విశ్వనాథ (వీర)వల్లుడు

భమిడిపాటి కృష్ణమూర్తి

చిన్న నీటి వినుకు. దాన్ని సాగరంతో పోలిస్తే నిన్న బిందువు. అయితే నేం, ఆ చినుకు మీద సూర్యకిరణం పడితే ఇంద్రధనుస్సు వెలుస్తుంది. ఆ ఇంద్రధనుస్సు లో స్థూలంగా చూస్తే కేవలం ఏడు రంగులు మాత్రమే గోచరమవుతాయి. కానీ ఆ సప్త వర్ణాల నుండి అగణితమైన రంగులు ఉత్పన్నమవుతాయి. వీరవల్లుడువిశ్వనాథ సాహితీ సాగరంతో పోలిస్తే ఒక చిన్న నీటి బిందువు. ఆ బిందువు మీద విశ్వనాథ ప్రతిఖా కిరణం పడింది. తత్ఫలితంగా ఒక విచిత్రమైన ఇంద్రధనుస్సు విరినింది. అందులో అన్ని వర్గాల సమైక్యమై వసుదైక కుటుంబంగా ఉంటుంది. అసలు విశ్వనాధ సృష్టించిన పాత్రలు సజీవమైనవి. అటు బ్రహ్మ సృష్టి ఎంతో, ఇటు విశ్వనాధ సృష్టి అంత. అందుకే ఆయన సృష్టించిన పాత్రలతో బ్రహ్మ సృష్టి ప్రతిబింబిస్తోందా, లేక బ్రహ్మ సృష్టి లోనే విశ్వనాధ సృష్టి ప్రాణం పోసుకుందా అన్న అనుమానం ఒక్కో పాత్రను చదువుతున్న కొద్దీ. అనిపిస్తుంది. మరో విచిత్రమైన విషయం . విశ్వనాథ కుల పక్షపాతిఅని, ఆయనకు తన కులం కాని ఇతర కులాలు అంటే గిట్టకపోవటమే కాకుండా, చిన్న చూపు కూడా ఉందని ఒక అభిప్రాయం సాహితీ లోకంలో ఉంది. తద్వారా ఆ అభిప్రాయం సాహితేతర రంగాలలో కూడా విశ్వనాథను గురించి వ్యాపించింది. నిజానికి ప్రధ కేవలం అప ప్రథ మాత్రమే. -విశ్వనాథ వారి వీరవల్లుడు, బద్దన్న సేనాని, మా బాబు ఈ అపప్రధను తొలగించినవారు. వీరవల్లుడు మరీ మరీ చిన్న వాడు. అందునా పాలేరు. అంతవరకైతే పర్వాలేదు. వాడు మాలవాడు. ఈ మాల- మలనే యగుదున్ అన్న మాల కాదు. ఎందుకంటే మా నాన్నే. నాకా పేరు పెట్టలేదని, అప్పుడప్పుడనిపించేది. అందుచేత నేనా పేరు నీకు పెట్టానుఅన్న మాల యిది. ఇక్కడ అంటరానితనం లేదు. ఈ పేరు పెట్టింది బ్రాహ్మడు, తన కొడుక్కి, ఇహ ఈ వీరవల్లడెల్లాంటివాడు? ‘ …వల్లుడు గబా గబా వచ్చాడు…కేక లేసుకుంటూ. ఎవరి మీద? మా నాయన మిద (ఆ నాయన బ్రాహ్మడు). అదీ ఎల్లా కేకలేశాడో? ‘ నీ వేమో కోడలమ్మను కావలించుకుని కూచోటం తప్ప ఇల్లు కదలవు. నేను చచ్చింతర్వాత తెలుస్తుంది నీ పాట్లు అన్న ధోరణి లో. (ఇప్పుడు 65 సంవత్సరాల వయస్సున్న నాకే నా చిన్నతంనలో అంటుకొంటు లేని…. అంటే మాల మాదిగ వాళ్లని దూరంగా ఉంచాలన్న భావం…ఎనో సంఘటనలు అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడే కాదు – అప్పుడు కూడా అస్పృశ్యత అంటే నేనెరుగను). ఇది ఒక మాల వాడు ఒక బ్రాహ్మణ్ణి అన్న మాటలు. ఆ నాటి ఇలాంటి మాల మాలనే యగుదున్ అన్న నాటికి ఎలాంటిమాలగామారాడో గమనిస్తే, దానికి కారణాలు పరిశోధిస్తే విశ్వనాధ సర్వమానవ సౌభ్రాతృత్వంహ, విశ్వజనీతద్యోత కమవుతాయి. అలా కేకలేస్తూ వచ్చిన వల్లడు, ఆ కామందుని చెయ్యి పుచ్చుకు, నిద్రమంచం మీంచి, లాక్కుపోతాడు. ఈ నాటి వరకు వల్లడి వంశపు నెత్తురులో ఈ దేవతా గుణం లేశమైనా చెదరలేదు‘. అంతే . కాదు కామందు పాలేరు సంబంధం ఎంత గట్టిదంటే, …. వాళ్లు వదిలి నేను మాత్రం ఉంటానా? నేనూ వాడితోనే ఏకాశీయో వెళ్లిపోతానుఅన్నంత గట్టిది. మెల్లి మెల్లగా ఇతర కులాల వారిని తీసుకువచ్చి వాళ్లకూ భాగాలు పెట్టి అడవి అంతా కొట్టించి, చివరకు ఊరు ఏర్పాటు చేశారు. (ఇల్లా ఊళ్లు ఏర్పడటం నా చిన్నప్పుడు… మావైపునుండి అంటే కృష్ణాజిల్లా నుండిమంది. అన్ని కులాలవారు కలిసికట్టుగా, నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడడం చూశాను. భాగవతం లోనివి. భారతంలోని పద్యాలు చదువుతూ వుంటాడుఆయన (కమ్మవారు) ఒరే మల్లా నువ్వేనాఅని పలకరిస్తే అవును తాతా అని చనువు, వరస కలిపి సమాధానం చెప్పాడు వల్లడు. అలా కులాలు పేరుకే కులాలు గాని ఆంతర్యంలో, ఆత్మీయంలో కులాలు కేవలం వృత్తులుగా (అందుకే పూర్వం వర్గాలు అన్నారు రాస కులం అనలేదు) పరిగణింపబడి, అందరూ ఒకే కుటుంబంగా మెలిగే వారు. ఈ వసుధత్వానికి అద్దం పట్టుంది వీర వల్లుడు కథ కథనం. ఇంక ఆచారం, ఆవారాలు మనిషి పరిదులు దాటకుండా వుండేం దురుగాని ద్వేషం పెంచుకునేందుకు కాదు. ఆ ఆచారాలు గౌరమర్యాదలు పొందాయే గాని హానంగా చూడబడలేదు. ఆ విషయం, వీరవల్లడు తన దొరసానిని తీసుకురావడానికి వార్లవూరు వెళ్లి ఆమెతో మాట్లాడిన తీరు, వ్యవహరించిన పద్దతి, గౌరవించిన వైనం ఈ విషయాన్ని వెల్లడిస్తాయి. ఈ కథంతా మా నాయనగారు ఆరోజున రాత్రి నాకు చెప్పారు. నాకు తెల్లవార్లూ నిద్రపట్టలేదు అనుకున్నారు ఆ బాపడు. మరి వల్లడు కేకలు వేస్తూ వచ్చాడు. వాణ్ణి చూట్టంలోనే వల్లా అని పిలిచి ఎడవటం మొదలుపెట్టాను. వాడి తెలిసి ముందర నేనెంత లని అనుకున్నాను. వల్ల మదలింపుఏమయ్యా! కుర్రాయనకు చెప్పావాయేమి నాకథంతా! బలేగ వినగలవాడవు! కుర్రాయన కేమి తెలుసుఅని చివరికిలా అంటాడు.

అవ్వన్నీ వట్టిమాటలు బాబూ, మీ నాయన అంతేలే అన్న కలిపించి చెప్తాడు. బాబూ ఏడవకుఅని అదొక విసురు తెచ్చుకని ఏడిస్తే పొలం ఎల్లా చేస్తావు?లే, లేఅని అంటాడు వల్లడు. అందులో ప్రాసంగికంగా ప్రజల జీవన సరళి, పరస్పర గౌరవమర్యాదలు, రాజరికపు చట్ట విరధులు మొదలైన విషయాలు స్థూలంగా స్పృశించబడ్డాయి. ఈ నవలలో నాయకుడు విరవల్లుడు మాలవాడు. మాలవాడు విశ్వనాథ సృష్టించిన మాలవాడు. ఆయన గౌరవాన్ని, ఆప్యాయతని, ఆత్మీయతని చూరగొన్నవారు. చివరి వాక్యంలో ధ్వనిని ఆలోచించండి ఏడిస్తే పొలం ఎల్లా చేస్తావు, లే, లేఇందులో పొలం చేసేది, చేయించేది ఎవరో తెలుస్తుంది. మరి ఈ గౌరవభావం ఈ నాడు ఎంతమందిలో వుంది ?విశ్వనాథకు కులాల పై గల అభిప్రాయానికి, ఆప్యాయతకు అర్ధమైనవాడు వల్లడు. ఆయస అన్ని కులాలలో వ్యవహించిన తీరుకు సజీవ రూపంవల్లడు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *