జాగృతి

 

 

 

 

 

 

 

 

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

అఖిల భూతమ్ములకు నిద్రయైన వేళ
జాగృతింగను సంయమి జాగృతియన
నద్ది జాగృతి నిదురలో నట్టు నిట్లు
పడక యుండుట జాగృతి వాచ్యమగునె

అటునిటు దొర్లి క్రిందఁబడినప్పుడు కొట్టిన నేల పాపగా
మిటమిటలాడు తెల్వి పొలిమేరల బారలు సాచి వచ్చును
త్కటకముగ క్రమ్మునట్టి చెడుగాలిగ దేలక యొక్క జాగృతి
స్ఫుటతర రేఖగా నిదురపోవుట మంచిదె జీవి కోటికన్

వాడు జాగ్రత్తగా నిద్రపోడటన్నఁ
జీర తొలగుట యెఱుగక చెట్టమొద్దు
నిద్దురంబోవు ననగ ధ్వనించులోక
వృత్తమున లాక్షణికము జాగృతి ప్రయుక్తి

ఏమి ప్రయోజనంబో! మహాంభోరాసి
గర్జాంతరంగంముల్ కదలి రాఁగ
ప్రళయమహా మరుద్భరము దూసుకరాగ
యెంగ జాగృతి కల్గి యేమి ఫలము
కొండకొమ్ము విరుచుకొని మీదఁబడుచుండ
నేమి లాభము రెప్పలెత్తి యున్కి
యేమీ జాగ్రత్తయో యెలుగెగిచ్చి సింహంబు
వివృత దంష్ర్టాస్యమ్ము విన్ను విరుగ

జార చోరాది భీతుయు సన్న సన్న
భయములును వొడ్డు కోఁగొంతవరకు మెలు;
ఈ యజాగృతియగు లోక వృత్తమందు
దాని ప్రస్తాన యొక్క ప్రతారణంబు

రాచరికపు విషయంబునఁ
బేచీలని యొకని నిద్ర పెఱజాగృతి; ధ
ర్మాచరణము జాగృతి, ని
ద్రాచరణధర్మ మార్గమది తెలిసికొనన్
(జాగృతి, 18-12, 1949)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *