గిరి కుమారుని ప్రేమగీతాలు కులపాలికా ప్రణయం

కోవెల సుప్రసన్నాచార్య
విశ్వనాథ సత్యనారాయణ రచించిన గిరికుమారుని ప్రేమగీతాలు అత్యంత మధురమైన ప్రేమగీతాల సంపుటి. 192028 మధ్యకాలంలో కాల్పనిక కవిత్వంలో ప్రణయకవితాశాఖ పుష్పించి ఫలిస్తున్న కాలంలో విశ్వనాథ సృజన శీలంలోనుంచి వెలువడిన ప్రేమ కవితాగ్రంథం ఇది. ఆనాటి ఖండకావ్యాల్లో అనేక సందర్భాలలో ప్రేమ స్త్రీ పుంసయోగము ఇవి ఆయన వస్తువులు. వైరాగ్యము, సన్యాసము ఎప్పుడూ ఆయన కవితలో ప్రాధాన్యం వహించలేదు.
192030ల నడుమ ఆయన రచనా ప్రపంచం వైవిధ్యభరితమైంది. ప్రక్రియా వస్తుపరంగా, ఆంధ్రప్రశన్తి, నర్తనశాల, అనార్కలి, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి సరే గిరికుమారుని ప్రేమగీతాలు కూడా. వీటిలో ఆంధ్రప్రశన్తి తెలుగు వారి చరిత్రకు మణిగోపురాలను సమకూర్చగా, కోకిలమ్మ పెళ్ళి సంస్కృతాంధ్ర భాషాపరిణామాలను నినర్గసుందరమైన తెలుగు సౌందర్యాన్ని ప్రతీకాత్మకంగా వెల్లడించింది. నర్తనశాల అధర్మకామాన్ని తిరస్కరించిన నాటకమైంది. నిజమైన ప్రేమ దాంపత్యం అధికార పరిమితులవల్ల ఎట్లా శిథిలమై నశించిందో అనార్కలిలో, కుటుంబవ్యవస్థలోని క్రౌర్యం దాంపత్యానికి ఎలా భంగం కలిగించగలదో కిన్నెరసాని పాటలలో వ్యక్తమైంది. అనార్కలిలో ప్రేమ ఎంత అమలినమైనా, ఆధ్యాత్మిక చరమనీమలను స్పృశించినా అది అక్బరు రాజ్య ఆభిజాత్య గర్వం వల్ల, క్రూరంగా అణగద్రొక్కబడ్డది. కిన్నెరసాని పాటలలో వివాహము కూడా కుటుంబం పెట్టే బాధలవల్ల (ప్రతీకాత్మకంగా అత్త) సుఖాన్ని అనుభవింపనీయలేదు. ప్రేమ పారమ్యాన్ని ముట్టనీయలేదు నాయకుడు స్తబ్ధుడై రాయైనాడు. నాయిక దుఃఖంలో కరిగి నీరై వాగై ప్రవహించింది.
వివాహము ప్రేమ దాంపత్యము వ్యవస్థ నిరంకుశలక్షణం వీటి మధ్య పరిష్కారం సాధించడం ఆనాటి కాల్పనిక సాహిత్యరచయితలకు, కవులకు ముఖ్యంగా రాయప్రోలు, కృష్ణశాన్ర్తి, చలం, విశ్వనాథ, బాపిరాజులకు పట్టింది. రాయప్రోలు ప్రణయాన్ని భావుక ప్రపంచంలో నిలిపి అమలిన శృంగారం అన్న అనాచరణీయమైన నిద్ధాంతాన్ని ప్రపంచించగా, కృష్ణశాస్త్రి మానుష జీవనంతో అన్వయించకుండా ేన్వచ్ఛా ప్రణయ నిద్ధాంతాన్ని ఆమోదించగా మిగిలిన ముగ్గురు రచయితలే సామాజిక చింతనలో నేల మీదకు దిగి ఈ సమస్యకు తమ తమ పరిమితులలో సమాధానాలు అన్వేషించారు. బాపిరాజు, విశ్వనాథ యించుమించు ఒకే భావనకు బలం కలిపించినా, చలం నవలల ద్వారా కథ ద్వారా వివాహాతీతమైన సామాజిక వ్యవహారాన్ని భావన చేనినాడు.
భారతీయ జీవన వ్యవహారంలో పారలౌకిక దృష్టియే ప్రధానమని, లౌకిక దృష్టిలేదనే ఇటీవల జరిగిన ప్రచారం సత్యం మీద ఆధారపడ్డ వ్యవహారం కాదు. ‘జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతమ్ ప్రబ్రువామ శరదశ్శతమ్’ అన్ని వేదభావన మొత్తం ఈ లోకంలోని ప్రేయస్సును ప్రధానంగా చేసుకొన్నదే. విశ్వనాథ ఆనాటి ఖండ కావ్యాలను చూేన్త లౌకిక జీవనం విూద ఎంత రక్తి ఉన్నదో తెలియవస్తుంది. ‘సన్యాని’ అన్న ఖండికలో (భ్రష్టయోగి) –
‘మధుర దరహాస చంద్రికా సుధ తొరంగు
కామినీ న్నిగ్థగండ భాగమ్ములాను
కప్పురపు కమ్మతావుల కావివ్మై
బీటు వడ నీకు వైరాగ్య వృత్తియేల?’
ప్రేమ జీవన సౌభాగ్యం సన్యాస జీవనం కంటే ఎంత ప్రియం కలిగిస్తుందో దీనిలో వెల్లడించటం జరిగింది. ‘రంభ’ అన్న ఖండకావ్యం (వైతాళికులలో ఉన్నది) ఇదీ వైరాగ్యవృత్తికి వ్యతిరేకమైనదే.
మొత్తం మీద ఆనాటి కవుల రచనల్లో ప్రేమ పారమ్యం, స్త్రీ పుంసయోగ జీవనం ఎలా ఆనందమయం చేయవలని ఉన్నదో వివరించింది. ‘తీయని త్రోవ’ అన్న ఖండకావ్యంలో(భ్రష్టయోగి)
‘బంగరుతీవ విల్‌చెఱకు వంచి రసార్ద్రమనోజ భావనా
సంగతులైన మాప్రణయ దంపతులుండిన పూవుటీరపున్
చుంగుల నుత్తరీయమును సోకుగ గప్పిన రీతి వేణికా
భంగము తీర్చె నొక్క ెనల పాయలు పాయలు గాగ తీర్చుచున్’
ఈ విధంగా ప్రణయోద్విగ్నమైన ఆనాటి కవిత్వంలో స్పష్టంగా కానవచ్చే మూడు పాయల లక్షణాలను స్పష్టంగా తెలుసుకొందాము.
అమలిన శృంగారము:
1. వయస్సులో ఉన్న స్త్రీ పురుషలు కామ దూషితం కాకుండా ప్రేమానుబంధం నిలుపుకోవటం ఈ లక్షణం.
‘ేన్నహసురత వాత్సల్యముల్ జీవితమున
ప్రేమ కంగంబులగు అంగిప్రేమ ెుుకడె
ప్రేమ శిఖరావరోహణాభిజ్ఞులైన
మృదు సహృదయుల కివిెుల్ల మెట్టులగును’
ఈ భావానికి మూలం రాయప్రోలు 1913లో రచించిన తృణ కంకణంలో ఉన్నది. చెలికాడు తన చెలిమికత్తె వేరొకరితో వివాహమై దూరమైతే పొందిన వ్యధను తొలగించటం కోసం ఆమె చేనిన ప్రేమభావ విస్తారమే ఈ నిద్ధాంతానికి పునాది. కామ స్పృష్టి లేకుండా యువకులు ేన్నహంతో జీవించవచ్చునన్నది ఈ నిద్ధాంతం తాత్పర్యం.
2. స్త్రీ పురుష సంబంధం తల్లి, భార్య, చెల్లెలు, బిడ్డ అన్న నాలుగు దశల్లో ఉండవచ్చును. అయితే మూడు అనుబంధాలలో కామ స్పర్శ ఉండదు. ఒక్క సహచరి సంబంధంలోనే అది ఉంటుంది. అయినా క్రవ్మ్మైలనంలో భార్యభర్తలు నడుమ కామభావం పలుచబడి, పాముకుబుసం విడిచినట్లు దాన్ని విడిచి అమలినంగా జీవించవచ్చు. క్రమంగా సృష్టి అంతా ఈ అస్పృష్ట కామమైన ప్రేమమయ జీవనంలో మధుర మధురంగా వికనించాలి.
3. 1949 ప్రాంతాలలో రాయప్రోలు వారు రచించిన ‘రూప నవనీతం’ నాటికి ఈ నిద్ధాంతం క్రమంగా శిథిలమైంది. కామం ఏకాంతంలో ేన్నహధర్మాన్ని దాటి ఎలా విజృంభించగలదో ఈ నాటకంలో ప్రసక్తమయింది. క్రమంగా అమలిన శృంగారం రాధాకృష్ణల ప్రేమభావంలోని ఆధ్యాత్మిక ప్రతీకాత్మక న్థితిలోకి సంలీనం అయింది. రాయప్రోలు వారు తరువాత ‘రాసపంచాధ్యాయి’ అనువాదం చేయటం అమలిన శృంగారం గూర్చిన ఆయన పట్టుసడలి పోవటాన్ని సూచిస్తుంది.
4. భోజాదులు ప్రపంచించిన శృంగారంలో ఈ నిద్ధాంతం సంగమించింది. అహంతా రమణం మూలకేంద్రం అయింది. భక్తి, వాత్సల్యము, ేన్నహము, సురతము అన్నీ ఇందులో సంగమించాయి. అందువల్ల శృంగార నిద్ధాంత పరిధి విస్తరించినా, అది ప్రపంచంలోని ప్రీతి భావాన్నంతా ఆక్రమించి కొంత నిర్దిష్టతను కోల్పోయింది.
ేన్వచ్ఛా ప్రణయము:
1. ఈ నిద్ధాంతం వెనుక ప్రధానంగా కామము, దాని అభివ్యక్తి రూపమైన ప్రేమ ప్రాధాన్యం వహించాయి. వివాహ వ్యవస్థ క్రమంగా అనురాగానికి, పరస్పర సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వక సామాజిక స్థాయికి, ఆర్థిక సాంప్రదాయిక న్థితులకు ముఖ్యస్థానం ఇవ్వటం వలన స్త్రీ పురుషల జీవితం క్రమంగా వ్యధా మయమై , అసఫలత పొంది, యాంత్రికమైన ధోరణిలోకి సాగింది. పురుషాధిక్య ధోరణి పెంపొంది సమాన భావన తొలగిపోయి, స్త్రీ స్థానం క్రమంగా దైన్యన్థితికి చేరటం వల్ల వివాహవ్యవస్థ పట్ల ఒక వ్యతిరేకత వ్యక్తమైంది.
2. దీనివల్ల వివాహానికి అతీతంగా జీవనం స్త్రీ పురుషల పరస్పర ేన్నహం ఆధారంగా సాగవలెనని నూతన జీవనతత్త్వ ధోరణి పెరిగింది. ఈ ప్రేమ వెనుక ఆకర్షణ ప్రధానమైనప్పుడు అది న్థిరంగా ఉండదు. భౌతిక జీవన పరిన్థితులలో ఆర్థికమైన ఎగుడుదిగుడుల్లో అన్నీ ఈ ప్రేమలోని సాహచర్య న్థితికి చిరస్థాయిత ఈయలేదు. వైమనస్యం వైరుధ్యం పెరిగిన ఆ న్థితిలో దిక్కులేని సమాజంలో ఆత్మహత్యలు మాత్రమే పరిష్కారమైన న్థితిలో సామరస్యంతోడి జీవనం కోసం మరొక ప్రయత్నం చేయవలని వచ్చింది.
3. ఈ ేన్వచ్ఛను పురుషనికి అనుకూలంగా, స్త్రీ భావచేతనకు వ్యతిరేకంగా కృష్ణశాస్త్రి ‘తేటివలపు’ అన్న ఖండికలో ప్రకటించాడు. ేన్వచ్ఛా ప్రణయ నాయిక ఎలా జీవన శైథిల్యంలో పడిపోయిందో ‘మాలపల్లి’లో కమలా మోహనుల వృత్తాంతంలో, మైదానంలో రాజేశ్వరి జీవితంలో, చెలియలి కట్టలో రత్నావళి జీవితంలో స్పష్టంగా చిత్రించబడింది. (అమలిన శృంగార నిద్ధాంత వైఫల్యం జ్యోతీ అప్పాదాసుల కథలో ఉన్నవవారు బలంగానే ప్రకటించటం జరిగింది).
ఈ రెండు మార్గాలకు అతీతంగా సామాజిక స్థాయిలో సుఖజీవన తాత్పర్యంతో బయటకు వచ్చింది. కులపాలికా ప్రణయ నిద్ధాంతము.
కులపాలికా శబ్దం తంత్ర శాస్త్ర సంబంధి. కులాంగనా, కులాంతస్థా, కౌలినీ, కులయోగినీ ఇత్యాదిగా లలితా సహస్ర నామం పేర్కొంటున్నది. కులం అన్నమాటకు తంత్ర శాస్త్రం షట్చక్ర సంపుటిని నిర్దేశిస్తున్నది. ఈ మొత్తం షట్చక్రాలలోనూ సంచరించే కుండలినీ శక్తికి ఈ కులాంగనాది నామాలు వర్తిస్తాయి. ఔపచారికంగా ఈ నామతాత్పర్యం – ఆమె పురుషనికి సహచరియైన ఆదిశక్తికి ప్రతినిధిగా శరీరాంతర్వర్తి యైన మహాశక్తికి ప్రతీక. శక్తితో కూడినప్పుడే శివుడు శక్తిమంతుడవుతాడు. లేకుంటే అతడు గడ్డిపోచను కూడా కదల్చలేడు అని సౌందర్యలహరి ఆరంభంలో శ్రీ శంకరులు పేర్కొన్నాడు.
కులం అంటే కుటుంబము, పరివారము, సమూహము అని అర్థం ఉంది. సమష్టి జీవనంలో ఉంటూ దానికి సమన్వయ శక్తిగా కేంద్రంగా వ్యవహరించుతుంది. కులపాలిక ఈ భావన లౌకిక జీవనంలోనికి వచ్చినప్పుడు పురుషనితో అభిన్న చైతన్యంగా అతని క్రియాచోదకశక్తిగా ఉండే స్త్రీ శక్తిని వెల్లడిస్తున్నది. శ్రీ రామాయణంలో ‘సహధర్మచరి’ అన్నప్పుడు ఈ తత్త్వాన్నీ వాల్మీకి సంభావించటం జరిగింది. సహధర్మం అంటే సాహచర్యధర్మం. ఇది జీవితాంతం సమాన భాగ స్వామ్యంతో నిర్వహింపవలనింది. ఇక్కడ ప్రేమ వివాహము రెండూ సమంగా, సయోజ్యాలై సాగి పోవలని ఉంటవి. ఒకరికోసం ఒకరు తపస్సు చేనిన లక్షణం ఇక్కడ ఉన్నది. ‘నిజ తపఃఫలాభ్యాం’ అని శివానందలహరి ఆరంభం.
భారతీయ సంస్కృతి దృష్టిలో దాంపత్యం ఒక క్లిష్టమైన పరంపరాయాతమైన జీవనం. పూర్వజన్మలు, కర్మలు, సంస్కారము, సంభావనలు ఇవన్నీ కలగలని ఈ దాంపత్యం సంభవిస్తున్నది. ఇక్కడ ఏదో యాదృచ్ఛికమైన సంబంధంగా ఎప్పుడైనా కలని ఉండటానికీ, ఉండకపోవటానికీ ేన్వచ్ఛ ఉన్న అంశం కానేకాదు.
దాంపత్య జీవనంలో అనురాగము, అనుబంధము, అరాధనము, ఆర్పణము, అనన నాల్గు ధాతువులు అత్యంత ముఖ్య సన్నివేశాలు. క్రమంగా జీవన సాధనంగా పరస్పరం సంలీనమై దె్వైతాన్ని అదె్వైతంలోనికి పరిణమింపజేనికోవటం ఇక్కడ ప్రయత్నసాధ్యమైన లక్ష్యం. ఒకరికొరకు ఒకరు ఒదిగిపోతూ, ఓంు్ట్చకుంటూ, ఒప్పుకుంటూ ఒరనికొంటూ సంగమంలో ఏకత్వాన్ని పొందటం ఈ స్త్రీ పుంసయోగ స్వరూపం. అందుచేత కులపాలికా ప్రణయంలో ప్రణయ పారమ్యము, పరస్పర సామరస్యముతో కూడిన అనుబంధము ప్రధానాంశాలు అవుతున్నాయి.
‘అచ్ఛిన్న మేఖల మలబ్ధ దృఢోపగూహం
అప్రాప్త చుంబన మవీక్షిత వక్త్రకాంతిః
కాంతా విమిశ్ర వపుషః కృత విప్రలంభ
సంభోగ సఖ్యమివ పాతు వపుఃపురారేః’
అర్థనారీశ్వర మూర్తిలో ఎంత సాన్నిహిత్యమున్నదో అంత విరహమూ ఉన్నది. విప్రలంభ సంభోగములకు వారి యందు సఖ్యమేర్పడి ఏకకాలములో అనుభూతము లవుతున్నవి. ఇక్కడి వియోగము వియోగం కాదు. సంయోగము సంయోగం కాదు. ఒకరి మనస్సులో ఒకరు న్థిరంగా ఉండటం వలన వారి నిత్య సాన్నిహిత్యానికి భంగం కలుగదు అట్లాగే వారి అనుభవము శరీర నీమలను అతిక్రమించింది. ప్రాణమయపరిమితులు దాటింది. మనోమయచేతనలో ప్రతిష్ఠితమై ఉన్నది.
కులపాలిక న్థితిలో ఆమె కులమును (వంశమును) రక్షించేది. కుటుంబాన్ని సుఖమయంగా నిలిపేది. సంతతి ద్వారా భవిష్యత్తులోనికి ఆ కుటుంబాన్ని నడిపించేది. కులపాలికా ప్రణయం దాంపత్యం ెుుక్క రహస్యాన్ని స్పష్టంగా వ్యాఖ్యానించింది. ‘చేతో మోహ కుల్యానదీ మర్యాదాకృతి తీర్చు యోగమిది’ ‘నిర్యత్ ప్రాణము వేళ జీవుడుచనన్ నిశ్శ్రేయసాధ్వంబునన్. దాంపత్యం రెండు పార్శ్వాలలోనూ ఫలాన్ని అందించే మహాసాధన. చిత్తం నిరోధింపబడటం. కామక్రోధాదులు వాటి పరిమితుల లోనే అవి నిలచి ఉండటం దీని ప్రత్యేక లక్షణం.
కులపాలికా ప్రణయం కఠినమైన సామాజికవ్యవస్థ కాదు. ఒకరికోసం ఒకరు అన్వేషించుకుని, పొంది, ఆత్యంతికమైన సాధన మార్గంలో సాగిపోవలనిన లక్ష్యనిద్ధి. ఇక్కడ ప్రణయము, వివాహము నుసంగతములై ఏక ప్రసారం పొందుతున్నవి.
కులపాలికా ప్రణయము:
1. విశ్వనాథ గిరికుమారుని ప్రేమగీతాలలో ప్రతిపాదించిన ఈ కులపాలికా ప్రణయాన్ని పైన వర్ణించిన భూమిక విూద అర్థం చేసుకోవాలి. వివాహము ఒక దైవ నిర్ణీతమైన అంశం. ప్రణయం జీవన సమర్పణం ఇద్దరూ కలని సాధించుకోవలనిన లక్ష్యాలు. ఇక్కడ ఎవరికి ఎవరూ లోబడిలేరు. పురుషనికి ధర్మపత్నీ విరహితంగా శ్రౌతస్మార్త క్రియాచరణకు అధికారం లేదు. (సామాజిక అధ్యాత్మిక కార్యక్రమాలలో ఇద్దరూ కలని పాల్గొన వలని ఉంటుంది). ఇద్దరి ఉనికి ఏ ఒకరి విూదనో ఆధారపడ్డదికాక పరస్పరం పరిపూరకం అయింది.
2. పరస్పర సామరస్యంతో కూడిన దాంపత్యం సత్సంతానానికి కారణం అయింది. ఆ సంతతి వారిద్దరి అనురాగాలకు వ్యక్తీకరణమవుతుంది. కుటుంబంలో పెద్దలు, సమవయస్కులు, పిన్నలు అందరూ ఒక భావవలయంలో సంస్కార బంధంలో పైకెదిగి వస్తారు. సామాజిక న్థితిలో సమష్టిగా తమ కర్తవ్యాన్ని, భాగధేయతను బాధ్యతతో నిర్వహిస్తారు.
3. ఇద్దరి అనుబంధం సమాజంలో ప్రాథమికమైన అంశం (యూనిట్). ఇక్కడనుంచి పరివారం వికనిస్తుంది. భూత భవిష్యత్తులకు ేనతువు వలె వృద్ధులకు, బాలురకు ఆశ్రయం పోషణ లభిస్తుంది. సమాజంలో ఉత్పత్తి కేంద్రంగా ఏర్పడ్డ గృహస్థవ్యవస్థ ఆర్థిక సున్థితికి సంఘపురోగతికీ, ఆధ్యాత్మిక సాధనకు భూమికగా ఏర్పడుతుంది.
4. నియతమైన కామము, మోహము వాటి విజృంభణ వల్ల వ్యక్తం అయ్యే క్రోధాదులు శమించిన న్థితివల్ల ధర్మం సక్రమంగా ఆచరింపబడు తుంది. బలవంతులు, బలహీనుల అర్థకామాలను రక్షణ లేకుండా దోచుకునే న్థితి తొలగిపోతుంది.
5. స్త్రీ కేవలం భోగోపకారణంగా కాక మాతగా, భగినిగా, సహచరిగా పుత్రికగా అత్యంత గౌరవస్థానాన్ని పొందుతుంది. ‘వాగార్థా వివసంపృక్తౌ’ అన్నట్లు వాగర్థములు ఒకదానిని ఒకటి బాగుగా కలని పోయినట్లుగా సంయోజితము లవుతాయి.
ఇది కులపాలికా ప్రణయ పారమ్యము.
గిరికుమారుని ప్రేమ గీతాలతో సమకాలికంగా రచన జరిగిన ‘సౌభద్రుని ప్రణయయాత్ర’లోనూ ప్రణయం దాంపత్యంలో పరిణమించటం, కులపాలికా గౌరవం నాయిక పొందటం ఉన్నది. ‘ప్రణయ గీతాలు’ అచ్చవటానికి ముందే ‘ప్రణయ యాత్ర’ అచ్చయింది. అందువల్ల కులపాలికా ప్రణయమూలం ప్రణయయాత్రలోనే నాయని వారు ప్రవేశపెట్టినట్లుగా భావించే వాదధోరణీ ఉన్నది. అయితే గిరికుమారుని ప్రేమగీతాలకే ఈ పట్టం కట్టడానికి కారణం ఈ రచనలో ఉన్న కులపాలికా ప్రణయ తత్త్వ గాఢత్వం, స్పష్టత, సోపానక్రమంలో ఉన్న ఎదుగుదల. కులపాలికా శబ్దాన్ని ప్రణయగీతాలలో 81 గీతంలో స్పష్టంగా ప్రయోగించినారు విశ్వనాథ.
విశ్వనాథ సత్యనారాయణ, నాయని సుబ్బారావు ఇద్దరు అత్యంత సన్నిహిత మైన సౌహార్దాన్ని అప్పటినుంచీ జీవితాంతం వరకూ అనుభవించినారు. విశ్వనాథ అన్న అయితే నాయనివారు అనుజుడు. కావ్యాలలో ఎంత సామ్యవైషమ్యాలు ఉన్నా ఒకరి రచనా పరిణామాన్ని ఎరిగిన వారు మరొకరు. నాయని వారి వివాహ సందర్భంలో ‘శశిరేఖ’ అనే మరొక లిరికల్ రూపకాన్ని రచించి విశ్వనాథ నాయని వారికి అంకితం చేశారు. (విశ్వనాథ అసంకలిత సాహిత్యం నాల్గవ సంపుటంలో ఈ రచన తొలిసారిగా ప్రకటింపబడింది) నాయని వారి ప్రణయవృత్తాంతం ప్రేమ గీతాలలోనూ, వేయి పడగలలోనూ విస్తరింపబడింది. ఒక రకంగా శశిరేఖలోనూ నాయని వారి ప్రణయ వృత్తాంతమే వస్తువు.
ఈ కులపాలికా ప్రణయ భావనను తొలిసారి ప్రవేశపెట్టిన ఆచార్య ని. నారాయణ రెడ్డి తన గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయము, ప్రయోగాలు’ అచ్చయినప్పుడు ఇద్దరు కవులూ జీవించి ఉన్నారు. అయినా ఎలాంటి వివాదము ఈ సందర్భంలో తలఎత్తలేదు.
భారతీయ జీవన భూమిక విూద కామపురుషార్థానికి ఉచితమైన స్థానమే ఉన్నది. కామము ధర్మార్థ పురుషార్థాల ఫల స్వరూపమని ‘ఫలభూతశ్చ ధర్మార్థయోః’ 1247 వాత్స్యాయన కామ సూత్రం పేర్కొన్నది. బృహదారణ్యకం స్త్రీని అగ్నిగా స్త్రీపురుష సంయోగాన్ని ఒక యజ్ఞంగా పవిత్రకార్యంగా నిరూపించింది. మన జీవన మూల్యాల గణనంలో ఎప్పుడూ కామాన్ని హేయపదార్థంగా చూడలేదు.
బ్రహ్మానంద భావన చేయటంలో లౌకికమైన ఉపమానం కోసం వెదుకగా వేదపురుషనికి స్త్రీ పురుష సంయోగానందమే స్ఫురించింది. తద్యధా ప్రియయా ప్రియా సంపరిష్వక్తో నబాహ్యం కించన వేద నానంతరమ్ ఏవమేవాయం పురుషః ప్రజ్ఞానాత్మనా సంపరిష్యక్తో నబాహ్యం కించన వేదనాంతరమ్. (బృహదారణ్యకం 4321) ప్రియాప్రియుల సంయోగం సర్వేతర భావనా విరహితమై ఇరువురి మనస్సులు ఏకాత్మ సంలీనన్థితిలో ఉంచుతుంది. అలాంటి న్థితి బ్రహ్మానందవేళలో జీవుడు ప్రజ్ఞానాత్మ సంపరిష్వక్తుడై పొందుతున్నాడు. స్త్రీ పుంసంయోగసన్నివేశంలో ‘సునిర్వృత మాసనః నిధువన పరబ్రహ్మానందం నిరర్గల మన్వభూత్’ అని శంకర విజయంలోని ఒక అజ్ఞాత కవి వచనం.
ఈ భావం తంత్ర శాస్త్రాదులలో వామాచారంగా ప్రవృత్తమయింది.
కులపాలికా ప్రణయ తత్త్వ రహస్యమును కేతవరపు రామకోటిశాస్త్రి ఇలా నిరూపించారు. ‘ఈ ప్రణయభావ కావ్యమున ఆమె కులవధువు గనుక శాంభవీ విద్యకునువలె పరమగుప్త. ఆమె దేవత. ఆ విధముగా ఆమె సమాజమునందు సర్వత్ర పూజింపబడుటను కవి ప్రదర్శించినాడు. దేవతలు మాట్లాడరు అను గ్రహింతురు. కులపాలికలు శ్రోత్రియత్వమును, అకామహతత్త్వమును పురుషల యందు ప్రజ్వలింపింతురు. గృహమునందు భార్య పురుషనకు ప్రత్యక్షదేవత. ఆమె ఉపాస్య. కులమనగా గృహమని కూడా. గృహపాలికను గలవాడు గృహము కలవాడు. గృహస్థు ప్రాణము చేతను, మనస్సుచేతను, చక్షుస్సుచేతను, శ్రోత్రము చేతను అవి పరబ్రహ్మము ెుుక్కచతుర్థపాదకళా చతుష్టయముగా నెరిగి షోడశకళా బ్రహ్మస్వరూపిణి నుపానించినచో ‘ఆయతనవాన్ భవతి’, అట్టివానిని పరమేశ్వరి పతివ్రతల చేత జన్మజన్మముల విూద ముక్తి త్రోవలలో నడిపించును. ఈ విధముగా కులపాలికా శబ్దమును ప్రయోగించి కులరూపిణీ, కులసంకేతపాలిని కులాంగనా మొదలగు నామముల చేత శ్రీలలితాపరమేశ్వరీ నామ సంకేతములను స్మరింప జేయుచు ప్రత్నీవ్రతమును పురుషన కుపాదేయముగా ప్రబోధించుచున్న దీ కావ్యము’ (విశ్వనాథ వైఖరి (1994) పే. 171)
ఈ సందర్భంలో కృష్ణశాస్త్రి ప్రభృతులు భావించిన ఊహాప్రేయని భూమి మీద నిలచి ఉన్నది కాదు. ఆ ప్రణయమునందు ఊహాలోకములో పుట్టి వచ్చింది. ఇది మనోమయ భూమికలోని వ్యక్తి. ఇక్కడ నిరంతర విరహమేకాని, సంయోగము లేదు. నిరంతర భావనమేకాని ఇంద్రియానుబంధము లేదు. నిరంతర పరిదేవనమేకాని సాక్షాత్కారములేదు. ఈ విధముగా ఇది అనుభవమునకు దూరమైంది కావటం వలన కవి లేదా సామాజికుడు తన సామాన్య జీవనానికి, అమృత ప్రణయమయ జీవితానికి ముడి వేనికోలేక వైరుధ్యములో కొట్టుమిట్టాడుతూ బ్రతుకవలని ఉంటుంది.
సామాజిక దృష్ట్యా పరోక్ష ప్రేయనిని గురించి ప్రకటించే వీలు ఉండదు. అందువల్ల కల్పించుకొన్న ఊహా ప్రేయని విషయంలో రచన అంతా అస్పష్టంగా, క్లిష్టంగా, ప్రతీకల చాటున దాగికొని ఉంటుంది. నాయిక న్వీయ కాదు పరకీయ అవుతుంది. అందువల్ల ధర్మవిరుద్ధమైన కామంలోనికి ఈ ప్రేమ కవిత్వం జారిపోతుంది.
ఈ క్లేశం తప్పటానికి గిరికుమారుని ప్రేమగీతాలలో ప్రేయనీ ప్రియులే భార్యాభర్తలై రసవిషయంలో పవిత్రమైన శృంగారానుభవానికి ఈ రచనను స్థానంగా చేనినారు. లేకపోతే ఏకత్రైవానురాగశ్చేత్ అన్న స్థాయిలో రసముకాక రసాభావమైనా కావలని వస్తుంది.
2
ప్రణయ కవితాశిఖరం
ఆత్మాశ్రయ కావ్యమైన గిరికుమారుని ‘ప్రేమగీతాల’ రచన కాల్పనికోద్యమ కవితా రచన ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో కొనసాగింది. 192028ల నడుమ దాదాపుగా ప్రవహించిన ఈ రచన కృష్ణ పక్షము, హృదయేశ్వరి, ఎంకి పాటలు, సౌభద్రుని ప్రణయయాత్ర మొదలైన రచనలకు సమకాలంలో సాగింది. విశ్వనాధ వారి తండ్రి పేరు శోభనాద్రి. అందువల్ల తను అద్రిపుత్రుడననే భావంతో గిరికుమారుడనే ్టలం పేరును పెట్టుకొన్నాడు. దీనిలో కవి ప్రణయ కవిత్వాన్ని సాగిస్తూనే తనను తాను వెదుక్కుంటూ తన తత్త్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన వైయక్తిక పరిమితులను, అవి దాటిన తన చైతన్యాన్ని, తన కవితా వ్యక్తిత్వాన్ని, తన ప్రవృత్తిలోని వైరుధ్యాలన, తన ‘భ్రష్టమోగి’తను క్రమంగా అన్వేషిస్తూ నిరూపించుకుంటూ పోయాడు.
పన్నెండవ గీతం ‘ఈ కెలన శరత్పూర్ణిమ వృత శశాంక లలిత రోచిర్వితానము’ అన్న రచన విలక్షణమైంది. మనిషిలో తానెరుగని మనిషి ఉన్నాడు. ఆ పార్శ్వం తనకు తనకే తెలియదు. ఒక వైపు స్వచ్ఛమైన శరత్కాలపు వెన్నెలల ఆవరణం. మరొక వైపు గాఢమైన చీకట్లు ఆక్రమించుకొన్న మరొక ప్రాంగణం. రెండు తనలో రెండు పార్శ్యాలు. ఒక వైపు జ్ఞాన భావ విస్ఫారం- ఇక్కడ తాను విచ్చుకొన్న ఒక మెరుపు తీగవలె ఉన్నాడు. రెండవ వైపు చీకట్లోని భాగం సగం తనకు తనకే కనిపించదు ‘ఎరుగని తనలోని తాను’ ఇది మనోలక్షణస్థాయిలో అవచేతనలోని భాగం కావచ్చు లేదా సుప్తచేతలోనిది కావచ్చు. తొలుతటిది జాగ్రదవస్థాచేతన. మరొక పక్షంలో అవిద్యావృతమైన తన స్వన్థితియైన ఆనందాన్ని మరచిపోయి తనకు తాను గుర్తించలేని అంధకార భాగం ఒకటైతే, రెండు జ్ఞాన చంద్రకాంతిలో పరిప్లావితమై చిదానందరూపంగా లోలోతులో వెలిగే కొత్తమెరుపుతీగ. ఈ రెండూ అంతర్బహిర్జగత్తులు. రెంటిలోనూ ఏక కాలంలో ద్విధాభూతమైన చైతన్యంతో ప్రవర్తించటం ఈ జీవుని లక్షణం.
ఐతే ఇది సృజన ప్రపంచం కావచ్చు. సృజన మూలాలు అవచేతనలో, సుప్త చేతనలో, సమష్టి అవచేతనలో సంలీనం అయి ఉంటాయి. అవి అభివ్యక్తిదశలో కావ్య ప్రపంచంగా ఆవిష్కృతమైనప్పుడు దానికి విశ్వజనీనత సార్వకాలీనత నిద్ధిస్తాయి. వాస్తవ ప్రపంచంకంటే భిన్నమై ప్రతిభాజ్యోత్స్నలో తడిని నడుమ నిలిచి ఉన్న ఒకానొక అన్థిరమైన మెరుపుతీగలాగా కావ్యం నిలచి ఉంటుంది. అయితే కావ్యకర్తకు తనకు ప్రేరణను కలిగించిన అవచేతనాదుల గురించిన ఎరుక అసలే ఉండదు.
‘అందుసగమిందు సగముంటి నౌరనేను’
‘ఈ సగము నాది నాకె కన్పింపబోదు’
‘ఉగ్రరాహుచంద్రార్థ బింబ గ్రసనము వోలె నున్నది నా న్థితి’
అన్న పద్యాంశాలు మొత్తంఖండం సూచించే తాత్పర్యానికి వాహికలుగా ఉన్నవి.
ఇరవై నాల్గవ గీతంలో కవి ఒక స్వప్నకథ చెప్పుతున్నాడు. రామాయణంలోని త్రిజటాస్వప్నము వలె వాశిష్ఠ రామాయణంలోని స్వప్నాల వలె ఇదీ విలక్షణమైంది. దీనిలోని వృత్తాంతము ఇది. సముద్రాలు హఠాత్తుగా పొంగి భూమి మునిగిపోయింది. అయితే అంత జలప్రళయంలోనూ నాల్గు దిబ్బలు మిగిలి ఉన్నాయట. వాటి విూద తాను, తన ప్రియురాలు, తన తండ్రి, తన సఖుడొకడు మిగిలి ఉన్నారట. క్రమంగా కొంతలో తాను తన ప్రియురాలే మిగిలినారు. మరికొంత ేనపటికి ఆమె కూడా లేదు తానొకడే మిగిలినాడట.
తాను తన ప్రియురాలు సంసారం ెుుక్క అనంతత్వానికి, అనుస్యూతికీ నిదర్శనాలు. తన తండ్రి గడచిపోయిన కాలానికి, తన సఖుడు వర్తమానానికి చిహ్నాలు. క్రమంగా భూత భవిష్యత్తులు అనంతత్వంలో సంలీనమైనాయి. అయితే తన ప్రియురాలు కూడా తనలో లీనమయింది. ఆమెకు వేరుగా అన్తిత్వం లేదు. ఆమె తనలోని ప్రేమ భావనాకృతి. విడిగా ఉండదు. తనలోనే సంలీనమై ఉంటుంది. ఇక్కడ వక్త పురుషడు కావటంవల్ల న్ర్తీ లీనమైంది. న్ర్తీ వక్త అయితే పురుషడు లీనమౌతాడు. తన ెుుక్క ప్రీతి కోసమే భార్య ఇష్టమైనదవుతున్నది. తన ెుుక్క ప్రీతికోసమే సంతానము ఇష్టమైనదవుతున్నది. ఇత్యాదిగా చెప్పబడ్డ ఉపనిషత్తత్త్వము దీనిలో వ్యక్తమవుతున్నది. ఐహికమైన సుఖము (ప్రేయస్సు) ఆత్యంతికంగా ఆముష్మికమైన శ్రేయస్సులోకి సంగమిస్తుంది. లేకుంటే దానికి ప్రత్యేకమైన న్థిరమైన ఉనికి ఉండదు. ఈనాడు సంపన్న దేశాలలో అసంతృప్తి దృష్ట్యా ఇది చైతన్యం లోలోతుల్లోకి వెళ్లీ శాంతిని వెదుక్కోలేకపోవటం- ఇది అంతర్జగత్తులోని శాంతిని చేదుకోవటం.
ఇక్కడ ‘వేయి పడగల’లోని చివరి సన్నివేశాన్ని గుర్తుంచుకోవాలి. నవల పూర్తయ్యేసరికి చివరకు అరుంధతీ ధర్మారావులు మిగులుతారు. ‘చివరకు నీవు మిగిలితివి. నాజాతిశక్తి’ అని నవల పూర్తవుతుంది. పై గీతంలో ఆమె కూడా మిగులలేదు. అంతా తనలోనే సంగమించింది. వేయి పడగలులోనిది సామాజిక అంశము అయితే ఇక్కడ విశ్వమయతను సాధించుకునే తపస్సులో లీనమైన యోగి ప్రవృత్తి కనిపించుతుంది.
మరొక అంతః ప్రవృత్తిని కవితా లక్షణాన్ని దాని కేంద్ర స్థానంలో ఉన్న కరుణ భావాన్ని వ్యాఖ్యానించే లక్షణం యాభైయైదవ గీతంలో ఉంది. కవి ఆషాఢ మేఘునితో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. లోకంలో సుఖం అనుభవింపగలవాళ్లకు వసంతం మనోజ్ఞమైన ఋతువు కాని కవికి ఆషాఢ మేఘమంటే ఒళ్లంతా జలదరింపు, ‘నా వాక్కులో నిలిపి శివుని అందెల చప్పుడును నీయందు కలిగించాను. మింటికి నీవు మంటికి నేను కవులమైనాము.’ ఆషాఢమేఘం అనే సరికి కాళిదాసు మేఘసందేశం స్మరణకు వస్తుంది. ఆ మేఘం యక్షుని విరహాన్ని ప్రకటించింది. విరహం, వియోగదుఃఖం – లోకంలో ఒకానొకని వ్యధన మేఘం ప్రకటిేన్త ఈ కవి తాను లోకంలోని దుఃఖాన్ని అంతనూ ప్రకటిస్తున్నానని చెప్పుతున్నాడు.
విశ్వనాథ రచనలన్నింటిలోనూ ఒకానొక విస్తృతమైన దుఃఖరేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు లోకం అంటే మిక్కిలి మమకారం. దానివల్ల ఇక్కడి వ్యధలను తాను భరించలేడు. ‘కవి దుఃఖము’ అనే ఖండికలో
‘నిన్నెవరు మెచ్చుకొందు రీ నేలయందు
పలుకు పెళుెనైన వట్టి నిర్భాగ్య కవిని
కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ
దుఃఖ దూషిత వాంఛావిధూతమతిని’
కవి తన కావ్యతత్త్వాన్ని ఇంకా స్పష్టంగా చెప్పుతున్నాడు.
‘భాస్వ ద్వాగ్గత లోభులీజనులు పాపం బూర్జితానంద భా
గ స్వాముల్, నిను నమ్మినందులకు దుఃఖంబల్ల ఆనంద భా
గ స్వామిత్వము పేరపంచుదువు శోకంబున్ రసంబంచు’ (కేదారగౌళ)
విశ్వనాథ ఇక్కడ భవభూతి చెప్పిన ‘ఏకోరసః కరుణయేవ’ అన్న సంభావనకు (కాంెనప్టు) దగ్గరగా వస్తున్నాడు. ‘శ్రీ మద్రామాయణ కల్పవృక్షం’నాటికి ఈ భావనకు విస్తృత రూపమిచ్చి ‘జీవుని వేదన’ అన్న నిద్ధాంతాన్ని ప్రపంచించాడు. అచ్చమైన పరబ్రహ్మ న్థితి నుండి విడిపోయి పరిమితుల్లో జన్మలలో ఉపాధులలో పడిపోయిన జీవుడు ఎరుగకుండానే ఆవేదన పొందటం, పరితపించడం అంతా ‘జీవుని వేదన’గా వ్యక్తమవుతున్నది. ఈ దుఃఖం తాను స్వన్థితి పొందేదాక ఉంటుంది. ఈ విధంగా కవికి లౌకిక పారలౌకిక దుఃఖాలు రెండూ తన కావ్యవస్తువులే అవుతున్నవి.
20వ శతాబ్దపు మూడవ దశాబ్దంలోనే కవి తనకు తాను ఎంత విశ్వాసంతో భావ్యాంధ్ర సాహిత్యమంతా తన ప్రాభవమేనన్న ప్రకటన చేస్తున్నాడు. (71వ గీతం)
‘ఇది ప్రతిన పూనితిని ప్రవహింప జేతు
నీ అడుగు దమ్ములందు అనేకనాక
వాహినులు వాని నీరముల్ ప్రాశనమ్ము
గాగ భావ్యాంధ్రదేశ సత్కవులకెల్ల’
తన ప్రియురాలు- ఆమెయే సరస్వతి. ఆమె బంగారు రెక్కలు గల, మోహింపజేేన అందెలచప్పుడు, మనోజ్ఞమైన క్రేంకారము గల హంస. ఈ హంస కావ్యసౌందర్య ప్రకటన శీలి. ఈ గీతం చివర అంటున్నాడు కవి ‘నన్ను నా సృష్టినేమి యనంగ గలరొ మన శిశువులైన భావి సంపన్న కవులు’
వర్తమానం దాటితేనే కవిని గూర్చిన, కావ్యాలను గురించిన అంచనాలు స్పష్టమవుతవి. అంత ఆత్మ ప్రత్యయంలోనూ, భావిని గురించిన సంశయం ఉన్నదేమో అని కవికి అనిపిస్తుంది. అయితే అది తన కావ్యాసాధనలోని అసామాన్య లక్షణాన్ని గమనించినప్పుడు కలిగే ఆశ్చర్యమేనని తరువాత నిశ్చయం కలుగుతుంది. తన కవిత్వానికీ ప్రేయనికి అభేదాన్ని కలిపిస్తున్నాడు. దాంతో తన కవితా స్వరూపాన్ని విశదీకరిస్తున్నాడు.
‘మధుర మధుర మంజువర్ణ గుంఫనము కల్గి
ప్రకృతి దివ్యార్థ సూచ్యభావమ్ము కల్గి
పరగు కల్యాణిపై పాడబడిన తెలుగు
పాెుుక్కటి నీదు రూపముగ మారె
ఈ సుకవినైన నా జన్మమెల్ల దేవి
అచ్చపు తెలుంగు పడతివైనట్టి నిన్ను
మరల నాతేనె పాటగా కరగిపోయ
త్వత్పదార్పితమ్ముగ నేను ధారవోతు’ (79వ గీతం)
ఇది విలక్షణమైన పద్యం. కవిత్వం రెండస్తులలో ఉంటుంది. ఒకటి బాహ్యరూపం అది వర్ణగుంఫనము అక్షరరమ్యత కలది. లోనారని చూడగలిగిన భావసౌందర్యం. ఇక్కడ కవి తన భావ కావ్య రూపాన్ని యింకా సుందరంగా దివ్యార్థ సూచ్యంగా వర్ణిస్తున్నాడు. దివ్యార్థమంటే ప్రకాశించేది అని- ఈ ప్రకాశం అంతఃకరణంలోని మనస్సును బుద్ధిని, అహంకారాన్ని దాటి చిత్తన్థితిలో సాధారణీకరణం పొందిన వేళ కలిగించే విశ్వచైతన్య ప్రకాశం. అలాంటి కావ్యం సంగీతమాధుర్యం జతగడితే కల్యాణి రాగ రంజితమైతే ఎంతమనోహరంగా ఉంటుంది?
అలాంటి బాహ్యాభ్యంతర సౌందర్యం గల, సంగీత సాంతత్యం గల పాట – కావ్యం తన ప్రియురాలిగా రూపొందింది. ఇక్కడ ప్రియురాలి వర్ణన సంగీత సాహిత్య సమష్టి మాధుర్య పరనీమగా భావింపబడింది. ఆమె మాధుర్యం ఎలాంటిదో మరొక సందర్భంలో ‘మూడుభాషలలోని ముగ్ధభావము లేరుకొని, తెచ్చుకొని దాచికొనిన చోటు’ అని కవి వర్ణించాడు. మరొక చోట ఆమె ఒక పెద్ద వెలుగని, ఆమె జీవితంలో నుంచి అదృశ్యమైపోగా ఆమె నీడయే తన జీవితంలో కవిత్వంగా రూపు కట్టిందనీ అంటాడు. ఇక్కడ ఆమె ఒక పాటగా తానై ఒక అద్భుత స్త్రీ రూపం తాల్చింది. కవి భావనకు యోగ్యంగా ఆమె నిరూపితం అయింది.
కాని కవి జీవితం అంతా ఒక సాధనగా మిగిలిపోయింది. ఒక తపస్సు అయింది. ఆమె ‘అచ్చవు తెలుంగు పడంతి’. ఆమెను మళ్ళీ తేనెపాటగా కరగిపోయటం తన ప్రయత్నం అంతా. ఈ పరిణామం అంతా ఈ విధంగా ఉంటుంది.
పాట ్ట ప్రియురాలు ్ట పాట
పాట ప్రియురాలిగా పరిణమించటం కవి ప్రయత్నంతో నిమిత్తంలేని సృష్టి రహస్యం. రసజగత్తులోని పరిణామం. అయితే ప్రియురాలిని మళ్లీ (తేనె) పాటగా రూపొందించుకోవటం కవి సాధన. అచ్చమైన పరబ్రహ్మము మాయావృతమై జగత్తుగా రూపొంది మళ్లీ అచ్చమైన బ్రహ్మముగా పరిణమించటం వంటిది. ఇక్కడ విడిపోయిన జీవచైతన్యం మళ్లీ సచ్చిదానందమయంగా పరిణమించటం ఎంతో సాధన మీదగాని సాధ్యం కాదు.
అట్లాగే భౌతిక జగత్తులోని అనుభవాన్ని రసజగత్తులోనికి నడిపించి దానికి దివ్యస్ఫురణగల కావ్య సామగ్రిగా కళారూపంగా పరిణమింపజేయటం కవికే సాధ్యమయ్యే పని. ‘కవిరేవ ప్రజాపతిః’ అని ఆనంద వర్థను డనటం ఈ తాత్పర్యం తోడనే. మానుషమైన న్థితి నుంచి పాంచభౌతిక పరిమితులను దాటి, షడూర్ములను ఆకలి, దాహము, శోకము, మెహము, ముసలితనము, మరణము ఈ ఆరు ఊర్ములు అతిక్రమించి దివ్యజీవనాంశను ఈ జగత్తులోనికి అవతరింపజేయటం ఋషికంటె కవికే సాధ్యమయ్యే విశిష్ట ప్రయత్నం. గిరికుమారుని ప్రేమగీతాలు మొత్తం 102 ఖండాల సంపుటి. ఒక్కో ఖండంలో సాధారణంగా మూడు గీతపద్యాలు ఉంటవి. కొన్నిచోట్ల రెండు లేకుంటే ఏ ఒక్క చోటనో ఒకే పద్యమూ ఉన్నాయి. ఈ పద్యాలలో కొన్ని పూర్తిగా ఉండవు. భావం ఎక్కడ తెగిపోతే అక్కడే పాదాంతంలోనో పాదమధ్యంలోనో ఆగిపోతవి. మొత్తం కావ్యం సుమారు 300 పద్యాలు ఉంటవి. ఇవన్నీ ముక్తకాలే. అయినా అన్నింటికీ ఏకాకారం కలిగించిన ఏకసూత్రం ఉన్నది. ఈ సూత్రం కవి ప్రణయ భావం.
ఈ ఖండకావ్యం – కవి వికాసదశలో ప్రారంభమై పరిణతి చెందిన న్థితిలో పూర్తి అగుటవలన ఈ కావ్యంలో ఆ దశాభేదాలన్నీ అంతో ఇంతో స్ఫురిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణకు చిన్నతనంలోనే వివాహం అవటం వల్ల, ఈ కావ్యంలో ప్రియురాలి స్థానం తన ధర్నపత్ని వరలక్ష్మీ దేవికే లభించింది. తరువాతి కాలంలో (1932) ఈమె మరణించగా తరువాత కరుణార్ద్రమైన వియోగ కృతి ‘వరలక్ష్మీ త్రిశతి’ వెలువడ్డది. ‘వేయి పడగలు’ ఈమెకే అంకితం చేయబడ్డది. తనను వరలక్ష్మీ దయితుడని కావ్యంలో పేర్కొన్నాడు.
భావకవుల కావ్య ప్రపంచంలో గీతపద్యానికి పట్టం క్టబడింది. వృత్తాలలో ఉండే గణ నిర్బంధంలేకపోవటం, ఇంద్రసూర్యగణాల ఉనికితో కొంచెం వదులుగా, కవి భావనకు అనుగుణంగా ఒదిగిపోయేటట్లు రూపొందటం వలన ఈ ఛందస్సును వాళ్లు ఎక్కువగా ఆదరించారు. ఈ భావకవిత్వ ఉద్యమం చివరి అంచుల్లో దీనిలో ప్రవేశించిన శ్రీశ్రీ ఈ గీత పద్యాన్ని గురించి ఇలా అన్నాడు.
పద్యములు ముఖ్యముగ గీతపద్యములవి
ెుుసగు నింతంతకాని సంతసము నాకు. . . .
ఒక అనిర్వచనీయ మహోన్నతమగు
హాయి యున్నది గీత పద్యముల యందు. . .
ఆధునిక దివ్య ఖండకావ్యముల యందు
ప్రాణసన్నిభమై గీతి పరుగులాడు (శ్రీ శ్రీ ప్రభవ)
అయితే ఒక నిష్ఠగా కావ్యం నిండా గీత పద్యం మాత్రమే ఉపయోగించింది- గిరికుమారుని ప్రేమ గీతాలలోనే. మిగతా కవులు చాలామంది అధికంగానే గీత పద్యాన్ని వాడినా నడుమ నడుమ ఇతర ఛందస్సుల ప్రయోగము చేనిన వారే.
ఈ కావ్యారంభం కవిత్వ ఆవిర్భావాన్ని గురించి స్పష్టంగా వ్యాఖ్యానించే రచన. కవి హృదయంలో నుంచి వ్యక్తమయ్యే వేళ కవి పొందే వేదన. దానివల్ల పొందే వ్యధ దీనిలో వ్యక్తం అవుతవి. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ, కూకుండనీదురా కూసంతేనపు’ అన్న ఎంకి పాటల ఆరంభము ఇలాంటిదే.
‘అస్మదీయ కంఠమునయం దాడుచుండె
ఒక ఎదో గీతి వెలుపలి కుబికిరాదు
చొచ్చుకొని లోనికింబోదు, వ్రచ్చి పోెు
నా హృదయ మీ మహా ప్రయత్నమ్మునందు’
కవిత్వనిర్మాణంలో వస్తువు కవి సంకల్పంలో ఉంటుంది. భాష అభ్యస్తమై ఉంటుంది. ఛందస్సు నిరంతరాభ్యాస వశీకృతమై ఉంటుంది. అయినా అసలు కవిత్వ పదార్థం అందీ అందకుండా, తెలినీ తెలియకుండా అవచేతనలో భద్రన్థితిలో ఉంటుంది. జాగ్రన్మనస్సులోని ఒత్తిడి వలన అది- అవ్యక్త భావం- శబ్దరూపాన్ని పొంది, అలంకృతమై, ఛందో విస్తృతమై బయటకు వస్తుంది. ఈ ఒత్తిడికి సంబంధించిన చిత్రణమే పై పద్యం. ఒక ఎదోగీతి అది వెలువడే ప్రయత్నంలో ఉన్నది. అయితే తల్లిగర్భంలో నుంచి శిశువు వచ్చినట్లుగా ఎంతో బాధలోంచి బయటకు వస్తుంది. పద్యం ‘వచ్చిపోెు నా హృదయమీ మహా ప్రయత్నమునందు’ కవిత్వ శిశువును వెలువరించే ప్రయత్నంలో కవి హృదయం విశీర్ణమయింది. కావ్యారంభంలోనే కవి సృజన రహస్యమూలాలలోకి ప్రవేశించాడు.
‘వెలుపలికిరాక లోనికి తిరిగి పోక’ ఈ పద్యం కవి ప్రయత్నాల్ని విఫలం చేనింది. ఆ ఒరిపిడిలో, రాపిడిలో హృదయంలో ఎఱ్ఱ సంజ ఉదయించింది. సంధ్యాకాలం రెండు కాలాలకు, దివారాత్రాలకు సంధిని సూచించేది. అంతర్బహిర్లోకాల సంధి, స్వప్న జాగ్రదవస్థల సంధి, చేతనావచేతనల సంధి. ఈ వ్యక్తావ్యక్త సంధి దశలో కవితా సాక్షాత్కారం, సరస్వతీ సాక్షాత్కారం అయింది.
ఈ ప్రారంభగీతం మొత్తం వ్యక్తావ్యక్తాల నడిమి ఘర్షణను వ్యక్తం చేయటమే కాకుండా మరొక అంశాన్ని స్ఫుటం చేస్తున్నది. ఆ కవిత సరస్వతీ దేవి ఆడే నెమలి, పాదకంకిణుల కిణికిణిరావంతో నృత్యం చేస్తూ తల్లియైన సరస్వతీదేవి చేతిలోని కచ్ఛపీ వీణ పలికించే మృదు గీతికలను అనుసరిస్తున్నది. తన కవిత వైయక్తికమైన వలయం అతిక్రమించి మనోజ్ఞ గీతీ నృత్యాలు శబ్దార్థ సౌందర్యముతో విశ్వచేతనకు ప్రతిస్వనించే కచ్ఛపీనాదాన్ని అనుసరిస్తున్నది.
కవి తన కవిత్వ నిర్మాణంలోని మూడుదశలను విస్పష్టంగా వెల్లడించాడు.
1. కవిత్వావిర్భావంలో వ్యక్తావ్యక్త న్థితులకు సామరస్యం ఏర్పడేదాకా జరిగే సంఘర్షణ.
2. హృదయ మథనంతో ఒక భావవేదిక నిర్మాణం కావటం.
3. ఆ భావ వేదిక మీద కవిత్వం ప్రకటమై పరిమిత నీమలను అతిక్రమించి విశ్వచేతనను అందుకొనటం.
గిరి కుమారుని ప్రేమ గీతాల నిర్మాణంలో కవి తన ధర్మపత్ని నాయికగా కావ్య నిర్మాణం చేనినా అది ఆ పరిమితులను దాటి విశ్వమయం అయి జగత్తులోని స్త్రీ పుంసయోగ సామరస్యాన్ని ప్రతిపాదిస్తున్నది. విశ్వనాథ ప్రణయ గీతాలలోని ప్రణయం పరమ సుకుమారమైంది. ఆమె నవ్యహేమ మధుకలశము. అయినా తన అధరానికి ఆ అమృత స్పర్శ ఎరుకలేదు. తాను ఆమెను గూర్చి విరహవేదన పడుతున్నాడు. ఆమె మరిగి పోతున్నది ఎడబాటువల్ల. ఇక్కడ కవి ఇట్లా పరిష్కృతి చూపుతున్నాడు. ‘అచ్చమౌ మహదానంద మనుభవింపజాల దీ శరీరము బాధ సమ్మిళితము కావలయుబోలె నున్నది’ అని ఈ బాధ విలక్షణమైంది. తాము సన్నిహితంగా ఉన్నా సన్నిహితం కాలేనితనం వల్ల వచ్చేది. ఒకరికొరకు మరొకరు తపస్సు చేసుకోవలనిందే. వియోగం వల్ల మనస్సులో ఒక పరిపాకం వస్తుంది. ఒక భావ ేనతువు నిర్మాణం అవుతుంది. ఒక శరీరావధులను దాటిన సంగమం నిద్ధిస్తుంది. (5వ గీతం)
తానేమో ఒక పిల్లగాలి. ఆమె ఒక పూవు. ఆమె ఈతనికి సహభాగిని. ఇద్దరూ స్పర్శ మాత్రంలోనే బ్రహ్మానందానుభవం పొందుతున్నారు. ఇద్దరూ కలనిపోయినప్పుడు ఎంతదూరమో వాళ్లకు తెలియదు. సాయం సంధ్యారాగకాంతులలో విహారం. ఆ సాయంకాలం తూర్పుదిక్కున చంద్రోదయం అయింది. చంద్రబింబం విూద ఒక మబ్బుతునక. అది తమను తన దగ్గరకు రమ్మంటున్నది. మాటిమాటికీ తమ ప్రయాణం అటు దిక్కే (19వ గీతం) ఇక్కడ ప్రియాప్రియుల సంయోగన్థితి వర్ణితమయింది. స్వభావాల భేదం వారిద్దరి సాహచర్యానికి అడ్డు రావటం లేదు. శశిదూతంలో ప్రారంభం ‘అమృతము గూడుకట్టిన దొరా ! అలదూరపు నీలికొండలో కొమరు మిగుల్ నితాంబుదపు కోసల మూసలుపోతు వెన్నెలల్’ అనే వర్ణనకు ఇక్కడి మబ్బునకు పోలికలు ఉన్నవి. వెన్నెల మబ్బు అంచుల్లో మూసలు పోని వెండి శలాకలను మేఘం అంచులలో అమర్చినట్లుగా ఉంటుంది. సాయంకాలం ఉదయించిన చంద్రబింబ మనటంలో పూర్ణిమనాటి సన్నివేశం గుర్తుకు వస్తుంది. సాయంకాలం, చంద్రబింబం, తరకలు కట్టిన మేఘం ఇవన్నీ దంపతుల ప్రణయయోగానికి ఉద్దీపన విభావాలవుతున్నవి. ప్రియా ప్రియులిద్దరూ పూవూ గాలీ అయి పూల పరిమళాన్ని భరించి వ్యాపింపజేేన ఒక పరవశన్థితిలో ఉండే భర్తగా కవి సాక్షాత్కరిస్తున్నాడు.
ఈ దాంపత్యం వెనుక సనాతన సంప్రదాయం ఉన్నది. ఆమె తేజోమయములైన చూపులను చూచి చూచి తాను ఎన్నో జన్మలకు ముందు ఆమె సంయోగంలో విశుద్ధమైన ప్రవృత్తి గల వానిలో పోల్చుకున్నాడు. ప్రణయ దివ్య శయ్యపైన తాను శ్రీరంగనాథుడై పవళించి ఊహకు రాని సుఖాలను భావన చేస్తూ నిశ్చలంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె నిగ్గుల వల్ల తన చూపుల్లోని నిశ్చలత తప్పి పోయింది. (18వ గీతం) శ్రీరంగనాథుని స్మరించటంలో ఆయనన వలచి, ఆయన చేత వలపించుకొన్న గోదాదేవి ప్రణయం గుర్తుకు వస్తుంది. ఆమె ‘నాచ్చియార్ తిరుమొళి’ అన్న ప్రబంధంలో ఈ ప్రణయ వేదనను పదింతలుగా వేయింతలుగా వర్ణించింది. ఆమె స్వప్నంలో వేయి ఏనుగుల ఊరేగింపు (వారణమాయిరమ్) కవిత్వ సౌందర్యమునకు పరాంకోటి. ఇక్కడ తాను శ్రీరంగనాథుడై ఆమె ప్రణయ వివశయైన గోదాదేవి అయింది.
అచ్చమైన దంపతులకు నిత్యసాహచర్యమే. వారినడుమ దూరాలు ఎడబాట్లూ ఉండవు. ఒకరిమనస్సులో వేరొకరు భద్రంగా ఉంటారు. ప్రేమగీతాలలో 36వ గీతం ఈ తాత్పర్యాన్ని స్పష్టీకరిస్తున్నది.
‘నీ వియోగమ్మటంచు నేనిక్కువముగ
నెరుగనే ెురుంగను నాదు హృదయనీమ
నీవకృత్రిమ భావనా నిశ్చితాత్మ
వెల్లపుడు మూర్తి కట్టితివేయ టనుము’
వారికి నిత్యభావ సాక్షాత్కారన్థితి. అందువల్ల నిత్యభావన తొలగినప్పుడే వియోగము. అది పదిలంగా ఉన్నంతేనపూ సంయోగం ‘ఎపుడు నీ పాట నేనాలపించలేనొ రగులుకొనును నాదు హృదంతరమున యందు నీ వియోగాగ్ని అపుడు’
అందువల్ల కేవల కామజీవన పరిమితులు దాటలేని వారి వియోగం వ్యధాభరితం. బెదరిపోవటం, శిథిలం కావటం అన్థితిలో వారికి సహజమైన అంశం. భావసాన్నిహిత్యం గల వారికి వియోగం శరీర పరిమితులలో, ప్రాణకోశ పరిమితులలోనే మనస్సులో ఎప్పుడూ ఒకరిమూర్తి ఒకరికి నిశ్చలంగా ఉంటుంది.
ఈ తాదాత్మ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉదయించే చంద్రబింబాన్ని శివ లింగంగా దర్శించారు భక్తకవులు. వేశ్యావాటికలో శివరాత్రివేళ కాంతా వక్షఃస్థలంలో శివసాక్షాత్కారమయింది మరొక భక్తునికి.
‘భవ మహాపూజ తన్మయ భావమందు
నాపయిన నీకటాక్ష సంతాన లహరి
ఇంతి ! నీవు దోనిళ్ళతో నెత్తిపోయ
శివ శిరః ప్రదేశ కృతాభిషేక మ్యొ’ (37 గీతం)
కార్తీక మాసంలో ఉపవనించి కృశించి ఉన్నాడు ప్రియుడు. కళ్లు ఎర్రపడ్డాయి. ఆమె కడకంటి చూపుల పూలు దోనిళ్ళతో ఎత్తి పోనింది. తనశిరస్సున ఆ పుష్పవృష్టి వల్ల శివాభిషేకం జరిగినట్లయింది. ‘శివోభూత్వా శివమర్చయేత్’ అన్న వాక్యం వల్ల సాధకుడు శివత్వాన్ని శివో-హంభావన ద్వారా లభించుకుంటున్నాడు. అందువల్ల ఆమె కటాక్షసుమవర్షం అభిషేకం అయింది ప్రభువునకు. లౌకికమైన ఉపచారాలైనా మన దివ్యభావన వల్ల పవిత్రతను సంతరించుకుంటాయి. దంపతులు సత్త్వమయ చేతో భూమికలో నిలువగలిగినప్పుడు వారి రసానుభవరేఖలు బ్రహ్మానంద పరిధిని స్పృశిస్తాయి. నాయికా నాయకులు దివ్య దంపతులవుతున్నారు.
తరువాతి గీతంలోను కార్తీక మాస శివార్చన ప్రసక్తి ఉన్నది. సంధ్యాకాలంలో శివాభిషేకం నిర్వర్తించారు. అభిషేకాంతంలో ్టర్పూరహారతి ఇచ్చారు. ఈ సన్నివేశం (విశ్వనాథ వారి తండ్రి శోభనాద్రి 1902లో ప్రతిష్ఠించిన) విశ్వేశ్వర స్వామి ముందర జరిగింది. ఆయన స్ఫటిక లింగమూర్తి. ఆ మహాఖండహారతి వలన శివలింగంలో దంపతులిద్దరూ ప్రతిఫలించారు. అప్పుడు వారికి తాము అర్థనారీశ్వరులేమోనన్న భ్రాంతి కలిగింది. తమ ప్రతిఫలనంలో అర్థనారీశ్వర భ్రాంతి పొందటం- వారు అప్పటి దాకా సాగిస్తూవున్న నిత్య శివభావనయే కారణం.
అర్థనారీశ్వర భావనలో ఎక్కువ తక్కువలు, అధికారము లొంగుబాట్లూ లేవు. ప్రణయ కవిత్వానికి దివ్యభావ స్పర్శను అంతో ఇంతో ఈ కవులు సంక్రమింపజేశారు. అయితే విశ్వనాథ ప్రణయ కవిత్వములో శ్రీ విద్యా సంప్రదాయ విశేషాలు అంతర్గర్భితంగా ఉన్నాయి. వీరి సాధనలో కులస్త్రీ పరాభట్టారికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పురుషడు మహాభైరవుడవుతున్నాడు. ఉపాసకుడవుతున్నాడు. ఇది శ్రీ సంప్రదాయంలో పరాకాష్ఠయైన న్థితి. అందువల్ల స్త్రీ ఆధిక్యం నిద్ధిస్తున్నది.
ఈ భావన పరిపుష్టమై అక్కడక్కడా సోపానమార్గంలో సాగిపోయినట్లుగా కనిపిస్తుంది.
‘అస్మదీయ వినీలదేహమ్ము గూడ
మత్కులాంగనా బాహుహైమచ్ఛవి సుప
రివృతమయి రమ్యమొహనాకృతి వహించు
నన్ను నిక నిగ్గుపుచ్చుచున్నదియు గూడ ’ (గీతం 85)
దేవీ హిరణ్మయకాంతి పృథ్వీలక్షణంలో చిక్కుకొని ఉన్న వినీలదేహుడైన సాధకునికి తన దేహం రమ్య మోహనాకృతియై కనిపిస్తున్నది. తపస్సాధన దేహకాంతి పరివర్తనం చెందటం శ్రీ అరవిందుల జీవనంలో మనం గమనించవచ్చు.
పరదేవతానుగ్రహం పొందటానికి ఆమె ఎంచుకోవటం ముఖ్యం. ఎవరిని ఈశ్వరుడు ఎన్నుకొంటారో వారికే ఆతడు లభ్యమవుతాడు అన్న ఉపనిషద్వచనం ఇక్కడ గ్రహింపదగింది. పరస్పరం వారు ఎలా సంభావించుకుంటున్నారో తరువాత వివరిస్తున్నాడు కవి. ‘నాకు శంపాలతాంగి సౌందర్య రాశి / నన్నుజూచి యీ శంప సౌందర్యమూర్తి కనుచునగి పరిష్వంగించు’ శ్రీ శంకరులు చెప్పిన ‘ఆనందస్ఫురదనుభవాభ్యాం’ అన్నమాటను యిక్కడ అన్వయించుకోవాలి. ఆనందానుభవానికి పరస్పర సౌందర్య స్పృహ ఆధారభూతమవుతున్నది. తన కులపాలికకు పార్వతీదేవి తోడ సామ్యము చెప్పటం ప్రధానాంశంగా మరొక గీతంలో (81లో) కనిపిస్తుంది
‘చరమ సంధ్యయుబలె ఫాలచంద్రరేఖ
నీలజలదకేశ ప్రసూనజాలమధుర
మూర్తి మత్కుల పాలిక ముగ్ధ హృదయ’
ఈమె కొప్పుననున్న పుష్పములే చంద్రరేఖగా రూపొంది ఉన్నాయి. అయినా మానుషమైన దేహ పరిమితులలో ఎన్నో దోషాలు ఉన్నవి. వ్మైం ప్రవాహమై క్రమ్ముకొంటున్నది. ‘గదుముకొన్న ముక్తి పొలాలు వదిలిపెట్టి / గెలుచుకొన్న వ్మైల నేలలకు వంగి / అకట సాలోచనాక్షుడ నైతినిట్లు (50 గీతం) ఇది విచిత్రమైన ఓటమి. సామాన్య జనులకు ఈ వెనుకకు తగ్గటమే గుర్తుగా ఉంటుంది.
‘కనుగొనిన వారు నను వసంతుని సుమాస్త్రు
గురిచి యజ్ఞ దీక్షితుడనుకొనిరి గాని
గేస్తురాలవు నీవ అగ్ని సమకూర్ప
నగు నిజానికి కర్మిష్ఠినని ఎరుగరు’
ఇక్కడ గేస్తురాలు సమకూర్చిన అగ్ని సామాన్యమైన అగ్ని కాదు. ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన కామసాధనాగ్ని. 80వ గీతంలో తమ పెళ్లికి సాక్షిభూతుడైన అగ్ని మళ్లీ తన చేత అర్చితుడు కానేలేదని అందుకే రెట్టించి చెప్పినాడు. మరొక గీతంలో (87) ఇట్లా భావన చేనినాడు కవి.
‘నీవు నా గుండె కదలించినావు దేవి-
దేవి తత్రత్యులగు సర్వదేవతలును
అనభిహుతములు హవ్యకవ్యములు పొంది
నా ఆకర్మిష్ఠిత క్షమించినారు దేవి’
ప్రణయోపాసన శ్రౌత విధియైన యజ్ఞాది కర్మలకు అగ్ని ఉపాసనకు ప్రత్యామ్నాయమైంది. ఈ అగ్ని గార్హపత్యము ెుుక్క వ్యవహారరూపం. ఈ అర్చన సృష్టి వికాసహేతువు. ఆనందసాధనకు, ప్రజాతంతు నిర్వహణకు హేతువవుతున్నది. అందువల్లనే కావ్యం అంతా నిశ్రేణిక నెక్కినట్లు భార్య, ప్రేయని, ధర్మసహచరి, దివ్యకాంత, సౌందర్యలోకాధిష్ఠాత్రి, సర్వచైతన్యపరిపాలిక, పరదేవత ఇలా ఎదుగుతూపోయింది. కవి భావప్రపంచంలో స్వర్గానికి మెట్లు కట్టాడు. ఈ ఒక్క పద్యంలోనే మూడుసార్లు దేవి శబ్దం వాడి ఆమె యందు తాను సాక్షాత్కరించుకునే త్రిశక్తులను – శ్రీవాణీ గిరిజలను భావిస్తున్నాడు.
‘శ్రీదమై శాంతమై సవిూచీనమైన
అవ్యయపదంబునందు నింహాసనమున
నీవధిష్ఠాత్రి వేలుచున్నావు కమల
పవనములు వీచు నీపదాబ్జముల నుండి ’ (49 గీతం)
తత్త్వ సాక్షాత్కరానికి ఇది పునాదిగా కొనసాగింది. ఆమె అనంతభావాలయయై విశాల భావసామ్రాజ్యాన్ని ఏలుతున్నది. అందువల్ల ప్రణయ కవిత్వం భావకవిత్వంగా పరిగణింపబడుతూ వచ్చింది. ‘గిరి కుమారుని ప్రేమ గీతాలు’ ప్రణయ కవిత్వంలోని ప్రతిపార్శ్వాన్ని స్పృశించింది. కావ్యసౌందర్యానికి పట్టం కట్టింది.
గాఢమైన భావుకత్వం చేత దీనిలోని ప్రతిగీతము విపులంగా వ్యాఖ్యానింపదగిందే. విస్తృతంగా అనుభవంలోనికి తెచ్చుకోవలనిందే. కవిలో ఈ రచన హఠాత్తుగా పొడుచుకువచ్చింది. ప్రారంభగీతంలోనే ఇది స్పష్టం అయింది ‘ఇవి యధాకంఠ నిర్గతం బివి తధా విలిఖితములు ప్రేమగీతముల్ దేవి’ ఈ గీతరచనలో కవి ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం రచన సహజోద్గతమైంది. అందువల్ల విలక్షణమైన అవచేతన ఏర్పరచిన క్రమానుబంధం దీనిలో రూపొందినట్లు కనిపిస్తున్నది.
అయితే ఈ గీతాల సౌందర్యం గురించిన కవి భావన విచిత్రంగా కానవస్తుంది.
‘నీ పయిన పాడినట్టి నా నిభృతగీతి
పాడుటెు పరమార్థము ఆ పైన దేవి
అందు ప్రత్యక్షరమ్ము నీ మందహాస
బాలచంద్రాతపములలో ప్రజ్వలించు’
ఈ భావ మణిభంగ దీప్తుల వల్ల ఈ కావ్యం ప్రణయ కవిత్వ శిఖరంగా ప్రకాశిస్తున్నది.

(కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంవారి
‘ఆధునిక కవిత్వం’ అన్న గ్రంథం కోసం వ్రానిన రెండు వ్యాసాలు, 2007)

కోవెల సుప్రసన్నాచార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *