అరికాళ్ల కింద మంటలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీపాద సుబ్రస్మాణ్యశాస్త్రి

 

దిమ్మ చెక్కలాగ ఆలా కూచోకపోతే కాస్త గంధం తీయ్య రాదు ? రోజూ పురమాయించాలా?

* పెద్ద బావ నిన్న నే వెళ్ళిపోయాడు. కదా యిం కెవరికీ?

గంధం పూసుకోతగ్గవాళ్ళే కనబడ్డం లేదూ నీ కింటోనూ?”

పోనీ, పురమాయించినట్లు చెబితే యేం?” 

మీ అమ్మా మీనాన్నా – నోటితో చెప్పాలి? టే 

లేకపోతే యెలా తెలుస్తుంది నా వంటి దానికి?” 

*నిజంగా నీకీ మాత్రం వూహ తోచనే లేదు? ముసలాళ్ల ముక్కాళ్లా వాళ్ళ కేమే 

నిక్షేపం లాగ గంధం పూసుకోక

 * ఈజన్మలో నీ కెలాగా ఆయోగం లేదు. ముందు దన్మలో నయినా సుఖపడా లంటే యిప్పుడిలాగ ముత్త యినువులికి గంధం తీసి యివ్వడమూ, మల్లె మొగ్గలు దండలు గుచ్చి వెన్యుడమూ – అందులోనూ కన్న వాళ్ళకి. ఇంతకంటే పుణ్యం యేమీటే

 

చూశా అనుభవించా, గంధం పూసుకుంటే యెలాంటి సుఖం కలుగుతుందో, వొకళ్ళ కలాంటి సుఖం కలిగిస్తే యెంత పుణ్యం వస్తుదో తెలవడానికి? ఇంతకీ, ఈజన్మలో యింతయింది, ముందు జన్మలో సుఖకడ నేమో అని బెంగ. ఏదో, చేతులారా ప్రాణాలు తీసుకో లేక బతకడం. పోయినా ముం జన్మలో మనిషి.నే అయి పుడతా నన్న మాటేమిటీ

 

నిజమే. ఇలాంటి బుద్ధు లుండే వాజమ్మకి మనిషి జన్మ రమ్మంటే మాత్రం, యెలా వస్తుంది?” –

వచ్చేం పురగదోసింది? ఇంతకంటే పరువు జన్మో, పెట్టజన్మో వస్తేనే వదం, మరాఠా యీకోతా—”

 

వెనకటి జన్మలో యెవళ్ళని చూసి యేడ్చావో ? ఎవళ్ళ ముఖం పడగొట్టావో? ఎదర్శకి యెడబుధాలు కల్పించావో? లేకపోతే నీ కిప్పు డీరాత యెందుకు వస్తుంది? కనక ముందుజన్మకోసం జాగ్రత్త పడవే అంఛే

అంశాళ్లకండ వంటలు నీకోసమే గాని నాకోసమా యేమిషి?”

* నీకోస మని యెవ ధన్నా దేమిటి? అన లెవరికోసం అయితే మాత్రం నాకు తప్పుతుం దేమిటి? నువ్వు

ప్రేమ వున్న దానవు కపక నీకూతురు కోసం గంధం తీయ్య మన్నావు, తప్పని యేవ రన్నా రేమిటి? నా వూహ కలగ లేదు గాని నేనేం తీయ్య వన్నా నా తీయ్యనా? నువ్వు స్పష్టంగానూ, కచ్చితంగానూ చెప్పావు కనక యివాళ

మొదలుకుని యేరోజు అయినా తియ్యక పోతే అడుగు, తిని కూచోవా లంట సాగుతుందా యేమిటి నాకు? రెక్కల్లో సత్తున వుంది కదా?”

వోసి నీ ముగం యీడ్చా, కాస్త మాట అనే టప్పటి కొంత దండకం విదేశావే

తల్లి తండ్రికీ చెయ్యడానికే యేడ్చి దానవు నువ్వు మరొకళ్ల కేం చేస్తాము

పెద్దశావ వుండిన వారం దినాలూ యేడుస్తూనో, మొగం మార్చుకునో కాస్త గంధం తీశావే! స్నానానికి దీన్ని వేన్నీళ్లు కాచావే! ఇంతేనా నువ్వు చేసింది అత గాడికి

వేదం అంతా చదువుకున్న బ్రాహ్మడు, అతగాడికి చెయ్యడం దేవుడికి చెయ్యడం రాదు షే?”

అవివరా లన్నీ పెట్టే పుట్టిన వాళ్లకి గాని నాకు కాదు. వాబతుక్కి దేవు డయినా వొకటే, మని వయినా వొకటే తుదకి దెయ్యం అయినా వొకటే. ఎవరి కయినా చెప్పిందల్లాలోచింది కూడా నయి సంతా చేశాను. నేనేమి వొళ్లు దాచుకో లేదు, దాచూ

దాచుకుందా మనుకుం ఛే సాగనిస్తారా యేమిషి?” “సాగనిస్తున్నారా మేమిటి? సాగనివ్వ మని నే నేశ్చానా యేమింటి? దాల్లో గేదీ వుంది, యింట్లో నేనూ వున్నాను, ఇంటిల్లపాదికీ

వోసి నీసిగ్గు చిమడా, కని పెచే గేదికీ నీరూ సాహ త్యం పే? కనాలని – యెంత వూహ వుందే దిక్కు మాలిన పీనుగా?

…………..” 

*దరిద్రం వోడుకుంటూ పుట్టావు నీకే అంత అదృష్టం

నువ్వే ముహూర్తాన కడుపున పడ్డావో అప్పుడు చచ్చి బతికింది మాఅమ్మ. నువ్విలా చేటలో పడ్డావు,

మీనాన్న వుద్యోగం అలా పోయింది

నాకు పుస్తి కట్టాడు. ఆపిల్లాడు చచ్చాడు. ఏం, యీమాట కూడా అన్నావు కాదేం? “

వూసి నీ యిల్లు అసలే దేవుని యింకా ముదలకించడం కూడానా? నిజంగా నిన్ను పెళ్లాడి వుండకపోతే బతి కేవుండును. ఆ వెర్రితండ్రి, పదహారే, “థరుడు ఫారం

 అతనెంత వుద్యోగస్థు డయిపోయి వుండునో నీకే తెలుసూ? పైగా చచ్చాడు. చచ్చాడని యీస డింపు కూడానా? “

నీకు పుస్తకట్టడమే అతనికి ముప్పయిపోయింది

నువ్వు కాలు పెట్టావు, వో కొడుకు తల్లి కడుపు కాలిపోయింది..

నిజంగా వచ్చే సుఖపడ్డాడా అబ్బాయి. అతను బతికే వుంచే నువ్వు కాపరం చేస్తునా? కాపరమే చేస్తే అన్నం పెడుదువా? అన్నం పెడితే నిద్ర పోనిస్తునా? “

నిద్రపోనిస్తే ఆనిద్రలో, ఓక ఒపిక చంపెయ్యక పోదునా?”

*, ఆ! ఏమని పేలావూ! ఎంత పొగరెక్కి పోయావూ?

………………

* నువ్వంత పనీ చేసే దానవు మాత్రం అప్రుదువు విన్నావా? నువ్వెంత కేనా సాహసురాలవు.

* చేసుకున్న వాణ్ణి, చచ్చి స్వర్గాన్నున్న మొగుణ్ణి –

నన్ను చేసుకున్నాడు గదా, మరి, ఆపిల్లాడికి స్వర్గం వస్తుందా? “

నిజమే. అదీ నిజమేనే, ఎంత జాణ వయినావూ? కొంప చెడపుట్టి- మనోవర్తి కయినా గతి లేకుండా

ఉమనోవర్తా? నా కెందుకూ మనోవర్తీ!? నాకు డ బ్బెందుకూ? చాకిరీ చెయ్యడం కోసం పుట్టాను. ఎవళ్ళు చేయించుకున్నా చేస్తాను. చేయించుకున్న వాళ్ళు గంజి నీళ్ళు పొయ్యకపోతారా? చేయించుకోడాని కయినా పొయ్యకపోతారా

కనకచెయ్యి, పుచ్చినట్టు చెయ్యి

పుచ్చిపెట్టేం, చచ్చినట్టు చేస్తాను. 

చేస్తూనూ వున్నాను కనపడ్డం లేదూ? ” 

కనపడ కేం, నిక్షేపం లా కనపడుతోంది. నా కే,

ఆరి కాళ్లకింద మంటలు కనపడగా? మీనాయనమ్మకి లాగ నాకూ కళ్ళు పోవా లనుకుంటున్నావు కాబోలు, వొఖ్ఖ నాటికి పోవు. నన్నన్న వాళ్ళ కళ్లు పోతాయి. దించుకుపోతాయి.

 … … …నా చేతుల్లో పుట్టి, నా చేతుల్లో పెరిగి నన్నే దిరిస్తావా? వన్నెది డొస్తావా అంఛ! నన్నెదిరించి నువ్వు బతగ్గలవు మే? “

నాకు బతకాలని వుంటెనా నీతో పంతం వేసు కోడానికీ? కనక ఆవుపాయం మాత్రం కాస్త తొరగా చూడు, చాలా పుణ్యం వస్తుంది నీకు

ఏమన్నావూ? ఏం పేలుతున్నావూ? నేనేం మందులు పెడతానా మాకులు పెడతానో? ఎంత లేని మాట లంఛు న్నావే చలి తేలు లాగ కుక పీనుగా! :

ఎంక వెళ్ళు కరుచుకు తిరుగుతున్నా నే పింజారీ!

“……చద్దువు గాని, చద్దువుగాని నేను కాస్త నిద్రపోయి లేచాటప్పటికి, అవిగో, ఆకంచులు బాగు చెగ్యుగపో మహమ్మాయి వండిం చేస్తానో లేదో చూసు కుందువు గాని

కుట్ట నని నోటితో అనాలా యేమిటి? పైగా సీయిష్టం గా నాయిష్టమా యేమిటి! నాయిష్టమే అయితే నువ్వు వాయిదా వెయ్యగలవా యేమి?”

ముదు పుచ్చుకున్న పని వెనక్కి పెడితే అదే మంటుందో యేమయినా ఆలోచించావా?” 

కొడుతుందా యేమిటి?”

“దాని కూతురికి లగ్గం మించిపోతుందా యేమిటి?

*అసలు పెద్దదు ఓ నీ కభిమాను. అది నే నెనగ వనుకున్నావా

స్పష్టంగా అలా చెప్పెయ్యక ముసు గులో గుద్దులాట లెంగళూ?”

దుడుగూ దుడుగూ మాట లనెయ్యడ మేనా కాస్తీనా నాసంగతి చూడ్డం వుందా?”

నీసంగతి కేమమ్మా! వండాలా వార్చాలా?” “అదే వయం, మః కట్టుకు టే చాలా పనులు గప్పి సోతాయి.

ఇప్పుడయితే సూత్రం, యీకసిన్ని కంకులూ బాగుచెయ్యడ మేనా?”

“…….కా సిన్నిటే యివీ?”

*కాసిన్ని కాదు, నాలుగు కుంచాలు, అంతేనా?” 

ఇప్పు డెన్ని గంట లయిందో యెరుగుదువా?”

* రెండే గాదూ? మూడు కొట్టాటప్పటికిదయిపోతుంది తరువాత

ఒక్క గంటలోనా

పోనీ నాలుగింటికి. ఏం: ఈవాళ యేం చేస్తా వమ్మా

* గంధం యెవరు తీస్తారూ?” 

అదవరి కే బావ నిన్ననే వెళ్ళిపోయాడు కాదూ!” 

అమ్మ నాన్నకీని

 “అమ్మ తీయ్యమందా

 “అమ్మ కాదు. అమ్మమ్మ

 “అదేమిటే

ఆ దేమిటే  ఆం టే

అమ్మమ్మ చెప్పడానికి 

తప్పేం ప్రేమగల తల్లులు, ముద్దుల కూతుళ్ళకోసం పురమాయిం చుకుంటారు. చెప్పకుండానే యెందుకు తీశావు కాదని

శాబాసు ………… పోనీ, అరగంటలో అదయిపోతుంది. తరువాత?”

అరగంటకా 

వొక్క గంటకే అను. అప్పుడు?” 

అప్పటికి మరో కొత్త పనీ తగలకపోతే అక్క, కూతురి జుబ్బా

“……. ఎంత చెప్పినా చివరి కదే మాట. కాస్తేనా సరసం తెలిస్తే నా? ఇవాళో రేపో వస్తారు. మీ బావ. నెల్లాళ్ల కిందట వచ్చినప్పుడు తెచ్చి యిచ్చా .. మళ్లీ వచ్చాటప్పటి కేనా

ఇన్నా చెప్పావు కావేం మరి?

ఇప్పుడు కొనకం వచ్చింది. కాకపోయినా గంట ఇవి. ఎన్నాళ్లు చెప్పా లేమిటి యీమాత్రం మహాభాగ్యా నికీ? నువ్వు గట్టిగా తలుచుకుంటే అరగంటకే అయి పోతుంది………. కుట్టి పెట్టవే, ఏమే చెల్లి

కుడతా నన్నాను కాదూ?” 

ముందు కుట్టాలి …….ఏం?”

ఏది ముందయినా నాకొక్కటే. 

అయితే పెద్దక్కకి కోపం రాకుండా చూస్తావా మరి?”

” …… నీ యిష్టం వచ్చినట్లు తగులడు. నేనే పని చెప్పినా యింతే నువ్వు. 

పెద్ద దంటే చచ్చిపోతావు. అదీ నువ్వూ కట్టకట్టుకుని గోదావరిలో దిగండి. కాస్త

రైక భాగ్యానికి నేను కుట్టుకోలే ననుకున్నావు కాబోలు పాపంనువ్వీ మాత్రం సాయం చెయ్యకపోతానా అని ఆశపడ్డందుకు పోనీ, రేపు సాయంత్రానికి తప్పకుండా కుట్టేస్తావా?”

…………” 

**వీలయితే రేపు పొద్దున్న కుట్టె య్యి. కొత్త చీర కట్టుకుని పాపసోడెమ్మ అ త్తగారి యింటికి వెడదా మను కుంటున్నాను. దానిమిది కిదెంతో బాగుంటుంది. కదుటే చెల్లీ

చెల్లాయికి తల అంటడమూ, తమ్ముడికి తల దువ్వ డమూ—”

అవెంత సేపే?”

 “మరి దూడల సాల?” 

బాగు చేస్తా వనుకో

పితికేస్తావు. దాలిమీద పడేస్తావు. చలకూడా అయిందనిపిం చేస్తావు. నాన్న పంచె వుతికి ఆరేస్తావు. ఇంతేనా? ఇంకేమిటమ్మా?

అవన్నీ నీ కెందుకు, నేను చూస్తాను కాదూ?? 

చూస్తా నేమిటీ చేస్తా నను

 “అంటే చేసినట్టూ అనకపోతే మానేసినట్టూనా?” * 

యేం సంగనాచివే నమ్మా?

ఎంత కటికితనమే మాతల్లీ?” 

“…………………………

ఎంత బలిమాలినా గదా అనే – అయితే రేపు నాయంత్రానికి తప్పకుండా కుడతావా?”

కుడతాను

మరిచిపోకు సుమా, అసలు, మధ్యాహ్నం భోజ నాలు కాగానే నీదగ్గరే పడుకుంటానులే నేను. దిక్కు మాలిన యెడలు ముదిరి పోవడంవల్ల తిండి తినగానే కసింత సేపు నిద్రపోతే గాని మళ్ళీ నేను లేచాటప్పటికి కుట్టేస్తావు కాదుటే

…………

మీ బావ యెంతో మెచ్చుకుంటారు నిన్ను . మాకు వుద్యోగం అయా? నువ్వు వచ్చి చూడగ్గిర పుదువు గాని, ఏం, వుంటావా?”

……………….” 

మాట్టాడవే మే?  

మాట్టడం యెందు కూ? ఎవరి దగ్గరా వుండకపోతే

రోజు లెలా వెడతాయి నా బతుక్కీ? “

ఎంతమా టన్నావే దిక్కుమాలినదానా! నీకంత నీరసంగా వుందా నేనంటేనూ? నువ్వు రాకపోతే నేను చేసుకోలే ననుకున్నావా? అసలు, వంటలక్కనే పెట్టేసు కుంటాము. మేము. ఒకళ్ళ అవసర మే మాకు లేదు

*తోడబుట్టినడానవు కదా- లేనిదానవుగదా అని రేపు కుట్టకపోతే అమ్మమ్మ చెబురా నే మనుకున్నావేమో

’………….‘

వోస్ ! మాట్లాడితే కళ్ళమ్మట నీళ్ళు. ఎవడికి భయం లేదు

’………‘

* జుబ్బా యెంత వరకూ ఇంకెందుకే గంధం?” 

*పూసుకోడానికి

ను… ఎవరూ 

అమ్మా , నా-” 

మళ్ళీ యెప్పణుం చే

 

ఎప్పణుచో యెందాకానో నాకు తెలవా తెలవదు, తెలవా అక్కర్లేరు. నీకు కావలిస్తే అమ్మమ్మని —” 

* ఆవిడ పురమాయించిం దా?” 

అవును

సరే, ఆదతా నా కెందుకు గానీ సగ మేనా కుట్టావా జుబ్బా?” 

*కత్తిరి పులయినాయి

* సెబాస్! పదకొండు న్నర కనగా యిస్తే యిప్పటికి కత్తిరింపులా అయినాయి?”

అవయినా అయినందుకు

వంతోషించ మంటావా? నా పనంటే నీకంత వేళాకోళమూ వెక్కిరింతగానూ వుందా?”

ఎందు కమ్మా అలా చూస్తావూ: ఈ కాస్తకే యింత రోషం వచ్చేదానవు, మరి, సగం సగమే చేసి యెందుకు మానేశావూ

అయ్యో, నాబతుక్కి రోషం కూడాను. ఎవళ్లే వని చెబితే అది పుచ్చుకోవాలి గాని లేకపోతే 

ఇంకా యెన రెవ రేమేం పనులు చెప్పారూ?” 

నువ్వలా వెళ్లావు, నాలుగు కుంచాల కందుల తట్టా వచ్చి నా నెత్తిక్కింది

అయితే 

అయి తేనా? ………చచ్చి డోరి ఆది దిం పేసు కుని యిదిగో సానదగ్గర కూచున్నాను” 

ఇదయా?

* నాలుగు లిప్పులు తిప్పుతావు గిన్ని గిర్రున నిండి పోతుంది. తరవాత ఏం చేస్తా వమ్మా

…….. ఇప్పటికి కూతురి జుబ్బా మాత్రమే కనపడుతోంది. మరో పనేదీ తగలకపోతే అదే చేస్తాను

తప్పకుండా చేసి పెట్టు. ఇదెంత పేపులే తరవాత యెవరికీ తెలవకుండా జుబ్బా పుచ్చుకుని డాబామీద కూచో, యిం చక్కటి గోదావరి గాలి వస్తుం దక్కడి!

గాలికోసం డాబామీదికే వెళ్ళనక్కర్లేదు. నే నెక్క డుంటే అక్కడే కావలసినం తానూ

ఇక నీయిష్టం ఊరికే నీ సుఖంకోసం చెప్పాను; గాని నాకు కావలసింది జుబ్బా కుట్టడమే. 

అయి తేనూ? చిన్నక్క యేమిటీ యిచ్చి వెళ్ళిందిటా ?” 

*డానికి రైక కుట్టి పెట్టాలి” 

తనికి చాతకాదటనా?”

దొరగారు దయచేస్తా రటనా?”

నే నిచ్చినప్పుడే యవ్వాలి కామోసు – 

అయితే, దానిక్కూడా చింపులయినాయి. కదూ 

“……………….” 

వులిక్కిపడి చూడనక్కర్లేదు. 

అబ్బో! నీగుణం నాకు తెలవ దనుకున్నావేం? అదంటే నీకు దిక్కుమాలిన అభిమానం. అంచేతే నేను చుందిచ్చిన పని మానేసి అది మొదలు పెట్టావు” 

చూసీ చూడని మాటలు

చూడనే అక్కర్లేదు. లక్షనట్లు చూశాను కూడా నూ. దాని మొగుడు ఇంగ్లీషు చదువుతున్నా డనిఇంకా నాలుళ్ళకి గాని బి. య్యే కాడుట. అదయినా యీమధ్య ఫీలయిపోకుండా వుండేట. మీ బావ చెప్పారు చాలామాట్లు, బి. య్యే. అయితే గాని అయినా యీ రోజుల్లో లాభం లేదుట

చెప్పేదయినా వినిపించుకోడం” 

ఇంగా చెప్పుడు యెదురూ, యీమాత్రమూ

తెలవ దనుకున్నావా? నువ్వెప్పుడూ దానిలోపు డొల్ల పోతావు. నాకంటే నీ కదేమో వొరగ బెట్టదు

చంటిపిల్లే యెక్కువో తాడి చెట్టు లాగ కాపరం చేసేదే యెక్కువో కనిపెట్టలేకపోయావు

తండ్రి తెచ్చిన గుడ్డ, పింతల్లివి నువ్వు కుట్టి పెడతా పని చూడవే, చూడవే నీకేసి యెంత ఆశగా చూస్తోందోనూ!

దిక్కుమాలిన పిన్ని, చచ్చిపోయిన పిన్ని, నా కేసి చూస్తే యేం వుంది. తల్లీ?

….. మామ్మే, మాతల్లే! నామీద వాల్తావు, మీ అమ్మ దగ్గిర నే నెంతటిదాన్ని కన్నా? జళ్ళ కుట్టి పెడతా నమ్మా! రాత్రి తిండేనా మానేసి కుట్టి పెడతాను. ఏ, సరా?”

చేరదీసిన వాళ్ళని పట్టుకుని పాకులాడతారు. పిల్లలు, మీకు తెలిసింది. కాదు గాని, నాపిల్ల నీవిల్లే అనుకుంటే

యెంత బాగుంటుంది? ఇలా అయిపోయిన వాళ్ళు లోకం లో అక్కల పిల్లల్ని పెంచుతూ యెత మంది. సుఖపడ్డ, లేదూ? “

చిన్నక్కలాగ మాయమాటలు చెప్పడం నాకు చేత కాదు. నువ్వంటే నేనెంత అభిమానపడి చస్తానో – యెం దుకూ చెప్పుకోడం? నువ్వు నాతో మాయింటికి వచ్చే శావంటే నిమిషంలో లేవగొట్టెయ్యనూ ఆకబడుచునీ? నాయింటి పెత్తనంకూడా నీ కిచ్చెయ్యమా? “

నువ్వు చేసే చాకిరీ చూస్తే నువ్వు పిల్లని చూసు కుంటూ వుంటే వీకొక్క పని చెబుతానా నేను? “

*……………………………

ఇంచక్క మాధవస్వామి గుడి మాయింటి కెంతో దగ్గర.

రోజూ వెళ్ళి పురాణం అంతకంటే నీకు మరేం కావాలి? గుప్పెడన్నమూ, చాకు బట్టి నీకు లోటు చేస్తానా నేను? తాళాలు నీ చేతికే యిచ్చేస్తారు మీ బావ, నెల్లాళ్ళు తిరిగారంటే దోసెడేసి రూపాయలు. నోములు, వ్రతాలూ, కాశీ రామేశ్వరాల_వో! నీ కడ్డేమిటీ నాయింటోనూ?”

……………….”

చిన్నక్కతో వెడదా మని పుబలాటపడుతున్నా వేమో, అది నిన్ను తీసుకు వెళ్లదు. పుంటెత్తు పీనుగు అది నీకు అన్నం కూడా పెడుతుందా ? కాకపోయినా పెట్టడానికి దాని కే వుంది పాస్ పీస్ మంటూ యింగ్లీ షే గాని భూమేదీ? రెండెక రాలేనా? ఆదేనా మెరక, మాది పదెకరాల చెరువుకింది పల్లం. ఇంతకీ దాని మొగుడు. అలాంటి చోట నువ్వుండగూడదు

ను వ్వేనా పూహ తెలిసినదానవు గాని చంటిపిల్లవు కావు, బాగా ఆలోచించుకో!!

………………….

* ఈమాటలు చిన్నక్కతో అన్నావుసుమీ! వో కజ్జా గోరు పీనుగు నన్నేం చెయ్యగలదు గానీ 

అయినా యెందుకూ?” చెప్ప కేం” 

అలాగే

నే నొక్క మాటు వాళ్ల సుందరమ్మగారి యింటికి వెళ్లి వస్తాను, యిదయిపోగానే జుబ్బా కుట్టేస్తావు కాదూ

మాట్టాడవేమే? “

 “ వెళ్ళిరా” 

మనం మళ్ళీ వచ్చాటప్పటికి పిన్ని నీకు జుబ్బా కుట్టేస్తుంది. వెంటనే మీకు తొడిగేస్తాది. ఇవాళ రాత్రి దానీ పక్కలో పడుకుందువు గాని నువ్వు. ఇంచక్క .

4

* నువ్విక్క డున్నావూ? మహాజాగా దొరికావు లే” *గంధ పుగిన్ని పడిపోతుంది, దూరం దూరంగాపడిపోదు. ……..పోనీ దూరంగానే ……..??

నేను సాయంపట్టనా?”

అక్కర్లేదయేపోయింది. ఈవాయి ఒక్కటీ తీస్తే చిరున నిండిపోతుంది గిన్ని

అయితే ఒక్కమాటు లేవే.

ఏమే అక్కా?”

ఎందుకూ

పనుందే

ఏమిటమ్మా ఆపనీ? ”

ఇంచ-క్కటి పని, మాంచి పని, చేసి పెట్టవూ?”

ఏమిటో చెప్పు

చేస్తా నను

ముందు చెప్పమన్నాను కాదూ?” 

చెబితే చేస్తావా?” 

నేను చెయ్యగల దయితే చేస్తాను” 

చూశావా?

 …… 

నోరూరిపోతోందే మా తల్లీ

ఏమయినా కొనుక్కున్నావా

డబ్బేదీ? ” 

అమ్మ నడగ లేక పోయావా?

అడిగాను. ఇస్తానంది. ఇవ్వబోయింది కూడానుఇంతలో అమ్మమ్మముండ పడ

తప్పుతప్పు, ఏమిటా పిట్లు

మరి మరి ఇచ్చి వాళ్ళని చెడగొట్టడ మేం? ఆ డబ్బుంటే మాబువ్వాలాట యెంత బాగుండునూ?”

ఎవరెవ రాడుకుంటున్నారూ?”

వాళ్ళ సుబ్బులూ, వాళ్ళ బచ్చమ్మా, వాళ్ళ రాజం, వాళ్ళ గవిరి ముండా

ఛీ, ఛీ! ఏమి టలా అయిపోతున్నావు చివరికి * 

మరి వుట్టి చేతులతో రావడమేం ??

 “తక్కినవా ళ్ళేమి తెచ్చారు?” 

* సుబ్బులు, డబ్బు కారపు సెనగపప్పు ఇచ్చింది.

బుచ్చెమ్మ, డబ్బు వేరు సెనకాయలు తెచ్చింది. రాజు పే ద్ద కొబ్బరి పెచ్చు తెచ్చింది

నన్ను డబ్బు బెల్లంముక్క తెమ్మన్నారు” 

కొనుడు ఎందుకూ. అమ్మ నడుగు యిస్తుంది.

 ” నువ్వియ్యి” 

నేనివ్వకూడ దమ్మా!” 

చూశా    వా?…… ఇవ్వవులే ఆక్కా?”

 * చెప్పిన మాట విను. ముందు దూరంగా వెళ్ళు” 

*అయితే, యేడుస్తా నే మనుకున్నానో

లేకపోతే తిట్టేస్తాను” 

నువ్వేం చేసినా నేనివ్వను, ఇవ్వకూడదు

వంటింట్లో యెవరూ లేరే అతావారట్లోవున్నా రే, నాకు గొళ్ళెం అందింది కాదు, నేనే తీసుకుందునే

* ………………”

ఇవ్వవ్? “

ముచ్చె, మూడుమాట్లూ ఇవ్వవ్ ? ఇవ్వవ్ ? ఇ…వ్వ…వ్

………………….

ఇంకొక్క మాటనుగుతాను, ఇస్తావా యివ్వవా?”

*సరే, మాట్లాడకు. ఇలా వుందా నీపనీ

…………………”

*…….అయ్యో! అయ్యో! గంధపు గిిన్ని పట్టుకు పోతావు లేకి అమ్మమ్మతో చెప్పనా?” 

చెప్పుకో…చెప్పుకో… చెబుతావేం …… ఏం” ………

రామా! రామా! గిన్నెడు గంధమూ నేల పాలు చేసేసిందోయ్ తండ్రీ! ఇప్పటికే నా రెక్కలు పడి పోయాయోయ్ నాయనా! 

ఒక్క చుక్కయినా పనికి రాదోయ్ బాబూ! ఓయి దేవుడా

అలా యేడు. అలా కూలబడు. ఏం, నన్నేడిపిస్తే వూరుకుంటా అనుకున్నా వేం?.

…..”

……………….”

ఏం చేస్తున్నావు రుక్కూ?”

ఇప్పుడే గంధం యింట్లో పెట్టేసి వచ్చి కూచున్నాను పెద్దక్క కూతుకు జుబ్బా కుడదా మని

* దాని కిప్పుడేం తొందరా?”

ఎవళ్ల పని వాళ్లకి తొందరే. ఇంకా పూర్తి చెయ్య లేదా అని క్షణం కిందటే సాగతీసుకు వెళ్లిందది?”

తేరగా చేసేవాళ్ళు దొరికితే సరితనమేం చేస్తుంది ” 

అడగలేదు” 

అడగనే వద్దు, అ యింట్లో పడేసి చక్కారా

ఎందుకూ?” 

చెబుతా ముదు పడేసిరా” 

* పడేస్తాను చెప్పు

* కందులు వేయించాటప్పటికి అమ్మమ్మకి వుళ్ళు హూనం అయిపోయింది

* నన్ను మీనాన్న తలంట మంటున్నారు. నేనే కాని పనికిరాదుట” 

ఊహూ

అమ్మమ్మ తన మట్టుకి కాస్త వుప్పడు పిండో మినప రొట్టో చేసుకుంటు దిట

నువ్వు వంట చెర్యూలి

*ఏం, అలా తెల్లపోతావేం?”

……………….

ఇవాళ, రేపు నేనే మడి కట్టుకుంటాను లే

కందులు బాగు చేశాజప్పటికీ, రెండు పూట్లు గగు తీశా టప్పటికీ నాకు రెక్కలు పడిపోయాయే అమ్మా

*రెండు మాట్లూ, మూడు మాట్లూనూ, , అంత రెచ్చగొట్టడమేం దాన్నీ?”

…………………..

*ఇంక పొయిదగ్గిర కూచోడమే కాదూ, రుళ్బాలా పోటు వెయ్యాలా?”

……………

అరిటీ కాయ పప్పులో వేసి, వంగవరుగూ మునగా డలూ పనస పెచ్చూ బెండకాయా చేసి పులుసు చెయ్యి

* పెద్దక్క నా చిన్నక్క నేనా చెయ్య మనరాదు చేరగా

వాళ్ళెంకుకు చేస్తా రమ్మా మనకు ఇక్కడ మనం పని చెబితే అక్కడ కాళ్ళ మొగుళ్ళ కేం కోపం వస్తుందో? ఆత్తగా గే దెప్పుతారో?

“……………….”

వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళూ, మనంతటివాళ్ళిం మన మూనూ, మనకి వూపిక వుంటే జాలి, లేకపోతే సం పెయ్యాలి గాని పని చెప్పగూడదు

అప్పుడే ఆరయిపోయింది, లే, కూచోకు. మీ నాన్న పెందరాడే వంట కావాలంటున్నారు. ఆగుడ్డ అవతల పడేసి రావేం?

 

చద్దన్నాల్లోకి వుడాలి, మామిడి కాయల పచ్చడి మాత్రం తెలిసిందా

అమ్మమ్మ కడుగు ఎన్ని కాయలు చెయ్యా లో చెబుతుంది.

అన్నట్టు వొక్క చెక్క పేడేనా లేను కింద, చీకటి పడకుండా తొరగా చిట్టటక యెక్కి తొరగా నాలుగు పూటలికొ సరిపడా తీసి దూరులో పెట్టాలి. మరిచిపోకు

అమ్మమ్మ కొయ్యరొట్టె చేసుకుంటా నటే కొబ్బరి కాయ కొట్టి ముక్కలు తరిగి ఇయ్యి. పచ్చట్లోకి కూడా వినపడిందా? “

* లేవాల్లేవాలి, కూచుంటే కాదు…. ……

 *………న్స్,

రామయ్యతండ్రి, నా బతు కిలా వెళ్ళిపోవలసిం దేనా మహాప్రభూ!………

ఏయ్, ఎవరు వంటింటో? “

* నేనురా తమ్ముడూ! ” 

నిమిషంలో అన్నం వెయ్యాలి నాకు

మాట్లాడ వేం ? సినీమాకి వేళ అయిపోతోంది తొరగా వడ్డించెయ్యాలి

అంత తొందరయితే 

తొంద రన్న తొందర కాదు, కంచు పెట్టుకోనా, ఆకు వేస్తావా 

ఇంత సేపటిదాకా యేం చేస్తున్నావురా?” 

డబ్బులు చూసుకోవాలా మరి?” 

ఇప్పుడా డబ్బులు చూసుకోవడం

తెల్లవారింది మొదలు అడుగుతున్నాను. మూడు గంటలికి ఒప్పుకుంది. అమ్మ; కాని వెధవ అమ్మమ్మ

ఆ..ఆ

నా సినిమా డబ్బు లడ్డుకొడితే వూరుకుంటా నేం?”

అలా నుంచుంటా వేం పట్టించక?”

 “ఎవట్లో బియ్యం పొయ్య లేదురా మరీ

* ఇప్పటిదాకా యేం చేస్తున్నావూ? వెధవది రెండో ఆటకి వెడితే రేపు చదువు పాడయిపోతుంది, ఇప్పుడేనా బియ్యం పోసెయ్య వేం?”

ఎసరు కాగందే?”

నీ మొఘంలాగే వుంది. వంట. మ రెలాగా యేడ వడం 

అ పొడి అన్నం వుంది తింటావా?”

అఘోరించిన ట్టుంది. నీమాట, పోనీ అదే పెట్టెయ్యి

చిన్నక్క నేనా పెద్దక్క నేనా పెట్టమను ” 

వాళ్లు రారుట. వాళ్లకి తీరుపడి లేకుట” 

*పంచేస్తున్నారూ

 చిన్నక్క మల్లెమొగ్గల దండ గుచ్చుకుంటోంది

పెద్దక్క యెదటింటి శ్యామలాంబగారితో గవ్వ లాడుకుంటోంది, నువ్వే పెట్టాలి

నేను ముట్టుకోగూడదురా” 

అయితే తగులడు వెధవ ఆచారమూ నువ్వూను

ఆ లేకపోతే పదిన్నర దాకా మేలుకుని వుండు, మళ్ళీ వచ్చి తింటాను

 “స్నానం యెలాగా చేస్తుంది కనక అమ్మమ్మ పెడుతుం దేమో వెళ్లి అడిగిరా

నాకక్కర్లేదు

 ఏం?” 

ఆవిడ కళ్లు పడితే అన్నం జీర్ణం కారు

……………… “ పనస పెచ్చుముక్కలు, మునక్కాడ ముక్కలూ నాకు చాలా అట్టేపెట్టాలి సుమా. లేకపోతే చిత కొట్టేస్తా నేమనుకున్నావో?”

7

ఇవాళ నువ్వు మడికట్టుకున్నా వేమమ్మా? “

అమ్మ కట్టుకోమంది నాన్నారూ

 ఆ పెద్దక్క యేం చేస్తోంది ” 

ఏమోనండీ 

చిన్నక్కో? ” 

ఏమోనండి” 

* మీ అమ్మమ్మో!

చివరి గదీ మాట, అందరికళ్ళూ తిరిగితిరిగి నామీద పడతాయి, ఇవి దగ్గరికి వచ్చాటప్పటి కొక్కళ్లూ నన్ను

మరిచిపోరు. నే నలాంటి పుణ్యం చేసుకున్నాను కామోసు. అయితేనూ, యేమోయ్? నాలుగు కుంచాల కందులు వేయించి, నడుం లాక్కుపోయి, ముద్దయిపోయి, వోమూల కూలబడ్డాను గా, నేనింకా వండి వడ్డించగలనుషోయ్

ఆసంగతి నా కే తెలుసునండీ? “

ఇదేకాదు, యింటి సంగతులే యేమీ తెలవడం లేను నీకు, భోజనం చేస్తావు, వూళ్ళో తిరిగి తిరిగి, మళ్ళీ వంట అయాటప్పటి కింటికి చేరుకునావు, లేకపోతే ముసుగు తన్ని చెయ్య లేక నేను చచ్చిపోతున్నాను కాబూ

మీ అమ్మాయి యేం చేస్తోంది? ” “అది వూరికే కూచుం భోం దనా నీవూహ?

* వంటలోకి రాదు. కాని, పై పనంతా యెవరు చేస్తు న్నారో నీ కేమయినా తెలుసూ .

అయినా నాశక్తి సన్నగిల్లిపోయింది. నా రెక్కలు మూల పడ్డాయి. మునపటిలాగ నేనిక చెయ్య లేదు. దీనికి నువ్వేమయినా పుపాయం చూడాలి

 ” రేపు డాక్టరు బ్రహ్మానందం గారికి కభురు చేస్తాను.

శాస్త్రం చెప్పిన తరవాయిగా వుంది. నీమాట, కాటికి కాళ్ళు కాచుక్కూచున్న దానికి నాకు వైద్యా లేమిషోయ్ యిప్పుడు

పనిమాట దేవు చెరుగును, మీరు సుఖంగా తిని కూచోడాని కయినా శక్తి వుండాలా? “

పని చెయ్యడం కష్టంగా వుంది కాని నాకేం తెగులా రోగమా? పై పని కేమి బాధ లేదు. పంట దగ్గరే వస్తోంది

*మా అమ్మాయి వలే చెయ్యరాదూ పై పని రుక్కమ్మ కప్పగించీ?

చెప్పాను కానూ, పైనులు తెముల్చుకోడం మాత్రం మాటలా? కాకపోయినా, తల చెడ్డవాళ్ళిద్ద ఇంట్ వుడగా పునిశ్రీపకుడు మడి కట్టుకోడం యేమి

లోకంలో యొక్కడేనా వుండిపోయే

సబబూ !

పైగా పదిహేను రోజుల నుంచి మా అమ్మకి అన్న హితవు లేకు కూడానూ

అయితే అప్పుడప్పుడు వండిస్తూ వుండండి రుక్కమ్మ చేత

రోజూ మాత్రం వద్దు 

అయితే నామాట 

అంటే

నీకింత తెలవకుండా వుందేమిటోయ్

అది చేసిన వంట నన్ను తీనంమంటావా యేమిటోయ్

అయ్యో, నా గ్రహచారమా?

*నేను పొయ్యిదగ్గిర పక్షి దేవుళ్లాడటం యెలాగా తప్పనప్పుడింక అది కూడా మడి కట్టుకున్న అందం యేమి

……………….

 “దానివల్ల నాకు పెరిగింది మాత్రం యేమిసోయ్?” 

అయి తే, నన్నేం చెయ్యు మంటారూ?” 

నానోటితో చెప్పించుకోవా లని వుందా?

నిజంగా మీకు ఆలోచనే కోడలేదుధావా

 తోచలేదు” 

అయ్యో” 

……….

*ఎఫ్ఫే చదివావు కదా ” 

మీరు చెబితే యేం? “

అయితే మీకు చెబుతాను. దాని బతుకంతా తెల్లా రేపోయింది. ఇంకేమున్నా లేనట్టే 

ఎప్పుడో వుకప్పు డెలాగా తప్పదు. రోజులు గడ వడమే గాని లాభం యేమీ లేదు

అయితే?

…………….

 ఏమిటి చివరికి

*తల అంటుకోనా దువ్వుకోనా, జడ వేసుకోనా యింకెందుకోయ్ దానికా దిక్కుమాలిన జుట్టు

అదే మమ్మా పులుసు కింద పోసేస్తున్నావూ?”

*…………

గరిటి వేడిగా వుండడం వల్ల చెయ్యి తొణుకుతోంది నాన్నారు..

ఇందాకా రామదీక్షితులుగారి నడగ్గా యెల్లుండి దశమినాడు మంచిదన్నారు. కోటిలింగాలికి వెడితే వొక్క నిమిషం పని

………………….. 

నువ్వు కాస్త దూరం ఆలోచిస్తే గాని వీలు లేదు. మొగుడు వచ్చిన కుడుచుపిల్లలికి మంచిరోజులు కావివి, మొన్ననే వీరేశలింగం తోటలో ఒక వెధవ పెళ్లి అయిం దిట, ఇంకా నలుగురు వెధవ కొరుకుల కోసం వెతుకు

కుండా తెల్లవారా టప్పటికి చేయిం చెయ్యడానికి

* …… ఆ దేమమ్మా నీళ్ళలా వెలకబోళావూ?” 

* …… నీలిజిప్టు మూలాన చేతిలో చెంబు జారిపో యింది వాన్నారు

చూశావా!… విన్నావా? ఇదీ వరస. 

ఒక్క పని చేతకాదు. చేసినంత మట్టు కయినా వొబ్బిడీ నిదానమూ లేదు. తేరగా తిని కూచున్నట్టి వుంటుందా వండి వర్షం చడం అంటేను

………………

మాట్టాడ వేమోయ్

ఏమనమంటారండీ” 

ఏమనమంటానా?… . . .

 నువ్వూరుకు టే నేనూరు కుంటా అనుకున్నావా?”

రేపు లే దెల్లుండి దశమిగా బుధవారం తప్పదు. నీకిదే చెప్పడం

………………

“వినపడింది షోయి

* చెవుల్లో నోరు పుట్టుకు వస్తూవుంటే వినపడక పోవడం యేమిటండీ

8

రుక్కమ్మ తన పక్క మీదికి వచ్చాటప్పటికీ ఖరాగా పదకొం డయింది.

అప్పటి కప్పుడే యింటిల్ల పాదీ – బహిరంగంగా పడు కుని వున్నవా రంతా గాఢనిద్రలో వున్నారు.

ముసలమ్మ, వసారాలో బావురుపిల్లులతో కాట్లాడుతోంది

అక్కడికి తానెలా వచ్చిందీ రుక్కమ్మ యెరగదు

వచ్చాక మాత్రం అంత యింటో అంతమంది వున్న యింటో తానొక్క తె మట్టుకే మేలుకుని వుండడం చూసి ఆమె తన అసహాయతను పూర్తిగా గ్రహించేను కుంది.

దాంతో, దీపం బంతిపువ్వు లాగే వెలుగుతోంది, కాని ఆమెకు యిల్లంతా అంధకారబంధురంగా కనపడు తోంది.

ఆమెకి, అస లేమి తోచడమే లేదు. తోచినా బోధ కావడం లేదు. అయినా అది నిలవడం లేదు, నిలిస్తే మళ్ళీ అంతట్లో అంతా ఆడివీ మళ్లూ అయిపోతోంది.

కాగా తన ఒటరితనం భరించుకోలేక ఆమె గట్టిగా కళ్లు మూసుకుంది.

కానీ, దానివల్ల స్థితి మరీ విషమించింది,

రైకగుడ్డ చేత పట్టుకుని కొరకొర చూస్తూ చిన్నక్క వొక వేపునా, జుబ్బాగుడ్డ పట్టుకుని పళ్లు పటప ట్టాడిస్తూ పెద్దక్క వొక వేపునా, కత్తి నూరుతూ మంగలి వెంట రాగా సగం పళ్ళూడిపోయిన దెయ్యపునోరు తెరుచుకుని స్వయంగా కత్తెర చేత్తో పుచ్చుకుని అమ్మమ్మ వొక వేపునా, రెక్కలు పడిపోయే టట్టు తాను తీసిన గంధం అంతా సెంటు కలిపి పూసుకుని బుగ్గాబుగ్గా ఆనించుకుని తల్లీ తండ్రి ఒక వేపునా

రుక్కమ్మకి వాళ్ళు రణకంపరం యెత్తి పోయింది,

ఇక పడుకుని వుండలేక వెంటనే ఆమె గభీ మని లేచి కూచుంది. కూచోనూ లేక వుబ్బెత్తుగా లేచి నుంచుంది, నుంచోడం తడువుగా వూచలాగ వాకిట్లోకి వచ్చేసింది. వచ్చిన వెంటనే తలుపులు తెరుచుకుని వీధిలో పడింది.

వెంటనే చెర తప్పిన ట్లనిపించిం దామెకి. ఆమె కాళ్ళలో విద్యు ద్వేగం పుట్టింది. కళ్ళల్లో దివ్య జ్యోతి వెలిగింది.

ఒక్క నిమిషంలో, ఒక్క మాటు, ఇన్నీస్ వేట వీధులు, పటం తిప్పేసిన ట్టయిపోయాయి. నిదానించగా ఆమె నాళం వారి నత్రం వెనక వేపున నిలిచి వుంది. ఎదట వరదారావు హోటలు ముందు ఆమె కెవరో మనుష్యులు కనపడ్డారు.

“బాబోయ్ ” అనుకుంటూ ఆమె నిలువునా కొయ్యాయి పోయింది.

ఒక గోడవార జట్కా కింద పడుకుని చుట్ట కాల్చు కుంటూ వున్న జట్కావా డిదంతా చూశాడు.

బండి కావాలా

మేఘాల మీద యెగిరిపోతేనే డబ్బివ్వండి

*అర్థరాత్రి తేళ్లో పాములో రూపాయాలా, అర్థణా పావలా డబ్బు లివ్వండి 

ఇన్ని అడిగినా జవాబు రాకపోవడంవల్ల జట్కా వాడికి అనుమానం స్థిరపడి లేచివచ్చి పరకాయించి చూస్తూయెక్కడికి వెడతా రమ్మా యిగారూ?” అని మెల్లిగా అడిగాడు.

ఏ పేట నీది?” అని ఆమె అంతకంటే మెల్లిగా అడిగింది. 

దానవాయి గుంటఅని చెవిలో వూదినట్లు చెప్పేడు వాడు

ఏం పుచ్చుకుంటావూ?” అన్నట్లు వెదవులు కదిపిం దామె.

* పంతులుగారి తోటకా?” అని అడిగాడు వాడు. 

ఉప్పొంగిపోయిఅవువన్నట్టు తల వూపిం దామె. 

* నిమిషాలమీద తోలుకుపో తాను బండెక్కండమ్మాయిగారూఅని అంటూ వాడు బండి కేసి బయలు దేరాడు. 

అయితేనాదగ్గిర వుక్క రాగిదమ్మిడీ అయినా లేదుఅంటూ ఆమె చరచరా రెండడుగులు వేసింది.

“పంతులుగారి తోట కయితే నాకేమీ యివ్వనక్క ర్లేదు తల్లీ” అని చెబుతూ గుర్రం పూన్చి, వాడు, జట్కా తీసుకువచ్చాడు. వెంటనే మాట్లాడకుండా బంకిలో యెగిరిపడి, శరీరం కుంచించుకుందామె. కొరడా ఫెడేలుమంది.

వేగం అందుకునీ దాకా గుర్రంతో కూడా పరిగెత్తి తరవాత వాడుకూడా బండి మీదికి వురికాడు.

నాకూ తెలుసునం డమ్మాయిగారూ కష్టసుఖాలు. నా కొక్కతే కూతురండి, అది యీడేరిన నెలకే పెద్దల్ని చెయ్యకుం డానే పదిరోజుల కిందటే దాని మొగుడు చచ్చి పోయా డండి. దాన్ని చూసినా తలుపుకి వచ్చినా నా కడుపు మడుగయిపోతోందం డమ్మాయిగారూ! … …

నాపనే యిలా వుంటే యిక మా యింటిదాని మాట చెప్పడాని కేం వుందండి? అది గంజినీళ్ళు కూడా మానేసి లంకణాల మనిషిలాగ మంచం పట్టేసిందండి. పిల్లని వూరుకో మనడానికి నోరురాకా, ఇంటి దాన్ని కనిపెట్టు కుని వుండడానికి వీలు లేకా, బండితోలడం మానేసి నెల్లాళ్ళు ఇంట్లో వుండిపోదా మంటే గడిచే దారి లేకా నేననుభవించే యాతన దేవు డయినా గుర్తించుకో లేదండి. 

…. పంతులుగారి తోటలో మొన్న రాత్రి రెండు పెళ్ళి ళ్ళయి నాయండి. నిన్న మూడో దయిందండి. నాలుగోది కూడా అయిపోయేదే కాని సగం దారిలో నా బండే అటకాయించి తండ్రీ అన్నలూ ఆ అమ్మాయిగారిని వెనక్కి లాక్కు , పోయారండి. నాకు గుండె లాగిపోయాయండి, ఎంత కోరికతో వచ్చారో, యెన్నాళ్ళనుంచి ఆశపడు తున్నారో, యిప్పుడే బాధ పడిపోతున్నారో, యిక ముందు ఆవిడ గతి యేమయిపోతుందో నాప్రాణాలు మహా కొట్టుకుంటున్నాయం డమ్మాయిగారూ! మరో పిల్ల కోసం వెతుకుతున్నా రండి తోటలోవారు. మహా బాగుం టారండి రాదమారుడిలాగ ఆ అబ్బాయిగారు. నెలకి అరవై రూపాయల జీత మంటండి. రెండో పెళ్లేగాని పాతికేళ్ళేనా వుండవండి పాపం. తండ్రిగారు యగ్గెం పట్టినోరుటండి. అక్కడికి వెళ్ళగానే ఆయనికీ మీకూ పెళ్ళయి పోతుందండి, మీరు పుణ్యం చేసుకున్నారు, భయపడకం డమ్మాయిగారూ! ఇక మీకు సుఖమే కాని కష్టం లేదం డమ్మాయిగారూ! పదిరోజులు పోయాక – కొంచెం పాత బడిపోయాక మాపిల్లక్కూడా” 

జట్కా మేఘాల మీద యెగిరిపోయింది. 

మళుపు కూడా తిరగేసింది.

(ప్రబుద్ధాంధ్ర నుంచి… సవరణలతో)

 

 

 

One thought on “అరికాళ్ల కింద మంటలు”

  1. బండితో పాటు భవిష్యత్ ఆమె బతుకు మలుపు తిరిగింది. బాల వితంతువుల కష్టాలు, దోపిడీకి, కొదవలేదు. బావలు, దగ్గర చుట్టాల లైంగిక వేధింపులు. వెలుగులో కి వచ్చేవికావు. వీరేశలింగం పంతులు గారు సంస్కరణలతో ఎన్నో బతుకులు చిగురించాయి. నిజంగానే పంతులు గారు యుగకర్త. .. మల్యాల పళ్ళంరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *