మహాభారత పరమార్థం – తర్కసంగతి – తత్త్వసారము

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

 

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
భారతారంభంలోనే ఈ ఇతిహాసం అంతా నరనారాయణుల లీల అనీ, ఈ సరస్వతీ ప్రవాహం వేదవ్యాసునివల్ల ప్రకాశించిందనీ తెలియవచ్చింది. నారాయణతత్త్వమే ద్విధా విభక్తమై జీవేశ్వరులుగా తపోమయ భూమికలోనికి అవతరించటం ఈ ఇతివృత్తం. చతుర్ముఖబ్రహ్మ (సరస్వతి), వశిష్ఠడు-శక్తి-పరాశరుడు-వేదవ్యాసుడు ఇదీ వ్యాసునిదాకా సాగివచ్చిన భారతీవంశం. అందుకే ఆయన భారతీ వంశ వివర్ధనుడు అని తిక్కన పేర్కొన్నాడు. నారాయణుని నుంచి ఈ తపోమయ నిశ్శ్రేణిక కొనసాగుతూ వచ్చింది.
భగవంతుడైన వ్యాసుడు మహాభారత నిర్మాణంలో సృష్టిరహస్యాన్ని సంసారంలోని దుఃఖాన్ని, జీవులు, దానినుంచి ఉద్గమించవలనిన లక్ష్యాన్ని, అనాసక్తకర్మయోగాన్ని, సృష్టిలో నిరంతరమైన విద్యావిద్యల, వ్యక్తావ్యక్తముల, దేవాసురుల సంఘర్షణను, ధర్మనిరూపణలో ఎదురయ్యే జీవన వైరుధ్యాలను ఇవన్నీ అతివిస్తృతమైన పటంమీద విపులంగా చిత్రీకరించాడు. ఇది ధర్మశామా వేదాంతమా అనే సందేహం అనాదినుంచీ ఉన్నది. ధర్మమువల్లనే అర్థకామములు సంప్రాప్తిస్తవనీ, ఎందుకు నరులు ధర్మాన్ని ేనవించరో అర్థం కావటంలేదని చేతులెత్తి రోదిస్తున్నానని వ్యాసుడు ఒకచోట చెప్పుకోవలని వచ్చింది.
ఈ గ్రంథం అంతా సంక్లిష్టనిర్మాణం. ఆఖ్యానాలు,ఉపాఖ్యానాలు, వైదిక, ప్రతీకాత్మక గాథలు, నీతిశా వేదాంతశాస్త్రాలు, యుద్ధవిస్తారము, సర్వలోకముల వర్ణనము, మంత్రమయ విస్తరాలు, రాజధర్మ, లోకధర్మ, మోక్షధర్మాలు, పూర్వవంశ గాథలు, యజ్ఞకలాప విశేషాలు, ఇవన్నీ ఎన్నని చెప్పను, అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంతేకాదు, ఎక్కడ లేనివీ ఇక్కడ ఉన్నవి. ఇది వేదోపబృంహణము, ఇతిహాసం దీని ప్రధానలక్షణమైతే, దీనిలోనే ఉపనిషత్సారసంగ్రహణమూ ఉన్నది. కణికుని కూటనీతి, విదురుని క్షేమనీతి రెండూ వస్తాయి. దిక్పాలకుల సభల వర్ణనతోపాటు, దేవ గంధర్వ యక్షరాక్షసులు కూడా కథలో అన్వయించటం ఉన్నది.
‘భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే-త్ర సనాతనః’ అన్నది ప్రధానాంశంగా పీఠికలో వ్యాసుడు పేర్కొనటం జరిగింది. శ్రీకృష్ణచరిత్రము పాండవుల గాథతో సమాంతరంగా, ఓతప్రోతంగా దీనిలో సాగివస్తుంది. ద్వాసుపర్ణా అన్న శ్రుతిలో ప్రతిపాదింపబడిన జీవేశ్వరులు దీనిలో నరనారాయణులు. నారాయణుడు సాక్షిభూతుడే. యుద్ధం నిర్వహించినది నరుడు, నరోత్తముడైన అర్జునుడే జీవుడు. నరనారాయణుల సాన్నిహిత్యాన్నీ, అభిన్నత్వాన్ని వనపర్వం 12వ అధ్యాయంలో శ్రీకృష్ణడే తెలియజేస్తాడు. మంత్రమయత్వం విషయం వేన్త దుర్గాస్తోత్రము, అగ్నిస్తోత్రము, విష్ణ శివ సహస్ర నామములు ఇవన్నీ ముఖ్యభాగాలే. ‘మహనీయజప’మనే ఒక మాలామంత్రం ఉన్నది.
మన్యుమయ వృక్షం దుర్యోధనుడనీ, కర్ణుడు స్కంధమనీ, శకుని శాఖలనీ, దుశ్శాసనుడు పూలుపండ్లనీ, మూలం ధృతరాష్ర్టడనే బుద్ధిహీనుడనీ (అమనీషి) వర్ణించి అట్లాగే ధర్మమయవృక్షం యుధిష్ఠిరుడనీ, అర్జునుడు స్కంధమనీ, భీముడు శాఖలనీ, కవలలు పుష్పఫలాలనీ, మూలం భగవంతుడైన శ్రీకృష్ణడనీ ఆరంభంలో రెండు చెట్ల వర్ణనం ఉన్నది. ఈ ప్రతీకాత్మక వర్ణన మూలాలు వైదికమైనవి. భగవద్గీతలో సంసారాన్ని అశ్వత్థంగా పోల్చటం ఉన్నది. వృక్షం ఊర్ధ్వముఖచైతన్యానికి గుర్తు.
ఒకవైపు పరమాత్మ మూలమైన వృక్షము, రెండవది అవిద్యామూలమైన వృక్షము, రెంటిమధ్య కథాప్రవాహం ఓతప్రోతంగా సాగిపోయింది. దుర్యోధనుడు కలిఅంశం. ద్వాపరం తుదకే చొచ్చుకువస్తున్నాడు. న్థిరయుద్ధలక్షణంగల యుధిష్ఠిరుడు దాన్ని నిలుపుదల చేస్తున్నాడు. ఇతనికి మూలంలో హృదయంలో ఈశ్వరానుగ్రహం ఉన్నది – ‘ఆపద గడవంబెట్టగ, నోపి శుభంబైనదాని నొనగూర్పగ మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనిెు మహాత్మా’. ఈశ్వరరక్షణ ధర్మరాజు విజయహేతువైంది. కలి ఎంతగా విజృంభించినా అది ఓటమి పాలుగాక తప్పలేదు.
వసురుద్రాదిత్యులలో వసువులు భౌమచైతన్యపరిధిలోనివారు, వసు అంశలో పుట్టిన భీష్మడు, అంత జ్ఞాని, పరాక్రమశాలి కూడా తన రాజ్యమే తనకు కాకుండాపోయినా, వృథాప్రయాసమని తెలినీ కౌరవరాజ్యమును నిలబెట్టే తలంపుతో అన్నంపెట్టినవారన్న భావంతో కౌరవపక్షంలోనే ఉండిపోయినాడు. అంబకు న్యాయం చేయలేక గురువుతో యుద్ధం చేనీ, అంబ మరుజన్మరూపమైన శిఖండివల్ల హతుడైనాడు. దేహభావననుండి అతడు విముక్తి కాలేదు. ఉన్నన్థితినుంచి మార్పు పొందలేని లక్షణం ఈతనిలో కానవస్తుంది.
పతితయైన బ్రాహ్మణ్యానికి ద్రోణుడు ప్రతీక. ప్రతీకారేచ్ఛ అంత తీవ్రంగా ఉండటం, తమోమయ లక్షణంచేత చేయించిన ద్రుపద పరాభవం ఈ అంశాన్ని తెలియ జేస్తుంది. కౌరవులు స్తోత్రం చేేన్త పాండవుల ేననను నుగ్గాడుతానని మాట ఇస్తాడు. ధర్మం పక్షం అని నమ్మినా అటు చేరడు. అహంతకు వశుడైనాడు. ఇతని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ నిద్రితులైన ఉపపాండవులను క్రూరంగా సంహరిస్తాడు, వ్యర్థమని తెలినినా – అప్పటికే దుర్యోధనుడు మరణించిన న్థితిలో ఉన్నాడు. ఇంత తామనిక విజృంభణ ఇతనిలో ప్రకటం కావటం ఆ వర్ణధర్మం ఎంతగా పతనమైందీ నిరూపిస్తుంది.
ఇక కర్ణుడి విషయానికి వేన్త – అతడి ప్రవృత్తిలో ఆత్మన్యూనతాభావం ఆవరించి ఉన్నది. దానిలోంచే భార్గవరాముని వంచించి విద్య నేర్వటం, రాజును చేనిన దుర్యోధనుని యందు విచక్షణలేని విశ్వాసం, ఆధిక్యభావ ప్రకటనకోసం మహాదాతగా రూపొందటం గమనించవచ్చు. ద్రౌపదీపరాభవ సన్నివేశంలో ఆ అధర్మకార్యానికి ప్రోత్సహించింది కర్ణుడే. ఆమెను బంధకి, వేశ్య అనీ వస్త్రాపహరణం దోషం కాదనీ దుర్యోధనాదులను ముందుకు త్రోనినాడు.
ధృతరాష్ర్టనికి రాజ్యాధికారం లేకపోయినా, రాజ్యాభిషిక్తుడైన పాండురాజు అనేక దిగ్విజయాలు చేని అతనిచేత అనేక అశ్వమేధాలు చేయించాడు. అతడు శాపగ్రస్తుడై మరణించటంవల్ల ధృతరాష్ర్టనికి రాజ్యాధికారం లభించింది. రాజ్యాధికారం పొందిన గ్రుడ్డివాడు. అతని ప్రవృత్తి అంతా అంతర్బహిరె్వైరుధ్యాలతో ఘర్షణలతో, పుత్రమమకారం వల్ల పాండవులయందు పెంచుకున్న అప్రీతివల్ల ఒక నాటకంగా గడచిపోయింది. పుత్ర మమకారం ఇటు ధృతరాష్ర్టనీ, అటు ద్రోణున్నీ పతనోన్ముఖంగా నడిపింది.
దుర్యోధనునికి క్రోధమే కాదు అసూయ కూడా ఆతని స్వభావము. జన్మతః సంక్రమించని రాజ్యాధికారం సందర్భానుసారంగా ఆక్రమించి దాన్ని ఇతరులతో అధికారంగల పాండవులతో పంచుకోలేకపోయాడు. ఆ కారణంవల్లనే నిజమైన అధికారం గల పాండవులను చిన్ననాటినుంచే చంపే కుటిలయత్నాలు చేస్తూ వచ్చాడు. తొడలు విరిగి పడిపోయినప్పుడు కూడా అతని పగ చల్లారనే లేదు. లాక్షాగృహదహనం, కపటద్యూతం, ఘోషయాత్ర, ఉత్తరగోగ్రహణం ఇవన్నీ ఆతని క్రోధాసూయాల క్రమోన్మీలనానికి సోపానాలవంటివి. ఒక కులన్ర్తీకి చేనిన అవమానం ఇన్నింటికీ పరాకాష్ఠ.
దుర్యోధనుడి పతన లక్షణం ఒక విధంగా నాటి క్షత్రియుల పతనానికి శిఖరం వంటిది. తత్పూర్వం వంశపురుషలుగా చెప్పబడ్డవారి చరిత్రలలోనూ కొన్ని కొన్ని దోషాలు కనిపిస్తున్నవి. యయాతి యౌవనకాంక్ష, నలుని ద్యూతవ్యసనం, దుష్యంతుడు లోకాపవాద భీతితో శకుంతల నెరుగనని అసత్యమాడటం, శంతనుడు సత్యవతిని వివాహమాడేందుకు ఈడొచ్చిన పుత్రుని కాదని ఆమె తండ్రి పట్టుదలకు లొంగిపోవటం, అరణ్యంలో తపస్సులో ఉన్నప్పుడు పాండురాజు శాపగ్రస్తుడై కూడా కామభావోద్వేగాన్ని పొందటం ఇవన్నీ క్షత్రియులు నాటికి అర్థకామ వశులై ధర్మానికి ఎంతగా దూరమైందీ తెలియజేస్తుంది. ‘శైశవే-భ్యస్తవిద్యానాం…’ ఇత్యాదిగా రఘువంశరాజుల వర్ణనం ఇక్కడ పోలికగా చూచుకోవచ్చు.
ధర్మవ్యాధునిదగ్గర కౌశికుడు ఉపదేశం పొందిన గాథ శూద్రులు ఇంకా పతనం కాలేదనటానికి, స్వధర్మంలోనే నిలచి ఉన్నారనేందుకు సాక్ష్యం. మరొక ఘోరమైన వ్యక్తి జరాసంధుడు. ఈయన రాజులందరినీ బంధించి శక్తికి బలి నివ్వదలచాడు. ఇది మహాక్రౌర్యం. నేటి హిట్లర్‌వంటి ప్రవృత్తి. రెండు ముక్కలుగా పుట్టిన ఈతణ్ణి ‘జర’ అనే రాక్షని అనుసంధించింది. అందువల్ల జరాసంధుడైనాడు. ‘జరా’ శబ్దం వ్యత్యస్తమైతే రాజశబ్దం అవుతుంది. రాజలక్షణం ఈతనియందు విపరీతత్త్వాన్ని పొందిందని తాత్పర్యం.

ఇలాంటి యుగసంధిలో బ్రాహ్మణ క్షత్రియజాతులు ధర్మవిస్మృతిలో పడ్డ సందర్భంలో మహాభారతం అవతరించింది. ‘ధర్మస్య గ్లాని ర్భవతి’ అన్న పరిన్థితి. కలికి అత్యంత సన్నిహితమైన కాలం. జగత్తు అంతా నాశనానికి, మృత్యువునకు అభిముఖంగా నడుస్తున్నది. అనుశాసన పర్వం ఆదిలో గౌతమీ, లుబ్ధక, సర్ప, మృత్యు కాల సంవాదం ఉన్నది. మృత్యువునకు కారణం ఎవరు అని విచారిేన్త శిశువును కరచిన సర్పము తాను కారణం కాదని, మృత్యువు తాను కారణం కాదని, కాలం (యముడు) తాను కారణం కాదనీ, జీవుని కర్మయే కారణమనీ తేలుతుంది.
మహాభారతంలో మూడు యజ్ఞాలు కనిపిస్తవి. ఒకటి సర్పయాగం, రెండు రాజసూయం, మూడు అశ్వమేధము. సర్పయాగానికి ముందే రురు ప్రమద్వరల వృత్తాంతం ఉన్నది. ప్రమద్వర సర్పదష్టయై మృతిచెందింది. ఆ కారణంగా రురుడు సర్పజాతిని సంహరించేందుకు పూనుకున్నాడు. ఉదంకుడు తాను తెచ్చిన కుండలాల్ని తక్షకుడు హరించటంవల్ల సర్పయాగం చేయమని జనమేజయుని ప్రేరేపించాడు. ఒక వ్యక్తి చేనిన కార్యానికి, నష్టానికి ఆ జాతినంతా సంహరించటం తీవ్రమైన ధర్మభంగం. ఇది భారతారంభం. ప్రతీకారబుద్ధివల్ల తమోగుణం ఆవరిస్తుంది. మహావిష్ణ అంశతో జనించిన భార్గవరాముడు త్రేతాయుగంలో అదే పని చేనినాడు. అందువల్లనే మళ్లీ క్షత్రియుడైన శ్రీరామునిచేత నిగ్రహింపబడ్డాడు. తమోమయమైన సర్పయాగం భారతానికి ప్రవేశముఖద్వారం.
రెండవ యాగం రాజసూయం. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో నెలకొల్పిన రాజ్యంలో మూర్ధాభిషిక్తుణ్ణి చేయటం దీని లక్ష్యం. నలుగురు తమ్ములు దిగ్విజయాలు చేని రాజులను జయించారు. ఈ విజయయాత్రలలో జనహింసలేదని చెప్పలేము. భారతయుద్ధానంతరం ధర్మజుడు నిర్వహించిన అశ్వమేధము – దీనిలోని సరస్వత్యాగరూపమైన లక్షణంచేత సత్త్వగుణావృతమై ఉన్నదని చెప్పవచ్చు.
ద్రౌపది అగ్నిసంభూత. ఆమె జన్మయందే ద్రుపదుని ప్రతీకారవాంఛ గూడుకట్టుకుని ఉన్నది. ఆమె శచీదేవి అంశ. దుర్గాదేవికి అభిన్నయైన ఐంద్రీశక్తి. దశమహా విద్యలలో ఈమె ఛిన్నమస్త. ఆమె మూర్తిలో తెగిన తన శిరస్సును ధరించి తన రక్తాన్నే పానంచేస్తూ వుంటుంది. ఈమె దుర్గాదేవియందు అంతర్భవిస్తుంది.
మహాభారతయుద్ధం అంతా ఈమె హేతువుగా సంభవించింది. ఈమె సహ చరుడు ఇంద్రపుత్రుడైన అర్జునుడు. నరనారాయణులలో నరుడు – ఒకస్థాయిలో పరమశివుడు.
మహాభారత నాయకుడు మృత్యువు సంతానం. నాయిక ప్రళయోగ్రమూర్తి. అగ్నిసంభూత ఛిన్నమస్త. సర్పయాగం మహాభారతగాథకు సంక్షిప్త ప్రతీకారూపం. అరణ్యవాసంలో అర్జునుని తపస్సంతా శస్త్రాస్త్రాల కోసమే. అతడు అభేద్యమైన పాశుపతాన్ని కూడా సంపాదించాడు. యముడు ధర్మజుడై, అగ్ని ద్రౌపదియై, ఇంద్రుడు అర్జునుడై ఈ కురుపాండవ సమరాన్ని నిర్వహించారు. పద్ధెనిమిది అక్షౌహిణుల ేనన నశించింది. భారతభూమిమీద క్షత్రియజాతి నశించింది ఇంచుమించుగా.
ఈ మొత్తం సమరక్రీడకు సాక్షీభూతుడై తాను అకర్మకృత్‌గానే ఉంటూ మొత్తం సమరానికి సారథియై ఈ మహామృత్యుహేలకు సారథియైనాడు పరమాత్ముడైన శ్రీకృష్ణడు. కురుపాండవులే కాదు, దుర్వాసముని శాపగ్రస్తులై యాదవులు మొత్తం తమలో తాము కలహించి సంహరించుకోవటం కూడా ఈ మృత్యుహేలకు మరో సన్నివేశం.
ఆశ్రమవాసం చేనినా ధృతరాష్ర్టడు నిజంగా వైరాగ్యం పొందలేదు. అతడు మళ్ళీ పుత్రులను చూడాలనుకుని వ్యాసానుగ్రహంతో దాన్ని సాధ్యం చేసుకున్నాడు. వ్యాసుడు అంత సన్నిహితుడైనా, సనత్సుజాతునివల్ల ఉపదేశం పొందినా, శ్రీకృష్ణని విశ్వరూపం చూచినా, అతనిలో అంతస్సులో పరిణామం సంభవించనే లేదు. అందువల్లనే తపోమయతలో కాకుండా అడవిలోని కార్చిచ్చులో దహనం అయ్యాడు గాంధారితో సహా.
మహాభారతంలో మృత్యువు రెండు రూపాలలో ఉంటాడు. ఒకడు ధర్మరాజు, రెండవవాడు విదురుడు. విదురుడు ధర్మబోధకుడే గాని ఆచరింపజేయలేడు. ధర్మజుడు దానికోసం యుద్ధం చేస్తాడు. అందువల్లనే విదురుడు ఆశ్రమవాసంలో తపోమయన్థితిలో దేహత్యాగం చేస్తాడు. ధర్మజుడే ఆతనికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు.
మహాభారతంలో ఈ మృత్యుహేల ఎంతగా కానిపించినా అమృతత్వసాధన కూడా ముఖ్యమైందే. మృత్యుతత్త్వాన్ని చెప్పే గాథలు రురుచరిత్రము, సావిత్రి ఉపాఖ్యానము, గౌతమీ లుబ్ధక మృత్యుకాల సంవాదం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. అట్లాగే అమృతత్వసాధనను గురించిన ప్రధానాంశం. ఆదిపర్వంలో గరుడోపాఖ్యానం, మృతసంజీవనీగాథలో (కచునిగాథ) మృత్యుజయం ఉన్నది కాని అమృతత్వసాధన లేదు. అనుశాసనపర్వంలో మళ్ళీ గరుడోపాఖ్యానం ఉన్నది. వ్యాసమైత్రేయ సంవాదంలో గరుడుడే విష్ణవని చెప్పటం ఉన్నది. వైదికంగా గరుడుడు గాయత్రిమంత్రం, యజ్ఞం, ఊర్ధ్వగామిచేతన, అమృతనిద్ధి, ధృతరాష్ర్టనికి వేదవ్యాసుడు మృతపుత్రులను దర్శింప జేయటం కూడా మృతసంజీవని వంటి గాథయే.
ఇంతకూ పాండవులు స్వర్గారోహణపర్వంలో మృతిని పొందారు. ధర్మజుడు తప్ప. ఆతడూ నరకదర్శనం చేని శరీరం దివ్యంగా పరిణమింపగా స్వర్గం చేరాడు. ఈ సందర్భంలో వీళ్ళు మోక్షమును, పరమపదాన్ని, నారాయణపదాన్ని పొందినట్లుగా భారతం చెప్పటంలేదు. అందువల్ల ఈ మహేతిహాసం చివరకు ధర్మేతిహాసమే గాని మోక్షేతిహాసం కాలేదా అనేది సందేహం.
ధృతరాష్ర్టని సభలో శ్రీకృష్ణడు చూపిన విశ్వరూపం భయంకరమైంది. రాజులంతా చూడలేక కళ్ళు మూసుకున్నారు. భీష్మద్రోణాదులు కొద్దిమందీ, శ్రీకృష్ణ అనుగ్రహం పొందిన ధృతరాష్ర్టడు చూడగలిగారు. దేవతలు, యాదవవీరులు, అనిరుద్ధ ప్రద్యుమ్నాదులు, బలరాముడు, అర్జునుడు మిగిలిన పాండవులందరూ అక్కడ దర్శనమిచ్చారు. సర్వాయుధములు ధరించిన ఆ మూర్తి సమర సన్నద్ధంగా ఉన్నది. సన్నిహితమైన యుద్ధాన్ని, జననాశనాన్ని సూచించింది.
ఇంతటి ఘోరదర్శనము కౌరవులను, ధృతరాష్ర్టని భయపెట్టలేదు. అవిద్య మోహము ఎంత బలవత్తరమైనవో ఈ సన్నివేశం నిరూపిస్తుంది. భీష్మాదులు చూచీ అలాగే ఆ పక్షంలోనే ఉండిపోయారు. జీవితంలోనికి పరిణామం తేగలిగితే దివ్యమైన అనుభవానికి సార్థకత. లేకుంటే సంనిద్ధం కాని సృష్టిలోనికి భగవంతుడు చొరబడే ప్రయత్నం చేయటం వంటిది.

ఇటువంటి అమేయమైన ఇతిహాసంలో తత్త్వనిర్ణయం చేయటం సాధ్యమేనా! విస్తారమైన ధర్మానుశాసకాలైన శాంతి అనుశాసన పర్వాలు, సర్వోపనిషత్సారమైన భగవద్గీత సాక్షాత్తు భగవంతుడైన సనత్కుమారుడు ఉపదేశించిన సనత్సుజాతీయము, భగవంతుని ఎదుట అతని గుణవర్ణనగా సర్వతోముఖంగా వర్ణించిన విష్ణసహస్రనామము, ఇంకా ఎన్నో ఎన్నో ఆఖ్యానోపాఖ్యానాలు ఉండిన ఈ వాఙ్మయరాశిలోని ఏకసూత్రాన్ని పట్టుకోవటం ఎలా?
విష్ణసహస్రనామం జిజ్ఞాసువైన ధర్మరాజు ప్రశ్నలకు సమాధానంగా వెలువడింది. ‘కిం జపన్ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్’ ఇదీ చివరిప్రశ్న. ఈ ‘నామవిద్య’ మోక్షదాయకమైనది. ‘న చ పునరావర్తతే’ అన్న బ్రహ్మసూత్రం ఈ విషయమే చెప్పింది. ఈ నామాలన్నీ భీష్మడు రోజులకొద్దీ ఒక్కో నామాన్ని ఉచ్చరించి ధ్యానంలోకి వెళ్ళి అనుభవం పొంది భావసమాధినుంచి ప్రకటించినవని పెద్దలు చెప్పుతారు. అందువల్లనే ఈ నామాలన్నీ శ్రీకృష్ణడు ఎదుట ఉండి పలికించినవి. ‘యాని నామాని గౌణాని విఖ్యాతాని, ఋషిభిః పరిగీతాని’ ఇదీ ఆ నామాల లక్షణం. ఋషల దర్శనంలోనుంచి వెలువడ్డవి. తామెరిగినదంతా వీటిల్లో నిక్షిప్తమైంది. వేదదర్శనం ఎలాంటిదో ఈ నామదర్శనమూ అలాగే ఈ ఋషిపరంపర పొందింది. వారి అనుగ్రహంవల్ల భీష్మనికి లభించింది. ఈ పరంపర విశ్వమయము, విశ్వాతీతము – నిర్గుణము, సగుణము – సరూపము, రూపాతీతము – ఇలా వేద తత్త్వసారము. తొలినామము ‘విశ్వం’ సృష్టిలక్షణాన్ని వివరించగా, చివరినామం ‘సర్వప్రహరణాయుధ’ అన్నది ప్రళయాన్ని చెప్పేది. ఈశ్వరుని షడ్గుణాలు, పంచకృత్యాలు, చతుర్వ్యూహాలు, దివ్యావతారాలు, అన్నీ దీనిలో సంలీనం అయి ఉన్నాయి. ఈ నామధ్యానమే యోగము, తపస్సు, సమాధి. శ్రవణ మనన నిదిధ్యాసలకు ఆధారంగా సహస్రనామాన్ని న్వీకరించవచ్చు. ఈ అనుశాసనిక పర్వంలోనే శివసహస్రనామావళి కూడా ఉన్నది.
అరణ్యపర్వంలో 293-299 అధ్యాయాలలో సావిత్రి ఉపాఖ్యానం వస్తుంది. అశ్వపతి తపఃఫలంగా సావిత్రీదేవి వరపుత్రిక అయింది. సవితృ తేజోరూపం ఆమె. సత్యవంతుడు మరణించే రోజునకు ముందు ఆమె త్రిరాత్రోపవాసం చేనింది. కట్టెలాగా నిలబడి ఉన్నది (కాష్ఠసమాధి). ఆమె ధ్యానయోగ పరాయణ. సత్యవంతుని ప్రాణం తిరిగి తేవటానికి ఆమె యోగమార్గంలో తన శరీరంనుంచి హంసయై లేచి, యముని వెంబడించింది. తిరిగి తన భర్తను దక్కించుకొన్నది. ఇదంతా యోగప్రక్రియ. కఠోపనిషద్గాథకు దీనికీ ఎన్నో పోలికలున్నాయి. త్రిరాత్రోపవాసము, మూడువరాలు, మృత్యువుతో సంవాదము, ఇవన్నీ రెంటికీ సామాన్యాంశాలు.
సనత్సుజాతీయము మరొక మెట్టు. సనత్సుజాతుడు ఆదిమ కుమారులలో ఒకడు. సృష్ట్యాది పురుషడు. భారతంలో ఈయన బోధ విదురునివల్ల సంభవించింది. విదరుడు ఎంత నీతి బోధించినా ఆత్యంతికమై తత్త్వజ్ఞానం ధృతరాష్ర్టనికి సనత్సుజాతుని వల్ల కలిగింది. విదురుడు అన్నాడు – సనత్సుజాతుడు మృత్యువు అనేది లేనే లేదంటాడు. ఆ మహాత్ముడు విదురుని పిలుపు మేరకు స్మరణమాత్రాన అక్కడకు వచ్చాడుక.
సనత్సుజాతుని ఉపదేశంలోని ప్రధానాంశం ‘మోహాన్మృత్యుః సమ్మతో-యం కవీనాం ప్రమాదం వై మృత్యురహం బ్రవీమి – తథా-ప్రమాదాదమృతత్వం బ్రవీమి’. పండితులు కూడా మోహంవల్ల మృత్యువుందని అంటారు. నా అభిప్రాయం ప్రకారం మృత్యువు లేనేలేదు. అది ప్రమాదం (ప్రమత్తత). ఆ ఏమరుపాటు లేకుంటే అమృతత్వమే నిద్ధిస్తుంది. మోహంవల్లనే రాక్షసులకు పరాభవము, అది లేకపోవటంవలన దేవతలు బ్రహ్మభావం పొంది ఉంటారు. పులివలె మృత్యువు అందరినీ మ్రింగుతున్నదనే మాట సత్యం కాదు. దానికి రూపం లేనే లేదు.
‘దేహాత్మభ్రాంతి ఉంటే వానికి యముడు మృత్యువుగా ఉన్నట్లే, ఆత్మను ఎరుగనివానికి అజ్ఞానమే మృత్యువు’.
సనత్సుజాతీయం మొత్తంమీద కఠోపనిషత్సారమే చెప్పింది. ఈ రెండూ సావిత్రి కథతో కలని ఒక త్రిపుటి. ఇది మృత్యుంజయవిద్య. నచికేతుడు, సావిత్రి సాధకులు, యోగులు. సావిత్రి పరమేశ్వరి రూపాంతరమే. ‘నావేవ నింధుం దురితాత్యగ్నిః’ అన్న శ్రుతిని ఇక్కడ అనుసంధించుకోవాలి.
మృత్యువు లేకపోవటమన్న సనత్సుజాతీయ వాక్యం బోధపడటానికి తపస్సు, సాధన అవసరం. శరీరత్యాగం చేేనప్పుడు తాను ఎరిగి దానిలోనుంచి బయటకు రాగలిగితే అక్కడ విస్మృతి లేకుండాపోతే మృత్యు అనుభవం ఉండదు. అక్కడ మరపు కలిగితే కలిగేది మృత్యుభావం.
ఈ బోధ అంతా జ్ఞానరూపమైన సాధన. అదె్వైతమునకు సన్నిహితమైన తత్త్వవిచారణ. ధృతరాష్ర్టనికి చెప్పబడినా, ఆత్యంతికంగా సాధకులకోసం ఉపదిష్టమైన అంశం. సనత్సుజాతీయం యజ్ఞాలను మూడు విధాలుగా పేర్కొన్నది. జ్యోతిష్టోమాదులు కర్మయజ్ఞాలు, జపాదులు వాక్‌యజ్ఞాలు, దేవధ్యానరూపం గలవి మానసయజ్ఞాలు. ఈ మూడు ఉత్తరోత్తరం ఉత్తమాలు. నాటికి కర్మరూపమైన యజ్ఞం తన ప్రాధాన్యాన్ని క్రమంగా కోల్పోతున్నది.
పరమాత్మ సాధనలో ప్రధానంగా నిర్వహించవలనిన అంశాలు – సత్యము, ధర్మము, ఇంద్రియజయము, తపస్సు, అనసూయ, లజ్జ, సహనం, అమత్సరత, యజ్ఞం, ధైర్యం, వేదార్థజ్ఞానం. ఈ పన్నెండంశాలు తప్పకుండా బ్రతుకులో నెలకొల్పుకోవాలి.
దేహం ఒక రథం. దేహం ఎప్పుడో నశించుతుంది. దేహంచేత చేనిన కర్మమాత్రం నశించదు. ఆ కర్మవల్ల ఇంద్రియాలనే గుర్రాలు పరుగులు తీస్తాయి. జ్ఞానికి మాత్రం హృదయాకాశంలో ఆ గుర్రాలే పరమాత్మవైపు ప్రసరించుతాయి. అక్కడ వారికి ఈశ్వరదర్శనం కలుగుతుంది.
ఇది హృదయోపాసనమే. స్వాధ్యాయప్రవచనాలు ఒక స్థాయి తపెన్సైతే, మౌనదీక్షతో అంతర్ముఖంలో చేేన సాధన మరొక తపస్సు. సనత్సుజాతుని బోధన అంతా సాంగోపాంగంగా బ్రహ్మవిద్యను వెల్లడించటం. అయితే ధృతరాష్ర్టనిలో ఇది ఫలించలేదు. అతడు అమనీషిగానే మిగిలిపోయాడు. ఇది ఒక విరోధాభాస.

యుద్ధరంగం మధ్యలో అర్జునుడు కార్పణ్యదోషోపహత స్వభావుడుగా మారిపోవటం, తీవ్రమైన సంక్షభంలో పడిపోవటం, ధర్మసమ్మూఢచేతసుడు కావటంవల్ల అక్కడ భగవంతుడు బోధించిన అంశం భగవద్గీత అయింది.
ేననామధ్యంలో నిలచినప్పుడు పార్థుడు పొందిన సంక్షభం మానవులకెవరికైనా కలిగేదే. కర్తవ్యం సందేహంలో పడ్డప్పుడు రెండువైపులా అనుకూల ప్రతికూల వాదాలు క్రమ్ముకుంటాయి. 1) ఆత్మీయులను సంహరించటంవల్ల ఏ శ్రేయస్సూ కలుగదు ; 2) వారు లేనప్పుడు మన జీవితం శూన్యమవుతుంది ; 3) చంపటంవల్ల పాపం కలుగుతుంది.
అందుకోసం ఆతడు వైరత్యాగం వైరాగ్యాన్ని అవలంబించాడు. నాకు రాజ్యము, విజయమూ వద్దు, దీనివల్ల కలిగే సుఖాలు వద్దు, నన్ను చంపినా ఫరవాలేదు, నేను వారితో యుద్ధం చేని లోకక్షయం చేయను అని చెప్పి జననాశంవల్ల కలిగే బాధలు అన్నీ వివరించాడు కూడా అర్జునుడు. వైయక్తిక న్థితినుంచి, కుటుంబ పరిమితులనుంచి, సమాజందాకా విస్తరించింది అర్జున విషాదం. యుద్ధం ఎలాంటిదైనా అది ఎంతగా నాశనాన్ని దరికి తెస్తుందో అర్జునుని శోకం తెలియజేస్తుంది.
సామాజిక స్థాయిలో అర్జునుని విషాదానికి సమాధానంగా శ్రీకృష్ణని సమాధానాలు వేరే అంతస్తులోనికి తీసుకుపోతున్నవి. విషయం భూమిక మారిపోయింది.
‘అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చభాషేన
గతాసూనగతాంసూంశ్చ నానుశోచంతి పండితాః ॥
నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః
నచైవ నభవిష్యామః సర్వేవయమతఃపరమ్ ॥
శ్రీకృష్ణడు పలికే భూమిక చైతన్యం ెుుక్క మౌలికన్థితి. జన్మచక్ర పరిభ్రమణము, ఇక్కడ కలిగే సుఖదుఃఖాలు, బాంధవ్యాలు ఇవేవీ ఇక్కడ పట్టవు. పండితులు, జ్ఞానులు వారి దృష్టిలో బ్రహ్మమొక్కటే సత్యము, మిగిలినదంతా ప్రాతిభానికము. ఆత్మ నిత్యమైంది, త్రికాలాలలో ఉండేది.
వ్యావహారిక సత్యత్వభూమిక నుంచి అర్జునుడు ప్రశ్నించి ఆవేదన పొందగా, దాన్ని ఆ స్థాయినుంచి అతనిని ఎత్తి, పారమార్థిక స్థాయినుంచి భగవంతుడు సమాధానం చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధవ్యతిరేకత, శాంతిప్రియత్వం కోరే మేధావులందరి ఆలోచనాసరళికి అర్జునవిషాదం ఒక భావసూచిక. అర్జునుడు పొందింది కార్పణ్యదోషం. పిరికితనం, ప్రాణలోభము, జీవనంమీద ఉన్న అత్యాసక్తి అని అర్థం చెప్పుకోవచ్చు. బృహదారణ్యకంలో శాశ్వతమైన పరమాత్మ నెరుగకయే ఈ లోకాన్ని వీడినవాడు కృపణుడని (3/8/10) చెప్పబడింది.
ఈ భిన్నభూమికలలో కృష్ణార్జున సంవాదం ప్రారంభమైంది. క్రమంగా అర్జునుడే శ్రీకృష్ణని భావభూమికలోనికి చేరుకున్నాడు. ద్వితీయోధ్యాయం పూర్తయేప్పటికి గీతాసారం దాదాపు చెప్పబడ్డది. తరువాతి భాగమంతా కేవలం ఈ సారాన్ని విస్తరించటమే.
ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు క్రమంగా సాగిపోయే రీతి ఒక పరంపరగా చెప్పబడ్డది. విషయాసక్తి శబ్దస్పర్శరూప రసగంధాదులయందు ధ్యాస ఉంటే అది ఆసక్తి అవుతుంది. ఆసక్తివల్ల కామము, కామంవల్ల క్రోధము, క్రోధంవల్ల మోహము, మోహంవల్ల స్మృతిభ్రమ, దానివల్ల బుద్ధినాశము, అందువల్ల వ్యక్తి పతనము నిద్ధించుతవి. ఈ పరంపర అంతా విషయాసక్తివల్ల కలిగింది.
జీవితం అంతా రాగద్వేష రహితంగా ఉన్న ఇంద్రియాలు విషయేనవనం చేేన్త తన వశమునందే తానున్నవాడు అంతఃకరణంలో ప్రసన్నతను పొందుతాడు. ఈ ప్రసన్నత వల్ల సర్వదుఃఖములు శమిస్తాయి. బుద్ధి ఈశ్వరాభిముఖమవుతుంది. ఇక్కడ ద్వంద్వములయందు లగ్నముకాని మనుష్యడు సుఖదుఃఖములయందు లాభాలాభముల యందు, శీతోష్ణములయందు, జయాపజయములయందు సమన్థితిలో ఉంటాడు. ఇతన్ని ‘న్థితప్రజ్ఞు’డని గీత పేర్కొన్నది.
ఈ న్థితప్రజ్ఞుని న్థితి – కోరికలకు అతీతమైంది, కోరికలు లేనిది, మమకారం లేనిది, అహంకారం లేనిది. ఇతడు శాంతిని పొందుతున్నాడు. ఈ శాంతిన్థితియే జీవన్ముక్తిన్థితి అని చెప్పవచ్చును. ఇది బ్రాహ్మీన్థితి. బ్రహ్మభూతన్థితి. సనత్సుజాతీయం కూడా బ్రాహ్మీన్థితిని పేర్కొన్నది.
18వ అధ్యాయంలో బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేష భూతేష (18-54) అన్నచోట్ల మళ్లీ ఈ సంగతి చెప్పటం అయింది. రెండవ అధ్యాయంలో ఆ బ్రాహ్మీన్థితిలో అంత్యకాలంలో నిలిేన్త బ్రహ్మానందాన్ని, ఆ న్థితిని పొందుతాడని చెప్పబడింది. ‘నయోత్స్యే’ అన్న అర్జునుడు యుద్ధంలో నియుక్తుడు కావటానికి ‘తస్మాత్ యుద్ధ్యస్వ’ అని నిర్దేశించటానికి శ్రీకృష్ణడు వ్యావహారిక జగత్తులోనికి రాక తప్పటం లేదు. ఎంతబాగా అనుష్ఠించినా పరధర్మానుష్ఠానంవల్ల ఫలం లేదు. స్వధర్మంలో ఆపద వచ్చినా అదే ఆచరింపదగింది అని (3/35) వర్ణిస్తున్నాడు. స్వధర్మ పరధర్మ భావనలు దేహాన్ని, వర్ణాదుల నాశ్రయించినవి కాని ఆత్మకు సంబంధించినవి కావు. ఈ వైరుధ్యాన్ని తొలగించటం కోసం ‘తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర’ (3/19) అంటున్నాడు భగవానుడు. ఇది అసంసక్త కర్మ – అనాసక్త కర్మ – నిష్కామకర్మ. ఇది చేస్తున్నది ఇంద్రియాలతో, మనస్సుతో బుద్ధియందు అహంతయందు చిత్తమునందు అనాసక్తి. సతతం అని చెప్పటంచేత శరీరధారి నిత్యము కర్మప్రవృత్తుడే. ఈ కర్మప్రవృత్తి అతని అంతఃకరణాన్ని పూర్తిగా ఆవరించకుండా ఉండాలి. ‘అసక్తోహ్యాచరన్ కర్మ పరమాప్నోతి’ – ఈ న్థితి ఫలసంగరాహిత్యంచేత ఫలం చెందకపోవటంవల్ల అతడు పుణ్యపాప విముక్తుడౌతాడు.
దేహచైతన్యం కర్మ నాచరిస్తుంది. అంతఃకరణ – చేతఃపురుషడు కర్మనంటడు. సమాంతరంగా రెండు చైతన్యప్రవాహాలలో కర్మాచరణ, ఫలసంగరాహిత్యం కొనసాగుతుంది. అప్పుడే స్వధర్మకార్యాచరణం దేహచైతన్యంలోనే కాని చేతఃపురుషని కర్మ కాదని తేల్చుకోవాల్సి ఉంటుంది. అందుకే, విశ్వరూప సందర్శన యోగంలో –
‘తస్మాత్ త్వ ముత్తిష్ఠ యశోలభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్
మయైవేతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ॥ 11/33
మొదటి అర్ధశ్లోకంలో సంబోధింపబడ్డ అర్జునుడు దేహచైతన్యంలో కర్మప్రవృత్తిలో నిలిచేవాడే. భీష్మద్రోణాదులందరూ ముందే నాచేత హతులైనారు, నీవు నిమిత్తమాత్రుడవే. ఆత్యంతికమైన కర్తృత్వం పరమాత్మదే. వారందరి సంహారం వ్యాజమే, పూర్వమే నిర్ణయమైంది. ఇప్పుడు అర్జునుడు నిమిత్తమాత్రుడే.
‘న కాంక్షే విజయం కృష్ణ’ అన్న తొలి అధ్యాయంలోని శ్లోకానికి ఇది సమాధానం. నీవు దేహచైతన్యంలో ప్రవర్తించినప్పుడు కర్తృత్వభావాన్ని పరిత్యజించితే మిగిలేది అనాసక్త యోగమే. అయితే ఉపకరణమైన దేహం ఇంద్రియాలు ఈ కార్యనిర్వహణలో పాల్గొనటంవల్ల దానివల్ల కలిగే సుఖములు, భోగాలు, రాజ్యము నీవు అనుభవించవలనిందే.
రెండు స్థాయిలలో వ్యక్తి ప్రవర్తించి దేహేంద్రియ దశ, మనోమయ దశ. మొదట కర్త, రెండవచోట అకర్త. అందువల్ల జీవునికి కర్మఫలప్రాప్తి ఉండదు. రెండు వ్యక్తిత్వాల మధ్య అనాసక్తి అనేది ేనతువు. అందువల్ల ఈ కర్మఫల ప్రవాహం మనోమయ చేతనలో ఉన్న జీవునికి చెందదు. ఇలాగైతేనే ఇక్కడ సమన్వయం కుదురుతుంది.
సృష్టి ఆరంభాన్ని వివరిస్తూ యజ్ఞములు చరాచర జీవకోటి ఒకేసారి సృష్టిని పొందాయి. యజ్ఞములు జీవనవృత్తికి కారణాలైనాయి. అన్నంవలన సర్వభూతాలు పుట్టాయి. అన్నం వర్షంవలన పుట్టింది. వర్షం యజ్ఞంవల్ల కలిగింది. యజ్ఞం కర్మఫలం వల్ల కలిగింది. కర్మ వేదాలనుండి పుట్టింది. ఆ వేదం అక్షరపరబ్రహ్మనుండి కలిగింది. ఈ సర్వగతమైన బ్రహ్మ యజ్ఞంలో నిలచి ఉన్నది. ఈ రెండు శ్లోకాలలో (3-14,15) ఒక యజ్ఞచక్రం ప్రవర్తిస్తున్నది.
అక్షరబ్రహ్మము – వేదము – కర్మఫలము – యజ్ఞము – వర్షము – అన్నము- ఇదీ ఈ చక్రక్రమము.
గీత ప్రకృతిని, ఈశ్వరుని, జీవకోటిని అంగీకరిస్తుంది. అయితే జీవకోటి అంతా ‘మమైవాంశో జీవలోకే జీవభూతః’ (15-7), ‘మయ్యాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్’ (9-10). అయితే జీవేశ్వరులకు అంగాంగి భావము చెప్పబడింది.
గీతాశాం కర్మ, జ్ఞాన, భక్తియోగాలను పరమార్థ సాధనాలుగా గుర్తించింది. యోగస్పర్శ ఉన్నది కాని అది పాతంజలము కాదు. కర్మజ్ఞానాదులలో అంతర్భవించింది. ‘సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప’ అప్పటికే ఆత్మయోగ సాధన విద్యలో ఎన్నో అంశాలు నశించిపోయాయి. కొంతవరకు ఇది జనకాది రాజర్షులలో నిలచి ఉన్నది. మూలాన్ని కాదని దీన్ని కర్మయోగమేనని చెప్పటం సరియైంది కాకపోవచ్చును. నాల్గవ అధ్యాయం ఆరంభంలో ఈ ప్రస్తావన తెచ్చి ఈ నష్టమైన యోగాన్ని నీకు నేను చెప్పుతున్నాను. ఇది సనాతనమైంది, రహస్యమైంది అని చెప్పినాడు శ్రీకృష్ణడు. ఈ నష్టమైన యోగం అంతర్ముఖసాధనకు సంబంధించినది కావచ్చు. ఈ సాధనలు ఉన్మనీ నీమలను చేరటానికి లేదా అక్కడి వెలుగులను దించటానికి ఉపయోగించేవి. కలియుగారంభం నాటి నానాయోగ సంప్రదాయాలు నష్టమయ్యాయి. శ్రీకృష్ణడు ఇంచుమించు ఈ కాలంలోనే అప్పటికి నష్టమైన సంప్రదాయాల గురించి వివరిస్తున్నాడు.
గీతను మూడు షట్కాలుగా విభజించే పద్ధతి ఉన్నది. కర్మషట్కమనీ, భక్తిషట్కమనీ, జ్ఞానషట్కమనీ మూడు విభాగాలు. అయితే వీటిని అంత సులభంగా విడదీేన వీలుండదు. కర్మషట్కంలో ‘శ్రోత్రాదీ నింద్రియాణ్యన్యే’ అన్న శ్లోకంలో జ్ఞానేంద్రియా లను సంయమమనే అగ్నిలోను, శబ్దాది విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేయాలని ఉన్నది. తరువాత ఇంద్రియకర్మలను ప్రాణకర్మలను (ప్రాణాయామాదులను) ఆత్మసంయమ యోగాగ్నిలో హోమం చేయవలని ఉన్నది. తరువాత అనేక రకాల యజ్ఞాలను వివరించి అపానవాయువనే అగ్నిలో ప్రాణవాయువనే హవిస్సును వ్రేల్చటం, దీనికి విపరీతంగా ప్రాణవాయువునందే అపానవాయువును వ్రేల్చుట, పంచప్రాణములను నియమించుట-ఇవీ యజ్ఞభేదాలు. ఇలా కర్మయోగాంతరమైన విషయం ఇక్కడ ప్రస్తావించబడ్డది.
కర్మషట్కంలోనే కర్మ, అకర్మ, వికర్మల విషయం ప్రస్తావించబడింది. యోగారూఢు డైన పురుషడు సంకల్పరహిత న్థితిని పొందవలెనని సూచింపబడింది. గీతకు సార భూతమైన అంశం ఆరవ అధ్యాయంలో వస్తుంది.
‘సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥
‘యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ (6-29,30)
జీవితం దివ్యభావం చేసుకునే సాధనలో రెండు ప్రధానాంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డవి. తనను సకలభూతములలో దర్శించాలి. అట్లాగే తనయందు సకల భూతాలను చూసుకోవాలి. అతనిది యోగయుక్తాత్మ లక్షణము. ఈ చరాచరజగత్తునందు తనకంటే భిన్నమైనదేమీ లేదు. అంతటా వ్యాపించియున్న తత్త్వము ఒకేచేతన. అదే అవికార లక్షణం గలది అనేది అభ్యాసంచేత కలుగవలనిన నిశ్చయము. అట్లాగే అన్ని ప్రదేశాలలో వస్తువులలో వ్యక్తులలో ఈశ్వరుని దర్శించాలి. అట్లాగే ఈశ్వరునియందు సర్వమును దర్శించగలగాలి.
తరువాత వచ్చే ‘వాసుదేవస్సర్వమితి’ అన్న భావం ఇక్కడ చెప్పబడింది. శ్రీ అరవిందులకు అలీపూర్ జైలులో సర్వమందు వాసుదేవ సాక్షాత్కారమైన విషయం గమనిేన్త ఈ విధానం సాధ్యమేనని తోస్తుంది.
సర్వభూతములలో తనను చూడటంవల్ల స్వ-పర భేదం నశిస్తుంది. అనుభవంలోకి అదె్వైతభావన వస్తుంది. తను ఎవరినైనా వైరిగా భావించవలనిన అంశం అంతర్ధానం పొందుతుంది. కామ మోహాదులకు జగత్తులో స్థానమే ఉండదు. పుత్రునియందు తల్లిదండ్రులకున్న ఆత్మీయత అనురాగంగా, వాత్సల్యంగా పరిణమించినట్లు జగత్తు అంతా ప్రేమస్థానం అవుతుంది. జగత్తులో ఉండే వేదనలన్నీ తన అనుభవంలోకి వస్తవి. ఈ భావం విస్తరించేందుకే విభూతియోగం వచ్చింది.
‘యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ ॥ (10-41)
అని సృష్టిలోని అణువణువులోను తన విభూతి విశేషమున్నట్లుగా భగవంతుడు వ్యాఖ్యానించాడు.
ఇట్లాగే భక్తిషట్కంలో మిగిలిన జ్ఞానకర్మల విషయం, జ్ఞానషట్కంలో కర్మభక్తుల విషయం విశేషంగానే వ్యాఖ్యాతమయింది. ఇంకా ప్రధానమైన అధ్యాయాలలో ఒకటియైన భక్తియోగంలో వ్యక్త-సగుణ బ్రహ్మోపాసనము అవ్యక్త నిర్గుణ బ్రహ్మోపాసనము వింగడిస్తూ అవ్యక్తోపాసన క్లేశోధికతరమని చెప్పబడ్డది. ఈ ఉపాసకులందరికీ ఉద్ధర్త భగవంతుడే. అతడు మృత్యుసంసార బంధమునుండి విడిపిస్తాడు.
ఉపాసకుల సౌకర్యం నిమిత్తం భక్తియోగంలో 8 నుంచి 11 శ్లోకాలవరకు సులభ సులభతర మార్గాలను సూచిస్తూ పోవటం జరుగుతున్నది. చివరకు చెప్పిన ‘మద్యోగమాశ్రీతః సర్వకర్మఫలత్యాగం కురు’ అని నిర్దేశించినాడు. సర్వకర్మఫలత్యాగం అన్నమాట. చివరి అధ్యాయంలోని ‘సర్వధర్మాన్ పరిత్యజ్య’ అన్న చరమశ్లోకాన్ని గుర్తు చేస్తున్నది. ఈ అధ్యాయంలోని ‘అద్వేష్టా సర్వభూతానాం’ మొదలైన సాధకుని వర్ణన న్థితిప్రజ్ఞుని వర్ణనమునకు ప్రతిబింబప్రాయమైందే.
భగవద్గీతలో కొన్నికొన్నిచోట్ల వేదములను నిందించినట్లుగా గోచరిస్తున్నది. అనేక సందర్భాలలో వేదము తన స్వరూపమని, వేదార్థము పరమాత్మను ఎరుగుటయేనని ప్రణవ మహిమను వెల్లడించటం జరిగింది. వేదవాదరతులు, త్రైగుణ్యవిషయ ప్రధానములైన క్రియాకలాపములను ప్రతిపాదించే వేదమందు ఆసక్తిగలవారిని, ధర్మమీమాంసలో ఆగిపోయి బ్రహ్మమీమాంసదాకా చేరనివారు జన్మసంసార చక్రములో పరిభ్రమింపగలరని ఆయన స్పష్టం చేశారు. అన్వయంలో సమన్వయం లేకపోవటంవలన ఈ అనిష్టార్థప్రాప్తి కలుగుతున్నది. గీతలో ప్రతిపాదితమైన సాంఖ్యయోగము కపిలసాంఖ్యంకంటె భిన్నమైంది. కపిలసాంఖ్యంలో ప్రకృతి అంటే మూడుగుణాల సామ్యన్థితి. గీతలో అది మూడు గుణములకు కారణమైంది. సాంఖ్యంలో పురుష డొక్కడే. ఇక్కడ పురుష లనేకులు. అక్కడ దుఃఖముల ఆత్యంతిక నివృత్తి ముక్తియైతే, బ్రహ్మానందాను భవము, అమృతత్వనిద్ధి గీతాశాం ప్రతిపాదించే ముక్తిస్వరూపము.
పాతంజలయోగము చిత్తవృత్తి నిరోధమును ప్రతిపాదిస్తుంది. గీత యోగమును భగవత్ప్రాప్తికి సాధనంగా అతనితోడి సంయోగంగా పేర్కొంటున్నది. కర్మ, ధ్యాన, భక్తి సమత్వయోగాలు మాత్రమే కాక దానికీ, దీనికీ ఆత్యంతికభేదం ఉన్నది. భక్తి స్పర్శ ఉన్నప్పుడు కర్మజ్ఞానాలు కూడా నిరంతర తైలధారావదవచ్ఛిన్న భావనతో ఈశ్వరుని నిలుపుకోవటంగా విస్తరించవచ్చు. చిత్తవృత్తి నిరోధం కాక చిత్తమునంతా తన్మయం చేసుకోవటం ఇక్కడ లక్షణం. ‘జన్మజన్మలకూ హృదయంలో నిన్ను నిరంతరం ధ్యానించే న్థితిని కలిగించు. మోక్షమే వద్దు’ అన్న భక్తిభావన ఇక్కడ ప్రధానం. భక్తియోగం ఈ లోకంలోనే దివ్య జీవనాన్ని కలిపిస్తుంది. ‘వాసుదేవస్సర్వమితి’ అన్న న్థితి అది. యోగసందర్భంలో ప్రాణాయామాదులు చెప్పబడినా ఇక్కడ ధ్యానతాదాత్మ్యాదులకే పారమ్యం.
భగవద్గీత తత్పూర్వం ఉన్న యజ్ఞభావనను పూర్తిగా పరివర్తింపజేనింది. అగ్ని, పశువిసనము, హోమము, దేవతాహ్వానము మొదలైనవాటి స్థానంలోకి భగవద్భావనమే యజ్ఞమయింది. జపము యజ్ఞమే. వాఙ్మయము యజ్ఞమే. ‘సతతం కీర్తయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్’ నిత్యము కీర్తించటం కూడా ఈ యజ్ఞమే. బాహ్యమైన ఆచారాల స్థానం. అది ఆంతరమైన నిత్యభావన్థితిగా రూపుమార్చుకున్నది యజ్ఞం భగవద్గీతలో. నిష్కామకర్మయోగాన్ని చెప్పి యజ్ఞము కూడా నిర్వహించినా అది భగవదర్పితంగా చేయటంతో దానిలోని కర్మజాటిల్యం తొలగిపోయింది. ‘కర్మణ్యేవాధికారేన్త మా ఫలేష కదాచన’ అని చెప్పి వ్యక్తి చేేన కర్మ విశ్వచేతనలోనికి తన సర్వశక్తులతో సంగమించటం సాధ్యమయింది. ఇక్కడనుంచే అంతర్యాగభావం ఆవిష్కారం అయింది.
‘నిర్వాణం’ అన్నమాట గీతలో కానవస్తుంది. ఈ మాట బౌద్ధులకు పూర్వం కొనసాగిన కాల పారమ్యాన్ని ప్రతిపాదించిన తాత్త్వికులది. దాన్ని బౌద్ధుల తరువాతిదిగా భావించటం దోషయుక్తం. విశ్వరూపం చూపిన భగవంతుడు ‘కాలో-న్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః’ అన్నచోట కూడా కాలమే సర్వకారణమనీ, అదే మృత్యుపర్యాయమని భావించటం మూలం కావచ్చు.
గీతలో చేనిన దేవాసుర సంపద్విభాగము సృష్టి ప్రక్రియలో మూలద్రవ్యమైన సంఘర్షణను వ్యక్తం చేనింది. గుణత్రయవిభాగము వ్యక్తి చిత్త మూలాలను విశ్లేషించింది. ఇందువల్ల ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం’ అన్నచోట కూడా వర్ణ మూలాలు, గుణకర్మలను ఆశ్రయించినవిగా గీతాకారుడు నిశ్చయించినట్లు స్పష్టమౌతుంది. వ్యతిరేక గుణాల విషయం వేన్త కామక్రోధ లోభములు నరకద్వారాలని విశదంగా చెప్పటం జరిగింది.
మహాభారతంవల్ల లోకానికి జగద్గురువు లభించాడు. ఈశ్వరుడే నిజమైన గురువు ఎవరికైనా. అయితే అతడు అంతర్యామిగా ఉన్నప్పుడు అతని ఆదేశాలను సామాన్యుడు గ్రహించలేడు. అందువల్లనే ద్వాపరాంతంలో తాను గురువై, తానే శిష్యడై నరనారాయణులుగా రూపాంతరం పొంది శ్రీకృష్ణార్జునులుగా అవతరించాడు. రథి జీవుడు, సారథి గురువు. గీతోపదేశం ఈ ప్రతీక నాశ్రయించింది. ఇక్కడ గురువు చేనింది మాయాపరిమితులను బలవంతంగా ఛేదించటం.
మహాభారత తాత్పర్యనిర్ణయం చేయటం ఎంత క్లిష్టమైందో దాని పరిణామాన్ని వైరుధ్యాన్ని నానాత్వాన్ని చూేన్తనే తెలియవస్తుంది.
ఈ సందర్భంలో భగవద్గీతాదులను గురించి విచారణ ఆధారభూమికగా గ్రహించ వచ్చు. మహాభారతం అంతా మృత్యుక్రీడగా భావించిన సందర్భంలో యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణడు ‘తేషాం అహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్’ అన్న అభయం ధైర్యాన్నిస్తుంది.
కార్పణ్యదోషం వదలిన అర్జునుడు ‘నష్టో మోహః స్మృతిర్ లబ్ధా’ అని చెప్పటం ఈశ్వరుడు చెప్పినవిధంగా ‘తస్మాత్ యుద్ధ్యస్వ’ అన్న ఆదేశాన్ని పాలించటం, మాయా మోహితము, మృత్యుసంవలితము అయిన జగత్తులో జీవులు ఎప్పుడూ ప్రమాదం పొందకుండా కామ, క్రోధ, లోభాలనే తమోమయ మృత్యుద్వారాలకు చిక్కకుండా మృత్యుజయాన్ని సాధించవలని ఉన్నది.
భీష్మడు ధర్మజునికి బోధించిన ‘మహనీయజపం’ అనే మాలామంత్రం ఈశ్వరుని సర్వవిభవాన్నీ వర్ణించింది. అది ఒక విధంగా సర్వోపాసన రీతులకూ సారభూతమైంది.
‘ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమస్సర్వలోక గురవే, నమస్సర్వలోకపిత్రే, నమస్సర్వలోక పితామహాయ, నమస్సర్వలోక ప్రపితామహాయ, నమస్సర్వలోక ప్రధానాయ, నమస్సర్వలోకేశ్వరాయ, నమస్సర్వలోకవిశిష్టాయ, నమస్సర్వలోక సుఖప్రదాయ, నమస్సర్వలోక కర్త్రే, నమస్సర్వలోక భర్త్రే, నమస్సర్వలోక హర్త్రే, నమస్సర్వలోక నిధయే, నమస్సర్వలోక నిధానాయ, నమస్సర్వలోక హితాయ, నమస్సర్వలోక హితకరాయ, నమస్సర్వలోకోద్భవాయ, నమస్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే ప్రభవిష్ణవే’ – అని ఈ మంత్రం.
మహాభారతం మొత్తానికి దైవీమూలమైన వాసుదేవతత్త్వాన్ని సంగ్రహంగా, సర్వతోముఖంగా వివరించిందీ మంత్రం. నిత్యపఠనీయమైన ఈ మంత్రం ద్వాదశాక్షరితో ఆరంభమై, తద్వివరణగా విస్తరించింది.
ఈ వ్యాసం సముద్రాన్ని ఒక బిందువులో చూపించినట్లు, ఒక కొండను అద్దంలో చూపినట్లు మాత్రమే. ఒక యుగం పూర్తయింది మహాభారతంవల్ల. ఒక సభ్యత తమోమయ తేజోమయ పార్శ్వాలతో ఏకకాలంలో దర్శనమిచ్చింది.
‘త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో ర్ముక్షీయ మా-మృతాత్ ॥
(ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాలలో మహాభారతంపై జరిగిన జాతీయ సంగోష్ఠిలో కోవెల సుప్రసన్నాచార్య గారిచే సమర్పింపబడిన పత్రము, 27,28,29 జులై 2007)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *