ ఆదరిస్తున్నాడు.
అరుంధతీ ధర్మారావుల దాంపత్యమును వర్ణించుతూ వేయిపడగలలో ‘ప్రతి నిమేషము వారి ఆత్మలలో దేవతలు తాండవించిరి, వేదఋక్కులు వారి క్రీడలలో నర్థవంతములె్యును, కులదేవతలు వారి లీలాపాంగములయందు భావ్యాశలు త్రవ్వు కొనిరి, పితృదేవతలకు వారి శృంగార లీలలందు తర్పణములందినవి’ (పే.157). అయితే వారి నడుమ సమభావమే కాని పురుషాధిక్యభావన లేదు. ‘ఈ ధర్మము పరస్పరమైనది. కాని పురుషని యందధికత కలది కాదు’ (పే.799).
వేయిపడగలలో కిరీటి శశిరేఖల ప్రణయము ఒక తపస్సుగా పరిణమిస్తుంది. వివాహముగా ఫలిస్తుంది. గిరిక ప్రణయం సఫలమై ఆమె ఒక ఆండాళ్‌వలె, ఒక మీరావలె దైవ సాన్నిధ్యాన్ని సంపాదించుకొంటుంది. జేబుదొంగలులో నీత భారతీయ దాంపత్యభావ గవేషణా ఫలం. ‘నీతయా నీత! ఆమె సనాతని ఈ దేశములోని ఆత్మ, ఆమెకు పుట్టుకలేదు, చావులేదు, ఆమె ఎవనిచెంత చేరునో అతడు నిత్యజీవి. అతనికి నాలుగు పురుషార్థములు కలవు’ (పే.125). వీరిద్దరికి గాంధర్వవివాహం జరుగుతుంది. సంప్రదాయ వివాహవ్యవస్థ సరిహద్దులు విశ్వనాథ నవలలో ఎన్నోచోట్ల చెదరి విస్తృతంగా పెరిగిపోతాయి. వేయిపడగలులో కుమారస్వామి-శ్యామలల వివాహం వర్ణాంతర సంబంధాన్ని అంగీకరిస్తుంది.
ధర్మానుబద్ధం అంటే లోకానికి సమాజానికి అహితం కలిగించనంతవరకు న్ర్తీ పురుష సంబంధం వర్ణాంతరమైనా, గాంధర్వమైనా, మరొకటైనా విశ్వనాథకు సమ్మతమే. లేనప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. ప్రణయము, వివాహముల నడిమి సంఘర్షణయే ఏకవీర నవల. అయితే దానిలో పరిన్థితులు ఎవరికీ అనుకూలం కాలేదు. ఏకవీర మనస్సులో దాగివున్న అవచేతన ెుుక్క ప్రాగ్రూపం గుఱ్ఱపువాళ్ళ పిల్ల ‘అమృతం’ చెప్పే అరుంజేవిరుంబు అన్న వాక్యం నవలను పరిపాలిస్తుంది. ధర్మం వ్యక్తికి సమాజానికి మధ్య ఒక సమన్వయాన్ని సంపాదించే ఒక సూత్రం. అయితే ఏకవీరలో అంతఃకరణ ప్రవృత్తికీ అత్యంత ప్రాధాన్యం ఈయబడింది.
చెలియలికట్టలో రత్నావళి, వేయిపడగలులో మంగమ్మ ఇద్దరూ కామానికీ, అర్థానికీ లోభించి వివాహవ్యవస్థ నుండి దూరదూరంగా సాగిపోయినవాళ్ళు. ఇద్దరూ క్రమంగా ఆ ప్రస్థానంలో సౌఖ్యం లేదన్న సంగతిని గ్రహించినారు. రత్నావళి వివేకవతియై తన జీవితాన్ని ముగించుకొంటుంది. మంగమ్మ ధర్మస్వరూపం గ్రహించి గిరిక పొందిన దివ్య సాఫల్యానికి ముగ్ధ ఔతుంది. ఆ కల్యాణోత్సవాలలో తనను మాననికంగా స్వామికి అర్పణ చేస్తుంది.
విశ్వనాథ చిత్రించిన న్ర్తీ పాత్రలలో కామ విపరీత ప్రవృత్తిగల వాళ్లల్లో బాదమ్మ బద్దన్నలు, సోఫియా, వామదేవుడు ఇలా ఎందరో కనిపిస్తారు. దాంభిక లక్షణం వసుంధరలో కనిపిస్తుంది. ఇంకా వింత లక్షణాలతో ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉన్నదో విశ్వనాథ రచనా ప్రపంచంలోనూ అంత వైవిధ్యం ఉంటుంది.
విశ్వనాథ రచనా ప్రపంచంలో సమకాలీనాంశాలెుడ కొన్ని విపరీత వ్యాఖ్యలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల ఆయన సంస్కరణ రూపంలో లోకంలో వస్తూ వున్న మార్పుకు వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకమైన వ్యాఖ్య చేయటమూ కనిపిస్తుంది. వర్ణభేదాలను సమర్థిస్తున్నట్లు ఉంటుంది. అయితే అవన్నీ ఆయన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే దేశకాలాల పరిమితులవల్ల సంభవించినవిగా భావించవలని ఉంటుంది.
అయితే విశ్వనాథ సృజనాత్మక ప్రతిభ ఈ పరిమితులలో ఎప్పుడూ నిబద్ధం కాలేదు. ఆయన రచనలన్నీ ఒక విశ్వజనీన లక్షణాన్ని ఆశ్రయించి ప్రవర్తించాయి. ఒక నవల వాస్తవికంగా రచింపబడటానికీ, రూపకాత్మకంగా (మెటఫారికల్)గా రచింపబడ టానికీ భేదం ఉన్నది. మొదటిది కాలంతోపాటు అదృశ్యమైపోతుంది. రెండవ పద్ధతి రచన కాలాన్ని మీరి ఉంటుంది. కాలాంతరంలో భిన్న వ్యాఖ్యానాలకు, భావస్ఫురణలకు అవకాశ మిస్తుంది. సమకాలికాంశాలు తమంత తాము జారిపోతాయి. విశ్వజనీనమైంది నిలుస్తుంది.
విశ్వనాథ రచనా జగత్తులోని ప్రధాన లక్షణం ఆయన వ్యక్తికీ తనలోని వ్యక్తికీ, బాహ్యమైన సమాజానికీ, వ్యక్తికీ సమస్త జగత్తుకూ ఒక సమన్వయం కోసం ప్రయత్నించారు. ఈ సమన్వయం భంగం అయినప్పుడు ఆయన విపరీతంగా వ్యధపడ్డారు. పసరిక మరణించినప్పుడు జగత్తు ఎంతగా దుఃఖించిందో, గిరిక పాల్గొన్న కల్యాణోత్సవాలకు ప్రకృతి పరవశించి దివ్యచైతన్య స్ఫురణతో ప్రకాశించింది. ఋతువులు, సూర్యోదయ చంద్రోదయాలు, వర్ణము, మేఘము, వృక్షము ఇలా ప్రకృతి అంతా రచనలో వస్తువుగా మారిపోయింది.
వివాహమూ ప్రేమ ఏదీ ఒకదాన్నొకటి అతిక్రమించరాదు. రెండూ ఒకదానిలో ఒకటి అంతర్భాగం కావాలి. న్ర్తీ పురుషల విషయంలో పరస్పర సంభావనం ప్రధానం. చలం నవలలలో వలెనే విశ్వనాథ నవలలలోనూ వివాహం ధర్మం తప్పినప్పుడు ఆ న్ర్తీలు హత్య పాలో, ఆత్మహత్య పాలో అయ్యారు. చలం పాత్రలు ఆత్మహత్య చేసుకున్నాయనీ, విశ్వనాథ పాత్రలు రచయిత చేతిలో హత్యకు గురయినట్లు ఇటీవల ఒక విమర్శకురాలు ప్రసంగించారు. అయితే ఇద్దరూ అవచేతనాదుల ప్రాబల్యంలో రచన చేనినవాళ్లవటం వల్ల ఇద్దరి పాత్రలూ తమంత తాము హత్యకో ఆత్మహత్యకో పాల్పడ్డాయనటంలో న్యాయమున్నది. ఏకవీర అంటే రేణుకాదేవి. దశమహావిద్యలలో ఛిన్నమస్త. పాతివ్రత్య భంగదోషం ఆరోపింపబడి పుత్రునిచేత వధకు గురయింది. పుత్రుడంటే తన భావచేతన ప్రపంచం. దానివల్ల హతమయింది ఈ ఇర్వురు రచయితల పాత్రల సమూహం.
విశ్వనాథ వివాహవ్యవస్థను రక్షించేందుకు తన సర్వశక్తులూ వినియోగించారు. అయినా అది నిర్బంధం కాకూడదనే ఆయన విశ్వనించారు. కృత్రిమమైన వివాహాన్ని ఆయన తిరస్కరించారు. పూర్వజన్మ, పూర్వకర్మలను విశ్వనించే వ్యక్తి కావటంవలన అది ఒక విధి నిర్ణయంగా భావించటం కూడా జరిగింది. ఆయన దృష్టిలో ప్రేమ చంచలమైంది కాదు. మోహోల్బణమూ కాదు. జీవితం అనే వలయం – అదే సమాజం. వ్యక్తి దానిలో బిందువు చుట్టూ వ్యాపించి స్థలమంతా పురుషార్థసాధన వేదిక. వ్యక్తి పురుషార్థాలను ఎంత సమగ్రంగా సాధించితే అంత పరిపూర్ణ వ్యక్తిగా, సమాజం తానుగా రూపొందుతాడు.
ఉపనిషత్తులలో – ఛాందోగ్యంలో – మైథునక్రియ ఒక యజ్ఞంగా పేర్కొనబడింది. ఈ యజ్ఞసాధనలో న్ర్తీ పురుషలిద్దరూ సమాన సాధకులు. వారు సృష్టి అనుస్యూతికోసం, సమాజ విస్తృతికీ, అభ్యుదయానికీ చేేన మహాకార్యం. బాహ్యంగా అతిథిేనవా పూజనాదులు లక్ష్యమైతే, ధర్మనిర్వహణ ద్వారా త్రివర్గసాధన ద్వారా ముక్తినీ, జీవన్ముక్తినీ సాధించటం, ఇరువురు జీవులు ఒక జీవితకాలం సహచరులై ఉంటూ బ్రతుకులో, భావనలో సామరస్యం సాధించటం ద్వారా సృష్టిలో సామరస్యం సాధించటం.
ఇది విశ్వనాథ రచనలో సుసూక్ష్మన్థితిలో దర్శించితే న్ర్తీపుంస యోగన్థితి ఈ లక్ష్యంవైపుగా సాధించినట్లు చెప్పుకోవచ్చును. చలం ఈ లక్ష్యానికి సమీపంలో కూడా లేడు.
ఉపయుక్త సాహిత్యము :
1. ఆధునిక తెలుగు సాహిత్యంలో పునరుజ్జీవన సంస్కరణ – జాతీయోద్యమ ప్రతిఫలన రూపాలు (ప్రసంగవ్యాసాలు), 1985 – కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ, వరంగల్.
2. విశ్వనాథ నవలలు – మానవ సంబంధాలు – డా॥ వారణాని వేంకటేశ్వర్లు (1996).
3. దర్పణం – ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, వరంగల్ – 2004.
4. జండర్ స్పృహ – ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు – (సంపా. కాత్యాయనీ విద్మహే) – 2005.
5. విశ్వనాథ అసంకలిత సాహిత్యం – 2 – విశ్వనాథభారతి, వరంగల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *