About

Swadhyaya

ప్రముఖ సాహిత్య కవి, విమర్శకుడు, రచయిత, తత్త్వవేత్త.. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య సంకల్ప మాత్రం.. ఈ స్వాధ్యాయ. ఇందులో ఇప్పటికి దాదాపు 15 నుంచి 20 వేల పుస్తకాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం కవిత్వం.. ప్రాచీన, ఆధునిక విమర్శ.. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన అన్ని ఉద్యమాలు.. అన్ని రకాల విమర్శలు.. వివాదాలు, చరిత్ర, సంస్కృతి.. వివిధ ప్రక్రియలు.. ఇతర సాహిత్య సంబంధ గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి తెలుగు నాట వచ్చిన కథ, నవల, నాటిక, వీటన్నింటికి సంబంధించిన గ్రంథాలు, వాటిపై వచ్చిన విమర్శలకు సంబంధించిన గ్రంథాలు. విజ్నాన సర్వస్వాలు.. నిఘంటువులు.. మాండలిక వృత్తిపదకోశాలు, పదకోశాలు, ప్రాచీన కవుల కావ్య పద నిఘంటువులు, 1872 నుంచి ప్రచురితమైనవి ఉన్నాయి. భారతీయ సాహిత్య, సామాజిక తాత్త్విక ఉద్యమ సారథులైన రామకృష్ణ వివేకానందులు, రాజా రామ్మోహన్రాయ్, శ్రీమాత, శ్రీ అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, ఓషో, రవీంద్రుడు, గాంధీ తదితరుల రచనలు ప్రత్యేక విభాగాలుగా ఉన్నాయి. సమస్త భారతీయ జీవనానికి మూలాలైన వేదోపనిషత్తులు, రామాయణ, భారతేతిహాసాలు, భాగవతాది అష్టాదశ పురాణాలు, భక్తి సాహిత్యం సమస్తంగా కొలువై ఉన్నాయి. పలు విధాలైన రామాయణాలు, భాగవతాలు, భారతాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి.

Swadhyaya

Library and Research Trust

Our History

దాదాపు మూడు దశాబ్దాల ఈనాడు ఆదివారపు సంచికలు ఇటీవలే వచ్చాయి.
ఓ మోస్తరుగా హిందీ, తమిళ, కన్నడ రచనలు ఇక్కడ ఉన్నాయి.
దేవనాగరిలో దేవభాషకు సంబంధించిన రచనలు ఉన్నాయి.
లలిత కళలు, జ్యోతిషం, రాజకీయాలు, జర్నలిజం, సినిమా, పెయింటింగ్లు,ఫొటో ఫీచర్లు, ఫెలిసిటేషన్లు, ప్రత్యేక సంచికలు.. ఇలా అనేకానేక గ్రంథ సంచయం ఇక్కడ కొలువై ఉన్నది. విశ్వనాథ సత్యనారాయణ సారస్వత సర్వస్వానికి ఇది నిలయం.
సుమారుగా పది వేల పై చిలుకు ఈ- పుస్తకాలు ఉన్నాయి.
సుమారుగా 7 టీబీ విస్తీర్ణం కలిగిన డాక్యు మెంటరీలు, ప్రసంగాలు, ప్రముఖుల స్వరాలు ఉన్నాయి.
సుమారు మూడువేల విలువైన హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. వీటిని స్క్రీనింగ్ చేయడానికి ప్రొజెక్టర్ గది కూడా ఉన్నది.
పరిశోధకులు పరిశోధనలు చేసుకోవడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అవసరమైతే ఇక్కడ అకామడేషన్ కూడా దొరుకుతుంది.
స్వాధ్యాయ భారతీయమైన సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక సారస్వతంపై ప్రత్యేక కార్యక్రమాలు, సెమినార్ ను నిర్వహించాలని సంకల్పిస్తున్నది.
ఏటా ప్రముఖులైన సాహిత్యవేత్తలకు ఒక పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించింది.
స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధనాసంస్థ ప్రత్యేక ట్రస్టుగా ఏర్పడి భారతీయ సరస్వతికి సేవచేయాలని లక్ష్యం.
అన్ని వర్సిటీల పరిశోధక విద్యార్థులకు ఇది ఒక అధ్యయన పరిశోధన కేంద్రంగా ఉపయోగపడటానికి , వినయోగించుకోవడానికి, తద్వారా అనేక పరిశోధనలు వెలుగులోకి రావాలని.. తెలుగు సాహిత్యం, భారతీయ సాహిత్యం మరింత సుసంపన్నం కావాలని అభిలషిస్తున్నాం.
దీనికి మరింత సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వంతోపాటు సహృదయుల సహకారాన్ని అండదండలు కోరుతున్నాం.

Acharya Kovela Suprasanna charya

Acharya Kovela Suprasanna charya was born on 17th March 1936 at Warangal a famous historical and cultural town in A.P. He took his M.A. degree in Telugu Literature in the year 1959 from Osmania University, Hyderabad and was awarded PhD in the year 1962 by the same university, for his work on RAMARAJA BHUSHANA AND HISWORKS. Subsequently he attended the summer school to linguistics at Hyderabad in the year 1963 and also obtained “DIPLOMO DE MERITO” from the university DELLEARTI ITALY in the year 1982.

            In the year 1959 i.e. after completion of his M.A. he worked as part time Lecturer in the Evening College at Hyderabad and later worked as lecturer in Osmania University. From 1962 onwards he worked in different capacities as lecturer, reader and professor in Kakatiya University, Warangal. He rendered his service as the principal of university evening college from (1987 to 1990) Head of the Dept. Telugu at Kakatiya University in Warangal from 1990-93, dean of faculty of  Arts (1985-1988)  and also he acted as chairman of board of studies from (1985to 1987)from (1993-1996) Suprasanna charya rendered his service as a member of Board of studies of different universities and served as member of High power committee of Telugu University. He is also the life member of All India Oriented conference since 1987.

A part from his official positions he is the founder president of ‘Sahiti Bandu Brindam an Independent literary association  (1955). He is the founder member of Kulapati Samiti (1960)Jatiya Sahitya parishat (HYD) (1974) Life member of Dr. Viswanthan Bharati Warangal (1994). He served as a member of General Council in A.P. Sahitya Academy (1964-73). He presided the “Dravidian Studies Section” in All India oriental conference at Calcutta (1987). At present he is rendering his service as secretary of ‘Pothana Vijnana Pitam’ Warangal and acting as secretary and correspondent of Sri Visweswara Sanskrit College Warangal.

            During his prolonged career 20 PhDs 16 M.Phils were produced under his able and illumined guidance. Apart from this he participated in several seminars conducted by different Universities Academies and submitted fifty and above Research papers on different aspects and subjects in Telugu literature.

            The literary world in A.P. has recognised his talented works and his unending service to enrich Telugu literature and culture and honored him with many awards. Some of them are Best Teacher Award by A.P. Govt (1987) Best Poetry award by (Telengana  literacy forum (1955) Best Criticism award to his book ‘ SAHITYA VIVECHANA’ (Literacy Analysis) by A.P. Sahitya Academy (1971) Eminent Research Scholar award by Telugu university (1997) Best critic award of G.V.S Sahitya Puraskara (2001) Best poetry award to his poetry ‘SRI NRISIMHA PRAPATHI’ by Andhra Saraswatha Samithi Best Criticism for ‘ADYANAM’ by Telugu university (2002) and ‘SRI RAMA NAVAMI’ Puraskaram (2007) by Sanathana Dharma Charitable Trust  Hyderabad .